F3 Movie Team Says Thanks To Audience For Made F3 Movie Biggest Hit, Deets Inside - Sakshi
Sakshi News home page

F3 Movie Team: ఎఫ్3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్

Published Fri, May 27 2022 7:40 PM | Last Updated on Fri, May 27 2022 8:08 PM

F3 Movie Team Thanks To Audience For Movie Biggest Hit - Sakshi

విక్టరి వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ తాజాగా నటించిన చిత్రం ఎఫ్‌ 3 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలై ఫస్ట్‌ షో నుంచే హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ 3 మూవీ సక్సెస్‌ టాక్‌ తెచ్చుకోవడంపై మూవీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం మూవీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌ రాజు, హీరోలు వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ 3 టీం ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు, యూనివర్షల్‌గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంది. 

హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. కుటుంమంతా కలిసొచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్‌కి వెళ్లి చూసిన సినిమా ఎఫ్ 3నే. దేవి థియేటర్లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్‌టైనర్ తీసుకునందుకు సంతోషంగా ఉంది. అనిల్ రావిపూడి ఎఫ్‌ 3కి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయాలి’ అని కోరుకున్నారు . 

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షకులు థియేటర్లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్ గారికి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్  ఇమేజ్ ఉండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో  వెంకటేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎఫ్ 3ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు.  ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి’ అని పేర్కొన్నారు. 

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ మూవీ మాకు చాలా ప్రత్యేకమైనంది. వెంకటేష్ గారి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement