లోక్‌సభలో ‘జమిలి ఎన్నికల’ బిల్లు.. సొంత పార్టీ ఎంపీలకు బీజేపీ నోటీసులు | BJP to Issue Notices to MPs Absent During One Nation, One Election Bill Discussion | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో ‘జమిలి ఎన్నికల’ బిల్లు.. సొంత పార్టీ ఎంపీలకు బీజేపీ నోటీసులు

Published Tue, Dec 17 2024 8:11 PM | Last Updated on Tue, Dec 17 2024 8:26 PM

BJP to Issue Notices to MPs Absent During One Nation, One Election Bill Discussion

ఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలపై బీజేపీ అధిష్టానం ఫైరయ్యింది. సుమారు 20మంది ఎంపీలకు బాధ్యతారాహిత్యం కింద నోటీసులు జారీ చేసింది.

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. ఎన్‌డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం  మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే, లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో 20మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యారు.

గతంలోనే, జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో లోక్‌సభ సభ్యులు సభకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీలు చర్చలో పాల్గొనలేదు. 

రాజ్యాంగాన్ని సవరించి ఏకకాలంలో పార్లమెంటరీ, రాష్ట్రాల ఎన్నికలను అనుమతించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాదు. కానీ, ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. జమిలి ఎన్నికలు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని, అందుకు ఆ 20 మంది బీజేపీ ఎంపీల తీరేనని ఆరోపిస్తోంది.    

నియమావళి ప్రకారం బిల్లులు సాధారణ మెజారిటీతో ఆమోదం లభించింది. 269 ​​మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ అన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement