Praveen Sattaru
-
వరుణ్ తేజ్ సినిమాకు అలాంటి టాక్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్ సంగీతం అందించాడు. నేడు(ఆగస్టు 25) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలాచోట్ల షో పడటంతో ట్విటర్ వేదికగా జనాలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉంది? ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్లో ఉంది? అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఓసారి వారి అభిప్రాయాలను చూసేద్దాం.. సినిమాను చాలా స్టైలిష్‌గా తీశారు. కానీ అంతగా వర్కవుట్ కాలేదు. చాలా బోరింగ్‌గా ఉందంటున్నారు. మరికొందరేమో థియేటర్లో ఉన్నవాళ్లంతా పారిపోండిరా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో తల్లి సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ బాగున్నాయట. ప్రవీణ్ సత్తారు ఈసారైనా మంచి సినిమా తీస్తాడనుకుంటే నిరాశపర్చాడని చెప్తున్నారు. ట్విటర్లో ఎక్కువగా నెగెటివ్ టాకే నడుస్తోంది. మరి సినిమా భవిష్యత్తు ఏంటనేది పూర్తి రివ్యూ వస్తే కానీ అర్థం కాదు. #GandeevadhariArjuna paaaripondii royiii rodd — Evadiki Thelusu (@EvadikiThelusu) August 25, 2023 #GandeevadhariArjuna Intense action 🔥 - Message 👏 - Mother sentiment 💕 - Slight slow paced(1st half)@IAmVarunTej's exact cutout/fit for the role!!💥💥@PraveenSattaru's kinda film 👏 https://t.co/3E225Uu42y — Navaneeth Reddy (@Navaneethkittu) August 25, 2023 Just saw so called action film #GandeevadhariArjuna. If marketed as an action movie poeple expect good action sequences ,Its not about budget or grandeur its about clarity and believability.Comerrcial movies has better logical scenes.#tollywood #TeluguCinema — im_akhil (@itsme_akhil) August 25, 2023 Sathaar bhai nuvvu urgentga film schoolki velli screenplay etla rayalo nerchuko bhai#GandeevadhariArjuna — గాలి గన్నారావు (@GaaliGannaRaoo) August 25, 2023 #GandeevadhariArjuna is an okayish movie with few plus points. Technical brilliance is shown in Visuals and Stunts 🔥 Plot point is good 🇮🇳 but failed to engage the audience due to slow paced narration 👎 It is better than #ghost#PraveenSattaru #VarunTej@IAmVarunTej — TechFlicksReview (@avi_techflicks) August 25, 2023 Excellent 1st Half for #GandeevadhariArjuna 👍👍👍 From Intro Title Reveal to Interval, Everything is Top-notch Very gripping fights and next level BGM are highlights 👌 Well set for the second half. Full Review after the Premiere! — Santhan Raj (@unpaid_Liar) August 25, 2023 Bola Shankar ni beat chese disaster ra idi #GandeevadhariArjuna monna #Ghani ippudu idi Producer ki chetilo chippa khayamm..!! — 🇱🇸Ghattamaneni & YSR 🔔 (@UFrcs) August 24, 2023 #GandeevadhariArjuna aspires to be a slick action thriller with mediocre content and an inconsistent writing. Except for the final 30mins of the film with a shifting situations screenplay, rest is hardly engaging. Wait for a solid film 4rm @PraveenSattaru since PSV continues :( — The Creative Shelf (@tcsblogs) August 25, 2023 #GandeevadhariArjuna attempt is good but execution got failed. Overall below average. pic.twitter.com/QDBjQDsEFV — TFI Exclusive (@TFIMovies) August 25, 2023 #PraveenSattaru hasn't improved a bit from his previous disastrous outing and failure of weaving the screenplay through a decent storyline is completely evident once again. Not even a single sequence created an impact throughout. Utterly disappointed#GandeevadhariArjuna - 1.25/5 https://t.co/2Jjq3MfMbt — Agnyathavaasi (@ThisisHarsha_) August 24, 2023 చదవండి: Jabardasth Comedian Nava Sandeep: జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ -
అప్పుడే ప్రేమలో పడ్డా: వరుణ్ తేజ్
‘‘నా పనిని ఎంజాయ్ చేయడం కోసం నేను సినిమా రంగంలోకి వచ్చాను. మనం చేసే పని ఏదైనా అందులో సంతృప్తి దక్కాలి. ‘గాండీవధారి అర్జున’ చిత్రం చేయడం నా బాధ్యత అనిపించింది. నా మనసుకు నచ్చిన సినిమా ఇది. నాకు సంతృప్తినిచ్చింది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► ప్రవీణ్ సత్తారుగారి సినిమాలను ప్రారంభం నుంచి చూస్తున్నాను. వైవిధ్యమైన చిత్రాలు చేయటానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. ప్రవీణ్ తీసిన ‘చందమామ కథలు’ సినిమాలోని భావోద్వేగాలు, ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రంలోని యాక్షన్ నాకు ఇష్టం. ‘గని’ సినిమా సమయంలో నేను ‘గాండీవధారి అర్జున’ కథ విన్నాను. సాధారణంగా స్టైలిష్ యాక్షన్ మూవీ అంటే యాక్షన్, స్టైలిష్ అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.. కథ తక్కువగా ఉంటుంది. కానీ ప్రవీణ్‌గారు కథ చెప్పినప్పుడు అందులోని ΄పాయింట్, భావోద్వేగాలు నచ్చాయి. ► ఈ చిత్రంలో హీరో పేరు అర్జున్. ఓ నటుడికి సామాజిక బాధ్యతాయుతమైన పాత్రల్లో నటించే అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. అందుకే మంచి కథతో ΄ాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉండే ఈ సినిమా చేయటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఎక్కువగా రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.. అవి చేస్తున్నప్పుడు నాకు గాయాలయ్యాయి. ► ‘గాండీవధారి..’ లో బాడీగార్డ్ రోల్ చేశాను. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఏదో సందేశం ఇచ్చి మీరు మారాలని చెప్పటం లేదు. ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్యని యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం చేశాం. సినిమా చూసి కొందరైనా మారితే మంచిదే. కథ డిమాండ్ మేరకే లండన్‌లో షూట్ చేశాం. అక్కడి వాతావరణం షూటింగ్‌కి సహకరించక΄ోవడం వల్ల బడ్జెట్ ముందుగా అనుకున్నదానికంటే పెరిగింది. అయినా బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారు, బాపినీడు ఖర్చుకు వెనకాడలేదు. ► సాక్షీ వైద్యకి చాలా ప్రతిభ ఉంది. తొలి రోజు షూటింగ్‌లోనే సినిమాలోని మూడు పేజీల డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పటం ఆశ్చర్యంగా అనిపించింది. మిక్కీ జె. మేయర్ అద్భుతమైన సంగీతం, అంతకు మించి నేపథ్య సంగీతం అందించారు. ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ సినిమాలు చేస్తున్నాను. ► మీ (వరుణ్–లావణ్యా త్రిపాఠి) ప్రేమ ఎప్పుడు మొదలైంది? పెళ్లెప్పుడు? అని వరుణ్ తేజ్‌ని అడగ్గా.. ‘‘తొలిసారి తనని కలిసినప్పుడే (‘మిస్టర్’ సినిమా అప్పుడు) అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘మా పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండే అవకాశం ఉంది’’ అన్నారు వరుణ్. -
Gandeevadhari Arjuna Pre Release Photos: వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వారి ప్రేమను తిరిగి ఇస్తాను
‘‘తెలుగు ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నాకు తెలుగు కొంచెం కొంచెం అర్థమవు తోంది. తెలుగు భాష నేర్చుకుని అభిమానుల ప్రేమను తిరిగి ఇస్తాను’’ అని హీరోయిన్ సాక్షీ వైద్య అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షీ వైద్య మాట్లాడుతూ– ‘‘ఏజెంట్’ సినిమా రిలీజ్ కాకముందే కొన్ని షాట్స్‌ను ప్రవీణ్ సార్ చూశారు. ‘గాండీవధారి అర్జున’లో ఐరా పాత్రకు నేను సెట్ అవుతానని తీసుకున్నారు. నాకు డ్రైవింగ్ అంతగా రాదు. ఈ మూవీలో ఆ సీన్లు చేసేటప్పుడు భయపడ్డాను. ఈ సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులో సాయిధరమ్ మూవీతో పాటు ‘లక్కీ భాస్కర్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు కమిట్ అయ్యాను. రవితేజగారితోనూ నటించే చాన్స్ ఉంది’’ అన్నారు. -
Gandeevadhari Arjuna Trailer Launch: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
'గాంఢీవధారి అర్జున' ట్రైలర్ విడుదల.. భారీ యాక్షన్ సీన్స్‌లో వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంఢీవధారి అర్జున' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా వరుణ్ సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 25న భారీ రేంజ్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. (ఇదీ చదవండి: వీడియో షేర్ చేసిన స్నేహ.. అలా చేయొద్దంటున్న ఫ్యాన్స్) ఇప్పటికే విడుదలైన టీజర్ అందరిని మెప్పించింది. అదే రేంజ్లో ట్రైలర్ కూడా ఉంది. భారీ యాక్షన్ సీన్లో వరుణ్ దుమ్ములేపాడు. బ్యాక్ గ్రౌడ్ స్కోర్ కూడా మిక్కీ జె.మేయర్ ఇరగదీశాడని చెప్పవచ్చు. ఇందులో నాజర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ పేర్కొంది. వరుణ్‌తేజ్ కెరీర్లోనే ‘గాంఢీవధారి అర్జున’ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది. యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాలోనూ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. -
వరుణ్ తేజ్ కొత్త సినిమా టీజర్ సూపర్.. కాకపోతే!
Gandeevadhari Arjuna Teaser: మెగాహీరో వరుణ్ తేజ్ తొలిసారి సరికొత్తగా కనిపించాడు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమా 'గాండీవధారి అర్జున'తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు రెడీ అయిపోయాడు. టీజర్‌ని సోమవారం రిలీజ్ చేయగా, అది సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఓ విషయం మాత్రం కాస్త భయపెడుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) కథ అదేనా? టీజర్ విషయానికొస్తే స్టోరీ విషయమై కాస్త క్లూ ఇచ్చారు. అర్జున్(వరుణ్ తేజ్) ఓ గూఢచారి. దేశం కోసం ప్రాణాలు రిస్క్‌లో పెట్టేందుకైనా అస్సలు వెనుకాడడు. ఈ క్రమంలోనే అతడికి ఓ మిషన్ అప్పగిస్తారు. అయితే మొండిగా వ్యవహరించే అర్జున్‌తో పనిచేయడానికి సహచర ఏజెంట్స్ భయపడుతుంటారు. వీళ్లలో ప్రియురాలు(సాక్షి వైద్య) కూడా ఉంటుంది. ఇంతకీ అర్జున్ టార్గెట్ ఎవరు? చివరకు ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్పై సినిమాల హవా 'గాండీవధారి అర్జున' టీజర్ చూస్తే గ్రాండ్ విజువల్స్‌తో చాలా రిచ్‌గా ఉంది. వరుణ్ తేజ్ ఇలాంటి సినిమాలో ఇంతకు ముందెన్నడూ చేయలేదు. దీంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన అఖిల్ 'ఏజెంట్', నిఖిల్ 'స్పై'.. ఈ తరహా చిత్రాలే. అవి ఎందుకో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. మరి ఆగస్టు 25న రాబోతున్న 'గాండీవధారి అర్జున' ఏం చేస్తుందో చూడాలి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!) -
‘గాంఢీవధారి అర్జున’ టీజర్ వచ్చేస్తుంది
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు వరుణ్ తేజ్. ఇందులో అర్జున్ అనే సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించారని, ఓ విపత్తు నుంచి ప్రజలను రక్షించేందుకు అర్జున్ ఎటువంటి సాహసాలు చేశాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. -
ఒటీటీ నుంచి వస్తున్న మొదటి స్పై థ్రిల్లర్ మూవీ ఇదే..
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ 5. ఇప్పుడు సరికొత్త యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్‌తో ఆకట్టుకోవటానికి సిద్ధమవుతోంది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా నటించబోయే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) 8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్టెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చిత్రీకరించని సరికొత్త లొకేషన్స్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న హీరోయిన్ లిప్‌లాక్ వీడియో) -
ఆగస్టులో అర్జున
గాంఢీవాన్ని ఎక్కుపెట్టి థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అవుతున్నాడు అర్జున. వచ్చే తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ టైటిల్ రోల్లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాంఢీవధారి అర్జున’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. ‘‘స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందిస్తోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన వరుణŠ లుక్‌కి, వీడియో గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: ముఖేష్. -
వరుణ్ తేజ్ యాక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గాండీవధారి అర్జున.' ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్తో ముందుకొచ్చారు. (ఇది చదవండి: వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!) ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించి వరుణ్ తేజ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. 'ఏజెంట్' సినిమాలో అఖిల్ జోడీగా మెరిసిన సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మిక్కీ. జే. మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
మాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తున్న రానా
టాలీవుడ్ హీరో రానా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రానా, వరుణ్ ధావన్ హీరోలుగా నటించడం లేదట. వరుణ్ ధావన్ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్ నారంగ్ కూడా భాగస్వామ్యులు అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో రానా ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు రానా. ప్రస్తుతం హీరోగా రానా చేతిలో ఉన్న చిత్రాల్లో ‘రాక్షసరాజు’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. ‘నేనే రాజు నేను మంత్రి’ చిత్రం తర్వాత దర్శకుడు తేజ–రానా కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
వరుణ్‌తేజ్ కొత్త మూవీ అప్డేట్...అంచనాలు పెంచేసిన ఫస్ట్‌లుక్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పణలో ఎస్వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. తాజాగా వరుణ్ తేజ్ పుట్టిన రోజు (జనవరి 19) సందర్భంగా గురువారం సినిమా టైటిల్‌తో పాటు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ సినిమాకు ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. లండన్ బ్రిడ్జ్‌పై యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గూడచారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. Introducing the Envoy of peace with an M4 Carbine 🔥 Presenting Mega Prince @IAmVarunTej in a Never Seen Before Avatar as #GandeevadhariArjuna 😎 - https://t.co/FbN30VGgtv#HBDVarunTej ❤🔥@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/suOAC1fikU — SVCC (@SVCCofficial) January 19, 2023 -
ఓటీటీలో ‘ది ఘోస్ట్’.. రిలీజ్ డేట్ ఫిక్స్?
ఇటీవల విడుదలైన నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వహించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ఫ్లిక్స్వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. గతంలోనూ నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్’ మూవీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఆ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే. (చదవండి: ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ) అసలు కథేంటంటే..: విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్‌ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్‌ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్‌కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్‌కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది.అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ. -
ఇంటర్నేషనల్ గూఢచారిగా వరుణ్ తేజ్.. యాక్షన్ బిగిన్
గన్ను ఫుల్‌గా లోడ్ చేసి రంగంలోకి దిగారు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పణలో ఎస్వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం లండన్‌లో ప్రారంభమైంది. హీరో వరుణ్ తేజ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘షూటింగ్ మొదలైంది. ది గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ బిగిన్స్’ అంటూ లొకేషన్ వీడియోను షేర్ చేశారు వరుణ్ తేజ్. కాగా ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంటర్నేషనల్ గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్. -
నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
ఈ సినిమాతో ఆ కోరిక తీరింది: నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున చిత్ర విశేషాలని పంచుకున్నారు. ది ఘోస్ట్‌లో వెపన్ ప్రమోషన్స్‌లో ఆకట్టుకుంది. దీని వెనుక కథ వుందా ? తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ ఉంది. ఈ సినిమాలో ఉండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్‌గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం.(నవ్వుతూ) ది ఘోస్ట్ పై చాలా ఇష్టం పెరగడానికి కారణం ? ఈ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బాగుంటుంది. తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్‌ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీలో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్. ది ఘోస్ట్‌ని శివతో పోల్చడానికి కారణం ? నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ ఉందనిపించింది. ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం ? నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్‌తో కూడిన ఒక స్టైలీష్ యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. గరుడ వేగలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాలా నచ్చింది. ప్రవీణ్‌ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్‌లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేశారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం. మీరు చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారనిపిస్తుంది ? మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్లాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పారు. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే యూఎస్‌లో రిలీజ్ అవుతోంది. ఈ రకంగా నిన్నే పెళ్లాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది (నవ్వుతూ). పాత సినిమాలని కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది.. శివ సినిమా మళ్లీ వస్తుందా ? తప్పకుండా. శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అదే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్స్ పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబధించిన పనులు జరుగుతున్నాయి. మీరు బాలీవుడ్లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చెరిగిపోయాయని అనుకోవచ్చా ? ఇప్పుడు బౌండరీలు లేవు. యూఎస్‌లో ఐమాక్స్ స్క్రీన్‌లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్రలో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ? ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా వుంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66రోజుల్లోనే పూర్తయింది. కొత్తగా చేయబోయే సినిమాలు ? రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్లో ఉంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నాయి. -
ది ఘోస్ట్‌పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్.. ఆ ఒక్కటే హైలెట్ అంటూ..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన చిత్రం 'ది ఘోస్ట్'. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో నాగార్జున కొన్ని యాక్షన్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కింగ్. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఆసక్తిగా ఉంటాయన్నారు నాగ్. క్లైమాక్స్‌లో వచ్చే చర్చ్ ఫైట్ హైలైట్‌గా నిలుస్తుందన్నారు కింగ్ నాగార్జున. అలాగే దర్శకుడు సైతం ఈ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ సీన్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. -
The Ghost: నాగ్ కోసమే కథ రాశా.. రొమాన్స్ ఉంటుంది: ప్రవీణ్ సత్తారు
‘‘నా దృష్టిలో సినిమా తీయడం అంటే సినిమా చరిత్రలో ఓ పేజీ రాయడంలా భావిస్తాను. అలా ఆ చరిత్రలో ‘ది ఘోస్ట్’ ఓ పేజీ. వెయ్యి సంత్సరాల తర్వాతే కాదు.. మనం చనిపోయిన తర్వాత కూడా సినిమా చరిత్రలో ఆ పేజీ ఉంటుంది. అందుకే ఈ పేజీని చాలా జాగ్రత్తగా రాయలన్న భయం, బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది’’ అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. సునీల్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్ సత్తారు చెప్పిన విశేషాలు. ► నాగార్జునగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘ది ఘోస్ట్’ కథ రాశాను.. నాగార్జునగారు అద్భుతంగా చేశారు. ఇంటర్‌పోల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన ఆఫీసర్ విక్రమ్ పాత్ర చేశారు నాగార్జునగారు. ఈ చిత్రంలో 12 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సినిమాలోని చెల్లి, మేనకోడలు సెంటిమెంట్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రొమాన్సూ ఉంది. ► నాకు ‘గరుడవేగ’ సినిమా ఫ్లస్ అయ్యిందనే భావిస్తున్నాను. ఈ విషయంలో జీవితా రాజశేఖర్గార్లకు ధన్యవాదాలు. నేను మూడు సినిమాలు నిర్మించాను. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేయడం అనేది కొంచెం కష్టమే. నిర్మాతల కష్టాలు నాకు తెలుసు. నా తర్వాతి చిత్రం వరుణ్ తేజ్‌తో ఉంది. ఈ నెల 10న యూకేలో ఆ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. ► పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్‌ను చూసే సినిమా చూడాలా? వద్దా అని ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటున్న రోజులువి. సినిమా స్టాండర్డ్స్ విషయంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంటే ఎంటర్టైన్ చేయడమే. థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు వారు తమ మొబైల్ ఫోన్స్ మెసేజ్‌లను చెక్ చేసుకోనంత వరకు స్క్రీన్ పై ఏ జానర్ సినిమా ఉన్నా అప్పుడు అది హిట్టే. హిందీలో రిలీజ్ చేస్తాం – సునీల్ నారంగ్ ‘ది ఘోస్ట్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 7న రిలీజ్ అవుతుంది. ముందుగా హిందీ రిలీజ్ ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత చేశాం. నాగార్జునగారు చాలా బాగా నటించారు. ప్రవీణ్ సత్తారు భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. కోవిడ్ వల్ల అనుకున్నదాన్ని కన్నా సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది. -
'ది ఘోస్ట్' ట్రైలర్ రిలీజ్.. కింగ్ యాక్షన్‌కు ఫిదా అవ్వాల్సిందే
కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ఘోస్ట్' ట్రైలర్ విడుదలైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయడంతో కింగ్ మాస్ యాక్షన్‌కు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. (చదవండి: 'నాగార్జున షాకింగ్ నిర్ణయం.. అప్పటివరకు సినిమాలకు బ్రేక్') యాక్షన్ ఎంటర్టైనర్గా తెరెకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో సన్నివేశాలు సినిమాలో కీలకమైనవిగా అర్థమవుతోంది. 'డబ్బు, సక్సెస్.. సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది’ అన్న డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
అప్పుడు చైన్‌తో వచ్చా... ఇప్పుడు కత్తితో వస్తున్నా
‘‘ముప్పైమూడు సంవత్సరాల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాతో సైకిల్ చైన్ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ అక్టోబరు 5న ఓ కత్తితో ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో వస్తున్నాను. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయదశమి మా ‘ది ఘోస్ట్’ చిత్రానికి కూడా విజయాన్ని ఇస్తుందనుకుంటున్నాను’’ అని నాగార్జున అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది. కాగా ఆదివారం కర్నూలులో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్ ఇంత ప్రేమను పొందడానికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్నగారికి (దివంగత అక్కినేని నాగేశ్వరరావు) థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ‘ది ఘోస్ట్’ లో అలానే కనపడతాను. నేను, చైతన్య చేసిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్స్‌లోనే కాదు.. టెలివిజన్ టీఆర్పీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. నెక్ట్స్ అఖిల్‌తో నేను చేయబోయే సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. మహేశ్‌బాబు ఎప్పుడంటే అప్పుడు అతనితో కలిసి నటిస్తాను. నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవిగారి సినిమా ‘గాడ్‌ఫాదర్’ కూడా అక్టోబరు 5న రిలీజ్ కాబోతుంది.. ‘ది ఘోస్ట్, గాడ్‌ఫాదర్’ సినిమాలకు విజయాలు చేకూరాలి’’ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ–‘‘గత నాలుగైదు నెలలుగా నాన్నగారిని(నాగార్జున) కలిసిన ప్రతిసారి ‘ది ఘోస్ట్’ గురించే మాట్లాడుకుంటున్నాం.. ఇలాంటి ఎగై్జట్‌మెంట్‌ను నాన్నలో చూసి చాలా రోజులైంది. ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ‘ది ఘోస్ట్’కి ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు అద్భుతం. ఈ విధంగా నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. స్క్రీన్‌పై నాన్నని ఎలా చూడాలనుకున్నానో అలా ప్రవీణ్‌గారు ఈ సినిమాలో చూపించారు’’అన్నారు. హీరో అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను, అన్నయ్య.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాం. ముప్పై ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో నాన్నగారు సినిమాలు చేస్తున్నారు.. దాన్నిబట్టి మేం ఎంత పరిగెత్తాలనేది అర్థం అవుతోంది. ‘ది ఘోస్ట్’ లో ఏదో ఒక ఫైర్ ఉంది.. సినిమా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన అభిమానుల అంచనాలను అందుకునేలా ‘ది ఘోస్ట్’ ఉంటుంది’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘నాగార్జున ఎంత స్టైలిష్‌గా ఉంటారో అంతే స్టైలిష్‌గా ఈ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత రామ్మోహన్రావు. ‘‘ది ఘోస్ట్’ తీసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సోనాల్ చౌహాన్, నటుడు విక్రమాదిత్య, కెమెరామేన్ ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, మ్యూజిక్ డియో భరత్, సౌరభ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరోతో రొమాంటిక్ మూవీ చేయాలని ఉంది: సోనాల్ చౌహాన్
‘‘యాక్షన్ మూవీ చేయాలనే నా ఆకాంక్ష ‘ది ఘోస్ట్’తో నెరవేరింది’’ అన్నారు సోనాల్ చౌహాన్. నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోనాల్ చౌహాన్ చెప్పిన విశేషాలు... ► ప్రవీణ్ సత్తారు ‘ది ఘోస్ట్’ కథ చెప్పినపుడు థ్రిల్ అయ్యాను. ఈ చిత్రంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా చేశాను. ఇది సవాల్‌తో కూడుకున్న పాత్ర. అందుకే శిక్షణ తీసుకున్నాను. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అయితే ట్రైనింగ్ టైమ్‌లో రెండో రోజే కాలి వేలు ఫ్రాక్చర్ అయ్యింది. డాక్టర్ సలహా మేరకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని, మళ్లీ శిక్షణ తీసుకుని షూటింగ్‌కి ఎంటర్ అయ్యాను. ► ఇంటర్‌పోల్ ఆఫీసర్ని కాబట్టి కొన్ని రకాల తుపాకీలను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అయితే మా నాన్న పోలీస్ కావడంతో గన్స్ పట్టుకోవడం తెలుసు. కానీ ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్‌ని హ్యాండిల్ చేయాల్సి రావడంతో శిక్షణ తీసుకున్నాను. గ్లామరస్ క్యారెక్టర్సే కాదు.. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ సినిమా నిరూపిస్తుంది. ► నాగార్జునగారిని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు కాస్త నెర్వస్ అయ్యాను. అయితే పది నిమిషాలు మాట్లాడాక నా భయం పోయింది. నాగార్జునగారు కింగ్ అఫ్ రొమాన్స్. ‘వేగం...’ పాటలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. నాగార్జునగారితో ఓ రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది. ► మాది సంప్రదాయ రాజ్‌పుత్ కుటుంబం. మా కుటుంబంలో ఆడవాళ్లు ఇంటి నుండి బయటకు రావడమే పెద్ద విషయం. అలాంటిది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా పరిశ్రమలో నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏ అవగాహన కూడా లేదు. అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. ఎత్తుపల్లాలను ఎలా తీసుకోవాలో సినిమా పరిశ్రమే నేర్పింది. -
The Ghost: ఎమోషన్.. యాక్షన్
పవర్ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా నాగార్జున నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, నాగార్జున–సోనాల్ల కొత్త పోస్టర్ని ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఇప్పటివరకు విడుదల చేసిన రెండు ప్రోమోలు ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని అబ్బురపరిచాయి. దాంతో ట్రైలర్‌పై అంచనాలు పెరి గాయి. ట్రైలర్లో మరింత ఎగ్జయిటింగ్ యాక్షన్‌ని చూపించనున్నాం. ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల. ∙నాగార్జున, సోనాల్ చౌహాన్ -
ఇది ఎవరికీ తెలియదనుకుంటా: నాగార్జున
Nagarjuna About The Ghost Movie: కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ది ఘోస్ట్'. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి 'కిల్లింగ్ మెషిన్' పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు మూవీ యూనిట్ సమాధానమిచ్చింది. నాగార్జున మాట్లాడుతూ.. ''ది ఘోస్ట్ 'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా వుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు. నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. సునీల్ నారంగ్ గారి నాన్నగారు నారాయణ్ దాస్ నారంగ్ తో ఈ సినిమా చేయాలనే ఆలోచన మొదలైంది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లాంటి మంచి అభిరుచి గల నిర్మాతలు కలసి సినిమా అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటాయి. చిత్రానికి మంచి టెక్నికల్ టీం పని చేసింది. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు ఎమోషన్ , సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. అక్టోబర్ 5న సినిమాని మీ ముందుకు తెస్తున్నాం'' అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. 'నాగార్జునతో సినిమా చేసే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. స్టైలిష్ యాక్షన్ లో నాగార్జున అద్భుతంగా ఉంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది. సినిమా మొదలైన తర్వాత కరోనా రూపంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గొప్ప సపోర్ట్ గా నిలబడ్డారు. టెక్నికల్ టీం, డైరెక్షన్ టీమ్ కి కృతజ్ఞతలు'' తెలిపారు. శివలో చైన్ పెట్టారు ఘోస్ట్ లో రెండు కత్తులు పెట్టారు మరో శివలా అంచనాలు పెట్టుకోవచ్చా ? నాగార్జున: శివకి దీనికి పోలిక లేదు. యాక్షన్ స్టైలిష్ గా డిజైన్ చేసిన క్రమంలో కత్తులు వచ్చాయి. ఎవరికీ ఘోస్ట్ గా వుంటారు ? నాగార్జున: ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు. స్టైలిష్ పోల్ ఏజెంట్ విక్రమ్ కి కోడ్ నేమ్. ఇన్నేళ్ల మీ అనుభవంలో ఎలాంటి పాత్రలు, ఎలాంటి కథలని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారనిపించింది ? నాగార్జున: నిజంగా తెలీదండి. నాకే కాదు ఇది ఎవరికీ తెలియదని అనుకుంటాను. ప్రేక్షకులకు ఎప్పుడు, ఎందుకు ఒక సినిమా నచ్చుతుందో తెలీదు. ఈ మధ్య రాజమౌళితో మాట్లాడుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చింది. ''మన మనసుకు నచ్చిన సినిమా బలంగా నమ్మి తీసేయాలి. మనకి నమ్మకం ఉంటేనే జనాలకి నచ్చుతుంది' అన్నారు. ప్రవీణ్ సత్తారు చెప్పిన కథలో కొత్త పాయింట్ ఏమిటి ? నాగార్జున: ట్రీట్మెంట్, యాక్షన్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఉంటుంది. ఈ చిత్రానికి టికెట్ రేట్లు ఎలా ఉంటాయి ? సునీల్ నారంగ్: సాధారణమైన ధరలే ఉంటాయి. టికెట్ రేట్లు పెంచం. మిషన్ బేస్డ్ సినిమాలకి సీక్వెల్స్ ఉంటాయి కదా .. ఘోస్ట్ కి సీక్వెల్ ఉంటుందా ? ప్రవీణ్ సత్తారు: ఇది మిషన్ బేస్డ్ సినిమా కాదు. మీరంతా రివ్యూలు చక్కగా రాసి సినిమా సూపర్ హిట్ అయితే ఎన్ని సీక్వెల్స్ అయినా తీసుకోవచ్చు( నవ్వుతూ) నాగార్జున మన్మధుడు కదా.. ఆయన్ని యాక్షన్ చేయించడానికి ఎంత కష్టపెట్టారు ? ప్రవీణ్ సత్తారు: నాగార్జున నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. చాలా అలోచించి ఒక యాక్షన్ బ్లాక్ పెడితే.. ఆయన వచ్చి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. 12 భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. నాగార్జున చాలా ఫ్లెక్స్ బుల్ గా సూపర్ ఫాస్ట్ గా చేశారు. యాక్షన్ లో కొత్తదనం ఏముటుంది ? ప్రవీణ్ సత్తారు: ఇందులోని యాక్షన్ కథలో కలసి ఉంటుంది. యాక్షన్ కూడా ఎమోషన్ లో బాగంగా ఉంటుంది. యాక్షన్ చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. -
కత్తులతో నాగార్జున వేట.. 'ది ఘోస్ట్' నుంచి కొత్త అప్డేట్
Nagarjuna As A Killing Machine From The Ghost Movie: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఘోస్ట్'. ఈ చిత్రానికి 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. నాగ్, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ విజువల్ ట్రీట్‌ను చిత్రబృందం షేర్ చేసింది. 'కిల్లింగ్ మేషిన్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో నాగార్జున కత్తులతో శత్రువులను వేటాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోన్న ఈ మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 5న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
సైకలాజికల్, రొమాంటిక్ డ్రామాగా 'గేమ్ ఆన్'..
Game On Movie Launch By Director Praveen Sattaru: సైకలాజికల్, రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఆన్'. గీతానంద్, నేహా సోలంకి, వసంతి, కిరిటీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరోహీరోయిన్లు గీతానంద్, నేహా సోలంకిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మూవీ డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ '2020 నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ ఫీల్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు.' అని తెలిపారు. 'ఈ 'గేమ్ ఆన్' చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి. ఇందులో ట్విస్ట్‌లు చాలా ఉంటాయి. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దర్శకుడు దయానంద్ చాలా కష్టపడ్డారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా 2022లో బెస్ట్ సినిమా అవుతుంది. అని హీరో గీతానంద్ పేర్కొన్నారు. లూజర్‌గా ఉన్న యువకుడు విన్నర్ ఎలా అయ్యాడనే కథాంశంతో రూపొందించామని నిర్మాతలు వెల్లడించారు. చదవండి: ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు.. చదవండి: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విజువల్ ఫీస్ట్‌లా ‘ది ఘోస్ట్’
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ చిత్రాలు, విజువల్ ఫీస్ట్‌లు ఆస్వాదించేవారికి ‘ది ఘోస్ట్’ కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. దుబాయ్‌లో కీలకమైన షెడ్యూల్లో భాగంగా హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. ముఖ్యంగా ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. -
నాగ్ సరసన మెహరీన్
నాగార్జునకు జోడీగా మెహరీన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపిస్తారు నాగార్జున. ఈ చిత్రంలో హీరోయిన్గా ఫస్ట్ కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాజల్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో అమలా పాల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఫైనల్‌గా మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా మెహరీన్ ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడంలో శివరాజ్‌కుమార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
నాగ్ సినిమా మేకర్స్‌కు చుక్కలు చూపించిన అమలా పాల్, మెహ్రీన్!
నాగార్జున అక్కినేని ప్రస్తుతం ‘బంగార్రాజు’ మూవీతో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు ఆయన ప్రవీణ్ సత్తారుతో ఓ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి 'ది ఘోస్ట్' అనే టైటిల్‌ను అనుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా మొదట కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు మేకర్స్. అయితే కొన్ని కారణాల వల్ల కాజల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో హీరోయిన్ వేటలో పడ్డ మేకర్స్‌కు చుక్కలు చూపిస్తున్నారట మన కథానాయికలు. చదవండి: ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్‌పైనే ఏడ్చిన హీరో శింబు ఈ సినిమా కోసం హీరోయిన్ అమలా పాల్‌ను సంప్రదించగా.. ఆమె భారీగా డిమాండ్ చేసి మేకర్స్‌కు షాక్ ఇచ్చిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను కాదని మెహరీన్ కౌర్‌ను అడగ్గా ఈ బ్యూటీ కూడా కోటీ రూపాయలకు వరకు డిమాండ్ చేసిందని వినికిడి. ఇక హీరోయిన్ల వైఖరితో నిర్మాతలు విసిగిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు కాస్తా వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక అమలా పాల్, మెహరీన్‌ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ -
'ఘోస్ట్'గా కింగ్ నాగార్జున.. ఫస్ట్‌లుక్ అవుట్
అక్కినేని నాగార్జున హీరోగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు నాగార్జున ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఘోస్ట్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వర్షంలో కత్తి పట్టుకొని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీలుక్‌తో పాటు పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విదేశీ బ్యాడ్డీలు, లండన్ ల్యాండ్‌స్కేప్ పిక్‌లు హైలెట్‌గా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుంది.. చదవండి : Raj Tarun: నాగార్జున చేతుల మీదుగా రాజ్ తరుణ్ మూవీ ఫస్ట్‌లుక్ అందుకే నాగార్జున పరిశ్రమలో స్పెషల్ వన్! -
మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి కింగ్ నాగార్జున!
Nagarjuna- Praveen Sattaru Movie: వైల్డ్ డాగ్ సినిమాలో పూర్తి స్థాయి యాక్షన్ క్యారెక్టర్ చేసిన నాగార్జున మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆరంభించనున్నారు. "హైరేంజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ రోల్లో కనిపించనున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం" అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్, నారాయణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’!
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు గుడ్‌బై చెబుతారు. కొంతమంది సినిమాలు చేసినా.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా తెరపై చాలా పద్దతిగా కనిపిస్తుంటారు. అయితే కొంతమంది నటీమణులు మాత్రం కెరీర్, వ్యక్తిగత జీవితం వేరు అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో సమంత అక్కినేని పెళ్లి తర్వాత సంచలన పాత్రలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుండగా.. తాజాగా ఆ లిస్ట్‌లో కాజల్ అగర్వాల్ కూడా చేరింది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ‘చందమామ’ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో నటిస్తుంది. వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కాజల్ స్పై పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ పాత్ర వేశ్య కూడా అని తెలుస్తోంది. నాగార్జున ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. సినిమాలో ఈమె ఎక్కువ భాగం వేశ్యగా.. చివర్లో మాత్రం స్పైగా కనిపించబోతుందట. తీవ్రవాదుల గుట్టు రట్టు చేయడానికి తన అందచందాలతో వాళ్లను ఆకట్టుకుంటూ.. వాళ్ళతో రొమాన్స్ చేస్తూ అక్కడి రహస్యాలను తన డిపార్ట్మెంట్ కు అందజేసే పాత్ర ఇది. ఒకవైపు గూడాచారి, మరోవైపు వేశ్య ఈ రెండూ కలగలిపి ఉన్న పాత్రను కాజల్ అద్భుతంగా పోషిస్తుందని తెలుస్తోంది.అంతే కాదు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా కాజల్ నటించబోతుందట. ఏదేమైనా.. పెళ్లి తర్వాత ఇలాంటి పాత్రలు చేయడం చిన్న విషయమేమి కాదు. తెరపై వేశ్యగా కాజల్ ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి మరి. చదవండి: నగ్నంగా దర్శనమిచ్చి షాకిచ్చిన స్టార్ హీరోయిన్ -
యుద్ధ విద్యల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాగ్
పోరాట సన్నివేశాల్లో హీరో నాగార్జున శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు తన యాక్షన్ స్టైల్‌కు మరింత పదును పెడుతున్నారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాజీ రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించనున్నారు నాగార్జున. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం క్రావ్ మాగా, సమురై స్వార్డ్ వంటి ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో నాగార్జున స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ సెకండ వేవ్ కారణంగా వాయిదా పడింది. దీంతో వీలైనంత తొందరగా చిత్రీకరణ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు అండ్ కో. వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అలాగే ఇందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు. -
మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా?
వరుణ్‌తేజ్ పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో దర్శకత్వంలో గని మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాక్సర్‌గా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ గ్యాప్‌లోనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా తెరెకెక్కుతున్న ఈ మూవీతో మరోసారి బాక్సీఫీస్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో వరుణ్ మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘గరుడవేగా’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి వరుణ్ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేసినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమా కథ ప్రకారం చిత్ర షూటింగ్ మొత్తం లండన్‌లోనే జరగనున్నట్లు సమాచారం. దీంతో పరిస్థితులు కొంచెం సద్దుమణిగాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే వరుణ్‌తో ప్రాజెక్టు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చదవండి : దూకుడు పెంచిన నాగ చైతన్య.. ఆ హిట్ డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా మరోసారి జంటగా నటించనున్న వరుణ్‌తేజ్, సాయిపల్లవి ? -
నాగార్జున యాక్షన్ మూవీ: జూన్‌లో ప్రారంభం
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అయితే ఈ సినిమా ఆగిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కానీ... ‘‘జూన్ మొదటివారంలో మా సినిమా చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొనడంతో ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదని స్పష్టం అయింది. చిత్రీకరణకు తగ్గ ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉన్నారు ప్రవీణ్ సత్తారు. అలాగే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘బంగార్రాజు’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కాల్సి ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోని సినిమా పూర్తయ్యాక ‘బంగార్రాజు’ ఆరంభం అవు తుందట. చదవండి: 2021ని ఇరగదీయాలని డిసైడ్ అయ్యాను.. -
ఆరత్రికా రెడ్డి బ్యాంకుకి రూ. 10 వేల కోట్లు చెల్లించాలి!
‘తెలుగు వెబ్ సిరీస్‌లలో ‘లెవన్త్ అవర్’కు ఓ స్టాండర్డ్ ఉంది. అందుకే బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ అని కూడా అంటున్నారు. కాస్టింగ్, విజువల్స్ పరంగా వెబ్ సిరీస్ రిచ్‌గా ఉంటుంది’’ అని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు అన్నారు. తమన్నా లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ ‘లెవన్త్ అవర్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్ ఉప్పలపాటి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ‘ఆహా’ ఓటీటీలో నేటి నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తారు గురువారం నాడు విలేఖరులతో మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాను. నా తొలి వెబ్ సిరీస్ ఇది. ఓ హోటల్లో రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు జరిగే కథ ఇది. ఈ తక్కవ సమయంలోనే ఆరత్రికా రెడ్డి (తమన్నా) బ్యాంకుకి పదివేల కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇంతకీ ఆమె డబ్బులు చెల్లించిందా, లేదా అనేదే కథ. తొలి నాలుగు ఎపిసోడ్స్ ఓ పేస్‌లో ఉంటే.. చివరి నాలుగు ఎపిసోడ్స్ మరో పేస్‌లో ఉంటాయి. 42 రోజులు షూటింగ్ అనుకున్నా టీమ్ సహకారంతో 33 రోజుల్లోనే పూర్తి చేశాం. సెన్సార్ పరిధి దాటి ఏ సన్నివేశాన్నీ తీయలేదు’’ అన్నారు. చదవండి: హీరోయిన్ అంజలికి కరోనా..ఆమె ఏమందంటే.. ఫొటోలు: మాల్దీవుల్లో జాన్వీ సందడి -
స్నేహితులే శత్రువులుగా..
హీరోయిన్ తమన్నా నటించిన వెబ్ సిరీస్ ‘లెవన్త్ అవర్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ప్రదీప్ ఉప్పలపాటి ఈ సిరీస్‌కు రైటర్‌గా వ్యవహరించడంతో పాటు నిర్మించిన వెబ్ సిరీస్ ఉగాది సందర్భంగా ‘ఆహా’లో ఏప్రిల్ 9 నుంచి ప్రసారం కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మల్టీ బిలియన్ డాలర్స్ కంపెనీ ఆదిత్య గ్రూప్‌కి అరత్రికా రెడ్డి సీఈఓ. ఈ కంపెనీ అనుకోకుండా ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఆమె స్నేహితులే శత్రువులుగా మారతారు. ఎగ్జయిట్‌మెంట్‌తో కూడిన ఈ ఈ గందరగోళం నుంచి బయటపడటానికి అరత్రిక ఎలా పోరాడింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ‘లెవన్త్ అవర్’ రూపొందింది. ఉపేంద్ర నంబూరి రచించిన ‘8 అవర్స్’ పుస్తకం స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించాం. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవింపుగా 8 ఎపిసోడ్స్‌తో రూపొందింది’’ అన్నారు. ‘‘పురుషాధిక్య ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకోవడానికి అరత్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింది? అనేది ఇందులో ప్రధానాంశం’’ అన్నారు తమన్నా. -
ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్
ఓ సీక్రెట్ మిషన్ యాక్షన్ మిషన్ కోసం మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్, గయాక్షన్ మిషన్ ఫైరింగ్‌లో శిక్షణ పొందుతున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు నాగ్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ‘రా’ ఏజెంట్‌గానే కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్‌గా ఉండాలని ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు కాజల్. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు కాజల్. -
ఇదే తొలిసారి.. ‘చందమామ’తో నాగ్ రొమాన్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాల వేగాన్ని పెంచాడు. కరోనా సంక్షోభం నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా, ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో మరో సినిమా మొదలుపెట్టాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో నటించనున్నాడు. ఇందులో నాగార్జున చెల్లిగా చండీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్ పనాగ్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో తొలిసారి కాజల్ అగర్వాల్ నాగార్జునకు జోడిగా నటిస్తోంది. టాలీవుడ్లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించిన కాజల్, నాగార్జునతో మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో నటించే చాన్స్ వచ్చినా.. వదులుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ సారి మాత్రం నాగార్జున సినిమా అనగానే.. కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. మార్చి 31 నుండి హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్లో కాజల్ పాల్గొనబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్, శరత్ మరార్, పుస్కూరి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చదవండి: ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్ సినిమా పాపం 'గాలి సంపత్' అప్పుడే ఓటీటీ బాట! -
హైదరాబాద్‌లో ప్రారంభమైన నాగార్జున కొత్త సినిమా
టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున అక్కినేని తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘గరుడవేగ’ మూవీతో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాదులో ఇవాళ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీకి ఆయన క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. కాగా ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, శరత్ మరార్‌కు చెందిన ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇక త్వరలోనే ఇతర తారాగణాన్ని కూడా చిత్రయూనిట్ ప్రకటించనుంది. కాగా షూటింగ్స్ తిరిగి పున: ప్రారంభం కావడంలో నాగార్జున తన చిత్రాల స్పీడును పెంచినట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్ ప్రారంభించిన అయిన చిత్రాలు ‘వైల్డ్ డాగ్’, బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లను ఇటీవల ఆయన పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ మూవీతో నాగార్జునను వినూత్నంగా చూపించేందుకు ప్రవీణ్ సత్తారు చాలా హోంవర్క్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి కావడంతో ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకోచ్చే పనిలో పడ్డట్లు మూవీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
నాగార్జున కొత్త సినిమా షురూ
-
కొత్త కాంబినేషన్!
‘గని, ఎఫ్3’ చిత్రాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాల తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కూడా కమిటయ్యారని టాక్. ‘చందమామ కథలు, పీయస్వీ గరుడవేగ’ చిత్రాలను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం లండన్‌లో జరపాలనుకుంటున్నారన్నది వార్త. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని’, ’ఎఫ్ 3’ సినిమాలు చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ‘11 హవర్’ అనే వెబ్ సిరీస్ చేశారు. నాగార్జున హీరోగా ఓ సినిమా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ ఏడాది చివరికి వరుణ్–ప్రవీణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ఊహించవచ్చు. -
మంచి నటి అనిపించుకుంటాను
‘‘అల్లు అరవింద్‌గారి సినిమాల వల్ల నేను యాక్టర్ నుండి స్టార్ అయ్యాను. ఇప్పుడు చేస్తున్న ‘లెవెన్త్ అవర్’ సిరీస్ వల్ల ఓ స్టార్ నుండి మంచి నటిగా పేరు తెచ్చుకుంటానని భావిస్తున్నాను. ఓ నటిగా తెలుగు సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. తెలుగు కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్ తమన్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. త్వరలో ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ సిరీస్ టైటిల్, పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కొన్ని గంటల్లో నడిచే కథ ‘లెవెన్త్ అవర్’. ప్రవీణ్ సత్తారు కథ నచ్చితేనే చేస్తాడు. ఈ సబ్జెక్ట్ బావుందని అన్నారు. ప్రదీప్‌గారు నిర్మాతే కాదు.. అద్భుతమైన రైటర్ కూడా. అందుకనే మా కోసం ఆయన్ని మరో వెబ్ సిరీస్ చేయమని అడిగాను’’ అన్నారు. ‘‘8 అవర్స్’ అనే బుక్ నుండి హక్కులు కొని ‘లెవెన్త్ అవర్’ కథ తయారు చేశాను’’ అన్నారు రచయిత, నిర్మాత ప్రదీప్. ‘‘ఓ సిరీస్‌కు కావాల్సిన అన్ని అంశాలు మా ‘లెవన్త్ అవర్’లో ఉన్నాయి. ఒక రాత్రిలో జరిగే కథ’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
నాగ్ – మహీ – ఓ సినిమా?
‘ఆనందోబ్రహ్మ, యాత్ర’ సినిమాలతో ఆకట్టుకున్నారు దర్శకుడు మహీ వి. రాఘవ్. తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే నాగార్జునను కలసి కథాచర్చలు జరిపారట మహీ. త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా ఉండబోతోందని టాక్. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నారు నాగ్. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక మïß వి. రాఘవ్ దర్శకత్వంలో సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమా క్రైమ్ జానర్లో ఉంటుందని సమాచారం. -
ఆ డైరెక్టర్‌తో నాగార్జున మూవీ ఫిక్స్
హీరో అక్కినేని నాగార్జున మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి ఒకే చెప్పారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తగా నిర్మించనున్నాయి. సోమవారం ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.(వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్) మరోవైపు ఈ చిత్రానికి నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. అయితే కరోనా లాక్డౌన్ అనంతరం.. ఒకటి రెండు సినిమాలు మినహా పెద్ద చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లు ఇంకా మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడూ మొదలవుతుందనేది వేచిచూడాలి. (బిగ్‌బాస్ ఎంట్రీపై శ్రద్ధా దాస్ క్లారిటీ) కాగా, నాగార్జున ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రానికి ప్రవీణ్ పక్కా పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రెడి చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, నాగార్జున ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. -
జోడీ కుదిరిందా?
ఇలియానా తెలుగు సినిమా కమిట్ అయి దాదాపు రెండేళ్లవుతోంది. ‘అమర్ అక్బర్ ఆంటోని’ తర్వాత ఈ గోవా బ్యూటీ మరో తెలుగు సినిమా అంగీకరించలేదు. అయితే ఇప్పుడు ఓ సినిమా సైన్ చేశారని సమాచారం. నాగార్జున సరసన ఇలియానా ఓ సినిమాలో నటించబోతున్నారట. నాగ్‌తో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించనున్న సినిమాలోనే ఆమె కథానాయికగా కనిపించబోతున్నారని టాక్. ఇందులో నాగార్జున సీఎస్ఓ (చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్) పాత్ర చేయనున్నారని సమాచారం. ఇటీవలే నాగార్జునను కలిసి ప్రవీణ్ సత్తార్ ఈ కథను వినిపించారట. ఈ కథ రీత్యా ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా ఉన్న హీరో ఓ మిషన్ కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా మారతారట. ఈ కథ బాగా నచ్చడంతో ప్రవీణ్ సత్తార్‌కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆ తర్వాత ఇలియానాని కూడా చిత్రబృందం సంప్రదించిందట. ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. -
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆఫీసర్, మన్మథుడు2 చిత్రాలతో ఘోర అపజయాలను మూటగట్టుకున్నారు. అంతకుముందు ‘దేవదాస్’ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలా వరుసగా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో ఆయన కాస్త వెనకపడ్డారు. దీంతో సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రంలో నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి. ప్రసుతం లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. (అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం) అయితే ఈ లాక్డౌన్ సమయంలో తన తదుపరి చిత్రాల కోసం కథలను అన్వేషించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు రచయితలు, దర్శకులు నాగార్జునను కలిసి కథలు వినిపించారు. అయితే చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ‘గరుడవేగ’తో కమర్షియల్ హిట్ అందించిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ చెప్పిన కథకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగార్జున ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని పక్కా పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను దర్శకుడు రెడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. (నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్!) గరుడవేగతో రాజశేఖర్‌కు హిట్ అందించిన ప్రవీణ్ మరి నాగార్జునకు కూడా అదే రేంజ్లో హిట్ అందించి మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొస్తాడో లేదో వేచి చూడాలి. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ‘వైల్డ్ డాగ్’ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాన్ని నాగార్జున చేస్తారని వార్తల వచ్చాయి. దీంతో ‘వైల్డ్ డాగ్’ తర్వాత బంగర్రాజు చిత్రాన్ని చేస్తారా? లేక ప్రవీణ్ సత్తారు సినిమాను తెరకెక్కిస్తారనే దానిపై స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. -
‘విధి విలాసం’ చిత్రం ప్రారంభం
-
మూడు కోణాలు
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విధి విలాసం’. ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ– ‘‘ఆదిత్ నాకు మంచి సన్నిహితుడు. తనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమా కథ కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శివాత్మిక రాజశేఖర్. ‘‘ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తాం. వేసవిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి. ‘‘దశరథ్ గారి దగ్గర దుర్గ నరేష్ దర్శకత్వ శాఖలో పనిచేశారు.. మంచి ప్రతిభావంతుడు’’ అన్నారు అరుణ్ ఆదిత్. కోట శ్రీనివాసరావు, ఇంద్రజ, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాచర్ల. -
బాహుబలి ప్రీక్వెల్
డిజిటల్ మాధ్యమంలో నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త షోలతో ముందుకొస్తోంది. సొంతంగా సినిమాలనూ రిలీజ్ చేస్తోంది. ఈ ఏడాది ఏకంగా ఎనిమిది సినిమాలు, ఒక సిరీస్‌తో రానున్నట్టు పేర్కొంది. రాజమౌళి సూపర్ హిట్ ఫ్యాంటసీ చిత్రం ‘బాహుబలి’ ప్రీక్వెల్ నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌గా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరీస్‌లో నటించే వారిని తాజాగా అనౌన్స్ చేసింది. శివగామిగా మృణాల్ ఠాకూర్, స్కందదాస్గా రాహుల్ బోస్, అతుల్ కులకర్ణి, అనూప్ సోనీ వంటి నటులు ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ సిరీస్‌ను దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనున్నారు. -
ఫస్ట్‌లుక్ 7th August 2018
-
పట్టాలెక్కనున్న గోపీచంద్ బయోపిక్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ బయోపిక్ ను తెరకెక్కించేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కారణాలు వెల్లడించకపోయినా ప్రాజెక్ట్ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ లో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాదాస్పద అంశాల జోలికి పోకుండా కేవలం ఆటకు సంబంధించిన అంశాలతోనే సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, గోపీచంద్ పాత్రలో నటించేందుకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో అదితిరావు హైదరి హీరోయిన్గా నటించారు. -
గరుడవేగ దర్శకుడితో తమిళ హీరో
రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ గరుడవేగ. చాలా కాలం తరువాత రాజశేఖర్ కు సక్సెస్ అంధించిన ఈ సినిమాతో దర్శకుడు ప్రవీన్ సత్తారు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. గరుడవేగ సక్సెస్తరువాత చాలా మంది హీరో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించేందుకు ముందుకు వచ్చారు. అయితే ప్రవీణ్ సత్తారు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రామ్ హీరోగా సినిమాను తెరకెక్కించాలని భావించాడు. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళ స్టార్ మీరో ధనుష్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ప్రవీణ్ సత్తారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించాల్సిన ఈ సినిమా ధనుష్ తో అయితే మార్కెట్ పరంగా ఎలాంటి రిస్క్ ఉండదని భావిస్తున్నాడట. ఇప్పటికే ధనుష్‌కు కథ కూడా వినిపించాడని.. సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది. -
రామ్ సినిమా ఆగిపోయిందా..?
ప్రస్తుతం హలో గురూ ప్రేమకోసమే సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ హీరో రామ్, ఈ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ లో నటించేందుకు ఓకె చెప్పాడు. గరుడవేగ సినిమాతో సక్సెస్ సాధించిన ప్రవీణ్, రామ్ హీరోగా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలన భావించాడు. అయితే ప్రస్తుతం ఉన్న రామ్ మార్కెట్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాదన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. నేను శైలజ తరువాత రామ్ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ సమయంలో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తే రిస్క్ అన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
విలన్‌గా మారనున్న యాంగ్రీ హీరో
చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక్సెస్ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు యాంగ్రీ హీరో. కేవలం హీరోగానే కాకుండా కీలకమైన పాత్రల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు. గతంలో ధృవ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటించాల్సి ఉన్న అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించేందుకు రాజశేఖర్ అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇటీవల ప్రారంభించారు. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్నారట. తనకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన ప్రవీణ్ కోరటంతో రాజశేఖర్ ప్రతినాయక పాత్రకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను జార్జియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలలో చిత్రీకరించనున్నారు. -
ఐశ్వర్య డైరెక్షన్లో రాజశేఖర్!
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమయిన యాంగ్రీ యంగ్‌మాన్ రాజశేఖర్ కెరీర్ మళ్లీ ‘గరుడవేగ’తో ఊపందుకుంది. దీంతో ఆయన మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ.. తాను అంగీకరించిన సినిమాలు అన్నీ కొత్త కథలే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘3’ సినిమాతో దర్శకురాలిగా కెరీర్‌ను ప్రారంభించి, మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందారు ఐశ్వర్య ధనుష్. ఇటీవలే రాజశేఖర్‌ను కలిసి సినిమా కథను వినిపించారని, ద్విభాష చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రవీణ్ సత్తారుతో, ‘అ!’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్వర్మతో కూడా రాజశేఖర్ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కూడా డిఫరెంట్ జానర్లో తెరకెక్కబోతున్నాయని సమాచారం. వీటన్నింటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. -
అడ్వెంచర్ ట్రిప్ స్టార్ట్
ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ కుదిరింది. ఇద్దరి స్టైల్‌కి తగ్గట్టుగానే యాక్షన్ అడ్వెంచర్‌లో సాగే న్యూ ఏజ్ సినిమాకు శ్రీకారం చుట్టారు. పి.కృష్ణ చైతన్య సమర్పణలో రామ్, మాళవిక శర్మ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ యాక్షన్ అడ్వెంచర్‌ను ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ– ‘‘మే7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే లాస్ట్ వీక్ వరకూ ఫస్ట్ షెడ్యూల్ చేస్తాం. తర్వాత ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. విదేశాల్లో షెడ్యూల్ అయిపోయాక కాశ్మీర్, లడఖ్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చే శాం. ఇది న్యూ ఏజ్ మూవీలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రామ్‌కి సరిపోయే కథ ఇది. స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. యాక్షన్, అడ్వెంచర్ అంశాలు ఉంటాయి. టాప్ టెక్నీషియన్స్ మా సినిమాకు పని చేయబోతున్నారు. అందర్నీ మెప్పించే చిత్రం అవుతుంది’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. -
రామ్ కొత్త సినిమా ఓపెనింగ్
యంగ్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ రోజు (26-04-2018) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పటికే కాంబినేషన్ పరంగా మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో ఉంటుందంటున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘ఈ రోజు హైదరాబాద్‌లో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలను నిర్వహించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలోని సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. విదేశాల నుంచి తిరిగి వచ్చాక కాశ్మీర్, లడఖ్‌లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. న్యూ వేవ్ లో సాగే చిత్రమిది. మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని చెప్పారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ‘హీరో రామ్‌కి చక్కగా సరిపోయే కథ కుదిరింది. స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్, అడ్వంచరస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. న్యూ వేవ్‌లో సాగే సినిమా. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు, నటీనటులు మా చిత్రానికి పనిచేస్తారు. అందరినీ మెప్పించే సినిమా అవుతుంది’ అని అన్నారు. -
గరుడ వేగ సినిమా ప్రదర్శించొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో రాజశేఖర్ నటించిన ‘పీయస్వీ గరుడ వేగ’ చిత్రాన్ని ప్రదర్శించరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గరుడ వేగ సినిమాపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారించిన సివిల్ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దంటూ దర్శకనిర్మాలతో పాటు, యూట్యూబ్‌కు కోర్టు నోటీసులు పంపింది. అసలేం జరిగింది? గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు నాల్గవ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సదరు సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు.. ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ స్కాంను ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ పాత్రధారుడిగా హీరో వెలికి తీసినట్టు చూపారని లాయర్ పేర్కొన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీంతో పిటిషనర్ వాదనలను పరిశీలించిన జడ్జి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేశారు. చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు గతేడాది నవంబరులో వచ్చిన గరుడ వేగ మంచి విజయం అందించిన విషయం తెలిసిందే . సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు రావడం గమనార్హం. -
ఎనిమిదేళ్ల తర్వాత..!
సాక్షి, సినిమా : సినీ ఇండస్ట్రీలో హిట్పెయిర్కు భలే క్రేజ్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందని అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారని అంటారు. ఒక వేళ సినిమా ఆడకపోతే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదని విమర్శిస్తారు. హీరో రామ్, హీరోయిన్ కాజల్ తీసిన గణేశ్ సినిమా విజయం సాధించకపోయేసరికి వీరిరువురు కలిసి మరో సినిమా తీయలేదు. ఫ్లాప్ కాంబినేషన్ కావటంతో దర్శక నిర్మాతలు ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఎనిమిదేళ్ల తర్వాత రామ్, కాజల్‌లు కలిసి నటించనున్నారు. గరుడవేగతో విజయం సాధించిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వీరు హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభకానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర పూర్తి వివరాలను యూనిట్ సభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రవీణ్ సత్తార్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా గ్యాప్ తర్వాత తొలి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్‌రామ్‌తో ఎమ్మెల్యేలో నటించిన కాజల్.. ఇప్పటికే సినిమా లుక్స్ అందరినీ ఆకట్టుకోగా, ఇప్పుడు మరో సినిమాలో ఎనిమిదేళ్ల తర్వాత రామ్ సరసన నటించనుంది. మరి ఈ సినిమాతోనైనా హిట్ జోడిగా పేరు తెచ్చుకుంటుందో చూడాలి. -
‘గరుడవేగ’ దర్శకుడితో రామ్
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో డిసెంట్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హలో గురు ప్రేమకోసమే అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా తరువాత రామ్ ఓ అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నాడట. ఇటీవల రాజశేఖర్ హీరోగా ఘనవిజయం సాధించిన పీఎస్వీ గరుడవేగ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో రామ్ ఈ భారీ చిత్రాన్ని చేయనున్నారు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యంగ్ హీరో
సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన పీయస్వీ గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల నితిన్ హీరో ప్రవీణ్ సత్తారు సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా విషయంలో క్లారిటీ రాకముందే ఇప్పుడు మరో యంగ్ హీరో పేరు తెర మీదకు వచ్చింది. ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్ హీరోగా ప్రవీణ్ సినిమా తెరకెక్కించనున్నాడట. రామ్ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా మొదలెట్టేలా ప్లాన్ చేస్తున్నాడట రామ్. భవ్యక్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రటన వెలుడనుంది. -
జీఎస్టీ-2లో నటిస్తా..!
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ-2(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)లో నటించేందుకు తాను సిద్ధమని యాంకర్, నటి రష్మీ గౌతమ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తే కచ్చితంగా జీఎస్టీ-2లో నటిస్తానని తెలిపారు. బుధవారం ట్విట్టర్ ఫాలోవర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ‘జీఎస్టీ 2’లో నటిస్తారా?అని ప్రశ్నించారు. దీనికి ఆమె ‘నటిస్తా.. కానీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాలి’ అని బదులిచ్చారు. అనంతరం మరో అభిమాని మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా? అని అడిగారు. దానికి ఆమె ‘అవును.. ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. -
యంగ్ హీరో న్యూ ఇయర్ ప్లాన్స్
కొత్త ఏడాదిలో వరుస సినిమాలతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఈ ఏడాది తాను చేయబోయే సినిమాలను కూడా ప్రకటించాడు. గత ఏడాదిలో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు సుధీర్. 2017లో రిలీజ్ అయిన శమంతకమణి సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన సుధీర్ బాబు ఈ పాత్ర ద్వారా తన తల్లి తనకు మరింత దగ్గరయ్యిందని తెలిపాడు. ఇక 2018లో తాను నాలుగు సినిమాలు చేయబోతున్నట్టుగా వెల్లడించాడు. జాతీయ అవార్డు పొందిన దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రవీణ్ సత్తారులతో సినిమాలు చేయనున్న సుధీర్ ఇంద్రసేన, ఆర్ఎస్ నాయుడు అనే కొత్త దర్శకులతోనూ సినిమాలు చేయనున్నాడు. అంతేకాదు ఈ ఏడాదిలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభిస్తున్నాడు. Finally can’t thank enough all my supporters & well wishers...thank you for being there next to me & hopefully you continue to do that in 2018🙏 wish you & your family a very #HappyNewYear 🤗🤗 — Sudheer Babu (@isudheerbabu) 1 January 2018 -
త్రీ కజిన్స్.. వన్ బ్రదర్ ఓకే!
నితిన్–రానా–నారా రోహిత్ కజిన్స్‌గా నటించనున్నారా? ‘పీఎస్వీ గరుడ వేగ’ హిట్ జోష్‌లో ఉన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా తీయనున్నారా? ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో ఇదే హాట్ టాపిక్. నితిన్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా ఆల్రెడీ షురూ అయిన విషయం తెలిసిందే. ఇది మల్టీస్టారర్ మూవీ అని, ఇందులో రానా, నారా రోహిత్ నటించనున్నారనే వార్త షికారు చేస్తోంది. ఈ విషయం గురించి ప్రవీణ్ సత్తారుని ‘సాక్షి’ సంప్రదించగా.. ‘‘మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నానన్నది నిజమే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. కథ రెడీ. ఇందులో ముగ్గురు హీరోలుంటారు. వారిలో నితిన్ ఒక్కరే ఫైనల్. నితిన్‌కి మాత్రమే కథ వినిపించాను. రానా, నారా రోహిత్ నటిస్తున్నారన్నది నిజం కాదు. ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. టైటిల్ ఇంకా ఏమీ అనుకోలేదు. కొత్త ఏడాదిలో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌లో ఈ సినిమా రూపొందనుంది. కాగా, ఈ చిత్రానికి ‘3 కజిన్స్’ టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. త్రీ కజిన్స్ అంటే హీరోయిన్స్ పాయింటాఫ్ వ్యూలోనూ ఉండొచ్చు. అయితే.. ఈ టైటిల్ హీరోలను ఉద్దేశించి ఫిక్స్ చేసినదే అని భోగట్టా. -
టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్?
సాక్షి, సినిమా : వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రీసెంట్గా గరుడవేగ చిత్ర ఘన విజయం సాధించటంతో అతనితో పని చేసేందుకు యువహీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తన తర్వాతి చిత్రం ప్రవీణ్‌తో ఉంటుందని స్వయంగా నితిన్ ప్రకటించటం చూశాం. అయితే అది మాములు చిత్రం కాదన్న సంకేతాలు ఇప్పుడు అందుతున్నాయి. ముగ్గురు యువ హీరోలతో ప్రవీణ్ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నాడని చెబుతున్నాడని ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘త్రీ కజిన్స్’ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతుందని టాక్. నితిన్ ఓ హీరోగా ఇప్పటికే ఎంపిక కాగా, మిగతా ఇద్దరు హీరోలుగా రానా, నారా రోహిత్‌లను తీసుకునే అవకాశం ఉందంట. ఒకవేళ అదే జరిగితే మాత్రం ప్రేక్షకులకు మరో క్రేజీ సినిమా అందినట్లే అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు యువహీరోలు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. -
అందువల్లనే థియేటర్లకు రావడం లేదేమో!
‘‘నా స్వస్థలం ఏలూరు. సినిమాలంటే ఆసక్తి. దర్శకుడు కావాలన్నది నా గోల్. నాన్నగారి సలహా మేరకు సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్‌లో పీజీ డిప్లొమా చేశా’’ అన్నారు ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పి.ఎస్.వి గరుడవేగ’ సినిమాకి ధర్మేంద్ర ఎడిటర్‌గా వర్క్ చేశారు. ‘‘నా తొలి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ‘గరుడవేగ’ అని ధర్మేంద్ర చెబుతోన్న విశేషాలు... ► ఎడిటర్లు శ్రీకర్‌ప్రసాద్, మార్తాండ్ కె. శంకర్లు నాకు స్ఫూర్తి. ఎడిటర్‌గా ‘ప్రస్థానం’ నా తొలి సినిమా. ఎడిటర్ శ్రవణ్ నా బ్యాచ్‌మేట్. తను బిజీగా ఉండటంతో ఆ సినిమా అవకాశాన్ని నాకు ఇప్పించారు. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం ఎదురుచూసే అవసరం రాలేదు. ఫిల్మ్ ఎడిటింగ్కీ, డిజిటల్ ఎడిటింగ్కీ మాన్యువల్ వర్క్ తగ్గిందే తప్ప... బ్రెయిన్ పరంగా కాదు. డిజిటల్ ఎడిటింగ్‌లో సగం టైమ్ తగ్గుతోంది. నాగచైతన్య ‘దడ’ ఎడిటర్‌గా నాకు పెద్ద సినిమా. నా మూడో సినిమా కూడా! భారీ డిజాస్టర్ అది. అందుకే పెద్ద సినిమా అవకాశాలు రాలేదనుకుంటున్నా. ► మన సినిమాలు జనరల్‌గా 2కె ఔట్పుట్లోనే ఉంటాయి. ‘బాహుబలి’ తర్వాత ‘గరుడవేగ’కి మాత్రమే 4కె రిజల్యూషన్ అవుట్‌పుట్ ఇచ్చాం. అందుకే క్వాలిటీకి అంత అభినందనలొస్తున్నాయి. 4కె టెక్నాలజీలో చేయాలంటే ఖర్చు ఎక్కువ. అందువల్ల, నిర్మాతలు ఒప్పుకోరు. ఫిల్మ్ క్వాలిటీగా ఉంటేనే... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఇప్పుడు యూట్యూబ్‌లో క్వాలిటీ పెంచుకుని చూస్తే ఎలా ఉంటుందో... స్క్రీన్‌పైనా అలాగే ఉంటోంది. అందుకే, థియేటర్స్‌కి ప్రేక్షకులు తగ్గిపోతున్నారేమో! అని నా ఫీలింగ్. ► ట్రైలర్స్ కట్ చేసేవాళ్లు ఎడిటర్ కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. అది పబ్లిసిటీ. ‘గరుడవేగ’ ఎడిటింగ్‌కి 195 రోజులు వర్క్ చేశాం. ► రెండేళ్ల తర్వాత డైరెక్షన్ చేద్దామనుకుంటున్నా. కథ రెడీ చేసుకుంటున్నా. పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో పాటు శ్రేష్ట్ మూవీస్‌లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వం చేయబోతున్న సినిమాలకు నేను పనిచేయబోతున్నా. -
ఆ సినిమా అద్భుతం : మహేష్ బాబు
సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గరుడ వేగ. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తోంది. చాలా కాలం తరువాత ఓ సూపర్ హిట్ తో అలరించిన హీరో రాజశేఖర్‌కి సినీ ప్రముకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా గరుడ వేగ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. ‘గొప్ప స్క్రిప్ట్, మంచి నటన, పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లే. పీవీయస్ గరుడ వేగ అద్బుతం. హీరో రాజశేఖర్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు లకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్. రాజశేఖర్ ఎన్ఐఏ ఏజెంట్ గా నటించిన గరుడ వేగ సినిమా తొలి వారంలోనే 15 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సత్తా చాటింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ సరసన పూజ కుమార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అదిత్ అరుణ్, శ్రద్ధా దాస్, కిశోర్, చరణ్‌దీప్, రవివర్మలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. Great script... Good performances... Slick screenplay... #PSVGarudaVega is stunning... Amazing work by the entire team. Take a bow @ActorRajasekhar & director @PraveenSattaru ! — Mahesh Babu (@urstrulyMahesh) 11 November 2017 -
నెక్ట్స్ మిషన్...
మిషన్ గరుడవేగ... రాజశేఖర్ హీరోగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన ‘పీఎస్వీ గరుడవేగ’ మంచి హిట్ టాక్‌తో రన్ అవుతోంది! గరుడవేగ హిట్‌తో ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడి నెక్ట్స్ సినిమా ఎవరితో? నితిన్‌తో! యస్, ప్రవీణ్ సత్తారు నెక్ట్స్ మిషన్... నితిన్‌తోనే. ‘‘నా తర్వాతి చిత్రాన్ని వెరీ టాలెంటెడ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో చేయబోతున్నా’’ అన్నారు నితిన్. -
వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్
సాక్షి, సినిమా : చందమామ కథలు చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తాజాగా పీఎస్వీ గరుడ వేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న సీనియర్ హీరో రాజశేఖర్‌కు కమ్ బ్యాక్ అని చెప్పుకుంటున్నారు. మరోపక్క సై-ఫై థ్రిల్లర్‌గా చిత్రాన్ని అద్భుతంగా మలిచాడంటూ దర్శకుడు ప్రవీణ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రవీణ్ సత్తారు తన తర్వాతి చిత్రం యంగ్ హీరో నితిన్ తో చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో తెలియజేశాడు. తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లోనే ఈ చిత్రం ఉండబోతుందని.. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని నితిన్ పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం నితిన్ రౌడీ ఫెల్లో ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లు సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లై బ్యూటీ మేఘా ఆకాశ్ మరోసారి నితిన్ పక్కన మెరవనుంది. Happy to announce that next film under Sreshth movies wil b directed by the very talented @PraveenSattaru 😃 other details soon.. — nithiin (@actor_nithiin) November 6, 2017 -
'పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్'
టైటిల్ : పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : రాజశేఖర్, పూజా కుమార్, కిశోర్, అదిత్ అరుణ్, నాజర్, పోసాని కృష్ణమురళీ సంగీతం : శ్రీచరణ్ పాకల, భీమ్స్ దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు నిర్మాత : ఎమ్. కోటేశ్వర రాజు, మురళీ శ్రీనివాస్ చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గుంటూరు టాకీస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో గరుడ వేగను తెరకెక్కించారు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రాజశేఖర్ సక్సెస్ సాధించారా..?(సాక్షి రివ్యూస్) తొలిసారిగా భారీ బడ్జెట్ చిత్రాన్ని డీల్ చేసి దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏమేరకు ఆకట్టుకున్నారు. కథ : చంద్రశేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో అసిస్టెంట్ కమిషనర్. తన ఉద్యోగం సంగతి భార్యతో కూడా చెప్పుకోలేని శేఖర్, తన మిషన్స్ కారణంగా తరుచు భార్య స్వాతి(పూజా కుమార్)తో గొడవ పడుతుంటాడు. ఇక ఉద్యోగం వద్దు అనుకొని రాజీనామ చేసే సమయంలో ఓ కేసు శేఖర్ దగ్గరకు వస్తుంది. నిరంజన్ (అదిత్ అరుణ్) తన దగ్గర ఉన్న ఓ ఇన్ఫర్మేషన్ను ప్రతిపక్షనాయకుడు ప్రతాప్ రెడ్డి(పోసాని కృష్ణమురళీ)కి బేరం పెడతాడు. పది కోట్లకు ఆ ఇన్ఫర్మెషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్న నిరంజన్ చివరి నిమిషంలో శేఖర్‌కి దొరికిపోతాడు. కానీ ఎన్ఐఏ కస్టడీలో ఉండగానే నిరంజన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ శత్రువు చేతికి వెళ్లిపోతుంది.(సాక్షి రివ్యూస్) అసలు నిరంజన్ దగ్గర ఉన్న సమాచారం ఏంటి..? ఆ సమాచారంతో ప్రతాప్ రెడ్డి పనేంటి..? అనుకున్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ ప్రతాప్‌రెడ్డికి చేరిందా..? ఈ మిషన్ తో క్రిమినల్ జార్జ్ కు సంబంధం ఏంటి..? నటీనటులు : తనకు బాగా అలవాటైన పోలీస్రోల్లో రాజశేఖర్ మరోసారి అద్భుతంగా నటించి మెప్పించారు. గతంలో పోలీస్రోల్స్తో ఆకట్టుకున్న రాజశేఖర్ సరైన పాత్ర దొరికితే మరోసారి సత్తా చాటగలనని నిరూపించుకున్నారు. హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. రాజశేఖర్ టీం మెంబర్స్ గా చరణ్ దీప్, రవివర్మలు తమ పాత్రకు న్యాయం చేశారు. పోసాని కృష్ణమురళీ రాజకీయనాయకుడి పాత్రలో మరోసారి అలరించగా, అలీ, 30 ఇయర్స్ పృధ్వీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. కీలక పాత్రలో నటించిన అదిత్ అరుణ్ ఈ సినిమాతో మంచి మార్కులు సాధించాడు. గత చిత్రాల్లో లవర్ బాయ్ లుక్స్‌లో కనిపించిన అదిత్ ఈ సినిమాతో డిఫరెంట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.(సాక్షి రివ్యూస్) విలన్ పాత్రలో నటించిన కిశోర్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నా.. పెద్దగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న పాత్ర కాకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇతర పాత్రల్లో శ్రద్దాదాస్, షియాజీ షిండే, శత్రులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : రాజశేఖర్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించే బాధ్యతను తీసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు అనుకున్న విజయం సాధించారు. యాక్షన్ థ్రిల్లర్‌కు కావాల్సిన పర్ఫెక్ట్ కథను రెడీ చేసుకున్న దర్శకుడు అదే స్థాయి టేకింగ్ తో అలరించాడు. పూర్తిగా టెక్నాలజీ, మైండ్ గేమ్ కు సంబందించిన అంశాలతో కథను నడిచిన ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించటంలో సక్సెస్ సాధించారు. అయితే సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడా కథ స్లో అయినట్టుగా అనిపించినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, అన్నింటినీ కవర్ చేసేస్తాయి. సినిమాకు మరో మేజర్ ఎసెట్ సంగీతం. భీమ్స్ కంపోజ్‌చేసిన రెండు పాటలు బాగున్నాయి.(సాక్షి రివ్యూస్) శ్రీచరణ పాకల అందించిన నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫి సినిమా మూడ్ ను క్యారీ చేసేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, నైట్ ఎఫెక్ట్ లో తీసిన సీన్స్ సూపర్బ్‌గా వచ్చాయి. సన్నిలియోన్ స్పెషల్‌సాంగ్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రాజశేఖర్ నటన కథా కథనం నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే మసాలా ఎలిమెంట్స్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
బడ్జెట్‌తో డైరెక్టర్‌కి సంబంధం లేదు
‘‘పోస్టర్స్, ట్రైలర్స్ నచ్చితేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు. ప్రజెంట్ సిట్యువేషన్లో సినిమా బాగుంటే చాలు. బాగా లేకపోతే వంద కోట్లతో తీసిన సినిమా 20 కోట్లు కూడా వసూలు చేయలేకపోవచ్చు. బడ్జెట్, హీరో ఇంపార్టెంట్ మేటర్ కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది. లేకపోతే ఆడదు’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తారు చెప్పిన సంగతులు... ► రాజశేఖర్‌గారి మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాకు అంత బడ్జెట్ ఖర్చుపెట్టారా? అంటే... ఇప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ 4 కోట్లతో తీశారు. సినిమా హిట్ కాకముందు ఆ హీరో (విజయ్ దేవరకొండ) సిన్మాకి 4 కోట్లు ఎక్కువే కదా! విడుదలైన తర్వాత 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ► ప్లానింగ్ ఉంటే ఇంకా తక్కువ బడ్జెట్లోనే ‘పీఎస్వీ గరుడవేగ’ను తీయొచ్చంటున్నారు. డైరెక్టర్‌కి, బడ్జెట్‌కి సంబంధం లేదు. బడ్జెట్ ప్లానింగ్ లైన్ ప్రొడ్యూసర్స్ది. తెలుగులో ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ పట్టుకుని వస్తే సిన్మా బడ్జెట్ ఎంత? అనడుగుతారు. మోస్ట్ స్టుపిడ్ క్వశ్చన్ అది. డైరె క్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి అసలు సంబంధం ఏంటి? స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు లైన్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడక్షన్ టీమ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. బేసికల్లీ లైన్ ప్రొడ్యూసర్స్ అందరూ ఎమ్.బి.ఏ చేయాలి. వారు బడ్జెట్‌ను తగ్గించేలా ప్లాన్ చేయాలి. ► నా ప్రతి సినిమాకి సెన్సార్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ‘చందమామకథలు’ సినిమాలో నరేశ్, ఆమని ముద్దు సీన్‌కి సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పారు. ఈ ఏజ్‌లో ఏంటి? అన్నారు. క్యారెక్టర్ పరంగా ఆ ఎమోషన్స్‌ను వారు అర్థం చేసుకోలేకపోయారు. సెన్సార్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలా... మార్నింగ్ వెళ్లి ఏవో నాలుగు సంతకాలు పెట్టి ఇంటికెళ్లిపోతే చాలు అన్నట్టుంది. ఎవరికీ రూల్స్ తెలియవు. ఈ సినిమాకి ‘యు’ సర్టిఫికెట్ వస్తుందనుకున్నా. సినిమాలో పోలీసాఫీసర్లను, గవర్నమెంట్ ఉద్యోగులను తిట్టకూడదట! ఎవరైతే గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తున్నారో... వారందరూ మంచోళ్లు. వాళ్లను పొగడాలి. సినిమాలో సీన్‌కి తగ్గట్టు గవర్నమెంట్ ఆఫీసర్ని వ్యతిరేకంగా చూపించడం తప్పా? తప్పే అంటే... మనం చైనాలో బతుకుతున్నామా? ఇండియాలో బతుకుతున్నామా? ఈ సినిమాకి 10 కట్స్ అన్నారు. ఫైనల్‌గా 5 ఆడియో కట్స్ వచ్చాయి. ఫైవ్ కట్స్కి కూడా రివైజింగ్ కమిటీకి వెళ్లేవాణ్ణి. కానీ టైమ్ లేదని వదిలేశా. అందులో ఒకటే వ్యాలిడ్ కట్ అనుకుంటున్నా. ► నెక్ట్స్ సుధీర్‌బాబు హీరోగా తెలుగు, హిందీ భాషల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లల గోపీచంద్ బయోపిక్ తీయబోతున్నా. వచ్చే ఏడాది మార్చిలో షూట్ స్టార్ట్ చేసి, 2019లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ గ్యాప్‌లో నేను మరో సినిమా చేసే అవకాశం ఉంది. -
బాబోయ్... ఫుల్ పేజీ డైలాగ్
ఏం చేయాల్రా బాబు... అసలే తెలుగు సరిగా రాదు!! దీనికి తోడు ఫుల్ పేజీ తెలుగు డైలాగు చేతిలో పెట్టి, త్వరగా టేక్‌కి రెడీ అవ్వమని చెబుతున్నారంటూ నోరెళ్లబెట్టారు శ్రద్ధా దాస్. ఈ మేడమ్‌గారు బెంగాలీ. ఆల్మోస్ట్ పదేళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తుండడంతో తెలుగు కొంచెం కొంచెం నేర్చుకున్నారు. కానీ, ఫుల్ పేజీ డైలాగులు చెప్పేసేంత తెలుగు రాదు. పైగా, అందులో కొన్ని నోరు తిరగని డైలాగులు ఉన్నాయట. దాంతో కొంచెం కష్టపడి ప్రాక్టీస్ చేసి, టేక్ ఫినిష్ చేశారట! రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మిస్తున్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎమ్’. ఇందులో శ్రద్ధాదాస్ జర్నలిస్ట్ కమ్ న్యూస్ రీడర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆమెపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ నోట్ చేసుకోవలసిన పాయింట్ ఏంటంటే... రియల్ లైఫ్‌లో కూడా శ్రద్ధాదాస్ జర్నలిస్టే. హీరోయిన్ కాకముందు జర్నలిజమ్‌లో డిగ్రీ కంప్లీట్ చేశారు. -
చుక్కేస్తే స్టెప్పేయాల్సిందే!
ఎవరైనా చిందులేయాలంటే నోట్లో చుక్క పడాలా? అవసరం లేదు కదూ! కానీ, నోట్లో మాత్రం చుక్క పడితే... ఎవరైనా ఆటోమేటిక్‌గా చిందులేస్తారు. నడకలో, నడతలో స్టెప్పులే... స్టెప్పులు! అందులోనూ ప్రముఖ శృంగారతార సన్నీ లియోన్ నోట్లో చుక్కేసుకునే కొట్టు దగ్గర చిందులేస్తుంటే... ఆమెతో ఎవరు కాలు కదపరు చెప్పండి. ఇప్పుడు ముంబయ్ ఫిల్మ్ సిటీలో అదే సీన్. త్వరలో ఈ సీన్‌ను తెలుగు తెరపై చూపిస్తామంటున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ హీరోగా ఆయన దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో రూపొందుతోన్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ’లో సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఓ కల్లు దుకాణం వద్ద సన్నీ చిందేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ హిందీ కొరియోగ్రాఫర్ విష్ణుదేవా ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీసాఫీసర్. కల్లు కాంపౌండ్ దగ్గరకు పోలీస్ ఎందుకు వెళ్లారు? ఎవర్ని పట్టుకోవడానికి మాటేశారు? అనే ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే. ‘కరెంట్ తీగ’ తర్వాత సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ చేస్తున్న తెలుగు చిత్రమిది. -
'గరుడ వేగ'గా సీనియర్ హీరో
కొంత కాలంగా సరైన హిట్స్ లేక కష్టాల్లో పడ్డ సీనియర్ హీరో, మరోసారి తన ట్రేడ్ మార్క్ సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో వరుసగా యాంగ్రీ రోల్స్ లో సక్సెస్ లు సాధించిన రాజశేఖర్ లాంగ్ గ్యాప్ తరువాత అదే తరహా పాత్రలోకనిపించనున్నాడు. ఇటీవల విలన్ రోల్స్ కూడా సై అన్న రాజశేఖర్ హీరోగా ఫాంలోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. గుంటూరు టాకీస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రాజశేఖర్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రోజు(శుక్రవారం) రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పిఎస్వి గరుడ వేగ 128.18ఎమ్' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎమ్ కోటేశ్వర రాజు నిర్మిస్తున్నారు. -
తెలుగు డాన్... సన్నీలియోన్
శృంగారతార సన్నీలియోన్ తెలుగు తెరపై డాన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన ‘గుంటూర్ టాకీస్’ ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఆర్కె స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూర్ టాకీస్-2’ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక-నిర్మాత మాట్లాడుతూ-‘‘మా బ్యానర్లో ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించనున్నాం. ‘రాజా.. మీరు కేక’ నవంబర్‌లో విడుదల చేస్తాం. ‘గుంటూర్ టాకీస్’లో కుటుంబ ప్రేక్షకులను మిస్ అయ్యామని అన్నారు. ఇప్పుడీ సీక్వెల్‌ని ఫ్యామిలీస్‌కి దగ్గరయ్యేలా రూపొందిస్తున్నాం. ఇందులో సన్నీలియోన్‌తో పాటు తమిళం నుంచి ప్రముఖ హీరోయిన్ నటిస్తారు. దక్షిణాదిలో సన్నీ ఫుల్‌లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిదే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చిలో రిలీజ్’’ అని పేర్కొన్నారు. నటులు సీనియర్ నరేశ్, వినీత్, హీరోయిన్ అదితీసింగ్, రచయిత కిరణ్ పాల్గొన్నారు. -
ఒకటోసారి...రెండోసారి.!
ఇదేంటి? వేలం పాటలోలా ఒకటోసారి.. రెండోసారి.. అంటున్నారనుకుంటున్నారా? దానికి కారణం లేకపోలేదు. కథానాయికగా శ్రద్ధాదాస్ హీరో రాజశేఖర్‌తో ఒకటోసారి, దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రెండోసారి సినిమా చేయనున్నారు. అసలు విషయం అదన్న మాట. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు శ్రద్ధాదాస్. ‘గుంటూర్ టాకీస్’ తర్వాత ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు. తాజాగా రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో శ్రద్ధాదాస్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. మరో నాయికగా పూజా కుమార్‌ని తీసుకున్నారట. ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’ చిత్రాల్లో కమల్‌హాసన్‌తో పూజా కుమార్ జతకట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇందులో రాజశేఖర్ పోలీసాఫీసర్ పాత్ర చేయనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. -
రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న సిద్దూ
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి సినిమాలతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్, తరువాత ఆ సక్సెస్‌ను కొనసాగించలేకపోయాడు. వరుస ఫ్లాప్‌లతో డీలా పడ్డ సిద్ధూ టాలీవుడ్ వదిలేసి చెన్నై వెళ్లిపోయాడు. అక్కడ కూడా మంచి సక్సెస్‌లు రాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్న సిద్ధార్థ్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టిపెట్టాడు. చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఇటీవల గుంటూరు టాకీస్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆర్ట్ సినిమాలే కాదు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలనని ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే సిద్దూకి కథ కూడా చెప్పి ఒప్పించిన ప్రవీణ్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. -
గుంటూరులో ఏం జరిగింది?
ఓ మెడికల్ షాప్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. ‘చందమామ కథలు’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రేష్మీ గౌతమ్, సిద్ధు జొన్నలగడ్డ , నరేశ్ విజయకృష్ణ, మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్.ఎం నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ‘‘సామాజిక అంశం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఆద్యంతం నవ్వించేలా ఈ చిత్రం రూపొందింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. గుంటూరులో ఓ ఫిలిం సిటీ నిర్మించాలనే ఆలోచనతో ఉన్నా’’ అని చెప్పారు.ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: రామిరెడ్డి.పి. -
'అందమైన అమ్మాయి'గా రేష్మీ
హైదరాబాద్ : వెండి తెర నుంచి బుల్లి తెరకు ట్రాన్స్ఫర్ అయి... జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్‌గా... తన హావభావాలు, మాటల గారడితో ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తున్న నటి రేష్మి ప్రస్తుతం మళ్లీ వెండి తెర మీద తన నట విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. అది పల్లెటూరులోని అందమైన అమ్మాయి పాత్రలో రేష్మీ ఒదిగిపోనుంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రంలో తాను పోషించనున్న పాత్రకు సంబంధించిన ముచ్చట్లను బుధవారం రేష్మీ విలేకర్లతో పంచుకున్నారు. ఓ పల్లెటూరు... అందులో స్లమ్ ఏరియా... అక్కడ నివసించే అందమైన అమ్మాయిగా నటిస్తునట్లు తెలిపింది. అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే పాత్ర అని పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్న రెండు రోజుల ముందు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తనను కలసి చిత్రంలోని పాత్రను కళ్లకి కట్టినట్లు వివరించారని చెప్పింది. ఆ పాత్ర మనస్సుకు హత్తుకునేలా ఉందని... దీంతో కలిగిన ఆనందానికి ఉబ్బితబ్బియినట్లు పేర్కొంది. ఈ చిత్రంలోని అన్ని పాత్రలు కీలకమేనని.... అందరివి సమానమైన పాత్రలేనని వెల్లడించింది. ఈ చిత్ర బృందంతో నటిస్తుంటే కలిగే అనందం వేరంది. ప్రవీణ్ సత్తార్ ప్రముఖ దర్శకుడు. ఆయన చిత్రంలో నటించే నటీనటుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో ప్రవీణ్‌కు బాగా తెలుసునని రేష్మీ తెలిపింది. -
నిజంగానే సినిమా కష్టాలు పడ్డాను!
సినిమాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకున్న సృజనశీలి ప్రవీణ్ సత్తారు. దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గరా శిష్యరికం చేయకపోయినా, వెండితెరపై తనదైన ప్రతిభా ప్రదర్శనం కావించారాయన. ‘ఎల్బీడబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న ఈ ఉత్తరాంధ్ర యువకుడు తన మూడో సినిమా ‘చందమామ కథలు’తో జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు. జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘చందమామ కథలు’ ఎంపికైంది. వరుస ఫోన్‌కాల్స్, అభినందనల వెల్లువతో బిజీగా ఉన్న ప్రవీణ్ సత్తారు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కంగ్రాట్స్... చాలా థ్యాంక్స్. ఇది నేను ఊహించని పురస్కారం. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడమంటే మాటలు కాదు కదా. అయినా నేను అవార్డుల కోసమని ఈ సినిమా తీయలేదు. బాక్సాఫీస్‌ని గెలవకపోయినా, అవార్డు దక్కినందుకు మాత్రం సంతృప్తికరంగా ఉంది. ఈ పురస్కారం ఎంపికలో మీ సినిమాకు కలిసొచ్చిన అంశాలు ఏమిటనుకుంటున్నారు? నిజాయతీ. మన సమాజంలో రోజూ కనిపించే అనేక పాత్రలను వెండితెరపై చాలా నిజాయతీగా ఆవిష్కరించా. ఎక్కడా అతి చేయలేదు. మంచు లక్ష్మి, నరేశ్, ఆమని, కృష్ణుడులాంటి పాత్రలు సమాజంలో ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి. అదే జ్యూరీకి నచ్చి ఉంటుంది. మరి ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదంటారు? సరిగ్గా ఎన్నికల వేడిలో విడుదల చేయడం మాకు ప్రధాన ప్రతికూలాంశం. మనకు మనం సర్దిచెప్పుకోవడానికి ఇలా ఏదో ఒక కారణం చెప్పుకోవాలి కదా. ఈ సినిమాకు నిర్మాత కూడా మీరే కదా! అవును నేనే. ఈ సినిమా విడుదల సమయంలో చాలా కష్టాలు పడ్డాను. మొత్తం డబ్బులన్నీ దీనికే పెట్టేశా. అయినా నేనేం బాధపడలేదు. నేను ఈ కథను నమ్మాను. నన్ను నా టీమ్ నమ్మింది. ఇంతకు ముందు రెండు సినిమాలకూ నేనే నిర్మాతను. ప్రతి సినిమాకీ కష్టాలు ఎదుర్కొన్నా. దీనికి మాత్రం చాలా కొత్త కష్టాలు పడ్డా. అయినా నిర్మాతకు సినిమా కష్టాలు సాధారణమే కదా. అవార్డు వచ్చింది కదా. మళ్లీ సినిమా రిలీజ్ చేయొచ్చుగా? (నవ్వేస్తూ) మంత్రాలకు చింతకాయలు రాలనట్టుగానే, అవార్డులకు వసూళ్లు రాలవు. అంతగా కావాలనుకుంటే యూ ట్యూబ్‌లో చూస్తారు తప్ప, థియేటర్లకు వస్తారంటారా! ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో చేస్తారా? సినిమా విజయం సాధించి ఉంటే, కచ్చితంగా ఇతర భాషల్లో చేసేవాణ్ణి. ఇప్పుడైనా ఎవరైనా అడిగితే చేస్తాను. మీ భవిష్యత్తు ప్రణాళికలు? నా దగ్గర 13 స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో ఓ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరగుతున్నాయి. నేనెలాంటి సినిమా చేసినా అందులో తప్పనిసరిగా వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటా. ఈ పంథాను మాత్రం ఎప్పటికీ వదలను. -
చందమామా కథలు మూవీ సక్సస్ మీట్
-
నేను చేసిన సాహసం అదే! : ప్రవీణ్ సత్తారు
తొలి సినిమా ‘ఎల్బీడబ్ల్యూ’తోనే మంచి దర్శకునిగా మార్కులు కొట్టేశారు ప్రవీణ్ సత్తారు. రెండో సినిమా ‘రొటీన్ లవ్‌స్టోరి’ని భిన్నమైన ప్రేమకథగా ఆవిష్కరించి ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించేశారు. ఆయన మూడో సినిమా ‘చందమామ కథలు’ విడుదలైంది. ఇదో కథామాలిక. సమకాలీన సమాజంలో... పొంతనలేని ఎనిమిది కథల సమాహారం ఈ సినిమా. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలందుకుంటోందని ప్రవీణ్ ‘సాక్షి’తో ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తారుతో కాసేపు... ఈ సినిమా విషయంలో మీకు లభించిన గొప్ప ప్రశంస? చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అభినందిస్తున్నారు. తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందని కలలో కూడా అనుకోలేదని చాలామంది అంటున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఈ చిత్రం చూశారు. విజయనిర్మలగారైతే క్లయిమాక్స్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో సినిమా తీయడం కష్టమని అభినందించారు. అసలు ఇలాంటి సినిమా తీయాలని ఎందుకనిపించింది? తెలుగులో కొత్త సినిమాలు రావడం లేదు, తీసిన సినిమాలే మళ్లీ తీస్తున్నారనే విమర్శ ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అందుకే... తెలుగుతెరకు ఓ కొత్త సినిమా ఇవ్వాలనే కసితో ఈ సినిమా చేశాను. నిజంగా ఇలాంటి కథనంతో సినిమా తీయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏమైనా హోమ్‌వర్క్ చేశారా? ఇలాంటి సినిమాలు తీయాలంటే పరిశీలన అవసరం. లేచినప్పట్నుంచీ పడుకునే వరకూ జీవితంలో ఎన్నో రకాల మనుషుల్ని చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యక్తిత్వం. సినిమాల్లో డ్రామా అవసరం అని చాలామంది అంటుంటారు. నిజానికి సమాజంలో మనకు కనిపించే పాత్రల్లో ఉండే డ్రామా ఏ సినిమాలో కనిపించదు. కాకపోతే దాన్ని తెరపై ఆవిష్కరించడం చేతకావాలి. ‘చందమామ కథలు’ విషయంలో నేను చేసిన సాహసం అదే. అంటే... అందులోని పాత్రలు రియల్ లైఫ్‌లో మీరు చూసినవేనా? అవును... పలు సందర్భాల్లో నేను గమనించిన పలువురు వ్యక్తులే ఈ సినిమాలోని పాత్రలకు ప్రేరణ. ఉదాహరణకు ఖైరతాబాద్ జంక్షన్లో కేవలం రాత్రి వేళల్లోనే ఓ ముసలాయన అడుక్కుంటూ ఉంటాడు. అతను పగలు కనిపించడు. కారణం పొల్యూషన్. దాని కారణంగా ఆరోగ్యం పాడవుతుందని అతని ఫీలింగ్. ఆ ముసలాయనకు చింతల్ బస్తీలో మూడంతస్తుల బిల్డింగ్ ఉంది. దాని అద్దెలు కూడా అతనికి భారీగానే వస్తుంటాయి. కేవలం బెగ్గింగ్ వల్ల వచ్చిన డబ్బుతోనే ఆ ముసలాయన ఆ బిల్డింగ్ కొన్నాడు. ‘చందమామ కథలు’ చిత్రంలోని బెగ్గర్ పాత్రకు ప్రేరణ అయనే. అలా ప్రతి పాత్రకూ ఓ ప్రేరణ ఉంది. విదేశాల్లో మంచి ఉద్యోగం, చేతినిండా సంపాదన ఉన్న మీకు సినిమాలపై మీ దృష్టి ఎందుకు మరలింది? నాకు సినిమాలంటే ప్రాణం. ముఖ్యంగా కె.విశ్వనాథ్‌గారి అభిమానిని. ఆయన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాలు తీసే దర్శకులు నాకు ఎవ్వరూ కనిపించలేదు. మంచి సినిమా అంటే... మలయాళం, హిందీ, తమిళ సినిమాలవైపే అందరూ చూస్తున్నారు కానీ, తెలుగు సినిమా వంక ఒక్కరు కూడా చూడటం లేదు. అందుకే... నా వంతు ప్రయత్నంగా తెలుగులో మంచి సినిమాలు తీయాలనే తలంపుతో దర్శకుణ్ణయ్యాను. అంటే... మున్ముందు కూడా మీ నుంచి ఇలాంటి సినిమాలే వస్తాయన్నమాట? ఒక మంచి ప్రయత్నం చేస్తే సరిపోదు. దానికి ప్రజాదరణ కూడా ముఖ్యం. ‘చందమామ కథలు’ అనే మంచి సినిమా తీశాను. అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ మెచ్చుకోళ్లతో పాటు డబ్బులు కూడా రావాలి. అలా వస్తే... మరిన్ని మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయరా? ఎందుకు చేయను... తప్పకుండా చేస్తాను. అయితే వాళ్లకి అనుగుణంగా చేయమంటే మాత్రం చేయలేను. నా శైలిలో నన్ను చేయనిస్తే స్టార్లతో కూడా చేస్తాను. -
'ఆమెకు సిగరెట్ కాల్చడం నేర్పా'
సినిమాల్లో హీరోలు సిగరెట్లు కాల్చే సన్నివేశాలు చాలానే ఉంటాయి. అయితే.. హీరోయిన్లు, ఇతర నటీమణులు సిగరెట్ కాల్చడం మాత్రం తక్కువ. అందులోనూ అప్పటివరకు ఏమాత్రం అలవటు లేకుండా కేవలం సినిమా కోసం, అందులో పాత్ర కోసం సిగరెట్ కాల్చాల్సి వస్తే? లక్ష్మీ మంచుకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 'చందమామ కథలు' సినిమాలో ఆమె ఒక మోడల్ పాత్ర పోషించారు. పాత్ర స్వరూప స్వభావాలను బట్టి సిగరెట్ కాల్చాల్సి ఉంటుంది. (చదవండి: సినిమా రివ్యూ) కానీ ఇంతవరకు లక్ష్మికి పొగతాగడం అలవాటు లేదు. అందుకే ఆమె కొంత తటపటాయించారు. కానీ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం ఆమెను సిగరెట్ కాల్చాల్సిందిగా కోరారు. కొంత నచ్చజెప్పిన తర్వాత ఆమె అర్థం చేసుకుని అంగీకరించారని, అలా తాను తొలిసారి లక్ష్మికి సిగరెట్ కాల్చడం నేర్పించానని ప్రవీణ్ చెప్పారు. అదంత సులభం కాకపోయినా.. పాత్రకోసం ఆమె అలా చేశారని అన్నారు. -
సినిమా రివ్యూ: చందమామ కథలు
నటీనటులు: లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషి సాంకేతిక వర్గం: మ్యూజిక్, రీరికార్డింగ్: మిక్కి జే మేయర్ సినిమాటోగ్రఫి: సురేశ్ రగుతు ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల నిర్మాత: చాణక్య బూనేటి దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు పాజిటివ్ పాయింట్స్: దర్శకత్వ పనితీరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫోటోగ్రఫి నటీనటుల పనితీరు మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్ నేరేషన్ ఎడిటింగ్ ఎల్ బీ డబ్య్లూ (లవ్ బిఫోర్ వెడ్డింగ్), రొటీన్ లవ్ స్టోరీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు మూడో చిత్రంగా చందమామ కథలు చిత్రాన్ని ఏప్రిల్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంచు లక్ష్మి, నరేశ్, ఆమని తదితర నటులతో మొత్తం ఎనిమిది కథలతో రూపొందిన ఈ చిత్రానికి విడుదలకు ముందు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఇంతకీ సినిమాలోని కథలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం... సారధి (కిషోర్) ఓ రచయిత. అతనికి కావేరి అనే కూతురు ఉంటుంది. కావేరికి లుకేమియా సోకడంతో సారథికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఆస్తిపాస్తులు అంతగా లేని సారథి కూతురు వైద్యానికి కావాల్సిన సొమ్మును ఎలా సంపాదించుకున్నారు? లుకేమియా నుంచి కావేరి బయటపడిందా? సారథి, కావేరి కథకు మరో ఏడు కథలకు సంబంధమేమిటనే ప్రశ్నలకు సమాదానమే 'చందమామ కథలు' చిత్రం. నటీనటుల ప్రదర్శన లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషిలవి కథపరంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలే. ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో రచయిత కృష్ణేశ్వరరావు నటనను ప్రశంసించాల్సిందే. ఇంకా లిసా స్మిత్‌గా ఓ మోడల్‌గా నటించిన మంచు లక్ష్మి ఓ డిఫెరెంట్ పాత్రతో ఆకట్టుకున్నారు. సారథిగా కిషోర్, కూతురు పాత్రలో కావేరి పూర్తిస్థాయి న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నింటికీ అందరూ పూర్తి న్యాయం చేకూర్చారు. సాంకేతిక వర్గం: ఎనిమిది కథల సంకలనం 'చందమామ కథలు' ఓ ఫీల్ గుడ్ చిత్రమనిపించడానికి ప్రధాన కారణం మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనికి తోడు సురేశ్ పోటోగ్రఫీ మ్యాజిక్ చేసింది. ధర్మేంద్ర కత్తెరకు మరింత పదును పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం కొంత డాక్యుమెంటరీ స్టైల్లో అనిపించడానికి పూర్ ఎడిటింగ్ కారణమని అనిపిస్తుంది. ఎనిమిది కథలకు తగినట్టుగా, సరిగ్గా అతికినట్టుగా నటీనటులను దర్శకుడు ఎంపిక చేసుకోవడంలో విజయం సాధించారు. ఇక ఎనిమిది కథలను సీన్ బై సీన్ ను పేర్చుకుంటూ రూపొందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. మల్టిప్లెక్స్ ఆడియెన్స్, బీ, సీ సెంటర్లను దృష్టిలో పెట్టుకుని కథల సంకలనంగా రూపొందిన 'చందమామ కథలు' టాలీవుడ్లో ఓ కొత్త ప్రయోగమే. -
చందమామ కథలు మూవీ ప్రెస్ మీట్
-
చందమామ కథలు మూవీ ప్రెస్ మీట్