Anil Ravipudi Talk About Venkatesh And Varun Tej F3 Movie - Sakshi
Sakshi News home page

F3: నత్తి.. ఒత్తిడి తెచ్చింది.. వరుణ్‌ని చూసి సర్‌ప్రైజ్‌ అవుతారు: అనిల్‌ రావిపూడి

Published Wed, May 25 2022 4:41 PM | Last Updated on Wed, May 25 2022 7:03 PM

Anil Ravipudi Talk About Venkatesh And Varun Tej F3 Movie - Sakshi

కొన్ని సినిమాలు చేయడానికి హీరోలు ఇమేజ్‌ దాటి రావాలి. బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌ లాంటి హీరోలు స్టార్‌డమ్‌ పక్కనపెట్టి ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. టాలీవుడ్‌కు లక్కీగా వెంకటేశ్‌ దొరికారు. ఆయన బోర్డర్‌ దాటి కూడా కొన్ని సీన్స్‌ చేసేస్తాడు. కామెడీ సినిమాలు చేసేటప్పుడు అలానే ఉండాలి. ఎఫ్‌3లో వెంకటేశ్‌ గారి రేచీకటి ట్రాక్‌ చాలా బాగుంటుంది’అని యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి అన్నారు. విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎఫ్‌3’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనిల్‌ రావిపూడి మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు..


మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్‌గా ఎఫ్‌3
ఎఫ్ 2లో  ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ తో కొత్త కథ చెప్పాం. అందులో భార్యభర్తల ఫస్ట్రేషన్  ఉంటే ఎఫ్ 3లో మనీ  ఫస్ట్రేషన్. ఇది ఇంకా కనెక్ట్ అయ్యే పాయింట్. డబ్బు చుట్టూ వుండే ఆశ అత్యాశ కుట్ర మోసం ఇవన్నీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యాయి. ఎఫ్ 2 సక్సెస్ తో ఆర్టిస్టలందరూ మంచి ఎనర్జీతో పని చేశారు. సునీల్, మురళీ శర్మ, అలీ గారు ఇలా కొంత మంది ఆర్టిస్ట్ లు  కొత్తగా యాడ్ అయ్యారు.  మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్ గా ఎఫ్‌3 ఉంటుంది. 

నత్తి..చాలా ఇబ్బంది తెచ్చింది
ఎఫ్ 2 నుంచి ఎఫ్ 3కి వచ్చేసరికి అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. ఫన్ డోస్ పెంచడానికి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ చేయగలం. అందుకే వెంకటేశ్‌కు రేచీకటి, వరుణ్‌తో నత్తి యాడ్‌ చేశాం. అయితే  అవే క్యారెక్టరైజేషన్స్ ప్రధానంగా సినిమా  ఉండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం, వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా దాదాపు ముఫ్ఫై చోట్ల ఆ మ్యానరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా  ఉంటుంది. ఇది నిజంగా చాలెజింగ్ అనిపించింది. మాట అడ్డుపడినప్పుడల్లా కొత్త మ్యానరిజం చేయాలి. అనుకున్నపుడు ఈజీగా అనిపించింది కానీ ప్రాక్టికల్ గా చాలా కష్టమైంది.  ప్రతిసారి కొత్త మ్యానరిజం అంటే.. సీన్ కంటే ఎలాంటి మ్యానరిజం ఇవ్వాలనే ఒత్తిడి ఎక్కువ ఉండేది.

 ఎఫ్‌4లో మూడో హీరో
ఎఫ్ 2 ఫినిష్ అయ్యాక ఎఫ్ 3 గురించి అలోచించినపుడు మూడో హీరో ఆలోచన వచ్చింది. అయితే అది ట్రంప్ కార్డు . అది ఇప్పుడే వాడేస్తే మళ్ళీ వాడుకోవడానికి ఏమీ  ఉండదు. అందుకే ఆ ఐడియాని పక్కన పెట్టేశాం. ఎఫ్ 2 స్టార్ కాస్ట్ తోనే వీలైనంత ఫన్ జనరేట్ చేశాం. ఐతే మూడో హీరో కార్డు మాత్రం ఎఫ్ 4లో కానీ తర్వాత సినిమాలో కానీ తప్పకుండా వాడాలి.  

తేడాలు ఉన్నాయి
ఎఫ్‌2లోని పాత్రలు ఎలా ప్రవర్తిసాయో.. ఎఫ్‌3లోనూ అలానే ఉంటాయి. అయితే ఎఫ్ 2లో వెంకటేష్ గారికి ఫ్యామిలీ లేదు. ఇందులో  ఉంటుంది. ఎఫ్  2లో వరుణ్ కి ఫ్యామిలీ వుంది. ఇందులో లేదు. ఇలా ప్రతిచోట మీకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 

క్లైమాక్స్‌తో అందరూ కనెక్ట్‌ అవుతారు
ఈ చిత్రంలో హీరోయిన్స్ అనే కాదు.. ప్రతి పాత్ర అత్యాశ గానే  ఉంటుంది. డబ్బు ఎలా త్వరగా సంపాయించాలనే ఆశతోనే  ఉంటారు. వారి ప్రయత్నాల్లో జరిగే ఫన్ ఇందులో ఉంటుంది. ఎంత ఫన్ ఉంటుందో అంత మంచి కంటెంట్ వుంటుంది. ఎఫ్ 2లో ఇచ్చిన ముగింపు అందరికీ నచ్చింది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది. డబ్బుతో మనం ఎలా ఉండాలనేది చెప్తాం. ఈ కంటెంట్ కి అందరూ కనెక్ట్ అవుతారు.

వింటేజ్‌ సునీల్‌ని చూస్తారు
ఈ చిత్రంలో ఉండే  నటులు ఆ పాత్రలకు వారే కరెక్ట్ అనిపించింది. సునీల్ గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ళ తర్వాత ఆయన హిలేరియస్ రోల్ చేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ సునీల్ ని చూస్తాం. అలీ గారిది కూడా అద్భుతమైన పాత్ర. టెర్రిఫిక్ గా చేశారు. ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేయడానికి చాలా కష్టపడ్డాం. కార్వాన్ లన్నీ చూస్తే మినీ మియాపూర్ బస్ డిపోలా వుండేది. ఎవరు ముందు వస్తే వాళ్ళ షాట్ తీసుకుంటూ వెళ్లేవాళ్లం. అన్నపూర్ణ గారు, వై విజయ గారు కొంచెం త్వరగా వస్తారు. వాళ్ళ షాట్స్ ముందే తీసేవాళ్ళం. కరోనా సమయంలో వాళ్ళపై ఎక్కువ కేర్ తీసుకున్నాం. వెంకటేష్ గారు ఇంకా కేరింగ్‌గా ఉంటారు. మా టీంలో ఆయనొక్కరినే కరోనా టచ్ చేయలేదు. 

కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది 
పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత  ఎఫ్‌3లో పూజా యాడ్ అయింది. ముగ్గురు హీరోయిన్స్ తో 'ఊ హ ఆహా ఆహా' పాటని తీశాం. తర్వాత వచ్చే సెలబ్రేషన్స్ పాట కొంచెం స్పెషల్ గా ఉండాలని  ఒక స్టార్ హీరోయిన్ గెస్ట్ గా వస్తే బావుంటుదని భావించాం. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది తను.

నత్తి కొత్తగా అనిపించింది
 జంధ్యాల గారి ఆహా నా పెళ్ళాంట సినిమాలో బ్రహ్మానందం గారు చేసిన పాత్ర నా ఫేవరేట్. నత్తిని ఒక హీరో పాత్రకి యాడ్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. దీనిపై ఎవరైనా వివాదం చేస్తే ‘ఆహా నా పెళ్లంట’ ప్రేరణతోనే చేశాని చెబుతా(నవ్వుతూ..). నత్తి అనేది పోషకార లోపం వల్ల వచ్చిందని సినిమాలో చూపించాం.  

దిల్‌ రాజుతో చాలా కంఫర్ట్‌బుల్‌
దిల్ రాజుగారితో ప్రయాణం కంఫర్ట్ బుల్ గా ఉంటుంది. నాకు ఏం కావాలో ఆయనకి తెలుసు. ఒక ఫోన్ కాల్ తో పనైపొద్ది. దిల్ రాజు గారి సినిమా అంటే నాకు హోం బ్యానర్ లాంటింది. 

అలా చేస్తే ప్లాప్‌ నుంచి బయటపడతాం
 నేను మాస్ సినిమాలు చేయలానే ఇండస్ట్రీకి వచ్చాను. అయితే కామెడీ ఉంటేనే నా సినిమా ఫుల్ ఫిల్ అవుతుంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ .. ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్  ఉందో అంత కామెడీ  వర్క్ అవుట్ అయ్యింది. ఇంకా లార్జ్ స్కేల్ ఆడియన్స్ కి రీచ్ కావాలని ఎఫ్ 2 ని ఒక స్ట్రాటజీ ప్రకారం చేశాను. ఎఫ్ 2 ఓవర్సిస్ లో 2 మిలియన్ కొట్టింది. ఎక్కడ ఖాళీ ఉందో చూస్తూ సినిమాలు చేయాలి. ఎఫ్ 2తో ఒక కామెడీ బ్రాండ్ వచ్చేసింది.

దాన్ని సరిచూసుకోవడానికి సరిలేరు నీకెవ్వరు లో ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకున్నాం. అది ఫుల్ యాక్షన్ మాస్ సినిమా. ఇప్పుడు ఎఫ్ 3తో మళ్ళీ ఫ్యామిలీ సినిమా చేశాం. తర్వాత చేయబోయే బాలయ్యగారి సినిమా మాస్. సినిమాకి సినిమాకి డిఫరెన్స్ చూపించుకుంటూ వెళితే ఫస్ట్ మనం బోర్ కొట్టం. మార్కెట్ లో ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేదాని చెక్ చేసుకున్నట్లయితే ఫ్లాప్ అవ్వాకుండా బయటపడవచ్చు. అది తర్వాత ఎంత హిట్ అవుతుందనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. 

అందుకే టికెట్ల రేట్లు పెంచలేదు
 ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళడానికి వీలుగా  ఉంటే ఒకటికి రెండుసార్లు చూస్తారు. నిజానికి ఎఫ్ 3కి కూడా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయితే టికెట్ ధర ఆడియన్స్ కి కంఫర్ట్ గా ఉండటం ముఖ్యం. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. 

వరుణ్‌ని చూసి సర్‌ప్రైజ్‌ అవుతారు
ఎఫ్ 2తో పోల్చుకుంటే ఎఫ్ 3లో వెంకటేశ్‌, వరుణ్‌లతో  పని చేయడంలో ఇంకా కంఫర్ట్ పెరిగింది. ఎఫ్‌3తో వరుణ్‌, వెంకటేశ్‌  బాగా క్లోజ్ అయ్యారు. ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలనే దానిపై వాళ్ళమధ్య ఒక అండర్ స్టాడింగ్ వచ్చింది. వరుణ్ తేజ్ కామెడీ పరంగా ఇందులో అద్భుతంగా చేశారు. మీరు చాలా సర్‌ప్రైజ్‌ అవుతారు. వెంకటేష్ గారికి ధీటుగా చేశారు వరుణ్ తేజ్. 

మరింత ఫవర్‌ఫుల్‌ పాత్రలో బాలయ్య
సెప్టెంబర్- అక్టోబర్ లో బాలయ్య సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాం.బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే  సినిమా  ఉంటుంది. ఫన్ ఉంటుంది కానీ అంత బిగ్గర్ గా వుండదు. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement