చుక్కేస్తే స్టెప్పేయాల్సిందే! | Sunny Leone was first choice for special number: Praveen Sattaru | Sakshi
Sakshi News home page

చుక్కేస్తే స్టెప్పేయాల్సిందే!

Published Sun, Apr 9 2017 2:16 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

చుక్కేస్తే స్టెప్పేయాల్సిందే!

చుక్కేస్తే స్టెప్పేయాల్సిందే!

ఎవరైనా చిందులేయాలంటే నోట్లో చుక్క పడాలా? అవసరం లేదు కదూ! కానీ, నోట్లో మాత్రం చుక్క పడితే... ఎవరైనా ఆటోమేటిక్‌గా చిందులేస్తారు. నడకలో, నడతలో స్టెప్పులే... స్టెప్పులు! అందులోనూ ప్రముఖ శృంగారతార సన్నీ లియోన్‌ నోట్లో చుక్కేసుకునే కొట్టు దగ్గర చిందులేస్తుంటే... ఆమెతో ఎవరు కాలు కదపరు చెప్పండి.

ఇప్పుడు ముంబయ్‌ ఫిల్మ్‌ సిటీలో అదే సీన్‌. త్వరలో ఈ సీన్‌ను తెలుగు తెరపై చూపిస్తామంటున్నారు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు. రాజశేఖర్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో రూపొందుతోన్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ’లో సన్నీ లియోన్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నారు. ఓ కల్లు దుకాణం వద్ద సన్నీ చిందేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.

 ప్రముఖ హిందీ కొరియోగ్రాఫర్‌ విష్ణుదేవా ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్‌ పోలీసాఫీసర్‌. కల్లు కాంపౌండ్‌ దగ్గరకు పోలీస్‌ ఎందుకు వెళ్లారు? ఎవర్ని పట్టుకోవడానికి మాటేశారు? అనే ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే. ‘కరెంట్‌ తీగ’ తర్వాత సన్నీ లియోన్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న తెలుగు చిత్రమిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement