![Sunny Leone Buys Office Space in Mumbai](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/sunny-leone.jpg.webp?itok=prtUs5WD)
సినీతారలు, క్రికెటర్స్ లేదా పారిశ్రామిక వేత్తలు చాలామంది ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, ప్లాట్స్ వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ముంబై వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఆస్తులను కొనుగోలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి నటి 'సన్నీ లియోన్' (Sunny Leone) కూడా చేరింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఓ కమర్షియల్ బిల్డింగ్ కొనుగోలు చేసింది.
బర్త్ డే సాంగ్స్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పాపులర్ అయిన సన్నీ లియోన్.. ముంబైలోని ఓషివారాలో రూ. 8 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు స్క్వేర్ యార్డ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇక్కడే ఆమె తన కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది.
బిగ్ బి, అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ కార్యాలయాలు ఉన్న భవనంలోనే సన్నీ లియోన్ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. కొనుగోలుకు సంబంధించిన లావాదేవీ ఫిబ్రవరి 2025లో జరిగినట్లు సమాచారం.
సన్నీ లియోన్ ఆస్తిని.. ఆనంద్ కమల్నాయన్ పండిట్ & రూపా ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఆనంద్ పండిట్.. టోటల్ ధమాల్, చెహ్రే మరియు ది బిగ్ బుల్ వంటి చిత్రాలను నిర్మించారు.
ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?
సన్నీ లియోన్ కొనుగోలు చేసిన ఆఫీస్ స్థలంలో 176.98 చదరపు మీటర్ల (1,904.91 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా, 194.67 చదరపు మీటర్ల (2,095 చదరపు అడుగులు) బిల్ట్ అప్ ఏరియా వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 35.01 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, మరో రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment