Sakshi Vaidya Speech At 'Gandeevadhari Arjuna' Movie Pre-Release Event - Sakshi
Sakshi News home page

వారి ప్రేమను తిరిగి ఇస్తాను

Published Tue, Aug 22 2023 1:36 AM | Last Updated on Tue, Aug 22 2023 10:55 AM

Sakshi Vaidya Talks About Gandeevadhari Arjuna Movie

‘‘తెలుగు ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నాకు తెలుగు కొంచెం కొంచెం అర్థమవు తోంది. తెలుగు భాష నేర్చుకుని అభిమానుల ప్రేమను తిరిగి ఇస్తాను’’ అని హీరోయిన్‌ సాక్షీ వైద్య అన్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల  25న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సాక్షీ వైద్య మాట్లాడుతూ– ‘‘ఏజెంట్‌’ సినిమా రిలీజ్‌ కాకముందే కొన్ని షాట్స్‌ను ప్రవీణ్‌ సార్‌ చూశారు. ‘గాండీవధారి అర్జున’లో ఐరా పాత్రకు నేను సెట్‌ అవుతానని తీసుకున్నారు. నాకు డ్రైవింగ్‌ అంతగా రాదు. ఈ మూవీలో ఆ సీన్లు చేసేటప్పుడు భయపడ్డాను. ఈ సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. తెలుగులో సాయిధరమ్‌ మూవీతో పాటు ‘లక్కీ భాస్కర్‌’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలు కమిట్‌ అయ్యాను. రవితేజగారితోనూ నటించే చాన్స్‌ ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement