ఆ సినిమా అద్భుతం : మహేష్‌ బాబు | Mahesh Babu Praises Garuda Vega | Sakshi

ఆ సినిమా అద్భుతం : మహేష్‌ బాబు

Nov 11 2017 1:09 PM | Updated on Nov 11 2017 2:58 PM

Mahesh Babu Praises Garuda Vega - Sakshi

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ గరుడ వేగ. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ తో మంచి వసూళ్లు సాధిస్తోంది. చాలా కాలం తరువాత ఓ సూపర్‌ హిట్‌ తో అలరించిన హీరో రాజశేఖర్‌కి సినీ ప్రముకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా గరుడ వేగ సినిమా చూసిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చిత్ర యూనిట్‌ పై ప్రశంసలు కురిపించాడు. ‘గొప్ప స్క్రిప్ట్‌, మంచి నటన, పర్ఫెక్ట్‌ స్క్రీన్‌ప్లే. పీవీయస్‌ గరుడ వేగ అద్బుతం. హీరో రాజశేఖర్‌, దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు లకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశాడు మహేష్‌.

రాజశేఖర్‌ ఎన్‌ఐఏ ఏజెంట్‌ గా నటించిన గరుడ వేగ సినిమా తొలి వారంలోనే 15 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సత్తా చాటింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంపై చిత్రయూనిట్‌ ఆనందం​ వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్‌ సరసన పూజ కుమార్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అదిత్‌ అరుణ్‌, శ్రద్ధా దాస్‌, కిశోర్‌, చరణ్‌దీప్‌, రవివర్మలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement