ఐశ్వర్య డైరెక్షన్‌లో రాజశేఖర్‌! | Aishwarya Dhanush Will Direct Rajashekar | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 30 2018 8:09 PM | Last Updated on Mon, Apr 30 2018 8:09 PM

Aishwarya Dhanush Will Direct Rajashekar - Sakshi

గత కొం‍త కాలంగా సరైన హిట్‌ లేక సతమతమయిన యాంగ్రీ యంగ్‌మాన్‌ రాజశేఖర్‌ కెరీర్‌ మళ్లీ ‘గరుడవేగ’తో ఊపందుకుంది. దీంతో ఆయన మూడు సినిమాలకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ.. తాను అంగీకరించిన సినిమాలు  అన్నీ కొత్త కథలే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

‘3’ సినిమాతో దర్శకురాలిగా కెరీర్‌ను ప్రారంభించి, మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందారు ఐశ్వర్య ధనుష్‌. ఇటీవలే రాజశేఖర్‌ను కలిసి సినిమా కథను వినిపించారని, ద్విభాష చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 అలాగే ప్రవీణ్‌ సత్తారుతో, ‘అ!’ సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మతో కూడా రాజశేఖర్‌ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కూడా డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కబోతున్నాయని సమాచారం. వీటన్నింటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement