అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలై త్రిపుల్ బస్టర్‌గా నిలిచింది.
వరుణ్, వెంకటేశ్‌ల కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వారు. నేటితో ఈ చిత్రం 40 రోజులు పూర్తి చేసుకొని 50 రోజుల థియేట్రికల్ రన్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో 10 థియేటర్లపై పైగా విజయవంతంగా రన్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
(చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య)
సమ్మర్ సోగాళ్లు అంటూ వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయించడమే కాకుండా... నిర్మాతలకు కాసుల వర్షాన్ని కూడా కురిపించింది. ఒక్క నైజాంలో ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించడం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 134 కోట్ల గ్రాస్, రూ.70.94 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. నిర్మాతల నిర్ణయం మేరకు దాదాపు 50 రోజుల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. జులై 22న ఈ చిత్రం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం.. ఓటీటీ వేదికపై ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఎఫ్3 క్లోజింగ్ కలెక్షన్స్
► నైజాం - రూ.20.57 కోట్లు
► సీడెడ్ -8.58 కోట్లు
► ఈస్ట్ - 4.18 కోట్లు
► వెస్ట్ -3.14 కోట్లు
► ఉత్తరాంధ్ర - 7.48 కోట్లు
► గుంటూరు- 4.18 కోట్లు
► కృష్ణా -3.23 కోట్లు
► నెల్లూరు - 2.31 కోట్లు
► రెస్టాఫ్ ఇండియా- 2 కోట్లు
► ఓవర్సీస్- రూ.10 కోట్లు
► ఏపీ/తెలంగాణ వాటా- రూ.53.94 కోట్లు
► మొత్తం రూ.134 కోట్లు(గ్రాస్),రూ.70.94 కోట్లు(షేర్)
#F3Movie Continues the Glorious Run of 40 DAYS in Theatres! 🥳✨
— Sri Venkateswara Creations (@SVC_official) July 5, 2022
Sticked to the word of not releasing in OTT until 8 weeks & Running Successfully! 👍🏻✅#F3TripleBlockbuster 🔥🤩@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official @adityamusic pic.twitter.com/ne28cInzNO
Comments
Please login to add a commentAdd a comment