ఇన్నాళ్ల కెరీర్‌లో ఆ సినిమా కష్టమనిపించింది: ఎడిటర్‌ | Editor Tammiraju About F3 Movie, Anil Ravipudi, Dil Raju | Sakshi
Sakshi News home page

F3 Movie: నేను కథ వినను, ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గర వాదనలు జరుగుతాయి

Published Tue, May 3 2022 4:27 PM | Last Updated on Tue, May 3 2022 4:27 PM

Editor Tammiraju About F3 Movie, Anil Ravipudi, Dil Raju - Sakshi

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్న క్రమంలో ఈ చిత్రానికి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న 'ఎఫ్ 3' విశేషాలు..

► మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది?
నేను పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 1998లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిడ్ ఎడిటర్‌గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత ప్రసాద్ ల్యాబ్‌లో 14ఏళ్ల పాటు ఆవిడ్ ఎడిటర్‌గా చేశాను. దర్శకుడు రాజమౌళి గారితో 18 ఏళ్ళు ప్రయాణం చేశాను. శాంతి నివాసం సీరియల్ నుంచి బాహుబలి 2 వరకూ రాజమౌళిగారితో పని చేశాను. దర్శకుడు అనిల్ రావిపూడితో పటాస్ నా ఫస్ట్ మూవీ. తర్వాత ఆయన సినిమాలన్నీ చేశాను. ఇప్పటివరకూ దాదాపు 30సినిమాలకు ఎడిటర్‌గా చేశాను.

 ఎఫ్ 2 తో ఎఫ్ 3 కథ ఎలా ఉండబోతుంది ?
ఎఫ్ 2లో పెళ్లి, తర్వాత వచ్చే కష్టాలు .. ఇలా వినోదాత్మకంగా చూపించాం. ఎఫ్ 3 డబ్బు చుట్టూ తిగిరే కథ. మానవసంబంధాలు డబ్బుతో ముడిపడి వున్నాయి. ఈ పాయింట్ ఎఫ్ 3లో చాలా ఫన్ ఫుల్‌గా చూపించాము.

 ఎఫ్ 2 కి ఎఫ్ 3 పోలికలు వస్తాయా ? 
ఎఫ్ 2 ఫ్రాంచైజ్ గా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఎఫ్ 2 క్యారెక్టర్లు ఉంటాయి కానీ ఎఫ్ 3 కథ మాత్రం పూర్తిగా భిన్నం. లీడ్ క్యారెక్టర్లు తీసుకొని కథని కొత్తగా చెప్పాం. 

 కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం ఎలా వుంటుంది ? 
కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్ రావిపూడిగారి సినిమాల్లో కామెడీ పంచులు అన్నీ బావుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా వుంటుంది. ఐతే ఓవరాల్ ఫ్లో చూసుకొని కథకు ఏది అవసరమో అదే ఉంచుతాం.  

 దర్శకుడు అనిల్ రావిపూడి గారితో వర్క్ చేయడం ఎలా వుంటుంది ?
అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం చాలా పాజిటివ్‌గా వుంటుంది. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల పక్షమే ఆలోచిస్తుంటారు. పటాస్ సినిమా నుంచి మా మధ్య అద్భుతమైన సింక్ కుదిరింది.

► ఎడిటర్ అభిప్రాయాన్ని దర్శకులు గౌరవిస్తారా ? 
ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా చర్చలు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ప్రీ ప్రొడక్షన్ ఎంత చక్కగా చేస్తామో పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ కూడా అంతే జాగ్రత్తగా చేస్తే మంచి సినిమా వస్తుంది. రషస్ మొదట ఎడిటర్ చూస్తాడు. ఎడిటర్ చెప్పే సూచనలని దర్శకులు గౌరవిస్తారు.

► పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఎడిటింగ్ పై ఎలా వుంటుంది ? 
నేను బాహుబలి 2కి చేశా. రాజమౌళి గారు క్రెడిట్ ఇచ్చారు. అన్ని భాషలు తెలిసిన ఎడిటర్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తారు.

► రీషూట్స్ విషయంలో ఎడిటర్ పాత్ర ఎలా వుంటుంది ? 
దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ .. అందరూ కూర్చుని చర్చించిన తర్వాత ఏది అవసరమో, కాదో నిర్ణయం తీసుకుంటారు.

► కథ వింటారా ? 
నేను కథ వినను. కథ వింటే ఇలా వుంటుందని ఫిక్స్ అయిపోతాం. రష్‌లో అది లేకపోతే ఇలా ఎందుకైయిందనే ప్రశ్న తలెత్తుతుంది. నా వరకూ రష్ ప్రకారం ఎడిటింగ్ చేస్తా.  

► ఎడిటింగ్ కి సిజీకి ఎలాంటి సంబంధం వుంటుంది ? 
చాలా వుంది. బ్లూ మ్యాట్స్ ఎక్కువగా తీసుకున్నారు. అక్కడ ఏం వుంటుందో తెలీదు. దాని దృష్టిలో మనం ఎడిట్ చేసుకోవాలి. కొన్ని సార్లు అనుకున్న విజన్ రాకపోవచ్చు. మళ్ళీ చర్చించి వర్క్ చేయాల్సివుంటుంది. 

► ఇన్నాళ్ళ కెరీర్ లో కష్టమనిపించిన సినిమా ? 
'మిర్చి' కి అసోసియేట్ ఎడిటర్ గా చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాను. పటాస్ సినిమాకి కూడా చాలా కష్టపడ్డాం.

► సినిమా విజయం అయినప్పుడు మిగతా వారితో పోల్చుకుంటే ఎడిటర్ కి తక్కువ క్రెడిట్ వస్తుంది కదా ?
సినిమా సక్సెస్ దర్శకుడిదే. దర్శకుడి విజన్‌తోనే ఎడిటర్ పని చేయాలి. అతను తీసిన రష్‌ను ఎడిట్ చేయాలి. కాబట్టి సక్సెస్ క్రెడిట్ దర్శకుడికే చెందాలి. ఐతే మాకు రావాల్సిన గురింపు కూడా వస్తుంది. 

► లీకేజీలు గురించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు ? 
సినిమా వర్క్ జరుగుతున్నపుడు పుటేజ్ చాలా చోట్లకి వెళుతుంది. ఐతే పని చేసే వాళ్ళకి లీక్ చేయడం తప్పు అనే సంస్కారం వుండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్వయం నియంత్రణ వుంటేనే లీకేజీలని ఆపగలం.  

► ఎఫ్ 4 కూడా వుంటుందా ?
ఇంకా అనుకోలేదు. ఐతే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది.  

► చేస్తున్న కొత్త సినిమాలు ?
కళ్యాణ్ రామ్ గారితో బింబిసార, మైత్రి మూవీ మేకర్స్ సినిమా, నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాలు చేస్తున్నా.

చదవండి: 'నేను ఏమైనా తప్పు చేశానా అని సరదాగా అడిగారు'

యూట్యూబ్​లో 'సర్కారు వారి పాట'కే మెజారిటీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement