Venkatesh And Varun Tej F3 Movie World Wide Box Office Collections Crosses Rs 110 Crores - Sakshi
Sakshi News home page

F3 Movie Collections: నవ్వులు పంచుతూనే రూ.110 కోట్లు రాబట్టిన ఎఫ్‌ 3

Published Mon, Jun 6 2022 2:20 PM | Last Updated on Mon, Jun 6 2022 3:09 PM

Venkatesh, Varun Tej Starrer F3 Movie Collects Rs 110 Crores - Sakshi

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్‌ 3. నవ్వుల బొనాంజా ఎఫ్‌ 2కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ అంతకంటే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు కాసేపు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చేసిన ఎఫ్‌ 3 మే 27న రిలీజైంది.

కేవలం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ సాధించిన మూవీ వీకెండ్‌ను బాగా వాడుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.110 కోట్ల గ్రాస్‌ అందుకుంది. ఇప్పటికే నిర్మాతలకు లాభాలు కూడా వచ్చాయని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కాగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్‌ 3 సినిమాలో మెహరీన్‌, తమన్నా కథానాయికలుగా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించాడు.

చదవండి: నిఖిల్‌ మూవీ 'స్పై' గ్లింప్స్‌ చూశారా?
నిజంగానే ఆరోజు తమన్నాతో గొడవపడ్డా.. ఎఫ్‌ 3 డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement