విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వీకెండ్స్‌తో పాటు వీక్ డేస్‌లోనూ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికీ కొన్నిచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు ప్రత్యక్షమవుతుండటం సినిమా ఫన్ అండ్ ఫెంటాస్టిక్ హిట్ అని చెప్పడానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్న ఈ సినిమాను వీక్షించడానికి వన్స్‌మోర్ అంటూ థియేటర్‌వైపు అడుగులు వేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లాభాల బాట పట్టిన ఎఫ్3 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.
💥💥🔥👌😀 https://t.co/xkMjy5LbSC
— Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2022
చదవండి: 'తిండి పెట్టట్లేదు, రోజూ కొడుతున్నాడు' హీరోకు మొర పెట్టుకున్న ఫ్యాన్
సూర్య ఎంట్రీ సీన్.. స్క్రీన్ తగలబెట్టిన ఫ్యాన్స్!
Comments
Please login to add a commentAdd a comment