‘జమిలి’ కోసం జేపీసీ ప్రకటన, చైర్మన్‌ ఎవరంటే.. | Joint Parliamentary Committee for One Nation One Election Details Here | Sakshi
Sakshi News home page

‘జమిలి’ కోసం జేపీసీ ప్రకటన, చైర్మన్‌ ఎవరంటే..

Published Wed, Dec 18 2024 9:40 PM | Last Updated on Wed, Dec 18 2024 9:43 PM

Joint Parliamentary Committee for One Nation One Election Details Here

న్యూఢిల్లీ, సాక్షి: జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను బుధవారం ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. 

కమిటీలో అనురాగ్‌ ఠాకూర్‌, అనిల్‌ బలూనీ, సంబిత్‌ పాత్రా, శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్‌ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి బాలశౌరి(జనసేన), హరీష్‌ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్‌(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు. పీపీ చౌధరి రాజస్థాన్‌ పాలి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. జమిలి జేపీసీ ఏర్పాటు ప్రతిపాదలను రేపు(గురువారం, డిసెంబర్‌ 19) లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలియజేయనున్నారు.

జమిలి బిల్లులపై ఈ జేపీసీ సంప్రదింపులు, అధ్యయనం చేసి తదుపరి సమావేశాల్లోగా నివేదిక సమర్పించనుంది. అవసరమైతే.. జేపీసీ గడువును లోక్‌సభ స్పీకర్‌ పొడిగిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement