Varun Tej Gandeevadhari Arjuna Trailer Out - Sakshi
Sakshi News home page

Gandeevadhari Arjuna Trailer: గాంఢీవధారి అర్జున ట్రైలర్‌ విడుదల.. సినిమా ఎప్పుడంటే?

Published Thu, Aug 10 2023 4:57 PM | Last Updated on Thu, Aug 10 2023 5:12 PM

Varun Tej Gandeevadhari Arjuna Trailer Released - Sakshi

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'గాంఢీవధారి అర్జున' ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాకు  ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా వరుణ్ సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌ష్టు 25న భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

(ఇదీ చదవండి: వీడియో షేర్‌ చేసిన స్నేహ.. అలా చేయొద్దంటున్న ఫ్యాన్స్‌)

ఇప్పటికే విడుదలైన టీజర్‌ అందరిని మెప్పించింది. అదే రేంజ్‌లో ట్రైలర్‌ కూడా ఉంది. భారీ యాక్షన్‌ సీన్‌లో వరుణ్‌ దుమ్ములేపాడు. బ్యాక్‌ గ్రౌడ్‌ స్కోర్‌ కూడా మిక్కీ జె.మేయర్‌ ఇరగదీశాడని చెప్పవచ్చు. ఇందులో నాజర్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు యాక్షన్‌ సన్నివేశాలు ప్రధానంగా హైలైట్‌ అవుతాయని చిత్ర యూనిట్‌ పేర్కొంది.  

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లోనే ‘గాంఢీవధారి అర్జున’ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు అమెరికాలోనూ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement