సంక్రాంతి బరిలో నుంచి ఎఫ్ 3 ఔట్‌.. రిలీజ్‌ డేట్‌ ఇదే | F3 Movie Release Date Out | Sakshi
Sakshi News home page

F3 Movie : ఆ రోజే నవ్వుల పండగ

Published Sun, Oct 24 2021 1:01 PM | Last Updated on Sun, Oct 24 2021 2:46 PM

F3 Movie Release Date Out - Sakshi

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్‌ రావిపూడి.

ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించగా... తాజాగా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఆదివారం ఎఫ్‌3 మూవీ విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ.. 'బొమ్మ ఎప్పుడు పడితే.. అప్పుడే మనకు నవ్వుల పండగ' అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. త‌మ‌న్నా, మెహ‌రీన్, సునీల్ ,రాజేంద్ర ప్ర‌సాద్ కీలక పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement