Daggubati Venkatesh
-
ఆయన వద్దనడంతోనే వెంకటేశ్‌తో సినిమా ఆగిపోయింది: ప్రసన్నకుమార్
ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) రాసిన ఎన్నో కథలు వెండితెరపై హిట్లు, సూపర్ హిట్లుగా నిలిచాయి. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా.. ఇప్పుడు మజాకా చిత్రాలకు ప్రసన్నకుమార్ కథ అందించగా వాటిని నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేశాడు. ఇటీవలే వీరి కాంబినేషన్లో మజాకా మూవీ కూడా వచ్చింది. తన కెరీర్లో నాని, రవితేజ, నాగార్జున వంటి పెద్ద హీరోలతో పని చేసిన ప్రసన్నకుమార్ ఓసారి వెంకటేశ్ (Daggubati Venkatesh)తోనూ సినిమా చేయాలనుకున్నాడట!కథ ఓకే అయింది కానీ..ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. వెంకటేశ్‌గారికి గతంలో ఓ కథ పూర్తిగా వివరించి చెప్పాం. ఆయన సరేనని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. డేట్స్ చెప్పి షూటింగ్ మొదలుపెట్టేయండి అన్నారు. అయితే వెళ్లేముందు వాళ్ల అన్నయ్య సురేశ్‌బాబుకు కూడా కథ చెప్పమన్నారు. ఆయనతో రెండుమూడుసార్లు కూర్చున్నాం.. కథ వివరించాం.. ఆయనకేవో కొన్ని డౌట్స్ వస్తే వివరణ ఇచ్చాం. మాకు నమ్మకముందని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. సురేశ్‌బాబు వల్లే..ఆయనకు తెలిసిన ఇద్దరుముగ్గురిని పిలిపిస్తాను. వారి అభిప్రాయం తెలుసుకున్నాక మాట్లాడదాం అన్నారు. ఎక్కడెక్కడి నుంచో ముగ్గురు వివిధ సమయాల్లో వచ్చారు. ఒక్కొక్కరికి సెపరేట్‌గా కథ చెప్పాను. ఆ ముగ్గురూ కథ బాగుందన్నారు. నాకు కథపై పట్టుందని, నన్ను డిస్టర్బ్ చేయకపోతే బెటర్ అని సురేశ్‌బాబు దగ్గరకు వెళ్లి చెప్పారు. కానీ సురేశ్‌బాబు నన్ను పిలిచి.. వేరేవాళ్ల నిర్ణయాలను పట్టించుకోను, తన నిర్ణయమే ఫైనల్ అన్నారు. అలాంటప్పుడు ఎందుకు వారికి కథ చెప్పడం అనిపించింది. అలా ఆయనకు నచ్చక సినిమా కుదర్లేదు అని చెప్పుకొచ్చాడు.చదవండి: మన దేశంలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా -
ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఈసారి సంక్రాంతికి థియేటర్లలో రిలీజై అనుహ్యంగా హిట్ అయింది వెంకటేశ్ మూవీ. పండగ పేరుతో 'సంక్రాంతికి వస్తున్నాం' అని ప్రేక్షకుల్ని పలకరించారు. అనుహ్యమైన విజయాన్ని అందుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది.అయితే వెంకీమామ సినిమా ఓటీటీలోకి రావడానికి కంటే ముందే టీవీలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. మార్చి 1న సాయంత్రం టీవీలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పడంతో మరి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్ప్పుడు స్ట్రీమింగ్ పై ఓ రూమర్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)మార్చి 1న టీవీలో ప్రసారమైన సమయానికే ఓటీటీలోనూ రిలీజ్ చేయాలని సదరు సంస్థ నిర్ణయం తీసుకుందట. దీనిబట్టి చూస్తే మార్చి 1నే సాయంత్రం జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కొన్నిరోజుల క్రితం సుదీప్ 'మ్యాక్స్' మూవీ కూడా ఇలానే టీవీ- ఓటీటీలో ఒకేసారి తీసుకొచ్చారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.'సంక్రాంతి వస్తున్నాం' కథ విషయానికొస్తే.. అమెరికాలో సెటిలైన సత్య అనే బడా వ్యాపారవేత్తని తెలంగాణ సీఎం కేశవ.. హైదరాబాద్ తీసుకొస్తాడు. కానీ అతడిని పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో సీక్రెట్ ఆపరేషన్ కి సిద్ధమవుతారు. దీనికోసం మాజీ పోలీస్ వైడీ రాజు (వెంకటేశ్)ని ఒప్పించే బాధ్యతని ఇతడి మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌదరి) తీసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ) -
ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి
తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు (Income Tax Raids) జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్‌రాజు ఇంట్లో, ఆఫీసులో.. సుకుమార్ ఇంట్లో.. అలాగే మైత్రీమూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.పండక్కొచ్చారుతాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే.. అవునా? నిజమా? అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తర్వాత అన్నీ బానే జరిగిపోతాయన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నామని మేము టైటిల్ పెట్టాం కదా.. వాళ్లు కూడా మేమూ సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని చమత్కరించారు. ఇది సాధారణమేదిల్ రాజుపైనే కాదు, చాలామంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లకోసారి ఐడీ రైడ్స్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేవన్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష -
సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?
సంక్రాంతి బరిలో దిగిన గేమ్ ఛేంజర్ సినిమా సైలెంట్ అయిపోయింది. మొదట్లో డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టగా దాన్ని సైతం వెనక్కు నెడుతూ టాప్ ప్లేస్‌లో నిలబడింది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). జనవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.165 కోట్లకు పైగా రాబట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిందని చిత్రయూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్ధలు కొట్టింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎంత?డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌లో మెరిసింది. తమన్ సంగీతం అందించగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. #SankranthikiVasthunam is redefining MASS with it’s CLASS FAMILY ENTERTAINMENT🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥ALL TIME HIGHEST FOR VICTORY @Venkymama ❤️🔥ALL TIME #2 HIGHEST FOR Hit Machine @AnilRavipudi ❤️🔥… pic.twitter.com/zjjrKwNoJk— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025Victory @venkymama is firing on all cylinders with #SankranthikiVasthunam at the box office🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam has now become the ALL-TIME HIGHEST COLLECTED FILM IN AP & TS on its 6th day💥💥💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶… pic.twitter.com/dv97e3aeVl— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025 చదవండి: వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను! -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పార్టీలో మహేశ్‌బాబు (ఫొటోలు)
-
బ్లాక్‌బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే?
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు. గతేడాది సంక్రాంతికి సైంధవ్‌తో పలకరించాడు విక్టరీ వెంకటేశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈసారి తన ఎవర్గ్రీన్ జానర్ కామెడీనే నమ్ముకున్నాడు. అలా అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) చేశాడు. ఈ మూవీ జనవరి 14న విడుదలైంది. అలా ఈసారి సంక్రాంతికి వస్తూనే పండగ కళను తీసుకొచ్చారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడానికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ ఎదుట క్యూ కడుతున్నారు.రెండు రోజుల్లోనే రూ.77 కోట్లుమొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రయూనిట్ ఈసారి బ్లాక్‌బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.32 కోట్లు వసూలు చేసింది. అంటే రెండు రోజుల్లోనే రూ.77 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఆడిస్తున్న వెంకీ మామ రెండు రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.తగ్గని డాకు మహారాజ్ జోరుమరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా (Daaku Maharaaj Movie) కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తొలి రోజు రూ.56 కోట్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే సెంచరీ క్లబ్‌లోకి చేరింది. డాకు మహారాజ్ రూ.105 కోట్లు రాబట్టిందంటూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. జనవరి 17 నుంచి తమిళనాడులోని థియేటర్లలో డాకు మహారాజ్ ప్రత్యక్షం కానుందని వెల్లడించారు. KING OF SANKRANTHI #DaakuMaharaaj has turned into a CELEBRATION with the audience's love ❤️#BlockbusterHuntingDaakuMaharaaj crosses 𝟏𝟎𝟓 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟒 𝐝𝐚𝐲𝐬 sweeping all territories into his zone 🪓🔥𝐓𝐇𝐄 𝐇𝐔𝐍𝐓 𝐈𝐒 𝐎𝐍 ~ Book… pic.twitter.com/JPF8US64bO— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025The ‘VICTORY RAMPAGE’ continues at the box office 🔥🔥🔥77CRORE+ Worldwide Gross in 2 days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥And Day3 already begun on a sensational note 💥💥#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶Victory @venkymama @anilravipudi @aishu_dil pic.twitter.com/IfkZ1tSa1q— Sankranthiki Vasthunam (@SVMovieOfficial) January 16, 2025 The sensation that shook the box office and won hearts in Telugu 😎Now ready to ROAR in Tamil from tomorrow! 🔥Experience the #BlockbusterHuntingDaakuMaharaaj with your loved ones ❤️#DaakuMaharaaj ❤️🔥𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby… pic.twitter.com/0Vg08BOWNY— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025 చదవండి: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్ -
పెద్దోడి సినిమాపై చిన్నోడి ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ..
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie).. సినిమా టైటిట్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ సంక్రాంతి కళ మొత్తం బాక్సాఫీస్ వద్దే కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ చలో అంటూ థియేటర్‌కు క్యూ కట్టారు. సినిమాలంటే పెద్దగా ఇష్టపడని వాళ్లు కూడా కాసేపు సరదాగా నవ్వుకోవడానికైనా ఈ మూవీకెళ్దామని అనుకుంటున్నారు. అక్కడే అనిల్ రావిపూడి సక్సెస్ అయిపోయాడు.సూపర్ హిట్‌గా సంక్రాంతికి వస్తున్నాం2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer Movie), డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజయ్యాయి. రెండు రోజుల వ్యవధితో ఒక్కో సినిమా విడుదలైంది. జనవరి 10న వచ్చిన గేమ్ ఛేంజర్ ఎక్కువగా నెగెటివ్ టాక్ తెచ్చుకోగా జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie)కు స్పందన బాగుంది. చివరగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది. వెంకటేశ్ కెరీర్లోనే అత్యధికంగా తొలి రోజే రూ.45 కోట్లు సంపాదించింది. (చదవండి: మంచు మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి)గర్వంగా ఉందితాజాగా ఈ సినిమాపై హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) స్పందించాడు. సంక్రాంతికి వస్తున్నాం అసలు సిసలైన పండగ సినిమా. ఈ మూవీ చూసి చాలా ఆనందించాను. వెంకటేశ్ సర్ మీరు అదరగొట్టారు. వరుస బ్లాక్‌బస్టర్స్ ఇస్తున్న అనిల్ రావిపూడిని చూస్తుంటే ఒకింత సంతోషంగా, ఒకింత గర్వంగా ఉంది. ఐశ్వర్య, మీనాక్షి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. పిల్లాడు బుల్లిరాజు యాక్టింగ్ అయితే వేరే లెవల్. సినిమా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు.పొంగల్ విన్నర్?ఇది చూసిన జనాలు సంక్రాంతికి వచ్చేస్తున్నాం సినిమాను పొంగల్ విన్నర్‌గా పేర్కొంటున్నారు. మరికొందరేమో మహేశ్‌బాబు.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఎలాంటి రివ్యూ ఇవ్వకుండా కేవలం ఈ ఒక్క సినిమాకు ఇచ్చాడంటేనే ఏది హిట్టో తెలిసిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా మహేశ్, వెంకటేశ్.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. ఇందులో వెంకటేశ్ పెద్దోడిగా, మహేశ్ చిన్నోడిగా యాక్ట్ చేశారు.సినిమా విశేషాలుసంక్రాంతి సినిమా విషయానికి వస్తే.. వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా నటించగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో బుల్లిరాజు ఒకటి. బుల్లి రాజుగా చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల నటించాడు. అతడి పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.గతేడాది సంక్రాంతికి డిజాస్టర్వెంకటేశ్ కెరీర్లో సంక్రాంతికి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. కానీ గతేడాది మాత్రం ఈ సమయానికి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. సైంధవ్ చిత్రంతో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి మాత్రం అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడ్డాడు. సంక్రాంతికి వచ్చేస్తున్నాంతో బ్లాక్‌బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. జీవిత సూత్రాలుఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో నేటి తరానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. జీవితాన్ని హాయిగా.. సంతోషంగా జీవించాలి. అత్యాశలకు పోకూడదు. అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచనలు సానుకూలంగానే ఉండాలి. అదే సమయంలో మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఆ పనిని నిజాయితీతో చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి... కష్టపడాలి. అప్పుడు సాధ్యమౌతుంది. లైఫ్‌లో ఎప్పుడూ హోప్‌ను కోల్పోకూడదు అని చెప్పాడు. Enjoyed watching #SankranthikiVasthunam , A proper festive film... @VenkyMama sir is just terrific👌👌👌So proud and happy for my director @AnilRavipudi for giving consecutive Blockbusters 👍👍👍@aishu_dil @Meenakshiioffl were superb in their characters. The kid "Bulli…— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2025 చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్ -
నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు
టాలీవుడుకు చెందిన దగ్గుబాటి వెంకటేష్,సురేష్, రానాలపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదైంది. దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, అభిరామ్‌పై 448, 452,458,120బి సెక్షన్లపై కేసు నమోదైంది.వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చెబుతుంది..?జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ ఒకటిలో వెంకటేష్‌కు చెందిన 1000 గజాలు స్థలాన్ని సుమారు ఆరేళ్ల క్రితం నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలానికి పక్కనే ఉన్న రానాకు చెందిన స్థలాన్ని కూడా నందకుమార్ లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడే వారి మధ్య వివాదం తలెత్తింది. రానా నుంచి తీసుకున్న స్థలం లీజు పూర్తి అయింది. కానీ, ఆ స్థలంలో నందకుమార్ నిర్మాణాలు చేయడంతో రానా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆపై జీహెచ్ఎంసీ అధికారులు నందకుమార్‌కు నోటీసులు జారీ చేసి డెక్కన్ కిచెన్ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, దగ్గుబాటి కుటుంబ సభ్యులు 60 మంది బౌన్సర్లతో తన రెస్టారెంట్‌ను కూల్చివేశారని నాంపల్లి కోర్టును నందకుమార్ ఆశ్రయించారు. ఈ స్థలం విషయంలో నందకుమార్‌పై కూడా కేసు నమోదు అయింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని నందకుమార్ తన స్థలంగా చెప్పుకుంటూ మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై రెండు కేసులో నమోదు అయ్యాయి. -
బన్నీ నటనకు కళ్లు తిప్పుకోలేకపోయా: విక్టరీ వెంకటేశ్
అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అధ్బుతమైన ప్రదర్శన చేశారని కొనయాడారు. అల్లు అర్జున్ నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయానని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు.పుష్ప-2లో హీరోయిన్ రష్మిక అసాధారణ ప్రదర్శన చేసినందని వెంకటేశ్ ప్రశంసించారు. గొప్ప విజయం సాధించిన సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ పుష్ప-2 పోస్టర్‌ను పంచుకున్నారు. అస్సలు తగ్గేదేలే అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.(ఇది చదవండి: 'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ)కాగా.. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.922 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. తొలి రోజు పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. రూ.294 కోట్లతో మొదలైన వసూళ్ల పర్వం అదేస్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటికే నార్త్‌లోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది పుష్ప-2. తొలిరోజే అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హిందీ సినిమాగా పుష్ప-2 సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. A thunderous and unforgettable performance @alluarjun!! Couldn't take my eyes off you on the screen ❤️❤️ So happy to see everyone celebrating the movie across the country! @iamRashmika you were phenomenal. Congratulations to #Sukumar @ThisIsDSP and the entire team of… pic.twitter.com/VcMxG5oLBA— Venkatesh Daggubati (@VenkyMama) December 11, 2024 -
రూ.కోటి సాయం ప్రకటించిన వెంకటేశ్, రానా
భారీగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎంతోమంది అమాయక జనాలు నిరాశ్రయులయ్యారు. నిత్యావసరాల కోసం అలమటిస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి సినీతారలు మేముసైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, నాగార్జున, అలీ, సాయిధరమ్‌తేజ్.. ఇలా ఎంతోమంది విరాళాలు ప్రకటించారు.కోటి రూపాయ విరాళం తాజాగా దగ్గుబాటి వెంకటేశ్, రానా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దగ్గుబాటి హీరోలను అభిమానులు మెచ్చుకుంటున్నారు. కష్టకాలంలో ఆదుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు. Our hearts go out to all those affected by the devastating floods. We are contributing Rs. 1 crore towards the relief and rehabilitation efforts of the Telugu state governments, hoping to bring comfort to those who need it most. Let us rebuild together and emerge stronger. pic.twitter.com/Hz73oFNkYf— Venkatesh Daggubati (@VenkyMama) September 6, 2024 చదవండి: అదొక పెద్ద స్కామ్.. అయినా అదే కోరుకుంటున్నా: జోష్ నటి -
గుర్తుందా.. సింగిల్ ‘హ్యాండ్’!
ఖమ్మం వన్‌టౌన్: ‘అందరికీ గుర్తుందా.. చేయి గుర్తు.. సేవాభావం కలిగిన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించుకుంటే ప్రజ లకు ఉపయోగపడే పనులు చేయడమే కాక అభివృద్ధికి పాటుపడతారని ఆయన వియ్యంకుడు, సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ తెలిపారు. రఘురాంరెడ్డి తరఫున మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డుషోలో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం 6గంటలకు మయూరిసెంటర్ వద్ద ప్రారంభమైన రోడ్డుషో పాత ఎల్ఐసీ ఆఫీస్, జెడ్పీ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రి, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకు కొనసాగింది. మార్గమధ్యలో జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో వెంకటేష్ మాట్లాడుతూ అందరూ ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు. ‘ఎనీటైం... ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ రఘురాంరెడ్డి.. కమాన్ ఖమ్మం’ అంటూ తన సినిమాల్లోని డైలాగ్‌లతో వెంకటేష్ ఆకట్టుకోగా ఆయనను చూసేందుకు రహదారి పొడవునా జనం బారులు దీరారు. అలాగే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ శ్రేణులు సైతం భారీగా తరలివచ్చాయి అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడగా ఎంపీ రేణుకాచౌదరి, అభ్యర్ధి రామసహాయం రఘురాంరెడ్డితో పాటు తుమ్మల యుగంధర్, బాలసాని లక్ష్మీనారాయణ, మహ్మద్ జావీద్, కమర్తపు మురళి, పాలెపు విజయలక్ష్మి, రాపర్తి శరత్, దొబ్బల సౌజన్య, విజయాబాయి, నాగండ్ల దీపక్‌చౌదరి, తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
SRH vs RCB :ఉప్పల్ స్టేడియంలో తారల సందడి (ఫొటోలు)
-
విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి.. వేడుకల్లో నమ్రత, సితార
విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి వేడుకలు జోరందుకున్నాయి. వెంకీ చిన్న కూతురు హయవాహిని నేడు(మార్చి 15న) మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. డాక్టర్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో కూతురి పెళ్లి జరగనుంది. గతేడాది అక్టోబర్‌లో ఎంతో సింపుల్‌గా ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. నిశ్చితార్థపు వేడుకలాగే పెళ్లి కూడా సీక్రెట్‌గానే పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఏవీ లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ మెహందీ సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో మంచి సమయం గడిపానంటూ పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో ఫోటోలు దిగింది. ఈ వేడుకల్లో నమ్రత కూతురు సితార సైతం సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఒక్క సినిమాతో టాలీవుడ్‌ను ఊపేసింది.. ఈ బ్యూటీ ఎక్కడుందో గుర్తుపట్టారా? -
హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కూతురు పెళ్లికి రెడీ అయింది. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ శుభకార్యానికి వేదిక కానుంది. గతంలో ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా జరిగినట్లే.. ఇప్పుడు పెళ్లిని కూడా దగ్గుబాటి ఫ్యామిలీ.. అలానే ఆర్భాటాలు లేకుండా చేయబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లి.. ఎవరు సెట్ చేశారో తెలుసా?) వెంకటేశ్-నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకకు మెగాహీరో రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. వెంకటేశ్ రెండో అమ్మాయి పేరు హయవాహినికి.. గతేడాది అక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. చాలా సింపుల్‌గా జరిగిన ఈ వేడుకకు మహేశ్, చిరంజీవి హాజరయ్యారు. ఇప్పుడు వెంకటేశ్ రెండో కూతురు హయవాహిని పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 15న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో.. ఈ వివాహానికి వేదిక కానుంది. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఫొటోలు వచ్చే దానిబట్టి.. మనకు ఈ విషయమై క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: ఆ నటితో నాకు సంతోషం లేదు.. అందుకే రెండో పెళ్లి!) -
హీరో వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
దుర్గమ్మను దర్శించుకున్న వెంకీ మామ.. సైంధవ్ 2పై అప్డేట్
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. ఇది ఈయన నటిస్తున్న 75వ సినిమా. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం తీసుకుంది. సోమవారం నాడు సైంధవ్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన చిత్రయూనిట్ దుర్గమ్మను దర్శించుకుంది. అనంతరం వెంకటేశ్ బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశాడు. వెంకటేశ్ మాట్లాడుతూ.. సైంధవ్ మూవీ కొత్త కథ, కథనంతో తెరకెక్కింది. సినిమాలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండబోతుంది. దర్శకుడు శైలేష్ కథ చెప్పగానే ఒప్పుకున్నాను. హీరోయిన్ శ్రద్ధ చాలా బాగా నటించింది. ప్రేక్షకులు మెచ్చితే సైంధవ్ 2 కూడా తీస్తాము. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నాను. బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశాను. చాలా సంతోషంగా అనిపించింది. మరిన్ని మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తాను అని చెప్పాడు. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. హిట్, హిట్ 2 సినిమాల ఘన విజయాల తర్వాత ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాను. వెంకటేశ్ 75వ చిత్రం నేను తీయడం చాలా సంతోషంగా ఉంది. ఎవరూ చూడని కొత్త విక్టరీ వెంకటేశ్‌ను మీరు ఈ చిత్రం ద్వారా చూడబోతున్నారు అని తెలిపాడు. చదవండి: బంగారు తల్లీ.. నిన్ను కలిసేవరకు నాకీ శోకం తప్పదు.. విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ -
సెలబ్రిటీలు కదిలారు.. ఓటు వేశారు (ఫొటోలు)
-
వన్డే వరల్డ్‌కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!
ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కి వెళ్లడం, ఇదే ప్రపంచకప్‌లో టోర్నీలో అన్ని మ్యాచులు గెలవడం.. ఇలా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. దీంతో కప్ గ్యారంటీ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ మ్యాచ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలు కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. సినిమా-క్రికెట్‌ని విడదీసి చూడలేం. రెండింటికి చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. అందుకు తగ్గట్లే చాలామంది తెలుగు హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కూడా. ఈ లిస్టులో ఫస్ట్ వెంకటేశ్ ఉంటాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల దగ్గర నుంచి ఇండియా మ్యాచ్‌ల వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కి హాజరవుతుంటారు. ఈ వరల్డ్‌కప్‌లో అయితే మొన్నటికి మొన్న జరిగిన సెమీఫైనల్లో సందడి చేశారు. ఇప్పుడు ఫైనల్లో అంతకు మించిన ఎనర్జీతో సందడి చేయడం గ్యారంటీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) వెంకటేశ్ మాత్రమే కాదు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, కింగ్ నాగార్జున.. వరల్డ్‌కప్ ఫైనల్ చూసేందుకు అహ్మదాబాద్ రాబోతున్నారట. తెలుగు నుంచి ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి ఈ లిస్టులో ఇంకా చాలామంది చేరుతారు. మిగతా ఇండస్ట్రీల నుంచి చూసుకుంటే బాలీవుడ్ స్టార్స్ ఆల్మోస్ట్ అటెండ్ అయిపోతారు. అందులో నో డౌట్. తమిళ్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్.. మ్యాచ్ కోసం గ్యారంటీగా స్టేడియానికి వస్తారని తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే గ్రౌండ్లో టీమిండియా హడావుడి కంటే స్టాండ్స్‌లో స్టార్స్ హీరోల హడావుడే ఎక్కువ ఉండబోతుందనమాట. ఫైనల్ విషయానికొస్తే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీన్ని చూసేందుకు ఇండియా-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులతో పాటు ఇప్పటివరకు వరల్డ్‌కప్ గెలుచుకున్న జట్ల కెప్టెన్స్ కూడా హాజరు కానున్నారట. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచే స్టార్‌స్పోర్ట్స్‌లో లైవ్ కవరేజీ ఉండనుంది. (ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!) -
Ram Charan Diwali Bash: రామ్‌చరణ్-ఉపాసన ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
పేకాట ఆడిన స్టార్ హీరోలు, ఫోటోలు వైరల్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్.. వీరిద్దరూ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీలో వెంకీ మామ.. పెద్దోడిగా, మహేశ్.. చిన్నోడిగా నటించి చాలా ఫేమస్ అయ్యారు. వీరు కలిసి కనిపిస్తే చాలు చిన్నోడు, పెద్దోడు ఒకేచోట ఉన్నారే అని కామెంట్లు వినిపిస్తుంటాయి. తాజాగా ఈ ఆన్‌స్క్రీన్ బదర్స్ పేకాట ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో వీరిద్దరూ ఒకే టేబుల్ దగ్గర పక్కపక్కన కూర్చుని పేకాట ఆడుతూ చిల్ అయ్యారు. అయితే ఓ ప్రముఖ క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కు వెళ్లిన సందర్భంలోనే ఇలా వీరు పేకాట ఆడినట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులు కొందరు మా హీరో పేకాట కూడా ఆడతాడా? అని షాక్ అవుతుంటే.. మరికొందరు మీరు కూడా ఇలా పేకాటతో చిల్ అవుతారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరి సినిమాల విషయానికి వస్తే మహేశ్‌బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తుండగా వెంకటేశ్ సైంధవ్ సినిమా చేస్తున్నాడు. Chilling 😎#MaheshBabu #Venkatesh #GunturKaraam #Saindav pic.twitter.com/fjOmWcFVls — Milagro Movies (@MilagroMovies) November 5, 2023 -
సైలెంట్‌గా హీరో వెంకటేశ్ కూతురి ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్
విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్- నీరజల రెండో కూతురు హయవాహిని పెళ్లి పీటలెక్కనుందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కదా! తాజాగా అదే నిజమైంది. బుధవారం రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సైలెంట్‌గా కానిచ్చేసిన ఎంగేజ్మెంట్ ఇకపోతే పెద్దగా ప్రచారం, హడావుడి లేకుండా సైలెంట్‌గా ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేశారు. కాగా మొదటి నుంచి వెంకటేశ్ సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. తన ఫ్యామిలీ వ్యవహారాలను ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతాడు. అందుకే ఇప్పుడు తన కూతురి ఎంగేజ్మెంట్ విషయాన్ని సైతం మీడియాకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అయినప్పటికీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో వియ్యం అందుకుంటున్న వెంకటేశ్ వచ్చే ఏడాది మార్చిలో కూతురి వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమాల సంగతేంటంటే.. వెంకీ మామ ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు. ఇది ఆయన కెరీర్లో 75వ చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రూమర్స్‌పై స్పందించిన సంపూర్ణేశ్ బాబు -
వెంకీ మామ ఇంట పెళ్లి సందడి.. రెండో కూతురి ఎంగేజ్మెంట్!
దగ్గుబాటి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేశ్-నీరజల రెండో కూతురు హయవాహిని పెళ్లి పీటలెక్కనుంది. వెంకటేశ్ పెద్దమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు రెండో అమ్మాయి హయవాహిని పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యమనేందుకు రెడీ అయ్యాడట. రేపే నిశ్చితార్థం? బుధవారం(అక్టోబర్ 25న) విజయవాడలో వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం దగ్గుబాటి కుటుంబం ఈపాటికే విజయవాడ బయల్దేరిందని సమాచారం. ఇకపోతే ఈ వేడుకకు ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రులే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా వెంకీమామ సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్‌గా ఉండడు. అంతేకాదు, తన పిల్లల్ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకోలేదు. వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకోమని పిల్లలకు స్వేచ్ఛనిచ్చాడు. సినిమాల సంగతేంటంటే? ఇదిలా ఉంటే వెంకటేశ్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. గతేడాది ఎఫ్ 3, ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకులను పలకరరించాడు. ఈ ఏడాది రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే హిందీ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. ప్రస్తుతం వెంకీ మామ హీరోగా సైంధవ్ సినిమా చేస్తున్నాడు. చదవండి: ఓటీటీలో సైకో థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే? -
సైంధవ్ టీజర్.. సైకోగా మారిపోయిన విక్టరీ వెంకటేశ్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. శైలేష్ కొలను ఈ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా.. నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. తాజాగా సైంధవ్ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కంప్లీట్ భారీ యాక్షన్ మోడ్‌లో సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్లో బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధిఖీకి అడ్డొచ్చిన వారందరిని దారుణంగా చంపేస్తూ కనిపించాడు. దీంతో సైకోగా మారిన వెంకటేష్ ఎంట్రీ టీజర్లో అదుర్స్ అనిపించేలా ఉంటుంది. (ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) టీజర్లో కొన్ని షాట్స్ గూస్‌బంప్స్‌ను తెప్పిస్తాయి. వెంకటేశ్ చేతికి కత్తి, గన్ ఏది దొరికితే అది అన్నట్లుగా శత్రు సంహారం చేశాడు వెంకీ. ఈ టీజర్లో చాలా పవర్‌ఫుల్‌గా వెంకటేశ్ కనిపించాడు. ఈ సినిమా 2024 జనవరి 13న సంక్రాంతికి కానుకగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
జాతీయ అవార్డుల్లో 'తెలుగు' హవా.. స్టార్స్ రియాక్షన్ ఇదే
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా టీమ్ సిక్స్ కొట్టగా, 'పుష్ప' సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. అలానే ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఉప్పెన' నిలిచింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం 69 ఏళ్ల సినీ చరిత్రలో సరికొత్త రికార్డు అనే చెప్పొచ్చు. అలానే ఆస్కార్ కొట్టిన 'ఆర్ఆర్ఆర్' కూడా జాతీయ అవార్డుల్లో హవా చూపించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్స్ అందరూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటిపై మీరు ఓ లుక్ వేయండి. (ఇదీ చదవండి: జాతీయ సినిమా అవార్డులు పూర్తి జాబితా) Heartiest Congratulations to All The Award Winners of 69 th National Film Awards 2021 !!!! 👏👏👏 Also Proud Moment for Telugu Cinema 👏👏👏 Heartiest Congratulations to especially my dearest Bunny @AlluArjun for the coveted National Best Actor Award !!!!! Absolutely Proud of… — Chiranjeevi Konidela (@KChiruTweets) August 24, 2023 ప్రతిష్ఠాత్మక 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు. -నందమూరి బాలకృష్ణ Warmest congratulations to all the recipients of the 69th National Film Awards in 2021! It's a big day for Telugu Cinema 🔥 Congratulations to Bunny on the much deserved win. Best Actor! So proud @alluarjun ❤️ Congrats to the "National Award winning composer" @ThisIsDSP 🎸🙌 — Venkatesh Daggubati (@VenkyMama) August 24, 2023 It’s a SIXERRR… Congratulations to the entire team of RRR on winning national awards. Thanks to the jury for the recognition..:) Bhairi, Prem Master, Peddanna, Srinivas Mohan garu, Solomon Master 🥰🥰 — rajamouli ss (@ssrajamouli) August 24, 2023 PUSHPAAAA… THAGGEDE LE. Congratulations Bunny…🥰🤗 — rajamouli ss (@ssrajamouli) August 24, 2023 Congratulations to my colleagues of #RRRMovie. @kaalabhairava7 you brought Komuram Bheemudo song to life with your voice. @mmkeeravaani garu, your background score for our film is the best and this award is another recognition for the same. Prem Master, every aching bone and… — Jr NTR (@tarak9999) August 24, 2023 Congratulations @aliaa08 and all the other winners of the national awards. You have made yourselves and your well wishers immensely proud. — Jr NTR (@tarak9999) August 24, 2023 So happy to see @alluarjun anna on winning the best actor national award! Such a proud moment! You truly deserve this!♥️#NationalAwards — Varun Tej Konidela (@IAmVarunTej) August 24, 2023 Congratulations to all the winners of the 69th national awards! Special mention to team RRR and Pushpa.@ssrajamouli sir you continue to make us proud.🙌🏽 And to buchi babu on winning the best regional film for uppena!👏🏽 Congrats to @ThisIsDSP , keeravani garu and @boselyricist . — Varun Tej Konidela (@IAmVarunTej) August 24, 2023 Many congratulations to the maverick @ssrajamouli garu and the team of #RRRMovie for winning big at the 69th National Awards! Your achievements are an inspiration to us all. My heartfelt best wishes and loads of love on this remarkable feat 👏🏼@AlwaysRamcharan @tarak9999… — Anil Ravipudi (@AnilRavipudi) August 24, 2023 THE PROUD TEAM FLOURISHED AGAIN… 💥💥💥💥💥💥 It’s a SIXERRR at the National Awards 🔥🌊 #RRRMovie pic.twitter.com/GOjsY4IHRl — RRR Movie (@RRRMovie) August 24, 2023 After ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥 Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/LqWnTcwpAe — Pushpa (@PushpaMovie) August 24, 2023 After ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥 Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/s3Wz2ObPKq — Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2023 -
నంది అవార్డులు.. హీరో వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అవార్డుల విషయంపై పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నంది అవార్డులపై హీరో వెంకటేష్ స్పందించారు. (ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి) వెంకటేశ్ మాట్లాడుతూ..'నేను అవార్డుల గురించి ఆలోచించను. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు ..లేదంటే లేదు..కానీ అవార్డులు మాకు ఎంకరేజ్‌మెంట్‌ను అందిస్తాయి.' అని అన్నారు. కాగా.. వెంకీ ఇటీవలే విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో ప్రత్యేకపాత్రలో కనిపించారు. అంతకు ముందే రానాతో కలిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ ఏడాది సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు రామ్ చరణ్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) -
నంది పురస్కారం లేక ఆరేళ్లు.. ఎక్కువ అవార్డులు ఏ హీరోకో తెలుసా?
మీరు సినిమా బాగా చేశారండి.. పెదాలపై చిన్న చిరునవ్వు.. మీ నటనకు నంది అవార్డు వచ్చిందండి.. గుండె నిండా సంతోషం.. ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలన్న తన్మయత్వం.. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు నంది అవార్డులు ఎవరిస్తున్నారని! ఈ అవార్డులు ప్రకటించక ఆరేడేళ్లవుతోంది. నంది పురస్కారాలను ఎవరూ పట్టించుకోవట్లేదని ఇటీవలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత ఆది శేషగిరి రావు. నంది అవార్డులకు ప్రాముఖ్యతే లేకుండా పోయిందని బాధపడ్డారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వినీదత్ నోరు జారుతూ ఇస్తారులే.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు అంటూ వెటకారంగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తిపోయిన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి ఉత్తమ మోసగాడు అవార్డులు మీకే ఇస్తాంలే అని కౌంటరిచ్చాడు. అయినా బాబు హయాంలో కులాలాను బట్టి నంది అవార్డులు ప్రకటించేవారని, నిజాయితీగా అవార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. నిజమే., టీడీపీ హయాంలో నీది ఏ కులం? ఏ ప్రాంతం? నీకు అవార్డు ఇస్తాను.. మరి నాకేటిస్తావు? ఇలా అన్నీ చర్చించుకున్న తర్వాతే నంది ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికే ఇచ్చేవారట. ఈ క్రమంలో కొన్ని అద్భుతం అనిపించిన చిత్రాలను సైతం నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసేవారు. దీంతో ఎంతోమంది చిన్నబుచ్చుకునేవారు. వారిలో కొందరే ఆక్రోశం అణుచుకోలేక బయటపడేవారు. అలా రుద్రమదేవి తీసిన గుణశేఖర్, రేసుగుర్రం నిర్మించిన బన్నీ వాసు, డైరెక్టర్ మారుతి సోషల్ మీడియాలో తమ అసహనాన్ని ప్రదర్శించారు కూడా! తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా నంది పురస్కారానికి పేరుంది. అలాంటి నంది పురస్కారాల వేడుక మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి ఓసారి ఈ అవార్డుకు సంబంధించిన విశేషాలను గుర్తు చేసుకుందాం.. ► 1964లో నంది అవార్డుల ప్రదానం మొదలైంది. దాదాపు 50 సంవత్సరాలు ఈ పరంపర కొనసాగింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ 2017లో నంది అవార్డులు ప్రకటించారు. ఆ తర్వాత నంది అవార్డుల ప్రదానంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► 1964లో ఉత్తమ ఫీచర్ ఫిలింగా డాక్టర్ చక్రవర్తి సినిమా ఎంపికైంది. అప్పుడు కేవలం ఉత్తమ చిత్రం కేటగిరీ మాత్రమే ఉండేది. ► 1977 నుంచి నటీనటులు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారం ఇచ్చే పరంపర మొదలైంది. ► ఎక్కువ నంది అవార్డులు అందుకున్న హీరో నాగార్జున. నటుడిగా నాలుగు, నిర్మాతగా ఐదు నందులు గెలుపొందారు. ► 8 నంది పురస్కారాలతో మహేశ్‌బాబు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ►వెంకటేశ్, జగపతి బాబు 7 సార్లు, చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ మూడేసి చొప్పున నందులు పొందారు. ► 2016లో చివరగా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్‌గా(నాన్నకు ప్రేమతో) అవార్డు అందుకున్నారు. ► ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి 11సార్లు నంది అవార్డు అందుకున్నారు. చదవండి: చిన్నవయసులోనే పెళ్లి, కొంతకాలానికే విడాకులు: నటుడు -
వెంకటేష్ బాబాయ్.. దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియలు (ఫొటోలు)
-
హీరో వెంకటేశ్ ఇంట తీవ్ర విషాదం
హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట విషాదం నెలకొంది. వెంకటేశ్, సురేశ్ బాబుల బాబాయ్, మూవీ మొఘల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుకున్న సురేశ్ బాబు.. కొడుకు అభిరాంతో కలిసి కారెంచేడు వెళ్లి బాబాయ్ మృతదేహానికి నివాళులర్పించాడు. హీరో వెంకటేశ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లడంతో కారెంచేడు రాలేకపోయినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం వెంకటేశ్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దగ్గుబాటి మోహన్ బాబు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైసీపీ సమన్వయకర్త కరణం వెంకటేశ్ .. మోహన్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
రానా నాయుడు: వెంకీ ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా?
టాలీవుడ్ హీరోల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన వ్యక్తి వెంకటేశ్. ఆయన సినిమా వచ్చిందంటే కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. కానీ తొలిసారి అలాంటి పాత్రలకు చెక్ పెడుతూ రానా నాయుడులో కొత్త రోల్లో కనిపించాడు వెంకీ. ఈ సిరీస్‌లో నాగ నాయుడిగా తండ్రి పాత్రలో నటించాడు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దయచేసి కుటుంబంతో కలిసి చూడొద్దని మొదటి నుంచి యూనిట్ అంతా మొత్తుకుంటోంది. వాళ్లెందుకు అలా చెప్తున్నారో ఒక్క ఎపిసోడ్ చూసినా అర్థమైపోతుంది. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులతో నిండిపోయిందీ సిరీస్. వెంకటేశ్ నోట బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను సౌత్ ఆడియన్స్ ఎలా ఇష్టపడతారనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. బూతులు తప్ప కథ లేదని మండిపడుతున్నారు. ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ డిజాస్టర్ అవడం ఖాయం అని రివ్యూలు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇన్నిరోజులు కుటుంబ విలువల గురించి చెప్పారు కదా, ఎంతమంది నిజజీవితంలో పాటించారు? మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే మానేయండి. కానీ నటులు ఎలాంటి పాత్రలు పోషించాలనేది కూడా మీరే నిర్ణయిస్తారా? అని వెనకేసుకొస్తున్నారు. ఊరికే తిడుతున్నారు కానీ సిరీస్ మాత్రం కిరాక్‌గా ఉంది అని పొగుడుతున్నారు. Venky ki intha criticize chestunnaru but do even see him doing a kissing scene in the entire show?? NO!! Yes he uttered cuss word & some filthy dialogues but that's how the character is even in the original!! #RanaNaidu — Sunny Kesh (@Sunnykesh) March 11, 2023 i dont know whats wrong with these film and webseries makers. Too many verbal abusing words being used making speaking foul language look cool and normalizing those words .imagine kids watching speaking same in house with parents and siblings #RanaNaiduOnNetflix #RanaNaidu — kiran kumar (@shiningkiran) March 11, 2023 5 Episodes chusaa story peddaga am ledh. Asalu expect eh cheyale Elati web series thisthadu ani @VenkyMama . Mirzapur chusinatu vundhii 🙏😂.#RanaNaidu https://t.co/mNS2kC6te7 — Rishi Royal 🌐 (@iamNarasim) March 11, 2023 @RanaDaggubati గారు ఫ్యామిలీ కలిసి చూడవలసిన సినిమా కాదు అని ముందుగానే చెప్పారు చాలా సంతోషం 🙏 కానీ ఇలాంటి సొల్లు, చెత్త సినిమాలు తీయకపోయుంటే ఇంకా బాగుండేది కదా. @VenkyMama గారు ఫ్యామిలీ మాన్ అయ్యుండి ఇంత దిగజారి సినిమా తీయాల్సిన అవసరం ఏముంది అర్ధంకాలేదు. #RanaNaidu 🖕🏽 Film — The SAI NIKHIL ✊🏽 (@SaiNikhil1022) March 11, 2023 Sorry to say but fact#DuniyaVijay ela ayithe EP #VeeraSimhaReddy lo alage mana #VenkyMama character kuda alage undi😭#RanaNaidu worst web series I have ever seen Worst Characterization for every actor pic.twitter.com/O3h7fdbIvN — Sanju (@sanjaysudula) March 11, 2023 #RanaNaidu enti ippudu venkatesh anthe ga anthe ga antu regressive content cheskovala life long?? What is this Gatekeeping…. Show was always an adult show and was marketed like that ! All of you are adults only..so stop getting surprised at some adult scenes… — HitWicket! (@WalkingXception) March 11, 2023 -
‘రానా నాయుడు’ ప్రెస్మీట్లో బాబాయ్, అబ్బాయ్ సందడి (ఫోటోలు)
-
చాలా త్వరగా వెళ్లిపోయావు సోదరా.. మహేశ్ ఎమోషనల్ ట్వీట్
నందమూరి హీరో తారకరత్న మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రటిస్తున్నారు. తారకరత్న మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. ‘చాలా త్వరగా వెళ్లిపోయాను సోదరా... ఈ దుఃఖ సమయంలో మీ కుటుంబానికి మనోధైర్యం కలిగించాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని మహేశ్ రాసుకొచ్చాడు. Shocked and deeply saddened by the untimely demise of #TarakaRatna. Gone way too soon brother... My thoughts and prayers are with the family and loved ones during this time of grief. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) February 18, 2023 తారకరత్న గారి మరణ వార్త విని చాలా బాధ పడ్డాను. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. Heartbroken to learn of the passing away of #TarakaRatna garu. Gone to soon 💔. My deepest condolences to his family, friends & fans. May he rest in peace. — Allu Arjun (@alluarjun) February 18, 2023 నందమూరి తారకరత్న మరణవార్త విని చాలా బాధ పడ్డాను. ఓ డైనమిక్ వ్యక్తి చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని వెంకటేశ్ ట్వీట్ చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ పాటు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. Extremely sad to hear about the passing of #NandamuriTarakaratna. Such a dynamic person, gone too soon. My heartfelt condolences to his family and friends. May his soul rest in peace🙏🏼 pic.twitter.com/Ntq2sq01SY — Venkatesh Daggubati (@VenkyMama) February 19, 2023 My deepest sympathies for Untimely demise of Dear friend Taraka Ratna 💐 we used to play snooker before Covid -19 ,such a humble & friendly person we lost .. Gone too soon #RIPTarakaRathna pic.twitter.com/m1BBTPOqRT — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) February 19, 2023 Deeply saddened by the passing away of #NandamuriTarakaratna garu. Gone too soon! Our heartfelt condolences to his family, friends and fans. May his soul rest in peace.#RIPTarakaratna #Tarakaratna pic.twitter.com/Z2fXWt2alw — Suresh Productions (@SureshProdns) February 19, 2023 Extremely shocking to learn about the demise of Versatile actor #NandamuriTarakaRatna Garu. May his Soul Rest in Peace & Strength to his family and friends. 🙏#RipNandamuriTarakaratna pic.twitter.com/1qqcOI68TT — UV Creations (@UV_Creations) February 19, 2023 -
రానా నాయుడు ట్రైలర్: తండ్రీ-కొడుకుల వార్!
దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) ట్రైలర్ రిలీజ్ అయ్యింది. స్కాండల్స్‌లో ఇరుకునే సెలబ్రిటీగా రానా, జైలు నుంచి రిలీజ్ అయిన వ్యక్తిగా వెంకీలు ఈ కథలో కనిపించనున్నారు. కథలో ఈ ఇద్దరిదీ తండ్రీకొడుకుల క్యారెక్టర్లు. అయినా ఇద్దరికీ అస్సలు పడని క్యారెక్టర్లుగా చూపించారు. ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణనే ప్రధాన కథాంశంగా మలిచినట్లు అర్థమవుతుంది. డైలాగులు కూడా కాస్త కటువుగా, నాటుగానే ఉండడం గమనార్హం. హిందీ స్ట్రెయిట్, తెలుగు డబ్బింగ్ వెర్షన్లలో మార్చి 10వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. Rana and Venky Mama dhee konte choodalanna, ee feeling Rana Naidu vasthe kaani thaggela ledhu! 🤯👀#RanaNaidu, releasing on March 10. pic.twitter.com/mOnbRGA5oA — Netflix India South (@Netflix_INSouth) February 15, 2023 -
Daggubati Venkatesh: నెట్‌ఫ్లిక్స్‌కు వెంకీ మామ వార్నింగ్
-
నాతో మజాక్ వద్దు: నెట్‌ఫ్లిక్స్‌కు వెంకీ మామ వార్నింగ్
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డొనవన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌పై గరమయ్యాడు వెంకీ. చేతిలో గన్ పట్టుకుని బెదిరిస్తున్న ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. 'చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్.. రానా నాయుడులో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్ ఎవరు? నేను. అందంగా కనిపించేది నేనే, ఫ్యాన్స్ కూడా నా వాళ్లే! కాబట్టి షోకి రానా నాయుడు కాదు నాగా నాయుడు అని ఉండాలి. నాతో మజాక్‌లొద్దు' అని వార్నింగ్ ఇచ్చాడు వెంకీ. ఈ వీడియోను సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ రీట్వీట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వెంకీ లుక్ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: వారం రోజులు తిండి పెట్టలేదు, చులకనగా చూశారు: జగ్గూ భాయ్ -
వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయిన పోస్టర్ లుక్
టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేశ్ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన హీరో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన వెంకటేశ్ మరే కొత్త సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇటీవల హీరో రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌లో కనిపించారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ న్యూ అడ్వెంచర్ అంటూ ఫైర్ ఎమోజీని జత చేశారు. అది కాస్తా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న చిత్రానికి 'వెంకీ75' పేరుతో విడుదలైన పోస్టర్ వెంకీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి జనవరి 25న పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. గతంలో వెంకటేశ్ నటించిన నారప్ప, ఎఫ్-3 చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై వెంకీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ లుక్ పోస్టర్ చూస్తే వెంకటేష్ చేతిలో తుపాకీ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. భారీ పేలుడు ముందు నిలబడిన వెంకటేశ్ లుక్ అదిరిపోయింది. పోస్టర్ చూస్తే ఈ సినిమా యాక్షన్ జోనర్‌ను తలపించేలా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. కాగా.. ఇటీవల వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) -
మై డియర్ వెంకీ.. వేర్ ఇజ్ ద పార్టీ.. మెగాస్టార్ ట్వీట్ వైరల్
ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. నేడు ఆయన 62 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. వెంకీ బర్త్‌డేను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్లో అగ్రహీరోగా పేరు సంపాదించిన వెంకటేశ్ తనదైన నటనతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. వెంకటేశ్‌కు బర్త్‌డే విషెష్ తెలిపారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో..' మై డియర్ వెంకీ.. హ్యాపీ బర్త్‌డే.. వేర్ ఇజ్ ద పార్టీ' అంటూ ట్వీట్ చేశారు. చిరు ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వాల్తేరు వీరయ్య సాంగ్ బాస్ పార్టీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. విక్టరీ వెంకటేశ్ తన కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. మై డియర్ వెంకీ... @VenkyMama Happy Birthday 💐🎂 Where is the Party?!! pic.twitter.com/kRHhEErsLD — Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2022 -
వెంకటేశ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప
ప్రస్తుతం ఇండస్ట్రీలో రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రాలను మరోసారి ప్రక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. స్టార్ హీరోస్ పుట్టినరోజు సందర్భంగా వారికి సంబంధించిన సినిమాలను ఫ్యాన్స్ కోసం రి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ స్టార్స్ పుట్టినరోజు సందర్భంగా వారి హిట్ సినిమాలను రి రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా విక్టరీ వెంకటేశ్ మూవీ కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఆయన బర్త్‌డే సందర్భంగా దగ్గుబాటి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించింది సురేశ్ ప్రొడక్షన్స్. అయితే ఇటీవల వెంకటేశ్ నటించిన నారప్ప సినిమాను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేశారు. స్టార్ హీరో అయిన వెంకటేశ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదే ఈ సినిమాను బిగ్స్క్రీన్పై చూడలేకపోయామనే నిరాశలో ఉండిపోయారు అభిమానులు. ఇప్పుడు వారి కోసం నారప్పు మూవీకి వెంకి బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 13న థియేటర్లోకి తీసుకువస్తున్నట్లు తాజాగా సురేశ్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ఒక్క రోజు మాత్రమే నారప్ప మూవీ థియేటర్లో సందడి చేయనుంది. కాగా నారప్ప మూవీకి ఓటీటీలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన నారప్ప చిత్రంలో ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేశ్, నాజర్, రాఖీ (నారప్ప చిన్న కుమారుడు)కీ రోల్స్ పోషించారు. నారప్ప చిత్రాన్ని కలైపులి యస్ థాను సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ – వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. VICTORY @VenkyMama's Raging Blockbuster #Narappa is all set to release on Dec 13th (for only one day) across theatres in AP & Telangana!! 🔥🔥#NarappaInTheatres#Priyamani@KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @sureshprodns @theVcreations @PrimeVideoIN pic.twitter.com/Q4u4VeLQXs — Suresh Productions (@SureshProdns) December 6, 2022 చదవండి: హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ ఘాటు రిప్లై అలా నేను సినిమాల్లోకి వచ్చాను: అక్కినేని అమల -
చిరుతో ‘విక్టరి’ వెంకటేశ్ సరదా సన్నివేశం? ఏ సినిమాలో అంటే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒకటి. ఈ మూవీకి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఓ కీలక పాత్రను రవితేజ పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటున్న ఈచిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కూడా భాగం కానున్నారట. ఇందులో ఆయన ఓ అతిథి పాత్ర పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు మెగాస్టార్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వెంకీ ఈ సినిమాలోని ఒక సరదా సందర్భంలో మెరవడానికి ఓకే చెప్పారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. మరి వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా వెంకటేశ్ ఈ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నప్పటి నుంచి మెగా ఫ్యాన్స్‌తో పాటు దగ్గుబాటి అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అంతేకాదు వెంకి చేస్తున్న సీన్‌పై రకరకాలు చర్చించుకుంటున్నారు. తనదైన నటన, కామెడీ టచ్‌తో నవ్వించే వెంకటేశ్‌తో సరదా సన్నివేశం అంటే మామూలు ఉండదని, ఆ సీన్ నెక్ట్ లెవల్లో ప్లాన్ చేసింటారంటూ నెట్టింట నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. -
సూపర్ స్టార్ బర్త్‌డే.. మహేశ్‌కు చిరు, వెంకీల స్పెషల్ విషెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేటితో 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. మంగళవారం(ఆగస్ట్ 9) మహేశ్ బర్త్‌డే సందర్భందగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటితో పాటు ప్రముఖ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లిలు మహేశ్‌కు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్‌డే మహేశ్’ అంటూ రాసుకొచ్చారు. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻 Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂 pic.twitter.com/7fDFnDDtwi — Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2022 వెంకటేశ్ ట్వీట్ చేస్తూ.. ‘హ్యపీ బర్త్‌డే చిన్నోడా’ అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వారిద్దరి ఫొటోను షేర్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, సురేందర్ రెడ్డి, అడవి శేష్ పలువురు సినీ ప్రముఖులు మహేశ్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఇక ఫ్యాన్ హంగామా అయితే మాములుగా లేదు. సోషల్ మీడియాను మహేశ్ బర్త్‌డే విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో మహేశ్ బాబు బర్త్ డే ట్యాగ్ నెంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. Happy birthday dearest @urstrulyMahesh! Wishing you love and laughter this year Chinnoda ❤️ pic.twitter.com/jPcmyazO8v — Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2022 Happy Birthday @urstrulymahesh anna! Wishing you lots of joy and success as always! — Jr NTR (@tarak9999) August 9, 2022 Happiest birthday to the most humble Superstar, an Amazing Director's Hero and more than that an incredible human being @urstrulyMahesh garu ♥️🤗 Wish you many More Blockbuster Hits sir! ✨#HBDSuperstarMahesh pic.twitter.com/QedO98qVjV — Anil Ravipudi (@AnilRavipudi) August 9, 2022 Happiest Birthday @urstrulyMahesh Sir... Wishing my brother all the more Happiness and the Best of everything always.. 🤗🤗 #HBDSuperstarMahesh pic.twitter.com/kkIYoStoGx — Vamshi Paidipally (@directorvamshi) August 9, 2022 Happy Birthday Superstar @urstrulyMahesh.. You are a heart-throb not only for the fans but also for the directors.. Keep Amazing all of us!!#HBDSuperStarMahesh pic.twitter.com/bCJ1dM1Sp8 — Sreenu Vaitla (@SreenuVaitla) August 9, 2022 Happy Birthday to the actor class apart and a true gentleman @urstrulyMahesh anna. Wishing you all the love and success 🤗 #HBDSuperstarMaheshBabu pic.twitter.com/A66F9r2RtS — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 9, 2022 Many many happy returns of the day sir 🤗 .@urstrulyMahesh So beautiful how the world is celebrating your birthday & we, the #Major team, are happy to have received your mentorship, love & support. You’ve been a guiding light and inspiration. Lots of love sir & happy birthday :) — Adivi Sesh (@AdiviSesh) August 9, 2022 -
విజయవంతంగా రన్ అవుతున్న ఎఫ్ 3
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వీకెండ్స్‌తో పాటు వీక్ డేస్‌లోనూ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికీ కొన్నిచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు ప్రత్యక్షమవుతుండటం సినిమా ఫన్ అండ్ ఫెంటాస్టిక్ హిట్ అని చెప్పడానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్న ఈ సినిమాను వీక్షించడానికి వన్స్‌మోర్ అంటూ థియేటర్‌వైపు అడుగులు వేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లాభాల బాట పట్టిన ఎఫ్3 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. 💥💥🔥👌😀 https://t.co/xkMjy5LbSC— Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2022 చదవండి: 'తిండి పెట్టట్లేదు, రోజూ కొడుతున్నాడు' హీరోకు మొర పెట్టుకున్న ఫ్యాన్ సూర్య ఎంట్రీ సీన్.. స్క్రీన్ తగలబెట్టిన ఫ్యాన్స్! -
ఎఫ్ 3: బ్లాక్‌బస్టర్ అంటే ఇట్టా ఉండాల!
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. నవ్వుల బొనాంజా ఎఫ్ 2కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ అంతకంటే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు కాసేపు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చేసిన ఎఫ్ 3 మే 27న రిలీజైంది. కేవలం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన మూవీ వీకెండ్‌ను బాగా వాడుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.110 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇప్పటికే నిర్మాతలకు లాభాలు కూడా వచ్చాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమాలో మెహరీన్, తమన్నా కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించాడు. 👌🔥🎉🎉💥💥💯 https://t.co/k2Ue1BPRsr — Anil Ravipudi (@AnilRavipudi) June 6, 2022 The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 చదవండి: నిఖిల్ మూవీ 'స్పై' గ్లింప్స్ చూశారా? నిజంగానే ఆరోజు తమన్నాతో గొడవపడ్డా.. ఎఫ్ 3 డైరెక్టర్ -
రామ్ చరణ్, తలపతి విజయ్ సినిమాలపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
-
తమన్నాకి అనిల్ రావిపూడి మధ్య గొడవ?
-
ఎఫ్ 3లో పవన్ కల్యాణ్?, దిల్ రాజు క్లారిటీ
Dil Raju Clarifies On Pawan Kalyan In F3 Movie: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలంతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఎఫ్ 3కి సంబంధించిన ఓ ఆసక్తిర అప్డేట్పై ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సింగర్ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు.. అయితే తాజాగా దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్ 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని తెలిపాడు. సినీ అభిమానులకు ఇదొక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పారు. పవన్ కల్యాణ్‌తో పాటు టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తారంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. అనంతరం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే స్క్రీన్‌పై పవన్ కల్యాణ్ ఏ విధంగా కనిపించబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో దీనిపై సస్పెన్స్ నెలకొంది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్! -
F3: ట్రైలర్ చూసి ‘ఏంటి పిచ్చోడిలా చేస్తున్నావ్’ అన్నారు!
‘ఎఫ్ 3 నవ్వుల పండగలా ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు’ అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 3. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వరుణ్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఎఫ్ 2 సక్సెస్‌తో ఎఫ్ 3 భాద్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది? ‘ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. అయితే ఆ భాద్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు. మాకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువ. ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్ 3 డబ్బు నేపధ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్‌గా అనిపించాయి. వెంకటేశ్ గారు, నేను ఎఫ్ 2 థియేటర్లో చూశాం. ప్రేక్షకులు ఆనందాన్ని చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్ 2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా ఉంటుంది’ అన్నాడు. ఎఫ్ 3లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది? ‘ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడం కూడా కష్టం. ఫన్ డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా ఉంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ట్ చేశాం. అది హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యింది’ అని చెప్పకొచ్చాడు. నత్తి కోసం స్పెషల్‌గా హోం వర్క్ ఏమైనా చేశారా? ‘అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డాను. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన ఉండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఈజీ అయ్యింది. అయితే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. కానీ, అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ఎఫ్ 3లో ఫన్ ఎవరికి? ఫస్ట్రేషన్ ఎవరికి? డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్‌ని హిలేరియస్‌గా చూపించారు. వెంకటేశ్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది? వెంకటేశ్ గారితో కల్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలవుతున్నా. వెంకటేశ్ గారు అంటే నాకు పర్శనల్‌గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్‌లా ఉంటారు. పెద్దనాన్నతో(చిరంజీవి) ఆయనకి ఉండే బాండింగ్, అనుభవాలు ఇలా చాలా విషయాలు చెబుతుంటారు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి.. మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేశ్ గారు చాలా లైట్ హార్టడ్. క్రమశిక్షణగా ఉంటారు. ఆయన్ని చూసి సెట్స్‌కి రెండు నిమిషాల్ ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. పాజిటివ్‌గా ఆలోచిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రోసెస్ కూడా మారింది. ఇది చాలెజింగ్‌గా అనిపిస్తుందా ? ఇప్పుడు కథల ఎంపిక మారింది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి. ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ? ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ అయ్యారు. ‘ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్’ అని సర్ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు. ‘మెగా ఫ్యామిలీ’ ట్రైలర్ డైలాగ్ మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారు? చాలా బావున్నాడు. మేం ఇద్దరం కలసి జిమ్‌కి వెళ్తున్నాం. నెల క్రితమే షూటింగ్ కూడా మొదలుపెట్టాం. -
ఈ సినిమా హిట్ కాకపోతే ఇకపై మీ ముందుకు రాను
‘‘నా సినిమా థియేటర్స్‌లో రిలీజై మూడేళ్లవుతోంది. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ ఓటీటీకి వెళ్లిపోయాయి. నా ఫ్యాన్స్ కొందరు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ సినిమా ఈ నెల 27న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నాపై ప్రేమను చూపిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ‘ఎఫ్ 3’ సినిమా మీ కోసమే... మీరందరూ థియేటర్స్‌కు వచ్చి ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ‘ఎఫ్ 2’ను హిట్ చేశారు. ‘ఎఫ్ 3’ కూడా హిట్ అవుతుంది. అనిల్ మంచి స్క్రిప్ట్‌తో సినిమా చేశాడు. వరుణ్ తేజ్ బాగా చేశాడు’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ‘ఫన్టాస్టిక్’ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులయింది. ‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ గ్లామర్‌గా ఉందంటే కారణం సాయి శ్రీరామ్‌గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఫిదా, ఎఫ్ 2 ఇప్పుడు ‘ఎఫ్ 3’.. ‘దిల్’ రాజుగారితో ఈ సినిమా నాకు ఓ హ్యాట్రిక్లా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ జనరేషన్లో అనిల్‌గారి కన్నా కామెడీని ఇంకా ఎవరూ బాగా తీయలేరని నాకు అనిపిస్తోంది. వెంకటేశ్‌గారు చాలా మల్టీస్టారర్ ఫిలింస్ చేశారు. కానీ ఆయనతో రెండోసారి వర్క్ చేసే అవకాశం నాకు మాత్రమే లభించింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’ సినిమాయే మాకు శత్రువు. ఎందుకంటే ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అందుకని ‘ఎఫ్ 2’కి మించిన వినోదాన్ని ‘ఎఫ్ 3’లో ఇచ్చేందుకు మేం స్క్రిప్ట్ నుంచే కష్టపడ్డాం. నవ్వడం చాలా ఈజీ. కానీ కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. అందుకే ‘దిల్’ రాజుగారితో వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు 35మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరు లేకపోతే ‘ఎఫ్ 3’ లేదు. ఈ సినిమాలో గొప్ప కంటెంట్ కూడా ఉందని భావించి సోల్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. వరుణ్ తేజ్ నాకు ఓ బ్రదర్‌లాంటి వాడు. వరుణ్‌లో ఇంత మంచి కామెడీ టైమింగ్ ఉందా? అని ఆడియన్స్ అంటారు. వెంకటేశ్‌గారు స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. కానీ కామెడీ చేసేప్పుడు ఆయన ఇమేజ్ను పక్కన పెట్టి పెర్ఫార్మ్ చేస్తారు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. నవ్వలేకపోవడం ఒక రోగం. నవ్వించడం ఒక భోగం. రెండేళ్లు కరోనా పరిస్థితులను ఫేస్ చేశాం. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్‌లో చూసి హ్యాపీగా నవ్వుకోండి’’ అని అన్నారు. ‘ఎఫ్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’లోలానే వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు ‘ఎఫ్ 3’లోనూ అద్భుతంగా చేశారు. హీరోల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ‘ఎఫ్ 2’లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ‘ఎఫ్ 3’లో నలుగురు హీరోయిన్స్‌ని పెట్టారు అనిల్. రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ.. ఇలా ఫుల్ఫ్యాక్డ్గా ఉంది సినిమా. దేవిశ్రీకి మా బ్యానర్లో ఇది 13వ సినిమా. ‘ఎఫ్ 2’కు మించి ‘ఎఫ్ 3’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రామానాయుడుగారి తర్వాత ‘దిల్’ రాజుగారినే నేను మూవీ మొఘల్‌గా పిలుస్తాను. మనిషి జీవితంలో నవ్వుకు ఎంత అవసరం ఉందో చెప్పే సినిమా ‘ఎఫ్ 3’. 45 ఏళ్లుగా నేను నమ్మింది నవ్వునే. ఈ సినిమాలోని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్‌ను నవ్విస్తాయి. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సినిమా హిట్ కాకపోతే నేను ఇకపై మీ ముందు (ప్రేక్షకులు) నిలబడను’’ అన్నారు. ‘‘ఎఫ్ 3’ సినిమా చూస్తూ, నవ్వుతారు. అది మన ఇమ్యూనిటీని పెంచుతుంది’’ అన్నారు సునీల్. ‘‘పవన్ కల్యాణ్‌గారి ‘తమ్ముడు’ సినిమా తీసిన దర్శకుడు అరుణ్ ప్రసాద్ బాబాయ్ కొడుకే అనిల్ రావిపూడి. అనిల్ అనే మొక్కను ‘దిల్’ రాజు పెంచారు. ఈ చెట్టు నీడ కింద ఇప్పుడు చాలా మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీలోని అందరూ బాగుంటారు. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్‌లోనే చూడాలని కోరుతున్నాను’’ అన్నారు అలీ. వై. విజయ, ప్రగతి, తులసి, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రదీప్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి 👉🏾 బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫైనల్ విన్నర్ బిందు మాధవి.. విజయ్ దేవరకొండతో సమంత లిప్‌లాక్ సీన్ ? -
ఎఫ్ 3కి మూడురెట్ల పారితోషికం తీసుకున్న వెంకటేశ్!
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఎఫ్ 3లో మోర్ ఫన్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అయితే ఫన్ మాత్రమే కాదు నటీనటులు మోర్ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారట! ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం వెంకటేశ్ ఎఫ్ 2లో రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. కానీ ఎఫ్ 3కి మాత్రం ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే ఏకంగా రూ.15 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక సాంగ్‌లో ఆడిపాడనుంది. చదవండి 👉🏾 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ -
ఎఫ్ 3 ఒక మంచి ట్రీట్‌లా ఉంటుంది – వెంకటేశ్
‘‘అందరి అభిమానులకు, కుటుంబ ప్రేక్షకులకు ‘ఎఫ్ 3’ చిత్రం ఒక ట్రీట్‌లా ఉంటుంది. అందరూ వచ్చి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ ప్రేక్షకులకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకున్నాం. ‘ఎఫ్ 3’లో రే చీకటి ఉన్న పాత్ర చేశా’’ అన్నారు. (చదవండి: నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్) వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ‘ఎఫ్ 3’ ఫ్రెష్‌నెస్‌ని, నవ్వులను తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ ఏమీ ఆలోచించకుండా మీ కుటుంబాలతో కలిసి వచ్చి ‘ఎఫ్ 3’ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ‘ఎఫ్ 2’ అనేది ప్రాక్టీస్ మ్యాచ్‌లాంటిది.. ‘ఎఫ్ 3’ అనేది మెయిన్ మ్యాచ్.. ఈ మ్యాచ్‌లో సిక్స్ కాదు.. బాల్ స్టేడియం బయటకి వెళుతుంది. మీ అందరికీ ‘ఎఫ్ 3’ నచ్చుతుంది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ –‘‘ఎఫ్ 3’ ట్రైలర్లో చూపించింది కొన్ని నవ్వులు మాత్రమే.. సినిమాలో అంతకుమించిన నవ్వులను మీ కోసం దాచి ఉంచాం. ‘ఎఫ్ 3’లో మోర్ ఫన్ అని పెట్టాం. ఈ రోజు ట్రైలర్‌కి వచ్చిన స్పందనను బట్టి చెబుతున్నాం.. ‘ఎఫ్’ ఫర్ ఫ్యామిలీ. ఎంటర్టైన్మెంట్ చేయడంలో వెంకటేశ్‌గారు ఎవరెస్ట్.. ఆ ఎవరెస్ట్ పక్కన నటించేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ని చూస్తే ‘ఇంత కామెడీ చేయగలడా?’ అంటారు. ఈ ఫ్రాంచైజీని నిర్మించడానికి సపోర్ట్ చేసిన నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. అలీ మాట్లాడుతూ – ‘‘ఈ చంటి (వెంకటేశ్‌ని ఉద్దేశించి) ‘ఎఫ్ 3’లో మామూలుగా చేయలేదు. ఇక్కడ మా చంటి (వరుణ్ తేజ్‌ని ఉద్దేశించి).. వీరిద్దరూ ఈ సినిమాని తమ భుజాలపై మోశారు’’ అన్నారు. -
జోరు మీదున్న హీరోలు, రీమేక్ అంటే మరింత హుషారు
ఒక భాషలో హిట్టయిన సినిమా వేరే భాషలవాళ్లకు నచ్చుతుందా? ఆ సినిమా కథ కనెక్ట్ అయితే నచ్చుతుంది.. అలా అందరికీ కనెక్ట్ అయ్యే కథలతో కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఇప్పుడు తెలుగులో అలాంటి కథలపై కొందరు స్టార్స్ ఓ చూపు చూశారు. ఆ కథలను రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. చిరంజీవి మంచి జోరు మీద ఉన్నారు. నాలుగైదు సినిమాలకు డేట్స్ ఇచ్చేసి, డైరీని ఫుల్ చేసేశారు. ఈ నాలుగైదు చిత్రాల్లో ఇప్పటికే రెండు రీమేక్స్ సెట్స్ మీద ఉండటం విశేషం. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నయనతార, దర్శకుడు పూరి జగన్నాథ్, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘బోళా శంకర్’. ఇది తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’కు రీమేక్ అని తెలిసింది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. అలాగే మలయాళంలో మరో హిట్‌గా నిలిచిన ‘బ్రో డాడీ’ చిత్రంలో చిరంజీవి నటిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కెరీర్లో దాదాపు పాతిక రీమేక్ సినిమాలు చేశారు వెంకటేశ్. ఈ మధ్య రెండు రీమేక్స్‌లో నటించారాయన. ధనుష్ తమిళ హిట్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’, మోహన్‌లాల్ మలయాళం హిట్ ‘దృశ్యం 2’ రీమేక్ ‘దృశ్యం 2’లో నటించారు వెంకటేశ్. ఈ రెండు చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే ఇదే టైమ్‌లో వెంకీ డిజిటల్ ఎంట్రీ కూడా ఖరారైంది. ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో వెంకీతో పాటు రానా మరో ప్రధాన పాత్రధారి. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకులు. అమెరికన్ పాపులర్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’కు ఈ ‘రానా నాయుడు’ అడాప్షన్ అన్న మాట. అంటే ఆల్మోస్ట్ రీమేక్ అనుకోవాలి. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఓ హీరోగా ఉన్న రానా దీనికంటే ముందు ‘భీమ్లానాయక్’ చిత్రంలో నటించారు. ఇది మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు తెలుగు రీమేక్. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓ హీరోగా నటించారు. అయితే పవన్ కల్యాణ్ మరో రీమేక్‌లో నటించనున్నారని సమాచారం. తమిళ హిట్ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’ తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ‘శంభో శివ శంభో’, ‘జెండాపై కపిరాజు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. అలాగే తమిళ హిట్ విజయ్ ‘తేరి’ తెలుగు రీమేక్‌లోనూ పవన్ కనిపిస్తారని, ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘కర్ణన్’ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. ఇటు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఓ కీ రోల్ చేస్తున్న సత్యదేవ్ నటించిన తాజా చిత్రాల్లో ‘గుర్తుందా.. శీతాకాలం’ ఒకటి. ఇది కన్నడ సినిమా ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక తమిళ హిట్ ‘ఓ మై కడవులే..’ రీమేక్ ‘ఓరి దేవుడా..’లో విశ్వక్ సేన్, మలయాళ ఫిల్మ్ ‘కప్పెలా’ రీమేక్ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్ టైటిల్)లో సిద్ధు జొన్నలగడ్డ (‘డీజే టిల్లు’ ఫేమ్), మలయాళ హిట్ ‘హెలెన్’ రీమేక్ ‘బటర్ ఫ్లై’లో అనుపమా పరమేశ్వరన్, మలయాళ ‘నాయట్టు’ రీమేక్‌లో అంజలి, ‘మిడ్నైట్ రన్నర్స్’ రీమేక్‌లో నివేదా, రెజీనా.. ఇలా... మరికొందరు నటీనటులు రీమేక్స్ వైపు ఓ చూపు చూశారు. హిందీ ‘బదాయీ దో’, ‘దేదే ప్యార్ దే’, తమిళ ‘విక్రమ్ వేదా’, మలయాళ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, సౌత్ కొరియన్ ‘లక్కీ కీ’ వంటి చిత్రాలూ తెలుగులో రీమేక్ కానున్నాయి. చదవండి: విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్ రిలీజ్.. క్యాన్సర్‌తో బాధపడుతున్న బుల్లితెర నటి.. ఎమోషనల్‌గా పోస్ట్ -
సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్
విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత మరింత బిజీ అయిపోయింది. వరస సినిమా ఆఫర్లు, స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ యాడ్స్ అటూ బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూ ఇలా రెండు చేతులా సంపాదిస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా హాట్‌హాట్ ఫోజులు, దుస్తులతో సమంత తరచూ ఫొటోషూట్స్ చేస్తోంది. అంతేకాదు వీటిని సోషల్ మీడియాల్లో సైతం షేర్ చేస్తుంది. దీంతో ఆమెపై నెగిటివి పెరిగి తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అయినా ఇవేవి పట్టించుకోను అంటూ తన పని తాను చేసుకుంటు పోతోంది సామ్. చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో సామ్ ఎంతటి వ్యతిరేకతను మూట గట్టుగుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెప్పాలంటే ఈ మూవీ వివాదమే ఆమె విడాకులకు దారి తీసిందని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డుకు ఎన్నికైంది. ముంబైలో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్‌కు సామ్ హజరైంది. ఈ కార్యక్రమానికి ఆమె ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు డ్రెస్సులో తళుక్కున మెరిసింది. కొత్త అందంతో అందరినీ కట్టిపడేసింది. ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో ‘నాకు అత్యంత ఇష్టమైన లుక్ ఇదే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: లైవ్‌లో ఎక్స్‌లవ్, బ్రేకప్‌పై ప్రశ్న, రష్మిక ఏం చెప్పిందంటే.. దీనికి నెటిజన్లు, ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పలువురు సెలబ్రెటీల నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో సమంత పోస్ట్‌పై విక్టరి వెంకటేశ్, నాగచైతన్య మేనమామ పెద్ద కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత సైతం స్పందించింది. హాట్ లుక్‌లో కనిపిస్తోన్న సామ్ పోస్ట్‌కు ఆశ్రిత ‘ముచ్చటేస్తోంది’ అంటూ లవ్ సింబల్‌తో ఉన్న ఏమోజీని జత చేసింది. ఫుడ్ లవర్ అయిన ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతాను రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆశ్రితతో పాటు హీరోయిన్లు రష్మిక మందన్నా, సంయుక్త హెగ్డే, రుహానీ శర్మ, హన్సికలు సమంత పోస్ట్‌పై స్పందించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
వెంకీ మామా.. కొత్త బిజినెస్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర హీరోలలో ఒకరైన వెంకటేష్ దగ్గుబాటి కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) స్టార్టప్ బైక్ వో టాలీవుడ్ హీరో వెంకటేష్ దగ్గుబాటితో భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. బైక్ వో అనేది ఈవీ టూ వీలర్ స్మార్ట్ హబ్ నెట్ వర్క్. ఈ కంపెనీ 2025 నాటికి దేశవ్యాప్తంగా 20,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. "బైక్ వో అనేది ఈవీ రంగంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్, సర్వీసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది" అని విక్టరీ వెంకటేష్ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో బైక్ వో తన ఈవీ సర్వీసింగ్, ఛార్జింగ్ నెట్ వర్క్ విస్తరిస్తుంది. మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాల కోసం తనను వినియోగించుకోనుంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. గతంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారు మంచి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో ఈ కంపెనీ తమ బిజినెస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. (చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది..!) -
చేతిలో సినిమాలు లేవు, ఖాళీగా ఉన్నా: వెంకటేశ్
సినిమా హిట్టయితే చాలు.. అది ఏ భాషా చిత్రమయినా సరే దిగుమతి చేసుకోవడానికి రెడీగా ఉంటుంది తెలుగు చిత్రపరిశ్రమ. అలా టాలీవుడ్లో రీమేక్ సినిమాల పరంపర ఎక్కువైంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్ తమిళ సినిమాకు జై కొడుతున్నాడు. అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దృశ్యం, నారప్ప చిత్రాలను రీమేక్ చేసి హిట్లు అందుకున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 సినిమా ఈనెల నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేశ్ గురువారం మీడియాతో ముచ్చటిస్తూ సినీ విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు.. ► ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాం బాబు ముఖ్య ఉద్దేశ్యం. అలాంటి పాత్రలో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ కొన్ని అనుమానాలుంటాయి. కానీ జీతూ జోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం.. సీటు అంచున కూర్చోబెట్టే సినిమాలు అంటారు కదా?..అలా ఉంటుంది సినిమా. ఏం జరిగిందనేది ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం తెలుసు. ఇది చాలా గొప్ప పాత్ర. మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. రాంబాబు పాత్రలో మరోసారి నటించడం చాలా హ్యాపీ.. ► దాదాపు ఒరిజినల్‌లానే ఉంటుంది. ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేదు. కొత్తగా నాలుగైదు సీన్లు యాడ్ చేశాం. మొదటి పార్ట్ చూడకపోయినా దృశ్యం 2 అర్థమవుతంది. ఒకవేళ మొదటి పార్ట్ చూడాలని అనుకున్నా కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను. తప్పూ ఒప్పూ అని ఏమి ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్లిపోవాలి. ఇంకా చాలా సినిమాలు థియేటర్లో కూడా వస్తాయి. ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేశాం. ► సినిమాలు తీశామా? రిలీజ్ చేశామా? అంతే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇలాంటి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు కానీ..ఈ బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో. నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో కానీ.. నెక్ట్స్ సినిమాలతో థియేటర్లోకి వస్తాను అని వాళ్లకు తెలుసు. అన్నింటికి ఓపిగ్గా ఉండాలి. ఈ సారి ఇలా జరిగిందంతే. అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతోన్నాను. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాను. నేను ఇలాంటి చిత్రాలే చేయలని అనుకోను. నా దగ్గరకు వచ్చిన సినిమాలు మాత్రమే నేను చేస్తాను. ► దృశ్యంకి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించను. అదృష్టం కొద్దీ ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఇంకా చూపిస్తూనే ఉన్నారు. కొత్తగా చేసేందుకు ట్రై చేసేందుకే ప్రయత్నిస్తున్నాను. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. ► ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే బాధ ఎఫ్ 3తో పోతుంది. ఎఫ్ 3 డబ్బు చుట్టూ సినిమా తిరుగుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అదే అవసరం కదా..అందుకే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. సమ్మర్లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఏమీ ఆశించొద్దు. వచ్చిన దాన్ని స్వీకరించాలి. ఫీడ్ బ్యాక్ అనే దాంట్లో ప్లస్, మైనస్‌లుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలి. రిలీజ్ అయిన వెంటనే కాకుండా ఓ ఆరు నెలల తరువాత కూడా సినిమాలు చూస్తారు. బాగుందని అంటారు. ఓటీటీలోని అందం అదే. కొన్ని సినిమాలు వెంటనే చూస్తారు. కొన్ని మెల్లిగా చూస్తారు. థియేటర్లోంచి సినిమా వెళ్లి పోతుందని ముందు చూస్తారు. కానీ ఓటీటీలో తీరిగ్గా తర్వాతైనా చూస్తారు. ► చాలామంది యువ దర్శకులు కథలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకీ సంతకం చేయలేదు. ఖరారైన వెంటనే ఆ వివరాల్ని తెలియజేస్తా. ప్రస్తుతానికి రానాతో కలిసి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ ప్రాజెక్టులో నటిస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు దానికోసం 100 శాతం కష్టపడదాం. పని లేనప్పుడు ఖాళీగా హ్యాపీగా ఉందాం. ప్రపంచాన్ని చుట్టేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. వీటికి మించింది ఏముంది?.. అనే ఆలోచనతో ముందుకు సాగుతుంటా అన్నారు వెంకటేశ్. -
సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్
నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పింది అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తన ప్రస్తుత కండిషన్‌ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారామే. దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. అంతేగాక తన నెక్ట్ పోస్ట్ ఏంటీ, ఈ సారి ఆమె ఎలా స్పందించబోతున్నారా? అని ఫ్యాన్స్, ఫాలోవర్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది. చదవండి: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్ ఇదిలా ఉంటే ఇటీవల ఆమె తన స్నేహితురాలు, మోడల్ శిల్పారెడ్డితో ఛార్‌ధామ్ యాత్ర అనంతరం సమంత.. కూతుళ్ల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలనే విషయాన్ని చెబుతూ ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె పెయింటింగ్ వేస్తున్న ఫొటోను కూడా పంచుకున్నారు. ఇక తన పోస్ట్‌పై హీరో వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత స్పందించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం దీనిపై నాగార్జున మినహా అక్కినేని కుటుంబ సభ్యులు కానీ ఇటూ దగ్గుబాటి కుటుంబంలో వెంకటేశ్ తప్పా ఎవరూ స్పందించలేదు. అంతేగాక సమంత పెట్టే సోషల్ మీడియా పోస్టులను కూడా చూసి చూడనంటూ వదిలేస్తున్నారు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు కానీ అశ్రిత తొలిసారిగా సామ్ పోస్ట్‌పై స్పందించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమంత షేర్ చేసిన తన పెయింటింగ్ ఫొటోపైనామె ఆసక్తికరంగా కామెంట్ చేశారు. దీంతో ఇది చర్చకు దారి తీసింది. అసలు అశ్రిత ఏమని స్పందించారంటే.. ‘ఇక నువ్వు స్వేచ్ఛగా పెయింటింగ్ వేసుకోవచ్చు’ అంటూ కామెంట్ చేశారు. అశ్రిత కామెంట్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆమె కామెంట్లో మరెదో ఆంతర్యం ఉందని, చై-సామ్ విడాకుల విషయంలో అశ్రిత హర్ట్ అయినట్టు కనిపిస్తోందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టుపై పలువురు సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. దీనిపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘నిన్ను ఇలా సరదాగా చూడటం సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Infinity Platter (@infinityplatter) -
ఆకట్టుకుంటున్న ‘అనబెల్..సేతుపతి’ ట్రైలర్
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, హీరోయిన్ తాప్సీ పన్ను కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అనబెల్ సేతుపతి’. హారర్, కామెడీ నేపథ్యంలో దీపక్ సుందర రాజన్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. సుధన్ - జయరామ్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ ప్రేక్షకుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌ను తెలుగులో విక్టరి వెంకటేశ్, తమిళంలో సూర్య, మలయాళంలో మోహన్ లాల్లు విడుదల చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 17 నేరుగా హాట్ స్టార్ డిస్నీలో విడుదల కానుంది. చదవండి: ‘బాహుబలి’ మూవీతో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు Happy to be launching #AnnabelleSethupathi Telugu trailer. Get ready to watch it streaming in Tamil, Telugu, Hindi, Kannada & Malayalam from Sept 17 on @DisneyPlusHS Trailer: https://t.co/3BtZuPnnVj@vijaysethuoffl @taapsee @SDeepakDir @PassionStudios_ pic.twitter.com/EWiFJJfAOg — Venkatesh Daggubati (@VenkyMama) August 30, 2021 ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. వీరసేతుపతి అనే రాజు నిర్మించిన రాజ్‌మహాల్ చూట్టూ కథ తిరగనుందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి కత్తి యుద్దం చేస్తున్న సన్నివేశంతో ఈ ట్రైలర్ ప్రారంభం కాగా... ఆ తర్వాత తాప్సీతో కలిసి ఆ మహాల్ ఉన్న పలు సీన్లను చూపించారు. ఇక ఈ మహాల్ సొంతం చేసుకోవడానికి కొందరూ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రేతాత్మలు వారిని ఎలా భయపెట్టాయి, ఈ క్రమంలో జరిగే కొన్ని ఫన్నీ సన్నివేశాలు సాంతం ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ హారర్‌తో పాటు ఫుల్ కామెడీతో ప్రేక్షకులను అలరించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. కాగా జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాధిక, వెన్నెల కిషోర్, యోగిబాబు, దేవదర్శిని ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ.. -
'నారప్ప' ఓటీటీ రిలీజ్ వల్ల నిర్మాతలకు అంత లాభమా!
ఒరిజినల్ కథ అయినా, రీమేక్ కంటెంట్ అయినా హీరో వెంకటేశ్ విజృంభిస్తాడు. ఎలాంటి పాత్ర అయినా సరే అందులో ఒదిగిపోయి తన నటనతో, డైలాగులతో ప్రేక్షకులకు కనులవిందు చేస్తాడు. ఇటీవలే వచ్చిన నారప్పలోనూ అమోఘంగా నటించి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు వెంకీ మామ. అయితే ఓటీటీ వద్దు థియేటరే ముద్దు అంటూ టాలీవుడ్లో చర్చ జరుగుతున్న సమయంలో పెద్ద సినిమా నారప్ప ఓటీటీలో రిలీజై అందరికీ షాకిచ్చింది. అయితే ఇది కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నారప్ప ఓటీటీలో రిలీజ్ చేశామని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాతలు సురేశ్‌బాబు, కలైపులి థాను మీడియాకు వెల్లడించారు. ఇదలా వుంచితే ఇంతకీ అమెజాన్ ప్రైమ్ నారప్ప సినిమాను ఎన్ని కోట్లకు సొంతం చేసుకుంది? నిర్మాతలకు ఎంత లాభం దక్కిందన్నది టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. తమిళ అసురన్‌కు రీమేక్‌గా వచ్చిన నారప్ప సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇది సుమారు రూ.40 కోట్లు ముట్టజెప్పి ఈ సినిమాను సొంతం చేసుకుందట. దీని ప్రకారం ఈ డీల్ ద్వారా నిర్మాతలకు సుమారు రూ.17 కోట్ల మేర లాభం వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సురేశ్‌బాబు వెంకటేశ్ నటించిన మరో రీమేక్ దృశ్యం 2ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మరి ఇది కూడా ఓటీటీలోనే వస్తుందా? లేదా థియేటర్లలో రిలీజ్ అవుతుందా? చూడాలి. -
వెంకీస్ నారప్ప
-
దృశ్యం, విరాట పర్వం కూడా ఓటీటీలోకే! డీల్ ఎంతో తెలుసా!
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారప్ప. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ మూవీకి నారప్ప రీమేక్. సూరేష్బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 20 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైం నారప్పకు 40 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘నారప్ప, దృశ్యం-2’లను ఓటీటీకి భారీ మొత్తంలో సురేష్ బాబు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 76 కోట్లకు అమ్ముడు పోయాయట. ఇక ‘దృశ్యం 2’ అయితే శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే నారప్ప, దృశ్యం 2 తో పాటు రానా ‘విరాట పర్వం’ కూడా నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలో నారప్ప: రిలీజ్‌డేట్ ఎప్పుడంటే?
Narappa Movie On OTT: అసురన్.. స్టార్ హీరో ధనుష్ నటించిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది "నారప్ప". విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా ప్రియమణి కథానాయికగా నటించింది. మే 14న థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్న ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇంతలోనే నారప్పకు ఓటీటీ ఆఫర్లు వెల్లువలా రావడంతో నిర్మాత సురేష్ బాబు డిజిటల్ స్ట్రీమింగ్కు మొగ్గు చూపాడు. దీంతో భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకోవడంతో 'నారప్ప' రిలీజ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సందర్భంగా నారప్పను జూలై 20 నుంచి ప్రసారం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మీ ప్రియమైనవారితో కలిసి ఇంట్లోనే సురక్షితంగా సినిమాను చూసి ఆస్వాదించండంటూ హీరో వెంకటేశ్ సైతం ట్వీట్ చేశాడు. జూలై 20 నుంచి నారప్ప చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చని పేర్కొన్నాడు. All my well-wishers and fans have been eagerly waiting to watch our film, #Narappa. Your love towards this film has been overwhelming for me and the team, who always ensured to go an extra mile just like Narappa. pic.twitter.com/5lEMa86pRb — Venkatesh Daggubati (@VenkyMama) July 12, 2021 -
విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత అరుదైన రికార్డు
venkatesh daughter ashritha daggubati: హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత అరుదైన రికార్టును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా ఆశ్రితకే కుకింగ్ హ్యాబిట్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అందులో తన చేసే రకరకాల వంటకాల వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్‌స్టాలో 13 లక్షలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాగా ఇటీవల హోపర్ డాట్ కం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో హాలీవుడ్ నటుడు క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇండియా నుంచి విరాట్ కోహ్లి, నటి ప్రియాంక చొప్రా ఉన్నారు. ఇదే జాబితాలో వెంకటేష్ కూతురు ఆశ్రిత కూడా చోటు సంపాదించుకుంది. ఈ లిస్టులో ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377 స్థానంలో నిలవగా.. ఆసియా మొత్తంలో 27వ ర్యాంకులో ఉంది. భారతీయులు అత్యల్పంగా ఉన్న ఈ జాబితాలో ఆశ్రిత చోటు దక్కించుకోవడం విశేషం. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో వీడియోకు సుమారు 400 డాలర్లు తీసుకుంటుందట. కాగా ఆశ్రిత 2019లో వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు స్పెయిన్‌లోని బార్సిలోనాలో సెటిల్ అయ్యారు. View this post on Instagram A post shared by Infinity Platter (@infinityplatter) -
‘దృశ్యం 2’ సెట్స్‌లో జాయిన్ అయిన మీనా
‘దృశ్యం 2’ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు హీరోయిన్ మీనా. సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ (2014) సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్, మీనాయే సీక్వెల్లో కూడా చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మీనా. ‘‘స్టార్ట్ రోలింగ్.. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు మీనా. ఈ సినిమాలో నటి పూర్ణ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ మాతృక ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. చదవండి: ఈ ఆపరేషన్ నా జీవితాన్ని మార్చేసింది : బిగ్ బీ -
దృశ్యం సీక్వెల్లో వెంకటేశ్: ఛాన్స్ ఉందా?
మలయాళంలో 2013లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం దృశ్యం. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్ అయింది. గత దశాబద్ధంలో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో దృశ్యం ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలోనూ రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఏడేళ్ల తర్వాత దృశ్యానికి సీక్వెల్ తెరకెక్కించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ మధ్యే సినిమా ట్రైలర్ రిలీజవగా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అయినా కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం ఓటీటీలో విడుదల చేయక తప్పట్లేదు. దృశ్యం తెలుగు రీమేక్‌లో నటించిన వెంకటేశ్ ఇప్పుడు దాని సీక్వెల్‌పైనా దృష్టి సారించాడు. కానీ డైరెక్టర్ జీతూ దృశ్యం 2ను తెలుగులో డబ్ చేస్తుండటంతో వెంకటేశ్‌కు దాదాపు రీమేక్ ఛాన్స్ లేకుండా పోయింది. పైగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో అందరికీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వెంకీ దీన్ని వదిలేసుకునే అవకాశమే అధికంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సీక్వెల్ తెలుగు రీమేక్ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వెంకీ 'నారప్ప' సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. 'అసురన్' రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించేందుకు వస్తోంది. చదవండి: వేసవిలో నారప్ప రిలీజ్.. కేజీఎఫ్ 2 బిజినెస్ మాములుగా లేదుగా.. అన్ని కోట్లా? -
హైదరాబాద్‌లో ‘ఎఫ్ 3’ పూజ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: వెంకటేష్ , వరుణ్ తేజ్‌లు హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో గతేడాది వచ్చిన ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లు నటించారు. కామెడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బ్లక్‌బస్టర్ హీట్‌గా నిలిచింది. దీంతో ఇదే కాంబినేషన్లో ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అదే దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభ పూజ కార్యక్రమం గురువారం హైదబాద్‌లో జరిగింది. హీరోయిన్ తమన్నా, హీరో వరణ్ తేజ్‌ల ఓ సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ నెల 23 నుంచి ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎఫ్ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు ‘ఎఫ్ 3’ని కూడా నిర్మించనున్నారు. -
మహేష్‌బాబు అంటే ఇష్టం : రాశీఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ రాశీ ఖన్నా సోమవారం 30వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇండస్ర్టీ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా పలువురు ఈ బ్యూటీకి బర్త్‌డే విషేక్ తెలుపుతున్నారు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాశీ మొదట సింగర్ అవుదామని పలు ప్రయత్నాలు చేసిందట. అయితే సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఆమె కల నిజమైంది. జోరు, విలన్, బాలకృష్ణుడు, జవాన్, ప్రతిరోజూ పండగే వంటి సినిమాల్లో పాడి తన డ్రీమ్‌ని పూర్తిచేసుకుంది. 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించిన రాశీ..విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. బీఏ ఇంగ్లీష్ పూర్తిచేసి ఐఏఎస్ కావాలని కలలు కందట. ఆ తర్వాత పలు యాడ్ సినిమాలకు కాపీ రైటర్‌గానూ పనిచేస్తున్న సమయంలోనే ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు వచ్చాయి. (రాశీ ఖన్నా నోట.. ‘ఉండిపోరాదే’ పాట..) జాన్ అబ్రహం సినిమా మద్రాస్ కేఫ్ చిత్రంతో తెరంగేట్రం చేసిన రాశీకి పలు అవకాశాలు వచ్చాయి. తెలుగులో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమై పలు సినిమాల్లో నటించి మెప్పించింది. పరాజయాలతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. తెలుగులో సుప్రీమ్, జోరు, జిల్, హైపర్, జై లవకుశ, వెంకీ మామ, ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో హిట్ సాధించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య అప్‌కమింగ్ సినిమా అరువా చిత్రంతో పాటు, అర్జున్ ముఖ్య పాత్రలో జీవా హీరోగా పీఏ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సైన్ చేసింది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలోతెరకెక్కుతున్న చిత్రం తుగ్లక్ స్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. బాలీవుడ్లో షారుక్‌ఖాన్, ప్రియాంకచోప్రాతో సహా టాలీవుడ్లో మహేష్‌బాబు అంటే ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. (ఇప్పటిదాకా ప్రేమలో పడలేదు: రాశీఖన్నా ) Happy birthday dear @RaashiKhanna ✨ Hope your year is as beautiful as you are❣️ #HBDRaashiKhanna — Venkatesh Daggubati (@VenkyMama) November 30, 2020 -
విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఫోటోలు
-
పవన్‌తో సినిమా... రానా స్పందన
పెళ్లి అనంతరం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో దగ్గుబాటి రానా. ఆయన నటించిన అరణ్య చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ప్రభు సోలోమాన్ దర్శకత్వం వహించారు. అదే విధంగా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, నందితా దాస్, ప్రియమణి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా రానాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ సూపర్‌హిట్ సాధించిన అయ్యప్పన్ కొషియమ్’ సినిమాలో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో లీడ్ రోల్ కోసం రానాను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో బిజు మేనన్ పోషించిన పాత్రలో పవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నారని సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: రానా- మిహికల కర్వాచౌత్ .. దీనిపై తాజాగా ఈ వార్తలపై రానా స్పందించారు. తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. ‘అవును ఈ సినిమాలోని పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉంది’ అని తెలిపారు. అదే విధంగా బాబాయి వెంకటేష్, రానా కలయికలో ఓ సినిమా రూపొందుతున్నట్లు వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. వెంకటేష్‌తో కలిసి సినిమా చేయనున్నటు క్లారిటీ ఇచ్చాడు. బాబాయ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని చాలా కాలం నుంచి వేచి చూస్తున్నట్లు తెలిపారు. సరైన కథ దొరికిందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఏడాదిలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేగాక ఇటీవల బాబాయి ఆరణ్య సినిమా బిట్స్ చూశారని, మొదటి సారి బాగుందని మెచ్చుకున్నారని అన్నారు. కాగా ఈ సినిమాను రానా తండ్రి సురేష్ బాబు తెరకెక్కించనున్నట్లు సమాచారం. చదవండి: సాయి పల్లవికి బంఫర్ ఆఫర్.. -
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం!
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘మోసగాళ్ళు’ సినిమా మోషన్ పోస్టర్ శుక్రవారం విడుదలైంది. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హీరో దగ్గుబాటి వెంకటేష్ లాంచ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న హాలీవుడ్–ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటుంది. ఇక మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విష్ణు–కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలు చేస్తున్నారని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. దీంతో అసలు వీరిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్న సస్పెన్స్ అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ కుమార్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నాడు. వేసవిలోనే ‘మోసగాళ్లు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగగా వాయిదా పడింది. దీంతో మరి థియేటర్స్ తెరిచేవరకు చిత్రబృందం వెయిట్ చేస్తుందా లేక ఓటీటీ వైపు వెళ్తుందా అన్నది తెలియాల్సి ఉంది. (బ్రదర్ అండ్ సిస్టర్) -
వెంకటేశ్ 'విక్టరీ'కి 34 ఏళ్లు
టాలీవుడ్లో నెంబర్ వన్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన వెంకటేశ్ తన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అన్నిరకాల వర్గాలను ఆకట్టుకునేలా వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూ తన పేరు ముందు విక్టరీని సుస్థిరం చేసుకున్నారు. ఆయన వెండితెరపై తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి 34 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సురేశ్ ప్రొడక్షన్స్ శుక్రవారం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో వెంకటేశ్ తాజాగా నటిస్తోన్న నారప్ప క్యారెక్టర్‌ను హైలెట్ చేసింది. (కేరాఫ్ నారప్ప) వెంకటేశ్ నటప్రస్థానాన్ని గమనిస్తే.. 1971లో ప్రేమ నగర్ సినిమాలో బాలనటుడిగా కనిపించారు. అనంతరం 1986లో 'కలియుగ పాండవులు' చిత్రంతో హీరోగా పరిచయమవగా, తొలి సినిమాకే నంది అవార్డును దక్కించుకున్నారు. నటి ఖుష్బూకు దక్షిణాదిన ఇదే తొలి సినిమా కావడం విశేషం. రీమేక్ సినిమా 'చంటి'తో ఆయన బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' వంటి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. 'ప్రేమించుకుందాం రా', 'సూర్యవంశం' ఆయన ఎవర్గ్రీన్ చిత్రాలు. 'రాజా', 'కలిసుందాం రా', 'జయం మనదేరా', 'సంక్రాంతి', 'దృశ్యం'.. వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. మల్టీస్టారర్ చిత్రాలు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎఫ్ 2', 'వెంకీమామ' అన్నీ కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. 36 ఏళ్ల సినీ ప్రయాణంలో వెంకటేశ్ ఉత్తమ నటుడిగా ఏడు సార్లు నంది అవార్డులు గెలుపొందారు. (వాటిని ప్రేమించాల్సిన సమయం ఇదే..) -
బీ ది రియల్ మేన్ ఛాలెంజ్.. అంగీకరించారు
‘ఇంటి పనుల్లో సహాయం చేసి, నిజమైన మగాళ్లు అనిపించుకుందాం’ అని ‘బీ ది రియల్ మేన్ ఛాలెంజ్’ను స్టార్ట్ చేశారు దర్శకుడు సందీప్ వంగ. ఆ తర్వాత రాజమౌళి, సుకుమార్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కొరటాల శివ, కీరవాణి ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. ఎన్టీఆర్ విసిరిన చాలెంజ్‌ని అంగీకరించి తాజాగా చిరంజీవి, వెంకటేష్ కూడా ‘బీ ది రియల్ మేన్’ చాలెంజ్ వీడియోలు పోస్ట్ చేశారు. ‘ఫ్లోర్ క్లీన్ చేయడం, దోసె వేయడం, వండిన దోసెను వాళ్ల అమ్మగారికి వడ్డించడం’ వంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేసి, ‘‘నేను రోజూ చేసే పనులే. ఇవాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం’’ అని పేర్కొన్నారు చిరంజీవి. ఈ ఛాలెంజ్‌కి మంత్రి కేటీఆర్, రజనీకాంత్, దర్శకులు మణిరత్నంలను ఎంపిక చేశారు చిరు. దోసె వేస్తూ దాన్ని చిరంజీవి తిరగేయడం వీడియోలో ఒక హైలెట్. ‘మన కుటుంబానికి ఇంటి పనుల్లో సహాయం చేసి నిజమైన మగాళ్లుగా ఉందాం’ అన్నారు వెంకటేశ్. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఇల్లు శుభ్రం చేస్తూ, వంట చేస్తూ, గార్డెనింగ్ చేసి, పని పూర్తయ్యాక పుస్తకం పట్టుకుని కనిపించారు వెంకటేశ్. ‘‘ఈ ఛాలెంజ్‌కు చిన్నోడు మహేష్‌బాబును, కో–బ్రదర్ వరుణ్ తేజ్‌ని, దర్శకుడు అనిల్ రావిపూడిని ఎంపిక చేస్తున్నా’’ అని పేర్కొన్నారు వెంకీ. దర్శకుడు క్రిష్ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలకు నీళ్లు పోయడం, వంట చేయడం చేస్తున్న వీడియో పంచుకు న్నారు క్రిష్. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొని అడవి శేష్, అల్లు అర్జున్, ప్రభాస్‌లను ఎంపిక చేశారాయన. -
టాలీవుడ్ సెలబ్రిటీల భోగి సందడి..
తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మూడు రోజుల పండుగలో తొలి రోజైనా భోగి నాడు.. భోగి మంటలు వేసి, వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అలకరించారు. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా భోగిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్‌తేజ్, కల్యాణ్‌దేవ్, నిహారిక, సుష్మిత.. ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నిహారిక దోశ వేస్తున్న ఫొటోను సుష్మిత.. దోశ స్టెప్పు అని పేర్కొన్నారు. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుటుంబం శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో భోగి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్‌లు పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ కొత్తగా ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు’ అని లక్ష్మి పేర్కొన్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్ కూడా భోగి శుభాకాంక్షలు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ఈషా రెబ్బా.. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
-
మామాఅల్లుళ్ల జోష్
గుంటూరు ఈస్ట్: బ్రాడీపేట ఏఈఎల్‌ఎం పాఠశాల గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వెంకీ మామ చిత్ర విజయోత్సవ సభకు హాజరైన చిత్రయూనిట్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. విశేష సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల కేరింతలు, వెంకీ మామా అంటూ చిత్రంలోని పాటలు పాడుతూ ప్రాంగణం హోరెత్తింది. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబి) మాట్లాడుతూ ఆకాశమంత ప్రేక్షకుల ప్రేమ ఈ చిత్రాన్ని ఘన విజయం వైపు నడిపించిందన్నారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ యాంకర్ శ్రీముఖి, కథానాయకి పాయల్‌రాజ్‌పుత్ చేసిన వ్యాఖ్యానం, పాటలు, నృత్యాలు, శ్రీముఖి యాంకరింగ్‌తో విజయోత్సవ సభ ధూమ్ ధామ్‌గా సాగింది. కథానాయకుడు విక్టరీ వెంకటేష్ తనదైన మేనరిజంతో, డైలాగులతో అభిమానులను ఆకట్టుకున్నారు. అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ వేదిక ముందు ఉన్నవారి ఎనర్జీకి తాను వారికి ఫ్యాన్స్ అయ్యానంటూ కితాబిచ్చారు. చక్కటి చిత్రాన్ని మేము మీముందుంచాం. అది బ్లాక్‌బస్టర్ అవ్వాలంటే అభిమానుల వల్లే సాధ్యమవుతుందన్నారు.తొలుత అభిమానులు భారీ ర్యాలీతో చిత్ర యూనిట్‌ను ప్రాంగణానికి తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్త చంద్రగిరి ఏసురత్నం, సురేష్ మూవీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ గుంటూరు బ్రాంచ్ మేనేజర్ మాదాల రత్తయ్య చౌదరి, ఈవీవీ యువ కళావాహిని వ్యవస్థాపకులు వెచ్చా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు
రియల్ లైఫ్ మామ-అల్లుడు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో కూడా అదే పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళుతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా వెంకీ మామ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్, నాగచైతన్య నటనపై ప్రశంసలు కురిపించారు. అలాగే డైరక్టర్ బాబీ(కేఎస్ రవీంద్ర) అభినందనలు తెలిపారు. ‘వెంకటేశ్ తనదైన స్టైల్లో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. చాలా కాలం తర్వాత వెంకటేశ్ యాక్షన్ సీన్స్‌లో వావ్ అనిపించాడు. మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య కూడా చాలా చక్కగా నటించాడు. దర్శకుడు బాబీ తనదైన టేకింగ్, ట్రీట్మెంట్, స్ర్కీన్‌ప్లేతో సినిమాను చక్కగా రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి నా అభినందనలు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా బాబీ, నాగచైతన్యలు ట్విటర్ వేదికగా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘వెంకీ మామ గురించి ఇంత అద్భుతమైన మాటలు చెప్పిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఒక అభిమానిగా ఆయన నోటి వెంట ఈ మాటల వినడం.. నా జీవితంలో మరచిపోలేని రోజు’ అని బాబీ ట్వీట్ చేశారు. మహేష్ బాబు కూడా వెంకీ మామ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. వెంకటేశ్, నాగచైతన్యల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పారు. తాను ఈ చిత్రంలో ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. కాగా, సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Here's what MEGASTAR Chiranjeevi garu had to say after watching #VenkyMama https://t.co/CAIA3wlzMI#MegastarAboutVenkyMama #BlockbusterVenkyMama #VictoryVenkatesh | @chay_akkineni | @dirbobby | @RaashiKhanna | @starlingpayal | @MusicThaman | @SureshProdns | @peoplemediafcy — Venky Mama (@VenkyMama) December 18, 2019 -
సల్మాన్ ఖాన్‌తో వెంకీ మామ డ్యాన్స్
-
ఇరగదీసిన సూపర్ స్టార్స్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజా చిత్రం దబాంగ్ 3. హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్, వెంకటేశ్‌లతో కలిసి సల్మాన్ చిందులేశారు. వేదికపై ముగ్గురు స్టార్స్ కలిసి చేసిన డ్యాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దబాంగ్ సీరిస్‌లో రెండు విజయవంతమైన చిత్రాలను సల్మాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్‌కు వాంటెడ్(పోకిరి రీమేక్)తో విజయాన్ని అందించిన ప్రభుదేవా.. దబాంగ్ 3తో మరో హిట్‌ను అందిస్తారని అంతా భావిస్తున్నారు. సోనాక్షి సల్మాన్ భార్యగా నటిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్‌లో సయీ మంజ్రేకర్‌తో ఆయన ఆడిపాడనున్నారు. దబాంగ్ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్, మహీగిల్ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెంకీ మామ ఫ్యామిలీ ప్యాక్
-
నెల్లూరులో సినీనటుడు వెంకటేశ్ సందడి
-
నాని బౌలింగ్.. వెంకీ బ్యాటింగ్
నాని నటించిన తాజా చిత్రం జెర్సీ ప్రీరిలీజ్ ఫంక్షన్ సోమవారం శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో వెంకటేష్ హాజరయ్యారు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా హీరోలు నాని, వెంకటేష్ క్రికెట్ ఆడి సందడి చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్, నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగాశ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ‘జెర్సీ’ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి
కృష్ణాజిల్లా , గన్నవరం: దేశానికి వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు వంటివని, అటువంటి వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న గ్రామీణ ప్రజలంతా పట్టణాలకు వలస వెళ్తుండడం వల్ల భవిష్యత్‌లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని అదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆదివారం జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ రెండో వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించే విధంగా ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల్లో స్నేహభావంతో పాటు ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు. దేశ జనాభాలో 35 శాతం మంది ఉన్న యువతను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతోనే స్వర్ణభారత్ ట్రస్ట్‌ను స్థాపించడం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండానే ప్రైవేట్ సంస్థల సాయంతో నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శిక్షణ, వైద్య సేవలను కూడా అందిస్తున్నట్లు వివరించారు. త్వరలో విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో ట్రస్టును స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు, యువత, రైతుల ప్రాధాన్యతను గుర్తించి వారిలోని నైపుణ్యాభివృద్ధికి స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రముఖ సినీనటుడు వెంకటేష్ మాట్లాడుతూ కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించి ట్రస్ట్‌లో సేవాలందించాలని ఉందన్నారు. అనంతరం ఒమేగా హస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్, సీపీ గౌతమ్ సవాంగ్, పలువురు ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘గోపాల గోపాల’ సినిమా రివ్యూ
తారాగణం: పవన్ కల్యాణ్, వెంకటేశ్, శ్రీయ, మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, కృష్ణుడు, స్క్రీన్‌ప్లే: భూపతిరాజా, దీపక్‌రాజ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమేరా: జయనన్ విన్సెంట్, కళ: బ్రహ్మ కడలి, యాక్షన్: అలన్ అమీన్, డ్రాగన్ ప్రకాశ్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: డి. రామానాయుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభిరామ్ దగ్గుబాటి, నిర్మాతలు: శరత్ మరార్, డి. సురేశ్‌బాబు, కథనం - దర్శకత్వం: కిశోర్‌కుమార్ పార్థసాని (డాలీ) కొన్ని కథలు చెబితే ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని కథలు విన్నప్పటి కన్నా, చూస్తేనే ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాకు వచ్చేసరికి మామూలు కథాంశాన్ని అయినా,తెరపై చూపడంలోని నేర్పును బట్టి ఆసక్తికరంగా మార్చేయవచ్చు. కానీ, ఆ నేర్పే గనక కొరవడితే, ఎంత మంచి కథాంశమైనా, సినిమా హాలు దాకా వచ్చేసరికి చప్పగా తయారవుతుంది. దర్శకుడి సామర్థ్యంతో పాటు అతనికి దక్కిన స్వేచ్ఛ, కథను సన్నివేశాలుగా, పాత్రలను సహజంగా మలుచుకోవడంలో చూపే సత్తా లాంటి అనేక అంశాలన్నీ అందుకు కారణాలే! ముఖ్యంగా, ఒక భాషలో హిట్టయిన కథాంశాన్ని మన భాషలోకి తెచ్చుకున్నప్పుడు ఎక్కడ యథాతథంగా అనుసరించాలి, ఎక్కడ సృజనాత్మకత చూపాలి, మన పాత్రధారులతో ఆ పాత్రల్లోకి ఎలా పరకాయ ప్రవేశం చేయించాలన్నది అనుభవం, ఆలోచనతో చేయాల్సిన పని. పరేశ్ రావల్ నటించిన హిందీ హిట్ ‘ఓ మై గాడ్’ చిత్రాన్ని మనవాళ్ళు తెలుగులోకి ‘గోపాల... గోపాల...’గా తెచ్చిన తీరు చూశాక ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతాయి. కథ ఏమిటంటే... గోపాలరావు (వెంకటేశ్) ఒక మధ్యతరగతి మనిషి. దేవుడి బొమ్మలు, గంగాజలం - ఇలా భక్తి సంబంధమైన సామగ్రి అమ్మే వ్యాపారి. అయితే, విచిత్రంగా అతడికి దేవుడి మీద, పూజా పునస్కారాల మీద నమ్మకం ఉండదు. మానవత్వం మీద, తోటి మనిషికి సాయపడడం మీదే గురి. అతని భార్య మీనాక్షి (శ్రీయ) మహా దైవభక్తురాలు. చిన్నారి కొడుకు మోక్షను కూడా వీర దైవభక్తుడిగా చేస్తుంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా సిద్ధేశ్వర మహరాజ్ (పోసాని కృష్ణమురళి) అనే దొంగ స్వామీజీతో గోపాలరావుకు ఘర్షణ ఎదురవుతుంది. దేవుణ్ణి నమ్మనివాడు నాశనమవుతాడంటూ సిద్ధేశ్వర్ శాపనార్థాలు పెడతాడు. ఇంతలో అనుకోకుండా వచ్చిన చిన్న భూకంపంలో ఊరంతా బాగున్నా, గోపాలరావు కొట్టు ధ్వంసమవుతుంది. ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళేమో ఈ ప్రకృతి వైపరీత్యం ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ బీమా సొమ్ము ఇచ్చేది లేదంటారు. ఆ క్రమంలో తనకు నష్టపరిహారం ఇవ్వాలంటూ గోపాలరావు చివరకు దేవుడి మీద కోర్టులో కేసు వేస్తాడు. దేవుడి పేరు చెబుతూ ఆశ్రమాలు, ఆలయాలు నడుపుతున్న స్వామీజీలకు నోటీసులిస్తాడు. ఆ క్రమంలో మతవాదులు అతనిపై దాడికీ దిగుతారు. ఆ సమయంలో సాక్షాత్తూ దేవుడే (పవన్‌కల్యాణ్) మానవరూపంలో దివి నుంచి భువికి దిగి వస్తాడు. దేవుడిపైనే కేసు వేసిన వ్యవహారం నచ్చక, బంధువులతో పాటు పెళ్ళాం బిడ్డలు కూడా హీరో ఇల్లొదిలి వెళ్ళిపోతారు. అక్కడికి సినిమా ప్రథమార్ధం. ఆ తరువాత సంచలనాత్మకమైన ఈ దేవుడిపై గోపాలరావు కేసు కోర్టులో ఏమైంది? మానవరూపంలో వచ్చి, గోపాలం ఇంటిలోనే దిగిన దేవుడు అతనికి ఏం చెప్పాడు, ఏం చేయించాడు, చివరకు గోపాలరావు జీవితం ఏమైందన్నది మిగతా సినిమా. ఎలా నటించారంటే దేవుడి మీద నమ్మకం కన్నా మానవత్వం మీద నమ్మకం ఎక్కువున్న గోపాలరావు పాత్రలో వెంకటేశ్ పాత్ర పరిధి మేరకు నటించడానికి ప్రయత్నించారు. అయితే, మానవత్వం మిన్న అని వాదించే కొన్ని ఘట్టాల్లో మాత్రమే ఆయన అభినయ ప్రతిభ వెలికి వచ్చింది. దేవుడుగా పవన్ కల్యాణ్ తన మాటలో, నటనలో మార్దవాన్ని మేళవించి, దైవత్వం ఉట్టిపడేలా చేయాలని చూశారు. అలవాటైన హావభావాలకు దూరంగా ఉంటూ కొత్తగా కనిపించారు. ప్రస్తుతం జనంలో ఉన్న క్రేజుతో హాలులో కేరింతలు కొట్టించారు. ఇక, మనిషిలో, ప్రవర్తనలో స్త్రీత్వాన్నీ, వ్యూహరచనలో క్రూరత్వాన్నీ కలగలుపుకొన్న లీలాధర స్వామిగా మిథున్ చక్రవర్తికి ఇది తొలి తెలుగు సినిమా. హిందీ ‘ఓ మై గాడ్’లో పోషించిన పాత్రనే మరింత సమర్థంగా ఆయన అభినయించారు. కొన్ని చిన్న చిన్న హావభావాలను కూడా తన అనుభవంతో తెరపై బాగా పండించారు. వెంకటేశ్ భార్యగా శ్రీయది ప్రాధాన్యం లేని చిన్న పాత్ర. మిగిలిన పాత్రలు, పాత్రధారులు సన్నివేశానికి తగ్గట్లు వచ్చిపోతుంటారు. సాంకేతిక నిపుణుల పనితీరెలా ఉందంటే అసలు ‘కిషన్ వర్సెస్ కన్హయ్య’ అనే నాటకం ఈ చిత్రకథకు మూలం. దాని ఆధారంగా వచ్చిన ‘ఓ మై గాడ్’ హిందీ చిత్రం అధికారిక మాతృక. ఆ స్క్రిప్టును తెలుగుకు తగ్గట్లు చిన్న చిన్న మార్పులు, చేర్పులతో అల్లుకున్నారు. ‘‘వేగం బండిలో కాదు మిత్రమా... దాన్ని నడిపేవాడి నరంలో ఉంటుంది!’’ (వెంకటేశ్‌తో పవన్ కల్యాణ్) లాంటి కొన్ని మెరుపులు డైలాగుల్లో ఉన్నాయి. ‘కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా’, ‘సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు’, ‘దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని’ (పవన్ కల్యాణ్) లాంటి రాజకీయ ధ్వనితో కూడిన మాస్ డైలాగులు సన్నివేశం, సందర్భంతో పని లేకుండా అభిమానులకు వీనులవిందు చేస్తాయి. అయితే, చాలాచోట్ల సన్నివేశాల రూపకల్పనలో, డైలాగుల్లో సహజత్వం కన్నా తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం తెలుస్తుంటుంది. పిల్లి ఎదురురావడం, బల్లిపాటు, వాస్తు లాంటి మనలోని మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ సినిమా మొదట్లో వచ్చే ‘ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు ముఖ్యమంటు...’ పాట ఆలోచింపజేస్తుంది. ఇక, ద్వితీయార్ధంలో ‘భాజే భాజే...’ అంటూ పవన్ కల్యాణ్ బృందంపై వచ్చే పండగ పాట ప్రేక్షకులతోనూ స్టెప్పులు వేయిస్తుంది. మిగిలిన పాటలు కూడా సందర్భోచితంగా వచ్చినవే అయినా, గుర్తుండేలా సాగవు. సినిమా అనేక చోట్ల నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని భావోద్వేగాలను పెంచడానికి ఉపకరిస్తుంది. శ్రీయతో, పవన్ కల్యాణ్ మాట్లాడే సన్నివేశం లాంటి చోట్ల ఛాయాగ్రహణ పనితనం కనిపిస్తుంటుంది. సినిమాలో మొదటి పాట లాంటి చోట్ల చకచకా సన్నివేశాన్ని నడిపిన ఎడిటర్, సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆ సన్నివేశాలు, వాటిలోని అంశాల తాలూకు అనివార్యత వల్లనేమో ఆ ‘టెంపో’ను చూపలేకపోయారు. పవన్ కల్యాణ్ భువి మీదకు వచ్చే సన్నివేశం, అక్కడి యాక్షన్ ఘట్టం ఇంటర్వెల్‌కు ముందు సినిమాలో ఊపు తెస్తుంది. ఎలా ఉందంటే... ఫస్టాఫ్‌కే కథ, హీరో లక్ష్యం తెలిసిపోతాయి. ఇక, సెకండాఫ్‌లో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పడ్డ కష్టం, దేవుడి సాయం, మానవత్వం వర్సెస్ దైవం పేరుతో సాగే వ్యాపారం లాంటి కీలక ఘట్టాలను చూపాలి. కానీ, సరిగ్గా అక్కడకు వచ్చే సరికే కథనం నీరసపడిపోయింది. కోర్టులో వెంకటేశ్ వాదన, ‘బోనులో భగవంతుడు’ టీవీ చర్చాకార్యక్రమం లాంటివి, ఆ మాటకొస్తే చివరాఖరులో గోపాలరావుకూ - గోపాలదేవుడికీ జరిగే సంభాషణ లాంటివి సుదీర్ఘమైన మోనో యాక్షన్ లాగా సాగుతాయి. దాంతో, ప్రేక్షకుడు సహనానికి పరీక్ష ఫీలవుతాడు. నిజానికి, మతం పేరిట, మనిషిలో దేవుడి పట్ల ఉన్న భయాన్ని సొమ్ము చేసుకుంటూ సాగుతున్న వ్యాపారమనే పాయింట్‌ను ‘ఓ మై గాడ్’ బాగా చర్చకు పెట్టింది. అదే విషయాన్నే తాజాగా ఆమిర్‌ఖాన్ ‘పీకె’ కూడా మరో కోణంలో సహజంగా, సమర్థంగా చూపెట్టింది. ఆ రెండిటినీ జనం చూసేసిన తరువాత రావడం - ‘గోపాల... గోపాల...’కున్న బలహీనత! ఈ రకమైన ఇతివృత్తానికి ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేయడానికి మాతృకలు ఉపయోగపడినా, ఇప్పటికే చూసేసిన కథాంశంలా ఆనుకొనే ప్రమాదం ఉంది. పైగా, దైవం మీద ప్రేమ కన్నా భయంతో చేసే శుష్క పూజల కన్నా, సాటి మనిషిని ఆదుకోవడమే అసలు దైవత్వమనే పాయింట్‌ను ఇంకా బలంగా చెప్పాల్సింది. మరోపక్క స్వామీజీలు మతం, దైవం పేరుచెప్పి మోసం చేస్తుంటే, గంగాజలమంటూ ట్యాప్ తిప్పి పట్టిన నీళ్ళిచ్చే హీరో చేస్తున్నది మాత్రం ఏమిటనిపిస్తుంది. వెరసి, పాత్రధారులే తప్ప, పాత్రలు కనిపించని ఈ రీమేక్‌కు పండగ సెలవులు, పవన్ కల్యాణ్ క్రేజు కలిసొస్తాయి కానీ, అది ఎన్ని రోజులన్నది దాదాపు రూ. 50 కోట్ల పైచిలుకు ప్రశ్న. - రెంటాల జయదేవ -
కృష్ణాష్టమికి గోపాల గోపాల ఫస్ట్ లుక్ !
చెన్నై: విక్టరీ హీరో వెంకటేష్ హీరోగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. ఆ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు16వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ గురువారం చెన్నైలో వెల్లడించారు. గోపాల గోపాల చిత్రంలో శ్రీకృష్ణుడు కీలక భూమిక పోషిస్తాడని.. ఈ నేపథ్యంలో ఆయన జన్మదినమైన కృష్ణాష్టమి రోజున ఆ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్‌ల డైలాగ్‌లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 25 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు. హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రం కిషోర్ కుమార్ దర్శకత్వంలో గోపాల గోపాల రీమేక్ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్, పరాష్ రావెల్ పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ రోజున గోపాల గోపాల చిత్రం విడుదలకు సిద్దమతుంది. -
మంత్రి-మధ్యతరగతి యువతి లవ్ స్టోరీ
చెన్నై: విక్టరీ వెంకటేష్‌తో నయనతార ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. లక్ష్మీ, తులసీ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. తాజాగా తెరకెక్కనున్న 'రాధ' సినిమాలో వెంకీ సరసన హీరోయిన్గా నయన్ నటించనుంది. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. జనవరి 16న షూటింగ్ ప్రారంభం కానుంది. మంత్రికి, మధ్యతరగతి యువతికి మధ్య చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వెంకటేష్-నయనతార హిట్ ఫెయిర్ మరోసారి రిఫీట్ అవుతుండడంతో 'రాధ' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ నటించిన సినిమా టైటిల్స్ ఆడవారి పేర్లే కావడం విశేషం. -
సరికొత్త కాంబినేషన్లు
సినిమా పరిశ్రమలో ఎవరెవరు ఎప్పుడు కలిసి పనిచేస్తారనేది ఎవ్వరూ చెప్పలేరు. ఫలానావారు ఫలానా వారికే సెట్ అవుతారనే రూల్ కూడా ఏమీ లేదు. ఇక్కడ ఏదైనా జరగొచ్చును. ఒక్కోసారి కొన్ని కాంబినేషన్లు భలే గమ్మత్తుగానూ ఆసక్తికరంగానూ అనిపిస్తాయి. అలాంటి ఓ నాలుగు కాంబినేషన్ల గురించి ప్రస్తుతం ఫిలిమ్నగర్లో వేడి వేడి చర్చ జరుగుతోంది. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌కి మళ్లీ ఓ కొత్త ఉత్తేజం తీసుకొచ్చారు వెంకటేశ్. మహేశ్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసిన వెంకీ, ‘మసాలా’లో రామ్‌తో కలిసి యాక్ట్ చేస్తున్నారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు ఫిలిమ్నగర్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో పాటు మరో వార్త షికారు చేస్తోంది. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ చిత్రాలతో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న మారుతి దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయడానికి అంగీకరించారట. దీనికి టైటిల్ ‘రాధ’ అని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారట. ఎన్టీఆర్‌లాంటి హై ఓల్టేజ్ మాస్ హీరో, త్రివిక్రమ్ శైలిలో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఉద్వేగాన్ని రేకెత్తించే వార్తే. ఇటీవలే ‘అత్తారింటికి దారేది’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ నెక్స్ ్ట ఎన్టీఆర్‌తో కలిసి పని చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘రభస’ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉందట. రామ్‌చరణ్ అంటేనే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇటు దశరథ్ చూస్తే పక్కా క్లాస్ డెరైక్టర్. మరి వీరిద్దరి కలయికలో సినిమా అంటే సమ్‌థింగ్ డిఫరెంట్ అనుకోవాలి. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండిస్తాడనే పేరున్న దశరథ్ చెప్పిన కథ చరణ్‌కి బాగా నచ్చిందట. ఏవో కొన్ని మార్పులు సూచించారని సమాచారం. అన్నీ సెట్ అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కేస్తుందన్నమాట. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో కేరెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే హీరోలందరూ పూరితో కలిసి పనిచేయడానికి అమితాసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం నితిన్‌తో ‘హార్ట్ ఎటాక్’ చేస్తున్న పూరి, ఆ తర్వాత విష్ణుతో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని పూరి కూడా ధ్రువీకరించారు. అయితే ఇది ‘అసెంబ్లీ రౌడీ’కి సీక్వెల్ అని బయట ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. -
ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది - విజయ్‌భాస్కర్
‘‘మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సంస్థలో నేను నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమానే అందుకు నిదర్శనం. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల్లో నటించాను. మళ్లీ ఆయన డెరైక్షన్‌లో చేయడం ఆనందంగా ఉంది’’ అని వెంకటేష్ అన్నారు. వెంకటేష్, రామ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘మసాలా’. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామ్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని వెంకటేష్‌కి అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఇంకా మాట్లాడుతూ- ‘‘కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చక్కనైన కుటుంబ కథాచిత్రం ‘మసాలా’. రామ్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేశాడు. అతని కెరీర్లో ది బెస్ట్‌గా చెప్పుకునే సినిమా అవుతుంది. సినిమా పూర్తికావచ్చింది. ఒక పాటలో కొంత భాగం మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. అతి త్వరలోనే ‘మసాలా’ని ప్రేక్షకులకు అందిస్తాం’’ అని చెప్పారు. ‘‘‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు నేను సెవెన్త్ స్టాండర్ట్ చదువుతున్నాను. అప్పుడు ఆ సినిమా సెట్‌కి వెళ్లి కూర్చొని భలే ఎంజాయ్ చేశా. ఇప్పుడు అదే బేనర్ నిర్మిస్తున్న చిత్రంలో అదే హీరోతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం స్థాయిలో ‘మసాలా’ ఉంటుంది. తమన్ వండర్ఫుల్ ఆడియో ఇచ్చాడు. ట్రైలర్స్‌కి మంచి అప్లాజ్ వస్తోంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’ అని రామ్ నమ్మకం వ్యక్తం చేశారు. విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తవడానికి, సినిమా గ్రాండ్‌గా రావడానికి కారణం వెంకటేష్, రామ్, రవికిషోర్, సురేష్‌బాబు. ఈ సందర్భంగా ఈ నలుగురికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ‘మసాలా’ చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, బ్యాంకాక్, జపాన్లలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశామని, వారం రోజుల్లో విడుదల తేదీని ప్రకటిస్తామని డి.సురేష్‌బాబు తెలిపారు. వెంకటేష్‌తో మళ్లీ నటించడం పట్ల అంజలి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అలీ, పోసాని కృష్ణమురళి, ఆండ్రూ, రామజోగయ్యశాస్త్రి తదితరులు కూడా మాట్లాడారు. కృష్ణచైతన్య, ఎ.ఎస్.ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సచిన్ రిటైర్మెంట్ పై టాలీవుడ్ హీరోల స్పందన
క్రికెట్ గాడ్‌గా పేర్గాంచిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వార్త క్రీడా ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. సచిన్ వీరాభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్‌ని విపరీతంగా ఆరాధించేవారిలో మన టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. వారు కూడా సచిన్ రిటైర్మెంట్ వార్త విని చలించిపోయారు. పలువురి హీరోల స్పందన ఇలా... క్రికెట్‌ను సచిన్‌కు ముందు... సచిన్‌కు తర్వాత అని విభజించాల్సిందే - వెంకటేశ్ నా దృష్టిలో ఇది వెరీ శాడ్ డే. 24 ఏళ్లుగా సచిన్ ఆటను ఆస్వాదిస్తూ వచ్చాను. ఇక తను లేని క్రికెట్ అంటే నాకే బ్లాంక్‌గా ఉంది. సచిన్‌ని చూసి ఎవ్వరైనా సరే ఇన్స్పైర్ కావాల్సిందే. అతని డిసిప్లిన్, డెడికేషన్, ఎఛీవ్మెంట్, ఎనర్జీ... మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. నాకు రిలాక్సేషన్ అంటే క్రికెట్టే. సచిన్ లేని క్రికెట్‌ని ఇంకో రకంగా ఊహించాల్సిందే. ఇక నుంచి ఈ క్రికెట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది. అసలు క్రికెట్ గురించి మాట్లాడాలంటే... సచిన్‌కి ముందు, సచిన్‌కి తర్వాత అని విభజించాల్సిందే. సచిన్‌తో నాకు మంచి పరిచయమే ఉంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ల సమయంలోనూ, ఐపీయల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తనను చాలాసార్లు కలిశాను. మా ఇద్దరి మధ్యనా చాలా మంచి చర్చలు జరిగేవి. ఆ సందర్భాలను ఎప్పుడు గుర్తు చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు - శ్రీకాంత్ ‘‘క్రికెట్‌ని గాఢంగా ప్రేమించే వాళ్లంతా సచిన్ రిటైర్మెంట్ వార్త వినగానే ఏడ్చినంత పనిచేశారు. క్రమశిక్షణకు నిలువుటద్దంలాంటి వ్యక్తి ఆయన. సచిన్‌ని చూడ్డానికే స్టేడియమ్‌కి వెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. ఇప్పుడా సంఖ్య తగ్గుతుంది. ఇకపై నేను కూడా స్టేడియమ్‌కి వెళ్లి మ్యాచ్‌లు చూడను. సచిన్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైజాగ్‌లో ఓసారి ఛారిటీ మ్యాచ్ జరిగినప్పుడు సచిన్‌తో పాటు ఐదుగురు ఇండియన్ క్రికెటర్లు, నేను, చిరంజీవిగారు, వెంకటేశ్‌గారు, తరుణ్ క్రికెట్ ఆడాం. ఆ మ్యాచ్‌లో నా కాలికి దెబ్బ తగిలితే, సచిన్ స్వయంగా నాకు ఐస్ పెట్టి ఎలా కేర్‌గా ఉండాలో సూచనలు చేశారు. ఆ తర్వాత రోజు చిరంజీవిగారి ఇంట్లో పార్టీ జరిగినప్పుడు సచిన్, మేమంతా చాలా ఎంజాయ్ చేశాం. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు. సచిన్ కోసమే ఇన్నేళ్లూ క్రికెట్ చూశాను - విష్ణు ‘‘ఇక సచిన్ లేని క్రికెట్‌ని నేను చూడలేను. సచిన్ కోసమే ఇన్నేళ్లూ క్రికెట్ చూశాను. ఇక నుంచి క్రికెట్ ప్రపంచమంతా బిఫోర్ సచిన్, ఆఫ్టర్ సచిన్ అని చెప్పుకుంటారు. ఈ 40 ఏళ్లలో 30 ఏళ్లు సచిన్ క్రికెట్‌నే అంకితమైపోయాడు. నెక్ట్స్ ఆయన ఏం చేస్తాడు? ఎంత మందికి ఆదర్శవంతంగా ఉంటాడు? అనేది నాతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ వచ్చినపుడు 2 సార్లు సచిన్‌ని కలిశాను. ఆ ఇన్సిడెంట్స్ ఇప్పటికే నా మదిలో లైవ్లీగా ఉన్నాయి’’. వన్ అండ్ ఓన్లీ సచిన్ - సిద్దార్థ్ ‘‘నాకు డాన్ బ్రాడ్‌మన్ తెలీదు. గ్యారీ సోబర్స్‌ని చూడలేదు. నేను చూసింది, నాకు తెలిసింది, నేను ఆరాధించింది, నేను ఆస్వాదించింది వన్ అండ్ ఓన్లీ సచిన్‌నే. ప్రపంచంలో ఇంత గొప్ప బ్యాట్స్‌మెన్ మళ్లీ రాడు. 24 ఏళ్లుగా ఈ క్రికెట్ ప్రపంచాన్ని తేజోవంతం చేసినందుకు సచిన్‌కి కృతజ్ఞతలు. సచిన్ అంటేనే క్రికెట్... క్రికెట్ అంటేనే సచిన్..! - అల్లరి నరేశ్ ‘గబ్బర్ సింగ్’లో పవన్ కల్యాణ్ ‘పిల్లా... నువ్వు లేని జీవితం నల్లరంగు అంటుకున్న తెల్ల కాగితం’ అని పాట పాడినట్టుగా, సచిన్ లేని క్రికెట్‌ని ఊహించడమే ఎంతో కష్టంగా ఉంది. బ్రియాన్ లారా లాంటి హేమాహేమీల్లాంటి క్రికెటర్లే సచిన్ రిటైర్మెంట్ వార్తను జీర్ణించుకోలేకపోతుంటే, నాలాంటి సాధారణ అభిమానుల పరిస్థితి ఏంటి? నిజంగానే సచిన్ క్రికెట్ దేవుడు. ఆయనలో ఇప్పటికీ క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే ఒకే ఒక్క కారణంతో పక్కకు తప్పుకుంటున్నారు. నా మట్టుకు నేను సచిన్ లేని క్రికెట్‌ని చూడ్డానికి ఇంకో రెండేళ్లు పడుతుందేమో! అసలు ఒక మనిషి 24 ఏళ్లుగా ఎక్కడా గ్రాఫ్ పడిపోకుండా హైరేంజ్‌లోనే క్రికెట్ ఆడటమంటే మాటలు కాదు. అది సచిన్ ఒక్కడి వల్లే అవుతుంది. ఇన్నేళ్లలో తనపై ఒక్క కాంట్రవర్శి కూడా రాకపోవడం చాలా గొప్ప విషయం. అసలు సచిన్ గురించి ఇంకా చాలా చెప్పొచ్చు. ఫైనల్‌గా మాత్రం ఒక్కటే. సచిన్ అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే సచిన్. సచిన్‌కి ఇంకో అయిదారేళ్లు ఆడగల స్టామినా ఉంది - ప్రిన్స్ ‘‘ఇండియాలో క్రికెట్ ఎప్పుడు పుట్టిందో నాకైతే తెలీదు కానీ, సచిన్ వచ్చాకనే చాలా ఎక్కువ మందికి క్రికెట్ బాగా దగ్గరైంది. నా విషయానికొస్తే - అసలు నేను క్రికెట్ పట్ల ఆకర్షితుణ్ణయ్యిందే సచిన్ వల్ల. ఈ 24 ఏళ్లల్లో చాలామంది క్రికెటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సచిన్ ఒక్కడే ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు పుట్టినవాళ్లతో కూడా అతను సమానంగా ఆడుతున్నాడు. ఇది మామూలు విషయం కాదు. సచిన్‌కి ఇంకో అయిదారేళ్లు ఆడగల స్టామినా ఉంది. వైజాగ్‌లో ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినా నేనే బాల్ బాయ్‌ని. ఆ విధంగా సచిన్‌ని ఐదారుసార్లు కలిశాను. హీరో అయ్యాక 2 సార్లు కలిశాను. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది!