గుంటూరులో ఏం జరిగింది? | guntur Medical shop at the actual incident? | Sakshi
Sakshi News home page

గుంటూరులో ఏం జరిగింది?

Published Wed, Aug 5 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

గుంటూరులో ఏం జరిగింది?

గుంటూరులో ఏం జరిగింది?

ఓ మెడికల్ షాప్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. ‘చందమామ కథలు’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రేష్మీ గౌతమ్, సిద్ధు జొన్నలగడ్డ , నరేశ్ విజయకృష్ణ, మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్.ఎం నిర్మించారు.
 
 ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ‘‘సామాజిక  అంశం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఆద్యంతం నవ్వించేలా ఈ చిత్రం రూపొందింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. గుంటూరులో ఓ ఫిలిం సిటీ నిర్మించాలనే ఆలోచనతో ఉన్నా’’ అని చెప్పారు.ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: రామిరెడ్డి.పి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement