రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న సిద్దూ
రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న సిద్దూ
Published Wed, Apr 6 2016 10:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి సినిమాలతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్, తరువాత ఆ సక్సెస్ను కొనసాగించలేకపోయాడు. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ సిద్ధూ టాలీవుడ్ వదిలేసి చెన్నై వెళ్లిపోయాడు. అక్కడ కూడా మంచి సక్సెస్లు రాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్న సిద్ధార్థ్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టిపెట్టాడు.
చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఇటీవల గుంటూరు టాకీస్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆర్ట్ సినిమాలే కాదు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలనని ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే సిద్దూకి కథ కూడా చెప్పి ఒప్పించిన ప్రవీణ్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు.
Advertisement
Advertisement