
కోలీవుడ్ మాజీ దంపతులు ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ కొన్ని రోజులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమైతే బాగుండని ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు సైతం ఆశపడుతున్నారు. అయితే వారిద్దరు మళ్లీ కలుస్తున్నారా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఈ వీరిద్దరు మళ్లీ కలవడంపై వారి సన్నిహితుల నుంచి స్పష్టత ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: అను ఇమ్మాన్యుయేల్‌కు మరో చాన్స్
ధనుష్-ఐశ్యర్య మళ్లీ కలుస్తున్నారని, వారు విడాకులు రద్దు చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వారిద్దరు మళ్లీ కలిసే ఆలోచనలో లేరని, ప్రస్తుతం ఎవరి జీవితం వారిది అన్నట్లుగా ధనుష్-ఐశ్వర్యలు వ్యవహరిస్తున్నారని సన్నిహితుల నుంచి సమాచారం. కనీసం ఎదురుపడిన వారు మాట్లాడుకోవడం లేదట. పిల్లల విషయంలో మాత్రమే వారిద్దరు అప్పుడప్పుడు కలుస్తున్నారని, బహుశా ఆ సమయంలో వారిని చూడటం వల్లే ఈ వార్తలు పుట్టుకొచ్చి ఉంటాయని సన్నిహితులు అభిప్రాయపడ్డారట.
చదవండి: త్రిష చిత్రంలో నయనతార?.. ఆ పాత్రకు అంగీకరిస్తారా..?
కాగా 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్-ఐశ్వర్యలు తమ 18ఏళ్ల వైవాహిక బంధానికి ఈ ఏడాది ప్రారంభంలో స్వస్తి పిలికారు. తాము విడాకులు తీసుకుంటున్నామంటూ జనవరిలో ప్రకటించారు వీరిద్దరు ప్రకటించడం వారి ఫ్యాన్స్‌తో సినీ సెలబ్రెటీలు సైతం షాకయ్యారు. కానీ వీరి విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి మళ్లీ కలిస్తే బాగుండూ అంటూ ధనుష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే వారు మళ్లీ కలుస్తున్నారనే వార్తలు నెట్టింట పుట్టుకొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment