అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలై త్రిపుల్ బస్టర్‌గా నిలిచింది. డబ్బు చుట్టూ తిరిగే కథకు వెంకీ, వరుణ్‌ల కామెడీ జత కావడంతో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కడుబ్బా నవ్వించింది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసి నవ్వుకునేందుకు ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు.
చదవండి: షాకింగ్.. రియాపై ఎన్‌సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?
దీంతో ఎఫ్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అలాంటి వారి ఎదురుచూపులకు తాజాగా ఎండ్ కార్డ్ వేస్తూ మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. జూలై 22 నుంచి ఎఫ్3 చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఇక ఈ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ను ఇప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేస్తూ.. ‘ట్రిపుల్ ది ఫన్, ట్రిపుల్ ది ఫన్నీ, ట్రిపుల్ ది ఫ్రస్ట్రేషన్.. జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో ఎఫ్ 3 రిలీజ్ రెడీ అయ్యింది’ అంటూ రాసుకొచ్చింది.
చదవండి: అతియా, రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి
Triple the fun. Triple the funny. Triple the frustration 🎉🥳
— Netflix India South (@Netflix_INSouth) July 12, 2022
F3 is coming to Netflix on the 22nd of July in Telugu! pic.twitter.com/bxEbYMTkLl
Comments
Please login to add a commentAdd a comment