
F3 Movie Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ తాజాగా ఎఫ్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు.
చదవండి: వైజాగ్‌లో రామ్‌చరణ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
'ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదే.. కానీ ఆరవ భూతం ఒకటుంది అదే డబ్బు' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'డబ్బు ఉన్నవాడికి ఫన్.. లేని వాడికి ఫ్రస్టేషన్, సీక్వెల్‌లో కూడా వీడికి సేమ్ డైలాగ్స్.. అంతేగా, అంతేగా'..వంటి డైలాగులు ఆకట్టకుంటున్నాయి.
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment