కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల ఐశ్వర్య రజినీకాంత్ లాల్ సలామ్ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు ధనుశ్ రాయన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ కపుల్ దాదాపు రెండేళ్ల తర్వాత అధికారికంగా విడాకుల కోసం పిటిషన్లు వేశారు. త్వరలో వారి కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. కాగా.. 2004లో ధనుశ్, ఐశ్వర్య ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దీంతో మరోసారి ధనుశ్- ఐశ్వర్య టాపిక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
కలుస్తారని భావించినా..
గతంలో ఈ జంట మళ్లీ కలవబోతున్నారని చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతే కాదు అభిమానులు సైతం వీరిద్దరు కలుస్తారని ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లకు పైగా దూరంగా ఉన్న ఈ జంట చివరికీ విడిపోయేందుకే మొగ్గు చూపారు.
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022
Comments
Please login to add a commentAdd a comment