‘ఎఫ్ 3 నవ్వుల పండగలా ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు’ అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 3. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వరుణ్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఎఫ్ 2 సక్సెస్‌తో ఎఫ్ 3 భాద్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది?
‘ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. అయితే ఆ భాద్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు. మాకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువ. ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్ 3 డబ్బు నేపధ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్‌గా అనిపించాయి. వెంకటేశ్ గారు, నేను ఎఫ్ 2 థియేటర్‌లో చూశాం. ప్రేక్షకులు ఆనందాన్ని చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్ 2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా ఉంటుంది’ అన్నాడు.
ఎఫ్ 3లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది?
‘ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడం కూడా కష్టం. ఫన్ డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా ఉంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ట్ చేశాం. అది హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యింది’ అని చెప్పకొచ్చాడు.
నత్తి కోసం స్పెషల్‌గా హోం వర్క్ ఏమైనా చేశారా?
‘అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డాను. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన ఉండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఈజీ అయ్యింది. అయితే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. కానీ, అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.
ఎఫ్ 3లో ఫన్ ఎవరికి? ఫస్ట్రేషన్ ఎవరికి?
డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్‌ని హిలేరియస్‌గా చూపించారు.
వెంకటేశ్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది?
వెంకటేశ్ గారితో కల్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలవుతున్నా. వెంకటేశ్ గారు అంటే నాకు పర్శనల్‌గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్‌లా ఉంటారు. పెద్దనాన్నతో(చిరంజీవి) ఆయనకి ఉండే బాండింగ్, అనుభవాలు ఇలా చాలా విషయాలు చెబుతుంటారు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి.. మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేశ్ గారు చాలా లైట్ హార్టడ్. క్రమశిక్షణగా ఉంటారు. ఆయన్ని చూసి సెట్స్‌కి రెండు నిమిషాల్ ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. పాజిటివ్‌గా ఆలోచిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రోసెస్ కూడా మారింది. ఇది చాలెజింగ్‌గా అనిపిస్తుందా ?
ఇప్పుడు కథల ఎంపిక మారింది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి.
ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ?
ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ అయ్యారు. ‘ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్’ అని సర్ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు.
‘మెగా ఫ్యామిలీ’ ట్రైలర్ డైలాగ్ మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.
సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారు?
చాలా బావున్నాడు. మేం ఇద్దరం కలసి జిమ్‌కి వెళ్తున్నాం. నెల క్రితమే షూటింగ్ కూడా మొదలుపెట్టాం.
Comments
Please login to add a commentAdd a comment