Reunite Couple
-
ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలవబోతున్నారా? ఇదిగో క్లారిటీ..
కోలీవుడ్ మాజీ దంపతులు ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ కొన్ని రోజులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమైతే బాగుండని ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు సైతం ఆశపడుతున్నారు. అయితే వారిద్దరు మళ్లీ కలుస్తున్నారా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఈ వీరిద్దరు మళ్లీ కలవడంపై వారి సన్నిహితుల నుంచి స్పష్టత ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అను ఇమ్మాన్యుయేల్‌కు మరో చాన్స్ ధనుష్-ఐశ్యర్య మళ్లీ కలుస్తున్నారని, వారు విడాకులు రద్దు చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వారిద్దరు మళ్లీ కలిసే ఆలోచనలో లేరని, ప్రస్తుతం ఎవరి జీవితం వారిది అన్నట్లుగా ధనుష్-ఐశ్వర్యలు వ్యవహరిస్తున్నారని సన్నిహితుల నుంచి సమాచారం. కనీసం ఎదురుపడిన వారు మాట్లాడుకోవడం లేదట. పిల్లల విషయంలో మాత్రమే వారిద్దరు అప్పుడప్పుడు కలుస్తున్నారని, బహుశా ఆ సమయంలో వారిని చూడటం వల్లే ఈ వార్తలు పుట్టుకొచ్చి ఉంటాయని సన్నిహితులు అభిప్రాయపడ్డారట. చదవండి: త్రిష చిత్రంలో నయనతార?.. ఆ పాత్రకు అంగీకరిస్తారా..? కాగా 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్-ఐశ్వర్యలు తమ 18ఏళ్ల వైవాహిక బంధానికి ఈ ఏడాది ప్రారంభంలో స్వస్తి పిలికారు. తాము విడాకులు తీసుకుంటున్నామంటూ జనవరిలో ప్రకటించారు వీరిద్దరు ప్రకటించడం వారి ఫ్యాన్స్‌తో సినీ సెలబ్రెటీలు సైతం షాకయ్యారు. కానీ వీరి విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి మళ్లీ కలిస్తే బాగుండూ అంటూ ధనుష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే వారు మళ్లీ కలుస్తున్నారనే వార్తలు నెట్టింట పుట్టుకొస్తున్నాయి. -
పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!
హుబ్లీ: పెళ్లయిన కొత్తలో గొడవలతో వేరుపడ్డారు. విడాకులు కూడా తీసుకుని 52 ఏళ్ల పాటు ఎవరికొద్దీ వారు జీవించారు. చివరకు లోక్ అదాలత్ వారిని ఒక్కటి చేసింది. ఈ అపరూప సన్నివేశం కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా కలఘటికిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లో చోటు చేసుకుంది. జెన్నూరు గ్రామానికి చెందిన బసప్ప అగడి (85), మాజీ భార్య కళవ్వ (80) 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కళవ్వకు బసప్ప ప్రతి నెలా భరణం చెల్లించేవాడు. గత కొన్ని నెలలుగా చెల్లించలేకపోయాడు. దీంతో కళవ్వ కోర్టును ఆశ్రయించగా సోమవారం మెగా లోక్ అదాలత్‌లో జడ్జి జీఆర్ శెట్టర్ వారి సమస్యను పరిశీలించారు. నడవలేని స్థితిలో ఉన్న కళవ్వను చూసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించాలంటూ హితబోధ చేశారు. దంపతులను ఒక్కటి చేసి పంపించారు. (క్లిక్: అయ్యబాబోయ్ ఏనుగులు.. పరుగో పరుగు!) -
తొలి భర్త, ప్రేయసిని కలిపిన కోర్టు
ముంబై: మతాంతర ప్రేమ వివాహం చేసుకున్న జంటను విడదీసి, యువతి బంధువులు బలవంతంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. తొలి భర్త న్యాయ పోరాటం చేయడంతో.. కోర్టు జోక్యం చేసుకుని విడిపోయిన ఆ ప్రేమజంటను మళ్లీ ఒకటి చేసింది. సినిమా కథను తలపించే ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రేమజంట గత జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి పారిపోయి వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత యువతి బంధువులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి గుజరాత్‌కు చెందిన మరో వ్యక్తితో పెళ్లిచేశారు. తన భార్య (గర్భవతి) తప్పిపోయిదంటూ మొదటి భర్త ముంబైకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితం లేకపోవడంతో అతను బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసుల సాయంతో తన భార్యను తనకు అప్పగించాలని కోర్టును కోరాడు. హైకోర్టు ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు యువతి ఇంటికెళ్లి ఆమెను తీసుకువచ్చి ఈ నెల 23న కోర్టులో హాజరుపరిచారు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తావా లేక భర్త దగ్గర ఉంటావా అన్ని న్యాయమూర్తులు ఆ యువతిని ప్రశ్నించగా.. తనను తొలుత వివాహం చేసుకున్న, ముంబైలో ఉంటున్న భర్త (ప్రియుడు) వద్ద ఉంటానని చెప్పింది. దీంతో ఈ ప్రేమజంట మళ్లీ కలసి జీవించేలా బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది.