‘ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన మూవీ. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం’అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు..
ఎఫ్ 3 స్టోరీ గురించి అనిల్ రావిపూడి మీకు ఎప్పుడు చెప్పారు ?
ఎఫ్ 2 విడుదలకు ముందే అనిల్ కు ఎఫ్ 3 ఐడియా వచ్చింది. ఎఫ్ 2పెద్ద హిట్ అయితే ఎఫ్ 3 చేద్దామని చెప్పారు. మేము అనుకున్నట్లే ఎఫ్ 2 పెద్ద విజయం సాధించింది. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత స్క్రిప్ట్ ని పూర్తి చేసి నటీనటులందరినీ మళ్ళీ ఒక్కదగ్గరి చేర్చి సెట్స్ పైకి వెళ్లాం. ఎఫ్ 3 కథ చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో సినిమా చూసిన తర్వాత దానికి మించిన నవ్వుకున్నాను. ఎఫ్ 3 నాన్ స్టాప్ ఎంటర్ టైనర్, కంప్లీట్ ఫన్ రైడ్.
ఎఫ్ 2 తో పోల్చుకుంటే ఎఫ్ 3 లో ఎలాంటి ఫన్ వుంటుంది ?
ఎఫ్ 2లో ప్రేమ, పెళ్లి.. అందులో వున్న ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపించి చివరికి భార్యల పాయింట్ ఆఫ్ వ్యూ ని కూడా చూడాలని చెప్పి అందరికీ నచ్చేలాగ ఎఫ్2ని హ్యుమరస్ గా చేశాం. ఎఫ్ 3 విషయానికి వస్తే.. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి.. ఇవి పంచభూతాలు. ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. ఈ పంచభూతాలతో పాటు ఆరో భూతం డబ్బు కూడా మనిషి బ్రతకడానికి అంతే అవసరం. డబ్బు లేకుండా మనిషి బ్రతకలేడు. చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి మనిషి బ్రతకడానికి డబ్బు ఈ రోజు తప్పనిసరైపోయింది.
బంధాలు, బిజినెస్సులు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగేకథ ఎఫ్ 3. అనిల్ అద్భుతంగా రాశాడు, తీశాడు. అనిల్ లో నాకు నచ్చే అంశం కథ కంటే కధనం పై ఎక్కువ ద్రుష్టి పెడతాడు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తున్నామా లేదా అని చూస్తాడు. ఎఫ్ 3 ఆర్టిస్టులకు భోనంజా లాంటింది. ఇంతమంది ఆర్టిస్ట్ లని పెట్టుకొని అద్భుతమైన ఫన్ క్రియేట్ చేశాడు అనిల్. సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ప్రేక్షకుడిగా ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. సినిమా రన్ టైం 2గంటల 28నిమిషాలు వుంటుంది. ఇందులో 90 నిమిషాలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు. అంత ఫన్ రైడ్ గా వుంటుంది.
సినిమా టికెట్ల రేట్లని పెంచకుండా యాధాతధంగా ఉంచడానికి కారణం ?
కరోనా ప్యాండమిక్ తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్ లు పెరిగాయి. ఇదే సమయంలో ఆడియన్స్ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. ఇందులో మంచి ఫలితాలు కూడా సాధించాం. ఐతే ఇక్కడ పరిశీలించిన అంశం ఏమిటంటే.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి దూరమౌతున్నారు. అలాగే రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్ కి రావడం తగ్గిపోవడం గమనించం. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం.
ధరలు తగ్గించిన దాని ప్రకారం మీ బడ్జెట్ ని రీచ్ కాగలరని భావిస్తున్నారా ?
నాకు థియేట్రికల్ రెవెన్యు కిక్ ఇస్తుంది. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూడటంలోనే ఒక ఆనందం ఉంటుంది. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్...సెకండ్ వీక్ ఇలా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడంలోనే ఒక కిక్ ఉంటుంది. ఎఫ్ 3 కి తప్పకుండా రిపీట్ ఆడియన్స్ వస్తారు. థియేటర్లు ఆడియన్స్ తో కళకళలాడుతాయి. ప్రేక్షకులు ఎఫ్ 3ని మళ్ళీ మళ్ళీ చూస్తారు.
ఎఫ్ 3ని పాన్ ఇండియా స్థాయిలో చేసే ఆలోచన రాలేదా ?
పాన్ ఇండియా విడుదల చేయాలంటే దానికి సేఫరేట్ గా హోం వర్క్ చేయాలి. బాలీవుడ్ లో కూడా ప్రేక్షకుడు థియేటర్ లోకి రావాలంటే స్క్రిప్ట్ దశ నుండే ప్లాన్ చేయాలి. ఎఫ్ 3వరకూ మాకు పాన్ ఇండియా ఆలోచలేదు.
మీ బ్యానర్ లో మార్వెల్ లాంటి సూపర్ హీరో సినిమాలు వచ్చే అవకాశం ఉందా ?
హాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. మార్వెల్, అవతార్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలే నిలబడుతున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్ మొదలైయింది. రాజమౌళి గారు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తో దీనికి శ్రీకారం చుట్టారు. మేము కూడా ఒక మూడు కథలపై పని చేస్తున్నాం. రెండేళ్ళలో ఒకటి, రెండు పెద్ద సినిమాలు మా బ్యానర్ నుండి ప్రకటించే అవకాశం వుంది.
ఎఫ్3 కి టికెట్ రేట్లు తగ్గించిన నేపధ్యంలో మంచి రెస్పాన్స్ వస్తే.. మిగతా సినిమాలు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యే అవకాశం ఉందా ?
మొన్న సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెరిగాయి. ఆ రేట్లు నేను పెంచానని విమర్శించారు. నైజంలో దిల్ రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారు. కానీ తెర వెనుక బోలెడు కథ ఉంటుంది. నిర్మాతలు, హీరోలు ఇలా బోలెడు లెక్కలు వుంటాయి. అందుకే టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట నేను ఒక అడుగు వేస్తున్నా. ఇది కనుక సక్సెస్ ఐతే అందరూ ఇదే ఫాలో అవుతారు. ప్రస్తుతానికి అందరూ ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
మల్టీ ప్లెక్స్ లో చార్జీలు ఎలా ఉండబోతున్నాయి ?
ప్రసాద్, జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీ ప్లెక్స్ 250 ప్లస్ జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ 250. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ 150ప్లస్ జీఎస్టీ.. జిల్లాలు జీఎస్టీ కలుపుతూ 150. 250లో మాకు వచ్చేది 25రుపాయిలే. ఇక థియేటర్ ఉండటం వలన ఎదో అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయనే అపోహ కూడా ఉంది. కర్నూల్ లో 15కోట్లు పెట్టి మల్టీ ప్లెక్స్ లో ఇన్వెస్ట్ చేశాం. పదేళ్ళు లీజు. పదిహేను కోట్లను వడ్డీతో సహా రిటర్న్ తెచ్చుకోవాలి. లెక్క చూసుకుంటే రూపాయి వడ్డీ వస్తుంది. పదిహేను కోట్ల మీద నెలకి పదిహేను లక్షలు వస్తుందని అనుకుందాం. కానీ పదేళ్ళలో ఈ పదిహేను కోట్లు పోయి జీరో అవుతుంది. దీని ప్రకారం చూసుకుంటే నష్టమే. మల్టీ ప్లెక్స్ అన్నిటిలో ఈ సమస్య వుంది. షేర్ మార్కెట్ కోసం కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న ఒక అపోహ ఇదంతా.
నైజాంలో మొత్తం 450 థియేటర్లు ఉన్నాయి. ఇందులో మా సంస్థకు 60 వున్నాయి. దిల్ రాజు నైజం మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడని చాలా మంది అంటారు. కానీ 60 థియేటర్లతో నేను కంట్రోల్ లో పెట్టుకునేది ఏమీ ఉండదు. కానీ మిగతా వాళ్ళు మా మాట ఎందుకు వింటారంటే.. ఎవరైనా రూపాయి డబ్బు మాకు అడ్వాన్స్ గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో వారి ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపోతారు. మాకు ఇచ్చిన డబ్బు అంత సేఫ్ గా వుంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిక్ గా మాకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్ గా వున్నా తప్పితే ఏదో కంట్రోల్ చేసి కాదు.
ఓటీటీలు కూడా పెద్ద సినిమాలకు ముందస్తు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి .. దీన్ని ఎలా చూస్తారు ?
ప్రేక్షకుడు ఇలా కూడా చూస్తాడా ? అని వాళ్ళు ఒక టెస్ట్ చేసుకుంటున్నారు.
ఎఫ్ 3లో మూడో ఎఫ్ కి మీనింగ్ అంటే ఏం చెప్తారు ?
ఫన్, ఫస్ట్రేషన్.. బీకాజ్ ఆఫ్ ఫైనాన్స్. ( నవ్వుతూ )
ఎఫ్ 4 ఉంటుందా ?
అనిల్ మంచి ఐడియా చెప్పాడు. నెక్స్ట్ వుంటుంది.
ఎఫ్3 ఐడియా వెంకటేష్, వరుణ్ తేజ్ కి చెప్పినపుడు వారి రియాక్షన్ ఏంటి ?
ఎఫ్ 2పెద్ద సక్సెస్. మళ్ళీ అదే కాంబినేషన్ లో సినిమా అంటే అందరూ ఎక్సయిట్ అయ్యారు.
వెంకటేష్ గారు మీతో ఎంత సరదాగా వుంటారు ,ఆయన మీకు ఇచ్చిన సర్ ప్రైజ్ ఏమైనా ఉందా?
'కలియుగ పాండవులు' సమయంలో నేను వెంకటేష్ గారికి ఫ్యాన్‌ని. వారం రోజులు ముందు టికెట్ బుక్ చేసుకొని సుదర్శన్ థియేటర్‌లో సినిమా చూశా. నువ్వు నాకు నచ్చావ్ సినిమా నైజంలో విడుదల చేసినప్పుడు ఆయనతో యాక్సస్ పెరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం మొదటిసారి కలిసి పని చేశాం. వెంకటేష్ గారు ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన హీరో. నిర్మాత కోసం ఎక్కువ ఆలోచిస్తారు. లొకేషన్ లో ఏదైనా వృధా అవుతుంటే తట్టుకోలేరు. రామానాయుడు గారు ఆయన నేర్పించిన గొప్ప లక్షణం అది. ఇక లొకేషన్ లో ఆయన చాలా హుషారుగా వుంటారు.
మొదటిసారి మీ బ్యానర్ సీక్వెల్ చేస్తున్నారు కదా .. ఎలా అనిపించింది ?
అనిల్ రావిపూడి చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశారు. ఎఫ్ 3లో పాత్రలు తీసుకొని కొత్త కథని చెప్పాడు. ఓ రెండు చోట్ల ఎఫ్2 గుర్తుకు వస్తుంది తప్పితే మిగతా అంతా ఫ్రెష్ గా ఉంటుంది. వెంకటేష్ కి రేచీకటి, వరుణ్ కి నత్తి ఇలా అన్నీ కొత్త ఎలిమెంట్స్ హిలేరియస్ గా చేర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment