Gandeevadhari Arjuna Movie
-
ఓటీటీకి వచ్చేస్తున్న మెగాహీరో సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే
మరో కొత్త సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది. అదీ.. నెల తిరక్కుండానే స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గాండీవధారి అర్జున'. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి వెళ్లిందనే విషయం కూడా చాలామందికి తెలియదేమో. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసేసరికి అలెర్ట్ అయిపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) కథేంటి? లండన్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కి భారత కేంద్రమంత్రి ఆదిత్యరాజ్ (నాజర్) వెళ్తారు. ఓ మహిళ వల్ల ఈయనపై కొందరు మనుషులు ఎటాక్ చేస్తారు. దీంతో ఆయనకు సెక్యూరిటీగా అర్జున్ (వరుణ్ తేజ్) వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు కేంద్రమంత్రిని చంపాలనుకున్నది ఎవరు? ఈ మొత్తం కథలో ఐరా (సాక్షి వైద్య), శ్రుతి (రోహిణి) ఎవరు? చివరకు ఏమైందనేదే 'గాండీవధారి అర్జున' స్టోరీ. ఓటీటీలోకి అప్పుడే ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఓ మాదిరి అంచనాలు ఏర్పడినప్పటికీ.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత బొక్కబోర్లా పడింది. ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా చాలామందికి గుర్తులేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. మరో ఘోరమైన సినిమా తీశాడని ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. థియేటర్ లో అంటే కష్టం. ఓటీటీలో కాబట్టి అలా అలా చూసేయొచ్చు. ఇక ఆగస్టు 25న థియేటర్లలో రిలీజ్ కాగా, నెలలోపే అంటే సెప్టెంబరు 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఆ రెండు మూవీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) Telugu film #GandeevadhariArjuna will premiere on Netflix on September 24th. pic.twitter.com/kzYYtlzC3i — Streaming Updates (@OTTSandeep) September 20, 2023 -
‘గాండీవధారి అర్జున’ కలెక్షన్స్.. వరుణ్ కెరీర్లోనే అతి తక్కువ..ఎంతంటే?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. ఓ మోస్తరు అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. కథ, కథనంలో కొత్తదనం లేదని, దర్శకుడు మేకింగ్‌పై పెట్టిన దృష్టి బలమైన కథను రాయడంలో పెట్టలేదని విమర్శలు వచ్చాయి. పలు వెబ్సైట్లు కూడా ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంలో ఈ చిత్రం విఫలమైంది. (చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి) వరుణ్ కెరీర్లోనే అతి తక్కువగా కేవలం 1.9కోట్ల కనెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే..నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ.15 లక్షలు, ఆంధ్రాలో రూ.65లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ.50 లక్షలు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.1.40 కోట్ల గ్రాస్, రూ. 75లక్షల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. (చదవండి: ‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ) వరుణ్ కెరీర్లోనే డిజాస్టర్‌గా మిగిలిన వరుణ్ గత సినిమా గని తొలి రోజు రూ. 3 కోట్లు రాబట్టడం గమనార్హం. ఈ లెక్కన వరుణ్ కెరీర్లోనే గండీవధారి అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయే అవకాశం మెండుగా ఉంది. ఇక ఈ చిత్రానికి రూ. 17 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినటట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 18 కోట్లు రాబట్టాలి. తొలి రోజే వసూళ్లు దారణంగా ఉండడంతో బ్రేక్ ఈవెన్ అసాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
గాండీవధారి అర్జున ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. ఆ పండగకు!
ఈ మధ్య మెగా హీరోలకు ఏదీ కలిసి రావడం లేదు. చిరంజీవి భోళా శంకర్, పవన్ కల్యాణ్ బ్రో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడ్డాయి. తాజాగా ఇదే బాటలోకి వచ్చేట్లు కనిపిస్తోంది. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. సాధారణ వసూళ్లు రాబట్టడం కూడా కష్టమే అనిపిస్తోంది. దీంతో ఈ సినిమా సైతం అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. యాక్షన్ సీన్స్, తల్లి సెంటిమెంట్ బాగున్నాయంటున్నారు. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ సినిమాను నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే థియేటర్ల వద్ద పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఈ వినాయక చవితి (సెప్టెంబర్ 19న)కి ఓటీటీలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గాండీవధారి అర్జున సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి, అభినవ్ గోమతం తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మిక్కీజే మేయర్ సంగీతం అందించాడు. చదవండి: సిగరెట్, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం.. -
‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ
టైటిల్: గాండీవధారి అర్జున నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విజయ్ రాయ్, విమలా రామన్, అభినవ్ గోమఠం, నరేన్ తదితరులు నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు సంగీతం:మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ:ముఖేష్ జి విడుదల తేది: ఆగస్ట్ 25, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథ అంతా లండన్‌లో జరుగుతుంది. అక్కడ జరిగే గ్లోబల్ సమ్మిట్-2023కి భారత్ తరపున కేంద్రమంత్రి ఆదిత్య రాజ్ బహదూరు(నాజర్) వెళ్తాడు. అతనికి పీఏగా ఐఏఎస్ అధికారిణి ఐరా(సాక్షి వైద్య)వెళ్తుంది. లండన్ పర్యటనలో ఉన్న మంత్రి ఆదిత్య రాజ్‌కు ఓ పెన్ డ్రైవ్(ఫైల్ 13) ఇవ్వాలని ప్రయత్నిస్తుంది శృతి(రోషణి ప్రకాశ్). అయితే ఆమెను క్లీన్ అండ్ గ్రీన్ (సీ అండ్ జీ)కంపెనీ అధినేత రణ్వీర్ (వినయ్ రాయ్) మనుషులు వెంబడిస్తారు. ఆ ఫైల్ మంత్రికి ఇవ్వకుండా ఆమెను అడ్డుకుంటారు. ఈక్రమంలో ఓ సారి మంత్రిపై ఎటాక్ జరుగుతుంది. దీంతో మంత్రికి సెక్యూరిటీగా అర్జున్ వర్మ(వరుణ్ తేజ్) వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు శృతి ఎవరు? ఆమె దగ్గర ఉన్న ఫైల్లో ఏం ఉంది? అది ఎందుకు మంత్రికి ఇచ్చేందుకు ప్రయత్నించింది? ఆ ఫైల్‌కు సీ అండ్ జీ అధినేత రణ్‌వీర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అర్జున్ వర్మ, ఐరాల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? కేంద్రమంత్రికి రక్షణగా వచ్చిన అర్జున్.. ప్రాణాలకు తెగించి ఆయన ఫ్యామిలీని ఎలా రక్షించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. యాక్షన్ థ్రిల్లర్ అనగానే అందరికీ గుర్తొచ్చేంది యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్. వీటితో పాటు కథ-కథనం కొత్తగా ఉండాలి. అవన్ని ఉంటేనే విజయం వరిస్తుంది. గాండీవధారి అర్జున విషయంలో కొత్తదనం అనేదే లేదు. కథలో కీలకమైన మెడికల్ వేస్టేజి పాయింట్ కూడా సూర్య నటించిన ‘సింగం 3’సినిమాను గుర్తు చేస్తుంది. అయితే ప్రవీణ్ రాసుకున్న ఈ కథ మాత్రం ఆలోచింపజేసేలా ఉంది. ఫారిన్లో ఉండే చెత్తను ఇండియాలో డంప్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటనేది ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. (చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ) అభివృద్ది పేరుతో అగ్రదేశాలు తమ దేశంలోని చెత్తనంతా భారత్ లాంటి దేశాలకు పంపుతూ, ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బదీస్తున్నారనే మంచి పాయింట్‌ని ఈ సినిమాలో చూపించారు.అయితే ఇది వినడానికి చాలా బాగుంటుంది. కానీ తెరపై ఎలా చూపించారనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. యాక్షన్, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేదు. కథ ప్రారంభం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ యువతి కేంద్రమంత్రిని కలిసేందుకు ప్రయత్నించడం.. ఆమెను కొంతమంది వెంబడించడంతో..అసai ఆ యువతి ఏం చెప్పాలనుకుంటుందననే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతోంది. హీరో ఎంట్రీ అంతగా ఆకట్టుకోదు. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ కంటే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే తల్లి కొడుకుల సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. శృతి అనే అమ్మాయి ఇచ్చిన ఫైల్ 13 గురించి మంత్రి, అర్జున్‌కి తెలియసిన తర్వాత కథపై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఆ తర్వాత కూడా కథనం ఆసక్తికరంగా సాగదు.పైగా కొన్ని లాజిక్‌లెస్ సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. లండన్ పోలీసులు హీరోని పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు.. వారి నుంచి హీరో తప్పించుకునే తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. విలన్ ఎంట్రీని ఎంతో గ్రాండ్‌గా చూపించారు కానీ.. విజనిజాన్ని పండించడంలో ఘోరంగా విఫలమయ్యారు. కనీసం క్లైమాక్స్‌లో అయినా విలన్ని సరిగా వాడుకోలేకపోయారు. ప్రతి సన్నివేశాన్ని చాలా రిచ్‌గా, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు కానీ ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా కథనాన్ని నడిపించలేదు. ఎవరెలా చేశారంటే.. మాజీ ‘రా’ ఏజెంట్ అర్జున్ వర్మ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. అతని ఫిజిక్ ఆ పాత్రకు బాగా సెట్ అయింది. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్స్ సీన్స్ ఇరగదీశాడు. ఇక కేంద్రమంతి పీఏ ఐరాగా సాక్షి వైద్య చక్కగా నటించింది. కేవలం పాటలకే పరిమితం కాకుండా కథతో పాటు ఆమె పాత్ర ప్రయాణిస్తుంది. ఇక కేంద్రమంత్రి ఆదిత్యరాజ్గా నాజర్ నటనకు వంకపెట్టలేం. ఇలాంటి పాత్రలు ఆయన కొత్తేమి కాదు. విజయ్ రాయ్ విలనిజం చూపించడంలో విఫలమయ్యారు. ఆయన పాత్రను మరింతగా బలంగా రాయాల్సింది. అభినవ్ గోమఠం, నరేన్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీజే మేయర్ సంగీతం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ప్రతీ సీన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ మేకింగ్ ఎంత రిచ్‌గా ఉన్నా.. కథ-కథనం ఆకట్టుకునేలా లేకపోతే ఏం లాభం?. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
వరుణ్ తేజ్ సినిమాకు అలాంటి టాక్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్ సంగీతం అందించాడు. నేడు(ఆగస్టు 25) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలాచోట్ల షో పడటంతో ట్విటర్ వేదికగా జనాలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉంది? ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్లో ఉంది? అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఓసారి వారి అభిప్రాయాలను చూసేద్దాం.. సినిమాను చాలా స్టైలిష్‌గా తీశారు. కానీ అంతగా వర్కవుట్ కాలేదు. చాలా బోరింగ్‌గా ఉందంటున్నారు. మరికొందరేమో థియేటర్లో ఉన్నవాళ్లంతా పారిపోండిరా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో తల్లి సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ బాగున్నాయట. ప్రవీణ్ సత్తారు ఈసారైనా మంచి సినిమా తీస్తాడనుకుంటే నిరాశపర్చాడని చెప్తున్నారు. ట్విటర్లో ఎక్కువగా నెగెటివ్ టాకే నడుస్తోంది. మరి సినిమా భవిష్యత్తు ఏంటనేది పూర్తి రివ్యూ వస్తే కానీ అర్థం కాదు. #GandeevadhariArjuna paaaripondii royiii rodd — Evadiki Thelusu (@EvadikiThelusu) August 25, 2023 #GandeevadhariArjuna Intense action 🔥 - Message 👏 - Mother sentiment 💕 - Slight slow paced(1st half)@IAmVarunTej's exact cutout/fit for the role!!💥💥@PraveenSattaru's kinda film 👏 https://t.co/3E225Uu42y — Navaneeth Reddy (@Navaneethkittu) August 25, 2023 Just saw so called action film #GandeevadhariArjuna. If marketed as an action movie poeple expect good action sequences ,Its not about budget or grandeur its about clarity and believability.Comerrcial movies has better logical scenes.#tollywood #TeluguCinema — im_akhil (@itsme_akhil) August 25, 2023 Sathaar bhai nuvvu urgentga film schoolki velli screenplay etla rayalo nerchuko bhai#GandeevadhariArjuna — గాలి గన్నారావు (@GaaliGannaRaoo) August 25, 2023 #GandeevadhariArjuna is an okayish movie with few plus points. Technical brilliance is shown in Visuals and Stunts 🔥 Plot point is good 🇮🇳 but failed to engage the audience due to slow paced narration 👎 It is better than #ghost#PraveenSattaru #VarunTej@IAmVarunTej — TechFlicksReview (@avi_techflicks) August 25, 2023 Excellent 1st Half for #GandeevadhariArjuna 👍👍👍 From Intro Title Reveal to Interval, Everything is Top-notch Very gripping fights and next level BGM are highlights 👌 Well set for the second half. Full Review after the Premiere! — Santhan Raj (@unpaid_Liar) August 25, 2023 Bola Shankar ni beat chese disaster ra idi #GandeevadhariArjuna monna #Ghani ippudu idi Producer ki chetilo chippa khayamm..!! — 🇱🇸Ghattamaneni & YSR 🔔 (@UFrcs) August 24, 2023 #GandeevadhariArjuna aspires to be a slick action thriller with mediocre content and an inconsistent writing. Except for the final 30mins of the film with a shifting situations screenplay, rest is hardly engaging. Wait for a solid film 4rm @PraveenSattaru since PSV continues :( — The Creative Shelf (@tcsblogs) August 25, 2023 #GandeevadhariArjuna attempt is good but execution got failed. Overall below average. pic.twitter.com/QDBjQDsEFV — TFI Exclusive (@TFIMovies) August 25, 2023 #PraveenSattaru hasn't improved a bit from his previous disastrous outing and failure of weaving the screenplay through a decent storyline is completely evident once again. Not even a single sequence created an impact throughout. Utterly disappointed#GandeevadhariArjuna - 1.25/5 https://t.co/2Jjq3MfMbt — Agnyathavaasi (@ThisisHarsha_) August 24, 2023 చదవండి: Jabardasth Comedian Nava Sandeep: జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ -
అప్పుడే ప్రేమలో పడ్డా: వరుణ్ తేజ్
‘‘నా పనిని ఎంజాయ్ చేయడం కోసం నేను సినిమా రంగంలోకి వచ్చాను. మనం చేసే పని ఏదైనా అందులో సంతృప్తి దక్కాలి. ‘గాండీవధారి అర్జున’ చిత్రం చేయడం నా బాధ్యత అనిపించింది. నా మనసుకు నచ్చిన సినిమా ఇది. నాకు సంతృప్తినిచ్చింది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► ప్రవీణ్ సత్తారుగారి సినిమాలను ప్రారంభం నుంచి చూస్తున్నాను. వైవిధ్యమైన చిత్రాలు చేయటానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. ప్రవీణ్ తీసిన ‘చందమామ కథలు’ సినిమాలోని భావోద్వేగాలు, ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రంలోని యాక్షన్ నాకు ఇష్టం. ‘గని’ సినిమా సమయంలో నేను ‘గాండీవధారి అర్జున’ కథ విన్నాను. సాధారణంగా స్టైలిష్ యాక్షన్ మూవీ అంటే యాక్షన్, స్టైలిష్ అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.. కథ తక్కువగా ఉంటుంది. కానీ ప్రవీణ్‌గారు కథ చెప్పినప్పుడు అందులోని ΄పాయింట్, భావోద్వేగాలు నచ్చాయి. ► ఈ చిత్రంలో హీరో పేరు అర్జున్. ఓ నటుడికి సామాజిక బాధ్యతాయుతమైన పాత్రల్లో నటించే అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. అందుకే మంచి కథతో ΄ాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉండే ఈ సినిమా చేయటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఎక్కువగా రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.. అవి చేస్తున్నప్పుడు నాకు గాయాలయ్యాయి. ► ‘గాండీవధారి..’ లో బాడీగార్డ్ రోల్ చేశాను. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఏదో సందేశం ఇచ్చి మీరు మారాలని చెప్పటం లేదు. ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్యని యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం చేశాం. సినిమా చూసి కొందరైనా మారితే మంచిదే. కథ డిమాండ్ మేరకే లండన్‌లో షూట్ చేశాం. అక్కడి వాతావరణం షూటింగ్‌కి సహకరించక΄ోవడం వల్ల బడ్జెట్ ముందుగా అనుకున్నదానికంటే పెరిగింది. అయినా బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారు, బాపినీడు ఖర్చుకు వెనకాడలేదు. ► సాక్షీ వైద్యకి చాలా ప్రతిభ ఉంది. తొలి రోజు షూటింగ్‌లోనే సినిమాలోని మూడు పేజీల డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పటం ఆశ్చర్యంగా అనిపించింది. మిక్కీ జె. మేయర్ అద్భుతమైన సంగీతం, అంతకు మించి నేపథ్య సంగీతం అందించారు. ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ సినిమాలు చేస్తున్నాను. ► మీ (వరుణ్–లావణ్యా త్రిపాఠి) ప్రేమ ఎప్పుడు మొదలైంది? పెళ్లెప్పుడు? అని వరుణ్ తేజ్‌ని అడగ్గా.. ‘‘తొలిసారి తనని కలిసినప్పుడే (‘మిస్టర్’ సినిమా అప్పుడు) అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘మా పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండే అవకాశం ఉంది’’ అన్నారు వరుణ్. -
Gandeevadhari Arjuna Pre Release Photos: వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వారి ప్రేమను తిరిగి ఇస్తాను
‘‘తెలుగు ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నాకు తెలుగు కొంచెం కొంచెం అర్థమవు తోంది. తెలుగు భాష నేర్చుకుని అభిమానుల ప్రేమను తిరిగి ఇస్తాను’’ అని హీరోయిన్ సాక్షీ వైద్య అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షీ వైద్య మాట్లాడుతూ– ‘‘ఏజెంట్’ సినిమా రిలీజ్ కాకముందే కొన్ని షాట్స్‌ను ప్రవీణ్ సార్ చూశారు. ‘గాండీవధారి అర్జున’లో ఐరా పాత్రకు నేను సెట్ అవుతానని తీసుకున్నారు. నాకు డ్రైవింగ్ అంతగా రాదు. ఈ మూవీలో ఆ సీన్లు చేసేటప్పుడు భయపడ్డాను. ఈ సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులో సాయిధరమ్ మూవీతో పాటు ‘లక్కీ భాస్కర్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు కమిట్ అయ్యాను. రవితేజగారితోనూ నటించే చాన్స్ ఉంది’’ అన్నారు. -
మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!
త్వరలోనే మెగా ఇంట్లో సందడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. (ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!) అయితే ఇప్పటికే పెళ్లి తేదీ ఫిక్స్ అయిందంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో బిజీగా ఉన్నారు వరుణ్ తేజ్. మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూకు హాజరైన వరుణ్ తన పెళ్లి తేదీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వరుణ్ మాట్లాడుతూ... 'ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. ఈ ఏడాదిలోనే చేసుకుంటా. మా అమ్మ ఇంకా తేదీ ఖరారు చేయలేదు. పెళ్లి తేదీ విషయంలో ఆమెదే తుది నిర్ణయం. అంతే కాకుండా తేదీ ఓకే అయ్యాక వేదిక ఎక్కడనేది ఫిక్స్ చేస్తాం. నెక్ట్స్ మూవీ కోసం వెయిటింగ్. కానీ పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక సినిమాపై ప్లాన్ చేస్తా. డెస్టినేషనా లేదా అనేది ఫ్యామిలీతో డిసైడ్ చేస్తాం. లవ్ ప్రోపోజ్పై ప్రశ్నించగా.. ముందు తానే ప్రపోజల్ పెట్టింది. ' అని అన్నారు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ పెళ్లి తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కించిన ‘గాండీవధారి అర్జున’ ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ తేజ్‌కు జంటగా సాక్షీ వైద్య నటించింది. (ఇది చదవండి: ఆ సీన్ చేయడం నాకు ఇష్టం లేదు.. కానీ: రమ్యకృష్ణ) -
Actress Sakshi Vaidya: చీరకట్టులో మెరిసిన హీరోయిన్ సాక్షి వైద్య (ఫోటోలు)
-
Gandeevadhari Arjuna Trailer Launch: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
'గాంఢీవధారి అర్జున' ట్రైలర్ విడుదల.. భారీ యాక్షన్ సీన్స్‌లో వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంఢీవధారి అర్జున' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా వరుణ్ సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 25న భారీ రేంజ్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. (ఇదీ చదవండి: వీడియో షేర్ చేసిన స్నేహ.. అలా చేయొద్దంటున్న ఫ్యాన్స్) ఇప్పటికే విడుదలైన టీజర్ అందరిని మెప్పించింది. అదే రేంజ్లో ట్రైలర్ కూడా ఉంది. భారీ యాక్షన్ సీన్లో వరుణ్ దుమ్ములేపాడు. బ్యాక్ గ్రౌడ్ స్కోర్ కూడా మిక్కీ జె.మేయర్ ఇరగదీశాడని చెప్పవచ్చు. ఇందులో నాజర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ పేర్కొంది. వరుణ్‌తేజ్ కెరీర్లోనే ‘గాంఢీవధారి అర్జున’ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది. యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాలోనూ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. -
వరుణ్ తేజ్ కొత్త సినిమా టీజర్ సూపర్.. కాకపోతే!
Gandeevadhari Arjuna Teaser: మెగాహీరో వరుణ్ తేజ్ తొలిసారి సరికొత్తగా కనిపించాడు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమా 'గాండీవధారి అర్జున'తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు రెడీ అయిపోయాడు. టీజర్‌ని సోమవారం రిలీజ్ చేయగా, అది సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఓ విషయం మాత్రం కాస్త భయపెడుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) కథ అదేనా? టీజర్ విషయానికొస్తే స్టోరీ విషయమై కాస్త క్లూ ఇచ్చారు. అర్జున్(వరుణ్ తేజ్) ఓ గూఢచారి. దేశం కోసం ప్రాణాలు రిస్క్‌లో పెట్టేందుకైనా అస్సలు వెనుకాడడు. ఈ క్రమంలోనే అతడికి ఓ మిషన్ అప్పగిస్తారు. అయితే మొండిగా వ్యవహరించే అర్జున్‌తో పనిచేయడానికి సహచర ఏజెంట్స్ భయపడుతుంటారు. వీళ్లలో ప్రియురాలు(సాక్షి వైద్య) కూడా ఉంటుంది. ఇంతకీ అర్జున్ టార్గెట్ ఎవరు? చివరకు ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్పై సినిమాల హవా 'గాండీవధారి అర్జున' టీజర్ చూస్తే గ్రాండ్ విజువల్స్‌తో చాలా రిచ్‌గా ఉంది. వరుణ్ తేజ్ ఇలాంటి సినిమాలో ఇంతకు ముందెన్నడూ చేయలేదు. దీంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన అఖిల్ 'ఏజెంట్', నిఖిల్ 'స్పై'.. ఈ తరహా చిత్రాలే. అవి ఎందుకో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. మరి ఆగస్టు 25న రాబోతున్న 'గాండీవధారి అర్జున' ఏం చేస్తుందో చూడాలి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!) -
‘గాంఢీవధారి అర్జున’ టీజర్ వచ్చేస్తుంది
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు వరుణ్ తేజ్. ఇందులో అర్జున్ అనే సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించారని, ఓ విపత్తు నుంచి ప్రజలను రక్షించేందుకు అర్జున్ ఎటువంటి సాహసాలు చేశాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. -
ఐదుగురు ‘మెగా’ హీరోలు.. 30 రోజులు.. 4 సినిమాలు
ఈ ఏడాది ‘మెగా’ అభిమానులకు చాలా స్పెషల్. మెగా ఫ్యామిలీలో వరుస శుభకార్యాలతో పాటు వరుస సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. వైష్ణవ్ తేజ్ వరకు ఈ ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాలను ఫ్యాన్స్‌కు అందించబోతున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ‘బ్రో’ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. వినోదయ సీతమ్మకు తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకుడు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన చిత్రం కావడంతో ‘బ్రో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భోళాశంకర్ బ్రో సినిమా విడుదలైన రెండు వారాలేకే భోళాశంకర్ సినిమా రాబోతుంది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు తెలుగు రీమేక్ ఇది. మోహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న లీజ్ కాబోతుంది. ఆదికేశవ భోళా శంకర్ రిలీజైన వారం రోజులకే అంటే ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ చిత్రం విడుదల కాబోతుంది. వైష్ణవ్ కెరీర్లో నాలుగో చిత్రమిది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీలీల హీరోయిన్. ‘గాండీధారి అర్జున’ ఆదికేశవ వచ్చిన మరో వారానికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గాండీధారి అర్జున’ చిత్రం రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మొత్తానికి జులై నెలాఖరు నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు... నెల రోజుల పాటు ఐదుగురు మెగా హీరోలు నాలుగు సినిమాలతో సందడి చేయబోతున్నారు. -
యాక్షన్ అర్జున్
సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సాక్షీ వైద్య హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని వరుణ్ తేజ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్‌పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘‘ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ప్రజలను అతను ఏ విధంగా కాపాడాడు? అందుకు అతని వ్యూహాలేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
ఆగస్టులో అర్జున
గాంఢీవాన్ని ఎక్కుపెట్టి థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అవుతున్నాడు అర్జున. వచ్చే తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ టైటిల్ రోల్లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాంఢీవధారి అర్జున’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. ‘‘స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందిస్తోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన వరుణŠ లుక్‌కి, వీడియో గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: ముఖేష్. -
వరుణ్ తేజ్ యాక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గాండీవధారి అర్జున.' ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్తో ముందుకొచ్చారు. (ఇది చదవండి: వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!) ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించి వరుణ్ తేజ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. 'ఏజెంట్' సినిమాలో అఖిల్ జోడీగా మెరిసిన సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మిక్కీ. జే. మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
ఫారిన్లో ఫైట్ చేసేందుకు రెడీ అయిన వరుణ్ తేజ్
ఫారిన్ ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడు హీరో వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ బుడాపెస్ట్‌లో ఆరంభం కానుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నాడు. దీంతో పాటు వరుణ్ మరో సినిమా కూడా చేస్తున్నాడు. భారతీయ వైమానిక దళ పైలెట్‌గా ఓ మూవీ చేస్తున్నాడు. దేశంలో జరిగిన వైమానిక దాడుల్లో మన సైనికులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎంత వీరోచితంగా పోరాడతారో కళ్లకు కట్టినట్లు చూపించనున్నాడు తేజ్. శక్తిప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. చదవండి: సిక్స్ ప్యాక్ కోసం కసరత్తులు, హీరోయిన్‌పై ట్రోలింగ్ -
వరుణ్‌తేజ్ కొత్త మూవీ అప్డేట్...అంచనాలు పెంచేసిన ఫస్ట్‌లుక్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పణలో ఎస్వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. తాజాగా వరుణ్ తేజ్ పుట్టిన రోజు (జనవరి 19) సందర్భంగా గురువారం సినిమా టైటిల్‌తో పాటు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ సినిమాకు ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. లండన్ బ్రిడ్జ్‌పై యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గూడచారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. Introducing the Envoy of peace with an M4 Carbine 🔥 Presenting Mega Prince @IAmVarunTej in a Never Seen Before Avatar as #GandeevadhariArjuna 😎 - https://t.co/FbN30VGgtv#HBDVarunTej ❤🔥@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/suOAC1fikU — SVCC (@SVCCofficial) January 19, 2023