Hero Venkatesh Talks About F3 Movie Story - Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా చిత్రాలపై వెంకటేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, May 24 2022 6:54 PM | Last Updated on Wed, May 25 2022 1:23 PM

Venkatesh Talk About F3 Movie - Sakshi

‘ప్రతి సినిమా నా తొలి మూవీలాగే భావిస్తా. ఎఫ్‌-3 కూడా అలానే చేశా. కామెడీ చేయడం నాకు ఇష్ఠం.  హీరో పాత్ర ఇలా ఉండాలి..అలా ఉండాలి అని అనుకోను. ప్రతి సినిమా ఎంజాయ్‌ చేస్తూ చేస్తాను’ అని విక్టరీ వెంకటేశ్‌ అన్నాడు. మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్‌తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్‌ మూవీ ఎఫ్‌-3.అనిల్‌ రావిపూడి దర్శకుడు.  దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్‌  మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు..

అనుకోకుండా నా గత రెండు చిత్రాలు(నారప్ప, దృశ్యం-2) ఓటీటీలో వచ్చాయి. రెండేళ్ల తర్వాత థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. గుంపుగా సినిమా చూస్తే వచ్చే కిక్‌ వేరు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు బిగ్‌స్క్రీన్‌పై చూస్తే బాగుంటుంది. ఎఫ్‌-3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా. అందరికి నచ్చుతుంది

► కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. స్నేహితులతో కానీ, ఇంట్లో కానీ నేను జోకర్‌గానే ఉంటాను. 

► అనిల్‌ రావిపూడి రచన నాకు చాలా ఇష్టం. ఆయన పాత్రలను చాలా నేచురల్‌గా తీర్చిదిద్దుతాడు. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఈవీవీ గారి మాదిరే అనిల్‌ కామెడీ బాగా పండిస్తాడు. అనిల్‌ నుంచి చాలా నేర్చుకున్నా. 

► మన చుట్టూ ఉన్న జనాలను చూసే నేను అన్ని నేర్చుకుంటా. ఎఫ్‌-3లో కామెడీ చాలా బాగుంటుంది. డిఫరెంట్‌ వాయిస్‌ యూజ్‌ చేశా. 

► ఈ సినిమాలో రేచీకటి పాత్రను పోషించాను. అలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. సినిమా మొత్తం రేచీకటి ఉండదు. కొంతవరకు మాత్రమే ఉంటుంది. కథలో భాగంగా ఈ చిత్రంలో నా పాత్రకు రేచీకటి ఉంటుంది. 

► ఎఫ్‌3 ఏ స్థాయిలో హిట్‌ అవుతుందో నేను చెప్పలేను కానీ..ఎఫ్‌2 కంటే హిలేరియస్‌గా ఉంటుందని మాత్రం చెప్తా.

► ఈ జానర్‌ సినిమాలే చేయాలని ఏమి అనుకోలేదు. ఆడియన్స్‌కు ఏం ఇష్టమో అది ఇస్తే చాలు. వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోవాలి అంతే. దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పని చేసుకుంటూ వెళ్లాలి. 

► కోవిడ్‌ తర్వాత ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది. రానాతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేశా. కోవిడ్‌ టైంలో ఖాలీగా ఉండడంతో.. ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌ చేశా. అది చాలా చాలెంజింగ్‌ అనిపించింది. త్వరలోనే వెబ్‌సిరీస్‌లోని నా లుక్‌ విడుదల కాబోతుంది.

► సల్మాన్‌ఖాన్‌తో తీయబోయే చిత్రంలో బ్రదర్‌ పాత్రని పోషిస్తున్నాను. 

► మల్టీస్టారర్‌ చిత్రాలకు నేను ఎప్పటికీ సిద్దంగానే ఉంటాను. మంచి కథ దొరికితే ఏ హీరోతోనైనా కలిసి నటిస్తా.

► బాక్సాఫీస్‌ నెంబర్లను నేను నమ్మను. కానీ నిర్మాతలకు లాభాలు రావాలని ఆశిస్తాను.అలాగే ఫ్యాన్స్‌ని, అడియన్స్‌ని అలరిస్తే చాలు అనుకుంటా. ప్రతి సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటాను.

► సెట్‌లో నేను నిర్మాత మాదిరే ఆలోచిస్తాను. ఏదైనా వృధా అయితే చాలా బాధ కలుగుతుంది. సినిమా షూటింగ్‌కు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం నసగా ఉంటంది. కానీ మూవీ హిట్‌ అయితే మాత్రం అవన్నీ మర్చిపోతారు. 

► పాన్‌ ఇండియా చిత్రాలు అనేది కేవలం బిజినెస్‌ మాత్రమే. నా సినిమాకు పాన్‌ ఇండియా స్థాయి మార్కెట్‌ ఉందనుకుంటే..అంతటా విడుదల చేస్తారు. లేదంటే ఇక్కడే రిలీజ్‌ చేస్తారు. పాన్‌ ఇండియా స్థాయి కథలు వస్తే.. నేను చేయడానికి సిద్దమే.

► టాక్‌ షోలకు హోస్టింగ్‌గా చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు అది సెట్‌ కాదు. ఒక్క సీన్‌ మళ్లీ మళ్లీ చేయడం నాకు కష్టం. సింగిల్‌ టేక్‌ యాక్టర్‌గా ఉండడమే నాకు ఇష్టం.

► కోవిడ్‌ టైమ్‌లో షూటింగ్స్‌ చాలా కష్టంగా జరిగాయి. మన ముందు ఉన్న ఆర్టిస్ట్‌కు కరోనా ఉందో లేదో తెలియదు. మేము ఏమో మాస్క్‌ తీసి డైలాగ్స్‌ చెప్పాలి. చాలా భయమేసేది. షూటింగ్‌ అయిపోగానే క్యారివాన్‌లోకి వెళ్లి ఆవిరి పట్టేవాడిని. ఈ రెండేన్నరేళ్లలో నేను కోవిడ్‌ బారిన పడలేదు. నేను ఇప్పటికీ మాస్కులు ధరిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గుంపులు ఉన్నప్పుడు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తేనే మంచిదని నా భావన.

► వివేకానంద బయోపిక్‌ తీయాలనుకున్నాడు కానీ ఇప్పటీకీ కుదరలేదు. ఇప్పుడు బయోపిక్‌ తీయాలని లేదు. నాన్నగారి(ప్రముఖ నిర్మాత రామానాయుడు) బయోపిక్‌ స్క్రిప్ట్‌ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను. 

► ఎఫ్‌2లో మాదిరి ఎఫ్‌3లో ఎలాంటి కొత్త ఆసనాలు ఉండవు. కానీ కామెడీ మాత్రం అంతకు మించి ఉంటుంది. ప్రతి సన్నీవేశం నవ్వులు పూయిస్తాయి. ఈ జనరేషన్‌ పిల్లలను కూడా అలరించడం అదృష్టంగా భావిస్తున్నాను.

► దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

► నేను సెట్స్‌కి వెళ్లగానే నిర్మాతగానే ఆలోచిస్తా. ప్లానింగ్‌ సరిగ్గా లేకుంటే షూటింగ్‌ లేట్‌ అయి, డబ్బులు వృథా అవుతాయి. ప్లానింగ్‌ విషయంలో అందరూ కరెక్టుగా పని చేయాలి.. ‘పాన్‌ ఇండియా’ అన్నది బిజినెస్‌ మాత్రమే. దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించను. 

ప్రస్తుతం నేను, రానా చేస్తోన్న ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ పూర్తి కావస్తోంది. అలాగే సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. త్రివిక్రమ్‌తో సినిమా చర్చలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement