బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న రష్మి.. జంతు ప్రేమికురాలనే విషయం చాలామందికి తెలిసిందే. మూగజీవాలకు ఏదైనా హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్‌డౌన్‌లోనూ వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజూ ఆహారం అందించేది. అంతేకాదు.. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అలాంటి రష్మీ తాజాగా ఎమోషనల్ అయింది. తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చుట్కీ గౌతమ్‌ను కోల్పోయింది.
దీంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. కారణాలు తెలియవు కానీ శనివారం తన పెంపుడు కుక్క చనిపోయిందంటూ రష్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. చుట్కీని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని తెలిపింది. అనంతరం చుట్కీకి స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించింది. చుట్కీ చితాభస్మాన్ని కారులో తన వెంట తీసుకెళ్తున్న పిక్‌ను కూడా రష్మీ షేర్ చేసుకుంది.
చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన ఫొటోలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంది. ప్రపంచంలో జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. అంతలా మూగ జీవాలపై ఆమె ప్రేమను చూపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment