One Nation One Election
-
జమిలిపై చర్చ...చాలా కీలకం
న్యూఢిల్లీ: ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ భారత ప్రజాస్వామ్య ప్రస్థానానికి చాలా కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలెంటీర్లు, యువత అందులో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది వారి భవిష్యత్తుతో నేరుగా ముడిపడ్డ అంశమని గుర్తుంచుకోవాలన్నారు. సోమవారం ఇక్కడ ఎన్సీసీ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మన దేశంలో పదేపదే ఎన్నికలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక మూల ఎన్నికల వాతావరణం నెలకొని ఉంటోంది. దాంతో పాలన, అభివృద్ధి పనుల వేగం మందగిస్తోంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలూ ఒకేసారి జరిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మొదట్లో దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగేవి. తర్వాతి కాలంలో ఆ ప్రక్రియకు విఘాతం కలిగింది. అమెరికా వంటి అగ్ర రాజ్యాల్లో ఎన్నికలు నిరీ్ణత కాలావధిలోనే జరుగుతాయి’’ అని గుర్తు చేశారు. కనీసం లక్షమంది యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని పునరుద్ఘాటించారు. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలోనూ ఇదే మాట చెప్పానని గుర్తు చేశారు. -
వాడీవేడిగా జేపీసీ తొలి భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో లోక్‌సభ, రాష్ట్రాల్లో శాసనసభలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశమే వాడీవేడి చర్చకు వేదికగా మారింది. బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యాంగం మౌలిక రూపాన్ని మార్చే కుట్ర జరిగిందని, ఈ బిల్లుకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్ష పార్టీల సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. ప్రజాభీష్టం మేరకే ఈ బిల్లులను తెచ్చామని మూడోసారి పీఠంపై కూర్చున్న ఎన్డీఏ కూటమి సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో 39 మంది సభ్యులతో కొలువైన జేపీసీ తొలి భేటీ ఆద్యంతం తీవ్రస్థాయిలో వాదోప వాదాలతో కొనసాగింది. బుధవారం ఢిల్లీలో జేపీసీ సమావేశం తొలిరోజు సందర్భంగా సభ్యులందరికీ కేంద్ర న్యాయ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత బిల్లుల్లోని కీలక అంశాలు, నియమనిబంధనలను పూర్తిగా విడమరచి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఎలా ఎన్నికల ఖర్చుగా భారీగా తగ్గించగల్గుతాయని నిలదీశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాల్లో తొలిసారిగా ఈవీఎంలను వాడినప్పుడు ఖర్చు భారీగా తగ్గిందనడానికి ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు.దీటుగా బదులిచ్చిన ఎన్డీఏ కూటమిదీనిపై బీజేపీ సభ్యులు సమాధానం ఇచ్చే ప్రయ త్నం చేశారు. ‘‘ 1957లో ఇలాగే ఏకకాల ఎన్ని కల కోసం అప్పుడు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలను కాలపరిమితి ముగిసేలోపే కుదించారు. అప్పు డు రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఆయ నే నాడు రాజ్యాంగ పరిషత్‌కు చైర్మన్ కూడా. ఆనాడు ఇలాంటి నిర్ణయం తీసుకున్న దిగ్గజ ఎంపీలంతా నాడు నెహ్రూ హయాంలో పనిచేసిన వాళ్లే. ఆ లెక్కన వీళ్లంతా ఆనాడు రాజ్యాంగ ఉల్ల ంఘనకు పాల్పడినట్టా? అని బీజేపీ సభ్యుడు సంజయ్ జైశ్వాల్ ఎదురు ప్రశ్న వేశారు. తీవ్రంగా తప్పుబట్టిన విపక్షాలుబిల్లులను విపక్ష పార్టీల సభ్యులు తప్పు బట్టారు. ‘‘ విస్తృతమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాలి. బిల్లులపై చర్చించేందుకు కనీసం ఏడాదిపాటు సమయం ఇవ్వాలి’’ అని కమిటీకి సారథ్యం వహిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరిని విపక్ష సభ్యులు కోరారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానం తేవాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. -
జేపీసీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ : జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది. ఆ 12మందిలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నిక బిల్లును)ను లోక్‌సభ శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇప్పటికే మంగళవారం దిగువ సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని విపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని డిమాండ్ చేయడంతో లోక్‌సభ జేపీసీకి పంపింది. మరోవైపు లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు.కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ నుంచి), బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు. -
జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం
-
‘జమిలి’ కోసం జేపీసీ ప్రకటన, చైర్మన్ ఎవరంటే..
న్యూఢిల్లీ, సాక్షి: జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను బుధవారం ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు. పీపీ చౌధరి రాజస్థాన్ పాలి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. జమిలి జేపీసీ ఏర్పాటు ప్రతిపాదలను రేపు(గురువారం, డిసెంబర్ 19) లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలియజేయనున్నారు.జమిలి బిల్లులపై ఈ జేపీసీ సంప్రదింపులు, అధ్యయనం చేసి తదుపరి సమావేశాల్లోగా నివేదిక సమర్పించనుంది. అవసరమైతే.. జేపీసీ గడువును లోక్‌సభ స్పీకర్ పొడిగిస్తారు.21 members from Lok Sabha; 10 from Rajya Sabha in Joint Parliamentary Committee (JPC) for 'One Nation One Election'Priyanka Gandhi Vadra, Manish Tewari, Dharmendra Yadav, Kalyan Banerjee, Supriya Sule, Shrikant Eknath Shinde, Sambit Patra, Anil Baluni, Anurag Singh Thakur named… pic.twitter.com/P678d7c9tl— ANI (@ANI) December 18, 2024 -
జమిలి జేపీసీలో ప్రియాంక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటవుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో కాంగ్రెస్ తరఫున ప్రియాంకా గాంధీ నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ తరఫున నామినీల జాబితాలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీశ్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్ పేర్లను చేర్చారు. అర్హత ఉన్న పార్టీలన్నీ తమ తమ నామినీల పేర్లను లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. మొత్తంగా లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. గురువారం ఈ 21 మంది లోక్‌సభ సభ్యుల పేర్లను స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంబంధిత తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీ తమ నివేదికను వచ్చే సెషన్ చివరివారం తొలి రోజున నివేదించాలని మేఘ్వాల్ ప్రతిపాదించనున్నారు. బీజేపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తంభాయ్ రూపాలా, భతృహరి మహతాబ్, అనిల్ బాలుని, సీఎం రమేశ్, బాన్సురీ స్వరాజ్, విష్ణు దయాళ్ రామ్, సంబిత్ పాత్రాల పేర్లు ఖరారైనట్లు సమాచారం. గతంలో న్యాయశాఖ సహాయ మంత్రిగా చేసిన పీపీ చౌదరి జేపీసీకి ఛైర్మన్‌గా ఉంటారని తెలుస్తోంది. అయితే అనురాగ్ ఠాకూర్ పేరు సైతం పరిశీలనలో ఉందని సమాచారం. శివసేన తరఫున శ్రీకాంత్ షిండే, సమాజ్‌వాదీ పార్టీ తరఫున ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ తరఫున కళ్యాణ్ బెనర్జీ, డీఎంకే తరఫున టీఎం సెల్వగణపతి, టీడీపీ తరఫున జీఎం హరీశ్ బాలయోగి, ఎన్సీపీ(ఎస్పీ) తరఫున సుప్రియా సూలే, ఆర్ఎల్డీ తరఫున చందన్ చౌహాన్, జనసేన పార్టీ తరఫున బాలశౌరి వల్లభనేని కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. బీజేపీ సారథ్యలోని ఎన్డీఏ కూటమి తరఫున కమిటీలో 14 మంది సభ్యులు ఉండనున్నారు. వీరిలో బీజేపీ నుంచి 10 మంది ఉంటారు. రాజ్యసభ నుంచి కాంగ్రెస్ తరఫున రణ్‌దీప్ సూర్జేవాలా, డీఎంకే తరఫున పి.విల్సన్, టీఎంసీ తరఫున సాకేత్ గోఖలే, జేడీ(యూ) తరఫున సంజయ్ ఝా, బీజేడీ తరఫున మానస్ రంజన్ మంగరాజ్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. జమిలీ ఎన్నికల బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. -
లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!
దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్‌సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది. జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు. ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.కాంగ్రెస్ తిరస్కరణమంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్ ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.జేపీసీకి డెడ్‌లైన్ ఉంటుందా?జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్ !! -
లోక్‌సభలో ‘జమిలి ఎన్నికల’ బిల్లు.. సొంత పార్టీ ఎంపీలకు బీజేపీ నోటీసులు
ఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలపై బీజేపీ అధిష్టానం ఫైరయ్యింది. సుమారు 20మంది ఎంపీలకు బాధ్యతారాహిత్యం కింద నోటీసులు జారీ చేసింది.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. ఎన్డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే, లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో 20మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యారు.గతంలోనే, జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో లోక్‌సభ సభ్యులు సభకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీలు చర్చలో పాల్గొనలేదు. BIG BREAKING NEWS 🚨 One Nation One Election Bill accepted in Lok Sabha despite MASSIVE opposition by Opposition Parties.269 votes in favour and 198 votes against it.According to the bill, the “appointed date” will be after the next Lok Sabha elections in 2029, with… pic.twitter.com/xRBHnXGEBA— Times Algebra (@TimesAlgebraIND) December 17, 2024రాజ్యాంగాన్ని సవరించి ఏకకాలంలో పార్లమెంటరీ, రాష్ట్రాల ఎన్నికలను అనుమతించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాదు. కానీ, ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. జమిలి ఎన్నికలు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని, అందుకు ఆ 20 మంది బీజేపీ ఎంపీల తీరేనని ఆరోపిస్తోంది. నియమావళి ప్రకారం బిల్లులు సాధారణ మెజారిటీతో ఆమోదం లభించింది. 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు -
లోక్‌సభకు ‘జమిలి’ బిల్లు? బీజేపీ ఎంపీలకు విప్!
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. మంగళవారం(డిసెంబర్17) లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలోని తమ పార్టీ ఎంపీలందరికి బీజేపీ విప్ జారీ చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో సోమవారమే ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, తర్వాత బిజినెస్ నుంచి తొలగించారు.ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియరైంది. దీంతో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టగానే చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి రిఫర్ చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. దీంతో స్పీకర్ జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.జమిలి ఎన్నికల బిల్లు గనుక పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితే లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయసభల్లోని మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ గతంలోనే ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే -
పార్లమెంటుకు జమిలి ఎన్నికల బిల్లు
-
జమిలి ఎన్నికల బిల్లులు వాయిదా
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లు సోమవారం లోక్‌సభ ముందుకు రావడం లేదు. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్ దిగువ సభలో నేడు ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆదివారం సవరించిన బిజినెస్ జాబితా నుంచి ఈ రెండు బిల్లులను తొలగించారు. సోమవారం నాటి లోక్‌సభ అజెండాలో వీటిని చేర్చలేదు. అయితే, రెండు బిల్లులను ఈ వారమే సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 20న ముగియనున్నాయి. ఆలోగానే బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను లోక్‌సభ స్పీకర్ అనుమతితో చివరి నిమిషంలోనైనా సప్లిమెంటరీ లిస్టు ఆఫ్ బిజినెస్ జాబితాలో చేర్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. నిధుల కేటాయింపులకు సంబంధించిన కొన్ని డిమాండ్లపై సోమవారం లోక్‌సభలో చర్చించాల్సి ఉందని, అందుకే జమిలి ఎన్నికల బిల్లులను వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన రెండు బిల్లుల వివరాలను నిబంధనల ప్రకారం గత వారమే లోక్‌సభ సభ్యులకు అందజేశారు. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఈ నెల 12న ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. జమిలి బిల్లులకు మద్దతివ్వండిలక్నో: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’విధానాన్ని బీఎస్పీ అధినేత మాయావతి సమర్థించారు. ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సంక్షేమ కార్యక్రమాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆమె చెప్పారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టే జమిలి బిల్లుకు మద్దతు పలకాలని ఇతర రాజకీయ పార్టీలను మాయావతి కోరారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలన్నారు. -
పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
KSR Live Show: కేంద్రం జమిలి జోరు.. ఏపీలో రైతు పోరు..
-
జమిలి ఎన్నికలపై కేంద్ర మరో ముందడుగు
-
జమిలి బిల్లుకు సై
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన ‘రాజ్యాంగ 129 (సవరణ) బిల్లు’ను సైతం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ఈ రెండు బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభకు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించినట్లు తెలియజేశాయి. బిల్లుకు సంబంధించిన సాంకేతిక అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంత్రివర్గ సహచరులకు వివరించారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని, వారిని చైతన్యపర్చాలని ప్రధాని మోదీ సూచించారు. నిజానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు దేశవ్యాప్తంగా మున్సిపాలీ్టలు, పంచాయతీలకు సైతం ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదించింది. కానీ, జమిలి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతానికి చేర్చకూడదని కేంద్రం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీతోపాటు కనీసం 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీలు అంగీకారం తెలియజేయాలి. కేబినెట్ భేటీ అజెండాలో ‘రాజ్యాంగ 129 (సవరణ) బిల్లు’ తొలుత లేదని అమిత్ షా చెప్పారు. అయినప్పటికీ దానిపై చర్చించి, ఆమోదించామని అన్నారు. వచ్చే ఏడాదే ఓటింగ్ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీతోపాటు శాసనసభలు ఉన్న మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూకశీ్మర్‌లో జమిలి ఎన్నికల నిర్వహణకు మూడు చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్–1991, గవర్నమెంట్ ఆఫ్ యూనియట్ టెరిటరీస్ యాక్ట్–1963, జమ్మూకశీ్మర్ రీఆర్గనైజేషన్ యాక్ట్–2019లో సవరణ చేయడానికి బిల్లు సిద్ధం చేశారు. ఈ మూడు చట్టాలను సవరించే బిల్లు సాధారణమైందే . దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదిస్తే సరిపోతుంది. మరోవైపు జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపించనున్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల అభిప్రాయాలను ఈ కమిటీ ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేధావులు, నిపుణులు, పౌర సమాజ సభ్యులతోపాటు సాధారణ ప్రజల అభిప్రాయాలు సైతం తెలుసుకోవాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. బిల్లుపై భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరగాలన్నదే ప్రభుత్వ యోచన. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బిల్లుపై వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే? జమిలి ఎన్నికల బిల్లు ప్రత్యేకమైంది. ఇది రాజ్యాంగ సవరణలతో ముడిపడిన వ్యవహారం. బిల్లు నెగ్గాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. రాజ్యసభలో మొత్తం ఎంపీల సంఖ్య 243. ప్రస్తుతం కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందాలంటే 164 మంది సభ్యులు మద్దతు పలకాలి. ఎన్డీయేకు 122 మంది సభ్యులున్నారు. ఎగువ సభలో ఖాళీల భర్తీ తర్వాత ఎన్డీయే బలం పెరుగనుంది. లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలున్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. బిల్లుకు అనుకూలంగా కనీసం 361 ఓట్లు రావాలి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే మనుగడ సాగిస్తోంది. ఎన్డీయేకు 293 మంది ఎంపీలున్నారు. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ కూటమి మరో 68 మంది ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంది. అది అంత కష్టం కాకపోవచ్చు. జమిలి ఎన్నికల విషయంలో రామ్‌నాథ్ కోవింద్ కమిటీ 47 రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించగా, 32 పారీ్టలు మద్దతిచ్చాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. కోవింద్ కమిటీ కీలక సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ 2023 సెపె్టంబర్ 2న తమ కార్యాచరణ ప్రారంభించింది. రాజకీయ పార్టీలు, భాగస్వామ్యపక్షాలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. అందరి అభిప్రాయాలు సేకరించింది. 191 రోజుల కసరత్తు అనంతరం నివేదికను సిద్ధం చేసింది. 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చి నెలలో సమర్పించింది. కోవింద్ కమిటీ సిఫార్సులను ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ సిఫార్సులు ఏమిటంటే.. → దేశంలో గతంలో అమలైన జమిలి ఎన్నికలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చట్టపరమైన కట్టుదిట్టాలు చేయాలి. పటిష్టమైన చట్టం తీసుకురావాలి. → జమిలి ఎన్నికల్లో భాగంగా తొలి అంచెలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. → రెండో అంచెలో మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు పూర్తయిన తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. → జమిలి ఎన్నికలు పూర్తయ్యాక లోక్‌సభ మొదటి సమావేశానికి తేదీని(అపాయింటెడ్ డే) రాష్ట్రపతి నోటిఫై చేయాలి. ఆ రోజు నుంచే లోక్‌సభ గడువు మొదలవుతుంది. → అపాయింటెడ్ డే ప్రకారమే రాష్ట్రాల అసెంబ్లీలు కొలువుదీరుతాయి. ఆ రోజు నుంచి వాటి గడువు ప్రారంభమవుతుంది. లోక్‌సభ గడువుతోపాటే అసెంబ్లీల గడువు కొనసాగుతుంది. గడువు ముగిసిన తర్వాత మళ్లీ జమిలి ఎన్నికలు చేపట్టాలి. → లోక్‌సభలో హంగ్ లేదా అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కొత్త లోక్‌సభను ఎన్నుకోవాలి. → ఈ కొత్త సభ పూర్తి ఐదేళ్లు మనుగడలో ఉండదు. దీని కంటే ముందున్న సభ కాలపరిమితి ముగిసే తేదీ వరకే కొత్త సభ గడువు కొనసాగుతుంది. అంటే పాత సభ గడువే కొత్త సభకు సైతం వర్తిస్తుంది. → రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కొత్తగా కొలువుదీరిన శాసనసభ కాలపరిమితి ఆ సమయంలో ఉన్న లోక్‌సభ గడువు ముగిసే వరకే కొనసాగుతుంది. అనంతరం లోక్‌సభతోపాటే ఆ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. → జమిలి ఎన్నికలకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదింపులు జరిపి ఒకే ఓటర్ల జాబితా రూపొందించాలి. → వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. తగిన సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు సమకూర్చుకోవాలి. ఎప్పుడు జరగొచ్చు? ప్రస్తుత 18వ లోక్‌సభ గడువు 2029 దాకా ఉంది. 2029 కంటే ముందు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో శాసనసభల గడువు ముగియనుంది. 2027లో గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే సమయంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి మోదీ సర్కారు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. → 2025లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఢిల్లీ, బిహార్ → 2026లో.. అస్సాం, పశి్చమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ → 2027లో.. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ → 2028లో.. త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ → 2029లో.. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూకశీ్మర్, హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రఇదీ చదవండి: శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..ప్రజాధనం ఆదా: బీజేపీఒకే దేశం.. ఒకే ఎన్నికను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రతిఏటా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడంతో అభివృద్ధికి విఘాతం కలుగుతోందని ఆయన చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి పనులు ఆపేయాల్సి వస్తోందని, ఇది మంచి పరిణామం కాదని అంటున్నారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ముగించేస్తే పరిపాలనపై దృష్టి పెట్టడానికి, అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఎలాంటి అవరోధాలు ఉండవని అభిప్రాయపడుతున్నారు. జమిలి ప్రతిపాదనను మోదీ 2016 డిసెంబర్లో తొలిసారిగా తెరపైకి తెచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. బీజేపీ మిత్రపక్షాలు జమిలికి మద్దతు ఇస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలతో ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుందని, ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ వర్గాలు వాదిస్తున్నాయి.జనం దృష్టిని మళ్లించడానికే జమిలి జపం: కాంగ్రెస్ జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యతిరేకించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ఎన్నికల సమగ్రతపై తలెత్తుతున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోదీ సర్కారు జమిలి జపం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు జేపీసీ పరిశీలనకు పంపించాలని కోరుతామని అన్నారు. జమిలి ఎన్నికలు దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పష్టంచేశారు. కనీసం మూడు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించలేని ప్రభుత్వం జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించగలదని ప్రశ్నించారు. జమిలి బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్, పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు తప్పుపట్టారు. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, సమాఖ్య వ్యతిరేకమని తేలి్చచెప్పారు. క్రూరమైన ఈ బిల్లును పార్లమెంట్లో కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. ఏయే ఆరి్టకల్స్ సవరించాలి? దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనితోపాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు ప్రధానంగా కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం. → లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83కు సవరణ → రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)కు సవరణ → అత్యయిక పరిస్థితుల సమయంలో సభకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆరి్టకల్ 83(2)కు సవరణ → రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆరి్టకల్ 85(2)(బి)కు సవరణ. → రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు దఖలు పరిచే ఆరి్టకల్ 174(2)(బి)కు సవరణ → రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కలి్పంచే ఆర్టికల్ 356కి సవరణ → ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324కి సవరణ నేపథ్యం పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం మన దేశంలో కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు చేపట్టాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడం, మరికొన్నింటిని తగ్గించడం చేయాలి. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఏయే దేశాల్లో జమిలి? జమిలి ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అమల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా దేశాల్లో ఎన్నికల తీరును రామ్‌నాథ్ కోవింద్ కమిటీ అధ్యయనం చేసింది. జమిలితో మంచి ఫలితాలు వస్తున్నట్లు గుర్తించింది. -
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం కసరత్తు
-
శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని.. అందుకోసం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ను తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశం ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ శీతాకాల సమావేశాల్లోనే గనుక చర్చకు వస్తే.. అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది? జమిలి ఎన్నికల బిల్లును ఆమోదింపజేసుకోగలిగే ‘బలం’ ఎన్డీయేకు ఉందా?..రాబోయే సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు.ముందుగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దానిని రిఫర్ చేసే అవకాశం ఉండొచ్చు. అవసరం అనుకుంటే జేపీసీ.. వివిధ పార్టీలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొచ్చు.మెజారిటీ ఎంత ఉండాలంటే.. ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం కోసం రూపొందించిన బిల్లు.. రాజ్యాంగ సవరణలతో ముడిపడిన అంశం. కాబట్టి.. ఉభయ సభల్లోనూ మూడింట రెండో వంతు మెజారిటీ కచ్చితంగా అవసరం.👉రాజ్యసభలో 245 మంది సభ్యులంటే.. కనీసం 164 ఓట్లు పడాలి👉అలాగే.. లోక్‌సభలో 545 మంది సభ్యులుంటే.. 364 ఓట్లు రావాలి.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే నడుస్తోంది. కాబట్టి.. ఓటింగ్ సమయానికల్లా మూడింట రెండో వంతు మెజారిటీ మద్దతు సంపాదించుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జై కొట్టిన సంగతి తెలిసిందే. అంటే 13 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపకల్పన చేసే పని.. కేంద్ర న్యాయ శాఖ చూసుకుంటోంది. ఇక ఈ బిల్లు బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అది కుదరకుంటే.. వచ్చే బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశానికి ముందైనా రావొచ్చు. సంబంధిత ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం గనుక పొందితే.. పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు రానుంది.ప్రస్తుత లోక్‌సభ గడువు 2029 దాకా ఉంది. కానీ, ఈ మధ్యలోనే దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.వచ్చే ఏడాది అంటే 2025లో.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2026లో..అసోం(పూర్వపు అస్సాం)పశ్చిమ బెంగాల్పుదుచ్చేరితమిళనాడుకేరళ2027లో..గోవాఉత్తరాఖండ్పంజాబ్మణిపూర్ఉత్తర ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్గుజరాత్ఈ స్టేట్స్ ఎన్నికల టైంలోనే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తోంది. 2028లో..త్రిపురమేఘాలయానాగాలాండ్కర్ణాటకమిజోరాంఛత్తీస్గఢ్మధ్యప్రదేశ్రాజస్థాన్తెలంగాణ2029లో..అరుణాచల్ ప్రదేశ్సిక్కింఆంధ్రప్రదేశ్ఒడిషాజమ్ము కశ్మీర్హర్యానాజార్ఖండ్మహారాష్ట్రకోవింద్ కమిటీ సిఫార్సులుజమిలి ఎన్నికల కోసం.. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు చర్చలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. కోవింద్ నివేదిక ఆధారంగా.. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఓకే చేసి .. ఆపై బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం కల్పించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.ఇప్పుడు కాకుంటే..జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ఈ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో వీలు కాని పక్షంలో వచ్చే సమావేశాల్లో అయినా.. దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. -
జమిలి ఎన్నికలపై విజయ్ పార్టీ కీలక నిర్ణయం
చెన్నై: సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట రాజకీయం హీటెక్కింది. తాజాగా టీవీకే పార్టీ అధినేత విజయ్.. స్టాలిన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ మేరకు టీవీకే(తమిళిగా వెట్రి కగజం) పార్టీ తీర్మానం కూడా చేయడం విశేషం.దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ.. జమిలి ఎన్నికలు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు చెన్నైలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ ఎజెండాను ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న విషయంపై చర్చించారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే, నీట్ పరీక్షపై కూడా తాజాగా తీర్మానం చేశారు.ఇదే సమయంలో తమిళనాడులోకి స్టాలిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు విజయ్. రాష్ట్రంలో అబద్దపు హామీలు ఇచ్చి స్టాలిన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కులగణన ప్రక్రియ జాప్యంపై అధికార డీఎంకే వైఖరిని తప్పుబట్టారు. ఇక, తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతమే అమలులో ఉండాలని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హిందీ అమలుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హిందీకి రాష్ట్రంలో చోటులేదని స్పష్టం చేశారు. కేంద్రం పెత్తనం లేకుండా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా టీవీకే పార్టీ పోటీపై క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలకే తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. -
వన్ నేషన్-వన్ ఎలక్షన్ అసాధ్యం: ఖర్గే
ఢిల్లీ: దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ అమలు చేయటం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ను అతిత్వరలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.‘‘పార్లమెంట్ ఏకాభిప్రాయం అవసరం కాబట్టి వన్ నేషన్- వన్ ఎలక్షన్ అమలు చేయటం అసాధ్యం. ముఖ్యంగా ప్రధాని మోదీ ఏమి చెప్పారో.. దానిని ఆయన చేయరు. ఎందుకంటే వన్ నేషన్-వన్ ఎలక్షన్ పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు.. అందరి ఆమోదం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అమలులోకి వస్తుంది. ఒకే దేశం ఒక ఎన్నిక అమలలోకి రావటం అసాధ్యం’ అని తెలిపారు.VIDEO | "What PM Modi tells, he won't do because unless this Bill comes in Parliament, he has to take everybody into confidence, then only it will happen. One Nation One Election is impossible..." says Congress president Mallikarjun Kharge (@kharge) on 'One Nation One Election'.… pic.twitter.com/8MdAFRhXGO— Press Trust of India (@PTI_News) October 31, 2024ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి మోదీ నివాళులర్పించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘‘ మేం ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. అదేవిధంగా త్వరలో భారత్‌లో వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో పాటు కామన్ సివిల్ కోడ్ అమలు కానుంది’’ అని అన్నారు.ఇప్పటికే.. ప్రతిపక్షాలు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అసాధ్యమైన ఆలోచన, ఫెడరలిజం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో రూపొందించిన 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అహ్మాదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. జాతీయ ఐక్యతా దినోత్సవంతోపాటు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.‘‘దీపావళి పండగ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం వైట్‌హౌస్‌లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళిని జరుపుకున్నారు. అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’ త్వరలో సాకారమవుతుంది. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్వహించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు త్వరలో లైన్ క్లియర్ అవుతుంది. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన సమర్పించనున్నాం.#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv— ANI (@ANI) October 31, 2024 మేం ప్రస్తుతం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశ వనరుల సరైన ఫలితాన్ని ఇస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సాయపడుతుంది. భారతదేశం.. నేషన్ వన్ సివిల్ కోడ్, సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేవంగా అవతరించనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. దానిని శాశ్వతంగా పాతిపెట్టాం. రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారు’’ అని అన్నారు. -
అధికార కేంద్రీకరణకు మార్గంగా.. జమిలి ఎన్నికలు
‘ఒకే దేశం – ఒకే సంస్కృతి – ఒకే పన్ను’ అంటూ నిరంతరం ప్రచారం చేసే అధికార బీజేపీ ఇప్పుడు ‘జమిలి ఎన్నికల’కు సన్నద్ధమవు తోంది. కేంద్ర మంత్రి వర్గం ఇటీవల జమిలి ఎన్నికలకు ఆమోదాన్ని తెలిపింది. దేశంలో సవివరమైన చర్చ జరగకుండానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలను పూర్తిగా సమర్థించేవారే కమిటీలో ఉన్నప్పుడు అది నిపుణుల కమిటీ ఎలా అవుతుంది? జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యంకాదనీ, ఇది అధికార కేంద్రీ కరణకు మార్గాన్ని సుగమం చేయడమేననీ, మన దేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మౌలిక సూత్రా లపైన దాడి చేయడమేననీ ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.దేశంలో తరచూ ఏదో ఒక ఎన్నిక జరుగు తున్నందు వల్ల అభివృద్ధికి ఆటంకమేర్పడుతుందనేది ఒక అభిప్రాయం. ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందనీ, దీనికి మన జీడీపీ గణాంకాలే రుజువనీ ప్రభుత్వ పెద్దలు చెబు తున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజంగా సరైనవనుకుంటే అభివృద్ధికి తరుచూ జరిగే ఎన్నికలు ఎలా ఆటంకమవుతాయి? దేశం ముందున్న మౌలిక సవాళ్ళ నుండి జనం దృష్టిని ప్రక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తున్నారనేది ఒక విమర్శ. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనేది సమర్థకుల మరో వాదన. ఈ వాదనను సరిగ్గా విశ్లేషిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2023–24 సంవత్సరానికి ఎన్నికల కోసం కేంద్రం కేటాయించింది కేవలం రూ. 466 కోట్లు మాత్రమే. పైగా అది ఎన్నికల సంవత్సరం కాబట్టి. అదే 2022–23 సంవత్సరానికి కేటాయించినది రూ. 320 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు కూడా ఎన్నికల ఖర్చును భరిస్తాయి. లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్న కేంద్రానికి ఈ ఎన్నికల ఖర్చు నిజంగా పట్టించుకోవలసినది కాదు. నిజానికి జమిలి ఎన్నికలు జరిపితేనే ఖర్చు పెరుగుతుంది. ఈ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో ఈవీఎమ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని, రక్షణసిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి.ఎన్నికలు తరచూ జరగడం వల్ల ఇప్పటి వరకూ విధానపర నిర్ణయాలు చేయడంలో ఏనాడూ ఆటంకమేర్పడలేదు. ప్రజల ప్రయోజనాలకు, వారి స్వేచ్ఛకు జమిలి ఎన్నికలు విఘాతమే. ప్రభుత్వాల దూకుడుకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కళ్ళెం వేసేది ప్రజలు మాత్రమే. జమిలి ఎన్నికల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధి వెంటనే మరణిస్తే ఏం చేస్తారు? అధికార పార్టీ మధ్యలో మెజారిటీ కోల్పోయి ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయమేమిటి? అటువంటి ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యయుతం అవుతుందా?చదవండి: ‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?అందుకే జమిలి ఎన్నికలకు బదులు, ఎన్నికల సంస్కరణలను తక్షణమే చేపట్టి దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టాలి. పార్టీల మ్యానిఫెస్టోలను, వారి విధానాలను సమగ్రంగా విశ్లేషించుకుని రాజకీయ పార్టీలకు ప్రజలు ఓటు వేయడం న్యాయసమ్మతమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రస్తుత పద్ధతిలో రాజకీయ పార్టీలకు లభించిన ఓట్ల శాతం, ఆయా పార్టీలు గెలిచిన సీట్లకు ఉన్న తేడా అసంబద్ధంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రక్రియను అమలు చేసే ఆలోచనను విరమించి ప్రజాస్వామ్య పటిష్ఠతకు, పరిరక్షణకు అవసరమైన అన్ని మార్పులను మన రాజకీయ వ్యవస్థ చేపట్టాలి. అధికార బీజేపీ దీనికి ముందుగా చొరవ చూపాలి.- వి.వి.కె. సురేష్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి -
జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోండి: కేరళ తీర్మానం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించటంపై ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొన్నారు.Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.— ANI (@ANI) October 10, 2024కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం. -
సమాఖ్యకు ‘జమిలి’ సవాళ్లు!
జమిలి ఎన్నికల వల్ల దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఎంతవరకు ఉపయుక్తం అనే దానిపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ నుంచి అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు అనుకూలంగా ఎన్ని వాదనలున్నాయో, వ్యతిరేకంగా అన్ని వాదనలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికల ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. కానీ అలా పొదుపు చేసే మొత్తం భారత్ లాంటి పెద్ద దేశానికి ఒక లెక్కలోకే వస్తుందా? అలాంటి ఎన్నికల వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించదా? బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు.నాకు తెలిసిన చాలామంది లాగే మీరు కూడా ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ను అర్థం చేసుకోవటానికి తన్నుకులాడుతుంటే కనుక మీకు సహాయం చేయటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే భావనను ప్రతిపాదించినవారు, దానిని వ్యతిరేకిస్తున్నవారు తమ అనుకూల, ప్రతికూల వాదనలతో మనల్ని ముంచెత్తారు. కానీ లాభ నష్టాల నడుమ దీనిపై మనమెలా ఒక తీర్పుకు రాగలం? ఈ వాదోపవాదాలన్నీ సముచితమైనవేనా? లేదా కొన్ని మాత్రమే మిగతా వాటి కంటే ప్రాముఖ్యమైనవా? ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ఈ భావనకు మద్దతు లభించటానికి గల కారణాలతో విషయాన్ని ప్రారంభిద్దాం. మొదటిది – డబ్బు ఖర్చు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికలకు అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే అలా పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ. 5000 కోట్ల కన్నా తక్కువేనన్నది శశి థరూర్, ప్రవీణ్ చక్రవర్తిల వాదన. ఇండియా వంటి భారీ ఆర్థిక వ్యవస్థకు ఇదేమంత తేడా చూపే మొత్తం అవుతుందని?రెండవ కారణం – ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే వర్తింపులో ఉంటాయి కనుక రాజకీయ నాయకులు తమను తాము పాలనా వ్యవహారాలలో నిమగ్నం చేసు కోవచ్చు. అయితే ప్రవర్తనా నియమావళి అన్నది జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అమలులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అదొక పెద్ద విషయమే అవదు. మళ్లీ ప్రశ్న, ఇదేమంత ముఖ్యమైన కారణం అవుతుందని?నిజమేమిటంటే, పై రెండూ కూడా చెప్పుకోదగిన కారణాలు కావు. ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణ... ఎన్నికలు. వాటి నిర్వహణకు అయ్యే వ్యయాన్ని బట్టి, లేదా అవి సజావుగా జరిగేందుకు అవసరమైన నియమావళిని బట్టి ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని లాభనష్టాలను చర్చించకూడదు. ఇప్పుడు మనం వ్యతిరేక వాదనల్లోకి వద్దాం. మొదటిది – ఇది మన దేశ విలక్షణతకు విరుద్ధం అవుతుందా? మనది ఒకే దేశం–ఒకే మతం కాదు. ఒకే దేశం–ఒకే భాష కాదు. ఒకే దేశం–ఒకే సంస్కృతి కాదు. ఒకే దేశం–ఒకే విధమైన మరేదీ కాదు. మన వ్యత్యాసాలనే మన సంపదలుగా మలుచుకున్న రాష్ట్రాల సమాఖ్య మన దేశం. ఆ వ్యత్యాసాలు, సంపదలే మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాయి. మనకు ప్రాముఖ్యం కల్పిస్తాయి. మరి ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ప్రత్యేకతలు, ప్రాముఖ్యాల నుంచి మన దేశాన్ని దూరం చేయదా? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. రెండవది – ఒకే దేశం–ఒకే ఎన్నిక వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే ప్రమాదంఉంటుందా? అలా జరిగితే – జరుగుతుందనే నా అనుమానం – అది దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఏకీకృత వ్యవస్థగా మార్చే ధోరణి కలిగి ఉండదా? వెంటనే కాకపోయినా, కాలక్రమేణా అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల చిన్న రాష్ట్రాల ప్రాంతీయ ఆందోళనలు కేంద్రస్థాయి జాతీయ డిమాండ్లలో కొట్టుకుని పోతాయి. గోవా, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల నిరసన గళాలు ఢిల్లీ రణగొణ ధ్వనుల్లో తేలిపోతాయి. మూడవది – పార్లమెంటరీ ఎన్నికలు క్రమంగా అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారినప్పుడు ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ధోరణిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం లేదా? అదే జరిగితే, అది మన బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇది అర్థవంతమైన భయమే అయితే దీనిని తేలిగ్గా తీసుకోవలసిన అవసరం లేదు. ఇదంతా కూడా మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘనకు గురి చేయగలిగినదే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని పర్యవసానాలపై ఆధారపడి ఉంది. అయితే మరొక విషయం కూడా ఉంది. మనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, వేళ్లూను కునేలా చేసుకోవలసిన అవసరం అది. నిజానికి 50 ఏళ్ల క్రితమే అటల్ బిహారి వాజ్‌పేయి ‘రైట్ టు రీకాల్’ (పదవుల్లో ఉన్నవారిని తొలగించే హక్కు)ను కోరు కున్నారు. దానికి పూర్తి భిన్నమైనది ఈ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’. ఓటు వేసే అవకాశాన్ని పరిమితం చేయటం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇది కురచబారుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే, వెళ్లవలసిన మార్గాన్ని వెనక్కి తిప్పుతుంది.ఇంకొక సమస్య ఉంది. వాస్తవంలో ఎదురుకాగల సమస్య అది. ఒకవేళ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి కంటే ముందు గానే తన మెజారిటీని కోల్పోతే ఏం జరుగుతుంది? మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచిస్తోంది. కానీ అది ఐదేళ్ల కాలానికి ఓటరు ఇచ్చిన తీర్పును పలుచబార్చదా? కొన్నిసార్లు వాళ్లు ఐదేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు. మరికొన్ని సార్లు ఒకటీ లేదా రెండేళ్ల ప్రభుత్వానికి ఓటేస్తారు. ఈ విధంగా మనం ఓటు విలువను యథేచ్ఛగా తగ్గించటం లేదా?ఉప ఎన్నిక అవసరమైన ప్రతిసారీ నిస్సందేహంగా ఇలాగే జరుగుతుంది కానీ... వ్యక్తికి ఓటేయటానికి, మొత్తం అసెంబ్లీకో, పార్లమెంటుకో ఓటేయటానికి తేడా లేదా? ఆలోచించదగిన ప్రశ్నే ఇది. నిజానికి, మధ్యంతర ఎన్నికలకు కారణమయ్యేవి ఏవీ లేకుండా పోవు. ఇంకా అనేక కారణాల వల్ల కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఈ విధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు వీలుగా తక్కువ కాల పరిమితిని కలిగి ఉంటాయి. ఈ కోణంలోంచి చూస్తే ‘ఒకే దేశం–ఒకే’ ఎన్నిక వల్ల ఏం తేడా కనిపిస్తున్నట్లు? చెప్పాలంటే మనం మరిన్ని ఎన్నికలకు వెళ్లటం అవుతుంది తప్ప, తక్కువ ఎన్నికలకేం కాదు. కనుక, అంతిమంగా నేను చెబుతున్నదేమిటి? అది మీతో చెప్ప టానికి సంకోచిస్తున్నాను. ఏమైనా, నా అభ్యంతరాలన్నీ ఇక్కడ స్పష్టంగానే వ్యక్తం అయ్యాయి. మీరు నా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే కనుక అందుకు చాలినంతగానే రాసేశాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
జమిలి ఎన్నికలు సాధ్యమేనా..? లాభమా..? నష్టమా..?
-
జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి లేకపోవడం తీరని లోటు. ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటాం.. పోరాడతాం అని అన్నారాయన. జమిలి ఎన్నికలతో అధికారం కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ మార్పులు, సవరణల విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. దేశ ఐక్యతను బీజేపీ దెబ్బ తీయాలని చూస్తోంది. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలి’’ అని రేవంత్ పిలుపుచ్చారు. ‘‘దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి సీతారాం ఏచూరి కృషి చేశారు. పేదల కోసం పాటు పడ్డారు. జీవితకాలం నమ్మిన సిద్దాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు అరుదు. రాహుల్‌గాంధీతో సీతారాం ఏచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దశబ్దాలపాటు పేదల సమస్యలపై సీతారాం ఏచూరి కృషి చేశారు’’ అని రేవంత్ గుర్తు చేశారు. అంతకు ముందు.. సీతారాం ఏచూరి చిత్రపటానికి కేటీఆర్, తమ్మినేని నివాళులర్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసి సీతారాం ఏచూరి చిరస్థాయిగా నిలిచారు. ప్రస్తుతం నేతలు పదవుల చుట్టూ పరిభ్రమిస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు సీతారాం ఏచూరి నిలబడ్డారు అన్నారు. రేవంత్ రాకముందే కేటీఆర్ ఎగ్జిట్ఒకేవేదికపై రేవంత్, కేటీఆర్ ఉంటారని తొలుత చర్చ నడిచింది. అయితే సభ ప్రారంభ సమయంలోనే కేటీఆర్ మాట్లాడి వెళ్లిపోయారు. కేటీఆర్ వెళ్లిపోయాకే సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అంతకు ముందు.. కోదండరాం పక్కనే కూర్చున్న కేటీఆర్ మాట కూడా మాట్లడలేదు. కేటీఆర్ తన ప్రసంగం ముగిశాక.. అప్పుడు కోదండరాం పలకరించారు. -
ఒకే ఎన్నిక... అనేక కోణాలు!
కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో రథం కదిలింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా. దేశంలో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రతిపాదనపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నందున తాజా పరిణామాలతో మరోమారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పైగా ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం.నిజానికి, ఏకకాలంలో ఎన్నికలనేవి కొత్త ఏమీ కావు. గతంలో ప్రత్యేకంగా నియమం, చట్టం లాంటివేమీ లేకున్నా, 1951 – 52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ నాటి నుంచి మన దేశంలో లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కలిసే జరుగుతుండేవి. అయితే, కాలవ్యవధి పూర్తి కాకుండానే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవడం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు 1967 తర్వాత నుంచి కథ మారింది. ఏకకాల ఎన్నికల క్యాలెండర్ మారిపోయింది. పదేళ్ళ క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చే ముందే బీజేపీ తన మేనిఫెస్టోలో ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ను లక్ష్యంగా పేర్కొంది. అంతకు ముందు సన్నాయినొక్కులు నొక్కినా, బీజేపీ గద్దెనెక్కాక సహజంగానే భారత ఎన్నికల సంఘం ఈ ఆలోచనను సమర్థించింది. అలాగే, లా కమిషన్లు సైతం 1999లో, 2018లో ఈ ఏకకాలపు ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలన్నాయి. 2015 నాటి పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు పలు పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతు నివ్వగా, కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. భిన్నాభిప్రాయాలున్న దీనిపై ఏకాభిప్రాయ సాధన అవసరమని మొదట్లో చెబుతూ వచ్చిన మోదీ సర్కార్, ఆ సంగతి పక్కనపెట్టి ఇటీవల తన అజెండాను ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. కోవింద్ కమిటీ వేయడం, ఆ కమిటీ ఈ ఏడాది మార్చిలో నివేదిక సమర్పించడం చకచకా జరిగాయి. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు – ఇలా రెండు దశలుగా 2029 నుంచి ‘ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అమలు చేయవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పుడు కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంట్లో చట్టం చేయడానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఆ యా రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చు వేరు. ఈ ప్రభుత్వ అధికారిక ఖర్చు కాక, వివిధ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు అనేక రెట్లు. ఏక కాలపు ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయనీ, తరచూ ఎన్నికలతో పాలన కుంటుపడుతున్నందున దాన్ని నివారించవచ్చనీ, ఒకేసారి ఎన్నికలతో ఓటింగ్ శాతం హెచ్చవుతుందనీ సమర్థకుల వాదన. అయితే, ఏకకాలపు ఎన్నికల కోసం పలు రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఒకేసారి ఎన్నికలు పెట్టినా... ఒకవేళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే, కేవలం మిగిలిన కాలవ్యవధికే ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్ను కోవాలట. ఇలాంటి ప్రతిపాదనలు వట్టి అర్థరహితం. పైగా, ఇది మరింత ఖర్చుకు దారి తీయడమే కాక, అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. అలాగే ఏకకాలపు ఎన్నికల వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకుపోయి, జాతీయ అంశాలదే పైచేయి అవుతుందనీ, చివరకు స్థానిక, చిన్నపార్టీలు కనుమరుగై పోతాయనీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల ఏకకాలంలో హర్యానా, జమ్మూ– కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు చేయలేమని చేతులె త్తేసిన ఎన్నికల సంఘం రేపు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలుగుతుంది? కొన్ని కోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యమా? దానికయ్యే ఖర్చుతో పోలిస్తే, ‘ఒకే ఎన్నిక’ వల్ల ఆదా అయ్యేది ఏపాటి? అసలింతకీ కేంద్రంలోని కమలనాథులు ఇప్పుడీ పనిని ఎందుకు భుజాన వేసుకున్నట్టు? అధికార పక్షం సొంత మెజారిటీ ఉన్నప్పుడు ఇట్టే చేయగల పనిని మిత్రపక్షాలపై ఆధారపడిన ప్రభుత్వ హయాంలో తలకెత్తుకున్నదేమిటి? 2015 నాటి ఓ సర్వే ప్రకారం... ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77 శాతం ఓటర్లు రెండింటా ఒకే పార్టీకి ఓటు వేస్తారట. అదే గనక ఆరు నెలల విరామం తర్వాత జరిగితే 61 శాతం మందే ఒకే పార్టీకి ఓటు వేస్తారట. దేశమంతటా ‘డబుల్ ఇంజన్ సర్కార్’కై తహతహలాడుతున్న బీజేపీ ఓటర్ల తాలూకు ఈ ఏకకాలపు ఎన్నికల మనస్తత్వం కలిసొస్తుందని భావిస్తూ ఉండవచ్చు. కానీ, వైవిధ్యానికి నెలవైన సమాఖ్య వ్యవస్థలో కృత్రిమంగా ఏకకేంద్రక స్వభావాన్ని జొప్పించడమే ఇదంతా అని విమర్శ. ఎవరి రాజకీయ, సైద్ధాంతిక వైఖరులు ఏమైనా అనేక అంశాలపై ప్రభావం చూపే ఈ ప్రతిపాదనకు తొందరపడితే సరిపోదు. కాగితంపై అందంగా కనిపించే ఆలోచనకు సైతం ఆచరణలో ఉండే ఇబ్బందులను గమనించాలి. వ్యతిరేకుల వాదన వినాలి. సహేతుకమైన వారి సందేహాల్ని తీర్చాలి. లేదంటే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. -
ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్రం పచ్చ జెండా
-
18 సవరణలు చేయాలి
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటే 18 రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరమవుతాయి. కమిటీ ఈ విషయాన్ని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో సంప్రదించి భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. దానికోసం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 325ని సవరించాల్సి ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ‘ఆరి్టకల్ 324ఏ’కు సవరణ అవసరం. ఈ రెండు అంశాలు రాష్ట్రాల పరిధిలోకి వచ్చేవి కాబట్టి రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఆర్టికల్ 368(2) ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాలు సమ్మతి తెలపాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ తెలిపింది. -
జమిలి ఇలా రెండు దశలుగా అమలు
కోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమరి్పంచింది. ’ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ఏం చెప్పిందంటే... → జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి. → తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. → అనంతరం 100 రోజుల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపేలా వ్యవస్థలను రూపొందించాలి. → సార్వత్రిక ఎన్నికలు జరిగి, కొత్తగా కొలువుదీరే లోక్‌సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని ‘అపాయింటెడ్ డే’గా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది. → అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువూ లోక్‌సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్‌సభ, అన్నీ అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. → లోక్‌సభలో ఏ పారీ్టకీ మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి, లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్లీ ఎన్నికలు జరపాలి. → అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు.. రద్దయిన సభలో మిగిలిన కాలావధి వరకు మాత్రమే ఉంటుంది. → అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు ఐదేళ్లు కొనసాగకుండా లోక్‌సభతో పాటే రద్దవుతాయి. → అన్ని ఎన్నికలకూ ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉపయోగించాలి. ఆమోదం ఈజీ కాదు జమిలి ఎన్నికలకు పార్లమెంటు ఆమోదముద్ర పొందడం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు అంతా ఈజీ కాబోదు. నవంబర్ గేమ్ అధికార కూటమికి అంత అనుకూలంగా లేదు. జమిలికి సంబంధించి కోవింద్ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్‌సభలో 362 మంది; 245 మంది ఎంపీలుండే రాజ్యసభలో 164 మంది మద్దతు అవసరం. కానీ ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలే అన్నారు. అయితే కోవింద్ కమిటీ ముందు జమిలిని సమరి్థంచిన పారీ్టలకున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పారీ్టలకు 205 మంది లోక్‌సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
One Nation One Election: ఆచరణ సాధ్యమేనా?
జమిలి. ప్రస్తుతం దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న పదం. అయితే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగైదు అసెంబ్లీలకు మాత్రమే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా అసెంబ్లీలకు విడిగా, వేర్వేరుగానే ఎన్నికలొస్తున్నాయి. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు పలు అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం, కొన్నింటిని పొడిగించడమో, లేదంటే గడువు తీరాక సుప్త చేతనావస్థలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనన్న అభిప్రాయముంది. లేదంటే లోక్‌సభ కొత్తగా తొలిసారి కొలువుదీరిన తేదీని ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆ తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీల అన్నింటి గడువూ.. వాటి ఐదేళ్ల కాలపరిమితితో సంబంధం లేకుండా.. లోక్‌సభతో పాటే ముగిసే ప్రతిపాదనను అమలు చేయాలి. ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందని, ఇక అప్పటి నుంచి జమిలి ఎన్నికలే ఉంటాయని కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందులో ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులున్నాయన్నది నిపుణుల మాట. అంతేగాక అసలు ఈ ప్రతిపాదన రాష్ట్రాల అధికారాల్లో అవాంఛిత జోక్యమే తప్ప మరోటి కాదని పలు పార్టీలు వాదిస్తున్నాయి. పైగా లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయాంశాలే తెరపైకి వస్తాయని, రాష్ట్రాల్లోని స్థానికాంశాలు పక్కకు పోతాయని ప్రాంతీయ పారీ్టలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా డీఎంకే వంటి పలు పారీ్టలు జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం కూడా చేశాయి. పైగా హంగ్, అవిశ్వాస తీర్మానం నెగ్గడం వంటి ఏ కారణంతో అయినా గడువుకు ముందే చట్టసభ రద్దయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సభ ఐదేళ్లు కాకుండా రద్దయిన సభలో మిగిలిన కాలావధి పాటు మాత్రమే కొనసాగాలని కోవింద్ కమిటీ సూచించింది. అలాగైతే జమిలి ప్రక్రియకు భంగం కలగకుండా ఉంటుందని పేర్కొంది. కానీ దీనిపైనా పలు పారీ్టలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజాతీర్పు కోరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు కొనసాగరాదనడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని వాదిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకం: ఖర్గే ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక మన దేశంలో ఆచరణ సాధ్యం కాదు. ఇలాంటి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్తకొత్త ఎత్తుగడలు వేయడం బీజేపీకి అలవాటే. ప్రజాస్వామ్య విరుద్ధమైన జమిలి ఎన్నికలను దేశ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరు’’ అది సంఘ్ పరివార్ రహస్య అజెండా ‘‘ఒకే దేశం–ఒకే ఎన్నిక అనేది దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఇది సంఘ్ పరివార్ రహస్య అజెండాలో ఒక భాగమే. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థను మార్చేసి అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని తీసుకురావాలన్నదే సంఘ్ పరివార్ అసలు కుట్ర. భారత పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనను మానుకోవాలి’’. – పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి ప్రజలంతా వ్యతిరేకించాలి సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నిర్మాణాన్ని దెబ్బతీసే జమిలి ఎన్నికలను ప్రజలంతా వ్యతిరేకించాలి. ఒకే దేశం–ఒకే ఎన్నిక ద్వారా ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ కుతంత్రాలు సాగిస్తోంది. ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే ఏం చేస్తారు? – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘జమిలి’తో ప్రభుత్వాలు రద్దేనా?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలపై పార్టీ నేతలమంతా కూర్చొని చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బుధవారం(సెప్టెంబర్18) కేటీఆర్ తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలతో సమావేశమై మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట చేసిన మోసంపై పార్టీ బీసీ నేతల సమావేశంలో చర్చించాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసే దాకా కాంగ్రెస్‌ను నిలదీస్తాం. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించాలి.నవంబర్ 10 లోపు పూర్తి చేయని పక్షంలో బీసీల తరఫున ఎలా ముందుకు పోతామో కార్యాచరణ ప్రకటిస్తాం.అవరసరం అయితే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం.బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టారు.బీసీ సబ్ ప్లాన్ పెట్టాలి.25 నుంచి 35 వేల కోట్లు అందులో పెట్టాలి.ఎమ్మెల్సీ మధుసూదనా చారి నేతృత్వంలో తమిళనాడు వెళ్లి బీసీ స్కీమ్‌లపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. కేవలం ఇద్దరు బీసీ మంత్రులు మాత్రమే కేబినెట్లో ఉన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి. బీఆర్ఎస్ బీసీల కోసం కదులుతుంది’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి.. జమిలికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ -
‘జమిలి’కి కేబినెట్ ఆమోదం..ప్రధాని కీలక ట్వీట్
న్యూఢిల్లీ: భారత దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చేదిశగా జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం ఒక ముందడుగు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జమిలి ఎన్నికలకు బుధవారం(సెప్టెంబర్18) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం మోదీ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా రాంనాథ్కోవింద్కు అభినందనలు తెలియజేస్తున్నా. విస్తృత సంప్రదింపులు జరిపి జమిలి ఎన్నికలపై సిఫారసులు చేశారు’అని కోవింద్‌ను ప్రధాని కొనియాడారు. ఇదీ చదవండి.. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ -
అభివృద్ధి కోసమే ‘జమిలి’: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: దేశ అభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం( సెప్టెంబర్18) ఆమోదం తెలిపిన సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘జమిలితో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడుతోంది. దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవు.జమిలి ఎన్నికలు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది.పార్లమెంట్లో జమిలి బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది.ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే పార్లమెంట్లో జరిగే చర్చలో చెప్పొచ్చు’అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి..కేసీఆర్,కేటీఆర్ వదిలిపెట్టినా..నేను వదిలిపెట్టను: బాల్కసుమన్ -
ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై మంగళవారం పత్రికాసమావేశంలో మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి అమిత్ సుదీర్ఘంగా మాట్లాడారు. జనగణన ఎప్పుడో త్వరలో చెప్తాం జనగణన ఎప్పుడు జరపబోయేది త్వరలోనే వెల్లడిస్తామని, ప్రకటన చేశాక సంబంధిత వివరాలను తెలియజేస్తామని అమిత్ చెప్పా రు. జనగణన, కులగణన తక్షణం జరపాలంటూ విపక్షాల నుంచి విపరీతమైన డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో అమిత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రైతుల కోసం రూ.15 లక్షల కోట్ల పథకాలు ‘‘రైతాంగం బాగు కోసం సాగురంగంలో 14 విభాగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన పథకాలను ఈ 100 రోజుల్లో అమల్లోకి తెచ్చాం. వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు మౌలిక సాగు నిధి ఏర్పాటుచేశాం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి నిర్ణయం రైతుల కోసమే తీసుకున్నారు. మెరుగైన మౌలిక వసతులకు రూ.3 లక్షల కోట్లు కేటాయించాం.25వేలకు పైగా కుగ్రామాలకు రోడ్ల అనుసంధానం పెంచుతున్నాం. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించాం. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడ్డాం. ఆస్తుల దురి్వనియోగాన్నీ వక్ఫ్ (సవరణ) బిల్లు అడ్డుకుంటుంది. గత నెలలో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుంది’’ అని షా అన్నారు. -
ప్రస్తుతం జమిలి ఎన్నికలు అసాధ్యం: చిదంబరం కీలక వ్యాఖ్యలు
న్యూడిల్లీ: ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ సాధ్యం కాదని, అందుకోసం కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని తెలిపారు.సోమవారం ఆయన చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగం సవరణలు చేయాలని వాటిని లోక్ సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు మోదీకి మెజారిటీ సంఖ్య లేదని అన్నారు. ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే రాజ్యాంగపరమైన అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని నొక్కి చెప్పారు. జమిలీ ఎన్నికలు అసాధ్యమని, ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.అయితే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందంటూ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మాటలకు ఖండించారు. తాము ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాము. వాటిని ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటామని అన్నారు. తాము కేవలం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని మాత్రమే చెబుతున్నామని తెలిపారు. కుల గణన కోరేది మేమే.. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నాం.. ప్రధాని చెప్పేవన్నీ నమ్మొద్దు’ అని వెల్లడించారు.ఇదిలా ఉండగా గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలపై గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
ఈ టర్మ్‌లోనే ‘ఒకే దేశం- ఒకే ఎన్నికల విధానం’
ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానంపై గత కొంత కాలంగా దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ఈ విధానం తప్పకుండా అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇదే విషయాన్ని నొక్కిచెప్పినట్ల సంబంధిత అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక.. ఇప్పటికే ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం అమలు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ ప్యానెల్ మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. వాటీ తర్వాత సుమారు వంద రోజుల వ్యవధితో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ఈ కమిటీ తర్వలోనే లా కమిషన్‌కు కూడా సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఏకకాలంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను 2029లో నిర్వహించాలని ఇటువంటి పరిస్థితిలో ఒకవేళ హంగ్ ప్రభుత్వం ఏర్పడితే, లేదా అవిశ్వాస తీర్మానం వంటి సందర్భంలో ఏకీకృత ప్రభుత్వం కోసం ఓ ప్రత్యేకమైన నిబంధనను రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ.. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అవసరాన్ని నొక్కి చెప్పారు. దశలవారిగా తరచూ ఎన్నికలు నిర్వహించటం.. దేశ పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఈ అంశాన్ని ఎన్నకల మేనిఫెస్టోలో సైతం పొందుపర్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానాన్ని దానిని అమలు చేయడానికి అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తే.. లోక్‌సభ ఎన్నికలపై నేపథ్యంలో ఓటర్లకు స్థానిక సమస్యలను వివరించడానికి తగిన ప్రాధాన్యత ఉండదని ప్రాంతీయ పార్టీలు పేర్కొంటున్నాయి.చదవండి: దేశ ప్రజాస్వామ్యానికి 2024 కీలక మలుపు -
రెండు దశల్లో 'జమిలి' ఎన్నికలు..
-
రెండు దశల్లో జమిలి ఎన్నికలు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు నివేదిక సమర్పించిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ..ఇంకా ఇతర అప్డేట్స్
-
రెండు దశల్లో ‘జమిలి’ ఎన్నికలు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచింది. రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును నివేదిక అందజేశారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత 100 రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. జమిలి ఎన్నికలతో అభివృద్ధి వేగవంతం అవతుందని, దేశానికి మేలు జరుగుతుందని ఉద్ఘాటించింది. ఈ ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం 18 సవరణలు సూచించింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే.... రామ్‌నాథ్ కోవింద్ కమిటీని 2023 సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 191 రోజులపాటు విస్తృత పరిశోధన సాగించింది. భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బెల్జియం తదితర దేశాల్లో అమల్లో ఉన్న జమిలి ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కోవింద్ కమిటీ సిఫార్సుల చేసిందని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ సిఫార్సుల ప్రకారం రాజ్యాంగానికి కనిష్ట సవరణలతో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. 32 పార్టీల మద్దతు జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోవింద్ కమిటీ సేకరించింది. అభిప్రాయం చెప్పాలంటూ 62 పార్టీలకు సూచించగా, 47 పార్టీలు స్పందించాయి. ఇందులో 32 పార్టీలు జమిలికి జైకొట్టాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మిగిలిన 15 పార్టీలు స్పందించలేదు. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, మిజో నేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్(యూ), శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి వ్యతిరేకించాయి. త్వరలో లా కమిషన్ నివేదిక ఏకకాలంలో ఎన్నికలపై లా కమిషన్ త్వరలో తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. 2029 నుంచి జమిలి ఎన్నికలు ప్రారంభించాని లా కమిషన్ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవింద్ కమిటీ సిఫార్సులు ► లోక్‌సభలో హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త సభను ఏర్పాటు చేయాలి. ► ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరిన లోక్‌సభ ఐదేళ్లు కొనసాగదు. అంతకంటే ముందున్న సభ గడువు ఎన్నాళ్లు మిగిలి ఉంటుందో అప్పటివరకు మాత్రమే కొత్త సభ మనుగడ సాగిస్తుంది. ► రాష్ట్రాల శాసనసభలు లోక్‌సభ కాల వ్యవధి ముగిసేవరకు(ముందుగా రద్దయితే తప్ప) పనిచేస్తాయి. ► జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్ 172(శాసనసభ కాల వ్యవధి)కు సవరణ చేయాలి. ► ఆర్టికల్ 83, ఆర్టికల్ 172కు సవరణ చేయడానికి రాష్ట్రాల అమోదం అవసరం లేదు. ► జమిలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదించి ఒక ఉమ్మడి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325కి సవరణ చేయాల్సి ఉంటుంది. ► స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం ఆర్టికల్ 324ఏను సవరించాలి. ► ఆర్టికల్ 325, ఆర్టికల్ 324ఏకు సవరణ చేయాలంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. జమిలి ఎన్నికలతో ఇలాంటి సమస్యలు పరిష్కరించవచ్చు. ► జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన చట్టబద్ధ యంత్రాంగాన్ని రూపొందించాలి. -
‘ఒక దేశం.. ఒక ఎన్నిక’పై 18,626 పేజీల కోవింద్ నివేదిక
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ (వన్ నేషన్.. వన్ ఎలక్షన్)కు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను ఈ నివేదికలో పొందుపరిచారు. కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2023, సెప్టెంబర్ 2 ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారధ్యంలో 191 రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తిచేశారు. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫారసు చేసింది. ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ నివేదికలోని ముఖ్యాంశాలు కోవింద్ కమిటీ తన నివేదికలో ఏకకాలంలో ఓటు వేయడం దేశప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్రక్రియను, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది. ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ భావించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికను ఈ కమిటీ సిఫారసు చేసింది. తొలిసారిగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది. -
జమిలి ఎన్నికలు: రాష్ట్రపతికి నివేదిక అందించిన కోవింద్ కమిటీ
సాక్షి, ఢిల్లీ: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నేడు నివేదకను అందించింది. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరగాలని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఈ ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కోవింద్ సహా కమిటీ సభ్యులు సమర్పించారు. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/zd6e5TMKng — ANI (@ANI) March 14, 2024 కాగా, దాదాపు 190 రోజుల పాటు జమిలీ ఎన్నికలపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు సమాచారం. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, has met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. The Report comprises of 18,626 pages, and is an outcome of extensive consultations with… — ANI (@ANI) March 14, 2024 ఇదిలా ఉండగా.. ఏకకాల ఎన్నికల జరగాలని కేంద్రంలోని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. -
దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం: ఆప్
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఆప్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మౌలిక స్వరూపం, సమాఖ్య విధానాలను దెబ్బతీస్తుంది. పార్లమెంట్, శాసనసభల్లో హంగ్ ఏర్పడిన సందర్భాల్లో ఈ విధానంలో పరిష్కారం లేదు. పైపెచ్చు పార్టీ ఫిరాయింపులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను బహిరంగంగానే కొనుగోలు చేసేందుకు దారులు చూపుతుంది. జమిలి ఎన్నికల నిర్వహణతో ఆదా అయ్యే ప్రజాధనం కేంద్ర వార్షిక బడ్జెట్లో కేవలం 0.1 శాతం మాత్రమే. సంకుచిత ఆర్థిక లాభాలు, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను త్యాగం చేయజాలం’అని ఆప్ పేర్కొంది. -
‘జమిలి ఎన్నికలు.. అధ్యయన కమిటీని రద్దు చేయండి’
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ రకమైన ఆలోచనే అప్రజాస్వామికమని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల విధానం.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు చాలా వ్యతిరేకమని తెలిపారు. ఆయన శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన జమిలి ఎన్నికల అధ్యయన కమిటికీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని వ్యతిరేకిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న, బలమైన రాజ్యాంగం ఉన్న భారత దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించటం అంత అవసరం లేదన్నారు. దానిని అమలు చేయటం కోసం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ రద్దు చేయాలని కమిటీ కార్యదర్శి నితిన్ చంద్ర రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 18, 2023న ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ.. జమిలి ఎన్నికల విధానంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా కోరిన విషయం తెలిసిందే. అయితే వారు ముందుగానే అమలు చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత ప్రజల వద్ద నుంచి సంప్రదింపులను కోరటం ఎందుకని ప్రశ్నించారు. అధ్యయన కమిటీని సైతం పక్షపాత ధోరణితో ఏర్పాటు చేశారని అన్నారు. కమిటీ ఏర్పాటు విషయంతో ప్రతిక్షాలు, పలు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఎన్నికల ఖర్చును ప్రజలు కూడా అంగీకరించడనికి సిద్ధం ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎన్నికలకు ఖర్చు చేసే డబ్బు.. చాలా తక్కువని ఆయన లేఖలో గుర్తుచేశారు. చదవండి: లాలూ, తేజస్వీలకు మళ్లీ ఈడీ నోటీసులు -
One Nation, One Election: జమిలి ఎన్నికలపై సూచనలివ్వండి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనలివ్వాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ కమిటీ ప్రజలను కోరింది. దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి చట్ట పరమైన పరిపాలనా ఫ్రేమ్‌వర్క్‌లో చేపట్టాల్సిన మార్పులను తెలపాలని పిలుపునిచ్చింది. జనవరి 15వ తేదీలోగా అందిన సూచనలను పరిశీలనకు పరిగణిస్తామని ఒక నోటీసులో తెలిపింది. సూచనలను onoe.gov.in వెబ్సైట్లో పోస్టు చేయాలని సూచించింది. లేదా sc& hlc@gov.in కి మెయిల్ చేయవచ్చని వివరించింది. ఈ నోటీసును ఆరు జాతీయ పార్టీలకు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు పంపినట్లు తెలిపింది. ఇదే అంశంపై లా కమిషన్ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామంది. -
జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక ప్రకటన..
సాక్షి, ఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. దీంతో, 2024లో జమిలి ఎన్నికలు ఉండవని తెలుస్తోంది. ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, 2024లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీటిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక 2024 లోక్‌సభ ఎన్నికలలోగా ప్రచురించే అవకాశం ఉందని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రుతురాజ్ అవస్ధి ఇటీవల వెల్లడించారు. ఏకకాల ఎన్నికలపై కసరత్తు ఇంకా జరుగుతున్నందున నివేదిక పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ఈ నివేదిక ప్రభుత్వానికి సూచిస్తుందని తెలిపారు. ఇక, జమిలి ఎన్నికలపై లోతుగా చర్చించాలని కమిషన్ సూచించింది. గత ఏడాది డిసెంబర్లో 22వ లా కమిషన్ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు కోరేందుకు ఆరు ప్రశ్నలను రూపొందించింది. On One Nation One Election, The Law Commission of India says, "The consultations with regard to the finalisation of the report on One Nation One Election would require some more meetings. We believe that certain Constitutional amendments would make the process of One Nation One… — ANI (@ANI) September 29, 2023 ఇది కూడా చదవండి: ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్ షాక్ -
జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక
ఢిల్లీ: జమిలి ఎన్నికలపై నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నేడు సమావేశం కానుంది. కమిటీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌కు లా కమిషన్ తన సూచనలను అందించనుంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కావాల్సిన సలహాలు, సూచనలను అందించాలని ఉన్నతస్థాయి కమిటీ గత వారం నిర్వహించిన భేటీలో కోరింది. ఈ నేపథ్యంలో లా కమిషన్‌తో పాటు మిగిలిన సభ్యులు నేడు తమ సూచనలను కమిటీకి అందించనున్నారు. అందరి సూచనలను తీసుకున్న తర్వాత ఉన్నతస్థాయి కమిటీ మరోసారి చివరిగా భేటీ నిర్వహించనుంది. సెప్టెంబర్ 2న ఎనిమిది మందితో కూడిన ఉన్నస్థాయి కమిటీని జమిలి ఎన్నికల పరిశీలనకు కేంద్రం నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశమైంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే బీజేపీ జమిలీ ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనే జమిలి విధానం తీసుకువస్తున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఇదీ చదవండి: మన దౌత్యం...కొత్త శిఖరాలకు -
ఈ టైంలో యూరప్ ట్రిప్పు అవసరమా?.. దీదీపై ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరోపా పర్యటనపై లోక్‌సభ ఎంపీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌద్రీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారి నొప్పిని పట్టించుకోకుండా విలాసవంతమైన పర్యటనలకు వెళతారా అని ప్రశ్నించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విధానాలపైనా ప్రధానిపైనా విమర్శలతో చౌదరి విరుచుకుపడ్డారు. అర్ధం చేసుకోలేరా? కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆగస్టు సెప్టెంబర్ వ్యవధిలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మేము ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అయినా కూడా వారు దాన్ని పట్టించుకోలేదని సామాన్యులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజలు బాధను అర్ధం చేసుకునే తీరిక లేదు గానీ స్పెయి పర్యటనకు మాత్రం వీలు కుదురుతుందని ఎద్దేవా చేశారు. విలాసాలకు డబ్బెక్కడిది? ముఖ్యమంత్రి ఐరోపా పర్యటనలో విలాసవంతమైన హోటల్లో బస చేయడంపై స్పందిస్తూ.. ముఖ్యామంత్రి జీతం తీసుకోకుండా కేవలం ఆమె రచనలు, పెయింటింగులు అమ్ముకుని సంపాదిస్తూ ఉంటారు. అలాంటిది రోజుకు రూ. 3 లక్షలు ఖర్చుతో మాడ్రిడ్ హోటల్లో బస చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఈ విలాసవంతమైన ట్రిప్‌లో ఖర్చులు ఎవరు భరించారని ఏ పారిశ్రామికవేత్త మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ ప్రజలను మోసం చేయాలని చూడొద్దని అన్నారు. ఇటీవల బిశ్వ బంగ్లా పారిశ్రామిక సమావేశంలో మీరు ఖర్చు చేసిన దానిలో పది శతం వెచ్చించి ఉంటే లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని అన్నారు. మామూలు రైలే.. ఇక ప్రధాని కొత్తగా ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు బులెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి 'వందేభారత్' పేరుతో డొల్ల ట్రైన్లు తీసుకొస్తున్నారని ఇవి వాటి సహజ వేగంతో కాకుండా సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్నాయని దీని టికెట్టు ధర మాత్రం సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తోందని అన్నారు. యునెస్కో శాంతినికేతన్‌కు వారసత్వగుర్తింపు కల్పించడంపైన కూడా మాట్లాడుతూ శాంతినికేతన్‌కు ఎటువంటి ప్రత్యేక గుర్తింపులు అవసరం లేదని దాని ప్రత్యేకత దానికుందని అలాగే ఒక ప్రాచీన ఆలయం తప్ప ఏమీ లేని ముర్షిదాబాద్ కృతేశ్వరి గ్రామానికి ఉత్తమ్ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించడం సరైనది కాదని చేతనైతే అక్కడి నవాబుల కాలం నాటి నిర్మాణాలను పరిరక్షించాలని అన్నారు. దృష్టి మళ్లించడానికే.. ప్రజా సమస్యలపై స్పందించకుండా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రభుత్వం ఇలాంటి అనేక అంశాలను తెరమీదకు తీసుకొస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి కొత్త కొత్త అంశాలను తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆలోచనా విధానం ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతూ పార్లమెంటును అగౌరవపరిచే విధంగా ఉందని అన్నారు. #WATCH | Murshidabad, West Bengal: West Bengal Congress President Adhir Ranjan Chowdhury says, "PM Modi's government keeps on making excuses before elections... Be on the Women's Reservation Bill or the One Nation, One Election... To do anything, it is necessary to come to… pic.twitter.com/LSi9Ehi1Ew — ANI (@ANI) September 24, 2023 ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు పక్కా -
జమిలి ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (ఒక దేశం, ఒకే ఎన్నికలు) అధ్యయనం కోసం ఏర్పాటు కమిటీ తొలి భేటీ ముగిసింది. శనివారం ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జమిలిపై అభిప్రాయాల సేకరణ చేపట్టడంతో పాటు సూచనలను తీసుకోవాలనుకుంటోంది. జమిలి కమిటీ తొలి భేటీలో సభ్యులకు సమావేశం అజెండా వివరించారు జమిలి కమిటీ చైర్మన్ కోవింద్. ఈ సమావేశంలో సభ్యులతో పాటు హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి మేఘ్‌వాలా పాల్గొన్నారు. భేటీ అంతిమంగా జమిలి ఎన్నికలపై అభిప్రాయాల కోసం.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలను ఆహ్వానించాలని ప్యానెల్ నిర్ణయించింది. జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను సైతం ఆహ్వానించనున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు పార్లమెంట్లో ప్రతినిధులుగా ఉన్న రాజకీయ పార్టీలకూ ఆహ్వానం అందించనుంది. ఇక.. లా కమిషన్ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టాలని కోవింద్ కమిటీ నిర్ణయించింది. -
జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ నేడు ఢిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక జరపడానికి కావాల్సిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, నిపుణుల సలహాలు స్వీకరించనున్నారు. ఒకే దేశం-ఒకే దేశం ఎన్నిక నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ నిన్న ఒడిశా పర్యటనలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న జమిలి ఎన్నికల కమిటీ మొదటి భేటీ ఉందని చెప్పారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీని ఏర్పరిచింది. ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన సర్దుబాట్లు, సూచనలను కమిటీ పరిశీలించనుంది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఇదీ చదవండి: Tender Voting: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? -
'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్!
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన వేసిన కమిటీ తొలిసారి అధికారికంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి సెప్టెంబర్ 23న ముహూర్తం ఖరారైంది. ముహూర్తం ఫిక్స్.. కొద్ది రోజుల క్రితం ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చిన కేంద్రం అనుకుందే తడవు హుటాహుటిన ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాయాలు గురించి అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని కీలక సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర సహా ఇతర ముఖ్య నేతలు సెప్టెంబర్ 6న సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి అధికారిక సమావేశాన్ని సెప్టెంబర్ 23న నిర్వహించాలని నిర్ణయించింది కమిటీ. కమిటీ కర్తవ్యం ఏమిటి? అయితే ఈ నెల 23న జరిగే సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రాధమిక కార్యాచరణ గురించి చర్చించనున్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే వాటి గురించి పూర్తిస్థాయి అధ్యయనం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. రాజ్యాంగంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా ఇతర చట్టాల సవరణలు చేయాల్సి ఉందా అన్న అంశాలపై కూడా గురించి చర్చించనున్నారు. ఉన్నతస్థాయి కమిటీ.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత వహించనున్న ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, మాజీ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, మాజీ లోక్‌సభ సెక్రెటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు హాజరు కానుండగా న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర ఈ ప్యానెల్‌కు సెక్రెటరీగా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ సెషన్ ముగిసిన వెంటనే! ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు పూర్తైన మరుసటి రోజునే ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకకాలంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంపైనే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగనుందని పుకార్లు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. #WATCH | On the 'One Nation, One Election' committee, former President and chairman of the committee, Ram Nath Kovind says "The First meeting will take place on 23rd September" pic.twitter.com/FU1gvzMi7j — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు..!
-
జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగించే పరిస్థితి లేదు. డిసెంబర్‌లోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జమిలీ ఎన్నికల పేరుతో ప్రజలను గందరగోళంలో పడేశారు. అన్ని మార్గాలను ఉపయోగించి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. జమిలీ ఎన్నికలు సాధ్యం కాకపోతే మినీ జమిలీ నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలను గందరగోళపరిచి గట్టెక్కాలని బీజేపీ చూస్తోందన్నారు. అలాగే, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహులు ఉన్నారని కొందరు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలకు స్వప్రయోజనాలే ముఖ్యం. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి.. వీరి ముగ్గురివి మూడు దారులు. కోమటిరెడ్డి సగం శరీరం బీజేపీలోనే ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే. -
‘గులాబీ’ వనంలో మౌనరాగం!.. ఏం జరుగుతోంది?
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించేంతవరకు ఆందోళన, ఉత్కంఠల్లో మునిగిన గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. పేర్లు వెల్లడి కాగానే సంతోష సంబరాల్లో మునిగిన ఎమ్మెల్యే అభ్యర్థులు అంతలోనే ఎన్నికల సమయాన్ని, అయ్యే వ్యయాన్ని తలచుకొని ఖర్చు ఫోబియాతో ఆందోళనకు గురయ్యారు. ఈలోగా జమిలి ఎన్నికలు ప్రచారంలోకి రావడంతో ఖర్చులకు, ప్రచారానికి కాస్త విరామమివ్వవచ్చని ఊపిరి పీల్చుకున్నారు. ఖర్చుల సంగతేంటి? ఒకవేళ జమిలి ఎన్నికలే వచ్చినా.. ఎన్నికలు జరిగేందుకు దాదాపు ఆర్నెళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అప్పటిదాకా నియోజకవర్గంలో శ్రేణుల్ని కాపాడుకోవడం, ఖర్చులు భరించడం మరింత భారమే అయినప్పటికీ ఇంకా స్పష్టత రానందున విరామం దొరికిందని భావిస్తున్నారు. జమిలి జరిగితే ఆర్నెళ్లు, జరగకపోతే మూణ్నెళ్లు ఖర్చులు భరించాల్సి ఉన్నందున ఏ మేరకు వీలైతే ఆ మేరకు ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఎలాంటి హడావుడి చేయడం లేదు. ఇది పార్టీ శ్రేణులకు నిరాశ కలిగిస్తోంది. ప్రచారమూ, హడావుడి వంటివి లేకపోవడంతో తాము ఖాళీగా ఉండాల్సి వస్తోందని, విందు వినోదాలకు అవకాశం లేకుండా పోయిందని స్తబ్దుగా ఉన్నాయి. అదే దారిలో అసమ్మతి నేతలు.. టికెట్ ఆశించి దక్కనందున అసంతృప్తిలో మునిగి అసమ్మతితో రగిలిపోతున్న నేతలు సైతం తమ కార్యాచరణకు విరామమిచ్చారు. తమ సత్తా చూపుతామని ఆవేశకావేషాలు ప్రదర్శించిన వారు నిశ్శబ్దంలో మునిగారు. ఉప్పల్ నుంచి టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, తన కొడుక్కి టికెట్ రానందున మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తమ బలం, బలగం చూపాలనుకున్నప్పటికీ ఎన్నికలెప్పుడో తేలిన తర్వాతే కార్యాచరణకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై స్పష్టత రానున్నందున ఆ తర్వాతే తాము రంగంలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాక టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లడమా, మానడమా అనేది నిర్ణయించుకునేందుకు కూడా తగిన సమయం లభించిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,టికెట్ దొరకని అసంతృప్తులకూ, ఎన్నికైన వారి ప్రచారానికీ బ్రేకులు పడ్డాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లు మరోవైపు.. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పలు పార్టీలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఒకవేళ బిల్లు ఆమోదం పొంది రిజర్వేషన్లు అమల్లోకి వస్తే మరింత ఆలస్యమే కాక 33 శాతం నియోజకవర్గాలను వారికి రిజర్వు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటికే వచి్చనవారి టికెట్లు కట్టవుతాయి. ఆ స్థానాల్లో మహిళా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుండటంతో అభ్యర్థుల దూకుడు తగ్గింది. దాంతోపాటే కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో జోష్ కూడా తగ్గింది. ఇది కూడా చదవండి: పొత్తు సరే.. సీట్ల మాటేంటి? -
జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు భారత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలా కాకుండా తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉంటే దానివలన దేశప్రగతికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును భారత్ అని మార్చడంలో కూడా తప్పులేదని అన్నారు. ప్రయోజనకరమే.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తరచుగా ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుందని, ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఖజానాపై ఖర్చు భారం తగ్గుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్, లా కమిషన్, పార్లమెంట్ ష్టాండింగ్ కమిటీ అభిప్రాయాలు సిఫారసుల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికల సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం మంచిదని అన్నారు. 1971 వరకు దేశంలో ఒకే ఎన్నికలు ఉండేవని తర్వాతి కాలంలో వివిధ కారణాల వలన ఈ ప్రక్రియకు తెరపడిందన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి.. ప్రజాస్వామ్యంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. కానీ చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించుకుని ముందుకు సాగాలని అన్నారు. చట్టసభ్యులు పార్టీలను ఫిరాయించడంపై ఆయన మాట్లాడుతూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలని అన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వలన ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిరనలు తీసుకోలేవని తెలిపారు. ఇక ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై అందులో తప్పేమీ లేదని ఆ పేరు ఎప్పటినుంచో వాడకంలోనే ఉందని అన్నారు. ఇది కూడా చదవండి: మీరు వద్దనుకుంటే పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం -
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. 'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది. రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి. సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి. సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి. భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి. సిబ్బంది: ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి. ఒక్కటే ఓటర్ కార్డు: లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి. ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
ఒక దేశం - ఒకే ఎన్నికపై కసరత్తులు వేగవంతం
-
ఒక దేశం-ఒకే ఎన్నికపై కసరత్తులు వేగవంతం
-
ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి
జైపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు జనాభాగణన పూర్తిచేయకుండా 'ఒకే దేశం ఒకే ఎన్నికలకు పిలుపునివ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇక రాజస్థాన్‌లో అయితే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎవరితో పెట్టుకుంటున్నారన్న విషయం వారికి తెలియాలని అన్నారు. అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగం చిన్నాభిన్నమైందని నేను ఎప్పటి నుంచో చెబుతునే ఉన్నాను. ఈరోజు దేశంలో జరిగేవన్నీ చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందో కూడా చెప్పడం కష్టమేనని.. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రం ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అడిగి ఉంటే బాగుండేదని కానీ వారు ఎవరి అభిప్రాయాన్ని అడగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇక మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తావన తీసుకొస్తూ అసలు ఇలాంటి కమిటీలో మాజీ రాష్ట్రపతి భాగస్వామి కావడం నేనింత వరకు ఎప్పుడు వినలేదు, చూడలేదని అన్నారు. ఇందులోకి అనవసరంగా ఆయనను లాగుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చే హక్కు ఉంది కానీ ప్రజలకు కారణం చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇక రాజస్థాన్ ప్రజలైతే మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారని అసలు వారు ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలని ఘాటుగా స్పందించారు. ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 రద్దుపై విచారణ.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం -
వన్ నేషన్-వన్ ఎలక్షన్.. ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే?
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది సభ్యులతో హైలెవల్ కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం జమిలీ ఎన్నికల నిర్ణయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిర్ణయం మంచిదైతే ఓకే.. తాజాగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలకు తన మద్దతు ఉంటుదన్నారు. అయితే, ఇది సరైన ఉద్దేశంతో చేస్తే దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని మంచి ఉద్దేశంతో తీసుకువస్తే మంచిది అని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ వంటి అతిపెద్ద దేశాలలో సంవత్సరానికి 25 శాతం మంది ఎన్నికలకు ఓట్లు వేస్తూ ఉంటారు. ఒకే ఎలక్షన్ విధానం తీసుకువస్తే ఇది ఒకటి రెండుసార్లు మాత్రమే పరిమితం అవుతుందన్నారు. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించడంతో పాటుగా, ప్రజలు ఒకేసారి నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితులు ఉంటాయని వ్యాఖ్యలు చేశారు. బిల్లును ప్రవేశపెట్టనివ్వండి.. ఇదే సమయంలో అసలు ఇది ఏ ఉద్దేశంతో తీసుకువస్తున్నారన్నదే ముఖ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రి పరివర్తన తీసుకురావాలని భావిస్తే అది తీవ్ర సమస్యగా మారుతుందన్నారు. ప్రభుత్వం బిల్లు తీసుకువస్తుంది కాబట్టి, ఆ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశానికి మేలు జరిగే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగానే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1967 వరకు 18 సంవత్సరాల పాటు దేశంలో ఒకేసారి ఎన్నికలు ఎలా జరిగాయో తెలిపారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు అనుకూలంగా పనిచేసే కారణాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. #WATCH | On 'One Nation, One Election', Prashant Kishor says, "If this is done with the correct intentions and there be a transition phase of 4-5 years, then it is in the interest of the country. This was once in effect in the country for 17-18 years. Secondly, in a country as… pic.twitter.com/beTAZqf0Gl — ANI (@ANI) September 4, 2023 ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
జమిలి లాభనష్టాలపై కేంద్రం వివరణ
ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానరూపకల్పనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై లాభనష్టాలను పేర్కొంటూ గత పార్లమెంట్ సెషన్లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి విడుదల చేసిన రిపోర్టు తాజాగా తెరమీదకు వచ్చింది. పార్లమెంట్లో కిరోడీ లాల్ మీనా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ సమాధానం ఇది.. సవాళ్లు.. ►జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌లో సవరణలు అవసరమని న్యాయ శాఖా మంత్రి తెలిపారు. 1) పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్ 83, 2) లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడంపై ఆర్టికల్ 85, 3) రాష్ట్ర శాసనసభల వ్యవధిపై ఆర్టికల్ 172, 4) రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయడంపై ఆర్టికల్ 174 5) రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనపై ఆర్టికల్ 356 ► ఇది కాకుండా జమిలీ ఎన్నికల నిర్వహణకు దేశం సమాఖ్య నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయాన్ని పొందడం తప్పనిసరి అని అర్జున్ మేఘావాల్ తెలిపారు. ► అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (EVMలు/VVPATలు) అవసరమవుతాయి. వీటి ఖర్చు వేల కోట్ల వరకు ఉంటుంది. ► EVM మెషీన్ జీవితకాలం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ యంత్రాన్ని దాని జీవిత కాలంలో మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించవచ్చు. ప్రతి 15 సంవత్సరాలకు దాని స్థానంలో మరోటి బర్తీ చేయాలంటే ఒకేసారి భారీ వ్యయం అవుతుందని అర్జున్ మేఘావాల్ చెప్పారు. ► ఇదీగాక అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు కూడా అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు. లాభాలు.. ► జమిలీ ఎన్నికల వల్ల ఒకరకంగా ప్రభుత్వ వ్యయం భారీగా తగ్గుతుందని న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ తెలిపారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రచార ఖర్చులు భారీగా ఆదా అవుతాయని పేర్కొన్నారు. ► జాతీయ, రాష్ట్ర ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల వల్ల ఎలక్షన్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఇది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ► దక్షిణాఫ్రికాలో జమిలీ ఎన్నికలే జరుగుతాయి. ప్రతి ఐదేళ్లకు ఒకేసారి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. రెండేళ్లకు ఒకసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. ► యూకేలోనూ ఎన్నికలు స్థిరమైన కాలవ్యవధుల్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ చట్టం 2011 ప్రకారం నిర్ణీత కాలవ్యవధి ప్రకారమే స్థిరంగా నిర్వహిస్తారు. ► స్వీడన్లో కూడా జమిలీ తీరు ఎన్నికలే నిర్వహిస్తారు. నాలుగేళ్లకు ఒకసారి సెప్టెంబర్ రెండవ ఆదివారం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే.. -
‘జమిలి’తో సామాన్యులకు లాభమేంటి?
చండీగఢ్: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. జమిలి ఎన్నికల వల్ల సామాన్య ప్రజలకు ఉపయోగం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం హరియాణాలోని భివానీలో ఎన్నికల ప్రచార సభలో కేజ్రివాల్ ప్రసంగించారు. ఏదో ఒక రోజు బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ దేశం నుంచి తుడిచిపెట్టేస్తుందని అన్నారు. ఒకే దేశం–ఒకే ఎన్నిక అవసరం లేదని, ఒకే దేశం–ఒకే విద్య కావాలని ఆకాంక్షించారు. ధనవంతులకు, పేదలకు ఒకేరకరమైన విద్య అందించాలన్నారు. ఒకే దేశం–100 ఎన్నికలు, ఒకే దేశం–1,000 ఎన్నికలు అయినా సామాన్య ప్రజలకు పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు అవసరం లేదని తేలి్చచెప్పారు. ఉచిత పథకాలు అంటూ కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పేదలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించడం నేరమా? పాపమా? అని ప్రశ్నించారు. హరియాణాలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేజ్రివాల్ మండిపడ్డారు. -
ప్రజలకు మంచి చేయడానికి ముందుకు రారు: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎగిరి గంతేయాల్సింది పోయి ప్రతిపక్షాలన్నీ అనవసర విమర్శలు చేస్తున్నాయని.. ఒకేసారి అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే బోలెడంత డబ్బును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు కదా అని సమాచార, ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఎప్పటినుంచో ఒకే దేశం ఒకే ఎన్నికలు గురించి చెబుతూనే ఉంది. మా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దీన్ని ఆమోదించారు. ఇదే క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒకకమిటీని కూడా వేశాము. ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణన తీసుకోవాలన్న ఉదేశ్యంతో కమిటీలో వారికి కూడా స్థానం కల్పించాం. కానీ అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ ఉంటుంది. దీనికి కమిటీ సభ్యులు కూడా హాజరవుతారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విషయంలో మాట్లాడటానికి వారు ఎప్పుడూ ముందుకు రారు. విలువైన పార్లమెంట్ సమీవేశాల సమయాన్ని వృధా చేయడమే వారికున్న ఏకైక లక్ష్యం. మీరే చూశారు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వారు సమయాన్ని ఎలా వృధా చేశారో. అంతెందుకు గతంలో ఒకే దేశం.. ఒకే పన్ను విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా వారు ఇదే విధంగా గొడవ చేశారు. కానీ ఈరోజు ఒకే పన్ను విధానం వలన రూ.90,000 వచ్చే చోట రూ.1,60,000 ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని అన్నారు. అదే విధంగా ఒకే దేశంలో ఒకే ఎన్నికల నిర్వహిస్తే మరింత డబ్బు ఆదా చేయవచ్చని.. బోలెడంత సమయం కలిసొస్తుందని అన్నారు. ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి వినియోగించవచ్చని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయకుండా సమాలోచన చేయాలని కోరుతున్నానన్నారు. ఇది కూడా చదవండి: చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా -
జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే?
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే దేశ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే అని అన్నారు. భారత్ అంటే రాష్ట్రాల సమైఖ్యత అని స్పష్టం చేశారు. ఇక, జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా జమిలీ ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడింది. అయితే, ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. INDIA, that is Bharat, is a Union of States. The idea of ‘one nation, one election’ is an attack on the 🇮🇳 Union and all its States. — Rahul Gandhi (@RahulGandhi) September 3, 2023 మరోవైపు.. జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ స్పందించారు. ‘జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 వరకు పెరుగుతుంది -
‘జమిలీ ఎన్నికలకు మద్దుతు ఉంటుందని కేసీఆర్ లేఖ రాశారు’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జమిలీ ఎన్నికలపై కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖయమని జోస్యం చెప్పారు. బీజేపీ పరువు పోకుడదనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే కారణంగా బీజేపీ కుట్ర చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖాయం. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా గెలిచే అవకాశం లేదు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది. బీజేపీ కుట్రలకు కేసీఆర్ సహకరిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు.. రెండు ఒక్కటే. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పే కేసీఆర్.. బీజేపీ పాలసీలకు మద్దతు తెలుపుతారు. జమిలీ ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని 2018లోనే కేసీఆర్ లేఖ రాశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకమని చెప్పే కేసీఆర్ జమిలీ ఎన్నికలపై తన స్టాండ్ ఏంటో చెప్పాలి. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. జమిలీ ఎన్నికలు పెద్ద డ్రామా. బీజేపీలోని ‘బీ’.. టీఆర్ఎస్లోని ‘ఆర్ఎస్’ను కలిపితేనే ‘బీఆర్ఎస్’ అవుతోంది. అధ్యక్ష తరహా ఎన్నికల కుట్రలో భాగమే జమిలి ఎన్నికలు. రాష్ట్రాల అధికారాలు గుంజుకోవడానికే జమిలి ఎన్నికలు. జమిలీ ఎన్నికలు జరిగితే సౌత్ ఇండియాకి తీవ్ర ప్రమాదం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు వస్తే ఎలా..! -
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు.. సభ్యులు వీరే..
సాక్షి, హైదరాబాద్: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై తాజాగా హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఎనిమిది మంది సభ్యులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వివరాల ప్రకారం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్రం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే శనివారం రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్రహోం అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ, గులాం నబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్ ఉన్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. Govt of India constitutes 8-member committee to examine ‘One nation, One election’. Former President Ram Nath Kovind appointed as Chairman of the committee. Union Home Minister Amit Shah, Congress MP Adhir Ranjan Chowdhury, Former Rajya Sabha LoP Ghulam Nabi Azad, and others… pic.twitter.com/Sk9sptonp0 — ANI (@ANI) September 2, 2023 ఇక, దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సలహాలును హై లెవెల్ కమిటీ తీసుకోనుంది. కాగా, సాధ్యమైనంత త్వరగా కమిటీ సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడు కీలక అంశాలపై సిఫారసు చేయాలని కమిటీకి లక్ష్యం 1. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల పరిశీలన. ఏ రాజ్యాంగ సవరణలు చట్టాలకు సవరణ చేయాలో సిఫారసు చేయాలి. 2. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? కాదా?. 3. హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై సిఫారసు ఇవ్వాలి. 4. ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కానీ పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశంపై సిఫారసు. 5. ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ సైకిల్ దెబ్బ తినకుండా అవసరమైన చర్యలపై సిఫారసులు. 6. ఒకేసారి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు, వీవీప్యాట్లు, మానవ వనరుల అవసరమెంతో తేల్చాలి. 7. లోకసభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు. ఇది కూడా చదవండి: మళ్ళీ అధికారంలోకి వస్తే వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!!
పాట్నా: ముంబైలో ముచ్చటగా మూడో సారి సమావేశమైన ఇండియా విపక్ష కూటమి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై జమిలి ఎన్నికల కమిటీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇదే క్రమంలో ఇండియా తదుపరి కార్యాచరణ గురించి కీలకమైన సమాచారమిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దానికోసం యావత్ భారత్ దేశం పండుగలా జరుపుకునే గాంధీ జయంతిని వేదికగా చేసుకున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి తర్వాతి కార్యాచరణ గురించి కీలక సమాచారమిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. ముంబైలో ఇండియా కూటమి సమావేశం ముగించుకుని పాట్నా చేరుకున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ జన్మదినోత్సవాల్లో పాల్గొని వచ్చేనెల ఇండియా కూటమి గాంధీ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఇదే నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం పిలుపునిచ్చిన ప్రభుత్వం వాటి ఎజెండా ఏమిటో చెప్పకపోవడంపై కూడా అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక జమిలి ఎన్నికల పేరుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని మేమంతా ఏకకంఠంతో వ్యతిరేకించడంతో షాక్‌కు గురయ్యారన్నారు. కేంద్రం ఎప్పుడో నిర్వహిస్తామని చెప్పిన కులగణన గురించి ఇప్పటికీ నోరువిప్పకపోవడం చాల ఆశ్చర్యకరంగా ఉందని వారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలోపే మేము మా రాష్ట్రంలో కులగణన తోపాటు జనాభా గణన కూడా పూర్తి చేశామని అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చేందుకే బహుశా వారు ఈ సమావేశాలకు పిలుపునిచ్చారనిపిస్తోందని మేము కూడా ఇదే సమావేశాల్లో జనాభాగణన గురించి కేంద్రాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ టికెట్టు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ -
Jamili Elections: ‘జమిలి’ సర్వరోగ నివారిణా?
జమిలి ఎన్నికలపై చర్చ సద్దుమణిగిందని అనుకున్నప్పుడల్లా అది మళ్లీ మళ్లీ రాజుకోవటం ఏడెనిమిదేళ్లుగా రివాజైంది. కానీ ఈసారి ఉన్నట్టుండి అందుకు సంబంధించి తొలి అడుగుపడింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ విధివిధానాలు, అందులో ఉండే నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా ఇండియా కూటమి సమావేశాల్లో తీరిక లేకుండా వున్న విపక్షాలకు ఇది ఊహించని పరిణామం. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలనీ, అందువల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందనీ ఆ విధానాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. అంతేకాదు, తరచు ఎన్నికలవల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని కూడా వారి వాదన. కానీ ఈ రకమైన వాదనలను కొట్టి పారేస్తున్నవారు కూడా గణనీయంగానే ఉన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడిందో చూపాలని సవాలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనో, మరే అత్యవసర సందర్భాల్లోనో ప్రభుత్వాలను ఎన్నికల సంఘం నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలూ లేవు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలను కూడా ఈ చట్రంలోకి తీసుకు రావటమే కేంద్రం ఉద్దేశం. ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ వినిపిస్తోంది. అంతక్రితం 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ విషయంలో కొంత ప్రయత్నం చేశారు. అప్పటి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో ఆయన చర్చించారు. కానీ ఎందుకనో తదుపరి చర్యలేమీ లేవు. జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక సైతం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా వెనక్కు వెళ్తే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈమాటే చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ, చట్టసభల నియమనిబంధనల సవరణ వగైరాలు చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యంకాదని 2018లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో అభిప్రాయపడింది. ఒక ఏడాది వేర్వేరు నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఉత్తమమని సూచించింది. దేశంలో జమిలి ఎన్నికలు 1952 నుంచి 1967 వరకూ జరిగాయి. కానీ దానికి తూట్లు పొడిచింది కేంద్రంలోని పాలకులే. అప్పటి నెహ్రూ సర్కారు 1959 జూలైలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని తొలి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని 356వ అధికరణ ప్రయోగించి బర్తరఫ్ చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దేవరకూ ఆ అధికరణ దశాబ్దాలపాటు దుర్వినియోగం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే ధోరణి వెర్రితలలు వేసి ప్రభుత్వాలు కుప్పకూలాయి. అసెంబ్లీలు రద్దయ్యాయి. ఈ కారణాలన్నిటివల్లా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలది తలోదారీ అయింది. పాలక పార్టీలను చీల్చటం, చీలికవర్గంతో కొత్త ప్రభుత్వాలను ప్రతిష్టించటం రివాజైంది. తరచు ఎన్నికల వల్ల ఖజానాకు తడిసిమోపెడు ఖర్చు అవుతున్నదన్నది వాస్తవం. దీనికితోడు రాజమార్గాల్లో, దొంగదారుల్లో ఎన్నికల జాతరకు వచ్చిపడే వేల కోట్ల రూపాయలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలకు ఖజానాకు రూ.1,115 కోట్లు ఖర్చ యితే, 2014 నాటికి ఇది రూ.3,870 కోట్లకు పడగలెత్తింది. ఇదంతా సర్కారుకయ్యే వ్యయం. పార్టీలూ, అభ్యర్థులూ చేసే ఖర్చు ఇందుకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. కానీ రోగం ఒకటైతే మందు మరొకటన్నట్టు ఈ సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారమని పాలకులు చేస్తున్న వాదన సరికాదు. ఎన్నికల్లో ధనప్రభావం అరికట్టడానికి ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికల విశ్వసనీయత పెంచటానికి దొంగ ఓట్లను అరికట్టడం అవసరం. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించి, అధికారంలోకొచ్చాక వంచించే పార్టీలపై చర్యలు తీసుకోవటం అవసరం. కానీ జరిగిందేమిటి? అసలే పార్టీలు వెచ్చించే కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడిదో తెలిసే అవకాశంలేని ప్రస్తుత పరిస్థితిని మరింత జటిలం చేసేలా ఎన్నికల బాండ్ల విధానానికి తెరలేపారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్ని కలు’ గొప్ప ఆదర్శంగా కనిపించవచ్చు. చూడదల్చుకున్నవారికి ఇందులో జాతీయతా భావన కూడా దర్శనమీయొచ్చు. కానీ ఎన్నికల ప్రక్షాళనకు ఇది దోహదపడేదెంత? ఇంతకూ జమిలి ఎన్నికల విధానం అమలు చేయటం మొదలెట్టాక రాష్ట్రాల్లో గడువుకు ముందే అసెంబ్లీలు రద్దు చేయాల్సివస్తే ఏం చేస్తారు? 90వ దశకంలో మాదిరే కేంద్రంలోనే అస్థిరత ఏర్పడి లోక్‌సభ రద్దు చేయాల్సివస్తే మార్గం ఏమిటి? ఇవన్నీ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఎటూ పరిశీలిస్తుంది. ఇక రెండు చట్టసభలకూ ముడివేయటంవల్ల ఫెడరలిజం దెబ్బతింటుందనేవారూ... జాతీయ అంశాల ప్రాముఖ్యత పెరిగి స్థానిక అవసరాలు, ఆకాంక్షలు మరుగునపడతాయనేవారూ ఉన్నారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వెలువడిన ఫలితాలు గమనిస్తే ఇది అర్ధసత్యమే అనిపిస్తుంది. ఏదేమైనా జమిలి ఎన్నికల విధానంపై విస్తృతమైన చర్చకు చోటిచ్చి, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేయాలి. తొందరపాటు పనికిరాదు. ఇది కూడా చదవండి: Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ -
జమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు.. రాజ్యాంగ సవాళ్లు ఇవే..
ఢిల్లీ:జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్రం కమిటీని నియమించింది. దానికితోడు ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఒకే దేశం- ఒకే ఎన్నికల బిల్లు చర్చకు రానుందని రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే జమిలి ఎన్నికలకు సిద్ధపడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి సరిపడా పోలింగ్ సామాగ్రి మన వద్ద లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు జరపడానికి రాజ్యాంగ పరంగా కూడా చిక్కులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సవరణలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ‘One Nation One Election’ possible, Constitutional amendment needed: say experts Read @ANI Story | https://t.co/QkRUL3m1Vf#OneNationOneElection #ParliamentSpecialSession pic.twitter.com/AwHG1QF3Gq — ANI Digital (@ani_digital) September 1, 2023 ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు.. జమిలీ ఎన్నికలకు అనుగుణంగా ఈ ఆరు ఆర్టికల్లలో విధివిధానాలను సవరించాల్సి ఉంటుంది. ► ఆర్టికల్ 83(2): ఈ ఆర్టికల్ ప్రకారం లోక్‌సభ గడువు ఐదేళ్లు. ముందుగా కూడా రద్దు చేయవచ్చు. ► ఆర్టికల్ 85: లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ప్రస్తుత సభ రద్దు అయిన వెంటనే సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త సభ ఆరంభం అవుతుంది. ► ఆర్టికల్ 172(1): రాష్ట్ర అసెంబ్లీ రద్దు కానంతరవరకు ఐదేళ్ల పాటు గడువు ఉంటుంది. ► ఆర్టికల్ 174(2): కేబినేట్ సూచన మేరకు అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. మెజారిటీ సందిగ్ధంలో ఉన్నప్పుడు గవర్నర్ తన విచక్షణను వినియోగిస్తారు. ► ఆర్టికల్ 356: ఈ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మాణం విపక్షాలు నెగ్గినప్పుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో జమిలి ఎన్నికలకు అనుగుణంగా సవరణ చేయాల్సి ఉంటుంది. ► ఈ ఆర్టికల్‌ల సవరణ ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో మూడొంతుల్లో రెండోంతుల సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తప్పనిసరి. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత సగం రాష్ట్రాల అసెంబ్లీలు దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. వనరుల కొరత.. లోక్‌సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలా రాజ్యాంగాన్ని సవరించినా.. ఎన్నికల నిర్వహణకు భారీ వనరులు అవసరమవుతాయి. 25 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM)లు, 25 లక్షల VVPATలు (ఓటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం కేవలం 12 లక్షల ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో సిబ్బంది కూడా అవసరమవుతారు. మొదట్లో జమిలీ ఎన్నికలే.. 1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. విదేశాల్లో ఇలా.. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతోంది. అక్కడ జాతీయ, స్థానిక స్థానాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. స్వీడన్లో కూడా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్ణీత తేదీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేషనల్ లెజిస్లేచర్ (రిక్స్‌డాగ్), ప్రావిన్షియల్ లెజిస్లేచర్ (ల్యాండ్‌స్టింగ్), స్థానిక సంస్థలు/మునిసిపల్ అసెంబ్లీలకు సెప్టెంబర్ రెండో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎందుకంటే..?
ఢిల్లీ:జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు. #WATCH | On 'One nation, One election', Union Parliamentary Affairs Minsiter Pralhad Joshi says "Right now, a committee has been constituted. A report of the committee will come out which be discussed. The Parliament is mature, and discussions will take place, there is no need to… pic.twitter.com/iITyAacPBq — ANI (@ANI) September 1, 2023 జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం కమిటీని నియమింటిన విషయం తెలిసిందే. అటు.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను జరపనున్నట్లు ప్రకటించింది. దీంతో జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించడానికి సిద్ధమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. VIDEO | "How can the government take unilateral decisions without consultation with political parties and Parliament?" says CPI general secretary D Raja on reports of the central government forming a committee to explore the possibility of 'one nation one election'. pic.twitter.com/RXjYuI19Xx — Press Trust of India (@PTI_News) September 1, 2023 'ఇతర పార్టీల అభిప్రాయాలను సంప్రదించకుండానే ఏ విధంగా జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు?. అందరి అభిప్రాయాలు తీసుకుని, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి' కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజ విమర్శించారు. నిష్పాక్షికమైన ఎన్నికలు కావాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశాన్ని దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికలను తెరమీదకు తెస్తున్నారు. VIDEO | "The country is already one, is anyone questioning that? We demand fair election, not 'one nation one election'. This funda of 'one nation one election' is being brought to divert the attention from our demand of fair election," says Shiv Sena (UBT) leader @rautsanjay61… pic.twitter.com/9phqvFiqCv — Press Trust of India (@PTI_News) September 1, 2023 ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
జమిలి ఎన్నికలపై ఫస్ట్ స్టెప్, కోవింద్ నేతృత్వంలో కమిటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై కమిటీని నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 16 మందితో కూడిన ఈ కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించి రిపోర్టును సమర్పించనుంది. ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు.? సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన వెంటనే కేంద్రం ఈ కమిటీని నియమించింది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. STORY | Ex-President Kovind-headed committee to explore possibility of 'one-nation, one-election'READ: https://t.co/UyGLbbKpdF(File Photo) pic.twitter.com/XVbXHjd75f— Press Trust of India (@PTI_News) September 1, 2023 అయిదు రాష్ట్రాల్లో యథాతధం.? అయితే షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లోగా అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాలి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలి. దానికి గాను ఎన్నికల సంఘం ముందున్న గడువు డిసెంబర్ 13, 2023. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వాటికి సంబంధం లేకుండా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిషన్ ఒకటి వచ్చే సోమవారం మధ్యప్రదేశ్ లో పర్యటించనుంది. Sources say that ECI is going ahead with its schedule for conduct of assembly elections in five states, namely, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan, Telangana and Mizoram; elections to these five States have to be completed before 13.12.2023. Commission to visit MP on Monday… — Arvind Gunasekar (@arvindgunasekar) September 1, 2023 లా కమిషన్ కసరత్తు వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ పార్లమెంట్లో ప్రధాని మోదీ ఈ అంశంపై పలుమార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ఉంది. మొదట్లో జమిలీ ఎన్నికలే.. 1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. ఇదీ చదవండి: ప్రత్యేక సమావేశాలు.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు బీజేపీ ప్లాన్! -
మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు?
సాక్షి, ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో పార్లమెంట్ అమృత్కాల్ స్పెషల్ సెషన్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కాల పరిమితి పెంపు, తగ్గింపు.. ఇక.. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సాధారణంగా వాటి గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అయితే.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఐడియా కింద, లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కింద కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి పెంచడం, మరికొన్ని అసెంబ్లీల కాలపరిమితి తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. కాగా, రాబోయే ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. బిల్లు ఆమోదానికి 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది. Special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings. Amid Amrit Kaal looking forward to have fruitful discussions and debate in Parliament. ಸಂಸತ್ತಿನ ವಿಶೇಷ ಅಧಿವೇಶನವನ್ನು… pic.twitter.com/k5J2PA1wv2 — Pralhad Joshi (@JoshiPralhad) August 31, 2023 ఇది కూడా చదవండి: జమ్ములో ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
...అడగాల్సింది మనల్ని!
...అడగాల్సింది మనల్ని! -
జమిలి ఎన్నికలకు సిద్ధం కండి..
సాక్షి, హైదరాబాద్: ‘లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలను (జమిలి) నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని పార్టీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. గ్రేటర్ ఓటమిపై నిరాశ వద్దు.. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామనే నిరాశలో ఉండొద్దు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గ్రేటర్ ఎన్నికలను మనం అనుభవంలా మాత్రమే చూడాలి. ఓటమి పాలైన వారి పట్ల చులకన భావంతో ఉండకండి. ఆయా డివిజన్లలో ఓటమి పాలైన అభ్యర్థులే మన పార్టీకి అత్యంత ముఖ్యమనే విషయాన్ని గుర్తించండి. సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు ఇచ్చే విషయంలో మనం కొంత ఆలోచించి ఉండాల్సింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై దృష్టి పెట్టాల్సిందిగా ఆదేశించారు. ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా బంద్... రైతులకు సంఘీభావంగా ఈ నెల 8న జరిగే భారత్ బంద్‌కు మద్దతుగా హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ భేటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేటీఆర్‌తో కార్పొరేటర్ల భేటీ గ్రేటర్లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆదివా రం తెలంగాణ భవన్లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. నగర పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన కార్పొరేటర్లతోపాటు, ఓడిన అభ్యర్థులను కూడా వెంటబెట్టుకుని వచ్చా రు. గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన కేటీఆర్... ఓటమిపాలైన వారు నిరాశ చెందవద్దని చెప్పారు. -
‘జమిలి’తో సమస్యలెన్నో!
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఆ అంశంపై అందరూ అధ్యయనం చేయాలని కోరారు. న్యూఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగిన స్పీకర్ల సదస్సు ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో చట్టసభలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగడం మన దేశానికి ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఇప్పుడే కాదు... అధికారంలో లేనప్పుడు కూడా బీజేపీ జమిలి ఎన్నికలుండాలని కోరుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ ఈ అంశంపై 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఎక్కడో ఒకచోట కొన్ని నెలల వ్యవధిలో ఎన్నికలు జరుగుతుంటే వాటి ప్రభావం అభివృద్ధి కార్యకలాపాలపై పడుతున్నదని, వేర్వేరు ఓటర్ల జాబితాల వల్ల వృధా వ్యయం తప్ప ఉపయోగంలేదని మోదీ భావన. మన దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ విధానంవుంది. ఆ రాష్ట్రాల్లో కూడా పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు తీరు వేర్వేరుగా వుంటోంది. వాస్తవానికి 1952 తొలి సార్వత్రిక ఎన్నికలతో మొద లుపెడితే 1967 వరకూ చట్టసభలకు జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే 1972లో ముగియాల్సిన లోక్‌సభను నాటి ప్రధాని ఇందిరాగాంధీ సంవత్సరకాలం ముందే రద్దు చేయడంతో 1971లోనే ఎన్నికలు వచ్చాయి. 1984లో రాజీవ్ గాంధీ కూడా ఆ పనే చేశారు. గడువుకు ముందే లోక్‌సభను రద్దు చేశారు. అనంతరకాలంలో ఏర్పడిన ప్రభుత్వాలు మూన్నాళ్ల ముచ్చటగా ముగిశాయి. (చదవండి: ఒకే దేశం.. ఒకే ఎన్నిక) 1989, 1999ల్లో ఏర్పడ్డ ప్రభుత్వాలు రెండేళ్ల వ్యవధిలోనే కుప్పకూలడంతో మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. మధ్యలో 1991 ఎన్నికల అనంతరం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అయిదేళ్లూ పాలించారు. తిరిగి 1996 ఎన్నికల తర్వాత 1998 వరకూ రెండేళ్లలోనే ఏబీ వాజపేయి, హెచ్డీ దేవెగౌడ, ఐకె గుజ్రాల్ వరసగా ప్రధానులయ్యారు. ఆ తర్వాత మళ్లీ మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. ఆ తర్వాత నుంచి సుస్థిర ప్రభుత్వాల యుగం వచ్చింది. అసెంబ్లీలు సైతం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి. తగినంత మెజారిటీ లేక రాజీనామా చేయాల్సిరావడం, కేంద్రంలో అధికారం చలాయించే పాల కులకు ఆగ్రహం కలిగినప్పుడు ప్రభుత్వాలు బర్తరఫ్ అయి, ఎన్నికలు రావడం... ఇదంతా మన కళ్ల ముందే సాగిన చరిత్ర. ఇప్పుడు ప్రధాని చేస్తున్న ప్రతిపాదన తీరుతెన్నులేమిటో ఎవరికీ తెలియదు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అనంతరకాలంలో అర్ధాంతరంగా ఏర్పడే రాజకీయ సంక్షోభాలకూ, అనిశ్చితికీ ఆ ప్రతిపాదనలో ఎటువంటి పరిష్కారం చూపదల్చుకున్నారో తెలియదు. ఇవి తెలిస్తే తప్ప జమిలి ఎన్నికలపై ఎవరూ సానుకూలంగా స్పందించలేరు. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఏదో కారణంతో అసెంబ్లీని రద్దు చేస్తే ఏం చేస్తారు? ఒకవేళ అధికారంలో వున్నవారు మెజారిటీ కోల్పోయి, ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే అక్కడి అసెంబ్లీ ఏమవుతుంది? అక్కడ ఎలాంటి పాలన వుంటుంది? మరో నాలుగేళ్లు లేదా మూడేళ్లు ఎన్నుకున్న ప్రభుత్వం లేకుండా రాష్ట్రపతి పాలనలో ఆ రాష్ట్రం మనుగడ సాగించాలా? అలాగైతే అది ప్రజా స్వామ్యం అవుతుందా? అసలు కేంద్రంలోనే అనిశ్చితి ఏర్పడితే ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానాలుండాలి. అన్నిటికీ అమెరికాతో పోలిక తెచ్చుకోవడం మనకున్న అలవాటు. అది చిరకాలంగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతున్న దేశమైతే...మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అక్కడ జమిలి ఎన్నికలు లేకపోయినా మనతో పోలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగ్గా వుంది. నాలుగేళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో రెండేళ్లకోమారు ప్రతి నిధుల సభకు ఎన్నికలుంటాయి. రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఆ మాదిరే వుంటాయి. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య ఎన్నికల నిబంధనల్లో, నిర్వహణలో ఎన్నో వ్యత్యాసాలుంటాయి. అయితే అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలూ ఏకమవుతాయి. మన దగ్గర ఫెడరల్ వ్యవస్థ నానాటికీ కుంచించుకుపోతుంటే అక్కడ అది నిరంతరాయంగా వర్థిల్లుతోంది. భిన్న సమయాల్లో ఎన్నికల వల్ల అభివృద్ధి కార్యకలాపాలకు అక్కడ కలగని విఘాతం మన దేశంలో ఎందుకు కలుగుతోంది? పాలకులు ఒప్పుకోరుగానీ... నిరంతర ఎన్నికల వల్ల విధాన సంబంధమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం వారికి సమస్యగా పరిణమిస్తోంది. ఒక రాష్ట్రంలో ఎన్నికలయ్యాక తీసుకునే విధాన నిర్ణయం మరో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు గుదిబండగా మారుతోంది. అయితే ప్రజలెదుర్కొంటున్న సమస్య వేరు. ఎప్పుడూ జరిగే ఎన్నికల వల్ల అనవసర ఉద్రిక్తతలు పెరగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, పర్యవసానంగా శాంతిభద్రతల సమస్య తలెత్తడం సాధారణ ప్రజానీకానికి సమస్యగా మారుతోంది. అలాగే ఆచరణసాధ్యంకాని వాగ్దానాలతో మేనిఫెస్టోలు నిండిపోవడం వారికి ఎబ్బెట్టుగా అనిపి స్తోంది, డబ్బు, మద్యం పంపిణీ వంటివి సరేసరి. ఇవన్నీ ఎన్నికలను జాతరగా మారుస్తుంటే... ఆ తర్వాత ఏర్పడే చట్టసభలు సైతం కర్తవ్య నిర్వహణలో విఫలమవుతున్నాయి. ఎంతో కీలకమైన బిల్లులనుకున్నవి కూడా అరకొర చర్చలతో ఆమోదం పొందుతున్నాయి. కొన్నిసార్లు గిలెటిన్లతో ముగుస్తున్నాయి. వాగ్దానాలు నెరవేర్చని పాలకులపై ఏవిధమైన చర్యలూ వుండవు. ఈ దుస్థితిని మార్చడానికి పాలకులు ముందుగా ప్రయత్నించాలి. జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే లోక్ సభ ఎన్నికలతో అసెంబ్లీలను జోడిస్తే స్థానిక ఆకాంక్షలు, సమస్యలు మరుగున పడతాయి. ఇందువల్ల ఫెడరల్ స్ఫూర్తి అటకెక్కుతుంది. జమిలి ఎన్నికల్లో ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం వరకూ వున్నాయని 1999 తర్వాత జరిగిన ఎన్నికలను డేటా పరిశీలించిన విశ్లేషకులు సైతం తేల్చారు. కనుక ఈ విషయంలో అన్ని కోణాల్లోనూ లోతైన చర్చ జరగాలి. -
ఒకే దేశం.. ఒకే ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు (‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’) ఆలోచన అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేయలేమని, ఈ ఆలోచన ప్రస్తుతం దేశ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గుజరాత్ కెవాడియాలో జరిగిన 80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా కొన్ని నెలల వ్యవధిలో నిర్వహించే ఎన్నికలు, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తాయని, ఈ కారణంగా ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ విషయంలో లోతైన అధ్యయనం, చర్చ అవసరమని ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రిసైడింగ్ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ అంశంపై చర్చకు నాంది పలకాలన్నారు. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ, స్థానిక ఎన్నికలకు వేర్వేరు ఓటింగ్ కార్డులు అవసరం లేదని తెలిపారు. ఓటరు కార్డులను క్రమబద్ధీకరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. లోక్‌సభ, విధానసభ, ఇతర ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను మాత్రమే ఉపయోగించాలని, ఈ జాబితాల తయారీకి ఎందుకు సమయం, నిధులు వృథా చేస్తున్నామని మోదీ ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ను కీలకంగా పొందుపరిచింది. ఈ అంశంపై మోదీ ఇప్పటికే అనేకసార్లు ప్రసంగించారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’పై చర్చించేందుకు గతేడాది జూన్‌లో ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది కీలక నాయకులు హాజరుకాకపోవడంతో ఈ విషయంపై చర్చ సరిగ్గా జరగలేదు. 1970ల్లో అత్యవసర పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ, అధికారాన్ని వేరు చేసేందుకు జరిగిన ప్రయత్నానికి సమాధానం, రాజ్యాంగం నుంచే వచ్చిందని మోదీ అన్నారు. అయితే, ఆ సందర్భం నుంచి శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు ఎన్నో కీలకాంశాలను నేర్చుకొని మరింత బలపడ్డాయని తెలిపారు. ఈ మూడు వ్యవస్థలపై 130 కోట్ల మంది భారతీయులకు ఉన్న విశ్వాసం కారణంగానే ఇది సాధ్యమైందని, ఈ విశ్వాసం మారుతున్న సమయానికి అనుగుణంగా మరింత బలపడిందని ప్రధాని తెలిపారు. మన రాజ్యాంగం అందించిన బలం కష్ట సమయంలోనూ సాయ పడుతుందని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రాజెక్టులను పెండింగ్‌లో ఉంచే ధోరణికి వ్యతిరేకంగా ముందుకు సాగాలని ప్రధాని హెచ్చరించారు. దేశంలో చట్టాల భాష మరింత సరళంగా, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. దీని ద్వారా ప్రజలు ప్రతి చట్టంతో ప్రత్యక్ష సంబం«ధాన్ని పొందగలుగుతారని తెలిపారు. వాడుకలో లేని చట్టాలను తొలగించే ప్రక్రియ సరళంగా ఉండాలని, పాత చట్టాలను సవరించేటప్పుడు వాటిని రద్దు చేసే వ్యవస్థ స్వయంచాలకంగా ఉండాలని ప్రధాని సూచించారు. నో యువర్ కస్టమర్(కేవైసీ)ని కార్పొరేట్ సంస్థల్లో వినియోగించుకున్నట్లే ప్రతి పౌరుడికీ మన రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు నో యువర్ కాన్స్టిట్యూషన్(కేవైసీ) అవసరమన్నారు. బాధ్యతలు తెలుసుకుని మసలుకునే వారికి హక్కులు కూడా వాటంతటవే సమకూరుతాయన్నారు. కోవిడ్ నేపథ్యంలో బిహార్‌లో ఎన్నికలు సజావుగా నిర్వహించడాన్ని మోదీ ప్రశంసించారు. ముంబై దాడి గాయాన్ని దేశం మరువదు 12 ఏళ్ల క్రితం ఇదే రోజు జరిగిన 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళాలకు ఈ సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. ‘ఇదే రోజు 2008లో దేశంపై అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. అనేక దేశాలకు చెందిన వారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ నా నివాళులు. ముంబై దాడులతో ఏర్పడిన గాయాలను దేశం ఎన్నటికీ మరువదు. ఉగ్రవాదులపై జరిగిన పోరులో ప్రాణాలర్పించిన జవాన్లకు ఘన నివాళులు’అని అన్నారు. మోదీ, కొత్త పంథాలో దేశం ఉగ్రవాదంపై పోరాడుతోందని తెలిపారు. ఉగ్ర పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్న భద్రతా బలగాలను ఆయన ప్రశంసించారు. -
‘పరిమితం’.. దేశహితం
ఎర్రకోటలో ఆరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం జనాభా పెరిగితే రాబోయే తరాలకు లెక్కలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలూ చర్యలు చేపట్టాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. ఇప్పటికే దేశంలో కొంత భాగం ప్రజలు చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. దీన్ని అనేక మంది వ్యతిరేకించినా.. దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు. కశ్మీరీల కలలకు రెక్కలు జమ్మూకశ్మీర్ అంశంలో కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయించదు. ‘సీడీఎస్’ రూపకల్పన.. త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి సైనిక, వాయుసేన, నౌకాదళానికి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది. దేశంలోనే విహారం ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవం వచ్చే నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీంతో దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం అభివృద్ధి చెందుతుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ఒక దేశం, ఒక ఎన్నిక అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి. న్యూఢిల్లీ దేశం ఎదుర్కొంటున్న వేలాది సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడు భారత్‌కు ఎంతో బలమైన ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి వరుసగా ఆరోసారి, 73వ స్వాతంత్య్ర దినోత్సవాన ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. రంగురంగుల తలపాగాతో గురువారం వేదిక మీదకు వచ్చిన మోదీ.. త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఆ మూడింటికీ కలిపి కొత్తగా ఒక అధిపతిని (చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్ – సీడీఎస్) నియమించడం, దేశంలో జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడం, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం తదితర అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం రాబోయే కొన్నేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లను ఖర్చు చేయనుందని మోదీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న నేపథ్యంలో, రాబోయే ఐదేళ్లలో ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల రంగంలో పెట్టి, ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ వెల్లడించారు. ఒక దేశం, ఒకే కార్డు వ్యవస్థతో ఒకే కార్డుతో దేశంలో ఎక్కడైనా ప్రయాణాలకు చెల్లింపులు చేసే వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దాదాపు 95 నిమిషాల పాటు, సుదీర్ఘంగా సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... జనాభాను నియంత్రించాల్సిందే.. ‘జనాభా పెరిగితే రాబోయే తరాల వారికి లెక్కపెట్టలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశం నేరుగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటైన జనాభా విస్ఫోటన సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన సమయం వచ్చింది. కుటుంబాలు చిన్నగా ఉండాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. వారి ఇళ్లతోపాటు మొత్తంగా దేశం కూడా సంతోషంగా ఉండదు. ఇప్పటికే దేశంలో కొంత భాగం మంది ప్రజలు జనాభాను తగ్గించుకుని, చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. ఈ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించినా సరే, దేశ, ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు’. ‘సీడీఎస్’విధివిధానాలను రూపొందిస్తున్నాం ‘త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి ఆర్మీ, వాయుసేన, నౌకాదళం.. మూడింటికి కలిపి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది’అని మోదీ చెప్పారు. ప్రస్తుత విధానంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం మూడు సేనల చీఫ్‌ల కమిటీ (చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ–సీవోఎస్సీ) ఉంది. ఆ ముగ్గురు అధిపతుల్లో ఎవరు అత్యంత సీనియర్ అయితే వారు సీవోఎస్సీ చైర్మన్‌గా ఉంటారు. కొత్తగా నియమితులయ్యే సీడీఎస్ త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం కృషి చేయడంతోపాటు ప్రధాని, రక్షణ మంత్రులకు సైనిక సలహాదారుగానూ ఉంటారు. కశ్మీరీల కలలకు కొత్త రెక్కలు ఇవ్వాలి ‘జమ్మూ కశ్మీర్ అంశంలో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం, భావం లేదు. కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయిం చదు. ఆర్టికల్ 370పై గత 70 ఏళ్లలో చేయలేని దానిని మేము ఇప్పుడు చేసి చూపించాం’ దేశంలోనే విహారయాత్రలకు వెళ్లండి.. ‘ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 2022 నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీనివల్ల దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం విదేశాల్లో మాదిరిగా దేశంలోని పర్యాటక కేంద్రాల్లో చాలా మంచి హోటళ్లు ఉండకపోవచ్చు. కానీ, ప్రజలు వెళ్లడం మొదలుపెడితే వాటంతట అవే వస్తాయి. దేశం గొప్పగా మారాలంటే తప్పదు.. ‘దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి’అని మోదీ అన్నారు. అయితే రాజ్యాంగం మార్చకుండానే జమిలి ఎన్నికలు అసాధ్యమని న్యాయ కమిషన్ గతేడాది ఆగస్టులోనే తేల్చి చెప్పడం తెలిసిందే. ఆరేళ్లు.. ఆరు తలపాగాలు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలప్పుడు ప్రసంగం చేసే సమయంలో వైవిధ్యమైన తలపాగాలు ధరించడం మోదీ ప్రత్యేకత. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రసంగం చేసే సమయంలోనూ మోదీ ఆ ప్రత్యేకతను చాటుకున్నారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, సగం వరకే చేతులున్న తెల్ల కుర్తా, పైజామా, కాషాయ రంగు అంచులున్న కండువాను ధరించి మోదీ వేదికపైకి వచ్చారు. 2014లో తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రసంగించినప్పుడు మోదీ తల భాగం ఎర్రగా, తోక భాగం ఆకుపచ్చ జోధ్‌పురీ తలపాగా పెట్టుకున్నారు. 2015లో పసుపు రంగు వస్త్రంపై ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగు గీతలున్న తలపాగాను, 2016లో పసుపు, గులాబీ రంగు తలపాగాను మోదీ ధరించారు. 2017లో దట్టమైన ఎరుపు, పసుపు రంగులపై బంగారు వర్ణం గీతలున్న తలపాగాను, 2018లో కాషాయ తలపాగాతో మోదీ ఎర్రకోటపైకి వచ్చారు. ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ఎర్రకోటలో ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. మోదీ ఎర్రకోటకు చేరుకుని తిరిగి వెళ్లే వరకూ కార్యక్రమం జరిగిన తీరు ఇలా... ► చారిత్రక కోట వద్దకు ప్రధాని చేరుకోగానే సందర్శకులంతా లేచి నిలబడ్డారు. ► కార్యక్రమానికి నరేంద్ర మోదీ తెల్లని పైజామా–కుర్తా, రాజస్తానీ తరహా రంగురంగుల తలపాగా ధరించి వచ్చారు. ► రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మోదీకి స్వాగతం పలికారు. ► తర్వాత మోదీ ఇంటర్ సర్వీసెస్, పోలీస్గార్డ్ల వందనం స్వీకరించారు ► అనంతరం ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ► తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి 95 నిమిషాల పాటు ప్రసంగించారు. వరుసగా ఆరోసారి బుల్లెట్ ప్రూఫ్ పోడియం రక్షణ లేకుండా ప్రసంగించారు. ► ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, రమేశ్ పోఖ్రియాల్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, బి.ఎస్. ధనోవా, కర్మబీర్ సింగ్ హాజరయ్యారు. ► ఎర్రకోట ముందు వేలాది మంది పాఠశాల పిల్లలు ’నయా భారత్’ అనే హిందీ అక్షరాల ఆకారంలో నిలబడ్డారు. ► తెల్లవారుజామున కురిసిన వర్షం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. అమరవీరులకు సలాం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమర్‌జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్ వందనం ఆసేతు హిమాచలం జమ్మూలో జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అలరించిన పాఠశాల విద్యార్థుల ప్రదర్శన భారీ త్రివర్ణం ముంబైలోని హిరానందాని గార్డెన్స్‌లో భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న ప్రజలు తల్లీ భారతి వందనం మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జెండా వందనం చేస్తున్న నటి ఊర్మిళ మతోండ్కర్ -
ఒకే రాజ్యాంగం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక నిజమేనా?
ఒకే దేశం ఒకే రాజ్యాం గం, ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక అని లాల్‌ఖిలా నుంచి ప్రధాని నినదించారు. ఒకే దేశం. మనది రాష్ట్రాల సమూహం, రాజ్యాల సంఘం. భిన్నత్వంలో ఏకత్వం మన లక్షణం కాని, వైవి ధ్యంలేని ఏకత్వం కాదు. మనమంతా ఒకటి కాదు అంటే నమ్మడం కష్టం కానీ.. విడివిడి సంస్కృతులు, భాషలతో జీవించే విభిన్న జీవన స్రవంతులన్నీ కలిసి ఒక దేశంగా ఉన్నాయనే వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం అవసరం. మన రాజ్యాంగం ఒకటే, మన ఐపీసీ ఒకటే, మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా ఒకటే కానీ, రాష్ట్రాలకు సంబంధించి నంత వరకు కొన్ని సవరణలు చేసుకునే అధికారాలు, చట్టాలు చేసుకునే స్వతంత్రత రాష్ట్రాలకు ఉన్నాయి. ప్రముఖ న్యాయశాస్త్రవేత్త ఉపేంద్ర బక్షీ, మనకు మూడు రాజ్యాంగాలు ఉన్నాయంటారు. ఒకటి 1950లో మనం రాసుకున్నది. మరొకటి వంద సవరణల ద్వారా మనం మార్చుకున్నది. మూడోది మన నియమాలు, సవరణల అసలు స్వరూపం ఏమిటో చెప్పే సుప్రీంకోర్టు తీర్పులలో వ్యక్తమైంది. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంది. అయినా ఆదేశం ఒకటి కాదనగలరా? అనేక రాజ్యాలు, చట్టాలు, సంప్రదాయాలు ఉండడం అవలక్షణం కాదు, అవసరమైన వైవిధ్య లక్షణం. ఇక ఒకదేశం ఒక పన్ను. పన్నులు కట్టేవాడికి తెలుస్తుంది ఎన్నిరకాల పన్నులు కడుతున్నాడో. అసలు ఒకే పన్ను అనే మాట ఒక ఫన్. ఒక పరి హాసం, ఒక అవాస్తవం. జీఎస్టీలే రెండు రకాలు, ఒకటి కేంద్రానిది మరొకటి రాష్ట్రానిది. అది కూడా అన్నిటికీ ఒకే రేటు కాదు. నానా రేట్లు ఉన్నాయి. ఆదాయం పన్ను, సంపద పన్ను, శిస్తులు వంటివి జీఎస్టీ కాకుండా, ముందునుంచే ఉన్నాయని అందరికీ తెలుసు. మరో చోద్యం, వింత ఏమిటంటే.. ఒకే దేశం, ఒకే ఎన్నిక. జమ్మూ కశ్మీర్లో శాసనసభకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నిక జరిపించడానికి అసలు ఏ అడ్డూ లేదు. రాజకీయ ప్రయోజనాలమీద ఆశలే ఎన్నికల్ని నిర్ణయిస్తాయి. ఆ ‘‘ఒకే ఎన్నిక’’ను జరపలేక చతికిలపడిన వారిదే ఈ నినాదం. కాంగ్రెస్ ప్రభుత్వాలు 356వ అధికరణాన్ని, అందులో లభించే అత్యవసర అధికారాన్ని అకారణంగా, అక్రమ కారణంగా 90 సార్లకు పైగా దుర్వినియోగం వల్ల ఒకే ఎన్నికలు జరపడం సాధ్యం కాలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత 356 అధికరణాన్ని దుర్వినియోగం చేయడంలో పద్ధతులు, ప్రయత్నాలు, వ్యూహాలు మారాయి. టోకు ఫిరాయింపులు చేయించే ధనవ్యాపార రాజకీయం విజృంభిస్తున్నది. మూడింట రెండు వంతుల మంది సభ్యులు లేకపోతే, ఎంఎల్యేలను కొని, ఫైవ్‌స్టార్ హోటళ్లలో స్టాక్‌గా పారేస్తారు. ప్రభుత్వాలను పడగొట్టి, గద్దెనెక్కుతారు. వీలుకాకపోతే గందరగోళం సృష్టించి ఓటింగ్‌లో గెలిచి ప్రభుత్వాన్నో ప్రతిపక్షాన్నో కొని పడేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోతే సర్కారును రద్దు చేస్తారు. అనుకూలంగా ఉంటే తమ పార్టీ తీర్థం పుచ్చుకోమంటారు. తెలంగాణ, ఆంధ్ర మరికొన్ని రాష్ట్రాలలో జమిలి ఎన్నికలు సహజంగా జరిగేవి. తెలంగాణ ఎన్నికలను ముందుకు జరిపిందెవరు? అప్పుడు ఒకే ఎన్నిక విధానం ఏమైంది? ఆర్నెల్లలోనే రెండు ఎన్నికలకు రాష్ట్రం ఎందుకు సమాయత్తం కావలసి వచ్చింది? కాలం, చట్టం, ఆచారం అనుకూలంగా ఉన్నా ఒకే రాష్ట్రం రెండు ఎన్నికలను కనీసం రెండు రాష్ట్రాలలో అమలు చేయలేని ప్రభుత్వం దారి ఏమిటో దాని శుధ్ధి బుద్ధి ఏమిటో? అత్యధిక రాష్ట్రాలలో పాలిస్తున్న బీజేపీ, వేరే పార్టీల అధీనంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్రాన్ని కాదని వ్యతిరేకించే ధైర్యమున్న ముఖ్యమంత్రులు తక్కువే. మూడింట రెండు వంతుల ఆధిక్యతతో, సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం పొందడం కూడా ఇప్పుడున్న పరిస్థితులతో కష్టం కాదని రుజువైంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి 2024 ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేం కాదు. కానీ నిర్వహిస్తారా? తమకు గెలిచే అవకాశం ఉందనుకుంటేనే జరుగుతాయా? రాష్ట్రంలో లోక్‌సభకు, శాసనసభకు ఒకే ఎన్నిక జరిపించడానికి అడ్డొచ్చిన అవసరాలే జమిలి ఎన్నికలకూ ఏర్పడతాయి.నినాదాలు చేయడంవేరు, విధానాలు రచిం చడం వేరు. విధానాలను సక్రమంగా రచించడం కోసమే సంవిధానం ఉంది. సంవిధానాన్ని కాదనుకుంటే, లేదనుకుంటే, ఉన్నా అది వేరు పాలన వేరు అనుకుంటే వారికి ఏదీ చెప్పడం సాధ్యం కాదు. స్వేచ్ఛగా వ్యవహరించి, శాస్త్రీయంగా ఆలోచించి, సహేతుకంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, ధైర్యంగా చెప్పగలవాళ్లుంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. మూఢంగా నమ్మడం మతంలో కుదురుతుందేమో కానీ సమాజంలో, రాజకీయంలో సాగించకూడదు. అభివృద్ధిని అవసరమైన వస్తువులాగా చూపి, టెర్రరిజం ప్రమాదాన్ని భయానక వాతావరణం కల్పించడానికి అనువుగా వాడుకుని, స్వతంత్రతను, స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, అధికార వికేంద్రీకరణను దెబ్బతీస్తూ ఉంటే మౌనంగా ఉండడం నేరమవుతుంది. మోదీ వల్ల ప్రజాస్వామ్యానికి వచ్చే ప్రమాదం కన్నా గుడ్డిగా ఆమోదించేవారి వల్ల ప్రమాదం ఎక్కువ. అయితే ఎవరేమన్నా, అనుకున్నా, తిట్టినా లైక్ చేయకపోయినా, నిజానిజాలను హేతుబద్ధంగా విశ్లేషించడం రాజ్యాంగ విధి, చట్టపరమైన బాధ్యత, నైతిక బాధ్యత, దేశ భక్తుల బాధ్యత. భయపడకండి, ధైర్యంగా విమర్శించండి, ఆ విమర్శల జడివానలకు బ్రిటిష్ పాలకులే పారిపోయారు. విమర్శాస్త్రం ముందు స్వార్థపర అవకాశ వాద రాజకీయులేం నిలబడతారు? స్వాతంత్య్ర దినోత్సవంలో దినం కాదు ప్రధానం, ఉత్సవం అంతకన్నా ప్రధానం కాదు. స్వతంత్రం ప్రధానం. దినాలు, ఉత్సవాలు మనకు స్వాతంత్య్రాన్ని గుర్తు చేయాలి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. ఒకే నేత!
రాజ్యాంగం దేశ పౌరులకు హామీ పడిన సప్త స్వాతంత్య్రాలను, భిన్నాభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛ సహా పత్రికా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ద్వారా పౌర స్వేచ్ఛను కుదించడాన్ని నియంతృత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక సంప్రదాయంగా పేర్కొన్న రాజ్యాంగ వ్యవస్థలను నీరుకార్చే దిశగా పాలకవర్గాలు వేగవంతంగా కదలబారుతున్నాయి. 2019లో లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికల పేరిట నరేంద్ర మోదీ – అమిత్ షాల నాయకత్వంలో నిర్వహించిన ఎన్నికలను శ్రద్ధగా పరిశీలించేవారికి – రానున్న రోజుల్లో, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వ్యూహాన్ని అమలు జరిపే ఉద్దేశం మోదీకి ఉందని అర్థమవుతుంది. తద్వారా 72 ఏళ్లనాడు భారత ప్రజలు అశేష త్యాగాలతో రూపొందించుకున్న గణ (జన)తంత్ర రిపబ్లిక్ వ్యవస్థ రూపురేఖలనే మార్చి ‘‘హిందూ రిపబ్లిక్’’ రాజ్యాంగ చట్టంతో బలవంతంగా ముందుకు నెట్టుకుపోయే సూచనలు కన్పిస్తున్నాయి. ‘‘ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే ప్రధాని మోదీ నినాదం, ప్రతిపాదన బహుళ రాష్ట్రాలతో కూడిన ఫెడరల్ (సమాఖ్య) రాజ్యాంగ స్ఫూర్తినే నాశనం చేస్తుంది. అలాంటి చట్రం భిన్న దృక్పథాలతో కూడిన ప్రాంతీయ రాజకీయ పక్షా లను సమాఖ్య స్ఫూర్తినుంచి గెంటేయడానికి దారితీస్తుంది. మోదీ ప్రతి పాదన స్వభావంతోనే ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది’’ – ప్రజాస్వామ్య సంస్కరణల సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు జగదీష్ చొక్కార్, రాజ్యసభ డీఎంకే సీనియర్ సభ్యుడు తిరుచి శివ ఇంటర్వూ్య (హిందూ 28–06–2019) ‘‘దేశంలో అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాయి. అలా జరిగిన చోటే మళ్లీ జనంలో విశ్వాసం కూడగట్టే ప్రయత్నం జరగాలి. ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయిన ప్రభుత్వాలు కొత్త తరహా ప్రచారయంత్రాంగాన్ని ఎంచు కుని ముందుకు సాగుతున్నాయి. ప్రశ్నించే గొంతును నులిమేసే ఉద్దేశం తోనే ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. కేంద్రంలో మోదీ ఏం చేస్తున్నారో, రాష్ట్రాల్లో కొందరు ముఖ్యమంత్రులూ అవే చర్యలకు దిగు తున్నారు. భారతదేశం విభిన్న సంస్కృతులకు కేంద్రం కానీ బీజేపీ ప్రభుత్వం దేశమంతా ఒకే సంస్కృతిని రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. బహుపరాక్’’ – ప్రముఖ సామాజిక కార్యకర్త స్వరాజ్ అభియాన్ పార్టీ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ (14–07–2019) ఇటీవల దేశంలో ఎన్నికలు జరిగిన తీరు 2019లో లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికల పేరిట నరేంద్ర మోదీ–అమిత్ షాల నాయకత్వంలో నిర్వహించిన ఎన్నికలను శ్రద్ధగా పరిశీలించేవారికి – రానున్న రోజుల్లో, అనతికాలంలోనే రాబోయే పరిణామాలకు సూచీగా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వ్యూహాన్ని అమలు జరిపే ఉద్దేశం మోదీకి ఉందని అర్థమవుతుంది, తద్వారా 72 ఏళ్లనాడు భారత ప్రజలు అశేషత్యాగాలతో రూపొందించుకున్న గణ (జన)తంత్ర రిపబ్లిక్ వ్యవస్థ రూపురేఖలనే మార్చి ‘హిందూ రిపబ్లిక్’ రాజ్యాంగ చట్టంతో బలవంతంగా ముందుకు నెట్టుకుపోయే సూచనలు కన్పిస్తున్నాయి. ఇందుకు వివిధ మార్గాల్లో వ్యూహాలతో, సమీకరణాలతో పదవుల ఎర చూపి ప్రతిపక్షాలను చీల్చి ముక్కలు చేసి తాను పెంచుకున్న లోక్‌సభ, కొన్ని అసెంబ్లీలలో పెంచు కున్న కృత్రిమ బలం ద్వారా– 2019 తర్వాత 2024 నాటికి అసలు ఎన్ని కలు అంటూ ఉండకపోవచ్చు! కారణం? తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తా మన్న ధీమా బీజేపీ నాయకత్వంలో కొరవడటమే అయివుండాలి. ఈ పరిణామాన్ని సూచనప్రాయంగా 2019 ఎన్నికల సమయంలోనే బీజేపీ సీనియర్ నేతలలో ఒకరైన సాక్షీ మహరాజ్ ‘2019 ఎన్నికల తర్వాత ఇక దేశంలో ఎన్నికలు ఉండకపోవచ్చు’నని బాహాటంగా ముందస్తు హెచ్చరి కగా ప్రకటించనే ప్రకటించాడని మరవరాదు! కాంగ్రెస్‌లో, దేశ ప్రతిపక్షా లలో ఎన్నడూ ప్రజలు చూడనంత అనైక్యతకు కారణం – సిద్ధాంత ప్రాతిపదిక లేకపోవడం, ఎన్డీఏకు దీటైన సమీ కరణ కొరవడటం, సైద్ధాంతికంగానైనా ఒకటిగా ఉండవలసిన వామపక్షాలు నిరంతర చీలు బాటలలో ప్రయాణించడం– బీజేపీకి, మోదీకి అప్పనంగా కలిసొచ్చిన నెగటివ్ గాలి! ఆ ‘గాలే’ ప్రతిపక్షాలకు ఎదురుగాలిగా పరిణమించింది. దేశ ఆర్థిక విధాన రూపకల్పనలో కీలక పాత్ర వహించవలసిన బ్యాంకింగ్ వ్యవస్థ రిజర్వ్ బ్యాంకు ప్రతిపత్తిని దిగజార్చడం ద్వారా దానిస్థానే బీజేపీ పాలకులే బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణను చేతుల్లోకి తీసుకుని రిజర్వ్ బ్యాంకు విధానాలను తారుమారు చేసి, నోట్ల రద్దు, కార్యక్రమాన్ని ఆర్బీఐ సలహాలను కాలదన్ని మరీ ప్రవేశపెట్టారు. ఫలితంగా పేద మధ్యతరగతి రైతాంగ, వ్యవసాయం కార్మిక, చేతి వృత్తుల వారికి బ్యాంకుల వద్ద పరపతి పుట్టకుండా పోయింది. తీరా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పేరిట జరిగిన నోట్లరద్దు కార్యక్రమం వల్ల 125 మంది బ్యాంకుల వద్ద కుప్పకూలి చని పోయారు. అయినా మోదీ ఆ 125 మృతుల సంఖ్యను ఉపేక్షిస్తూ, ‘125 కోట్లమంది ప్రజలు నోట్ల రద్దు చర్యను సమర్థించార’ని గొప్పలు చెప్పుకున్నా జనం ఉలకలేదు, పలకలేదు! దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్య, పేద, మధ్యతరగతి, విభిన్న దళిత వర్గాలకు ఆర్థిక విధానాల వల్ల కలిగిన కష్టనష్టాలకు ఎలాంటి సవరణలు మోదీ పెట్టకపోయినా, వారు భరించి పడి ఉండటానికి మరో కారణం–ప్రతిపక్షాల చెండితనమూ, బహుశా దేశ పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూప స్వభావాలను ఇప్పటికైనా అర్థం చేసుకుని వ్యూహరచన చేసుకోవడంలో విఫలం కావడమూ. చివరికి రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు ఒక్కరొక్కరుగా ముగ్గురు, నలుగురు మోదీ పాలన ప్రారంభమైన రోజుల నుంచి రెండవసారి పాలన మొదలైన నాటి దాకా గవర్నర్ పదవులు వదులుకుని పోవలసిన దుర్గతి పట్టింది. అయినా మన ప్రజాస్వామ్యం (బ్రాండ్ ఏదైనా) వర్ధిల్లుతూనే ఉంది. అంతేకాదు, ఎన్ని లోటుపాట్లున్నా స్వాతంత్య్రానంతర దశలో దేశ ఆర్థిక వ్యవస్థను పెట్టుబడి వ్యవస్థ మధ్యనే ప్రజాహితం చేయడానికి ప్రభుత్వ రంగానికి వెన్నుదన్నుగా ఉన్న ప్రణాళికా సంఘాన్ని మోదీ రద్దు చేసి, ముక్కూ ముఖం లేని, ఉన్నా ప్రజల అనుభవంలోకి రాని నీతి ఆయోగ్ సంస్థను ఏర్పాటు చేస్తే అదీ అవినీతి విధానాల కేంద్రంగా మారింది. బహుశా మోదీ ఏకపక్ష విధానాలతో పొసగకనే ఆ సంస్థ నుంచి కూడా అయిదేళ్లలో ముగ్గురు ఉన్నతాధికారులు జారుకోవలసి వచ్చింది. ఇలాంటి పరిణామం గత 72 ఏళ్ల దేశ స్వాతంత్య్ర చరిత్రలో జరగలేదు. అయినా మనలో చలనం లేదు! పైగా, మరోవైపున రిపబ్లిక్ రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా– పార్లమెంటరీ విభాగాలు, న్యాయ, శాసన వేదికల స్వతంత్ర ప్రతిపత్తులను కోల్పోతున్నాయి. న్యాయ వ్యవస్థ నిర్వహణలో జోక్యం నానాటికి పెరిగిపోయింది. కేంద్ర పాలకుల జోక్యం ఎంతవరకు పాకిందంటే– సొంత పార్టీ (బీజేపీ) అగ్రనేతలలో ఒకరికి తన మాట వినని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి హత్య కేసుతో సంబంధముం దన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తినా సుప్రీం ధర్మాసనం ముందుకు ఆ కేసు వచ్చినా, చివరికి ఆ నేతను కేసునుంచి తప్పించాల్సి వచ్చింది. దేశ ‘ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో రూ. 340 లక్షల కోట్ల (5 లక్షల కోట్ల డాలర్లు) స్థాయికి పెంచేస్తామని’ ప్రకటించారు. కాని గడచిన ఐదేళ్లలో వృద్ధి 7.5 శాతం నుంచి 5–6 శాతానికి ఎందుకు పడిపోయిందో మాత్రం చెప్పరు. అంతేగాదు పారిశ్రామిక, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల, నోట్ల ముమ్మరం) గణాంకాలు కూడా మనకన్నా ప్రపంచ గణాంక సంస్థలే తరచుగా ముందు ప్రకటిస్తుంటాయి. ‘మరిన్ని పెట్టుబడులు వస్తేనే’ మన ఆర్థిక వ్యవస్థకు ఊపూ, ఊతం అని ఆర్థిక మంత్రి నిర్మలమ్మే చెబుతున్నారంటే నమ్మాల్సిందేనట. ఇక ‘సంస్కరణ’ల పేరిట కార్మిక సంఘాలకు, లేబర్ మార్కెట్‌కు రానున్న కష్టాలనూ ఊహించుకోవచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే– గతంలోకన్నా బీజేపీ హయాంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు దేశ సంపదను తరలించుకుపోవడానికీ పెద్ద పీటలు వేయబోతున్నారు. మోదీ తొలి హయాంలోనే దేశంలో నిరుద్యోగం గత 45 ఏళ్లలో లేనంతగా పెరిగిపోయిందని ‘బిజినెస్ స్టాండర్డ్’ వెల్లడిస్తోంది. మరో మాటగా చెప్పాలంటే 1972–75తో పోల్చితే నిరు ద్యోగం 6.1 శాతం పెరిగింది. అంతేగాదు, భారత ప్రజలు, ప్రతిపక్షాల చేతగానితనంవల్ల ఎంతగా అవమానాలు భరించవలసి వస్తోందంటే ‘ఉద్యోగాల కోసం వేచిఉంటే, బజ్జీలు అమ్ముకోండి’ అని మోదీ ఇటీ వలనే వ్యాఖ్యానించినా గానీ మనం ‘మన్నుతిన్న పింజారుల’ల్లే పడి ఉండటానికి అలవాటు పడ్డాం. అయినా, రాజ్యాంగం దేశ పౌరులకు హామీ పడిన సప్త స్వాతం త్య్రాలను, భిన్నాభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛ సహా పత్రికా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ద్వారా పౌర స్వేచ్ఛను కుదించడాన్ని నియంతృత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక సంప్రదాయంగా పేర్కొన్న రాజ్యాంగ వ్యవస్థలను నీరుకార్చే దిశగా పాలకవర్గాలు వేగవంతంగా కదలబారుతున్నాయి. కొందరు న్యాయ మూర్తులలో కొన్ని బలహీనతల ఆధారంగా పాలకుల తమ నిర్ణయాలకు అనుకూలంగా ముద్ర వేయిం చుకోడానికి జరిగిన ప్రయత్నాలు చరిత్రకు తెలుసు. ప్రజాస్వామ్య సంస్కృతికి ప్రతిబింబాలుగా ఉన్న కల్బుర్గి, పన్సారే లాంటి విద్యాధికుల్ని లంకేష్, వరవరరావు లాంటి సామాజిక కార్యకర్త లపై దారుణ నిర్బంధ విధానాన్ని పాలకులు కొనసాగిస్తూనే ఉన్నారు. దళిత, పేద, బలహీన వర్గాల, మైనారిటీల సమైక్య భావనకు గండి కొడు తూనే గత ఐదేళ్ల పాలనలో బీజేపీ ‘గోసంరక్షణ’ ముసుగులో 69 మంది హత్యలకు బలైనారని ప్రజాస్వామ్య ఉద్యమ పరిరక్షణా జాతీయ సంస్థ ప్రకటించింది. రఫేల్ సంస్థ పంపిన ముడుపులపై ఎవరూ నోరెత్తకుండా ఉండటానికి, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌పై ఆరోపణలను కోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేసినందుకు సుప్రీంకోర్టు సుప్రసిద్ధ న్యాయ వాది ఇందిరా జైసింగ్, తీస్తా నెతల్‌వాడ్‌లపై కేసులో ఆమెను సమర్థిం చినందుకు ఇందిర భర్త ఆనంద్ గోవ్రర్ ఇళ్లపై సీబీఐచే కేంద్రం దాడులు జరిపించింది. పోలీసులు, ప్రాసిక్యూటర్లు, విచారణ సంస్థలు మూకుమ్మ డిగా పౌరహక్కుల్ని కాలరాస్తుంటే నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుండే ఉదా హరణలు ఎన్నో, ఎన్నెన్నో’’. ఈ విపరిణామం– మన దేశ ప్రజలకు సహితం ఒక హెచ్చరికగా భావించాలి, రేపటి కోసం! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
జమిలి పోరాటాలు నేటి అవసరం
ఇప్పుడు దేశాన్ని చుట్టుముడుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తగ్గిన తలసరి ఆదాయం, అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటి అన్ని కీలక సమస్యలను గాలికి వదిలేసి లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టడం అనే అంశమే అతి ప్రధాన సమస్య అయినట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ, భారత్‌కి ఇప్పుడు కావలసింది మౌలిక సమస్యలపై జమిలి పోరాటాలే తప్ప జమిలి ఎన్నికలు కావని గ్రహించాలి. అలాగే ఏపీలో సాధారణ ప్రజానీకం తరపున పేదలకు అండగా సామాజిక న్యాయం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపర్చేందుకు ప్రగతిశీల శక్తులు సిద్ధంకావాలి. ఇటీవలనే జమిలి (లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి) ఎన్నికల అంశాన్ని, అది మన దేశ ప్రజలముందున్న అతి తీవ్రమైన, తక్షణం పరిష్కరించవలసిన సమస్య అయినట్లూ.. దానిముందు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తగ్గిన తలసరి ఆదాయం, అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటివి చాలా చిన్న సమస్యలైనట్లు, ముందుకు తెచ్చి దానిపై చర్చించేందుకు ఎన్టీయే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇక్కడో చిన్న మెలిక ఉంది. బీజేపీ ప్రభుత్వం ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అన్న అంశాన్ని ఎజెండాగా చేసింది. ఇది ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న అర్థంలో మన తెలుగు మీడియాలోకి వచ్చి చర్చలు జరిగాయి. నిజానికి దీని అసలు అనువాదం ‘ఒకేజాతి, ఒకే ఎన్నికలు’ అని చెప్పుకోవాలి. జాతి–దేశం సమానార్థకాలు కావు. భౌగోళికంగా సారూప్యత, ఒకే విధమైన వాతావరణం, ఆర్థిక నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలు అన్నింటినీ మించి ఒకే భాష కలిగిన ప్రజాసమూహాన్ని జాతి అంటాము. నిజానికి ఈ దేశంలో రాష్ట్రపతి గానీ, ప్రధాని గానీ, తమ మాతృభాషలో ప్రసంగిస్తే, మన దేశ జనాభాలో సగంమందికి అర్థం కాదు. అంటే ఒకే భాష ‘జాతి’కి ఒక సామాన్య అంశం. ఉదాహరణకు, మనది తెలుగుజాతి, అలాగే ద్రవిడ, మరాఠా, పంజాబీ, గుజరాతీ ఇలా మనదేశంలో వివిధ జాతులున్నాయి. మన జాతీయ గీతం జనగణమనలో కూడా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా అని మన దేశం వివిధ జాతుల సముదాయం అనే రాశారు. నా భారతదేశం జిందాబాద్, మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని సగర్వంగా నేను నినదిస్తాను. ఇలా ఒక దేశంలో ఎన్నో జాతులున్నట్లే, ఒకేజాతి ఎన్నో దేశాలలో ఉండవచ్చు. మన దేశ స్వాతంత్య్రోద్యమంలో, వివిధ జాతుల ప్రజానీకమూ, పరాయి, వలస బ్రిటిష్ దుర్మార్గ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా, తమ తమ పోరాటాలు సాగించారు. మన అల్లూరి, కొమరం భీం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, తమిళులకు వీరపాండ్య కట్టబొమ్మన, మరాఠాలకు శివాజీ, కన్నడిగులకు టిప్పుసుల్తాన్, ఇలా స్వాతంత్య్రం కోసం పోరాడిన వివిధ జాతుల వీరులెందరో ఉన్నారు. అయినా రాజకీయంగా, కాంగ్రెస్ పార్టీ గాంధీజీ నాయకత్వాన దేశవ్యాపితంగా ప్రధానమైన పాత్ర పోషించిందనడం నిర్వివాదం! 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు, తొలి సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అనే పిలిచారు. నిజానికి భారత స్వాతంత్య్రోద్యమం ‘భారత జాతుల స్వాతంత్య్రోద్యమం’ అన్నమాట. ఈ వివిధ జాతులన్నీ బ్రిటిష్ వాడు ఏర్పర్చిన పాలనాపరమైన దేశంలాగా గాక, తమ జాతుల అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, భారతదేశంగా ఏకశిలాసదృశ్యమైన, రాజ్యాంగంగానే.. వివిధ రాష్ట్రాలుగా ఉన్న ఒక సమాఖ్య స్వరూపంగానే మన రాజ్యాంగం ఏర్పడింది. ఇప్పటికీ తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండులో జాతులు, ఉపజాతులు మన దేశంలో కళ్లముందు ఉన్న దృశ్యమే. ఇంత సువిశాల భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ సమయాలలో, ఎన్నికలు జరుగుతూ ఉండటం వలన, ఎన్నికల నియమావళి, పాలనాపరమైన ఇబ్బందులు, అధిక ధనవ్యయం, ఎప్పుడూ ఎన్నికల వాతావరణంతో అభివృద్ధి వెనకడుగు వేయడం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి రాష్ట్రాల శాసనసభలకూ, దేశ లోక్‌సభకూ ఎన్నికలు నిర్వహించడం వలన మేలు జరుగుతుందన్న భావన ఉండవచ్చు. వాస్తవానికి మన రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా అలా జమిలి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జమిలి ఎన్నికలకు సూత్రప్రాయమైన అంగీకారం తెలిపారు. తనకు అత్యంత ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పొందుపర్చవలసిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్న ఆకాంక్షను, అక్కడి అఖిలపక్ష సమావేశంలో మరోసారి వక్కాణించారు. అదీ ఆయన నిబద్ధత. వైవిధ్యభరితమైన వివిధ జాతుల ప్రత్యేకతలను బీజేపీ తృణీకరించి ప్రతిపాదించిన అఖండ భారత జాతి అన్న అవగాహనకు భిన్నంగా ‘ఒకే జాతి–ఒకే ఎన్నిక’ అంశం మరింతగా అధ్యయనం చేయాల్సి ఉంది. అందుకే ఒక కమిటీ ఏర్పాటుకు అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. అంతేకాదు. జమిలి ఎన్నికల్లో రాష్ట్ర, కేంద్ర ప్రాధాన్యతలు ఒకటి కాకపోవచ్చు. ఉదాహరణకు, మొన్నటి మన శాసనసభ ఎన్నికలలో గత వెన్నుపోట్ల పార్టీ పాలనలోని అవినీతి, అసమర్థత, కులతత్వం, నయవంచన వంటి వాటిని అంతం చేయడం.. మన రాష్ట్రానికి, ప్రత్యేక హోదాతోసహా విభజన లాభాలను సాధించడం.. ఒక నిబద్ధత గల, ప్రజానురంజక, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం ప్రధాన ఎజెండాగా వైఎస్ జగన్ నాయకత్వాన వైఎస్సార్సీపీ ఎన్నికల రంగంలోకి దిగి అద్భుత విజయాన్ని సాధించింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారికి ఈ అంశాలు పట్టలేదు. భారత జాతీయత, అఖండ భారతం అంటూ సామాజిక న్యాయసాధనను వ్యతిరేకిస్తూ మనుస్మృతి ఆధారిత, మతతత్వ నిచ్చెనమెట్ల వర్ణ(కుల) వ్యవస్థను నిలబెట్టడం ఎజెండా. అందుకే ప్రజలు, వెన్నుపోటు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేవిధంగా తిరస్కరించడమే కాక, బీజేపీ పార్టీకీ దాని భావజాలానికి రాష్ట్ర శాసనసభలో స్థానం లేకుండా చేశారు. కేవలం మాటలతోనూ, ప్రచారంతోనే కాదు.. ఆచరణలో మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా, పదహారు రోజుల పండుగ కూడా ముగియకుండానే, జగన్మోహన్రెడ్డి ఆచరణలో అడుగులు వేశారు. ఆయన పాలన ఆరంభించి అవినీతి రహిత పాలన దిశగా, నవరత్న పథకాల ఆచరణకు రూపు దిద్దుకునే రీతిలో రాష్ట్రం ముందడుగు వేయడం చూస్తున్నాం! వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థుల సంగతి ఎలా ఉండినా, దాదాపు యావదాంధ్ర ప్రజలు ఆశావహ రీతిలో అభినందించడమూ చూస్తున్నాం. ఒక్క సామాజిక న్యాయ అంశాన్నే తీసుకుందాం. ఎన్నడైనా, ఏ పార్టీ అయినా తన మంత్రివర్గ కూర్పులో అయిదుగురు దళిత, గిరిజన, మైనార్టీ, మహిళా, వెనుకబడిన కులాలవారికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి గౌరవించిందా? తన మంత్రివర్గంలో 60 శాతం సామాజిక న్యాయం అవసరమైన వారికే స్థానం కల్పించి చరిత్ర సృష్టించిన వారు ఇంతకు ముందెవరు? ఇటీవల ఒక మార్క్సిస్టు మిత్రుడు నాకు ఫోన్ చేసి, ‘మీరు జగన్‌ను సమర్థిస్తున్నట్లు వ్యాసాలు రాస్తుంటే, జగన్ ఏమైనా సోషలిజం తీసుకువస్తాడా అని అడిగాడు. కానీ సాధారణ ప్రజానుకూల పాలనదిశగా, ఇంత త్వరగా ఇంత నిబద్ధతతో జగన్ తన ప్రస్థానం ఆరంభించగలడని అనుకోలేదండీ! ఎండకన్నెరుగని జగన్మోహన్ రెడ్డి ఇలా దళితులకు, గిరిజనులకు, మహిళలకు, మైనారిటీలకు, వెనుకబడిన కులాలవారికి, ఇంత పెద్ద పీట వేస్తారని అనుకోలేదండీ’ అంటూ ఎంతో స్పందనతో మాట్లాడాడు. నిజానికి ఈ వర్ణ(కుల) వ్యవస్థను అంతం చేయడం.. ఈ దేశ ప్రజల శ్రేయస్సును కోరేవారందరి ప్రథమ కర్తవ్యం. ఆర్థిక దోపిడీకి గురవుతున్న సాధారణ శ్రామికులలో కూడా ఈ అణగారిని ప్రజానీకమే ఎక్కువ. వర్గదోపిడీని అరికట్టాలన్నా, ఈ కులవ్యవస్థను బద్దలు కొట్టకుండా మన దేశంలో అసాధ్యం. విభిన్న జాతుల సమాహారం మన భారతదేశం అని చెప్పుకున్నాం కదా! ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ జాతిలో అయినా ఈ కులవివక్ష ఉంది. అదే మన సామాన్య అంశంగా ఉందన్నదీ నిర్వివాదాంశమే. ఆంధ్రప్రదేశ్‌లో అయినా, బెంగాల్లో అయినా, ఉత్తరాది రాష్ట్రాల్లో అయినా కులవ్యవస్థ అమానవీయత మన దేశంలో సర్వేసర్వత్రా వ్యాపించింది. అత్యంత పేదరికం అనుభవిస్తున్న శ్రమజీవులూ ఈ అణగారిన కులాల్లోనే ఉన్నారు. అంతేకాదు మన జనాభాలో ఆధిపత్య కులాలవారు 20 శాతం ఉంటే మిగిలిన వారిలో అత్యధికులు సామాజిక న్యాయం పొందవలసిన అణగారిన ప్రజానీకమే. ఎక్కువమంది పేద మధ్యతరగతి ప్రజానీకం ఉండగా, కోటీశ్వరుల సంఖ్య చట్టసభల్లో పెరుగుతుండటం నిజం. ప్రజాస్వామ్యం పెంపొందే క్రమంలో అది పేద, మధ్యతరగతి ప్రజానీకానికి అనుగుణంగా మారాలి. అలాగే సామాజిక అణచివేతకు గురవుతున్న వారిలో దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్ ఉన్నది. ఇతర వెనుకబడిన కులాల వారికి, మహిళలకు, మైనారిటీలకు, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అవసరం. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం ఆధిపత్య కుల ధనస్వామ్యంగా మారకుండా ఉంటుంది. పార్లమెంటులో వైఎస్సార్ సీపీ తరపున విజయసాయిరెడ్డి.. ఇతర వెనుకబడిన కులాలవారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని, ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి, ఆ ప్రజాసమూహాల అభినందనలు అందుకున్నారు. నిజానికి ఇలాంటి బిల్లును కమ్యూనిస్టులే ఎప్పుడో పెట్టాల్సి ఉండింది. కానీ సృజనాత్మకత, సాధారణ వివేకం కనుమరుగైనట్లుగా.. ఈ కుల వ్యవస్థ నిర్మూలనకు నడుం కడితే, వర్గపోరాటం వెనకపట్టు పడుతుందని వాదిస్తున్న కమ్యూనిస్టు నేతల ఆలోచనా ధోరణి సరి కాదు. కులతత్వం మన భారతదేశంలో ఘనీభవించింది అని ఇఎంఎస్ నంబూద్రిపాద్ అన్నారు. పైగా మార్క్సిజం ప్రవచించిన నాటి ‘ప్రొలిటేరియట్స్’ నేడు బాగా తగ్గిపోతున్నారు. నేడు ట్రేడ్ యూనియన్లలో ప్రధానంగా ఆర్గనైజ్డ్ ట్రేడ్ యూనియన్లలో (రెక్కల కష్టం తప్ప మరేమీ లేనివారు), బ్యాంకింగ్ రంగంలో, తదితర పరిశ్రమల్లో ఉన్న వారిలో అత్యధికులు మధ్యతరగతివారు. వారు ఆర్థిక సమస్యలతో పాటు నిజానికి, అంతకంటే కొంచెం ఎక్కువగానే సామాజిక న్యాయం అవసరమని అర్రులు చూస్తున్నారు. కనుక వర్గపోరాటాన్ని, వర్ణపోరాటాల్ని పరస్పర విరుద్ధంగా ఆలోచించడం మన దేశ పరిస్థితుల్లో మార్క్సిజం అనిపించుకోదు. తెలంగాణ రాష్ట్ర సీపీఎం, నాడు తెలంగాణ పోరాటంలో దిశానిర్దేశం చేసి నేడు ఈ కులనిర్మూలన పోరాటంలో ముందున్నందుకు వారికి అభినందనలు! ఆ తెలంగాణ గడ్డమీదే లాల్–నీల్ నినాదమిచ్చాడు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం! కానీ, ఇప్పుడెందుకో పార్టీ కేంద్రనాయకత్వం తెలంగాణ సీపీఎం విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు లేదు. ప్రజలు ఎక్కడ ఏరకమైన దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారో వారికి అండగా ఉంటేనే మనదేశంలో కమ్యూనిస్టు పార్టీలకు ఏమాత్రమైన పురోగమనం ఉంటుంది. లేకుంటే ఆ పార్టీల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఈ విషయంలో.. మన మార్క్సిస్టు పరిభాషలో, బూర్జువా పార్టీనే అయినా, బహుజన వామపక్ష సంఘటన వంటి వాటి నిర్మాణంతో, ప్రస్తుత దేశ, కాల, రాష్ట్ర, సామాజిక న్యాయ పరిస్థితులకు అనుగుణంగా, సాధారణ ప్రజానీకం తరఫున పేదలకు అండగా సామాజిక న్యాయదిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజల అభ్యున్నతి – ప్రస్తుత దశలో, ఎలా ఆచరణలోకి వస్తే, దానిని బలపర్చి, మొత్తం సమాజం మార్క్స్ చెప్పిన పరిణామ దిశగా పురోగమించడానికి కమ్యూనిస్టులు ప్రయత్నించాలని మనసారా కోరుకుంటున్నాను. వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720