‘‘నా సినిమా థియేటర్స్‌లో రిలీజై మూడేళ్లవుతోంది. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ ఓటీటీకి వెళ్లిపోయాయి. నా ఫ్యాన్స్ కొందరు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ సినిమా ఈ నెల 27న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నాపై ప్రేమను చూపిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ‘ఎఫ్ 3’ సినిమా మీ కోసమే... మీరందరూ థియేటర్స్‌కు వచ్చి ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ‘ఎఫ్ 2’ను హిట్ చేశారు. ‘ఎఫ్ 3’ కూడా హిట్ అవుతుంది. అనిల్ మంచి స్క్రిప్ట్‌తో సినిమా చేశాడు. వరుణ్ తేజ్ బాగా చేశాడు’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ‘ఫన్‌టాస్టిక్’ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా రోజులయింది. ‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ గ్లామర్‌గా ఉందంటే కారణం సాయి శ్రీరామ్‌గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఫిదా, ఎఫ్ 2 ఇప్పుడు ‘ఎఫ్ 3’.. ‘దిల్’ రాజుగారితో ఈ సినిమా నాకు ఓ హ్యాట్రిక్‌లా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ జనరేషన్‌లో అనిల్‌గారి కన్నా కామెడీని ఇంకా ఎవరూ బాగా తీయలేరని నాకు అనిపిస్తోంది. వెంకటేశ్‌గారు చాలా మల్టీస్టారర్ ఫిలింస్ చేశారు. కానీ ఆయనతో రెండోసారి వర్క్ చేసే అవకాశం నాకు మాత్రమే లభించింది’’ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’ సినిమాయే మాకు శత్రువు. ఎందుకంటే ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అందుకని ‘ఎఫ్ 2’కి మించిన వినోదాన్ని ‘ఎఫ్ 3’లో ఇచ్చేందుకు మేం స్క్రిప్ట్ నుంచే కష్టపడ్డాం. నవ్వడం చాలా ఈజీ. కానీ కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌గార్లను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. అందుకే ‘దిల్’ రాజుగారితో వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు 35మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరు లేకపోతే ‘ఎఫ్ 3’ లేదు. ఈ సినిమాలో గొప్ప కంటెంట్ కూడా ఉందని భావించి సోల్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. వరుణ్ తేజ్ నాకు ఓ బ్రదర్‌లాంటి వాడు. వరుణ్‌లో ఇంత మంచి కామెడీ టైమింగ్ ఉందా? అని ఆడియన్స్ అంటారు. వెంకటేశ్‌గారు స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. కానీ కామెడీ చేసేప్పుడు ఆయన ఇమేజ్‌ను పక్కన పెట్టి పెర్ఫార్మ్ చేస్తారు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. నవ్వలేకపోవడం ఒక రోగం. నవ్వించడం ఒక భోగం. రెండేళ్లు కరోనా పరిస్థితులను ఫేస్ చేశాం. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్‌లో చూసి హ్యాపీగా నవ్వుకోండి’’ అని అన్నారు.
‘ఎఫ్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’లోలానే వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు ‘ఎఫ్ 3’లోనూ అద్భుతంగా చేశారు. హీరోల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ‘ఎఫ్ 2’లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ‘ఎఫ్ 3’లో నలుగురు హీరోయిన్స్‌ని పెట్టారు అనిల్. రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ.. ఇలా ఫుల్‌ఫ్యాక్డ్‌గా ఉంది సినిమా. దేవిశ్రీకి మా బ్యానర్‌లో ఇది 13వ సినిమా. ‘ఎఫ్ 2’కు మించి ‘ఎఫ్ 3’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రామానాయుడుగారి తర్వాత ‘దిల్’ రాజుగారినే నేను మూవీ మొఘల్‌గా పిలుస్తాను. మనిషి జీవితంలో నవ్వుకు ఎంత అవసరం ఉందో చెప్పే సినిమా ‘ఎఫ్ 3’. 45 ఏళ్లుగా నేను నమ్మింది నవ్వునే. ఈ సినిమాలోని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్‌ను నవ్విస్తాయి. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సినిమా హిట్ కాకపోతే నేను ఇకపై మీ ముందు (ప్రేక్షకులు) నిలబడను’’ అన్నారు. ‘‘ఎఫ్ 3’ సినిమా చూస్తూ, నవ్వుతారు. అది మన ఇమ్యూనిటీని పెంచుతుంది’’ అన్నారు సునీల్.
‘‘పవన్ కల్యాణ్‌గారి ‘తమ్ముడు’ సినిమా తీసిన దర్శకుడు అరుణ్ ప్రసాద్ బాబాయ్ కొడుకే అనిల్ రావిపూడి. అనిల్ అనే మొక్కను ‘దిల్’ రాజు పెంచారు. ఈ చెట్టు నీడ కింద ఇప్పుడు చాలా మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీలోని అందరూ బాగుంటారు. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్‌లోనే చూడాలని కోరుతున్నాను’’ అన్నారు అలీ. వై. విజయ, ప్రగతి, తులసి, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రదీప్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి 👉🏾 బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫైనల్ విన్నర్ బిందు మాధవి..
విజయ్ దేవరకొండతో సమంత లిప్‌లాక్ సీన్ ?
Comments
Please login to add a commentAdd a comment