Aishwarya Dhanush
-
రెండేళ్లుగా సస్పెన్స్.. విడాకులే కావాలంటున్న ధనుష్-ఐశ్వర్య
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల ఐశ్వర్య రజినీకాంత్ లాల్ సలామ్ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు ధనుశ్ రాయన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ కపుల్ దాదాపు రెండేళ్ల తర్వాత అధికారికంగా విడాకుల కోసం పిటిషన్లు వేశారు. త్వరలో వారి కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. కాగా.. 2004లో ధనుశ్, ఐశ్వర్య ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దీంతో మరోసారి ధనుశ్- ఐశ్వర్య టాపిక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కలుస్తారని భావించినా.. గతంలో ఈ జంట మళ్లీ కలవబోతున్నారని చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతే కాదు అభిమానులు సైతం వీరిద్దరు కలుస్తారని ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లకు పైగా దూరంగా ఉన్న ఈ జంట చివరికీ విడిపోయేందుకే మొగ్గు చూపారు. 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n — Dhanush (@dhanushkraja) January 17, 2022 -
సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఇద్దరు కూతుళ్లూ విడాకులు
Rajinikanth Two Daughters Marriage Life Ended In Divorce, Deets Inside: విడాకుల ప్రకటనతో హీరో ధనుష్- ఐశ్వర్యలు అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించారు. కోలీవుడ్‌లో బ్యూటిఫుల్ కపూల్‌గా గుర్తింపుపొందిన ధనుష్, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్ కపూల్.. విడాకులు తీసుకోవడం అభిమానుకులకు మింగుడుపడటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు18 ఏళ్ల తర్వాత విడిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ధనుష్- ఐశ్వర్యల విడాకుల ప్రకటనతో రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య విడాకుల అంశం కూడా మరోసారి తెరమీదకి వచ్చింది. అప్పట్లో సౌందర్య విడాకులు కోలీవుడ్ నాట సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. 2010లో అశ్విన్ అనే వ్యాపారవేత్తతో సౌందర్యకు వివాహం జరిగింది. వీరికి వేద్ కృష్ణ అనే బాబు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా 2017లో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం రెండేళ్లకు నటుడు, బిజినెస్ మ్యాన్ విషగన్ వనంగముడిని పెళ్లాడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి కలతలు లేకుండా సాఫీగానే సాగుతుంది వారి బంధం. కానీ రజనీ కూతుళ్లు మాత్రం వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్
Dhanush Aishwarya Divorce Fans Shocking Reactions: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్‌లోనే కాకుండా వివిధ చిత్ర పరిశ్రమలో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా ధనుష్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ అల్లుడిగా కాకుండా తనకంటూ సొంత బ్రాండ్ ఇమేజ్ ఏర్పర్చుకున్నాడు ధనుష్. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాంజన సినిమాతో హిందీలో తెరంగ్రేటం చేశాడు. తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించడమే కాకుండా, ధనుష్ చిత్రాలు కొన్ని వివిధ భాషల్లో విడుదలయ్యాయి. ఇలా ధనుష్ వివిధ వర్గాల ప్రేక్షకులను అలరించాడు. ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు.. ధనుష్ హీరోగానే కాకుండా గాయకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పాడిన 'కొలవెరి ఢీ' సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు ధనుష్. టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య విడాకుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రేక్షకజనానికి ధనుష్ ప్రకటన షాక్‌కు గురి చేసింది. ధనుష్ అభిమానులు బాధ అయితే వర్ణనాతీతం. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో తమ బాధను వెల్లబోసుకుంటున్నారు ధనుష్ అభిమానులు. ఇదీ చదవండి: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్ ఫోన్ కాల్.. కారణం ఇదేనా? That's unexpected and shocking! The reasons behind the break-up are none of our business. Media and fans should give them the space they need. We just wish #Dhanush and @ash_r_dhanush sis all the best for the future! Be strong Thalaivaa @rajinikanth ❤️😢 pic.twitter.com/v4cRtclPXn — 𝗩 𝗠 𝗧 ツ | 𝗔 𝗞 (@VMT_0fficial) January 17, 2022 This icons picture becomes meaningless now😢...#dhanush whyyyyy???????? @rajinikanth love you thalaivaaa pic.twitter.com/wc6jpsTIBM — elsa (@elsa_Amna) January 17, 2022 🥺😢 Please Be Strong Thalaiva @rajinikanth❤ #Dhanush #AishwaryaDhanush pic.twitter.com/iovD0lD5Lp — Rajan (@Subash1899) January 17, 2022 Kind request to all not to make fun of #Dhanush & #AishwaryaD separation You don't know how it affects when we are in a situation to leave our loved one 💔 It's heartbreaking one but still we respect you both @dhanushkraja & @ash_r_dhanush ❤️ Stay strong @rajinikanth sir 🥺 pic.twitter.com/FanxThypae — RaGuVaRaN (@MemesSingle) January 17, 2022 Shocking 🥺🥺 💔💔 Dhanush & Aiswarya divorce #Dhanush #aishwarya #Rajinikanth #divorce #tamilcinema pic.twitter.com/3Tb8dp082B — Salam Mass (@SALAMMASS1) January 17, 2022 This one is not even an year old ra 💔#Dhanush pic.twitter.com/9k3I2zc4Q7 — Troll Cinema ( TC ) (@Troll_Cinema) January 17, 2022 Despite of the Issue inside his family, this Man greeted his fans(Pongal) at his door step with Smile on his face to give the due respect to his fans gathered ❤️🙏 Anta Manasu Tan Sir Kadavul😍 Stay Strong Thalaivaa!🙏#Rajinikanth #Thalaivar @rajinikanth#Dhanush pic.twitter.com/QQk1ihmtJ8 — ONLINE RAJINI FANS🤘 (@OnlineRajiniFC) January 17, 2022 -
ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు..
Ram Gopal Varma Sensational Tweets Regarding Dhanush Aishwarya Divorce: సినీ ఇండస్ట్రీలో వివాహ బంధాలు ఇలా ముడిపడుతున్నాయి. అలా తెగిపోతున్నాయి. ఇంతకుముందు సెలబ్రిటీల పెళ్లిల్లు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఆసక్తి ఉండేది. వారి వివాహనికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు. విందు భోజనంలోకి ఎన్ని వెరైటీలు వడ్డించారు. ఎంత ఖర్చు చేశారు అంటూ ఆరా తీసేవారు. ప్రస్తుతం సెలబ్రిటీలు విడిపోవడంపై కూడా అంతే ఆసక్తి కనబరుస్తున్నారు. కాకపోతే ఇక్కడ అందరినీ వేధించే ప్రశ్న ఒక్కటే. అదే 'ఎందుకు విడిపోయారు ? అసలు కారణం ఏంటీ ?' అని. ఇదంతా ఎందుకు చెబుతున్నామో అర్థమైందిగా. అవును.. కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు వారి 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలికారు. వారు ఎందుకు విడిపోయారు అని ప్రేక్షకలోకం ఓ వైపు ఉత్సుకతో, మరోవైపు జాలిగా స్పందిస్తోంది. ఇదీ చదవండి: ఇంటికి బొకే పంపి.. టచ్‌లో ఉండమని చెప్పింది.. ధనుష్-ఐశ్వర్యల లవ్‌స్టోరీ అయితే వీరందరికి కాస్త భిన్నంగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. అందరిలా రియాక్షన్ ఇస్తే అతను ఆర్జీవీ ఎందుకు అవుతాడు. ఎలాంటి సంఘటన జరిగిన విభిన్నమైన రీతిలో స్పందించడమే ఆర్జీవీ స్టైల్. తాజగా ధనుష్, ఐశ్వర్యలు విడిపోయినట్లు ప్రకటించేసరికి తనదైన శైలిలో ట్వీట్ చేశాడు ఆర్జీవీ. 'పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్ సెట్టర్స్' అని ఆర్జీవీ ట్వీటాడు. అంతే కాకుండా 'సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకూ ప్రేమించడం ఉత్తమం', 'స్మార్ట్ పీపుల్ లవ్ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు' అంటూ వరుస ట్వీట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ. Star divorces are good trend setters to warn young people about the dangers of marriages — Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022 Nothing murders love faster than marriage ..The secret of happiness is to keep loving as long as it remains and then move on instead of getting into the jail called marriage — Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022 Love in a marriage lasts for lesser days than the days they celebrate it , which is 3 to 5 days — Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022 Smart people love and dumbos marry — Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022 Only divorces should be celebrated with sangeet because of getting liberated and marriages should happen quietly in process of testing each other’s danger qualities — Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022 Marriage is the most evil custom thrust upon society by our nasty ancestors in promulgating a continuous cycle of unhappiness and sadness — Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022 ఇదీ చదవండి: హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు -
ధనుష్ ఓ సెన్సేషన్
-
అప్పా.. అమ్మా.. శుభాకాంక్షలు
‘‘ఆమె అందర్నీ తన కుటుంబంలా భావించింది. ఆయన ఆమె కుటుంబాన్ని తన కుటుంబం అనుకున్నాడు. ఇద్దరూ కలసి ఒక మంచి కుటుంబం ఏర్పడటానికి కారణం అయ్యారు’’ అని తన తల్లిదండ్రులు రజనీకాంత్, లత గురించి ఐశ్వర్య అన్నారు. ఫిబ్రవరి 28 రజనీ–లత నలభయ్యో వివాహ వార్షికోత్సవం. 1981లో ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. నలభయ్యో వార్షికోత్సవం సందర్భంగా రజనీ–లతల పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి గల కారణాలను మా అమ్మానాన్న జీవితాలను చూసి తెలుసుకున్నాను. జీవితం అనే ప్రతి మలుపులోనూ మా గ్రాండ్ పేరెంట్స్ దేవదూతల్లా ఈ ఇద్దర్నీ కాపాడుకుంటూ వస్తున్నారని నా నామ్మకం. మ్యారేజ్ అంటే ఒకరి బాధ్యతను ఒకరు మోయడం అనే విషయాన్ని అమ్మానాన్నని చూసి తెలుసుకున్నాను. ఒక బంధం బలపడటానికి భార్యాభర్త మధ్య ఉండే స్నేహం కారణమవుతుందనే విషయం అర్థమైంది. వ్యక్తులుగా ఎదిగే ప్రతి దశలోనూ జీవితం తాలూకు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ, జీవితానికి అర్థం తెలుసుకుంటూ ఉంటాం’’ అంటూ అప్పా (నాన్న).. అమ్మా... మీ ఇద్దరికీ సూపర్ డూపర్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అన్నారు ఐశ్వర్య. -
క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్
చెన్నై,పెరంబూరు: రజనీకాంత్ పెద్ద కూతురు, నటుడు ధనుష్ సతీమణి, సినీ దర్శకురాలు ఐశ్వర్యధనుష్ తాజాగా క్రీడా రంగంలోకి అడుగిడుతున్నారు. 2019వ ఏడాదికి గానూ ఈ నెల 25వ తేదీన డిల్లీలో జరగనున్న టేబుల్ టెన్నీస్ పోటీలకు చెన్నై జట్టు నిర్వాహకుల్లో ఒకరిగా ఐశ్వర్యధనుష్ భాగస్వామిగా మారారు. టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఢిల్లీ, చెన్నై, పుణే, గోవా, కోల్‌కతా, ముంబై జట్లు పాల్గొననున్నాయి. -
భార్యను పొగడ్తలతో ముంచెత్తిన సూపర్ స్టార్
నలభై ఏళ్ల నుంచి సిని పరిశ్రమలో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు తలైవా రజనీకాంత్. ఇప్పటికి కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు ఈ సూపర్ స్టార్. గురువారం విడుదలైన రజనీ 2.ఓ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇండియా టూడేతో ముచ్చటించారు రజనీకాంత్. ఈ సందర్భంగా తన భార్య లతా రజనీకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్. ‘తను నా పిల్లలను, కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది. తను నాకు స్నేహితురాలు, ఫిలాసఫర్ అన్ని’ అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్. ఈ సందర్భంగా తన పిల్లలు దర్శకురాలు ఐశ్వర్య ధనుష్, డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ సౌందర్య రజనీకాంత్‌ల గురించి కూడా మాట్లాడారు. ‘నా పిల్లల విషయంలో నేను ఎప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే నా పిల్లలిద్దరూ వారికి నచ్చిన రంగంలోనే స్థిరపడ్డారు. వారు చేసే పని పట్ల వారు సంతోషంగా ఉన్నారం’టూ చెప్పుకొచ్చారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. -
రజనీకాంత్ రిటైర్మెంట్పై ఐశ్వర్య కామెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తెర మీద కనిపిస్తే చాలని భావించే వీరభిమానలకు కొదువే లేదు. కోలీవుడ్ సినీ జనాలకు రజనీ దేవుడితో సమానం. ఇతంటి క్రేజ్ ఉన్న రజనీకాంత్‌ను ఆయన కూతురు ఓ అనూహ్యమైన కోరిక కోరారు. రజనీ కుమార్తె ఐశ్వర్య ధనుష్ తండ్రిని సినిమాలు మానేయాలని కోరారట. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా వెల్లడించారు. కాలా రిలీజ్ తరువాత జాతీయ మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య, తండ్రి కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని కోరారు. పూర్తిగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. కాస్త పని తగ్గించుకొని కుటుంబంతో ఆనందంగా గడపాలని తాము కోరుకుంటున్నట్టుగా వెల్లడించారు. హీరోగా ఎదుగుతున్న దశలో రజనీ ఏడాదికి ఏడెనిమది సినిమాల్లో నటించేవారన్న ఐశ్వర్య, సినిమాల కారణంగా ఆయన ఫ్యామిలీతో గడపాల్సిన సమయాన్ని కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ఆయన మూలంగా ప్రజలు ఎంత ఆనందం పొందుతున్నారో నాకు తెలుసు అందుకే రిటైర్మెంట్ ప్రకటించకమని కోరలేకపోతున్నామన్నారు ఐశ్వర్య. ఇటీవల కాలాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. రజనీ హీరోగా తెరకెక్కిన 2.ఓ నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. -
ఐశ్వర్య డైరెక్షన్లో రాజశేఖర్!
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమయిన యాంగ్రీ యంగ్‌మాన్ రాజశేఖర్ కెరీర్ మళ్లీ ‘గరుడవేగ’తో ఊపందుకుంది. దీంతో ఆయన మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ.. తాను అంగీకరించిన సినిమాలు అన్నీ కొత్త కథలే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘3’ సినిమాతో దర్శకురాలిగా కెరీర్‌ను ప్రారంభించి, మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందారు ఐశ్వర్య ధనుష్. ఇటీవలే రాజశేఖర్‌ను కలిసి సినిమా కథను వినిపించారని, ద్విభాష చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రవీణ్ సత్తారుతో, ‘అ!’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్వర్మతో కూడా రాజశేఖర్ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కూడా డిఫరెంట్ జానర్లో తెరకెక్కబోతున్నాయని సమాచారం. వీటన్నింటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. -
హర్రర్ బాటలో ఐశ్వర్య ధనుష్
తమిళసినిమా: సక్సెస్‌ల వెంట పరుగులు తీయడం సర్వసాధారణం. అందుకు ట్రెండ్‌ను సెట్ చేయడానికి కృషి చేసేవారు కొందరైతే, సక్సెస్ ట్రెండ్‌ను అనుసరించే వారు మరికొందరు. మహిళా దర్శకురాలు ఐశ్వర్యధనుష్ ఇప్పుడు ట్రెండ్‌ను ఫాలో అవ్వడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, నటుడు ధనుష్ సతీమణి అయిన ఈమె తొలి ప్రయత్నంలోనే తన భర్త ధనుష్‌నే డైరెక్ట్ చేసిన క్రెడిట్‌ను సొంతం చేసుకున్నారు. 3 పేరుతో రూపొందిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, అందులోని వై దిస్ కొలవరి డి పాట ప్రపంచ స్థాయిలో దుమ్మురేపింది. ఆ చిత్ర సంగీతదర్శకుడు అనిరుద్‌ను సూపర్ రేంజ్‌కి తీసుకెళ్లింది. మలి ప్రయత్నంగా ఐశ్వర్యధనుష్ ‘వై రాజా వై’ చిత్రాన్ని తెరకెక్కించారు. అది కమర్శియల్‌గా ఓకే అనిపించుకుంది. అదే విధంగా స్టంట్ కళాకారుల జీవన విధానాన్ని ‘సినిమా వీరన్’ పేరుతో డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందించారు. ఇకపోతే పారా ఒలింపిక్ క్రీడా పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తమిళనాడుకు చెందిన మారియప్పన్ జీవిత చరిత్రను చిత్రంగా తెరపై ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక హర్రర్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి ఐశ్వర్య ధనుష్ రెడీ అవుతున్నారని సమాచారం. దెయ్యం ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని తన భర్త ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి వేల్రాజ్ ఛాయాగ్రహణం అందించనున్నారు. వనమగన్ జయశ్రీ కళాదర్శకత్వం వహించనున్నారు. సాంకేతిక వర్గం కూడా పూర్తి అయిన తరువాత చిత్ర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. -
నష్టపరిహారం కోరుతూ ఐశ్వర్య ధనుష్ పిటిషన్
చెన్నై: ఆశ్రమ పాఠశాల వ్యవహారంపై రూ.6 కోట్లు పరువు నష్టం కోరుతూ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే...స్థానిక గిండీ సమీపంలోని రేస్ కోర్స్ రోడ్డులో రజనీకాంత్ ఆశ్రమ పాఠశాలను నడుపుతున్నారు. ఈ పాఠశాల స్థల యజమాని వెంకటేశ్వర్లు అద్దె ఇవ్వలేదని గత 15న పాఠశాలకు తాళం వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఐశ్వర్య హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్లో శ్రీ రాఘవేంద్ర విద్యాసంఘాన్ని 1991లో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘం ద్వారా ఆశ్రమం పేరుతో వేలచ్చేరి, గిండీ, సైదాపేటలో పాఠశాలలు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. వీటిలో గిండీ రెస్కోర్స్ రోడ్డులో పాఠశాలను 2005లో స్థల యజమాని వెంకటేశ్వర్లు వద్ద లీజ్‌కు తీసుకుని పాఠశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత మే వరకూ అద్దె చెల్లించినట్లు తెలిపారు. ఈ స్థితిలో ఈ నెల 15న వెంకటేశ్వర్లు ఆశ్రమంలోకి చొరబడి అద్దె ఇవ్వడం లేదంటూ పాఠశాలను మూసివేశారన్నారు. అద్దె చెల్లించని కారణంగా ఆశ్రమ పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని మీడియాకు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పాఠశాల లోపలికి హద్దు మీరి ప్రవేశించినందుకు రూ.కోటి, తమ పాఠశాల సంఘం పేరుకు కళంకం కలిగించినందుకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని, ఇతరులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలనీ కోరారు.పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి సీవీ.కార్తీకేయన్ మంగళవారం (ఇవాళ) విచారణ జరపనున్నట్లు తెలిపారు. సంబంధిత వార్త...: రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ! -
ఐరాసలో ఐశ్వర్య భరతనాట్యం
న్యూయార్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే వారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య భరతనాట్యం ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసం ఐరాస తరఫున కృషిచేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఐరాసలో భారత శాశ్వత రాయబారి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మహిళాదినోత్సవం రోజున ఐరాసలో నృత్యంచేసే అవకాశంరావడం గర్వంగా ఉందని ఐశ్వర్య పేర్కొన్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ నాట్య ప్రదర్శన చేయనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కోసం ఆమె తనదైన రీతిలో రిహార్సల్ చేస్తున్నారు. తమిళ హీరో ధనుష్ సతీమణి అయిన ఐశ్వర్య ఇటీవల ‘స్టాండింగ్ ఆన్ యాన్ ఆపిల్ బాక్స్: ద స్టోరీ ఆఫ్ ఏ గర్ల్ అమాంగ్ ది స్టార్స్’ అనే పుస్తకం రాశారు. -
అభివృద్ధి సమానంగా జరగాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆత్కూరు (గన్నవరం): పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధించాలని, అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు అన్ని సదుపాయాలతో పూర్తిగా అభివృద్ధి చెందితే, గ్రామాల్లో మాత్రం సరైన రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, డ్రెయిన్లు వంటి కనీస సదుపాయలు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేవారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు పట్టణాలతో పాటు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చదువుకునే రోజుల నుంచి సమాజ సేవ చేయాలని తనతో పాటు తన స్నేహితులు భావించినా వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదన్నారు. 16 ఏళ్ల కిందట మిత్రులందరం చర్చించుకుని స్వర్ణభారత్ ట్రస్టును వెంకటచలంలో ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడలో ఎక్కువగా ఉన్న తన మిత్రుల కోరిక మేరకు ఏడాది కిందట ఇక్కడ చాప్టర్‌ను ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నట్లు తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యధనుష్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి ట్రస్టు ద్వారా చేస్తున్న విభిన్న కార్యక్రమాలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. -
వెండితెరకు మరియప్పన్ జీవితం!
గతేడాది రియో పారా ఒలింపిక్స్‌లో హై జంప్‌లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ‘ఎవరీ మరియప్పన్ తంగవేలు’ అని దేశమంతా ఆరా తీసింది. అతడికి జేజేలు కొట్టింది. ఇప్పుడీ తమిళనాడు యువకుడి జీవితకథ సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌ను ఆకర్షించింది. ‘మరియప్పన్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నారామె. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆదివారం షారుఖ్‌ఖాన్ ట్విట్టర్లో విడుదల చేశారు. హిందీలో ‘మేరీ కోమ్’, ‘సుల్తాన్’, ‘ఎం.ఎస్. ధోని’, ‘దంగల్’... క్రీడాకారుల జీవితకథలతో రూపొందిన చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగుంది. అయితే... ఓ పారా ఒలింపియన్ జీవితకథతో రూపొందనున్న మొదటి చిత్రం ఇదే అవుతుందేమో! ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్
ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలను వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఫిలింమేకర్స్. అదే బాటలో దక్షిణ భారత క్రీడాకారుడు మరియప్పన్ తంగవేళు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. 2016 సమ్మర్లో రియోలో జరిగిన పారాఒలింపిక్స్‌లో భారత్ తరుపున హై జంప్‌లో స్వర్ణపతకం సాధించిన మరియప్పన్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్లో రిలీజ్ చేసిన కింగ్ ఖాన్ ' భారత హీరో మరియప్పన్ తంగవేళు జీవితకథతో తెరకెక్కిన మరియప్పన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్. ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య ధనుష్' అంటూ కామెంట్ చేశాడు. Here's presenting the first look of the biopic on #MariyappanThangavelu, our very own national hero, all the best @ash_r_dhanush pic.twitter.com/oD1avhkC4K — Shah Rukh Khan (@iamsrk) 31 December 2016 -
అతనేంటో నాకు తెలుసు
నా భర్త ఎలాంటి వారో నాకు బాగా తెలుసని సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు. 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఈమె ఆ తరువాత వైరాజావై చిత్రం చేశారు. ప్రస్తుతం స్టంట్ కళాకారుల జీవిత ఇతివృత్తంతో సినిమా వీరన్ అనే లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే విధంగా తన తండ్రి సూపర్‌స్టార్ జీవిత చరిత్రను రాసి, దాన్ని వెండి తెరపై ఆవిష్కరించే పనిలోనూ ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఐశ్వర్య భర్త, ధనుష్ గురించి రకరకాల వదంతులు మీడి యాలో హల్చల్ చేస్తున్నాయి. ధనుష్ ప్లేబాయ్ అని, కొందరు నటీమణులతో చెట్టాపట్టాల్ అంటూ వదంతులు కలకలం పుట్టిస్తున్నాయి. అంతే కాదు ఇలాంటి వదంతుల కారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తినట్లు, చివరకు రజనీకాంత్ కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలాంటి ప్రచారాన్ని మౌనంగా గమనిస్తూ వస్తున్న ధనుష్ భార్య, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ తన మనోగతాన్ని తేటతెల్లం చేశారు. తన భర్తపై ప్రచారం అవుతున్న వదంతులకు స్పందిస్తూ తాను డాక్టర్నో, లాయర్‌నో అయి ఉంటే ఇలాంటి వదంతులకు ఆగ్రహించుకునేదానినన్నారు. తనది సినిమా కుటుంబం అని, సినిమా గురించి తనకు పూర్తిగా తెలుసనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన భర్త ధనుష్ గురించి,ఆయన ఎలాంటి వారో తనకు బాగా తెలసన్నారు. ఇలాంటి పనికిమాలిన, అసత్య ప్రచారాల గురించి పట్టించుకోవలసిన అవసరమో, బాధ పడాల్సిన పనో లేదని ఐశ్వర్య ధనుష్ స్పష్టం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనం. -
రియల్ హీరోలకు అవార్డులివ్వండి
సినిమా పరిశ్రమలో రియల్ హీరోలంటే స్టంట్ కళాకారులే. అలాంటి వారి కోసం దర్శకురాలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు, నటుడు ధనుష్ అర్ధాంగి ఐశ్వర్యధనుష్ గొంతు విప్పారు. ఇటీవల ఐనా సభలో మహిళాభివృద్ధి రాయబారిగా ఎంపికైన ఐశ్వర్య అటు వైపుగా అడుగులు వేస్తున్నారు. తన భర్త ధనుష్ హీరోగా నటించిన 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తిన ఈమె తాజా చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ప్రస్తుతం సినిమా వీరన్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన భర్త వుండర్‌బార్ ఫిలింస్ పతాకంపై రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా సినీ స్టంట్కళాకారుల జీవితాలను ఆవిష్కరించనున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవ్వనున్నారు. ఇక ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం మరో విశేషం. కాగా సినీ కళాకారులను ప్రోత్సహించే విధంగా కేంద్రప్రభుత్వం ఉత్తమ కళాకారులకు జాతీయ అవార్డులను అందించడం ఆనవాయితీగా జరుగుతున్న విషయమే. అయితే ఇందులో స్టంట్ కళాకారుల కేటగిరి చోటు చేసుకోలేదు. ఇప్పుడు స్టంట్ కళాకారుల జీవితాలను డాక్యుమెంటరీగా రూపొందిస్తున్న ఐశ్యర్య ధనుష్ శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖా మంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. ఆయనతో కాసేపు ముచ్చటించిన ఐశ్వర్యధనుష్ తన డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించారు. అదే సమయంలో జాతీయ అవార్డుల కేటగిరిలో స్టంట్ కళాకారుల శాఖను చేర్చి వారికి అవార్డులందించి ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ కోసం గొంతు విప్పిన ఐశ్వర్యధనుష్కు పలువురు స్టంట్ మాస్టర్లు, స్టంట్ కళాకారులు సోషల్ మీడియా ద్వారా కృతజత్ఞలు తెలుపుతున్నారు. -
ఐశ్వర్య దర్శకత్వంలో 'సినిమా వీరన్'
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా, హీరో ధనుష్ భార్యగా ఐశ్వర్య ధనుష్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఈ స్టార్ వారసురాలు, ప్రస్తుతం దర్శకురాలిగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది. ఇప్పటికే ధనుష్ హీరోగా 3 సినిమాను డైరెక్ట్ చేసిన ఐశ్వర్య ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం సినిమా నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉంది. సినీ రంగంలోని 24 శాఖల్లో ఒకటైన స్టంట్ డైరెక్టర్ల కష్టాలు, వారి జీవనశైలి, వారికి ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా వీరన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఐశ్వర్య. తానే స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వాయిస్ ఓవర్ అంధిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నేపథ్యం సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రిలీజ్ చేయనున్న ఈ డాక్యుమెంటరీని కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ మినిస్టర్ వెంకయ్య నాయుడుకు చూపించిన ఐశ్వర్య, ఇన్నాళ్లుగా జాతీయ అవార్డుల్లో ఫైట్ మాస్టర్ క్యాటగిరీ లేకపోవటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ఫైట్ మాస్టర్లకు కూడా జాతీయ అవార్డును అందించాలని కేంద్రాన్ని కోరారు. -
రచయిత్రిగా సూపర్ స్టార్ డాటర్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్యా ధనుష్ రచయిత్రిగా మారనున్నారు. రజనీ కూతురిగా, ధనుష్ లాంటి స్టార్ హీరోకు భార్యగా సమాజంలో ఎదుర్కొన్న అనుభవాలను పుస్తకంలో వివరించనున్నారు. ‘‘దీన్ని పుస్తకంగా రాయాలనుకోలేదు. అయిదేళ్ల క్రితం నుంచి డైరీ రాస్తున్నా. దాన్నే పుస్తకంగా తీసుకురావాలని ప్లాన్. నేను రచయితనవుతానని ధనుష్ అనుకోలేదు. నాన్నకైతే ఈ విషయం ముందే తెలుసు. ఎందుకంటే చిన్నతనం నుంచే నా ఆలోచనలన్నీ కవితలుగా రాసేదాన్ని. ఏదో రోజు రచయితనవుతానని నాన్న అంటూ ఉండేవారు’’ అని ఐశ్వర్య చెప్పారు. -
వారిద్దరితో సినిమా తీసే ఆలోచన లేదు
చెన్నై: తన తండ్రి రజనీకాంత్, భర్త ధనుష్ కలసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ తనయ సౌందర్య ధనుష్ వెల్లడించారు. గురువారం చెన్నైలో సౌందర్య మాట్లాడుతూ.... మీ దర్శకత్వంలో రజనీకాంత్, ధనుష్ కలసి నటిస్తున్న చిత్రం ఎప్పడు ప్రారంభమవుతుందని ప్జజలు నిత్యం తనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని చెప్పారు. అయితే అలాంటి ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ ఏమీ ప్రస్తుతానికి తన వద్ద లేదని చెప్పారు. ధనుష్ నటించిన వాయి రాజా వాయి చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రంలో ధనుష్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుదని సౌందర్య అన్నారు. వాయి రాజా వాయి చిత్రంలో గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వాయి రాజా వాయి చిత్రానికి సౌందర్య ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
భార్య దర్శకత్వంలో మరోసారి
నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో మరోసారి నటించనున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ పెద్దకుమార్తె, ధనుష్ భార్య అయిన ఐశ్వర్య తొలిసారిగా మెగాఫోన్ పట్టి తన భర్త హీరోగా ‘3’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. నటి శ్రుతిహాసన్ హీరోయిన్గా తొలి తమిళ చిత్రం ఇదే. అనిరుధ్ సంగీ తాన్ని అందించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించక పోయినా అందులోని వై దిస్ కొల్లవెరి డీ పాట ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కొంచెం గ్యాప్ తర్వాత ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వై రాజా వై’. యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. చిత్ర కథను మలుపు తిప్పే ముఖ్య భూమికను నటుడు ధనుష్ పోషించనున్నారన్నది తాజా వార్త. ఈ క్యామియో పాత్ర పోషించాలని ఐశ్వర్య తన భర్త ధనుష్‌ను కోరగా అందుకాయన ఓకే చెప్పారట. ఈ పాత్ర చిత్రీకరణ త్వరలో నిర్వహించనున్నట్లు తెలిసింది. -
నేను విలన్ని కాదు!
‘రాముడు మంచి బాలుడు’ అన్నట్లుగా... తాప్సీని మంచి బాలిక అనవచ్చు. పార్టీలు చేసుకోవడం, విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం, ఎలా పడితే అలా ఉండడం తాప్సీకి నచ్చదు. అలాంటి తాప్సీ జూదశాలలోకి అడుగుపెట్టారు. పందెం కట్టారు. అయితే, ఇదంతా సినిమా కోసమేలెండి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వై రాజా వై’లో ఇలాంటి పాత్ర చేస్తున్నారు తాప్సీ. దాంతో ఈ చిత్రంలో ఆమె ప్రతినాయికగా నటిస్తున్నారనే వార్త ప్రచారం అవుతోంది. దీని గురించి తాప్సీ స్పందిస్తూ -‘‘ఇందులో నా పాత్ర పేరు శ్రేయ. జీవితాన్ని ఆస్వాదించాలనుకునే మనస్తత్వం తనది. జూదశాలలకు వెళుతుంది. డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెడుతుంది.తన జీవితం తనది. అంతే కానీ, ఈ సినిమాలో హీరో కారణంగా లాభపడటమో, విలన్ వల్ల నష్టపోవడమో ఉండదు. నేను మాత్రం విలన్ కాదు. నిజం చెప్పాలంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని జూదశాలల్లో పోగొట్టుకోవడం నాకిష్టం ఉండదు. నా మనస్తత్వానికి విరుద్ధమైన పాత్రను ఇందులో చేశాను. నాది అతిథి పాత్ర. తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర’’ అని చెప్పారు. -
నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ లేరు
నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరంటున్నారు సీనియర్ నటుడు కార్తీక్ వారసుడు, కాదల్ హీరో గౌతమ్ కార్తీక్. తొలి చిత్రం కడల్ నిరాశ పరిచినా గౌతమ్ కార్తీక్‌కు పలు అవకాశాలు క్యూకట్టడం విశేషం ప్రస్తుతం ఈ వర్ధమాన నటుడి చేతిలో మూడు నాలుగు చిత్రాలున్నాయి. గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. కడల్ చిత్రం తరువాత అభిమానులు నన్ను గుర్తిస్తున్నారు. అయితే ఆ అభిమానం ఇతర రాష్ట్రాలకు పాకలేదు. ఇటీవల బెంగళూరు వెళ్లాను. అక్కడ నన్నెవరూ గుర్తుపట్టలేదు స్వేచ్ఛగా తిరిగి ఎంజాయ్ చేశాను. నాన్న నటించిన పలు చిత్రాలు చూశాను. నటుడిగా ఆయనంత స్థాయికి చేరుకోవడానికి నాకు చాలా కాలం పడుతుంది. ఎన్నమో ఏదో చిత్రంలో సీనియర్ నటుడు ప్రభుతో కలిసి నటిస్తున్నాను. ఆయన నటనలో చాలా మెళకువలు నేర్పారు. ఆ విధంగా నటనలో కాస్త పరిణితి చెందాననే చెప్పాలి. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో వై రాజా వై చిత్రంలో నటిస్తున్నాను. ఇది లవ్ థ్రిల్లర్. కాగా చిత్రం హీరోయిన్ ప్రియా ఆనంద్ చాలా స్నేహశీలి. ఇక సిపాయి చిత్రంలో లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమెకు పాత్రను అర్ధం చేసుకుని నటించాలనే ఆసక్తి అధికంగా ఉంది. ఇక నా తండ్రి కార్తీక్‌కు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నట్లుగా మీకూ ఉన్నారా? అని తరచూ చాలామంది అడుగుతున్నారు. నాకు గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే అని గౌతమ్ కార్తీక్ చాలా స్పష్టంగా తెలిపారు. -
రవి రాఘవేంద్ర కుమార్తె వెడ్డింగ్ కి విచ్చేసిన స్టార్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లత సోదరుడు, తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీతారలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రజనీకాంత్ కుటుంబ సమేతంగా విచ్చేసి వధూవరుల్ని ఆశీర్వదించారు. ప్రభు, ధనుష్, అనుష్క తదితర ప్రముఖులు వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు.