
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 2019 లో సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించిన ‘ఎఫ్2’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్‌కి మంచి స్పందన విచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నీ కోర మీసం చూస్తుంటే...నువ్వట్టా తిప్పేస్తుంటే... ఊ ఆ అహా అహా! నీ మ్యాన్లీ లుక్కేచూస్తుంటే... మూన్ వాక్ చేసే నా హార్టే' 'ఊ ఆ అహా అహా!' అంటూ ఈ సాంగ్ సాగింది. ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ , దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సునిధి చౌహాన్ , లవితా లోబో, సాగర్,ఎస్పీ అభిషేక్ అద్భుతంగా ఆలపించారు. తమన్నా, మెహ్రీన్ గ్లామర్, స్పెసీ డాన్స్‌తో పాట ఉర్రూతలు ఊగిస్తుంది. చీర కట్టుతో పాటు పాశ్చాత్య దుస్తుల్లోనూ హాట్ హాట్‌గా కనిపించి, కనువిందు చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment