'అందమైన అమ్మాయి'గా రేష్మీ
హైదరాబాద్ : వెండి తెర నుంచి బుల్లి తెరకు ట్రాన్స్ఫర్ అయి... జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్గా... తన హావభావాలు, మాటల గారడితో ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తున్న నటి రేష్మి ప్రస్తుతం మళ్లీ వెండి తెర మీద తన నట విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. అది పల్లెటూరులోని అందమైన అమ్మాయి పాత్రలో రేష్మీ ఒదిగిపోనుంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రంలో తాను పోషించనున్న పాత్రకు సంబంధించిన ముచ్చట్లను బుధవారం రేష్మీ విలేకర్లతో పంచుకున్నారు.
ఓ పల్లెటూరు... అందులో స్లమ్ ఏరియా... అక్కడ నివసించే అందమైన అమ్మాయిగా నటిస్తునట్లు తెలిపింది. అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే పాత్ర అని పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్న రెండు రోజుల ముందు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తనను కలసి చిత్రంలోని పాత్రను కళ్లకి కట్టినట్లు వివరించారని చెప్పింది.
ఆ పాత్ర మనస్సుకు హత్తుకునేలా ఉందని... దీంతో కలిగిన ఆనందానికి ఉబ్బితబ్బియినట్లు పేర్కొంది. ఈ చిత్రంలోని అన్ని పాత్రలు కీలకమేనని.... అందరివి సమానమైన పాత్రలేనని వెల్లడించింది. ఈ చిత్ర బృందంతో నటిస్తుంటే కలిగే అనందం వేరంది. ప్రవీణ్ సత్తార్ ప్రముఖ దర్శకుడు. ఆయన చిత్రంలో నటించే నటీనటుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో ప్రవీణ్కు బాగా తెలుసునని రేష్మీ తెలిపింది.