మరో కొత్త సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది. అదీ.. నెల తిరక్కుండానే స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గాండీవధారి అర్జున'. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి వెళ్లిందనే విషయం కూడా చాలామందికి తెలియదేమో. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసేసరికి అలెర్ట్ అయిపోయారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్)
కథేంటి?
లండన్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కి భారత కేంద్రమంత్రి ఆదిత్యరాజ్ (నాజర్) వెళ్తారు. ఓ మహిళ వల్ల ఈయనపై కొందరు మనుషులు ఎటాక్ చేస్తారు. దీంతో ఆయనకు సెక్యూరిటీగా అర్జున్ (వరుణ్ తేజ్) వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు కేంద్రమంత్రిని చంపాలనుకున్నది ఎవరు? ఈ మొత్తం కథలో ఐరా (సాక్షి వైద్య), శ్రుతి (రోహిణి) ఎవరు? చివరకు ఏమైందనేదే 'గాండీవధారి అర్జున' స్టోరీ.
ఓటీటీలోకి అప్పుడే
ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఓ మాదిరి అంచనాలు ఏర్పడినప్పటికీ.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత బొక్కబోర్లా పడింది. ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా చాలామందికి గుర్తులేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. మరో ఘోరమైన సినిమా తీశాడని ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. థియేటర్ లో అంటే కష్టం. ఓటీటీలో కాబట్టి అలా అలా చూసేయొచ్చు. ఇక ఆగస్టు 25న థియేటర్లలో రిలీజ్ కాగా, నెలలోపే అంటే సెప్టెంబరు 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఆ రెండు మూవీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
Telugu film #GandeevadhariArjuna will premiere on Netflix on September 24th. pic.twitter.com/kzYYtlzC3i
— Streaming Updates (@OTTSandeep) September 20, 2023
Comments
Please login to add a commentAdd a comment