Anchor Rashmi Comments About Boyfriend And Breakups, Deets Inside - Sakshi

Anchor Rashmi: నా హార్ట్ చాలాసార్లు బ్రేక్ అయింది

Aug 21 2023 8:32 AM | Updated on Aug 21 2023 9:57 AM

Anchor Rashmi About Her Boyfriend And Breakups - Sakshi

యాంకర్ రష్మీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీళ్లు ఏ క్షణాన కలిశారో గానీ జంటగా హాట్ టాపిక్ అయిపోయారు. దాదాపు 6-7 ఏళ్ల నుంచి టీవీ స్క్రీన్‌పై వీళ్ల జోడీని కొట్టే కాంబో రాలేదని చెప్పొచ్చు.  అలాంటిది కొన్నాళ్లుగా సుధీర్-రష్మీ కలిసి కనిపించలేదు. దీంతో చాలామంది ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి టైంలో తాజాగా రష్మీ.. తన బ్రేకప్స్ గురించి మాట్లాడింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)

'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు యాంకరింగ్ చేస్తూ రష్మీ బిజీగా ఉంటుంది. వీటితోపాటు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఈ మధ్యే భోళా శంకర్ మూవీలో చిరుతో కలిసి ఓ పాటలో స్టెప్పులేసింది. తాజాగా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి, తెలుగులో ఆగస్టు 25న రిలీజ్ కాబోతున్న 'బాయ్స్ హాస్టల్' చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. 

ఇక ఈ ఈవెంట్‌లో రష్మీ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్ట్ బ్రేక్స్ గురించి చెబుతూ.. 'ప్రతి ఒక్కరి జీవితంలో హార్ట్ బ్రేక్, రిలేషన్స్ చాలా ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు చాలామంది ఇవన్నీ చూస్తూనే ఉంటారు. నా బ్రేకప్స్ గురించి కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి చూస్తుంటే యాంకర్ రష్మీ మనసు కూడా ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ అయిందనమాట. 

(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement