తెలుగు డాన్... సన్నీలియోన్ | Sunny Leone in Guntur Talkies 2 not merely to attract viewers: Director | Sakshi
Sakshi News home page

తెలుగు డాన్... సన్నీలియోన్

Published Mon, Oct 3 2016 11:34 PM | Last Updated on Tue, Aug 21 2018 4:42 PM

తెలుగు డాన్... సన్నీలియోన్ - Sakshi

తెలుగు డాన్... సన్నీలియోన్

 శృంగారతార సన్నీలియోన్ తెలుగు తెరపై డాన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన ‘గుంటూర్ టాకీస్’ ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఆర్‌కె స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూర్ టాకీస్-2’ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక-నిర్మాత మాట్లాడుతూ-‘‘మా బ్యానర్‌లో ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించనున్నాం.
 
  ‘రాజా.. మీరు కేక’ నవంబర్‌లో విడుదల చేస్తాం. ‘గుంటూర్ టాకీస్’లో కుటుంబ ప్రేక్షకులను మిస్ అయ్యామని అన్నారు. ఇప్పుడీ సీక్వెల్‌ని ఫ్యామిలీస్‌కి దగ్గరయ్యేలా రూపొందిస్తున్నాం. ఇందులో సన్నీలియోన్‌తో పాటు తమిళం నుంచి ప్రముఖ హీరోయిన్ నటిస్తారు. దక్షిణాదిలో సన్నీ ఫుల్‌లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిదే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చిలో రిలీజ్’’ అని పేర్కొన్నారు. నటులు సీనియర్ నరేశ్, వినీత్, హీరోయిన్ అదితీసింగ్, రచయిత కిరణ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement