F3 Movie 2nd Day Box Office Collection - Sakshi
Sakshi News home page

F3 Box Office Collection: ఎఫ్‌3 రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే..

Published Sun, May 29 2022 2:25 PM | Last Updated on Sun, May 29 2022 3:39 PM

F3 Movie Second Day Box Office Collection - Sakshi

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ మల్టీస్టారర్‌గా, అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ఎఫ్‌3. మే 27న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోష్‌ని కనబరిచింది. రెండో రోజు ఈ చిత్రం 9.85కోట్ల షేర్‌ రాబట్టింది.

(చదవండి: ఎఫ్‌3 మూవీ రివ్యూ)

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో రోజు రూ.8.4 కోట్లను వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు రూ.18.77 కోట్ల షేర్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ ఎఫ్‌3కి మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలో ఈ చిత్రం 750కే డాలర్లను రాబట్టింది. వారాంతంలో ఈ చిత్రం అక్కడ 1 మిలియన్‌ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్డాలు అంచనా వేస్తున్నాయి.

ఎఫ్‌3 రెండు రోజుల కలెక్షన్స్‌:

► నైజాం - 8.16 కోట్లు

► సీడెడ్ - 2.38 కోట్లు 

► ఈస్ట్ - 1.28 కోట్లు

► వెస్ట్ - 1.22 కోట్లు

► ఉత్త‌రాంధ్ర - 2.22 కోట్లు

► గుంటూరు- 1.42 కోట్లు

► కృష్ణా - 1.17 కోట్లు

► నెల్లూరు - 85 లక్షలు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- 1.20 కోట్లు

►ఓవర్సీస్‌-3.60 కోట్లు

►మొత్తం 23.50 కోట్లు(షేర్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement