F3 Movie OTT Release Update: F3 Movie Not To Release On OTT Before 8 Weeks Of Theatrical Run - Sakshi
Sakshi News home page

F3 Movie: ఎఫ్‌ 3 ఓటీటీకి వచ్చేది అప్పుడేనట, మూవీ టీం క్లారిటీ

Published Thu, Jun 2 2022 3:49 PM | Last Updated on Thu, Jun 2 2022 8:30 PM

F3 Movie Not To Release On OTT Before 8 Weeks Of Theatrical Run - Sakshi

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన తాజా చిత్ర ఎఫ్‌3. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్‌, మురళీ శర్మ, అలీ, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే 27)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ 3 చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుండటంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.

చదవండి: OTT: 3 వారాలకే అమెజాన్‌లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్‌, కానీ..

ఇప్పటికే ఈ సినిమా రిలీజై 6 రోజులు అవుతున్న థియేటర్లో ఏమాత్రం ఈమూవీ క్రేజ్‌ తగ్గలేదు. వసూళ్ల పరంగా కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.46 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తి ఎదురు చూసే వారు కూడా లేకపోలేరు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెల రోజుల్లో డిజిటల్‌ వేదికగా చూడోచ్చులే అని ధీమాగా ఉండి ఉంటారు కొందరు. అలాంటి వారికి తాజాగా ఎఫ్‌ 3 టీం షాకిచ్చింది.

చదవండి: మేనేజర్‌ను ఒంటరిగా కలిస్తే ఎక్కువ డబ్బులిస్తామన్నారు

అప్పుడే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేసే చాన్సే లేదని చెప్పేశారు. ఈ మేరకు దర్శకుడు అనిల్‌ రావిపూడి, హీరోలు వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌లు వీడియో రిలీజ్‌ చేశారు. ఎఫ్‌ 3 మూవీని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ మూవీని థియేటర్లో చూడని వారు ఓటీటీలో చూడొచ్చని అనుకుంటున్నారేమో.. కానీ మరో 8 వారాల వరకు ఎఫ్‌ 3 ఓటీటీకి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే. ఈ మూవీ థియేట్రికల్‌ రన్‌కు రెండు నెలలకు ముందుగా ఎఫ్ 3 డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేది లేదని వారు తేల్చిచెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement