F3 Movie
-
డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?
పైసా మే పరమాత్మ అంటారు. ఒక్క చిన్న మార్పు. ఇప్పుడు ‘పైసా మే సినిమా’ అనాలి. ఎందుకంటే రిలీజ్ తర్వాత సాధించే పైసా వసూల్ కోసం పైసల చుట్టూ కథలు అల్లి కొన్ని సినిమాలు తీస్తున్నారు. ‘పైసా మే సినిమా’... అంటూ పైసల మీద తీస్తున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. వినోదం.. సందేశం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’. భార్యాభర్తల అనుబంధాలతో అల్లుకున్న ‘ఎఫ్ 2’ అయినా.. వారసత్వం నేపథ్యంతో సాగిన ‘ఎఫ్ 3’ అయినా.. ఈ రెండు సినిమాల్లో అంతర్లీనంగా ఉన్న ప్రధానాంశం డబ్బుతో కూడుకున్న అవసరాలేనని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ‘ఎఫ్ 3’లో అయితే జీవితంలో డబ్బు చాలా ముఖ్యమంటూ ‘లబ్ డబ్.. లబ్ డబ్.. డబ్బూ..’ అనే పాట కూడా ఉంది. ఈ చిత్రం ఎండింగ్లో ‘ఎఫ్ 4’ ఉంటుందన్నట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది ‘ఎఫ్ 4’ సినిమా ఆరంభం కానుందట. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ల మాదిరిగానే ‘ఎఫ్ 4’ ప్రధాన కథాంశం డబ్బే అయ్యుంటుందని ఊహించవచ్చు. ఖరీదైన భవనాలు.. నోట్ల కట్టలు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు వినోదంతో పాటు సందేశాత్మకంగానూ ఉంటాయి. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న తాజా సినిమాలో ధనుష్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఒకవైపు అత్యంత ఖరీదైన భవనాలు, మరోవైపు మురికి వాడలు.. మధ్యలో నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. సో.. ఈ సినిమా ప్రధాన కథాంశం డబ్బు నేపథ్యంలో ఉంటుందని, సమాజంలో నెలకొన్న అసమానతల కోణంలో కథనం సాగుతుందని ఊహింవచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. జూదం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ పాన్ ఇండియన్ సినిమాకు ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్‌ని బట్టి ‘మట్కా’ కథ అంతా డబ్బు చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నట్లు, వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామాన్యుడి కథ నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌ను గమనిస్తే టైటిల్లో డాలర్ సింబల్ స్పష్టంగా కనిపిస్తుంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాలర్ కుమార్ ‘బిగ్ బాస్’ షో ఫేమ్ వీజే సన్నీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. ఏ ట్విస్టెడ్ ఫ్యామిలీ స్టోరీ అనేది ఉపశీర్షిక. హ్రితికా శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్ శేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాలర్ కుమార్ అనే పాత్రలో నటిస్తున్నారు వీజే సన్నీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌లో డబ్బు కనిపిస్తుండటం ‘సౌండ్ పార్టీ’ ప్రధాన కథాంశం డబ్బేఅని స్పష్టం చేస్తోంది. డబ్బే ప్రధానాంశంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
ఈ సినిమాలకు ముందుంది మూడో భాగం
ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ కూడా హిట్.. మరి ఆ హిట్ కంటిన్యూ అవ్వాలి కదా. అవ్వాలంటే కథ ఉండాలి. కొన్ని చిత్రాల కథలకు ఆ స్కోప్ ఉంది. ఎన్ని భాగాలైనా తీసేంత కథ ఉంటుంది. అలా తెలుగులో కొన్ని చిత్రాల కథలు ఉన్నాయి. ఆ కథల తొలి, మలి భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగానికి కథ రెడీ అవుతోంది. ‘ముందుంది మూడో భాగం’ అంటూ రానున్న సీక్వెల్ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఒకే కాంబినేషన్.. రెండు చిత్రాల సీక్వెల్ సీక్వెల్ చిత్రాలు రావడం ఇప్పుడు కామన్ అయింది. అయితే ఒకే కాంబినేషన్లో రెండు చిత్రాల సీక్వెల్స్ రావడం అరుదు. అల్లు అర్జున్–సుకుమార్‌ల కాంబినేషన్ ఈ కోవలోకే వస్తుంది. ‘ఆర్య’ (2004)తో ఈ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది. ఆ చిత్రం హిట్‌తో హిట్ కాంబినేషన్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (2021) పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాణంలో ఉంది. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది. ‘ఆర్య’, ‘పుష్ప’... ఇలా సౌత్‌లో రెండు చిత్రాల సీక్వెల్స్ తెచ్చిన కాంబినే షన్ బన్నీ–సుకుమార్లదే అవు తుంది. ఎఫ్ 4 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన తొలి మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ తెరకెక్కించారు అనిల్. ఈ మూవీలోనూ వెంకటేశ్–తమన్నా, వరుణ్ తేజ్–మెహరీన్ హీరో హీరోయిన్లు. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిట్ 3 ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదల కాగా మూడో భాగం కోసం డైరెక్టర్ శైలేష్ కొలను సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమా 2020 ఫిబ్రవరి 28న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ తీశారు శైలేష్ కొలను. అయితే ఈ మూవీలో హీరో మారారు.. అడివి శేష్ హీరోగా నటించారు. 2022 డిసెంబరు 2న రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ స్పష్టం చేశారు. ‘హిట్ 2’ లానే ‘హిట్ 3’లోనూ హీరో మారారు. ‘హిట్ 1’, ‘హిట్ 2’ సినిమాలు నిర్మించిన హీరో నాని ‘హిట్ 3’లో లీడ్ రోల్ చేయనున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. ‘హిట్ 2’ క్లయిమాక్స్లోనే నాని కనిపించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అటు నాని, ఇటు శైలేష్ కొలను తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరి ‘హిట్ 3’కి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ 3 కన్నడ చిత్ర పరిశ్రమను, యశ్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2018 డిసెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత యశ్‌తోనే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. 2022 ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. -
Year End 2022: ఈ పంచ్ డైలాగ్స్‌పై ఓ లుక్కేయండి
2022 ఎండ్ అవుతోంది... ఈ ఎండింగ్ హ్యాపీకి దారి తీయాలంటూ 2023కి వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నాం. ఈ ఇయర్ ఎండింగ్‌ని కొన్ని పంచ్ డైలాగ్స్‌తో ఎండ్ చేద్దాం. 2022లో రిలీజైన చిత్రాల్లో పాపులర్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని పంచ్ డైలాగ్స్, లవ్ డైలాగ్స్, కామెడీ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ ఈ విధంగా ... బంగార్రాజు: ఏంటే ఈ మనుషులు.. బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలీదేంటే వీళ్లకి.. పోతేనే తెలుస్తుందా? నాకు తెలుసే దాని విలువ.. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చస్తారు.. బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలు.. పోయాక ఏం మిగులుతుందే.. ఫొటోలు తప్ప. గుడ్ లక్ సఖి: గోలీ రాజు ఏంటి గోలీ రాజు? స్టేజి మీద నా పేరు రామారావు.. నువ్వు రామారావు అయితే నేను సావిత్రి. ఆర్ఆర్ఆర్: తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోణ్ణి ఏసుకుంటూ పోవాలే ♦ భీమ్... ఈ నక్కల వేట ఎంత సేపు. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా? ఖిలాడి: ఎప్పుడూ ఒకే టీమ్‌కి ఆడటానికి నేషనల్ ప్లేయర్‌ని కాదు.. ఐపీఎల్ ప్లేయర్. ఎవడెక్కువ పాడుకుంటే వాడికే ఆడతాను. డీజే టిల్లు: ఇంట్లో ఒక శవాన్ని, బిల్డింగ్‌లో సీసీ టీవీ కెమెరాల్ని పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను మొహానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసినా చూడు అట్లుంటది మనతోని ముచ్చట. సన్ ఆఫ్ ఇండియా: నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని.. నేను కసక్ అంటే మీరందరూ ఫసక్. ఆడవాళ్ళు మీకు జోహార్లు: వీకెండ్ అంటే ఏం ఉంటుందండి.. తాగటం, తినడం, తొంగోవడం.. అలా అందరిలా కాకుండా అంతర్వేది, అన్నవరం వెళ్లొద్దామనుకుంటున్నానండి. రాధేశ్యామ్: ఏంట్రా.. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?, ఆడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైపు కాదు. ఆచార్య: పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో? ♦ ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది.. ధర్మస్థలి అధర్మస్థలి కాకూడదు. సర్కారువారి పాట: మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోవద్దు. ♦ దీనికున్న అలవాట్లకి, దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని. ఎఫ్3: వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ ♦ వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ మేజర్: టైమ్‌కి మనం వెళ్లకపోవడం వల్ల ఒక్క ప్రాణం కోల్పోయినా కూడా లైఫ్‌లో నన్ను నేను సోల్జర్ అనుకోలేను సర్. పక్కా కమర్షియల్: సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా.. విలన్. ది వారియర్: ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. థ్యాంక్యూ: లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేది లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడికొచ్చాను. బింబిసార: బింబిసారుడు అంటే మరణ శాసనం.. ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే. సీతారామం: చూడండీ... అడ్రస్ దొరికింది కదా అని వచ్చేస్తారేమో? అంత సాహసం మాత్రం చేయకండే! కార్తికేయ 2: శక్తి, సామర్థ్యాలతో పాటు బుద్ధి, గుణం వల్లే రాముడు, శివుడు, శ్రీకృష్ణుడు దేవుళ్లయ్యారు. లైగర్: లోపాలు అందరికీ ఉంటాయి. నీకు నత్తి ఉంది అంటున్నారు కదా. రేపు నీ మాట కూడా అందరికీ పాట లెక్క వినపడతది.. వినపడేటట్టు చేయాలి. గాడ్‌ఫాదర్: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, నా నుంచి రాజకీయం దూరం కాలేదు. జిన్నా: నమ్మకం లేని ప్రేమ.. కర్రల్లేని టెంటు నిలబడవు రేణుకా. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: అన్యాయంగా బెదిరించేవాడికన్నా న్యాయం కోసం ఎదిరించేవాడే బలమైనవాడు. హిట్ ది సెకండ్ కేస్: అవతలి టీమ్ వీక్ అని మన గోల్ కీపర్‌కి రెస్ట్ ఇవ్వలేం కదా సర్. ధమాకా: నేను వెనకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చినవాణ్ణి కాదురోయ్.. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసినవాణ్ణి. 18 పేజెస్: ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించాం అంటే ఆన్సర్ ఉండకూడదు. -
ఎఫ్-3 మూవీని వెంకీ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు: పరుచూరి
అనిల్ రావిపూడి తెరెకెక్కించిన ఎఫ్-2తో పోలిస్తే ఎఫ్-3 అంత బాలేదని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాపై పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పరుచూరి పలుకులు వేదికగా ఎఫ్-3 మూవీపై తన రివ్యూను వీడియో ద్వారా విడుదల చేశారు. ఎఫ్-2లో భార్యభర్తల మధ్య పెత్తనం అనే అంశం అందరికీ కనెక్ట్ అయ్యింది. అనిల్ రావిపూడికి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. కానీ రీసెంట్గా నేను ఎఫ్-3 సినిమాను చేశాను. గతంలో 'శ్రీ కట్న లీలలు'లో మేము చేసిన పొరపాటే అనిల్ రావిపూడి ఈ సినిమాలోని సెకండాఫ్‌లో చేశారనే అనుమానం నాకు కలిగింది. సెకండ్ ఆఫ్‌లో మురళీ శర్మ కొడుకుగా వెంకీని చూపించడం అతకలేదు. మన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలా చూపించడం సహా సెకండాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ అర్థం పర్థం లేనట్లు అనిపించింది. కాస్త లాజిక్ లేకున్నా వెంకటేశ్ ఒప్పుకోడు. ఈ పాత్రను ఎలా ఓకే చేశాడో అర్థం కావడం లేదు. కుటుంబం మొత్తం హోటల్ నడుపుకుంటూ ఉంటే మెహ్రీన్ మాత్రం వేరే ఇంట్లో పనిమనిషిగా చేయడం అంతగా నప్పలేదు. ఇలా ఎన్నో తప్పులున్నా చివరి 20నిమిషాలే ఎఫ్-3ని బతికించాయి అని పరుచూరి చెప్పుకొచ్చారు. -
సీక్వెల్స్ ట్రెండ్.. పేరు అదే కానీ, కథ వేరు
‘క్రిష్’, ‘ధూమ్’, ‘దబాంగ్’, ‘టైగర్’, ‘హౌస్‌ఫుల్’, ‘గోల్మాల్’, ‘భాగీ’, ‘హేట్ స్టోరీ’, ‘మర్డర్’... ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్లో ఎన్నో ఫ్రాంచైజీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ తెలుగులోనూ కనబడుతోంది. కథ ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచి కొనసాగడాన్ని సీక్వెల్ అంటుంటారు. కానీ కథ వేరు ఉంటుంది.. టైటిల్ అదే ఉంటుంది. కాకపోతే ఆ సినిమా పేరుకి 1, 2, 3 అని జోడించి ఏ భాగానికి ఆ భాగంలో కొత్త కథ చూపిస్తుంటారు. దీన్ని ఫ్రాంచైజీ అంటుంటారు. ఇక తెలుగులో రానున్న ఫ్రాంచైజీల గురించి తెలుసుకుందాం. చదవండి: ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి! ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా నవ్వించిన చిత్రాల్లో ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ ఒకటి. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. 2019లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్లాక్బాస్టర్ హిట్ అందించారు. ‘ఎఫ్ 2’ ఇచ్చిన హిట్ జోష్‌తో ‘ఎఫ్ 3’ (2022)ని రెడీ చేసి ఆడియన్స్‌కు అందించారు అనిల్ రావిపూడి. ఇందులోనూ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. తొలి భాగంలో నటించిన రాజేంద్రప్రసాద్ మలి భాగంలోనూ ఉన్నారు. సోనాల్ చౌహాన్, సునీల్ ఈ ఫ్రాంచైజీలో యాడ్ అయ్యారు. ఈ ఏడాది మేలో విడుదలైన ‘ఎఫ్ 3’కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ‘ఎఫ్ 3’ ఎండింగ్లో ‘ఎఫ్ 4’ హింట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఇక హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబి నేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ప్రేమ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. కాగా ఇటీవల సోషల్ మీడియాలో చాట్ సెషన్లో పాల్గొన్న సుకుమార్‌ను ఓ నెటిజన్ ‘ఆర్య 3’ తీయాలని కోరగా, సుకుమార్ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతూ ‘ఆర్య 3’ ఉంటుం దన్నట్లుగా చెప్పారు. ఇది ‘ఆర్య’ ఫ్యాన్స్‌ను హ్యాపీ ఫీలయ్యేలా చేసింది. మరోవైపు కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చదవండి: హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్ సల్మాన్ సోషియో ఫ్యాంటసీ అండ్ టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘బింబిసార’ను ‘బింబిసార 2’ ‘బింబిసార 3’... ఇలా ఓ ఫ్రాంచైజీగా కొనసాగించే ఆలోచనలు ఉన్నట్లుగా వశిష్ఠ్ చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ‘బింబిసార 2’ చేయడానికి కల్యాణ్ రామ్ కూడా ఫుల్ పాజిటివ్‌గా ఉన్నారు. ఇక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్న సినిమాల జాబితాలోకి ‘గూఢచారి’, ‘కార్తికేయ’, ‘హిట్’ చేరాయి. 2018లో అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ‘గూఢచారి’ మంచి విజయాన్ని సాధించింది. దీంతో ‘గూఢచారి 2’కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు అడివి శేష్. ‘గూఢచారి 2’కు రాహుల్ పాకాల దర్శకుడు. ‘గూఢచారి’ని ఓ ఫ్రాంచైజీలా కొనసాగించే ఆలోచన ఉందని, ‘గూఢచారి 2’కు తాను దర్శకత్వం వహించలేకపోయినప్పటికీ ‘గూడఛారి’ ఫ్రాంచైజీలో వచ్చే ఏదో ఒక భాగానికి తప్పక దర్శకత్వం వహిస్తానన్నట్లుగా దర్శకుడు శశి కిరణ్ తిక్క ఇటీవల కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ‘హిట్: ది సెకండ్ కేస్’ సెట్స్‌పై ఉంది. అయితే ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. కానీ టైటిల్స్‌ని బట్టి ‘హిట్’ సినిమా ఓ ఫ్రాంచైజీలా కొనసాగే అవకాశం ఉందని ఊహించవచ్చు. ఇంకోవైపు హీరో నిఖిల్ కెరీర్‌కు ‘కార్తికేయ’ (2014) మంచి ప్లస్‌గా నిలిచింది. దీంతో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి మళ్లీ ‘కార్తికేయ 2’ తీశారు. ఈ నెల 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ‘కార్తికేయ 3, 4’లకు స్క్రిప్ట్ రెడీగా లేకపోయినప్పటికీ కోర్ ఐడియా ఉందని చందు మొండేటి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో.. ‘కార్తికేయ 3’ కూడా ఉండొచ్చు. అలాగే ‘చిత్రం’ (2000) సినిమా ‘చిత్రం 1.1’, ‘ఢీ: కొట్టి చూడు’ (2007) తర్వాత ‘ఢీ 2: డబుల్ డోస్’, ‘డీజే టిల్లు’ తర్వాత ‘డీజే టిల్లు 2’ వంటి సినిమాలు రానున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీలు వచ్చే అవకాశం ఉంది. -
ఓటీటీ హావా.. ఈ ఒక్క రోజే ఏకంగా 13 సినిమాలు సందడి
ప్రస్తుతం ఓటీటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోనే హాయిగా ఈ డిజిటల్ స్క్రీన్‌పై కొత్త కొత్త సినిమాలన్ని చూసేయచ్చు. అందుకే చాలా మంది ప్రేక్షకులు ఓటీటీకిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతూ సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రతి వారం ఏదోక కొత్త, పెద్ద సినిమాలను పలు ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఒక వారంలో పదికి పైగా సినిమాలు రిలీజ్ అవ్వడం చూశాం. కానీ, నేడు ఒక్కరోజే 13 సినిమాలు/వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుండటం విశేషం. అందులో తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు సైతం ఉన్నాయి. మరి ఈ రోజు (జూలై 22న) స్ట్రీమింగ్ కాబోతున్న 13 సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం! నెట్ ఫ్లిక్స్: F3 – తెలుగు మూవీ ది గ్రే మ్యాన్ మూవీ: ఇంగ్లీష్‌తో పాటు 5 భారతీయ భాషల్లో బ్లౌన్ అవే (ఇంగ్లీష్ సిరీస్, సీజన్ 3) అమెజాన్ ప్రైమ్ వీడియో: ఎనీథింగ్ పాసిబుల్: (ఇంగ్లీష్ మూవీ) జీ5 నోడి స్వామి ఇవను ఇరోదే హీగే (కన్నడ మూవీ) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇన్ ది సూప్: ఫ్రెండ్కాషన్ (కొరియన్ సిరీస్) ఘర్ వ్వాపసీ: (హిందీ సిరీస్) సోనీ లివ్: మీమ్ బాయ్స్ (తమిళం సిరీస్) డాక్టర్ అరోరా (హిందీ సిరీస్) F3 : తెలుగు మూవీ ఆహా: ఏజెంట్ ఆనంద్ సంతోష్: తెలుగు సిరీస్) వూట్: ఫిజిక్స్ టీచర్ (కన్నడమూవీ) మాస్టర్ చెఫ్ (US సిరీస్ సీజన్ 11) ఎంఎక్స్ ప్లేయర్: రుహనీయత్ (హిందీ సిరీస్ సీజన్ 2) చదవండి: Samantha Coffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా.. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
ప్రతివారం బాక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే సమ్మర్లో పెద్ద సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు సందడి చేయగా.. ఇప్పుడు చిన్న సినిమాలు వరుసగా థియేటర్లోకి వస్తున్నాయి. ఇక బిగ్స్క్రీన్పై వచ్చిన పలు పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అలా ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం రండి! ఈ వారం థియేటర్లో సందడి చేసే చిత్రాలివే: ‘థ్యాంక్యూ’ చేప్పేందుకు వస్తున్న నాగ చైతన్య అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయా ‘దర్జా’ సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘షంషేరా’గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న రణ్‌బీర్ కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ‘మహ’గా వస్తున్న హన్సిక హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జూలై 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ‘హై ఫైవ్’ అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. మన్నార చోప్రా, సుధీర్, అమ్మ రాజశేఖర్, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. మీలో ఒకడు శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ''మీలో ఒకడు''. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నటులు కృష్ణ భగవాన్, సమీర్, అశోక్ కుమార్, బస్టాప్ కోటేశ్వరరావు, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూలై 22న థియేటర్లోకి రాబోతోంది. జగన్నాటకం మనిషి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జగన్నా టకం’. ఆరజ్ అల్తాడ దర్శకత్వంలో పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్ అర్ఫితా లోహి ప్రధానా పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 22 ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. వి. కిరణ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే... ట్రిబుల్ ఫన్‌తో వస్తున్న ‘ఎఫ్ 3’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 22న ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, సోనిలివ్‌లో ఈ చిత్రం జూలై 22న నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ప్రిడెటర్ హిందీ సిరీస్ - జూలై 20 ద గ్రే మ్యాన్(తెలుగు డబ్బింగ్) - జూలై 22 యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్) - జూలై 22 అమెజాన్ ప్రైం కమెండెడ్ ఫర్ యూ షార్ట్‌ఫిల్మ్ విడుదల - జూలై 20 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పరంపర 2 తెలుగు సిరీస్ జూలై 21న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆహా తొలి తెలుగు ఓటీటీలో బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ జశ్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ తెలుగు సిరీస్ జూలై 22న విడుదల కానుంది. సోనీ లివ్ డాక్టర్ అరోరా(హిందీ సిరీస్) - జూలై 22 మీమ్ బాయ్స్ (తమిళ సిరీస్) - జూలై 22 ఎఫ్ 2 మూవీ - జూలై 22 -
ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ఎఫ్3 మూవీ, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలై త్రిపుల్ బస్టర్‌గా నిలిచింది. డబ్బు చుట్టూ తిరిగే కథకు వెంకీ, వరుణ్‌ల కామెడీ జత కావడంతో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కడుబ్బా నవ్వించింది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసి నవ్వుకునేందుకు ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. చదవండి: షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా? దీంతో ఎఫ్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అలాంటి వారి ఎదురుచూపులకు తాజాగా ఎండ్ కార్డ్ వేస్తూ మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. జూలై 22 నుంచి ఎఫ్3 చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఇక ఈ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ను ఇప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేస్తూ.. ‘ట్రిపుల్ ది ఫన్, ట్రిపుల్ ది ఫన్నీ, ట్రిపుల్ ది ఫ్రస్ట్రేషన్.. జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో ఎఫ్ 3 రిలీజ్ రెడీ అయ్యింది’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: అతియా, రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి Triple the fun. Triple the funny. Triple the frustration 🎉🥳 F3 is coming to Netflix on the 22nd of July in Telugu! pic.twitter.com/bxEbYMTkLl — Netflix India South (@Netflix_INSouth) July 12, 2022 -
కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్
ఓటీటీ వరల్డ్ ఒక్కసారిగా కొత్త సినిమాలతో కళకళలాడుతోంది. ఇప్పటికే మేజర్, విరాటపర్వం మూవీస్ నెటిజన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ వారం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం, కమల్ హాసన్ కమ్ బ్యాక్ మూవీ ‘విక్రమ్’ ఓటీటీలోకి రానుంది. జులై 8 నుంచి హాట్ స్టార్ లో తెలుగు,తమిళం సహా ఇతర భాషల్లో స్ట్రీమ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కొల్లగొట్టిన విక్రమ్ థియేటర్స్ లోకి వచ్చిన 35 రోజుల్లో ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. (చదవండి: 1200 మందితో రామ్‌చరణ్ రిస్కీ ఫైట్!) విక్రమ్ తో పాటు నాని నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అంటే సుందరానికి ఓటీటీ లోకి వచ్చేస్తోంది. జులై 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాడు సుందరం. మరోవైపు సమ్మర్ సోగాళ్లు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా ఎఫ్3 జులై మూడో వారంలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు మోడర్న్ లవ్ పేరుతో ఆంథాలజీ సిరీస్‌ని తీసుకొస్తోంది అమెజాన్ ప్రైమ్. హైదరాబాద్ నేపథ్యంలో 6 కథలను ఇందులో చూపించనుంది. ఆదిపిని శెట్టి, నిత్యామీనన్, రీతువర్మ, సుహాసిని, రేవతి, నరేష్ , మాళవిక నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ఆరు కథలను నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక తెరకెక్కించారు. జులై 8 నుంచే ఈ ఆంథాలజీ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది. -
F3: సమ్మర్ సోగ్గాళ్లకు 40 రోజులు పూర్తి.. ఎన్ని కోట్లు వసూలు చేశారంటే..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలై త్రిపుల్ బస్టర్‌గా నిలిచింది. వరుణ్, వెంకటేశ్‌ల కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వారు. నేటితో ఈ చిత్రం 40 రోజులు పూర్తి చేసుకొని 50 రోజుల థియేట్రికల్ రన్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో 10 థియేటర్లపై పైగా విజయవంతంగా రన్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. (చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య) సమ్మర్ సోగాళ్లు అంటూ వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయించడమే కాకుండా... నిర్మాతలకు కాసుల వర్షాన్ని కూడా కురిపించింది. ఒక్క నైజాంలో ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 134 కోట్ల గ్రాస్, రూ.70.94 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. నిర్మాతల నిర్ణయం మేరకు దాదాపు 50 రోజుల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. జులై 22న ఈ చిత్రం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం.. ఓటీటీ వేదికపై ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎఫ్3 క్లోజింగ్ కలెక్షన్స్ ► నైజాం - రూ.20.57 కోట్లు ► సీడెడ్ -8.58 కోట్లు ► ఈస్ట్ - 4.18 కోట్లు ► వెస్ట్ -3.14 కోట్లు ► ఉత్తరాంధ్ర - 7.48 కోట్లు ► గుంటూరు- 4.18 కోట్లు ► కృష్ణా -3.23 కోట్లు ► నెల్లూరు - 2.31 కోట్లు ► రెస్టాఫ్ ఇండియా- 2 కోట్లు ► ఓవర్సీస్- రూ.10 కోట్లు ► ఏపీ/తెలంగాణ వాటా- రూ.53.94 కోట్లు ► మొత్తం రూ.134 కోట్లు(గ్రాస్),రూ.70.94 కోట్లు(షేర్) #F3Movie Continues the Glorious Run of 40 DAYS in Theatres! 🥳✨ Sticked to the word of not releasing in OTT until 8 weeks & Running Successfully! 👍🏻✅#F3TripleBlockbuster 🔥🤩@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official @adityamusic pic.twitter.com/ne28cInzNO — Sri Venkateswara Creations (@SVC_official) July 5, 2022 -
‘‘ఎఫ్ 3’ ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మూడోవారం కూడా డబ్బులొస్తున్నాయి, సక్సెస్ అంటే ఇదే: హీరో
‘‘ఎఫ్ 3’లో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. స్టార్స్‌తో ‘దిల్’ రాజు తీసిన ‘ఎఫ్ 3’ పాన్ ఇండియా సినిమా కింద లెక్క. ఓ హీరోకి రేచీకటి, మరో హీరోకి నత్తి, హీరోయిన్స్‌కు డబ్బు పిచ్చి. ‘ఎఫ్ 3’లో ఇలాంటివి పెట్టి సినిమాను హిట్ చేయడం అనిల్‌కే సాధ్యం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలైంది. సోమవారం జరిగిన ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాఘవేంద్రరావు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండటం కంటే మించిన ఆనందం ఓ యాక్టర్‌కు ఏదీ ఉండదు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘సక్సెస్ అంటే ఈ కరోనా పరిస్థితుల్లోనూ మూడో వారంలో ఇంకా రెవెన్యూ రావడమే. సక్సెస్ అంటే ఇదే. ‘ఎఫ్ 3’కి అందరూ హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇప్పుడు సినిమాకి ప్యారలల్‌గా ఓటీటీ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘ఎఫ్ 3’ని ఆదరిస్తున్నారంటే ఇది రియల్ సక్సెస్’’ అన్నారు అనిల్ రావిపూడి. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ప్రదానం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్త ట్రెండ్.. స్టేజ్‌పై స్టార్ హీరోల స్టెప్పులు
ఒకప్పుడు హీరోలు స్టేజ్‌పై తమ సినిమాలోని డైలాగ్స్ చెపి అభిమానులను ఖుషీ చేసేశారు. కానీ ఇప్పుడు హీరోలు అదే స్టేజ్‌పై స్టెప్పులేయడం ట్రెండ్‌గా మారింది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లో మైక్ పట్టుకుని అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సిన హీరోలు అంతటితో ఆగకుండా అదే స్టేట్ పై స్టెప్పులేస్తూ ఈవెంట్ వచ్చిన ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. సినిమా సక్సెస్ ను అందరితో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల సర్కారు వారు పాట ప్రమోషన్స్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టేజ్‌పై స్టెప్పులేసి టోటల్ టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచాడు. (చదవండి: వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్) అలాగే ఎఫ్3 సక్సెస్ మీట్లో విక్టరీ వెంకటేష్ కూడా స్టేస్పై డాన్స్ చేశారు.తాజాగా అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, నజ్రియా మాత్రమే కాకుండా టోటల్ యూనిట్ ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కు స్టెప్పులేసింది. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 కరోనా కాలంలో థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పించడం కోసమే హీరోలో ఇలా డాన్స్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అని ఇటీవల అల్లు అరవింద్ అన్నారు. .ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించేందుకు ఇండస్ట్రీకి కొన్ని సూచనలు కూడా చేశారు. వాటిల్లో హీరోలు సీరియస్ గా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాలని చెప్పారు. Sundar, Leela and their families are enjoying themselves on the stage with the Hook Step ❤️ Watch #AnteSundaraniki Pre Release Celebrations Live Now 💥💥#PKforSundar ❤️🔥 - https://t.co/tZCkxpv1zw IN CINEMAS TOMORROW 💥@NameisNani #NazriyaFahadh pic.twitter.com/4Ca25cStuR — Mythri Movie Makers (@MythriOfficial) June 9, 2022 -
విజయవంతంగా రన్ అవుతున్న ఎఫ్ 3
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వీకెండ్స్‌తో పాటు వీక్ డేస్‌లోనూ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికీ కొన్నిచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు ప్రత్యక్షమవుతుండటం సినిమా ఫన్ అండ్ ఫెంటాస్టిక్ హిట్ అని చెప్పడానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్న ఈ సినిమాను వీక్షించడానికి వన్స్‌మోర్ అంటూ థియేటర్‌వైపు అడుగులు వేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లాభాల బాట పట్టిన ఎఫ్3 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. 💥💥🔥👌😀 https://t.co/xkMjy5LbSC— Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2022 చదవండి: 'తిండి పెట్టట్లేదు, రోజూ కొడుతున్నాడు' హీరోకు మొర పెట్టుకున్న ఫ్యాన్ సూర్య ఎంట్రీ సీన్.. స్క్రీన్ తగలబెట్టిన ఫ్యాన్స్! -
ఎఫ్ 3: బ్లాక్‌బస్టర్ అంటే ఇట్టా ఉండాల!
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. నవ్వుల బొనాంజా ఎఫ్ 2కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ అంతకంటే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు కాసేపు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చేసిన ఎఫ్ 3 మే 27న రిలీజైంది. కేవలం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన మూవీ వీకెండ్‌ను బాగా వాడుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.110 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇప్పటికే నిర్మాతలకు లాభాలు కూడా వచ్చాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమాలో మెహరీన్, తమన్నా కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించాడు. 👌🔥🎉🎉💥💥💯 https://t.co/k2Ue1BPRsr — Anil Ravipudi (@AnilRavipudi) June 6, 2022 The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 చదవండి: నిఖిల్ మూవీ 'స్పై' గ్లింప్స్ చూశారా? నిజంగానే ఆరోజు తమన్నాతో గొడవపడ్డా.. ఎఫ్ 3 డైరెక్టర్ -
తమన్నాతో గొడవ నిజమే, రెండు రోజులు..: అనిల్ రావిపూడి
పటాస్‌తో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు అనిల్ రావిపూడి. ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతూనే వచ్చింది. అపజయం అనేదే తెలియని ఈ డైరెక్టర్ ఇటీవలే ఎఫ్ 3తో మరో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అనిల్‌కు, హీరోయిన్ తమన్నాకు మధ్య గొడవలు జరిగాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకే తమన్నా ఎఫ్ 3 ప్రమోషన్స్‌కు కూడా రాలేదని వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై అనిల్ స్పందిస్తూ.. 'ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేసినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. తమన్నాది పెద్ద గొడవేం కాదు. ఒకరోజు రాత్రి షూటింగ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. దానికామె పొద్దున్నే జిమ్ చేసుకోవాలి, టైం లేదు, వెళ్లిపోవాలి అని మాట్లాడింది. అలా రెండురోజులు మా మధ్య కొంత హీట్ నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుకున్నాం. వేరే సినిమా షూటింగ్స్‌లో ఉండటం వల్ల తను ప్రమోషన్స్‌కు రాలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు. కొంత సమయం తీసుకున్నా సరే ఎఫ్ 4 చేస్తానన్నాడు అనిల్ రావిపూడి. కాగా మే 27న రిలీజైన ఎఫ్ 3 సినిమా 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. చదవండి: అల్లు అర్జున్‌కి మహేశ్ బాబు థ్యాంక్స్.. చాలా హ్యాపీగా ఉందంటూ ట్వీట్ అమ్మ ముందే అలా చేశాడు, వర్జినిటీ కోల్పోయా: నటి -
బీచ్‌రోడ్డులో ఎఫ్–3 ఫన్టాస్టిక్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి..
F3 Success Meet Vizag, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మహిళా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఎఫ్–3 (F3) సినిమా అఖండ విజయం సాధించిదని ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. ఆర్.కె.బీచ్ దరి గోకుల్‌పార్కులో శనివారం రాత్రి ఎఫ్–3 ఫన్టాస్టిక్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకెప్పుడూ స్పెషల్ అన్నారు. తన తొలి సినిమా కలియుగ పాండవులు షూటింగ్ విశాఖ బీచ్‌రోడ్డులోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను విశాఖలో చిత్రీకరించామన్నారు. తాను నటించిన దృశ్యం–2, నారప్ప వంటి సినిమాలు ఓటీటీలో మాత్రమే విడుదల కావడంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని పేర్కొన్నారు. ఎఫ్–3 సినిమాకు అభిమానులు విజయం చేకూర్చారని సంతోషం వ్యక్తం చేశారు. మరో హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ 'అభిమానుల ఆదరణే తమకు వందకోట్ల ఆదాయంతో సమానం. విశాఖ నోవాటెల్ హోటల్లోనే దర్శకుడు అనిల్ ఎఫ్–3 సినిమా కథ రాసుకున్నారు. మళ్లీ అవకాశం వస్తే కథ వినకుండానే వెంకటేశ్‌తో సినిమా చేస్తాను.' అని పేర్కొన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్య, పరుగు సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అమెరికాలో కూడా ఇదే ఆదరణ లభించడం అపూర్వమన్నారు. ఈ రోజుకు సినిమా విడుదలై 9 రోజులవుతుందని.. రూ.100 కోట్ల గ్రాస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జగదాంబ వంటి 1,100 సీట్లు ఉన్న థియేటర్లో ఎఫ్–3 హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోందని జగదాంబ థియేటర్ అధినేత జగదీష్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్–4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 'విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ముందు నేను చేసిన చాలెంజ్‌తో మీడియా కూడా షాక్ అయింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను నేను, హీరో వెంకటేశ్ ఎంతో రుచి చూశాం' అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశానన్నారు. ఈ సినిమాలో ఆలీ పాత్ర నచ్చిందా అని ప్రేక్షకులను అడిగారు. తనకు ఎఫ్–2 కంటే ఎఫ్–3 సినిమా అంతకుమించి ఆనందం ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చాలా బాగా పండాయన్నారు. తన సినిమా కథలన్నీ వైజాగ్‌లోనే రాసుకున్నానని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఎఫ్–3 చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇదే రోడ్డుపై ఎన్నో షూటింగ్‌లు చేశానని నటుడు అలీ చెప్పారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో వెంకటేశ్, వరుణ్‌తేజ్, అనిల్ సినిమాలోని ఓ పాటకు నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. సే నో టు ప్లాస్టిక్ ఎఫ్–3 విజయోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖలో ఆదివారం నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామన్నారు. విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. -
ఎఫ్ 3 ఓటీటీకి వచ్చేది అప్పుడేనట, మూవీ టీం క్లారిటీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్ర ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే 27)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుండటంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. చదవండి: OTT: 3 వారాలకే అమెజాన్‌లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్, కానీ.. ఇప్పటికే ఈ సినిమా రిలీజై 6 రోజులు అవుతున్న థియేటర్లో ఏమాత్రం ఈమూవీ క్రేజ్ తగ్గలేదు. వసూళ్ల పరంగా కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.46 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తి ఎదురు చూసే వారు కూడా లేకపోలేరు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెల రోజుల్లో డిజిటల్ వేదికగా చూడోచ్చులే అని ధీమాగా ఉండి ఉంటారు కొందరు. అలాంటి వారికి తాజాగా ఎఫ్ 3 టీం షాకిచ్చింది. చదవండి: మేనేజర్‌ను ఒంటరిగా కలిస్తే ఎక్కువ డబ్బులిస్తామన్నారు అప్పుడే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే చాన్సే లేదని చెప్పేశారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు వీడియో రిలీజ్ చేశారు. ఎఫ్ 3 మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ మూవీని థియేటర్లో చూడని వారు ఓటీటీలో చూడొచ్చని అనుకుంటున్నారేమో.. కానీ మరో 8 వారాల వరకు ఎఫ్ 3 ఓటీటీకి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే. ఈ మూవీ థియేట్రికల్ రన్‌కు రెండు నెలలకు ముందుగా ఎఫ్ 3 డిజిటల్ ఎంట్రీ ఇచ్చేది లేదని వారు తేల్చిచెప్పారు. -
కాఫీ, టీ మోశాను.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రగతి
Actress Pragathi Emotional Speech In F3 Success Meet: దగ్గుబాటి విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మెహరీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్‌గా నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కొల్లగొట్టిందని సమాచారం. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్లో చిత్రబృందం వారి అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే నటి ప్రగతి వ్యక్తిగత విషయాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగ్గ పాత్రలు పడలేదన్న వెలితి ఎప్పుడూ ఉండేది. ఆ ఒత్తిడి తట్టుకోలేకే కొన్నిరోజులు బ్రేక్ కూడా తీసుకున్నాను. కాఫీ, టీ మోయడం దగ్గర నుంచి పెద్ద విలన్ పక్కన నిలోచవడం, అందమైన, యంగ్ అమ్మ పాత్ర వరకు చాలా సినిమాల్లో సెట్ ప్రాపర్టీలాగే పనిచేశాను. అవేవీ సంతృప్తి ఇవ్వలేదు. కానీ ఒక మంచి పాత్ర ఎఫ్ 2 రూపంలో ఒక బ్లెస్సింగ్ వచ్చింది. తర్వాత ఎఫ్ 3లో అవకాశంతోపాటు నా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నాకెంతో సంతృప్తినిచ్చింది.' అని ఎమోషనల్ అయ్యారు ప్రగతి. చదవండి: నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ -
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి
Anil Ravipudi Says I Have 3 Families Comments Viral In F3 Success Meet: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, బ్యూటిఫుల్ హీరోయిన్స్ మెహరీన్, సోనాల్ చౌహన్ కలిసి నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మే 27న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటివరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'థంబ్‌నేయిల్స్ పెట్టుకోండి. నాకు మూడు ఫ్యామీలులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మరో ఫ్యామిలీ ఇక్కడున్న నా చిత్రబృందం. అలాగే నా మూడో కుటుంబం ప్రేక్షకులు.' అని అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ భార్యతో కలిసి నటించిన యశ్ సినిమా.. -
రామ్ చరణ్, తలపతి విజయ్ సినిమాలపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
-
తమన్నాకి అనిల్ రావిపూడి మధ్య గొడవ?
-
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ
Comedian Ali Comments On F3 Movie In Success Meet: ‘‘ఎఫ్ 3’ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని వెంకటేశ్ తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం (మే 30) ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ‘‘ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా తీశారు అనిల్ రావిపూడి. థియేటర్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ‘‘45 ఏళ్లుగా నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ‘మీ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి’ అని అభినందిస్తున్నారు. నాకు నా ‘మాయలోడు’ సినిమా గుర్తొచ్చింది’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్ 3’ సక్సెస్ ఓ నిదర్శనం’’ అని తెలిపారు అలీ. చదవండి: నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఎఫ్3
-
F3 రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ మల్టీస్టారర్‌గా, అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ఎఫ్3. మే 27న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోష్ని కనబరిచింది. రెండో రోజు ఈ చిత్రం 9.85కోట్ల షేర్ రాబట్టింది. (చదవండి: ఎఫ్3 మూవీ రివ్యూ) ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో రోజు రూ.8.4 కోట్లను వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు రూ.18.77 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లోనూ ఎఫ్3కి మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలో ఈ చిత్రం 750కే డాలర్లను రాబట్టింది. వారాంతంలో ఈ చిత్రం అక్కడ 1 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్డాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్3 రెండు రోజుల కలెక్షన్స్: ► నైజాం - 8.16 కోట్లు ► సీడెడ్ - 2.38 కోట్లు ► ఈస్ట్ - 1.28 కోట్లు ► వెస్ట్ - 1.22 కోట్లు ► ఉత్తరాంధ్ర - 2.22 కోట్లు ► గుంటూరు- 1.42 కోట్లు ► కృష్ణా - 1.17 కోట్లు ► నెల్లూరు - 85 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 1.20 కోట్లు ►ఓవర్సీస్-3.60 కోట్లు ►మొత్తం 23.50 కోట్లు(షేర్) -
ఎఫ్3కి ఫస్ట్‌డే ఊహించని కలెక్షన్స్... ఎంతంటే.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్ర ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే 27)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. (చదవండి: ఎఫ్3 మూవీ రివ్యూ) తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 10.35 కోట్లు షేర్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెరికాలో ఈ చిత్రం 0.5మిలియన్ డాలర్లను వసూలు చేసింది. వారాంతంలోఘీ చిత్రం అక్కడ 1 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఈచిత్రానికి మొత్తంగా రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్‌కు రూ.64 కోట్ల షేర్ రాబట్టాలి. ఎఫ్3 ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ.4.06 కోట్లు ► సీడెడ్ - రూ.1.26 కోట్లు ► ఈస్ట్ - రూ.76 లక్షలు ► వెస్ట్ - రూ.96లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.1.18 కోట్లు ► గుంటూరు- రూ.88 లక్షలు ► కృష్ణా - రూ. 67 లక్షలు ► నెల్లూరు - రూ.62లక్షలు ► మొత్తం రూ.10.37కోట్లు America la modhalaindhi Soggalla Hawa 🤑 A blockbu$ter start at the U$ box office🤩#F3Movie premieres & 1st Day grossed $5️⃣0️⃣0️⃣K+ & Counting🇺🇸 Watch #F3TripleBlockbuster in your nearest cinemas😀@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @SVC_official @PharsFilm @PrimeMediaUS pic.twitter.com/hCuVSMbG9y — Sri Venkateswara Creations (@SVC_official) May 28, 2022 -
ఎఫ్3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం
విక్టరి వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఎఫ్ 3 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలై ఫస్ట్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంపై మూవీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎఫ్ 3 టీం ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు, యూనివర్షల్గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంది. హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. కుటుంమంతా కలిసొచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్‌కి వెళ్లి చూసిన సినిమా ఎఫ్ 3నే. దేవి థియేటర్లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్టైనర్ తీసుకునందుకు సంతోషంగా ఉంది. అనిల్ రావిపూడి ఎఫ్ 3కి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయాలి’ అని కోరుకున్నారు . దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షకులు థియేటర్లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్ గారికి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్ ఇమేజ్ ఉండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో వెంకటేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎఫ్ 3ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు. ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి’ అని పేర్కొన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ మూవీ మాకు చాలా ప్రత్యేకమైనంది. వెంకటేష్ గారి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’ తెలిపారు. -
ఎఫ్ 3 మూవీ పబ్లిక్ టాక్
-
F3 Telugu Movie Review: ఎఫ్3 మూవీ రివ్యూ
టైటిల్ : ఎఫ్3 నటీనటులు : వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్రప్రసాద్, అలీ సునీల్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత: దిల్ రాజు, శిరీష్ దర్శకుడు: అనిల్ రావిపూడి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: మే27,2022 సీనియర్ హీరో వెంకటేశ్, యంగ్ హీరో వరుణ్ తేజ్ మల్టీస్టారర్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్ల ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటూ F3ని తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఎఫ్3పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్3 ఏమేరకు అందుకుంది? వెంకటేశ్, వరుణ్‌ల కామెడీ మరోసారి వర్కౌట్ అయిందా? హిట్ కాంబినేషన్‌గా పేరొందిన అనిల్, దిల్‌రాజు ఖాతాలో విజయం చేరిందా లేదా? ప్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఎఫ్2లో భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించిన అనిల్ రావిపూడి.. ఎఫ్3లో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను చూపించాడు. ఈ సినిమాలోని పాత్రలన్నింటికీ డబ్బు పిచ్చి ఉంటుంది. వెంకీ(వెంకటేశ్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. సవతి తల్లి పోరుతో పాటు ఇంటినిండా సమస్యలు. వీటీని దూరం చేసేందుకు అడ్డదారుల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇక అవారాగా తిరిగే వరుణ్ యాదవ్(వరుణ్‌తేజ్) కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. దీని కోసం బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరోవైపు హనీ(మెహరీన్) కూడా తన కుటుంబ సమస్యలు తీర్చడం కోసం ధనవంతున్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా ఇద్దరు ధనవంతులని అబద్దం చెప్పి ఒకరికొకరు దగ్గరవుతుంటారు. ఇక వరుణ్ని ధనవంతుడిగా నటింపజేసేందుకు వెంకీ తన ఇల్లుని తాకట్టు పెట్టి మరీ డబ్బులు అందిస్తుంటాడు. చివరకు హనీ ధనవంతుడి కూతురు కాదని తెలుస్తుంది. దీంతో ఈజీగా కోటీశ్వరులవుదామనుకునే వారి ఆశ అడియాశలైపోతాయి. అంతేకాదు వెంకీ, వరుణ్ మరింత అప్పుల్లో కూరుకుపోతారు. చివరకు తమకు చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో విజయనగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనందప్రసాద్(మురళీ శర్మ)గురించి తెలుస్తుంది. అతని కొడుకు చిన్నప్పుడే పారిపోయాడని, వారసుడి కోసం ఆనందప్రసాద్ 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడని తెలిసి..వెంకీ అతని కుమారుడిగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అదేసమయంలో వరుణ్‌తో పాటు మరో ఇద్దరు కూడా నేనే వారసుడిని అని ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరిలో ఆనందప్రసాద్ వారసుడు ఎవరు? డబ్బు మీద అత్యాశ ఉన్న వీళ్లకు ఆనందప్రసాద్ ఎలా బుద్ది చెప్పాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు అంటే జనాలు పొట్టచెక్కలయ్యే కామెడీ పక్కా అని ఫిక్స్ అయ్యేవారు ప్రేక్షకులు. ఇప్పుడు అదే పంథాలో వెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా దూసుకుపోతున్నాడు. ఎఫ్2తో భార్యల వల్లే వచ్చే ఫ్రస్టేషన్ చూపించి, చివరిలో వారి గొప్పదనం ఏంటో అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. ఇక ఎఫ్3లో డబ్బు వల్ల కలిగే ఫ్రస్టేషన్ చూపించి..చివరిలో మంచి సందేశాన్ని అందించాడు. అయితే ఈ సినిమాలో కామెడీనే ఆస్వాదించాలి తప్ప..స్టోరీ పెద్దగా ఉండదు. ఇక లాజిక్ లెక్కలను అసలే పట్టించుకోవద్దు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘లాజిక్ అని, రియలిస్టిక్ అని మమ్మల్ని ఎంతకాలం దూరంపెడతారు రా’ అని పోలీసు వేషంలో ఉన్న తనికెళ్ల భరణితో ఓ డైలాగ్ చెప్పించి.. తమ మూవీలో అవేవి ఉండవని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. స్టోరీని పక్కకు పెట్టి కామెడీనే నమ్ముకున్నాడు. హీరోలకు లోపం ఉన్న క్యారెక్టర్లు ఇచ్చి హాస్యాన్నీ పండించాడు. రేచీకటితో వెంకటేశ్, నత్తితో వరుణ్‌తేజ్ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఈజీగా డబ్బు సంపాదించేందుకు వెంకీ, వరుణ్ పడే పాట్లతో ఫస్టాఫ్ అంతా రొటీన్ కామెడీతో సాగుతుంది. రేచీకటి లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంకీ పడే పాట్లు నవ్విస్తాయి. ముఖ్యంగా ‘వెంకట్రావు పెళ్లాన్ని చూశా..’అంటూ వెంకీ చెప్పే డైలాగ్‌కు ప్రేక్షకులు పడిపడి నవ్వుతారు. ఇక సెకండాఫ్‌లో నిజంగానే మూడురెట్ల ఎంటర్టైన్మెంట్ అందించారు. మేమే ఆనందప్రసాద్ నిజమైన వారసులం అంటూ వెంకీ, వరుణ్ పండించే ఫన్ హైలెట్. వీరితో హారిక(తమన్నా) కూడా పోటీ పడడం.. వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టడం ఇలా ప్రతీ సీన్ నవ్విస్తుంది. ముఖ్యంగా ‘ఆంబోతు’ సీన్ అయితే కడుపుబ్బా నవ్విస్తుంది. ఎఫ్3 టాయ్స్ అంటూ టాలీవుడ్ స్టార్ హీరోలను తెరపై చూపించడం సినిమాకు ప్లస్ పాయింట్. ఇక క్లైమాక్స్‌లో వెంకీ, వరుణ్‌ల ఫైట్ సీన్ అయితే అదిరిపోతుంది. వారి గెటప్‌లకు, చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకుడు నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తాడు. లాజిక్‌ని పక్కకు పెట్టి, హాయిగా నవ్వుకోవడానికి అయితే F3 మూవీ చూడొచ్చు. టికెట్ల రేట్లు పెంచకపోవడం ఎఫ్3(F3)కి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే... వెంకటేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడిపించాలన్నా.. నవ్వించాలన్నా వెంకటేశ్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఆయన కామెడీ చేస్తే ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. రేచీకటి సమస్యతో బాధపడుతున్న వెంకీ పాత్రలో వెంకటేశ్ అద్భుతంగా నటించాడు. తన ఇమేజ్‌ని పూర్తిగా పక్కకు పెట్టి.. తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక వెంకటేశ్‌తో పోటాపోటీగా నటించాడు వరుణ్ తేజ్. నత్తి ఉన్న వరుణ్ యాదవ్ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి. మంగ టిఫిన్ సెంటర్ నడిపే యువతి హారికగా తమన్నా, ఆమె చెల్లిగా హనీగా మెహ్రీన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌లో తమన్నా సరికొత్త గెటప్‌లో కనిపిస్తుంది.సీఐ నాగరాజుగా రాజేంద్రప్రసాద్ తనదైన కామెడీతో నవ్వించాడు. వరుణ్ స్న్నేహితుడు కత్తి శీనుగా సునీల్ మెప్పించాడు. చాలా కాలం తర్వాత ఒకప్పటి కామెడీ సునీల్‌ని తెరపై చూడొచ్చు. ఇక వడ్డీ వ్యాపారీ పాల బాజ్జీగా అలీ, వ్యాపారవేత్త ఆనందప్రసాద్‌గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు.పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
F3 మూవీ (ఫొటోలు)
-
ఎఫ్3 మూవీ ట్విటర్ రివ్యూ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటూ `ఎఫ్ 3`ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ఈ చిత్రంలో కామెడీ బాగా వర్కౌట్ అయిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ల కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుందట. స్టోరీ పెద్దగా ఏమీ లేకున్నా..కామెడీతో లాక్కొచ్చారని చెబుతున్నారు. సినిమా యావరేజ్‌గా ఉందని మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #F3Movie Very good 1st and 2nd half. Excellent Comedy timing from @VenkyMama & @IAmVarunTej. Franchise is mean for Fun and they delivered it perfectly. Overall: logics aside just enjoy the hilarious laugh ride in Theaters💥🔥#F3OnMay27 #F3 #f3 — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) May 26, 2022 ఎఫ్3 మూవీ చాలా బాగుంది. వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ల కామెడీ అదిరిపోయింది. లాజిక్‌ని పక్కన పెట్టి చూస్తే ఎఫ్3 ని ఎంజాయ్ చేస్తారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #F3Movie First Half Report : Entertainment Loaded #F3 > #F2 🤑💸@VenkyMama as usual👌@IAmVarunTej #sunil comedy 👏@Mehreenpirzada @tamannaahspeaks 😍@AnilRavipudi 👍 #DilRaju pic.twitter.com/Xd9s6vS4du — Ushkela Mohan (@UshkelaM) May 27, 2022 ఎఫ్2 కంటే ఎఫ్3 బాగుంది. ఫస్టాఫ్ వెంకటేశ్ ఎప్పటిమాదిరే తనదైన కామెడీతో నవ్వించాడు. #F3Movie Pretty Average 1st Half! Some comedy sequences work well but others seem very forced and unfunny. The production qualities are bad. #F3 — Venky Reviews (@venkyreviews) May 27, 2022 ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, కొన్ని కామెడీ సీన్స్ మినహా..మిగతాదంతా బోరింగ్‌గా ఉందని, ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాలేవని చెబుతున్నారు. Disappointed with #F3Movie Waste and Horrible 😞 We wanted to see our tammy in glamorous role but you disappointed us @AnilRavipudi f2 was far better! Confirm flop on way. Don’t give anymore films to anil @SVC_official 🙏 Waited 2 years for this crap😭 #F3 #F3Disaster — sanjay (@TamannaahFansAP) May 27, 2022 Few comedy scenes worked really well, Decent 1st half…Venky on duty 🥁🥁 #F3Movie — ♓️aRRRsha (@harshakaruturi) May 27, 2022 #f3 Review: Average 1st half First 15mins too much Lag and comedy sequences are okay okay in 1st half But 2nd half full out and out Comedy Entertainer Final verdict Above average movie Rating:3/5 #F3 pic.twitter.com/op8JC6gmE7 — UTR (@Uday_TejaReddyj) May 27, 2022 ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. మొదటి 15 నిమిషాలు సాగదీతగా అనిపిస్తుంది. కామెడీ ఓకే. కానీ సెకండాఫ్‌లో మాత్రం కామెడీ అదరిపోయింది. మూవీ చాలా బాగుందంటూ మూడు స్టార్లు ఇచ్చాడు ఓ నెటిజన్. #F3 review First half is good with comedy and second half is worst than #Acharya #Rating-2/5 — saikiran (@saikiranbannu) May 26, 2022 #F3 is SUPER HIT! Decent 1st half and extremely entertaining 2nd half with superb climax. Sure shot blockbuster! — Asim (@a01_asim) May 26, 2022 WORST - #f3@VenkyMama & @IAmVarunTej ilanti hero's ni pettukoni ee cringe comedy franchises ela teesthunavu ayya anil 🙏🏻 Asalu em undi ani ee movie lo Storyline ey ledhu cringe comedy overactive dailouges and aa songs aa useless skin shows 🗣️ 2nd Half Ithy oddule 🙏🏻#F3Movie — Bhanu Kanna (@Bhanuprasadh) May 26, 2022 #F3Movie First Half Report :#Positive: Venkatesh , Varun Tej Comedy👌 Tamannaah presence 😍 Mehreen👍 Some very Good comedy scenes, Sunil#Negative: Few comedy scenes didnot worked#F3 > #F2 until First half 💸@VenkyMama @tamannaahspeaks #DilRaju @IAmVarunTej @AnilRavipudi — Thyview (@Thyveiw) May 26, 2022 #F3Movie Review FIRST HALF: A Decent Yet Entertaining One 👍#Venkatesh Shines With His Timing 😂#VarunTej Is Good ✌️#TamannaahBhatia & #MehreenPirzada Are Good As Well 👌 Most of the jokes work 👍#F3MovieReview #F3Review #F2 #F3FunAndFrustration #F3 pic.twitter.com/A4F3TLgLxk — Swayam Kumar (@SwayamD71945083) May 26, 2022 -
ఎఫ్ 3లో పవన్ కల్యాణ్?, దిల్ రాజు క్లారిటీ
Dil Raju Clarifies On Pawan Kalyan In F3 Movie: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలంతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఎఫ్ 3కి సంబంధించిన ఓ ఆసక్తిర అప్డేట్పై ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సింగర్ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు.. అయితే తాజాగా దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్ 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని తెలిపాడు. సినీ అభిమానులకు ఇదొక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పారు. పవన్ కల్యాణ్‌తో పాటు టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తారంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. అనంతరం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే స్క్రీన్‌పై పవన్ కల్యాణ్ ఏ విధంగా కనిపించబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో దీనిపై సస్పెన్స్ నెలకొంది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్! -
F3: ట్రైలర్ చూసి ‘ఏంటి పిచ్చోడిలా చేస్తున్నావ్’ అన్నారు!
‘ఎఫ్ 3 నవ్వుల పండగలా ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు’ అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 3. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వరుణ్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఎఫ్ 2 సక్సెస్‌తో ఎఫ్ 3 భాద్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది? ‘ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. అయితే ఆ భాద్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు. మాకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువ. ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్ 3 డబ్బు నేపధ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్‌గా అనిపించాయి. వెంకటేశ్ గారు, నేను ఎఫ్ 2 థియేటర్లో చూశాం. ప్రేక్షకులు ఆనందాన్ని చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్ 2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా ఉంటుంది’ అన్నాడు. ఎఫ్ 3లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది? ‘ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడం కూడా కష్టం. ఫన్ డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా ఉంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ట్ చేశాం. అది హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యింది’ అని చెప్పకొచ్చాడు. నత్తి కోసం స్పెషల్‌గా హోం వర్క్ ఏమైనా చేశారా? ‘అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డాను. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన ఉండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఈజీ అయ్యింది. అయితే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. కానీ, అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ఎఫ్ 3లో ఫన్ ఎవరికి? ఫస్ట్రేషన్ ఎవరికి? డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్‌ని హిలేరియస్‌గా చూపించారు. వెంకటేశ్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది? వెంకటేశ్ గారితో కల్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలవుతున్నా. వెంకటేశ్ గారు అంటే నాకు పర్శనల్‌గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్‌లా ఉంటారు. పెద్దనాన్నతో(చిరంజీవి) ఆయనకి ఉండే బాండింగ్, అనుభవాలు ఇలా చాలా విషయాలు చెబుతుంటారు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి.. మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేశ్ గారు చాలా లైట్ హార్టడ్. క్రమశిక్షణగా ఉంటారు. ఆయన్ని చూసి సెట్స్‌కి రెండు నిమిషాల్ ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. పాజిటివ్‌గా ఆలోచిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రోసెస్ కూడా మారింది. ఇది చాలెజింగ్‌గా అనిపిస్తుందా ? ఇప్పుడు కథల ఎంపిక మారింది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి. ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ? ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ అయ్యారు. ‘ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్’ అని సర్ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు. ‘మెగా ఫ్యామిలీ’ ట్రైలర్ డైలాగ్ మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారు? చాలా బావున్నాడు. మేం ఇద్దరం కలసి జిమ్‌కి వెళ్తున్నాం. నెల క్రితమే షూటింగ్ కూడా మొదలుపెట్టాం. -
అలా చేస్తే ప్రేక్షకులకు మనం బోర్ కొట్టం : అనిల్ రావిపూడి
కొన్ని సినిమాలు చేయడానికి హీరోలు ఇమేజ్ దాటి రావాలి. బాలీవుడ్లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు స్టార్డమ్ పక్కనపెట్టి ఎంటర్టైన్ చేస్తుంటారు. టాలీవుడ్‌కు లక్కీగా వెంకటేశ్ దొరికారు. ఆయన బోర్డర్ దాటి కూడా కొన్ని సీన్స్ చేసేస్తాడు. కామెడీ సినిమాలు చేసేటప్పుడు అలానే ఉండాలి. ఎఫ్3లో వెంకటేశ్ గారి రేచీకటి ట్రాక్ చాలా బాగుంటుంది’అని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు.. మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్‌గా ఎఫ్3 ఎఫ్ 2లో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ తో కొత్త కథ చెప్పాం. అందులో భార్యభర్తల ఫస్ట్రేషన్ ఉంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. ఇది ఇంకా కనెక్ట్ అయ్యే పాయింట్. డబ్బు చుట్టూ వుండే ఆశ అత్యాశ కుట్ర మోసం ఇవన్నీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యాయి. ఎఫ్ 2 సక్సెస్ తో ఆర్టిస్టలందరూ మంచి ఎనర్జీతో పని చేశారు. సునీల్, మురళీ శర్మ, అలీ గారు ఇలా కొంత మంది ఆర్టిస్ట్ లు కొత్తగా యాడ్ అయ్యారు. మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్ గా ఎఫ్3 ఉంటుంది. నత్తి..చాలా ఇబ్బంది తెచ్చింది ఎఫ్ 2 నుంచి ఎఫ్ 3కి వచ్చేసరికి అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. ఫన్ డోస్ పెంచడానికి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ చేయగలం. అందుకే వెంకటేశ్‌కు రేచీకటి, వరుణ్‌తో నత్తి యాడ్ చేశాం. అయితే అవే క్యారెక్టరైజేషన్స్ ప్రధానంగా సినిమా ఉండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం, వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా దాదాపు ముఫ్ఫై చోట్ల ఆ మ్యానరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా ఉంటుంది. ఇది నిజంగా చాలెజింగ్ అనిపించింది. మాట అడ్డుపడినప్పుడల్లా కొత్త మ్యానరిజం చేయాలి. అనుకున్నపుడు ఈజీగా అనిపించింది కానీ ప్రాక్టికల్ గా చాలా కష్టమైంది. ప్రతిసారి కొత్త మ్యానరిజం అంటే.. సీన్ కంటే ఎలాంటి మ్యానరిజం ఇవ్వాలనే ఒత్తిడి ఎక్కువ ఉండేది. ఎఫ్4లో మూడో హీరో ఎఫ్ 2 ఫినిష్ అయ్యాక ఎఫ్ 3 గురించి అలోచించినపుడు మూడో హీరో ఆలోచన వచ్చింది. అయితే అది ట్రంప్ కార్డు . అది ఇప్పుడే వాడేస్తే మళ్ళీ వాడుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే ఆ ఐడియాని పక్కన పెట్టేశాం. ఎఫ్ 2 స్టార్ కాస్ట్ తోనే వీలైనంత ఫన్ జనరేట్ చేశాం. ఐతే మూడో హీరో కార్డు మాత్రం ఎఫ్ 4లో కానీ తర్వాత సినిమాలో కానీ తప్పకుండా వాడాలి. తేడాలు ఉన్నాయి ఎఫ్2లోని పాత్రలు ఎలా ప్రవర్తిసాయో.. ఎఫ్3లోనూ అలానే ఉంటాయి. అయితే ఎఫ్ 2లో వెంకటేష్ గారికి ఫ్యామిలీ లేదు. ఇందులో ఉంటుంది. ఎఫ్ 2లో వరుణ్ కి ఫ్యామిలీ వుంది. ఇందులో లేదు. ఇలా ప్రతిచోట మీకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. క్లైమాక్స్‌తో అందరూ కనెక్ట్ అవుతారు ఈ చిత్రంలో హీరోయిన్స్ అనే కాదు.. ప్రతి పాత్ర అత్యాశ గానే ఉంటుంది. డబ్బు ఎలా త్వరగా సంపాయించాలనే ఆశతోనే ఉంటారు. వారి ప్రయత్నాల్లో జరిగే ఫన్ ఇందులో ఉంటుంది. ఎంత ఫన్ ఉంటుందో అంత మంచి కంటెంట్ వుంటుంది. ఎఫ్ 2లో ఇచ్చిన ముగింపు అందరికీ నచ్చింది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది. డబ్బుతో మనం ఎలా ఉండాలనేది చెప్తాం. ఈ కంటెంట్ కి అందరూ కనెక్ట్ అవుతారు. వింటేజ్ సునీల్‌ని చూస్తారు ఈ చిత్రంలో ఉండే నటులు ఆ పాత్రలకు వారే కరెక్ట్ అనిపించింది. సునీల్ గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ళ తర్వాత ఆయన హిలేరియస్ రోల్ చేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ సునీల్ ని చూస్తాం. అలీ గారిది కూడా అద్భుతమైన పాత్ర. టెర్రిఫిక్ గా చేశారు. ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేయడానికి చాలా కష్టపడ్డాం. కార్వాన్ లన్నీ చూస్తే మినీ మియాపూర్ బస్ డిపోలా వుండేది. ఎవరు ముందు వస్తే వాళ్ళ షాట్ తీసుకుంటూ వెళ్లేవాళ్లం. అన్నపూర్ణ గారు, వై విజయ గారు కొంచెం త్వరగా వస్తారు. వాళ్ళ షాట్స్ ముందే తీసేవాళ్ళం. కరోనా సమయంలో వాళ్ళపై ఎక్కువ కేర్ తీసుకున్నాం. వెంకటేష్ గారు ఇంకా కేరింగ్‌గా ఉంటారు. మా టీంలో ఆయనొక్కరినే కరోనా టచ్ చేయలేదు. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత ఎఫ్3లో పూజా యాడ్ అయింది. ముగ్గురు హీరోయిన్స్ తో 'ఊ హ ఆహా ఆహా' పాటని తీశాం. తర్వాత వచ్చే సెలబ్రేషన్స్ పాట కొంచెం స్పెషల్ గా ఉండాలని ఒక స్టార్ హీరోయిన్ గెస్ట్ గా వస్తే బావుంటుదని భావించాం. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది తను. నత్తి కొత్తగా అనిపించింది జంధ్యాల గారి ఆహా నా పెళ్ళాంట సినిమాలో బ్రహ్మానందం గారు చేసిన పాత్ర నా ఫేవరేట్. నత్తిని ఒక హీరో పాత్రకి యాడ్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. దీనిపై ఎవరైనా వివాదం చేస్తే ‘ఆహా నా పెళ్లంట’ ప్రేరణతోనే చేశాని చెబుతా(నవ్వుతూ..). నత్తి అనేది పోషకార లోపం వల్ల వచ్చిందని సినిమాలో చూపించాం. దిల్ రాజుతో చాలా కంఫర్ట్బుల్ దిల్ రాజుగారితో ప్రయాణం కంఫర్ట్ బుల్ గా ఉంటుంది. నాకు ఏం కావాలో ఆయనకి తెలుసు. ఒక ఫోన్ కాల్ తో పనైపొద్ది. దిల్ రాజు గారి సినిమా అంటే నాకు హోం బ్యానర్ లాంటింది. అలా చేస్తే ప్లాప్ నుంచి బయటపడతాం నేను మాస్ సినిమాలు చేయలానే ఇండస్ట్రీకి వచ్చాను. అయితే కామెడీ ఉంటేనే నా సినిమా ఫుల్ ఫిల్ అవుతుంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ .. ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్ ఉందో అంత కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ఇంకా లార్జ్ స్కేల్ ఆడియన్స్ కి రీచ్ కావాలని ఎఫ్ 2 ని ఒక స్ట్రాటజీ ప్రకారం చేశాను. ఎఫ్ 2 ఓవర్సిస్ లో 2 మిలియన్ కొట్టింది. ఎక్కడ ఖాళీ ఉందో చూస్తూ సినిమాలు చేయాలి. ఎఫ్ 2తో ఒక కామెడీ బ్రాండ్ వచ్చేసింది. దాన్ని సరిచూసుకోవడానికి సరిలేరు నీకెవ్వరు లో ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకున్నాం. అది ఫుల్ యాక్షన్ మాస్ సినిమా. ఇప్పుడు ఎఫ్ 3తో మళ్ళీ ఫ్యామిలీ సినిమా చేశాం. తర్వాత చేయబోయే బాలయ్యగారి సినిమా మాస్. సినిమాకి సినిమాకి డిఫరెన్స్ చూపించుకుంటూ వెళితే ఫస్ట్ మనం బోర్ కొట్టం. మార్కెట్ లో ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేదాని చెక్ చేసుకున్నట్లయితే ఫ్లాప్ అవ్వాకుండా బయటపడవచ్చు. అది తర్వాత ఎంత హిట్ అవుతుందనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. అందుకే టికెట్ల రేట్లు పెంచలేదు ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళడానికి వీలుగా ఉంటే ఒకటికి రెండుసార్లు చూస్తారు. నిజానికి ఎఫ్ 3కి కూడా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయితే టికెట్ ధర ఆడియన్స్ కి కంఫర్ట్ గా ఉండటం ముఖ్యం. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. వరుణ్ని చూసి సర్ప్రైజ్ అవుతారు ఎఫ్ 2తో పోల్చుకుంటే ఎఫ్ 3లో వెంకటేశ్, వరుణ్‌లతో పని చేయడంలో ఇంకా కంఫర్ట్ పెరిగింది. ఎఫ్3తో వరుణ్, వెంకటేశ్ బాగా క్లోజ్ అయ్యారు. ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలనే దానిపై వాళ్ళమధ్య ఒక అండర్ స్టాడింగ్ వచ్చింది. వరుణ్ తేజ్ కామెడీ పరంగా ఇందులో అద్భుతంగా చేశారు. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. వెంకటేష్ గారికి ధీటుగా చేశారు వరుణ్ తేజ్. మరింత ఫవర్‌ఫుల్ పాత్రలో బాలయ్య సెప్టెంబర్- అక్టోబర్ లో బాలయ్య సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాం.బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే సినిమా ఉంటుంది. ఫన్ ఉంటుంది కానీ అంత బిగ్గర్ గా వుండదు. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం. -
F3 Movie: అలా ఉండటమే నాకు ఇష్టం : వెంకటేశ్
‘ప్రతి సినిమా నా తొలి మూవీలాగే భావిస్తా. ఎఫ్-3 కూడా అలానే చేశా. కామెడీ చేయడం నాకు ఇష్ఠం. హీరో పాత్ర ఇలా ఉండాలి..అలా ఉండాలి అని అనుకోను. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తూ చేస్తాను’ అని విక్టరీ వెంకటేశ్ అన్నాడు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-3.అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు.. ► అనుకోకుండా నా గత రెండు చిత్రాలు(నారప్ప, దృశ్యం-2) ఓటీటీలో వచ్చాయి. రెండేళ్ల తర్వాత థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. గుంపుగా సినిమా చూస్తే వచ్చే కిక్ వేరు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు బిగ్స్క్రీన్పై చూస్తే బాగుంటుంది. ఎఫ్-3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా. అందరికి నచ్చుతుంది ► కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. స్నేహితులతో కానీ, ఇంట్లో కానీ నేను జోకర్‌గానే ఉంటాను. ► అనిల్ రావిపూడి రచన నాకు చాలా ఇష్టం. ఆయన పాత్రలను చాలా నేచురల్‌గా తీర్చిదిద్దుతాడు. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఈవీవీ గారి మాదిరే అనిల్ కామెడీ బాగా పండిస్తాడు. అనిల్ నుంచి చాలా నేర్చుకున్నా. ► మన చుట్టూ ఉన్న జనాలను చూసే నేను అన్ని నేర్చుకుంటా. ఎఫ్-3లో కామెడీ చాలా బాగుంటుంది. డిఫరెంట్ వాయిస్ యూజ్ చేశా. ► ఈ సినిమాలో రేచీకటి పాత్రను పోషించాను. అలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. సినిమా మొత్తం రేచీకటి ఉండదు. కొంతవరకు మాత్రమే ఉంటుంది. కథలో భాగంగా ఈ చిత్రంలో నా పాత్రకు రేచీకటి ఉంటుంది. ► ఎఫ్3 ఏ స్థాయిలో హిట్ అవుతుందో నేను చెప్పలేను కానీ..ఎఫ్2 కంటే హిలేరియస్‌గా ఉంటుందని మాత్రం చెప్తా. ► ఈ జానర్ సినిమాలే చేయాలని ఏమి అనుకోలేదు. ఆడియన్స్‌కు ఏం ఇష్టమో అది ఇస్తే చాలు. వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోవాలి అంతే. దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పని చేసుకుంటూ వెళ్లాలి. ► కోవిడ్ తర్వాత ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది. రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేశా. కోవిడ్ టైంలో ఖాలీగా ఉండడంతో.. ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేశా. అది చాలా చాలెంజింగ్ అనిపించింది. త్వరలోనే వెబ్సిరీస్లోని నా లుక్ విడుదల కాబోతుంది. ► సల్మాన్‌ఖాన్‌తో తీయబోయే చిత్రంలో బ్రదర్ పాత్రని పోషిస్తున్నాను. ► మల్టీస్టారర్ చిత్రాలకు నేను ఎప్పటికీ సిద్దంగానే ఉంటాను. మంచి కథ దొరికితే ఏ హీరోతోనైనా కలిసి నటిస్తా. ► బాక్సాఫీస్ నెంబర్లను నేను నమ్మను. కానీ నిర్మాతలకు లాభాలు రావాలని ఆశిస్తాను.అలాగే ఫ్యాన్స్‌ని, అడియన్స్‌ని అలరిస్తే చాలు అనుకుంటా. ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటాను. ► సెట్లో నేను నిర్మాత మాదిరే ఆలోచిస్తాను. ఏదైనా వృధా అయితే చాలా బాధ కలుగుతుంది. సినిమా షూటింగ్‌కు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం నసగా ఉంటంది. కానీ మూవీ హిట్ అయితే మాత్రం అవన్నీ మర్చిపోతారు. ► పాన్ ఇండియా చిత్రాలు అనేది కేవలం బిజినెస్ మాత్రమే. నా సినిమాకు పాన్ ఇండియా స్థాయి మార్కెట్ ఉందనుకుంటే..అంతటా విడుదల చేస్తారు. లేదంటే ఇక్కడే రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియా స్థాయి కథలు వస్తే.. నేను చేయడానికి సిద్దమే. ► టాక్ షోలకు హోస్టింగ్‌గా చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు అది సెట్ కాదు. ఒక్క సీన్ మళ్లీ మళ్లీ చేయడం నాకు కష్టం. సింగిల్ టేక్ యాక్టర్‌గా ఉండడమే నాకు ఇష్టం. ► కోవిడ్ టైమ్‌లో షూటింగ్స్ చాలా కష్టంగా జరిగాయి. మన ముందు ఉన్న ఆర్టిస్ట్‌కు కరోనా ఉందో లేదో తెలియదు. మేము ఏమో మాస్క్ తీసి డైలాగ్స్ చెప్పాలి. చాలా భయమేసేది. షూటింగ్ అయిపోగానే క్యారివాన్లోకి వెళ్లి ఆవిరి పట్టేవాడిని. ఈ రెండేన్నరేళ్లలో నేను కోవిడ్ బారిన పడలేదు. నేను ఇప్పటికీ మాస్కులు ధరిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గుంపులు ఉన్నప్పుడు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తేనే మంచిదని నా భావన. ► వివేకానంద బయోపిక్ తీయాలనుకున్నాడు కానీ ఇప్పటీకీ కుదరలేదు. ఇప్పుడు బయోపిక్ తీయాలని లేదు. నాన్నగారి(ప్రముఖ నిర్మాత రామానాయుడు) బయోపిక్ స్క్రిప్ట్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను. ► ఎఫ్2లో మాదిరి ఎఫ్3లో ఎలాంటి కొత్త ఆసనాలు ఉండవు. కానీ కామెడీ మాత్రం అంతకు మించి ఉంటుంది. ప్రతి సన్నీవేశం నవ్వులు పూయిస్తాయి. ఈ జనరేషన్ పిల్లలను కూడా అలరించడం అదృష్టంగా భావిస్తున్నాను. ► దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ► నేను సెట్స్‌కి వెళ్లగానే నిర్మాతగానే ఆలోచిస్తా. ప్లానింగ్ సరిగ్గా లేకుంటే షూటింగ్ లేట్ అయి, డబ్బులు వృథా అవుతాయి. ప్లానింగ్ విషయంలో అందరూ కరెక్టుగా పని చేయాలి.. ‘పాన్ ఇండియా’ అన్నది బిజినెస్ మాత్రమే. దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ► ప్రస్తుతం నేను, రానా చేస్తోన్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పూర్తి కావస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. త్రివిక్రమ్‌తో సినిమా చర్చలు జరుగుతున్నాయి. -
సోనాల్ చౌహాన్ సొగసు చూడతరమా (ఫోటోలు)
-
ఈ వారం థియేటర్, ఓటీటీలో రాబోయే సినిమాలివే!
ఇప్పటిదాకా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. మధ్యమధ్యలో కొన్ని చిన్న సినిమాలు కూడా ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టాయి. అయితే ఈ వారం మాత్రం ప్రేక్షకుడికి వినోదాన్ని పంచేందుకు ఓ మల్టీస్టారర్ మూవీ సిద్ధమైంది. ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చూసిన ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించేందుకు వస్తోంది ఎఫ్ 3. ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదొక్కటే ఉంది. అటు ఓటీటీ కూడా ఈ వారం సరికొత్త కంటెంట్‌తో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సై అంటోంది. మరి ఈ వారం అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేయండి.. ఎఫ్ 3 వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. తమన్నా, మెహరీన్ కథానాయికలు. సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 27న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. మరి సమ్మర్ సోగ్గాళ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారో లేదో చూడాలి. అశోకవనంలో అర్జున కల్యాణం మాస్ సినిమాలతో ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కల్యాణం. ఇందులో విశ్వక్ అద్భుతమైన నటన కనబర్చాడు. రుక్సార్ ధిల్లాన్ కథానాయికగా ఆకట్టుకుంది. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోనే ఓటీటీ బాట పట్టిన ఈ చిత్రం ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కణ్మణి రాంబో ఖతీజా విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాతువాకుల రెండు కాదల్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా విడుదలైంది. తాజాగా ఓటీటీ ట్రాక్ ఎక్కిన ఈ మూవీ మే 27 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అటాక్ జాన్ అబ్రహం హీరోగా నటించిన మూవీ అటాక్: పార్ట్ 1. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. జీ 5లో మే 27 నుంచి అందుబాటులోకి రానుంది. ఓటీటీలో ఇంకా ఏమేం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయంటే.. హాట్‌స్టార్ ఒబీ వ్యాన్ కెనోబి (వెబ్ సిరీస్) - మే 27 నెట్‌ఫ్లిక్స్ తులసీదాస్ జూనియర్ - మే 23 వెల్కమ్ టు వెడ్డింగ్ హెల్ - మే 23 స్ట్రేంజర్ థింగ్స్ (నాలుగో సీజన్) - మే 27 సోనీ లివ్ నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ (వెబ్ సిరీస్) - మే 27 సేత్తుమాన్ - మే 27 చదవండి 👇 'ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని ఐశ్వర్యరాయ్ చివరకు ఇలా తయారైంది' బెడ్ సీన్ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్ రిప్లై -
ఈ సినిమా హిట్ కాకపోతే ఇకపై మీ ముందుకు రాను
‘‘నా సినిమా థియేటర్స్‌లో రిలీజై మూడేళ్లవుతోంది. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ ఓటీటీకి వెళ్లిపోయాయి. నా ఫ్యాన్స్ కొందరు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ సినిమా ఈ నెల 27న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నాపై ప్రేమను చూపిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ‘ఎఫ్ 3’ సినిమా మీ కోసమే... మీరందరూ థియేటర్స్‌కు వచ్చి ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ‘ఎఫ్ 2’ను హిట్ చేశారు. ‘ఎఫ్ 3’ కూడా హిట్ అవుతుంది. అనిల్ మంచి స్క్రిప్ట్‌తో సినిమా చేశాడు. వరుణ్ తేజ్ బాగా చేశాడు’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ‘ఫన్టాస్టిక్’ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులయింది. ‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ గ్లామర్‌గా ఉందంటే కారణం సాయి శ్రీరామ్‌గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఫిదా, ఎఫ్ 2 ఇప్పుడు ‘ఎఫ్ 3’.. ‘దిల్’ రాజుగారితో ఈ సినిమా నాకు ఓ హ్యాట్రిక్లా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ జనరేషన్లో అనిల్‌గారి కన్నా కామెడీని ఇంకా ఎవరూ బాగా తీయలేరని నాకు అనిపిస్తోంది. వెంకటేశ్‌గారు చాలా మల్టీస్టారర్ ఫిలింస్ చేశారు. కానీ ఆయనతో రెండోసారి వర్క్ చేసే అవకాశం నాకు మాత్రమే లభించింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’ సినిమాయే మాకు శత్రువు. ఎందుకంటే ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అందుకని ‘ఎఫ్ 2’కి మించిన వినోదాన్ని ‘ఎఫ్ 3’లో ఇచ్చేందుకు మేం స్క్రిప్ట్ నుంచే కష్టపడ్డాం. నవ్వడం చాలా ఈజీ. కానీ కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. అందుకే ‘దిల్’ రాజుగారితో వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు 35మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరు లేకపోతే ‘ఎఫ్ 3’ లేదు. ఈ సినిమాలో గొప్ప కంటెంట్ కూడా ఉందని భావించి సోల్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. వరుణ్ తేజ్ నాకు ఓ బ్రదర్‌లాంటి వాడు. వరుణ్‌లో ఇంత మంచి కామెడీ టైమింగ్ ఉందా? అని ఆడియన్స్ అంటారు. వెంకటేశ్‌గారు స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. కానీ కామెడీ చేసేప్పుడు ఆయన ఇమేజ్ను పక్కన పెట్టి పెర్ఫార్మ్ చేస్తారు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. నవ్వలేకపోవడం ఒక రోగం. నవ్వించడం ఒక భోగం. రెండేళ్లు కరోనా పరిస్థితులను ఫేస్ చేశాం. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్‌లో చూసి హ్యాపీగా నవ్వుకోండి’’ అని అన్నారు. ‘ఎఫ్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’లోలానే వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు ‘ఎఫ్ 3’లోనూ అద్భుతంగా చేశారు. హీరోల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ‘ఎఫ్ 2’లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ‘ఎఫ్ 3’లో నలుగురు హీరోయిన్స్‌ని పెట్టారు అనిల్. రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ.. ఇలా ఫుల్ఫ్యాక్డ్గా ఉంది సినిమా. దేవిశ్రీకి మా బ్యానర్లో ఇది 13వ సినిమా. ‘ఎఫ్ 2’కు మించి ‘ఎఫ్ 3’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రామానాయుడుగారి తర్వాత ‘దిల్’ రాజుగారినే నేను మూవీ మొఘల్‌గా పిలుస్తాను. మనిషి జీవితంలో నవ్వుకు ఎంత అవసరం ఉందో చెప్పే సినిమా ‘ఎఫ్ 3’. 45 ఏళ్లుగా నేను నమ్మింది నవ్వునే. ఈ సినిమాలోని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్‌ను నవ్విస్తాయి. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సినిమా హిట్ కాకపోతే నేను ఇకపై మీ ముందు (ప్రేక్షకులు) నిలబడను’’ అన్నారు. ‘‘ఎఫ్ 3’ సినిమా చూస్తూ, నవ్వుతారు. అది మన ఇమ్యూనిటీని పెంచుతుంది’’ అన్నారు సునీల్. ‘‘పవన్ కల్యాణ్‌గారి ‘తమ్ముడు’ సినిమా తీసిన దర్శకుడు అరుణ్ ప్రసాద్ బాబాయ్ కొడుకే అనిల్ రావిపూడి. అనిల్ అనే మొక్కను ‘దిల్’ రాజు పెంచారు. ఈ చెట్టు నీడ కింద ఇప్పుడు చాలా మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీలోని అందరూ బాగుంటారు. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్‌లోనే చూడాలని కోరుతున్నాను’’ అన్నారు అలీ. వై. విజయ, ప్రగతి, తులసి, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రదీప్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి 👉🏾 బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫైనల్ విన్నర్ బిందు మాధవి.. విజయ్ దేవరకొండతో సమంత లిప్‌లాక్ సీన్ ? -
‘ఎఫ్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అది చూసి అనిల్ నాకు వంద హగ్గులు, వంద ముద్దులు అన్నారు
‘‘ఎఫ్ 3’ లాంటి పూర్తి కామెడీ సినిమాకి కథ రాసుకోవడం కష్టం. అనిల్ రావిపూడిగారు అద్భుతంగా కథ రాసుకుని ‘ఎఫ్ 3’ తీశారు. ‘ఎఫ్ 2’లో ఉన్న వినోదం కంటే పది రెట్లు ఎక్కువగా ‘ఎఫ్ 3’లో ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ► ఓ సినిమాకి సంగీతం అందించే ముందు కథని అర్థం చేసుకుంటాను. డైరెక్టర్ ఎలాంటి మ్యూజిక్ కావాలనుకుంటున్నాడో తెలుసుకుని, నా శైలి మిస్ కాకుండా సంగీతం అందిస్తాను. ► అనిల్ రావిపూడి ఫాస్ట్‌గా సినిమా తీసినా బాగా తీయడం తన ప్రత్యేకత. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణగార్ల సినిమాల్లో ఉండే సెన్సిబుల్ చమత్కారం అనిల్ సినిమాల్లోనూ ఉంటుంది. ► ‘దిల్’ రాజుగారు ఎన్నో సక్సెస్‌లు చూసినా కథలోని కొత్త అంశాలకి ఇప్పటికీ ఎగ్జయిట్ అవుతుంటారు. ‘ఎఫ్ 3’ సినిమాని ఆయన ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ∙‘ఎఫ్ 3’లో అన్ని పాటలకూ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’, ‘ఊ ఆ ఆహా ఆహా’, ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా..’ పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘నేపథ్య సంగీతం కూడా అద్భుతం.. నీకు వంద హగ్గులు.. వంద ముద్దులు’ అన్నారు అనిల్. ► సినిమా కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి సినిమా హిట్ కావాలనుకుంటాను. ఎవరి మ్యూజిక్ బాగున్నా, సినిమా బాగున్నా అభినందిస్తాను. ‘మనం విజయం సాధించినప్పుడే కాదు.. ఇతరులు విజయం సాధించినప్పుడు అభినందించేవాడే గొప్ప’ అని మా నాన్నగారు (సత్యమూర్తి) చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. ► ‘రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో పాటలు బాగున్నా మేము అనుకున్నంత రీచ్ కాలేదు. సినిమా హిట్‌ని బట్టి కూడా మ్యూజిక్ రీచ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ వస్తుంది. ఇందుకు ‘రంగస్థలం, ఉప్పెన, పుష్ప’ సినిమాలు ఉదాహరణ. ► దక్షిణాదిలోని అన్ని భాషలవాళ్లు ఎక్కువగా ఉండేది చెన్నైలోనే. అక్కడ మంచి మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ మ్యూజిక్ స్కూల్స్ పెరుగుతున్నాయి. ఒక సంగీత పాఠశాల ఆరంభించి, ఉచితంగా నేర్పించాలనే ఆలోచన ఉంది. దానికి కొంత సమయం పడుతుంది. చదవండి 👉🏾 ఎఫ్ 3కి మూడురెట్ల పారితోషికం తీసుకున్న వెంకటేశ్! కాస్ట్లీ కారు కొన్న హీరోయిన్ కంగనా రనౌత్ -
ఎఫ్ 3కి మూడురెట్ల పారితోషికం తీసుకున్న వెంకటేశ్!
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఎఫ్ 3లో మోర్ ఫన్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అయితే ఫన్ మాత్రమే కాదు నటీనటులు మోర్ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారట! ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం వెంకటేశ్ ఎఫ్ 2లో రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. కానీ ఎఫ్ 3కి మాత్రం ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే ఏకంగా రూ.15 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక సాంగ్‌లో ఆడిపాడనుంది. చదవండి 👉🏾 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ -
ఆ విషయంలో అందరు నన్ను నిందిస్తున్నారు: దిల్ రాజు
కోవిడ్ అనంతరం పెద్ద సినిమాల టికెట్ల రెట్స్‌ను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే మే 27న రిలీజ్ కాబోతోన్న విక్టరి వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా ఎఫ్ 3కి మాత్రం టికెట్ రెట్స్ పెంచడం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. దీంతో ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చారు. త్వరలో ఎఫ్ 3 మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. చదవండి: ఆ సీన్స్‌తో మళ్లీ రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ! ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ రెట్స్ పెంచడంలో తప్పులేదని, అయితే ఇది అన్ని సినిమాలకు వర్క్ కాదన్నారు. ‘కోవిడ్ సమయంలో సినిమా షూటింగ్ వాయిదా పడటం వల్ల బడ్జెట్ మరింత పెరిగింది. మరోవైపు అదే సమయంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే సినిమాల చూడటం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు. అయితే టికెట్ రెట్స్ పెంచడం వల్ల పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందొచ్చు. కానీ, అదే సమయంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేటర్లకు వచ్చేందుకు ధైర్యం చేయలేదనే విషయాన్ని గమనించాను. చదవండి: తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు అంతేకాదు రెండు నుంచి మూడు సార్లు సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఒక్కసారి మాత్రమే థియేటర్‌కు వచ్చారు’ అని ఆయన అన్నారు. అయితే కోవిడ్ అనంతరం టికెట్ రెట్స్ పెరగడంపై ప్రతి ఒక్కరు తనని నిందిస్తున్నారని దిల్ రాజు అన్నారు. ఇది ప్రొడ్యూసర్స్‌తో పాటు హీరోలు కలిసి తీసుకున్న నిర్ణయమని, వారందరి తరపున తాను ఇన్సియేషన్ తీసుకున్నానే విషయం ప్రతి ఒక్కరు గమనించాలన్నాడు. అయితే తాను మాత్రం తన సినిమాను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే థియేటర్లోకి తీసుకువస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. -
అందుకే ఎఫ్3 మూవీ టికెట్ల రేట్లను పెంచలేదు : దిల్ రాజు
‘ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన మూవీ. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం’అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు.. ఎఫ్ 3 స్టోరీ గురించి అనిల్ రావిపూడి మీకు ఎప్పుడు చెప్పారు ? ఎఫ్ 2 విడుదలకు ముందే అనిల్ కు ఎఫ్ 3 ఐడియా వచ్చింది. ఎఫ్ 2పెద్ద హిట్ అయితే ఎఫ్ 3 చేద్దామని చెప్పారు. మేము అనుకున్నట్లే ఎఫ్ 2 పెద్ద విజయం సాధించింది. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత స్క్రిప్ట్ ని పూర్తి చేసి నటీనటులందరినీ మళ్ళీ ఒక్కదగ్గరి చేర్చి సెట్స్ పైకి వెళ్లాం. ఎఫ్ 3 కథ చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో సినిమా చూసిన తర్వాత దానికి మించిన నవ్వుకున్నాను. ఎఫ్ 3 నాన్ స్టాప్ ఎంటర్ టైనర్, కంప్లీట్ ఫన్ రైడ్. ఎఫ్ 2 తో పోల్చుకుంటే ఎఫ్ 3 లో ఎలాంటి ఫన్ వుంటుంది ? ఎఫ్ 2లో ప్రేమ, పెళ్లి.. అందులో వున్న ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపించి చివరికి భార్యల పాయింట్ ఆఫ్ వ్యూ ని కూడా చూడాలని చెప్పి అందరికీ నచ్చేలాగ ఎఫ్2ని హ్యుమరస్ గా చేశాం. ఎఫ్ 3 విషయానికి వస్తే.. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి.. ఇవి పంచభూతాలు. ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. ఈ పంచభూతాలతో పాటు ఆరో భూతం డబ్బు కూడా మనిషి బ్రతకడానికి అంతే అవసరం. డబ్బు లేకుండా మనిషి బ్రతకలేడు. చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి మనిషి బ్రతకడానికి డబ్బు ఈ రోజు తప్పనిసరైపోయింది. బంధాలు, బిజినెస్సులు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగేకథ ఎఫ్ 3. అనిల్ అద్భుతంగా రాశాడు, తీశాడు. అనిల్ లో నాకు నచ్చే అంశం కథ కంటే కధనం పై ఎక్కువ ద్రుష్టి పెడతాడు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తున్నామా లేదా అని చూస్తాడు. ఎఫ్ 3 ఆర్టిస్టులకు భోనంజా లాంటింది. ఇంతమంది ఆర్టిస్ట్ లని పెట్టుకొని అద్భుతమైన ఫన్ క్రియేట్ చేశాడు అనిల్. సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ప్రేక్షకుడిగా ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. సినిమా రన్ టైం 2గంటల 28నిమిషాలు వుంటుంది. ఇందులో 90 నిమిషాలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు. అంత ఫన్ రైడ్ గా వుంటుంది. సినిమా టికెట్ల రేట్లని పెంచకుండా యాధాతధంగా ఉంచడానికి కారణం ? కరోనా ప్యాండమిక్ తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్ లు పెరిగాయి. ఇదే సమయంలో ఆడియన్స్ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. ఇందులో మంచి ఫలితాలు కూడా సాధించాం. ఐతే ఇక్కడ పరిశీలించిన అంశం ఏమిటంటే.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి దూరమౌతున్నారు. అలాగే రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్ కి రావడం తగ్గిపోవడం గమనించం. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ధరలు తగ్గించిన దాని ప్రకారం మీ బడ్జెట్ ని రీచ్ కాగలరని భావిస్తున్నారా ? నాకు థియేట్రికల్ రెవెన్యు కిక్ ఇస్తుంది. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూడటంలోనే ఒక ఆనందం ఉంటుంది. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్...సెకండ్ వీక్ ఇలా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడంలోనే ఒక కిక్ ఉంటుంది. ఎఫ్ 3 కి తప్పకుండా రిపీట్ ఆడియన్స్ వస్తారు. థియేటర్లు ఆడియన్స్ తో కళకళలాడుతాయి. ప్రేక్షకులు ఎఫ్ 3ని మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఎఫ్ 3ని పాన్ ఇండియా స్థాయిలో చేసే ఆలోచన రాలేదా ? పాన్ ఇండియా విడుదల చేయాలంటే దానికి సేఫరేట్ గా హోం వర్క్ చేయాలి. బాలీవుడ్ లో కూడా ప్రేక్షకుడు థియేటర్ లోకి రావాలంటే స్క్రిప్ట్ దశ నుండే ప్లాన్ చేయాలి. ఎఫ్ 3వరకూ మాకు పాన్ ఇండియా ఆలోచలేదు. మీ బ్యానర్ లో మార్వెల్ లాంటి సూపర్ హీరో సినిమాలు వచ్చే అవకాశం ఉందా ? హాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా.. మార్వెల్, అవతార్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలే నిలబడుతున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్ మొదలైయింది. రాజమౌళి గారు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తో దీనికి శ్రీకారం చుట్టారు. మేము కూడా ఒక మూడు కథలపై పని చేస్తున్నాం. రెండేళ్ళలో ఒకటి, రెండు పెద్ద సినిమాలు మా బ్యానర్ నుండి ప్రకటించే అవకాశం వుంది. ఎఫ్3 కి టికెట్ రేట్లు తగ్గించిన నేపధ్యంలో మంచి రెస్పాన్స్ వస్తే.. మిగతా సినిమాలు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యే అవకాశం ఉందా ? మొన్న సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెరిగాయి. ఆ రేట్లు నేను పెంచానని విమర్శించారు. నైజంలో దిల్ రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారు. కానీ తెర వెనుక బోలెడు కథ ఉంటుంది. నిర్మాతలు, హీరోలు ఇలా బోలెడు లెక్కలు వుంటాయి. అందుకే టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట నేను ఒక అడుగు వేస్తున్నా. ఇది కనుక సక్సెస్ ఐతే అందరూ ఇదే ఫాలో అవుతారు. ప్రస్తుతానికి అందరూ ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మల్టీ ప్లెక్స్ లో చార్జీలు ఎలా ఉండబోతున్నాయి ? ప్రసాద్, జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీ ప్లెక్స్ 250 ప్లస్ జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ 250. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ 150ప్లస్ జీఎస్టీ.. జిల్లాలు జీఎస్టీ కలుపుతూ 150. 250లో మాకు వచ్చేది 25రుపాయిలే. ఇక థియేటర్ ఉండటం వలన ఎదో అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయనే అపోహ కూడా ఉంది. కర్నూల్ లో 15కోట్లు పెట్టి మల్టీ ప్లెక్స్ లో ఇన్వెస్ట్ చేశాం. పదేళ్ళు లీజు. పదిహేను కోట్లను వడ్డీతో సహా రిటర్న్ తెచ్చుకోవాలి. లెక్క చూసుకుంటే రూపాయి వడ్డీ వస్తుంది. పదిహేను కోట్ల మీద నెలకి పదిహేను లక్షలు వస్తుందని అనుకుందాం. కానీ పదేళ్ళలో ఈ పదిహేను కోట్లు పోయి జీరో అవుతుంది. దీని ప్రకారం చూసుకుంటే నష్టమే. మల్టీ ప్లెక్స్ అన్నిటిలో ఈ సమస్య వుంది. షేర్ మార్కెట్ కోసం కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న ఒక అపోహ ఇదంతా. నైజాంలో మొత్తం 450 థియేటర్లు ఉన్నాయి. ఇందులో మా సంస్థకు 60 వున్నాయి. దిల్ రాజు నైజం మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడని చాలా మంది అంటారు. కానీ 60 థియేటర్లతో నేను కంట్రోల్ లో పెట్టుకునేది ఏమీ ఉండదు. కానీ మిగతా వాళ్ళు మా మాట ఎందుకు వింటారంటే.. ఎవరైనా రూపాయి డబ్బు మాకు అడ్వాన్స్ గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో వారి ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపోతారు. మాకు ఇచ్చిన డబ్బు అంత సేఫ్ గా వుంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిక్ గా మాకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్ గా వున్నా తప్పితే ఏదో కంట్రోల్ చేసి కాదు. ఓటీటీలు కూడా పెద్ద సినిమాలకు ముందస్తు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి .. దీన్ని ఎలా చూస్తారు ? ప్రేక్షకుడు ఇలా కూడా చూస్తాడా ? అని వాళ్ళు ఒక టెస్ట్ చేసుకుంటున్నారు. ఎఫ్ 3లో మూడో ఎఫ్ కి మీనింగ్ అంటే ఏం చెప్తారు ? ఫన్, ఫస్ట్రేషన్.. బీకాజ్ ఆఫ్ ఫైనాన్స్. ( నవ్వుతూ ) ఎఫ్ 4 ఉంటుందా ? అనిల్ మంచి ఐడియా చెప్పాడు. నెక్స్ట్ వుంటుంది. ఎఫ్3 ఐడియా వెంకటేష్, వరుణ్ తేజ్ కి చెప్పినపుడు వారి రియాక్షన్ ఏంటి ? ఎఫ్ 2పెద్ద సక్సెస్. మళ్ళీ అదే కాంబినేషన్ లో సినిమా అంటే అందరూ ఎక్సయిట్ అయ్యారు. వెంకటేష్ గారు మీతో ఎంత సరదాగా వుంటారు ,ఆయన మీకు ఇచ్చిన సర్ ప్రైజ్ ఏమైనా ఉందా? 'కలియుగ పాండవులు' సమయంలో నేను వెంకటేష్ గారికి ఫ్యాన్‌ని. వారం రోజులు ముందు టికెట్ బుక్ చేసుకొని సుదర్శన్ థియేటర్లో సినిమా చూశా. నువ్వు నాకు నచ్చావ్ సినిమా నైజంలో విడుదల చేసినప్పుడు ఆయనతో యాక్సస్ పెరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం మొదటిసారి కలిసి పని చేశాం. వెంకటేష్ గారు ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన హీరో. నిర్మాత కోసం ఎక్కువ ఆలోచిస్తారు. లొకేషన్ లో ఏదైనా వృధా అవుతుంటే తట్టుకోలేరు. రామానాయుడు గారు ఆయన నేర్పించిన గొప్ప లక్షణం అది. ఇక లొకేషన్ లో ఆయన చాలా హుషారుగా వుంటారు. మొదటిసారి మీ బ్యానర్ సీక్వెల్ చేస్తున్నారు కదా .. ఎలా అనిపించింది ? అనిల్ రావిపూడి చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశారు. ఎఫ్ 3లో పాత్రలు తీసుకొని కొత్త కథని చెప్పాడు. ఓ రెండు చోట్ల ఎఫ్2 గుర్తుకు వస్తుంది తప్పితే మిగతా అంతా ఫ్రెష్ గా ఉంటుంది. వెంకటేష్ కి రేచీకటి, వరుణ్ కి నత్తి ఇలా అన్నీ కొత్త ఎలిమెంట్స్ హిలేరియస్ గా చేర్చాడు. -
‘ఎఫ్ 3’ మూవీ టికెట్ రేట్స్‌పై దిల్ రాజు క్లారిటీ
Dil Raju Clarifies On F3 Movie Ticket Rates Hike: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూడేళ్ల క్రితం వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 చిత్రానికి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఎఫ్ 3లో కూడా వారే హీరోయిన్లు కాగా సోనాల్ చౌహన్ ఓ ప్రధాన పాత్ర పోషించనుంది. చదవండి: నార్త్ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎన్నో వాయిదాల అనంతరం మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ ఇంకా కొద్ది రోజులే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 మూవీ టికెట్ ధరల పెంపుపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్ ధరలు పెంచిన విషయం విధితమే. దీంతో తాజాగా ఎఫ్ 3కి కూడా టికెట్ ధరలు పెంచుతారా? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్ రేట్స్ పెంపుపై క్లారిటీ ఇచ్చాడు మూవీ నిర్మాత దిల్ రాజు. చదవండి: జై భీమ్ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్ ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన ఇచ్చారు. ‘ఎఫ్ 3 చిత్రానికి టికెట్ ధరలు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మా సినిమాను మీ ముందుకు తెస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. కాగా డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అనే కథనంతో 'ఎఫ్-3' సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా త్వరలోనే ఎఫ్ 3 మూవీ టీం ప్రచార కార్యక్రమాలతో ప్రారంభించనుంది. -
నార్త్ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ
‘సౌత్ సినిమాలు అంటే నార్త్ వాళ్లకు ఒకప్పుడు బాగా ప్రేమ ఉండేది. ఇప్పుడు ఇంకా ప్రేమ వచ్చింది. అలాగే వీళ్లు మనల్ని తొక్కేస్తున్నారనే భయం కూడా వాళ్లకు మొదలైంది’ అని కమెడియన్ అలీ అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. స్టార్ ఇమేజ్ ఉంది. 43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్ తగ్గింది. ఎందుకు? బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీల సీరియల్ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరో చేశాడు. స్టార్ దర్శకుడిగా ఉన్న ఆయన.. అందరినీ ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనకా ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీగారు ఎందుకు ఈ సినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడం లేదు. కథ విని నా క్యారెక్టర్ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎఫ్ 3లో పూర్వ అలీగారిని చూడగలమా? తప్పకుండా చూస్తారు. నా క్యారెక్టర్లో అంత సత్తా ఉంది. లొకేషన్లో కూడా టెక్నీషయన్స్ బాగా ఎంజాయ్ చేశారు. శిరీష్ గారు అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎఫ్3లో మీ క్యారెక్టర్ పేరు? పాల బేబీ. వడ్డీకి తిప్పే క్యారెక్టర్ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం.. సినిమా ఎండింగ్లో మీకు ఆ విషయం తెలుస్తుంది (నవ్వుతూ..). సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మంది ఆరిస్టులు నటించారు. ఎవరెలా చేశారు? ఒకరిని మించి ఒకరు నటించారు. ఎవ్వరినీ తగ్గించలేం. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం. ‘కొన్ని సీన్స్ మిస్ అయిపోయామే.. మళ్లీ వెళ్లాలిరా’ అనేలా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్ కామెడీ టైమింగ్ గురించి? వాళ్లు పుట్టిందే ఇండస్ట్రీలో. ఇద్దరూ బాగా చేశారు. వారితో పాటు మిగతా నటీనటులు కూడా చక్కగా నటించారు. సినిమాల్లో హీరోలిద్దరికి ఓ లోపం ఉంది. వెంకటేశ్‌కు రేచీకటి అయితే.. వరుణ్‌కు నత్తి.. మరి మీకేముంది? నాకు గన్ ఉందిగా (నవ్వుతూ..) అనిల్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సినిమాలో ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ అనిల్‌లో అది కొంచెం కూడా కనిపించదు. అందరు వచ్చారా? టిఫిన్ చేశారా? ఓకే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని సింపుల్‌గా అనేస్తాడు. అతి తక్కువ వయసులో ఇంతమంది ఆర్టిస్టులను మేంటేన్ చేయడం అనేది గొప్ప విషయం. ఒకప్పుడు రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావు సినిమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. అనిల్‌లో అంత సత్తా ఉంది కాబట్టే.. దిల్ రాజు గారు కూడా ఎంత మంది ఆర్టిస్టులు కావాలంటే.. అంతమందిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాంటి నిర్మాత దొరకడం అనిల్ అదృష్టం. వెంకటేశ్‌తో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది? ఆయనతో నేను చేసిన సినిమాలు అన్ని కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు ఎక్స్పర్ట్స్ పొలిటికల్ కెరీర్ గురించి? నన్ను హీరోగా క్రియేట్ చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి అయితే.. పొలిటికల్ లీడర్‌గా క్రియేట్ చేయబోతున్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిగారే. ఆయన నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారు అంతే. ఏదో ఒకరోజు కాల్ వస్తే వెళ్తా.. మీ సమక్షంలోనే(మీడియా) ఆ విషయాన్ని పంచుకుంటా(నవ్వుతూ..) ఫైనల్‌గా ఎఫ్3 గురించి ఏం చెప్తారు? ఇది ఒక అద్భుతమైన సినిమా. పైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది. కొత్త సినిమాల గురించి? అంటే సుందరానికి, ఎఫ్3, లైగర్, ఖుషీ, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నా. ఒకప్పుడు మనం సినిమాల్లో అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్‌వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్ నేర్పించి, డబ్బింగ్ చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్ వాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని పిలుస్తున్నారు. -
'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా'.. పూజాతో వెంకీ, వరుణ్ స్టెప్పులు..
F3: Pooja Hegde Life Ante Itta Vundaala Lyrical Song Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను వదిలారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పూజాతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి చిందేసారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పార్టీ నంబర్‌గా పేర్కొన్న ఈ పాట పార్టీల్లో, వేడుకల్లో మారుమోగనుంది. చదవండి: ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్‌పై స్పందించిన అనిల్ రావిపూడి -
ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్‌పై స్పందించిన అనిల్ రావిపూడి
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటాడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఒకదానికి ఒకటి అంతకుమించి అన్నట్టుగా ఉంటాయి. అనిల్ రావిపూడి సినిమాల్లో యాక్షన్ సీన్స్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. అందుకే ఆయన రూపొందించి పటాస్ సినిమా నుంచి ఎఫ్ 2 వరకు మూవీ వరకు ఒకదానికి మించి మరోకటి హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తెరకెక్కంచి చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2కు ఇది సీక్వెల్. ఈ చిత్రం మే 27 థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన మీడియాతో ముచ్చటించాడు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన ఎఫ్ 3 ట్రైలర్లో తమన్నా, మెహ్రీన్‌లతో పాటు సోనాలి చౌహాన్ మూడో హీరోయిన్గా కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో సోనాలి రోల్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆమె క్యారెక్టర్ ఏంటీ? తన రోల్ అనిల్ ఎలా డిజైన్ చేశాడనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న. ఈ ఇంటర్య్వూలో అనిల్‌కు సోనాల్ చౌహాన్ రోల్‌పై ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. ‘ఆమె పాత్రను గురించి మాత్రం అడగొద్దు .. అది సస్పెన్స్. సోనాల్ పాత్ర ఏమిటి? ఆమె ఏం చేస్తుందనేది తెరపై చూడాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తే ఆ కిక్కుపోతుంది’ అంటూ ఆయన మరింత ఆసక్తిని పెంచేశాడు. కాగా ఈ సినిమాలో విక్టరి వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు హీరోలు కాగా తమన్నా, మెహ్రీన్ కౌర్ నటించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. -
పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే..
F3 Movie: Pooja Hegde Party Song Of The Year Promo Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా మరోసారి సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన సంగతే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను విడుదల చేయనున్నారు. 'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మే 17న రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రొమోను సోమవారం (మే 16) బయటకు వదిలారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నిలవనుంది. మోస్ట్ గ్లామరస్‌గా ఉన్న పూజా హెగ్డే పోస్టర్‌ను 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్'గా రిలీజ్ చేశారు. ఈ పార్టీ నంబర్ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చదవండి: ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు.. మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం తొలి ప్రాధాన్యత: మంచు విష్ణు -
అదే అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్: సునీల్
అనిల్ రావిపూడి గ్రేట్ ఆల్ రౌండర్. అతనిలో గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు. ప్రతి సీన్ అతనే చేసి చూపిస్తాడు. నా టైమింగ్ నా కంటే అనిల్ కే బాగా తెలుసు.ఇంతమంది స్టార్ కాస్ట్‌తో ఈ మధ్య కాలంలో ఎవరూ సినిమా తీయలేదు. తీసినా ఇంతమంది ఆర్టిస్ట్ లకి వేరే సినిమాలకి సర్దుబాటు చేస్తూ తీయలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ఉంటాడు. ఆయనను చూసిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ, స్మెల్ వస్తుంది. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. ఆయన ఎంత ఎనర్జిటిక్, పాజిటివ్‌గా ఉంటారో ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి’అన్నారు నటుడు సునీల్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సునీల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. ఎఫ్ 3 లోకి ఎలా వచ్చారు ? 'కామెడీ రాసే వాళ్ళు తగ్గిపోయారు. మనం కలసి చేస్తే బావుంటుంది కదా'' అని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడితో చెప్పా. 'తప్పకుండ చేద్దాం అన్నగారు.. మీ 'సొంతం' సినిమా పదేపదే చూస్తుంటా. మీ టైమింగ్ లోనే మాట్లాడుతుంటాం. మనం కలసి చేద్దాం' అన్నారు అనిల్. చెప్పినట్లే ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చారు. ఎఫ్ 3లో వింటేజ్ సునీల్ ని చూస్తారు. ఎఫ్3లో మీ పాత్ర సినిమా అంతటా ఉంటుందా? సినిమా అంతా వుంటుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్ గారు , రఘుబాబు ఒక బ్యాచ్, తమన్నా ఫ్యామిలీ ఒక బ్యాచ్, పృద్వీగారు, స్టంట్ శివ ఒక బ్యాచ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక బ్యాచ్, వెన్నల కిషోర్, రాజేంద్రప్రసాద్ గారు ఒక బ్యాచ్.. మళ్ళీ అందరం కలసి ఒక బ్యాచ్.. అందరం కలసి తర్వాత కామెడీ మాములుగా వుండదు. నాన్ స్టాప్ నవ్వులే. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో ఉంటుంది. ఎఫ్2 - అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్.. మరి ఎఫ్3 అంటే మీరేం చెప్తారు ? ఫన్ & ఫ్రస్ట్రేషన్..మూడు రెట్లు (నవ్వుతూ). ఐతే ఫ్రస్ట్రేషన్ లో కూడా ఫన్ వుంటుంది. ఫ్యామిలీ అంతా థియేటర్ కి వెళ్లి గట్టిగా నవ్వుకొని, మళ్ళీ వెళ్దాం అనుకునే సినిమా ఎఫ్ 3. వరుణ్ తేజ్‌లో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? వరుణ్ తేజ్ అప్పియరెన్స్ చుస్తే రష్యా సినిమాలో కూడా హీరోగా పెట్టేయొచ్చు. హాలీవుడ్ కటౌట్ ఆయనది. ఆలాంటి అప్పియరెన్స్ వున్న వరుణ్ గారు.. ఒక మిడిల్ క్లాస్ రోల్ చేయడం సర్ప్రైజింగా అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి తెలుసు. హీరో అయిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. 'అన్నా' అని పిలుస్తారు. వరుణ్ గారిలో చాలా ఫన్ వుంది. ఈ సినిమాతో అది బయటికి వచ్చింది. దీని తర్వాత ఆయన నుండి ఫన్ ఓరియంటడ్ సినిమాలు కూడా వస్తాయి. ఎఫ్3 లో మీరు ఫేస్ చేసిన చాలెంజ్ ఏంటి ? ఎఫ్ 3, పుష్ప .. ఒకే సమయంలో షూట్స్ లో పాల్గొన్న. రెండూ డిఫరెంట్ రోల్స్. ఒక కామెడీ , రెండు విలనీ. పొద్దున్న కామెడీ చేసి రాత్రికి విలనీ చేయడం కాస్త చాలెజింగ్ అనిపించింది. ఇప్పుడు కామెడీ సినిమాలు చేసే దర్శకులు తగ్గిపోయారు కదా.. ఆర్టిస్ట్ గా మీ మీద ఎలాంటి ప్రభావం వుంటుంది? నామీద కంటే ప్రేక్షకుల మీద ఆ ప్రభావం ఎక్కువ వుంటుంది. నవ్వించే సినిమాలు చేయడం అంత తేలిక కాదు. నవ్వించడం కూడా అంత తేలిక కాదు. సరదాగా నవ్వుకొని వుంటే ఇమ్యునిటీ పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా.. సో.. కామెడీ సినిమాలు ఎక్కువ రావాలి. ప్రేక్షకులని నవ్వించాలి. సీరియస్ పాత్రలతో పోల్చుకుంటే కామెడీ చేయడమే కష్టం. అన్ని జోనర్ సినిమాలూ రావాలి. కానీ కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. సీరియస్ రోల్స్ ఈజీ అంటున్నారు. కలర్ ఫోటోలో చాల సెటిల్ గా చేశారు.. దీనికి కూడా క్రాఫ్ట్ మీద కంట్రోల్ కావాలి కదా ? నిజమే. అయితే ఆ క్రెడిట్ ఇప్పుడు వస్తున్న యంగ్ దర్శకులకు దక్కుతుంది. నా సినిమాలు స్కూల్ , కాలేజీ డేస్ లో చూశారు. ఇప్పుడు వాళ్ళు అప్డేటడ్ వర్షన్. నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిందే కలర్ ఫోటో. ఎక్కువ కామెడీ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు కదా .. మీ వరకూ ఏం ప్లాన్స్ చేస్తున్నారు ? నిజానికి నేను ప్లాన్ చేయడం మానేశాను. నా కోసం నేచర్ ఏం ప్లాన్ చేస్తుందో గుర్తిస్తున్నాను. కామెడీ చేయమన్నా ఓకే, పదహారేళ్ళ అమ్మాయికి ఫాదర్ గా చేయమన్నా ఓకే. అయితే వచ్చిన అవకాశానికి న్యాయం చేయడానికి వంద శాతం కష్టపడతాను. ఐతే నా వరకూ కామెడీ చేసి నవ్వించడమే ఇష్టం. ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయా ? తమిళ్, కన్నడ, బాలీవుడ్ నుంచి విలన్ పాత్ర సంప్రదించారు. బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశాం. త్వరలోనే వివరాలు చెప్తాం. మీ స్నేహితుడు త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు ? తన కొత్త సినిమాలో నేను వుంటాను. అవకాశం వున్న ప్రతి చోట నన్ను పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి 'భీమ్లా నాయక్' సాంగ్ లో కూడా పెట్టారు ( నవ్వుతూ) ఎఫ్ 3లో వెంకటేష్ , వరుణ్ తేజ్ ఫెర్ఫార్మేన్స్ ఎలా ఉండబోతుంది ? వెంకటేష్ గారి టైమింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎఫ్ 3లో ఆయన స్టీల్ ది షో. వరుణ్ తేజ్ గారిని ఇప్పటివరకూ ఇంత కామెడీ చేసిన రోల్ లో చూసి వుండరు. ఎఫ్ 3 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. ఈ సినిమాకి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వుంటారు. కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ -శంకర్ గారి సినిమా చేస్తున్నా. మరో 13 చిన్న , మీడియం సినిమాలు కూడా వున్నాయి. అందరికీ అందుబాటులో వుండాలని నిర్ణయించుకున్నా. ఒక నాలుగు పెద్ద సినిమాలు చేస్తే మరో పది చిన్న సినిమాలు చేయాలని భావిస్తున్నాను. -
వెంకటేశ్‌తో ఫస్ట్ సీన్, చాలా కంగారుపడ్డా: హీరోయిన్
థియేటర్లలో నవ్వులు పంచడానికి ఎఫ్ 3 సినిమాతో సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్లో నవ్వుల పండగ తీసుకురాబోతున్న ఎఫ్3లో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ సందడి చేయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎఫ్ 3తో పాటు తన పాత్రకు సంబధించిన పలు విశేషాలు మీడియాతో పంచుకున్నారు సోనాల్. ''ఎఫ్ 3'' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు? ''లెజెండ్'' సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పరిచయం. లెజెండ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ గారు వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడుకున్నాం. కలిసి వర్క్ చేయాలనుకున్నాం. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఆయన నుంచి ఫోన్ వచ్చింది. 'ఎఫ్3 అనే సినిమా చేస్తున్నాను. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను'' అన్నారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. అనిల్ గారు కామెడీ కింగ్. అప్పటికే ఎఫ్ 2 సినిమా చూశాను. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3లో వుంటుంది. ఎఫ్ 3 ట్రైలర్ లో కూడా మీ పాత్ర గురించి ఎలాంటి డిటెయిల్ ఇవ్వలేదు.. ఇంతకీ ఎఫ్3లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ట్రైలర్లో సీక్రెట్‌గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ వుంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ ఫీలవుతారు. ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఇప్పటికైతే నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మీ కెరీర్ లో ఎఫ్ 3 ఫస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ కదా..దీని కోసం ప్రత్యేకంగా హోం వర్క్ ఏమైనా చేశారా? కామెడీ ఎంటర్ టైనర్ చేయడం నాకు కొత్త. చాలా టెన్షన్ పడ్డాను. ''ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ఏవైనా సినిమాలు చూడాలా? అని దర్శకుడు అనిల్ రావిపూడి గారిని అడిగాను. ఆయన సూపర్ కూల్. ఏమీ అలోచించకుండా నేరుగా షూటింగ్‌కు వచ్చేయమని చెప్పారు. అనిల్ గారితో వర్క్ చేయడం ఆర్టిస్ట్‌కి చాలా ఈజీ. ఆయనే నటించి చూపిస్తారు. ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆర్టిస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం ఆయనకు తెలుసు. ఆయన చెప్పినట్లే చేస్తే చాలు మన పని తేలికైపోతుంది. ఎఫ్ 3లో కలసి వర్క్ చేసిన తర్వాత ఆయనపై గౌరవం ఇంకా పెరిగింది. సెట్స్‌లో చాలా సరదాగా జోకులు వేస్తుంటారు. కష్టాన్ని కూడా కామెడీగా మార్చగలరు. వెంకటేశ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో పని చేయడం ఎలా అనిపించింది? వెంకటేశ్‌గారు గొప్ప నటుడే కాదు.. గొప్ప మనిషి. సెట్స్‌లో అందరితో కలిసిపోయి మాట్లాడతారు. సహనటులు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేస్తారు. అలాగే ఆయన ఎప్పుడూ నిర్మాతల పక్షం నుంచి ఆలోచిస్తుంటారు. సమయం వృధా చేయడం ఆయనకి నచ్చదు. వెంకటేశ్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వరుణ్ తేజ్ చాలా పాజిటివ్‌గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ పర్సన్. వరుణ్ తేజ్ స్టార్‌తో వర్క్ చేయడం కూడా ఆనందాన్ని ఇచ్చింది. ఎఫ్ 3 లో మెమొరబుల్ మూమెంట్? ఫస్ట్ సీన్ వెంకటేశ్ గారితో చేయాలి. చాలా కంగారు పడ్డా. ఎలా వుంటుందో అనుకున్నా. ఐతే ఆ సీన్ చాలా కూల్‌గా జరిగింది. బెస్ట్ మూమెంట్ అది. దిల్ రాజు గారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది? గ్రేట్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారి నిర్మాణంలో పని చేయాలని ఎప్పటినుంచో కోరుకున్నాను. ఎఫ్ 3తో ఆ కోరిక తీరింది. సినిమా పట్ల ఇష్టం, అంకితభావం ఉన్న నిర్మాతలు. సినిమాకి సంబధించిన ప్రతి అంశాన్ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. మీరు చాలా భాషల్లో నటిస్తున్నారు కదా.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత ఏమిటి ? తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు చాలా క్లారిటీగా వుంటారు. ప్రేక్షకుడు కోరుకునే వినోదం అందించడానికి తపనపడతారు. ప్రేక్షకుడిని గౌరవిస్తారు. ఈ క్రమంలోనే గొప్ప సినిమాలు వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇప్పుడు దేశం అంతా గొప్పగా మాట్లాడుతుంది. కొత్తగా చేస్తున్న సినిమాలు ? నాగార్జున గారితో ఘోస్ట్ సినిమా చేస్తున్నా. ఇందులో నాది ఫుల్ యాక్షన్ రోల్. చదవండి: ప్రముఖ సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో! 25 సవర్ల బంగారాన్ని వాడుకున్నారు, కూతురిని చంపేశారు: మోడల్ తల్లి -
మెహరీన్, తమన్నాల ఫైర్ అండ్ ఫెంటాస్టిక్ ఫోటోలు
-
ఎఫ్ 3 ఒక మంచి ట్రీట్‌లా ఉంటుంది – వెంకటేశ్
‘‘అందరి అభిమానులకు, కుటుంబ ప్రేక్షకులకు ‘ఎఫ్ 3’ చిత్రం ఒక ట్రీట్‌లా ఉంటుంది. అందరూ వచ్చి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ ప్రేక్షకులకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకున్నాం. ‘ఎఫ్ 3’లో రే చీకటి ఉన్న పాత్ర చేశా’’ అన్నారు. (చదవండి: నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్) వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ‘ఎఫ్ 3’ ఫ్రెష్‌నెస్‌ని, నవ్వులను తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ ఏమీ ఆలోచించకుండా మీ కుటుంబాలతో కలిసి వచ్చి ‘ఎఫ్ 3’ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ‘ఎఫ్ 2’ అనేది ప్రాక్టీస్ మ్యాచ్‌లాంటిది.. ‘ఎఫ్ 3’ అనేది మెయిన్ మ్యాచ్.. ఈ మ్యాచ్‌లో సిక్స్ కాదు.. బాల్ స్టేడియం బయటకి వెళుతుంది. మీ అందరికీ ‘ఎఫ్ 3’ నచ్చుతుంది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ –‘‘ఎఫ్ 3’ ట్రైలర్లో చూపించింది కొన్ని నవ్వులు మాత్రమే.. సినిమాలో అంతకుమించిన నవ్వులను మీ కోసం దాచి ఉంచాం. ‘ఎఫ్ 3’లో మోర్ ఫన్ అని పెట్టాం. ఈ రోజు ట్రైలర్‌కి వచ్చిన స్పందనను బట్టి చెబుతున్నాం.. ‘ఎఫ్’ ఫర్ ఫ్యామిలీ. ఎంటర్టైన్మెంట్ చేయడంలో వెంకటేశ్‌గారు ఎవరెస్ట్.. ఆ ఎవరెస్ట్ పక్కన నటించేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ని చూస్తే ‘ఇంత కామెడీ చేయగలడా?’ అంటారు. ఈ ఫ్రాంచైజీని నిర్మించడానికి సపోర్ట్ చేసిన నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. అలీ మాట్లాడుతూ – ‘‘ఈ చంటి (వెంకటేశ్‌ని ఉద్దేశించి) ‘ఎఫ్ 3’లో మామూలుగా చేయలేదు. ఇక్కడ మా చంటి (వరుణ్ తేజ్‌ని ఉద్దేశించి).. వీరిద్దరూ ఈ సినిమాని తమ భుజాలపై మోశారు’’ అన్నారు. -
ఏంటో.. అందరికి నా బర్త్‌డే సెంటిమెంట్ అయిపోయింది: విజయ్
Vijay Deverakonda Tweet On His Birthday: ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల లైగర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన విజయ్, అప్పుడే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేయగా.. మరోసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో జనగనమణ సినిమాలను స్టార్ట్ చేసేశాడు. ఇదిలా ఉంటే నేడు (మే 9న) విజయ్ బర్త్ డే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విజయ్‌కి స్పెషల్ విషెష్ చెప్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత అర్ధరాత్రే విజయ్‌తో కేక్ కట్ చేయించి రౌడీ బర్త్‌డేను సెలబ్రెట్ చేసింది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లైగర్ మూవీ టీం ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయనుంది. చదవండి: ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి డేట్ ఫిక్స్, ఆ రోజే లాంచ్! ఈ నేపథ్యంలో సాయంత్రం లైగర్ మూవీ నుంచి ఓ అప్డేట్ ఇవ్వనుంది మూవీ టీం. ఈ క్రమంలో తన బర్త్‌డే సందర్బంగా విజయ్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ రోజు నా బర్త్‌డే. ఏంటో నా బర్త్‌డే అందరికి సెంటిమెంట్ అయిపోయింది. ఇదే రోజు ఎఫ్ 3, మేజర్ మూవీల ట్రైలర్, అంటే సుందరికి నుంచి సాంగ్ ఈ రోజే రిలీజ్ కానున్నాయి. దీనితో పాటు బాలీవుడ్ బాలీవుడ్ చిత్రం పృథ్విరాజ్ ట్రైలర్ కూడా ఈ రోజే విడుదల’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్. కాగా ఈ రోజు మే 9న సాయంత్రం నాలుగు గంటలకు లైగర్‌కు సంబంధించిన ఒక స్పెషల్ థీమ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా So many movie promotions on my birthday! It is like a festival day 😀 Andariki Vijay Deverakonda birthday sentiment ekva ipoindi.. All will do well, I shall share my power :)#Liger #VD11 #Major #F3 #AnteSundaraniki #Prithviraj — Vijay Deverakonda (@TheDeverakonda) May 7, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అల్టీమెట్ ఫన్ ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది..
F3 Movie Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ తాజాగా ఎఫ్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు. చదవండి: వైజాగ్‌లో రామ్‌చరణ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్ 'ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదే.. కానీ ఆరవ భూతం ఒకటుంది అదే డబ్బు' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'డబ్బు ఉన్నవాడికి ఫన్.. లేని వాడికి ఫ్రస్టేషన్, సీక్వెల్లో కూడా వీడికి సేమ్ డైలాగ్స్.. అంతేగా, అంతేగా'..వంటి డైలాగులు ఆకట్టకుంటున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. -
ఇన్నాళ్ల కెరీర్లో ఆ సినిమా కష్టమనిపించింది: ఎడిటర్
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్న క్రమంలో ఈ చిత్రానికి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న 'ఎఫ్ 3' విశేషాలు.. ► మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది? నేను పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 1998లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిడ్ ఎడిటర్‌గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత ప్రసాద్ ల్యాబ్‌లో 14ఏళ్ల పాటు ఆవిడ్ ఎడిటర్‌గా చేశాను. దర్శకుడు రాజమౌళి గారితో 18 ఏళ్ళు ప్రయాణం చేశాను. శాంతి నివాసం సీరియల్ నుంచి బాహుబలి 2 వరకూ రాజమౌళిగారితో పని చేశాను. దర్శకుడు అనిల్ రావిపూడితో పటాస్ నా ఫస్ట్ మూవీ. తర్వాత ఆయన సినిమాలన్నీ చేశాను. ఇప్పటివరకూ దాదాపు 30సినిమాలకు ఎడిటర్‌గా చేశాను. ► ఎఫ్ 2 తో ఎఫ్ 3 కథ ఎలా ఉండబోతుంది ? ఎఫ్ 2లో పెళ్లి, తర్వాత వచ్చే కష్టాలు .. ఇలా వినోదాత్మకంగా చూపించాం. ఎఫ్ 3 డబ్బు చుట్టూ తిగిరే కథ. మానవసంబంధాలు డబ్బుతో ముడిపడి వున్నాయి. ఈ పాయింట్ ఎఫ్ 3లో చాలా ఫన్ ఫుల్‌గా చూపించాము. ► ఎఫ్ 2 కి ఎఫ్ 3 పోలికలు వస్తాయా ? ఎఫ్ 2 ఫ్రాంచైజ్ గా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఎఫ్ 2 క్యారెక్టర్లు ఉంటాయి కానీ ఎఫ్ 3 కథ మాత్రం పూర్తిగా భిన్నం. లీడ్ క్యారెక్టర్లు తీసుకొని కథని కొత్తగా చెప్పాం. ► కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం ఎలా వుంటుంది ? కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్ రావిపూడిగారి సినిమాల్లో కామెడీ పంచులు అన్నీ బావుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా వుంటుంది. ఐతే ఓవరాల్ ఫ్లో చూసుకొని కథకు ఏది అవసరమో అదే ఉంచుతాం. ► దర్శకుడు అనిల్ రావిపూడి గారితో వర్క్ చేయడం ఎలా వుంటుంది ? అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం చాలా పాజిటివ్‌గా వుంటుంది. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల పక్షమే ఆలోచిస్తుంటారు. పటాస్ సినిమా నుంచి మా మధ్య అద్భుతమైన సింక్ కుదిరింది. ► ఎడిటర్ అభిప్రాయాన్ని దర్శకులు గౌరవిస్తారా ? ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా చర్చలు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ప్రీ ప్రొడక్షన్ ఎంత చక్కగా చేస్తామో పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ కూడా అంతే జాగ్రత్తగా చేస్తే మంచి సినిమా వస్తుంది. రషస్ మొదట ఎడిటర్ చూస్తాడు. ఎడిటర్ చెప్పే సూచనలని దర్శకులు గౌరవిస్తారు. ► పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఎడిటింగ్ పై ఎలా వుంటుంది ? నేను బాహుబలి 2కి చేశా. రాజమౌళి గారు క్రెడిట్ ఇచ్చారు. అన్ని భాషలు తెలిసిన ఎడిటర్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తారు. ► రీషూట్స్ విషయంలో ఎడిటర్ పాత్ర ఎలా వుంటుంది ? దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ .. అందరూ కూర్చుని చర్చించిన తర్వాత ఏది అవసరమో, కాదో నిర్ణయం తీసుకుంటారు. ► కథ వింటారా ? నేను కథ వినను. కథ వింటే ఇలా వుంటుందని ఫిక్స్ అయిపోతాం. రష్లో అది లేకపోతే ఇలా ఎందుకైయిందనే ప్రశ్న తలెత్తుతుంది. నా వరకూ రష్ ప్రకారం ఎడిటింగ్ చేస్తా. ► ఎడిటింగ్ కి సిజీకి ఎలాంటి సంబంధం వుంటుంది ? చాలా వుంది. బ్లూ మ్యాట్స్ ఎక్కువగా తీసుకున్నారు. అక్కడ ఏం వుంటుందో తెలీదు. దాని దృష్టిలో మనం ఎడిట్ చేసుకోవాలి. కొన్ని సార్లు అనుకున్న విజన్ రాకపోవచ్చు. మళ్ళీ చర్చించి వర్క్ చేయాల్సివుంటుంది. ► ఇన్నాళ్ళ కెరీర్ లో కష్టమనిపించిన సినిమా ? 'మిర్చి' కి అసోసియేట్ ఎడిటర్ గా చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాను. పటాస్ సినిమాకి కూడా చాలా కష్టపడ్డాం. ► సినిమా విజయం అయినప్పుడు మిగతా వారితో పోల్చుకుంటే ఎడిటర్ కి తక్కువ క్రెడిట్ వస్తుంది కదా ? సినిమా సక్సెస్ దర్శకుడిదే. దర్శకుడి విజన్‌తోనే ఎడిటర్ పని చేయాలి. అతను తీసిన రష్ను ఎడిట్ చేయాలి. కాబట్టి సక్సెస్ క్రెడిట్ దర్శకుడికే చెందాలి. ఐతే మాకు రావాల్సిన గురింపు కూడా వస్తుంది. ► లీకేజీలు గురించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు ? సినిమా వర్క్ జరుగుతున్నపుడు పుటేజ్ చాలా చోట్లకి వెళుతుంది. ఐతే పని చేసే వాళ్ళకి లీక్ చేయడం తప్పు అనే సంస్కారం వుండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్వయం నియంత్రణ వుంటేనే లీకేజీలని ఆపగలం. ► ఎఫ్ 4 కూడా వుంటుందా ? ఇంకా అనుకోలేదు. ఐతే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది. ► చేస్తున్న కొత్త సినిమాలు ? కళ్యాణ్ రామ్ గారితో బింబిసార, మైత్రి మూవీ మేకర్స్ సినిమా, నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాలు చేస్తున్నా. చదవండి: 'నేను ఏమైనా తప్పు చేశానా అని సరదాగా అడిగారు' యూట్యూబ్‌లో 'సర్కారు వారి పాట'కే మెజారిటీ.. -
ఎఫ్-3 సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్ 3’ ఈ నెల 27న విడుదలకానుంది. ఈ నెల 9న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ‘‘టీజర్‌ను విడుదల చేయడం లేదు. నేరుగా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. ఫన్ రైడ్ ట్రైలర్‌ను చూసేందుకు మరో వారం రోజులు ఎదురు చూస్తే చాలు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సాయి శ్రీరామ్. The FUN BOMB explodes BIG with a Blasting Update 💥 Get ready to tickle your fun bones with a FUN-tastic #F3Trailer 🥳 Releasing on MAY 9th 🙌#F3Movie@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @adityamusic#F3OnMay27 pic.twitter.com/2O99fJBWkw — Sri Venkateswara Creations (@SVC_official) May 2, 2022 -
ఎఫ్-3 నుంచి బిగ్ అప్డేట్.. పేలనున్న ఫన్ బాంబ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ మరో బిగ్ అప్డేట్ను అనౌన్స్ చేశారు. రేపు(సోమవారం) ఉదయం 10.08 నిమిషాలకు ‘బ్లాస్టింగ్ టుమారో’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ బ్లాస్ట్ ఏంటో తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. The FUN BOMB is ready to EXPLODE 💣 Blasting Tomorrow @ 10:08 AM💥#F3Movie #F3OnMay27 @VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @sonalchauhan7 @Mee_Sunil @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/rI6H4NtJ5A — Sri Venkateswara Creations (@SVC_official) May 1, 2022 -
నా కెరీర్లో బెస్ట్ పాత్ర ఇదే!: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 3’. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ‘ఎఫ్ 2’లో అల్లరి, అమాయకత్వం నిండిన హనీ పాత్రలో కనిపించిన మెహరీన్ ‘ఎఫ్ 3’లో ఈ రెండు షేడ్స్‌తో పాటు పరిణతి చెందిన అమ్మాయిలానూ కనిపించనున్నారు. ‘‘మెహరీన్ క్యారెక్టర్ మెచ్యూర్డ్‌గా డిఫరెంట్ లేయర్స్‌తో ఉంటుంది. అలాగే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ‘‘నా కెరీర్లో ఇది బెస్ట్ ఎంటర్టైనింగ్ రోల్’’ అని మెహరీన్ అన్నారు. సోనాల్ చౌహాన్ ఓ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో నటించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి. చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు -
ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు సీక్వెల్స్ జోరు కొనసాగుతోంది. దాదాపు అరడజను సినిమాల సీక్వెల్స్ నిర్మాణంలో ఉంటే, ప్రకటించిన సీక్వెల్స్ కూడా అరడజనుకు పైగా ఉన్నాయి. ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనేలా ఒకే ఏడాదిలో తెలుగులో ఇన్ని సీక్వెల్స్ రూపొందడం ఇదే మొదటిసారి. మొదటి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు ‘తరువాయి భాగం’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీక్వెల్ సినిమాల గురించి తెలుసుకుందాం. త్రిబుల్ సందడి... ‘ఎఫ్ 2’ సినిమాతో సంక్రాంతి అల్లుళ్లుగా కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ‘ఎఫ్ 2’ 2019 జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నవారికి ఈ సినిమా ద్వారా ‘వెంకీ ఆసనం’ నేర్పించారు వెంకటేశ్. తోడల్లుళ్లుగా వెంకీ–వరుణ్‌లు చేసిన డబుల్ సందడిని ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ ఆనందాన్ని త్రిబుల్ చేయడానికి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్ 3’ మే 27న విడుదలవుతోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాట చేశారు. ‘ఎఫ్ 2’ మంచి విజయం సాధించడంతో ‘ఎఫ్ 3’ పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తగ్గేదే లే అంటూ... ‘తగ్గేదే లే’... ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి. ‘ఆర్య, ఆర్య 2’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్– డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’: ది రైజ్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ‘తగ్గేదే లే’ అంటూ.. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించింది టీమ్. ప్రస్తుతం ‘పుష్ప 2’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గత ఏడాది ‘పుష్ప’ విడుదలైన తేదీ (డిసెంబరు 17)నే ఈ ఏడాది డిసెంబరులో ‘పుష్ప 2’ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎనిమిదేళ్లకు సీక్వెల్... నిఖిల్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వాతి హీరోయిన్గా నటించారు. వెంకట్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా 2014 అక్టోబర్ 14న విడుదలై ఘనవిజయం సాధించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రమిది. ‘కార్తికేయ’ విడుదలైన ఎనిమిదేళ్లకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మళ్లీ హిట్ కోసం... వైవిధ్యమైన చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న హీరో నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘హిట్’ 2020 ఫిబ్రవరి 28న విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2’ని తీస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. అయితే ‘హిట్ 2’కి హీరో, హీరోయిన్ మారారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్న, నిర్మాణంలో ఉన్న చిత్రాలైతే మరికొన్ని సీక్వెల్స్ కూడా రూపొందనున్నాయి. ఆ చిత్రాలేంటంటే.. రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’కి సీక్వెల్, రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’కి సీక్వెల్, గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘లక్ష్యం’కి సీక్వెల్, మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ సీక్వెల్ కూడా రానున్నాయి. ఇంకా ఉదయ్ కిరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ (2000) మూవీకి సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ తెరకెక్కనుంది. అలాగే అడివి శేష్ ‘గూఢచారి’, తేజా సజ్జ ‘జాంబి రెడ్డి’, నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ వంటి చిత్రాల సీక్వెల్స్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. చదవండి: ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా? టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
F3 Movie: ఉర్రూతలూగిస్తున్న ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ సాంగ్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 2019 లో సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించిన ‘ఎఫ్2’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్‌కి మంచి స్పందన విచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నీ కోర మీసం చూస్తుంటే...నువ్వట్టా తిప్పేస్తుంటే... ఊ ఆ అహా అహా! నీ మ్యాన్లీ లుక్కేచూస్తుంటే... మూన్ వాక్ చేసే నా హార్టే' 'ఊ ఆ అహా అహా!' అంటూ ఈ సాంగ్ సాగింది. ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ , దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సునిధి చౌహాన్ , లవితా లోబో, సాగర్,ఎస్పీ అభిషేక్ అద్భుతంగా ఆలపించారు. తమన్నా, మెహ్రీన్ గ్లామర్, స్పెసీ డాన్స్‌తో పాట ఉర్రూతలు ఊగిస్తుంది. చీర కట్టుతో పాటు పాశ్చాత్య దుస్తుల్లోనూ హాట్ హాట్‌గా కనిపించి, కనువిందు చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. -
‘ఎఫ్ 3’ సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో.. గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను, మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, తొలి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మూవీలోని సెకండ్ సింగిల్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ‘ఊ .. ఆ .. అహ అహ’అంటూ ఈ పాట సాగుతోంది. వెంకటేశ్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంటలపై ఈ పాటను చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రొమో సాంగ్ తమన్నా-మెహరీన్‌లు చీరకట్టులో గ్లామర్‌గా కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాటలో కనిపించనుంది. -
ఎఫ్-3 నుంచి ‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా' పాట ఎప్పుడంటే..
‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా’ అంటూ తాడు పట్టుకుని వెంకటేశ్, వరుణ్ తేజ్ ఒకవైపు... తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ మరోవైపు బరిలోకి దిగారు. ఈ సందడి అంతా ‘ఎఫ్ 3’లో ఓ పాటలో కనిపించనుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, ఓ పోస్టర్ని విడుదల చేసింది. ‘‘ఊ.. ఆ.. ఆహా...’ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చారు. ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మే 27న మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి. -
పూజా హెగ్డె ఐటమ్ సాంగ్ షురూ.. ఇక మరింత ఫన్
Pooja Hegde F3 Movie Item Song Starts: ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సుమారు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడుతూ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్గా మారింది ఈ బ్యూటీ. ఇటీవల 'అరబిక్ కుతు' సాంగ్‌లో విజయ్‌తో కలిసి అదరగొట్టింది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి'గా జిగేలుమనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ 'ఎఫ్ 3' సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ పాట చిత్రీకరణను శుక్రవారం (ఏప్రిల్ 15) న ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోలో సుమారు 7 ఎకరాల్లో వేసిన అద్భుతమైన సెట్లో ఈ పార్టీ నెంబర్‌ను షూట్ చేయనున్నారు. శుక్రవారం నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతోపాటు సినిమాలోని హీరోహీరోయిన్లు కూడా ఆడిపాడనున్నారట. ఒకే స్క్రీన్‌పై బుట్టబొమ్మ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీరన్ పిర్జాదా, సోనాల్ చౌహన్ కనిపించడం నిజంగా ఫన్‌గానే ఉండనుంది. ఈ పాటను రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 3' చిత్రం నవ్వులు పూయించడానికి మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే Lets get this party started💃 The Ravishing beauty @hegdepooja joins #F3Movie to add spice to our SPECIAL PARTY SONG🎶#F3OnMay27@VenkyMama @IAmVarunTej@AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/SNZRyJFbD1 — Sri Venkateswara Creations (@SVC_official) April 15, 2022 -
ఐటం సాంగ్ కోసం అన్ని కోట్లు అడుగుతున్న జిగేల్ రాణి!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోందీ పూజా హెగ్డే. దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడే చాన్స్ దక్కించుకుంటూ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా మారిందీ బ్యూటీ. తాజాగా ఆమె విజయ్ సరసన నటించిన బీస్ట్ ఏప్రిల్ 13న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అరబిక్ కుతు పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటే కాదు సినిమా కూడా అదే రేంజ్లో హిట్టవుతుందని ఎంతో ధీమాగా ఉందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఆమె వెంకటేశ్, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ ఎఫ్3 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందంటూ కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పూజా హెగ్డే గతంలో రంగస్థలం సినిమాలో 'జిల్ జిల్ జిల్ జిల్ జిగేల్‌రాణి..' అంటూ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. మరోసారి ఐటం సాంగ్ ఆఫర్ రాగా అందుకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. అయితే దానికోసం పూజా ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కపాట కోసం మరీ ఆ రేంజ్లో డిమాండ్ చేయడమా? అని ఆశ్చర్యపోయిన నిర్మాతలు కోటి రూపాయలు అయితే ఇవ్వగలమంటూ ఆమెకు సర్దిచెప్పి ఒప్పించారట! కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 3 సినిమాలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 27న విడుదల కానుంది. చదవండి: స్టార్ హీరో అయ్యుండి విజయ్ ఇలా చేస్తారనుకోలేదు, షాకయ్యా.. ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె -
శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్‌గా..
‘శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్‌గా కనిపించాలి.. ఓకేనా’ అంటే, మరో మాట మాట్లాడకుండా ‘ఓకే’ చెప్పేస్తారు కొందరు స్టార్స్. అలాంటి క్యారెక్టర్లను సవాల్‌గా తీసుకుని, తమలోని ఆర్టిస్ట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తారు. కొందరు స్టార్స్ ఈ మధ్య అలా డిఫరెంట్‌గా కనిపించే మిషన్ మీద ఉన్నారు. కొంచెం ‘డిఫరెంట్’గా కనిపించే ఆ క్యారెక్టర్ల గురించి తెలుసుకుందాం. ఎంత డబ్బైనా ఆఫర్ చేయండి? ఎంతటి దావత్నైనా ప్లాన్ చేయండి? సాయంత్రం ఆరు దాటితే అడుగు బయటపెట్టేదే లే అంటున్నారు వెంకటేశ్. ఇటు వెంకటేశ్ వెండితెర కో బ్రదర్ వరుణ్ తేజ్ కూడా గలాగలా మాట్లాడమంటే కాస్త గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఈ కో బ్రదర్స్‌కు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది ‘ఎఫ్ 3’ చిత్రమే. ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో డబ్బు ప్రధానమా లేక బంధాలు ముఖ్యమా? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ చిత్రంలో రే చీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తితో ఇబ్బందిపడే వ్యక్తి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో సునీల్, సోనాలీ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘ఎఫ్ 3’ చిత్రం ఈ ఏడాది మే 27న విడుదల కానుంది. మరోవైపు మాటల్లేవ్ అంటున్నారు హీరో సూర్య. ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ బధిర (చెవుడు, మూగ) వ్యక్తి పాత్రలో సూర్య నటిస్తారనే ప్రచారం సాగుతోంది. బాల దర్శకత్వంలో వచ్చిన ‘నంద’, ‘పితామగన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) తదితర చిత్రాల్లో నటించారు సూర్య. అలాగే బాల తెరకెక్కించిన ‘అవన్ ఇవన్’ (తెలుగులో వాడు–వీడు) చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. తాజాగా బాల దర్శకత్వంలో సూర్య చేయనున్న సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ఆరంభం కానుంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఓ చిత్రంలో మోనోఫోబియాతో బాధపడుతున్న రచయిత పాత్ర చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ద్వారా సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒక ప్రమాదం ఓ రచయిత జీవితాన్ని ఎలా మార్చేసింది? అతను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని ఎలా అధిగమించాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక అటు హిందీవైపు వెళితే చాలెంజింగ్ రోల్స్ చేస్తూ, దూసుకెళుతున్న తాప్సీ నటించిన తాజా చిత్రం ‘బ్లర్’. కంటి చూపుకి సంబంధించిన కథ ఇది అని టైటిలే చెప్పేస్తోంది. ఈ చిత్రకథ నచ్చి లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడంతో పాటు తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ‘జూలియాస్ ఐస్’ అనే స్పానిష్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ ‘బ్లర్’లో క్రమ క్రమంగా కంటిచూపు మందగించే పాత్ర చేశారు తాప్సీ. చూపు మెరుగుపడడానికి శస్త్ర చికిత్స చేయించుకుని, కళ్లకు బ్యాండేజ్‌తో తాప్సీ కనిపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సీన్లలో నటించే ముందు నిజంగానే తాప్సీ కళ్లకు బ్యాండేజ్ వేయించుకుని, ఓ పన్నెండు గంటల పాటు అలానే తన పనులు చేసుకున్నారట. క్యారెక్టర్లోకి పూర్తిగా ఒదిగిపోవాలనే ఇలా చేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్ బెహల్ ఈ చిత్రానికి దర్శకుడు. కొంచెం కొంచెంగా చూపు మందగించే పాత్రను తాప్సీ చేస్తే ‘బ్లైండ్’ చిత్రంలో సోనమ్ కపూర్ పూర్తిగా కళ్లు కనిపించని యువతిగా నటించారు. ఓ ప్రమాదంలో చూపు కోల్పోవడం, చేస్తున్న పోలీస్ జాబ్‌కు ఫుల్ స్టాప్ పడడం, ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. కొరియన్ సినిమా ‘బ్లైండ్’కి రీమేక్‌గా అదే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందింది. షోమే మఖీజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాదే పూర్తయింది. త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం. ఇక్కడ పేర్కొన్న స్టార్స్ మాత్రమే కాదు.. మరికొందరు కూడా కొంచెం ‘డిఫరెంట్’ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. -
F3 Movie: ఆడియన్స్‌కి హోలీ ట్రీట్, స్పెషల్ వీడియో చూసేయండి
F3 Movie Team Shares Special Video: ‘ఎఫ్ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్ 3’ టీమ్. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత మే 27న ఎఫ్ 3ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించింది. ఇక నేడు హోలీ పండగ సందర్భంగా ఫ్యాన్స్ ట్రీట్ ఇచ్చింది ఎఫ్ 3 టీం. ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ పేజీలో ఈ మూవీ అప్డేట్ ఇస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. ఈ సినిమాలోని నటీనటుల నవ్వులను పంచుతూ ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫ్రస్ట్రేషన్ లేని ఫన్‌తో ఈ వీడియోలో నటీనటులు కనిపించడంతో బాగా ఆకట్టుకుంటుందో. ఫస్ట్ హీరో వెంకటేశ్‌తో స్టార్ అయిన ఈ వీడియో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, నటి ప్రగతి, సునీల్, ఆలీ ఇలా అందరూ నవ్వులు పూయిస్తూ కనిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం టీంలో సందడి చేస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు, ప్రేక్షకులు చాలా బాగుందని మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమా చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: Vidya Balan: నాతో దారుణంగా ప్రవర్తించారు, 6 నెలలు అద్ధంలో చూసుకోలేదు.. #F3Movie Family wishes you all a very Happy & Safe Holi ♥️ May the festival of colours fill your lives with lots of happiness 🌈✨#HappyHoli@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP @adityamusic @SVC_official @f3_movie #F3OnMay27 pic.twitter.com/hlp7aGGrUz — Sri Venkateswara Creations (@SVC_official) March 18, 2022 -
వెంకీ, వరుణ్ తేజ్‌లను ఆడేసుకున్న నాగరత్తమ్మ.. ట్రెండింగ్‌లో వీడియో
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీని అనేక వాయిదాల తర్వాత మే 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా సెట్లో చిత్రబృందానికి చుక్కలు చూపించింది నాగరత్తమ్మ అలియాస్ 'ఫ్రస్టేటెడ్ ఉమెన్' ఫేమ్ సునయన. అయితే ఎఫ్-3 చిత్రం రిలీజయ్యే వరకూ నీడలా వెంటాడతానని ఇదివరకు శపథం చేసిన నాగరత్తమ్మ.. అన్నట్లే చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్ ఇతర టీం సభ్యులతో ఆమె కొంతసేపు ముచ్చటించి సరదాగా గడిపింది. అనంతరం వాళ్లతో ఫొటోలు దిగింది. సినిమాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. -
మే 27కు పోస్ట్ పోన్ అయిన ఎఫ్ 3
-
వెనక్కు తగ్గిన ఎఫ్3, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
‘ఎఫ్ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్ 3’ టీమ్. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ఎఫ్ 3 విడుదల చేస్తామని గతంలో చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే! తాజాగా ఒక నెల వెనక్కు జరిగిందీ సినిమా. మే 27న సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 'పిల్లలు పరీక్షలు ముగించుకోండి, పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి.. ఫన్ పిక్నిక్కు డేట్ ఫిక్స్ చేశాం.. మే 27న ఎఫ్3 వస్తోంది. ఇంక డేట్ మార్చే ప్రసక్తే లేదు' అని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 29న ఆచార్య రిలీజవుతోంది. ఎఫ్ 3 రిలీజ్ డేట్‌ను సవరించడంతో ఈ రెండు పెద్ద సినిమాల మధ్య క్లాష్ తప్పినట్లైంది. పిల్లలు పరీక్షలు ముగించుకోండి🤩 పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి🔥 ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం!🔐 No change in date Anymore! 😎 Most Awaited FUN Franchise ➡️ #F3Movie ON MAY 27th🥳#F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/PTjLnKvQbF — Sri Venkateswara Creations (@SVC_official) February 14, 2022 -
లబ్ డబ్.. డబ్బు
‘ఎఫ్ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్ 3’ టీమ్. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ‘ఎఫ్ 3’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మొదటి పాట ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు..’ని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ కనిపించనున్నారు. -
తీపి కబురు.. పెద్ద సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ ఇవే!
మంచిది.. ఇలా కదా చేయాల్సింది.. మంచిది... ఇది కదా జరగాల్సింది. మంచిది... ఇంత ఫ్రెండ్లీగా కదా ఉండాల్సింది. సోమవారం కొన్ని మంచి విషయాలను మోసుకొచ్చింది. టాలీవుడ్ పెద్ద నిర్మాతలందరూ మంచి నిర్ణయం తీసుకున్న కబురు తెచ్చింది. పెద్ద సినిమాలు క్లాష్ కాకుండా.. నిర్మాతలు సినిమాల రిలీజ్ డేట్స్‌ని డిసైడ్ చేశారు. సోమవారం ముందు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి. నిర్మాతలు డిసైడ్ అయి, ఇలా విడుదల తేదీలు చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక రిలీజ్ ‘డేట్ లాక్’ చేసుకున్న సినిమాల డేటా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ‘రౌద్రం.. రుధిరం.. రణం’ (ఆర్ఆర్ఆర్) సినిమా గురించి సినీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. కానీ జనవరి 31 (సోమవారం) ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి, స్వీట్ షాక్ ఇచ్చింది. ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. కొన్ని కల్పిత అంశాలకు స్నేహం, భావోద్వేగాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల రాజమౌళి చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా దాదాపు పద్నాలుగు భాషల్లో (విదేశీ భాషలతో కలిపి) విడుదల కానుంది. ఇక ధర్మస్థలి పోరాటాన్ని వెండితెరపై చూసే సమయం ఎప్పుడో తెలిసిపోయింది. చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ చిత్రం ధర్మస్థలి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే కనిపిస్తారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం సోమవారం ప్రకటించింది. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు 2022లో ముందుగానే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రాల జాబితాలో మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ముందు వరుసలో ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది జనవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు (అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల జనవరి 7కి షెడ్యూలైన కారణంగా ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోరిన మేరకు వాయిదా వేసుకున్నారు). ఆ తర్వాత ఏప్రిల్ 1న ‘సర్కారువారి పాట’ను రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్రనిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట తెలిపారు. అయితే ఏప్రిల్ 1కి షెడ్యూల్ అయిన ఈ చిత్రం ఆ తేదీకి రావడంలేదు. మే 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయిక. ఇటు మేం ఎప్పుడు వస్తే అప్పుడే నవ్వుల పండగ అని ‘ఎఫ్ 3’ టీమ్ చెబుతూనే ఉంది. ఏప్రిల్ 28న ప్రేక్షకులను నవ్వించాలని ఈ సినిమా టీమ్ ఇటీవల డిసైడ్ అయింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి సినిమాల కొత్త విడుదల తేదీలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ‘ఎఫ్ 3’ సినిమా విడుదలలో ఏమైనా మార్పు ఉంటుందా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ సినిమాను ఏప్రిల్ 28నే విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ మంచి విజయాన్ని సాధించింది. ‘దిల్’ రాజు నిర్మించారు. ఇక ‘ఎఫ్ 3’ గ్యాంగ్‌లో సునీల్, సోనాలీ చౌహాన్ కూడా చేరారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ‘ఎఫ్ 3’ సినిమాను నిర్మించారు. మరోవైపు పవన్ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె. చంద్ర దర్శకుడు. ఈ ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. అయితే సోమవారం కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో తమ సినిమా రిలీజ్‌ను కూడా ‘భీమ్లానాయక్’ టీమ్ ప్రకటించింది. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తాం.. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే ఏప్రిల్ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని చిత్రనిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. కోవిడ్ సృష్టించిన అయోమయ పరిస్థితుల కారణంగా సినిమాల విడుదలలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా ఒకేసారి పెద్ద చిత్రాల విడుదల తేదీలు ఖరారు కావడం సినిమాని నమ్ముకున్న అందరికీ తీపి కబురులాంటిది. విడుదల తేదీలు ఆర్ఆర్ఆర్ – మార్చి 25 ఆచార్య – ఏప్రిల్ 29 ఎఫ్ 3 – ఏప్రిల్ 28 సర్కారువారి పాట – మే 12 భీమ్లా నాయక్ – ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 డేట్ డిబేట్ ఇక మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ గురించి డిబేట్స్ (చర్చలు) జరుగుతున్నాయని తెలిసింది. ఈ జనవరి 14న విడుదల కావాల్సిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ థియేటర్స్‌కు రాలేదు. మార్చి 11న ఈ చిత్రం విడుదల కానుందన్నది లేటెస్ట్ టాక్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే వరుణ్ తేజ్ చేసిన ‘గని’ని మార్చి 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే అంటే ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రనిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ద. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహోర్లు’ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ తేదీకి ‘భీమ్లా నాయక్’ వస్తే, ‘ఆడవాళ్ళు...’ సినిమా రిలీజ్ డేట్ మారొచ్చు. అలాగే ఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కావాల్సింది. కానీ తాజా విడుదల తేదీల ఖరారు దృష్ట్యా ఈ సినిమా రిలీజ్ డేట్ (‘ఆచార్య’, ‘ఎఫ్ 3’ రిలీజ్ కారణంగా) మారే చాన్స్ ఉంది. అలాగే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్స్‌పై నిర్మాతల మధ్య సానుకూల వాతావరణంలో డేట్ డిబేట్ జరుగుతోంది. -
F3 Movie: ముందో.. వెనకో.. థియేటర్స్‌లోనే పక్కా
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ ‘ఎఫ్ 2’లో హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో కామెడీ చేయించారు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరు హీరోలకు తోడు తమన్నా, మెహరీన్, నటుడు రాజేంద్రప్రసాద్ కూడా సందడి చేశారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ అంటూ ఈ కాంబినేషన్ మరింత వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈసారి కీలక తారాగణంలో సునీల్, సోనాల్ చౌహాన్ కూడా ఉన్నారు. ‘ఎఫ్ 2’ని నిర్మించిన ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క పాట చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘వస్తే కొద్దిగా ముందుగా.. వెళ్లినా కొద్దిగా వెనకగా! థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సాయి శ్రీరామ్, కో–ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి. మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!😉 వస్తే, కొద్దిగా ముందుగా. వెళ్ళినా కొద్దిగా వెనకగా!😊 థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!😎#F3Movie @VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @Mee_Sunil @ThisIsDSP @SVC_official @f3_movie#F3OnApril28th pic.twitter.com/CHjtB5Ry5S — Sri Venkateswara Creations (@SVC_official) January 29, 2022 -
సమ్మర్‌పై గురి పెట్టిన స్టార్ హీరోలు
2022.. సమ్మర్ సీజన్ పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అప్పటికీ థర్డ్ వేవ్ తగ్గి థియేటర్లు తెరుచుకుంటే మాత్రం ఇండియాలో ఉన్న థియేటర్లు అన్ని స్టారాతి స్టార్ల సినిమాలతో కళకళలాడటం ఖాయం. సమ్మర్లో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ చిత్రాలు సమ్మర్ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఐదేళ్ల క్రితం ఏప్రిల్ 28న విడుదలై సంచలన విజయం సాధించింది బాహుబలి 2. ఇప్పుడు అదే తేదిన ఆర్ఆర్ఆర్ని విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నాడట రాజమౌళి. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ కూడా సమ్మర్ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అలాగే మెగా మల్టీస్టారర్ ఆచార్య కూడా ఫిబ్రవరిలో రిలీజ్ కావడంలేదని,మూవీని సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్నటిస్తున్న సర్కారు వారి పాట కూడా ఎట్టిపరిస్థితుల్లో వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి మేకింగ్ లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 కూడా సమ్మర్ సీజన్ లోనే రానుంది. ఈ వేసవికి తెలుగు చిత్రాలు మాత్రమే కాదు. పరభాషా చిత్రాలు కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించబోతున్నాయి. ఏప్రిల్ 14న శాండల్ వుడ్ నుంచి కేజీయఫ్ 2 తో రాఖీ భాయ్ వస్తున్నాడు. సేమ్ డే బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ కొత్త సినిమా లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో నటించాడు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా లాల్ సింగ్ చెద్దా సందడి చేయడం ఖాయం. ఇక కోలీవుడ్ నుంచి అజిత్ నటించిన వాలిమై, మరో తమిళ స్టార్ విజయ్ నటించిన బీస్ట్, సూర్య కొత్త సినిమా కూడా వేసవి కానుకగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రాలు కూడా టాలీవుడ్ లో భారీ స్థాయిలో విడుదలకు ప్రయత్నించబోతున్నాయి. మొత్తంగా రాబోయే సమ్మర్ సీజన్ సీనీ ప్రేమికులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది. -
2022లో వెంకీ మామ ప్లానింగ్ ఏంటి?
2021లో విక్టరీ వెంకటేశ్ రెండు సినిమాల్లో నటించాడు. అయితే ఆయన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఆ రెండు కొత్త చిత్రాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేశాయి. జూలైలో నారప్ప, నవంబర్ లో దృశ్యం2 చిత్రాలు అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు కూడా రీమేక్ మూవీస్ కావడం ఒక విశేషం అయితే, రెండు కూడా నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడం మరో హైలైట్ పాయింట్. అయితే 2021లో మాత్రం వెంకీ బాక్సాఫీస్ కలెక్షన్స్ మిస్ అయ్యాడు. 2022లో మాత్రం థియేటర్స్ ద్వారానే ప్రేక్షకులను పలకరించడానికి ఫిక్స్ అయ్యాడు. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 మూవీని ఏప్రిల్ 29న రిలీజ్ థియేటర్స్‌లో చేస్తున్నారు. మరోసారి వెంకీ, వరుణ్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ వెండితెరపై చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ తర్వాత వెంకటేష్ చేయబోయే కొత్త సినిమా పై సస్పెన్స్ కొనసాగుతోంది. త్రివిక్రమ్ ఒకటి, తరుణ్ భాస్క్ర్లో మరో సినిమా చేయాల్సి ఉన్నా.. ప్రస్తుతానికి ఏ డైరెక్టర్ మూవీ ఖరారు కాలేదని ఇటీవలే వెంకీ స్వయంగా చెప్పుకొచ్చాడు.పైగా నచ్చిన కథలు వచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తానంటున్నాడు విక్టరీ. మరో వైపు నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ నటిస్తున్న వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో రానాతో కలసి నటిస్తున్నాడు. మరి 2022లో వెంకీ మామ ప్లాన్ ఏంటి? తదుపరి సినిమా ఏ డైరెక్టర్‌తో చేస్తాడో వేచి చూడాలి. -
టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హంగామా
-
మహేశ్‌బాబుపై రాజమౌళి ప్రశంసల వర్షం.. కారణం ఇదే
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుపై దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు మహేశ్ తీసుకున్న చొరవ అభినందనీయం అని కొనియాడారు. మహేశ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఎఫ్ 3 మూవీ టీమ్‌ని కూడా అభినందించాడు. కాగా, పాన్ ఇండియా మూవీస్ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ విడుదలను దృష్టిలో పెట్టికొని మహేశ్.. తాను హీరోగా నటిస్తున్న ‘‘సర్కారువారి పాట’ను 2022 సంక్రాంతి నుంచి ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే సీజన్లో విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’, ఎఫ్3 చిత్రాలు కూడా విడుదల తేదీలను మార్చుకున్నాయి. .@urstrulyMahesh was the one who took the initative in decluttering the Pongal releases... Even though #SarkaruVaariPaata was a perfect Pongal film, he moved it to summer and created a healthy atmosphere. Thanks to my Hero 🙂 and also to the entire team at @MythriOfficial… — rajamouli ss (@ssrajamouli) December 21, 2021 ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కి, ‘ఎఫ్ 3’ చిత్రాలను ఏప్రిల్ 29కి వాయిదా వేశారు. ఈ మూడు చిత్రాల మేకర్స్ తీసుకున్న నిర్ణయంపై రాజమౌళి హర్షం వ్యక్తం చేశాడు. ‘సంక్రాంతి సీజన్‌కు రావాల్సిన సరైన సినిమా ‘సర్కారు వారి పాట’. కానీ చిత్ర సీమలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మహేశ్ బాబు తన చిత్రాన్ని వేసవికి వాయిదా వేసుకున్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసేందుకు మహేశ్ తీసుకున్న చొరవ అభినందనీయం’అని రాజమౌళి ట్వీట్ చేశాడు. అలాగే భీమ్లా నాయక్, ఎఫ్3 బృందాలకు కూడా ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. The decision by Chinababu garu and Pawan Kalyan garu to defer the release date of #BheemlaNayak is well appreciated. Wishing the team all the very best…:) — rajamouli ss (@ssrajamouli) December 21, 2021 ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం.. 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమరమ్ భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి ఆలియాభట్ నటించగా, తారక్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. Also, thanks to Dil Raju garu and the #F3Movie team for shifting the release of their film. Best wishes ! @SVC_official — rajamouli ss (@ssrajamouli) December 21, 2021 -
మరోసారి వాయిదా పడ్డ ఎఫ్ 3 మూవీ, సమ్మర్లో ఈ నవ్వుల పండగ..
Venkatesh Daggubati And Varun Tej F3 Movie Release Date Postponed Again: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించగా.. ఆ తర్వాత ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. చదవండి: వెనక్కి తగ్గిన భీమ్లానాయక్, విడుదల తేదీ వాయిదా తాజాగా ఇదే తేదీకి భీమ్లా నాయక్‌ను వాయిదా వేయడంతో ఎఫ్ 3 మూవీని మరోసారి వాయిదా వేశారు మేకర్స్. సమ్మర్‌కు రిలీజ్ చేయబోతున్నామంటూ తాజా విడుదల తేదీని ప్రకటించారు. నవ్వల పండగ వచ్చే ఏడాది సమ్మర్లో అంటూ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు విడుదల తేదీని వెల్లడించారు. ‘నవ్వుల పండగా ఇప్పుడు సమ్మర్లో.. ఏప్రిల్ 29న విడుదల, గెట్ రెడీ ఫర్ సమ్మర్ సోగాళ్లు’ అంటూ ఎఫ్ 3 మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. కాగా ఈ సినిమాకు.. ఎఫ్ 2 స్టోరీకి ఏమాత్రం సంబంధం ఉండదు అని గతంలోనే అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ త్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. చదవండి: పుష్ప స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్, సెక్సీగా కనిపించాలంటే.. నవ్వుల పండుగ ఇప్పుడు వేసవి లో ☀️😎😃 The Ultimate Fun Franchise #F3Movie on 𝟐𝟗𝐭𝐡 𝐀𝐩𝐫𝐢𝐥, 𝟐𝟎𝟐𝟐 😎💥 Get Ready for సమ్మర్ సోగ్గాళ్ల సందడి 👬#F3OnApril29th@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP @SVC_official @f3_movie pic.twitter.com/pDTzCjANww — Sri Venkateswara Creations (@SVC_official) December 21, 2021 -
టాలీవుడ్ సీక్వెల్స్‌కు అడ్డాగా 2022.. కొత్త ఏడాదిలో వచ్చే చిత్రాలివే!
2022 టాలీవుడ్ సీక్వెల్స్ కు అడ్డాగా మారనుంది. అన్ని కుదిరితే సంక్రాంతి నుంచే సీక్వెల్ సినిమాల హంగామా మొదలు కానుంది. సంక్రాంతికి వచ్చేందుకు నాగార్జున సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. 2016 సంక్రాంతి సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా వస్తోంది బంగార్రాజు. చాలా ఏళ్లుగా దర్శకుడు కళ్యాణ కృష్ణ సిద్దం చేసిన కథ ఇది. సీక్వెల్లో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2కు, 2022 ఫిబ్రవరిలో సీక్వెల్ రానుంది. నిజానికి ఈ సీక్వెల్ ను సంక్రాంతి రిలీజ్ చేయాలనుకున్నారు. కాని ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాల మధ్య విడుదల అంత మంచిది కాదని, ఫిబ్రవరి 25న ఎఫ్ 3 సోలోగా రిలీజ్ చేస్తున్నారు. 2020 స్లీపర్ హిట్ హిట్ కు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్ 2లో హీరో మారిపోయాడు.ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ ఒక కేస్ ను సాల్వ్ చేసాడు. ఇప్పుడు సీక్వెల్లో ఆ డ్యూటీని అడివి శేష్ తీసుకున్నాడు. సెకండ్ పార్ట్ ను కూడా మొదటి భాగాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను డీల్ చేస్తున్నాడు. కేడీ అనే కూల్ కాప్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు శేష్. ఈ లిస్ట్ లో ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. కార్తికేయ 2 ఆల్రెడీ సెట్స్ పై ఉంది. మంచు విష్ణు మరోసారి ఢీ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీనువైట్ల మేకింగ్ లో డి అండ్ డి అనే సినిమా చేయనున్నాడు.ఇయర్ ఎండ్ కు మరోసారి పుష్ప తిరిగిరానున్నాడు. అలాగే గూఢచారి 2 కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలన్ని వచ్చే ఏడాది ప్రేత్రక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
చార్మినార్ వద్ద వెంకటేశ్, వరుణ్ తేజ్ సందడి
చార్మినార్ దగ్గర వెంకటేశ్, వరుణ్ తేజ్ చిందులేస్తున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్ 3’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: బన్నీ ఇండస్ట్రీకి దొరికిన ఓ బహుమతి: రాజమౌళి 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఎఫ్ 3’ మూవీ ప్రస్తుతం హైదారాబాద్‌లోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఓ పాట చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల కానుంది.