parliment
-
కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ!
చెన్నై : మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైనట్లే తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం కమలహాసన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనుందంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బుధవారం కమల్ హాసన్ నివాసానికి రాష్ట్రమంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లారు. ఆ భేటీని ఎంఎన్ఎం పార్టీ ఎక్స్ వేదికగా ప్రస్తావించింది. దీంతో రాజ్యసభకు కమల్ హాసన్ ప్రచారం జోరందుకుంది. மக்கள் நீதி மய்யம் கட்சியின் தலைவர் திரு. @ikamalhaasan அவர்களை, இந்து சமய அறநிலையத்துறை அமைச்சர் திரு. @PKSekarbabu அவர்கள் மரியாதை நிமித்தமாகச் சந்தித்து உரையாடினார். தலைவரின் அலுவலகத்தில் நடந்த இந்தச் சந்திப்பின்போது, கட்சியின் பொதுச்செயலாளர் திரு. @Arunachalam_Adv அவர்கள்… pic.twitter.com/ni4Ne3hqFb— Makkal Needhi Maiam | மக்கள் நீதி மய்யம் (@maiamofficial) February 12, 2025 ఈ తరుణంలో కమల్ హాసన్‌తో ఉదయనిధి స్టాలిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కమల్‌తో భేటీ అనంతరం, ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మేం ఈరోజు మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్ హాసన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాం. మమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతించినందుకు, రాజకీయాలు, సినిమాతో పాటు వివిధ రంగాలపై అభిప్రాయాలను పంచుకున్నందుకు నా కృతజ్ఞతలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. மக்கள் நீதி மய்யத்தின் தலைவர் - கலைஞானி @ikamalhaasan சாரை இன்று அவருடைய இல்லத்தில் மரியாதை நிமித்தமாக சந்தித்தோம். அன்போடு வரவேற்று அரசியல், கலை என பல்வேறு துறைகள் சார்ந்து கருத்துக்களை பரிமாறிக்கொண்ட கமல் சாருக்கு என் அன்பும், நன்றியும்.@maiamofficial pic.twitter.com/YdLqu4KZs4— Udhay (@Udhaystalin) February 13, 2025 2024లో తమ ఎన్నికల ఒప్పందంలో భాగంగా హాసన్‌కు రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చినట్లు సమాచారం. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ఇచ్చింది. గతేడాది మార్చిలో కమల్ హాసన్ డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంను సందర్శించారు. అక్కడ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఒప్పందంపై సంతకం చేశారు.డీఎంకే నేతృత్వంలోని కూటమితో పొత్తు పెట్టుకోవాలనే తన నిర్ణయం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే జరిగిందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. కానీ ఈ ఇండియా కూటమికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పదవి కోసం కాదు, దేశం కోసం’అని ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం, తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే నేతృత్వంలోని కూటమి తరపున లోక్‌సభ ఎన్నికలకు కమల్ హాసన్ ప్రచారం చేశారు. ప్రతిగా 2025లో డీఎంకే కోటా నుండి రాజ్యసభ నామినేట్ చేయనుంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే సభ్యులతో సహా కనీసం ఆరుగురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం జూన్ 2025 నాటికి ముగియనుంది. అందుకే డీఎంకే పార్టీ ఇప్పుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు సిద్ధమైంది. -
పోలవరం ఎత్తు తగ్గింపుతో రాష్ట్రానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్ణీత ఎత్తును తగ్గించాలన్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి వంటిది. దాని నిల్వ సామర్థ్యాన్ని ఏమాత్రం తగ్గించినా అది రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల ఎత్తు నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే దాని నిల్వ ఏకంగా 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.5,936 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును 2026లోగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. ముందస్తు వరదలు, కోవిడ్ వల్ల వచ్చిన అవాంతరాలతో కొంత ప్రతికూలత ఉన్నా.. సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల్లో గణనీయ పురోగతి జరిగింది. స్పిల్‌వే, స్పిల్ చానల్, కాఫర్ డ్యామ్ నిర్మాణాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతాంశంగా తీసుకుని పూర్తిచేసేందుకు కృషిచేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో 21,054 ఎంఎస్ఎంఈలురాష్ట్రంలో 21,054 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రిజిస్టర్ అయినట్లు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ⇒ రాష్ట్రంలో లక్షా 90 వేల 777 జల వనరులున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి.. వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొదటి గణన నివేదిక ప్రకారం 3,920 జల వనరులు ఆక్రమణకు గురైనట్టు తెలిపారు. ⇒ విమాన ప్రయాణికులకు సరసమైన ధరలో భోజనాన్ని అందించేందుకు కలకత్తా విమానాశ్రయంలో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్మోహల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.⇒ రాష్ట్రంలో 99.72శాతం మంది తమ తమ ఇళ్లలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకున్నట్టు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. -
వేతన జీవులకు బిగ్ రిలీఫ్ .. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
‘అమిత్‌షా క్షమాపణలు చెప్పాల్సిందే’
ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో భారత రాజ్యాంగం పై చర్చ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. మంగళవారం జరిగిన చర్చ సమయంలో అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వినియోగించుకోవడం 'ఫ్యాషన్'గా మారిందని అన్నారు. అంబేద్కర్,అంబేద్కర్ అని జపం చేస్తున్నారు. బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా పుణ్యం వస్తుంది. స్వర్గానికి వెళ్లొచ్చని విరుచుకు పడ్డారు. "अभी एक फैशन हो गया है- अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर..इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता."अमित शाह ने बेहद घृणित बात की है. इस बात से जाहिर होता है कि BJP और RSS के नेताओं के मन में बाबा साहेब अंबेडकर जी को लेकर बहुत नफरत है.नफरत… pic.twitter.com/UMvMAq43O8— Jairam Ramesh (@Jairam_Ramesh) December 17, 2024 అయితే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. మనుస్మృతిని విశ్వసించే వారు ఖచ్చితంగా అంబేద్కర్‌తో విభేదిస్తారు' అని ట్వీట్లో పేర్కొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను హోంమంత్రి అవమానించడంతో బీజేపీ-ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకానికి వ్యతిరేకమని, వారి పూర్వీకులు అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని, సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేయాలనుకుంటున్నారని ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల దూతగా ఉంటారని చెప్పారు. -
లోక్‌సభలో ‘జమిలి ఎన్నికల’ బిల్లు.. సొంత పార్టీ ఎంపీలకు బీజేపీ నోటీసులు
ఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలపై బీజేపీ అధిష్టానం ఫైరయ్యింది. సుమారు 20మంది ఎంపీలకు బాధ్యతారాహిత్యం కింద నోటీసులు జారీ చేసింది.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. ఎన్డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే, లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో 20మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యారు.గతంలోనే, జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో లోక్‌సభ సభ్యులు సభకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీలు చర్చలో పాల్గొనలేదు. BIG BREAKING NEWS 🚨 One Nation One Election Bill accepted in Lok Sabha despite MASSIVE opposition by Opposition Parties.269 votes in favour and 198 votes against it.According to the bill, the “appointed date” will be after the next Lok Sabha elections in 2029, with… pic.twitter.com/xRBHnXGEBA— Times Algebra (@TimesAlgebraIND) December 17, 2024రాజ్యాంగాన్ని సవరించి ఏకకాలంలో పార్లమెంటరీ, రాష్ట్రాల ఎన్నికలను అనుమతించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాదు. కానీ, ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. జమిలి ఎన్నికలు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని, అందుకు ఆ 20 మంది బీజేపీ ఎంపీల తీరేనని ఆరోపిస్తోంది. నియమావళి ప్రకారం బిల్లులు సాధారణ మెజారిటీతో ఆమోదం లభించింది. 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు -
ఆందోళనలు,విమర్శలతో అట్టుడుకుతున్న ఉభయ సభలు
ఢిల్లీ : కొనసాగుతున్న పార్లమెంట్ సీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య వాగ్వాదం మొదలైంది. అమెరికాలో అదానీపై వచ్చిన ఆరోపణలపై చర్చ జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబడుతుంటే.. దేశ వ్యతిరేక కార్యలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ సంబంధాల వ్యవహారంపై చర్చ జరపాలని బీజేపీ పట్టుబట్టింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణ, విమర్శలతో ఉభయ సభలూ పలు మార్లు వాయిదా పడ్డాయి. #WATCH | Delhi | After both Houses are adjourned till noon, Opposition MPs protest on the steps of the Parliament on Adani issue, demand reply from the government on the issue pic.twitter.com/S6g59PDBHw— ANI (@ANI) December 10, 2024అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులతో పనిచేస్తున్న ఫోరమ్ ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్-ఆసియా ఫసిఫిక్ ఫౌండేషన్ (ఎఫ్డీఎల్-ఏపీ)కు సహఅధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాందీ.. ఆ సంస్థలో తన పాత్రపై స్పష్ట ఇవ్వాలని చెప్పేది మేంకాదని, పబ్లిక్ డొమైన్ ఉందని అందరికి తెలుసని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.రాహుల్ గాంధీ ప్రవర్తన, అతని కార్యకలాపాలన్నింటి గురించి ప్రజలకు బాగా తెలుసు. జాతీయ ప్రయోజనాల విషయానికి వస్తే, మనమందరం కలిసి నిలబడాలి మరియు ఐక్యంగా ఉండాలి. జార్జ్ సోరోస్ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం’అని మీడియాతో మాట్లాడారు. -
పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి
సాక్షి,ఢిల్లీ : కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్క్ దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుని బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా, కేబినెట్ సభ్యులు, సహాయ మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు సైతం పూర్తయింది. ఇక, లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఎనిమిది రోజులపాటు కొనసాగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జూన్ 24 నుంచి 25 ఈ రెండు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎంపిక జరగనుంది.స్పీకర్ రేసులో ఎవరున్నారంటే? రాజస్థాన్ కోట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత ఓం బిర్లా 2019 నుంచి 2024 వరకు లోక్‌సభకు 17వ స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో లోక్‌సభకు 18వ స్పీకర్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఓం బిర్లా స్థానంలో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్లమెంట్ సభ్యులను లోక్‌సభ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం టీడీపీ,ఏపీ బీజేపీ, జేడీయూ పోటీపడుతున్నాయి. -
మణిపూర్‌లో భరతమాతని హత్య చేశారు..ఇంకా ఇతర అప్డేట్స్
-
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ కౌంటర్
-
ఎంపీ పదవిని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు : రాహుల్
-
అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ
-
పార్లమెంటు భవనం ప్రారంభంపై రాదంతం అంత అవసరమా
-
‘‘అసలు రాహుల్‌కు ఆస్తుల మోనిటైజ్ అంటే తెలుసా?’’
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 1.62 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆస్తులు మోనిటైజ్ (ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం లేదా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి మార్గం ద్వారా ఆదాయ సముపార్జన) సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది ఈ మేరకు ఒక లిఖిత పూర్వక ప్రకటన చేస్తూ, 2021–22లో దాదాపు రూ.97,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను మోనిటైజ్ చేయడం జరిగిందని తెలిపారు. 2025 వరకు నాలుగు సంవత్సరాలలో విద్యుత్ నుండి రహదారి, రైల్వేల వరకు అన్ని రంగాలలో మౌలిక సదుపాయాల ఆస్తుల విలువను అన్‌లాక్ చేయడానికి ప్రభుత్వం గత సంవత్సరం రూ. 6 లక్షల కోట్ల నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 60 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తులను కేంద్రం అమ్మేస్తుందన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గతంలో విమర్శించారు. అయితే దీనిపై ఆర్థికమంత్రి సీతారామన్ అప్పట్లో స్పందిస్తూ, ‘‘అసలు రాహుల్‌కు ఆస్తుల మోనిటైజ్ అంటే తెలుసా?’’ అని ప్రశ్నించారు. ఎన్ఎంపీ కింద గుర్తించిన రంగాలలో రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, గిడ్డంగులు, గ్యాస్ అండ్ ఉత్పత్తి పైప్లైన్లు, విద్యుత్ ఉత్పత్తి, ప్రసార కార్యకలాపాలు, మైనింగ్, టెలికం, స్టేడియం, పట్టణ రియల్టీ వంటివి ఉన్నాయి. అసెట్స్ మోనిటైజ్ స్కీమ్ పట్ల ప్రైవేటు దిగ్గజ సంస్థల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
Amit Shah: పొరపాటు వల్లే కాల్పులు
న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో తీవ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో భద్రతా దళాలు పొరపాటు పడడం వల్లే కాల్పులు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై సిట్ నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తుందన్నారు. భవిష్యత్తులో తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని భద్రతా దళాలకు సూచించారు. ఈ మేరకు షా సోమవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తృణమూల్ మినహా ప్రతిపక్షాల వాకౌట్ అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం, కాల్పులకు బాధ్యులైన వారిపై చర్యల గురించి ఆయన మాటమాత్రమైనా ప్రస్తావించలేదని మండిపడ్డాయి. షా ప్రకటనను నిరసిస్తూ సభను నుంచి వాకౌట్ చేశాయి. టీఎంసీ వాకౌట్ చేయలేదు. ఎలాంటి ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకుండా హోంమంత్రి ఏకపక్షంగా ప్రకటన చేసి వెళ్లిపోయారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. అంతకుముందు నాగాలాండ్ ఘటనను ప్రతిపక్షాలు సభలో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్‌చేశాయి. (చదవండి: Maharashtra: ప్రేమించి, పారిపోయి పెళ్లి.. గర్భిణీ అక్క తల నరికిన తమ్ముడు.. తీసుకొని) హైదరాబాద్ నైపర్‌కు ‘జాతీయ’ హోదా బిల్లుకు లోక్‌సభ ఆమోదం హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(నైపర్)లకు ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ’ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. ఈ మేరకు నైపర్(సవరణ) బిల్లు–2021ను ఆరోగ్య మంత్రిæ మాండవియా సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే నైపర్‌లకు ఒకేరకమైన జాతీయ హోదా లభిస్తుందని తెలిపారు. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టంలో దొర్లిన తప్పిదాన్ని సరిచేయడానికి సవరణ బిల్లు–2021ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభ నుంచి 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. సోమవారం కూడా ఆందోళనకు దిగాయి. దీంతో నాలుగు సార్లు సభ వాయిదాపడింది. రాజ్యసభలో నినాదాల మధ్యే నాగాలాండ్ ఘటనపై షా ప్రకటన చేశారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. చదవండి: నాగాలాండ్ రాష్ట్రం మోన్ జిల్లాలో దారుణం -
తిలా పాపం... తలా పిడికెడు!
అనుకున్నదే అయింది. అందరూ అనుమానించినట్టే అయింది. ఏ ప్రజాసమస్య పైనా తగిన చర్చ జరగకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణమయ్యాయి. అదీ... మొదట ప్రకటించిన ఆగస్టు 13 కన్నా రెండు రోజుల ముందే ముగిశాయి. ప్రతిపక్షాలు గొంతు చించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం, సర్కారు సావధానంగా పోదామన్నా పట్టు వీడని విపక్షం, సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘం కబురు చేసినా సరే ఖాళీ లేదనే అధికార వర్గం, మంత్రి చేతిలోని ప్రకటనను చించివేసే సభ్యుల తెంపరితనం, పెద్దల సభలోనే బల్లలెక్కి అధ్యక్షుడి ఖాళీ కుర్చీ మీదకు నిబంధనావళిని విసిరేయగల దాదాగిరి, సమస్యల పరిష్కారం కన్నా ప్రతిపక్షాలదే తప్పు అన్న ప్రచారమే కీలకమని భావించిన పాలకులు, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై మార్షల్స్ దౌర్జన్యం, మహిళా మార్షల్‌పై ఎంపీలే దాడి చేశారన్న పాలకపక్ష ఆరోపణలు – ఇలా ఈ విడత పార్లమెంట్లో ఎన్నెన్నో వివాదాలు, విషాద దృశ్యాలు. చివరకు, ఈ విడత కూడా విలువైన సభాసమయం వృథా అయింది. తిలాపాపంలో తలా పిడికెడు వాటా అన్ని పక్షాలకూ దక్కింది. లెక్కిస్తే – ఈ సమావేశాల్లో కేవలం 17 సార్లే సభ కొలువు తీరింది. నిజానికి, లోక్‌సభ 96 గంటలు పనిచేయాల్సి ఉండగా, కేవలం 21 గంటల 14 నిమిషాలే పని చేసింది. ఏకంగా 74 గంటల 46 నిమిషాల సమయం గందరగోళాలకే సరిపోయింది. వెరసి, నిరుడు పార్లమెంట్ ఉత్పాదకత 126 శాతం దాకా ఉంటే, ఈసారి ఏకంగా 22 శాతానికి పడిపోయింది. సాధారణంగా సభా నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలు, రోజుకు రూ. 9 కోట్లు ఖర్చవుతాయని లెక్క. అంటే విలువైన సమయంతో పాటు, ఎంత ప్రజాధనం వృథా అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ సమావేశాల్లో ప్రభుత్వం 13 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. మరో 20 బిల్లుల్ని ఆమోదించింది. చర్చకు అవకాశమివ్వకుండా, సంఖ్యాబలంతో కీలకమైన బిల్లులకు క్షణాల్లో ఆమోదముద్ర వేస్తూ పోయింది. ‘ఏ మాత్రం చర్చ లేకుండా దాదాపు 35కి పైగా బిల్లుల్ని పాస్ చేశారు. అనేక బిల్లుల్ని పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకైనా పంపకుండానే ఆమోదిస్తున్నార’ని ప్రతిపక్షాల ఆరోపణ, ఆవేదన. సభకు అడ్డుపడి తమ వాదన వినిపించాలనుకోవడం, తామెత్తిన అంశంపై చర్చ జరగాలనడం ప్రతిపక్షాలు ఆది నుంచి చేసేదే. అధికారపక్షం ఎక్కడోచోట సర్దుకొని, అందుకు అంగీకరించడం సంప్రదాయం. కానీ, ఈసారి మోదీ సర్కారు విదేశీ నిఘా సాఫ్ట్వేర్ పెగసస్ వివాదంపై చర్చకు సై అనకుండా, తప్పుకు తిరగడంతో పీటముడి బిగిసింది. సమావేశాలకు ఒక్క రోజు ముందుగా బయటపడ్డ పెగసస్ పైనే చివరి దాకా ప్రతిష్టంభన సాగింది. అదే పట్టుకొని వేలాడిన ప్రతిపక్షాలు ఇతర అంశాలపై చర్చ లేవనెత్తడంలో విఫలమయ్యాయి. మరోపక్క ప్రతిపక్షాల అనుమానాల్ని నివృత్తి చేయాల్సింది పాలకులే. అధికారంలో ఉన్నవారే పెద్దమనసుతో ముందుకు రావడం ఎక్కడైనా మర్యాద, గౌరవం. కానీ, ఆపాటి విశాల హృదయం పాలకపక్షానికి లేకుండా పోయింది. పెగసస్‌పై ఐరోపా దేశాలు కొన్ని విచారణకు ఆదేశించినా, మనవాళ్ళు అందుకు సిద్ధమనలేదు. కేంద్ర ఐటీ మంత్రేమో ఫోన్లను తాము ట్యాప్ చేయలేదన్నారు కానీ, పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాకింగ్‌కు వాడారో లేదో చెప్పలేదు. రక్షణ మంత్రేమో లిఖిత పూర్వక ఏకవాక్య సమాధానంలో తమ శాఖ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని సరిపెట్టారు. కానీ, దర్యాప్తు సంస్థలు దాన్ని వాడిందీ లేనిదీ సర్కారు సూటిగా జవాబివ్వలేదు. సభలో ప్రతిష్టంభనకు కారణం ప్రతిపక్షాలే అని ప్రచారం చేస్తే చాలనుకుంది. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి, మాట్లాడలేమంటూ తర్కం లేవదీసింది. ‘కరోనా రెండో వేవ్ మరణాలు స్వతంత్ర భారత ప్రభుత్వాలన్నిటి సమష్టి వైఫల్యం’ అంటూ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా చేసిన భావోద్వేగభరిత ‘మాఫీనామా’ ప్రసంగమొక్కటే ఈ సమావేశాల్లో అందరినీ కదిలించింది. అధికార, విపక్షాలు రెంటి మధ్య ఒకే ఒక్క అంశంలో అరుదైన ఐక్యత కనిపించింది. అది – సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీలు – వాడుకలో ఓబీసీలు) జాబితాను రాష్ట్రాలే తయారుచేసుకొనే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓటుబ్యాంకు ఓబీసీల విషయంలో రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. అయితే, ఓబీసీల జాబితా రూపకల్పనకు రాష్ట్రాలకున్న అధికారాన్ని 2018లో మోదీ ప్రభుత్వమే తొలగించిందనీ, ఇప్పుడా తప్పు దిద్దుకొనేందుకు తాము సహకరించామనీ విపక్షాల వాదన. ఆ బిల్లు పని కాగానే సర్కారు ఈ సమావేశాలకు సెలవిచ్చేసింది. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో జరగాల్సింది ప్రజాసమస్యలపై విలువైన చర్చ. ఈ విడత సభలో చర్చలు లేవు. జరిగిందల్లా రచ్చ. దానితోనే చివరకు సమావేశాలు సమాప్తం కావడం విచారకరం. సభలో ఘటనలతో రాత్రి నిద్ర పట్టలేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగం చూపారు. అధికార – ప్రతిపక్షాల మంకుపట్టు, ఓబీసీ బిల్లు వేళ కూడా సభా నాయకుడు – హోమ్ మంత్రుల గైర్హాజరు, ప్రతిపక్షాల ప్రశ్నలకు కొన్నేళ్ళుగా సభలో జవాబివ్వని పాలకుల తీరు చూస్తుంటే నిజంగానే ప్రజాస్వామ్య వాదులకు కన్నీరొస్తుంది. లోక్‌సభ కొలువుదీరి రెండేళ్ళు దాటినా, ప్రతిపక్షాలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవ డమూ విడ్డూరమనిపిస్తుంది. మూకబలానికే తప్ప, చర్చకు స్థానం లేనివేళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రోజులు కావా అన్న అనుమానమొస్తోంది. ఇప్పుడిక దీని మీద చర్చ జరగాల్సిందే! -
ఆదుకోండి, నన్ను అమ్మొద్దు ప్లీజ్
రుణ భారాలను తగ్గించుకోడానికి ఎయిర్ ఇండియా 2015 నుంచి 2021 జూలై నాటికి 115 ఆస్తులను విక్రయించిందని, తద్వారా రూ.738 కోట్లు సమకూర్చుకుందని పౌర విమానయాన శాఖమంత్రి వీకే సింగ్ లోక్‌సభకు తెలిపారు. లీజ్ రెంటల్ ఆదాయంగా ఎయిర్ ఇండియాకు వార్షికంగా రూ.100 కోట్లు అందుతున్నట్లు కూడా వెల్లడించారు. ప్రాజెక్ట్ రాయల్ అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను అమ్మేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రూ.60,074 వేల కోట్ల అప్పుల్లో ఉంది. అయితే ఆ రుణ భారం నుంచి బయటపడేందుకు కేంద్రం ఎయిరిండియాను అమ్మేందుకు ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించింది. అందుకు 64రోజుల సమయం ఇచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. ఇదే సమయంలో 'ప్రాజెక్ట్ రాయల్' పేరుతో ఎయిర్ ఇండియా వ్యాల్యూ ఎంత ఉందనేది తెలుసుకుంటున్నారు. ఈ వ్యాల్యూషన్ అంతా నాలుగు పద్దతుల్లో జరుగుతుంది. ఇతర విమాన సంస్థలు వ్యాల్యూ ఎలా ఉంది? ఎయిరిండియా సర్వీసుల కోసం చేసిన ఖర్చు ఎంత? ఎయిరిండియాకు వచ్చిన మొత్తాన్ని ఏ పర్పస్ కింద ఖర్చు చేశారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? నికర ఆస్తులు ఎంత? వాటి మొత్తం వ్యాల్యూ ఎంత అనే విషయాల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. మరోవైపు ఎయిరిండియా అమ్మకాలతో ఆ సంస్థలో పనిచేస్తున్న పదివేల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నష్టాల నుంచి బయటపడేలా భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేయాలని కోరుతున్నారు. మరి ఎంతమేరకు సఫలం అవుతుందో చూడాల్సి ఉండగా.. ఎయిరిండియా ను సొంతం చేసుకునేందుకు టాటా, స్పైస్‌జెట్ ప్రమోటర్ అయిన అజయ్‌సింగ్ తో పాటు మరో నాలుగు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏఏఐకు రూ.30,069 కోట్ల ఆదాయం తన జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టులు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ఎయిర్‌పోర్టుల నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.30,069 కోట్ల ఆదాయాన్ని పొందినట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి లోక్సభుకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. హైదరాబాద్‌సహా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, నాగపూర్లలో పీపీపీ నమూనాలో ఏఏఐ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. 2020–21లో ప్రభుత్వం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రూ.856 కోట్లను రాయితీ ఫీజుగా పొందిందనీ ఆయన తెలిపారు. ఏఏఐ పౌర విమానయాన శాఖ కింద పనిచేసే సంగతి తెలిసిందే. -
సెంట్రల్ విస్టాకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం ఉద్దేశించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ. పరిధిలో పునర్నిర్మాణం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకి 2–1 ఓట్ల తేడాతో మంగళవారం సుప్రీం బెంచ్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం పర్యావరణ అనుమతులు, భూ కేటాయింపుల్ని మారుస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించి కేంద్రం చేసిన వాదనలతో ఏకీభవించింది. పర్యావరణ శాఖ అనుమతులు సహా అన్నింటిని పూర్తిగా సమర్థించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలు కేంద్రం వాదనలతో ఏకీభవించగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యతిరేకించారు. స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలి పాత భవనాల కూల్చివేత, కొత్త భవన నిర్మాణ సమయంలో పర్యావరణ ప్రతికూలతలపై పడే ఆందోళనలు వ్యక్తమవుతూ ఉండడంతో కాలుష్య నియంత్రణ కోసం స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని, యాంటీ స్మాగ్ గన్స్ ఉపయోగించాలని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరిగా తెచ్చుకోవాలని అప్పటివరకు నిర్మాణ పనులు మొదలు పెట్టవద్దని సుప్రీం ఆదేశించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. పార్లమెంటు, సచివాలయం కొత్త భవనాల నిర్మాణం కోసం కేంద్రం సెప్టెంబర్ 2019ని ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. కొన్ని భవనాలను యథాతథంగా ఉంచి , మరికొన్నింటిని తిరిగి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ ప్రాజెక్టు డిజైన్, పర్యావరణ అనుమతులు, స్థలం కేటాయింపులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పర్యావరణ అనుమతులు చట్టబద్ధంగా లేవని పలువురు కోర్టుకెక్కారు. కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే సుప్రీంకోర్టు భవనాలకి శంకుస్థాపన చేయడానికి అనుమతినిచ్చింది. అయితే తుది తీర్పు వెలువడే వరకు భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణం చేపట్టరాదని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్లో పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. -
ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: నూతన పార్లమెంటు శంకుస్థాపనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. నూతన పార్లమెంట్ నిర్మాణానికి గురువారం ఢిల్లీలో శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక పేర్కొన్నారు. ప్రజలందరికీ గర్వకారణమైన ఈ పార్లమెంటు నిర్మాణం ఎప్పుడో జరగాల్సి ఉందని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న సదుపాయాలు విదేశీయుల చరిత్రతో ముడిపడి ఉన్నాయని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు. చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్ దూకుడుతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. చైనాతో సరిహద్దు వివాదం ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉందని, 1962లో చైనా లడ్డాఖ్లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు. చైనా ఏకపక్ష చర్యలను భారత్ ఖండిస్తోందని, డ్రాగన్ కదలికలను పసిగడుతున్నామని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారత్ శాంతినే కోరుకుంటోందని, సామరస్య చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. చైనా రక్షణ మంత్రితో తాను చర్చలు జరిపానని, యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టం చేశానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడ్డాఖ్‌కు వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. చైనాతో చర్చలకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చర్చలు కొనసాగిస్తామని చైనా హామీ ఇస్తున్నా సరిహద్దుల విషయంలో మొండిగా వాదిస్తోందని దుయ్యబట్టారు. తాజాగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అవగాహనకు వచ్చారని చెప్పారు.ఇక చైనాతో ఉద్రిక్తతలపై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చగా ఈ అంశంపై సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. చదవండి : రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ -
నిర్మలా సీతారామన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యల తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై విపక్ష సభ్యుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. విపక్ష సభ్యుడి అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో వివాదం సమసిపోయింది. నిర్మలా సీతారామన్‌పై తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ కోరాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పట్టుబట్టారు. లోక్‌సభలో సోమవారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సౌగత రాయ్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక దుస్థితి నిర్మలా సీతారామన్ కష్టాలను పెంచిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన మీదట వీటిని రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. బిల్లును సమర్ధిస్తూ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ సౌగత రాయ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇతర అంశాలపై వ్యాఖ్యలు చేయకుండా సౌగత రాయ్ సభా కార్యకలాపాలను వినాలని అన్నారు. సీనియర్ సభ్యురాలిపై రాయ్ వ్యాఖ్యలను పాలక పక్ష సభ్యులు తప్పుపట్టారు. ఇది మహిళా సభ్యురాలిని అవమానించడమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. కాగా తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలూ చేయలేదని సౌగత్ రాయ్ చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 18 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. చదవండి : ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా -
‘ఆ ప్రాజెక్టును అడ్డుకోలేం’
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవన నిర్మాణాలకు రూ 20,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్ధాయి పనులను అడ్డుకోలేమని సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం తేల్చిచెప్పింది. నిర్మాణ పనులకు అనుమతులివ్వడంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రాజెక్టు పనులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టబద్ధంగా తమ విధులను నిర్వర్తించే అధికారలను నిలువరించగలమా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం కన్విల్కార్ పిటిషనర్‌ను ప్రశ్నించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సర్వోన్నత న్యాయస్ధానం వద్ద పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇస్తోందని పిటిషనర్ రాజీవ్ సూరి తరపు న్యాయవాది శిఖిల్ సూరి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా పిటిషనర్ల ఆరోపణలపై జులై 3లోగా ప్రభుత్వం బదులివ్వాలని కోరుతూ జులై 6 తర్వాత పిటిషన్‌పై విచారణను చేపడతామని కోర్టు పేర్కొంది. పార్లమెంట్ భవన నిర్మాణానికే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపడుతుంటే పిటిషనర్‌కు అభ్యంతరం ఏమిటని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశ్నించారు. చదవండి : వడ్డీమీద వడ్డీనా..? -
చైనా పార్లమెంట్ కీలక నిర్ణయం
బీజింగ్ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌తో పోరాడుతున్న క్లిష్ట సమయంలోనూ చైనా తన సామ్రాజాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. హాంకాంగ్‌పై ఆధిపత్యానికి వడివడిగా అడుగులు వేస్తున్న డ్రాగన్ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్ వాసుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలతో జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. మొత్తం 2800 మంది ఎన్పీసీ సభ్యులు నూతన చట్టానికి అనుకూలంగా ఓట్లు వేశారని సమాచారం. తాజా నిర్ణయంతో చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు హాంకాంగ్‌లో తిష్ట వేసే అవకాశం ఉంది. హాంకాంగ్‌లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం ఎంతో అవసరమని చైనా ప్రభుత్వం చెబుతోంది. ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని భావిస్తోంది. కాగా చైనా చట్టాలను, జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణించే బిల్లుకు గత నెలలోనే ముసాయిదాను తయారు చేసిన విషయం తెలిసిందే. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్!) -
అలాగైతే సూర్య నమస్కారాలు పెంచుతా..
సాక్షి, న్యూఢిల్లీ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించని పక్షంలో మోదీ సర్కార్‌కు గడ్డుకాలం తప్పదన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆరునెలల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రధాని మోదీని యువత కర్రలతో బాదుతారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ గురువారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బదులిచ్చారు. కర్రల దాడిని తట్టుకునేలా తాను ప్రతిరోజూ చేసే సూర్య నమస్కారాల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నానని మోదీ అన్నారు. గత 20 ఏళ్లుగా తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని ఇప్పుడు తనను తాను దందా-ప్రూఫ్‌గా రాటుతేలానని చెప్పుకొచ్చారు. ఎన్డీ ప్రభుత్వం ప్రదర్శించిన అంకిత భావం, చొరవతో దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి సమస్యలు కొలిక్కివచ్చాయని చెప్పారు. 2014 నుంచి 2019 వరకూ తమ ప్రభుత్వ పనితీరును మెచ్చిన ప్రజలు తమకు తిరిగి అధికారం కట్టబెట్టారని అన్నారు. తాము గత పాలకుల బాటలోనే పయనిస్తే ఆర్టికల్ 370 రద్దయ్యేది కాదని, ట్రిపుల్ తలాక్ సమస్య పరిష్కారమయ్యేది కాదని విపక్షాలకు మోదీ చురకలు వేసారు. చదవండి : పెట్టుబడులు పెట్టండి : మోదీ -
ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం
-
రాజధాని అంశంపై కేంద్రం తొలి స్పందన..
-
రాజధాని అంశంపై కేంద్రం తొలి స్పందన..
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల తరలింపుపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని అంశంపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని వెల్లడించింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఏక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పింది. అందులో తమ జోక్యం ఉండదని పేర్కొంది. కాగా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం రాజధాని అంశంపై జాతీయ మీడియా ఇష్టాగోష్టిలో కూడా కేంద్ర ఉన్నత వర్గాలు ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. శాసనమండలి, రాజధాని అంశాల్లో కేంద్ర జోక్యం చేసుకోదని తెలిపాయి. ఏపీలో ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉందని గుర్తుచేశాయి. రాజకీయ అంశాల్లో కేంద్రం చేసేదేమీ ఉండదని పేర్కొన్నాయి. కంగుతిన్న టీడీపీ.. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి అడ్డుతగిలేలా రాజధాని అంశంపై టీడీపీ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల పేరిట అమరావతి గ్రామాల్లో ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్.. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ కేంద్రం మాత్రం రాజధానుల అంశంపై తమ జోక్యం ఉండబోదని వెల్లడించింది. తాము అనుకున్న దానికి విరుద్ధంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడటంతో టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి. -
పౌరసత్వ ప్రకంపనలు : ముస్లింలకు షా భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ముస్లింలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారంతా దేశ పౌరులుగానే కొనసాగుతారని హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. బుధవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆయన రాజ్యసభలో ప్రవేశపెడుతూ ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమనే దుష్ర్పచారం సాగుతోందని, ఇది సత్యదూరమని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. భారత్‌లో ముస్లింలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదని, వారంతా ఇక ముందూ ఈ దేశంలో భద్రంగా జీవించవచ్చని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా భరోసాతో జీవించాలని, భయపడాల్సిన అవసరం లేదని అమిత్ షా కోరారు. పొరుగు దేశాల నుంచి వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇవ్వాలని కొందరు చెబుతున్నారని..పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌లు ఇస్లాంకు అనుగుణంగా తమ రాజ్యాంగాలను రూపొందించుకున్న క్రమంలో ఆయా దేశాల్లో ఇతర మతస్తుల మాదిరి ముస్లింలు మతపరమైన వివక్షను ఎదుర్కోవడం లేదని ఈ దేశాల నుంచి వచ్చే ముస్లింలకు పౌరసత్వం ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలకు చెందిన ముస్లింలను మన పౌరులుగా చేయగలమా..? ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి భారత్‌కు తరలివచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
‘మనది మేకిన్ ఇండియా కాదు’
-
‘మనది మేకిన్ ఇండియా కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని సీనియర్ కాంగ్రెస్ నేత పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్ ఇండియా దిశగా కాకుండా రేపిన్ ఇండియా వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ప్రతి అంశంపైనా మాట్లాడే ప్రధాని మహిళలపై నేరాల గురించి మాత్రం నోరు మెదపకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశం క్రమంగా లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ హత్యాచార ఘటన, ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలు దేశంలో కలకలం రేపాయని అన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రజలు వేడుకగా జరుపుకున్నారని గుర్తు చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై విమర్శలు చెలరేగినా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతించారని, సీనియర్ రాజకీయ నేతలు సైతం పోలీసుల చర్యను సమర్ధించారని చెప్పారు. -
మరి ఆమె అవకాడో తింటారా !
సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అల్లాడుతున్న క్రమంలో తాము ఉల్లిపాయలు ఎక్కువగా తినమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మండిపడ్డారు. ఉల్లిపాయలు తిననని చెప్పిన మంత్రి అవకాడోలు తింటారా అని ఆయన ప్రశ్నించారు. ఆమె ఉల్లిపాయలు తినకున్నా వాటి ధరలు మండిపోతున్నాయని అన్నారు. ఐఎన్ఎక్స్ కేసులో 106 రోజులు జైలులో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన చిదంబరం నేడు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. మీడియా సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ మోదీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను సమర్ధంగా నడిపించడంలో విఫలమైందని విమర్శించారు. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం అసమర్ధ మేనేజర్‌గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. గ్రామీణ వినియోగం, వేతనాలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతం అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని ఇందుకు ఆర్బీఐ అసమర్ధ అంచనా కారణమా లేక కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా అని చిదంబరం నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తన గొంతును నొక్కేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ కుప్పకూల్చిందని, ఎకానమీపై ప్రధాని నోరు మెదపడం లేదని చిదంబరం మండిపడ్డారు. -
పార్లమెంట్ వద్ద అలజడి.. కత్తిపట్టుకుని..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్ద గుర్తుతెలియని వ్యక్త తీవ్ర అలజడి సృష్టించాడు. ఓ అగంతకుడు కత్తిపట్టుకుని పార్లమెంట్ భవనం లోపలకి చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. పార్లమెంట్ ద్వారమైన విజయ్ చౌక్ గేట్ నుంచి అతను లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దుండుగుడిని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు. తాజా ఘటనతో పార్లమెంట్ భవనం సమీపంలో భద్రతాసిబ్బంది అలర్టయింది. -
అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలు శనివారం పార్లమెంట్ ఆవరణలో స్వచ్ఛ భారత్ అభియాన్‌కు పూనుకున్నారు. ఎంపీలు హేమా మాలిని, కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్‌లు పార్లమెంట్ బయట చీపురుకట్ట చేతబట్టి శుభ్రం చేశారు. త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల దృష్ట్యా 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే వీరిపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు. ‘‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంలో (పార్లమెంట్) స్వచ్ఛ భారత్‌ను చేస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా పార్లమెంట్ ముందు పాటించిన శుభ్రత పాటించరు. ముఖ్యంగా సమావేశాలు జరిగే రోజుల్లో ఇంకా శుభ్రతను పాటిస్తారు. మీరు మాత్రం అక్కడే శుభ్రం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏమో?. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఈ కార్యక్రమానికి దిగినట్టు ఉంది’’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి హేమా మాలిని గెలిచిన విషయం తెలిసిందే. -
‘ఆ చట్టానికి నూకలు చెల్లలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటిష్ హయాం నాటి దేశ ద్రోహం చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదనకు సంబంధించి కాంగ్రెస్ సహా విపక్షాలు అడిగిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానం తెలిపింది. దేశద్రోహ నేరానికి సంబంధించి ఐపీసీలో పొందుపరిచిన నిబంధనను రద్దు చేసే ప్రతిపాదన ఏమీ లేదని బుధవారం రాజ్యసభలో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విద్వేషపూరితంగా వ్యవహరించే వారిపై ప్రయోగించే పురాతన దేశ ద్రోహ చట్టాన్ని తొలగించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలించడం లేదని మంత్రి పెద్దల సభలో పేర్కొన్నారు. కాగా, దేశద్రోహ చట్టాన్ని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తోందని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే వారిని వేధించేందుకు వాడుతుందని విపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఆ వ్యాఖ్యలకు పార్లమెంట్ వేదిక కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన నవనీత్ కౌర్ రానా మొదటి సమావేశాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీ స్వీకార ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ప్రమాణం చేసే సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు సభ్యులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీనిపై నవనీత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణం అనంతరం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన ఆమె..‘‘ జైశ్రీరాం అంటూ నినాదాలు చేయడానికి ఇది సరైన వేదిక కాదు. వాటి కోసం ప్రత్యేకంగా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ప్రజా సమస్యలపై చర్చకు మాత్రమే ఇక్కడ చోటుంది’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా అమరావతి నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. -
కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత ఎన్నికపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ లోక్‌సభ పక్షనేతను ప్రకటించలేదు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీమే ఆపార్టీ పదవిని చేపడతారని ప్రచారం జరగినప్పటికీ.. రాహుల్ మాత్రం సిద్ధంగా లేనట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని పట్టుబడుతున్న విషయం తెలిసిందే. రాహుల్ రాజీనామాను పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీని ఎదుర్కొనే సమర్థ నాయకుడు ఎవరన్న దానిపై పార్టీలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఫలితాలు విడుదలై ఇరవై రోజులకుపైగా కావస్తున్న.. ఇప్పటికీ స్పష్టత రాలేదు. 16వ లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మరో నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలవురు సీనియర్ నేతల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శశిథరూర్, మనీశ్ తివారీ, బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కే.సురేశ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొవడం, ప్రజా సమస్యలపై గళమెత్తగల నేతను ఎన్నుకోవాలని పార్టీ భావిస్తోంది. అయితే అధిష్టానానికి విధేయుడిగా ఉండి, హిందీ, ఇంగ్లీష్ భాషాలపై పట్టున్న నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు. వీరిలో తిరువనంతపురం నుంచి గెలిచిన, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భాషపై పట్టుతో పాటు, అన్ని అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. మరోవైపు కేరళకు చెందిన కే.సురేశ్.. పార్టీకి ఎంతో కాలంగా విధేయుడిగా ఉన్నారు. అయితే ఈయనకు హిందీ, ఇంగ్లీష్‌లో అంతగా ప్రావీణ్యం లేదు. బెంగాల్‌కు చెందిన అధిర్ చౌదరిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీంతో వీరివురు రేసులో వెనకబడే అవకాశం ఉంది. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో దక్షిణాదిన ఆపార్టీ మంచి ఫలితాలనే సాధించింది. ముఖ్యంగా కేరళలో మెజార్టీ స్థానాలు గెలుపొందింది. దీంతో ఉత్తర, దక్షిణాది సమీకరణాలు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. -
జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ
-
జగన్‌ను కలిసిన కర్ణాటక సీఎం కుమారస్వామి
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ భవన్లో జరిగిన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, ప్రత్యేక హోదాపై ఉభయసభల్లో అవలంభించాల్సిన విధానంపై పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘పార్లమెంట్లో నాలుగవ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్ సీపీ ఉంది. దీన్ని ఒక అవకాశంగా భావించాలి. మనకున్న సంఖ్యాబలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఫలితాలు రాబట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఎంపీల గౌరవం పెరిగేలా, హుందాగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కువ శాతం యువకులు, విద్యావంతులు ఉండటం వల్ల భాషాపరమైన సమస్య ఉండదు. శాఖలవారీగా ఎంపీలు ఏర్పరచుకొని ఆయా శాఖాల నుంచి రావాల్సిన నిధులపై కృషి చేయాలి. వ్యక్తిగత ఆసక్తి, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలను ఎంపిక చేసుకోవాలి. పార్లమెంట్ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా మిథున్ రెడ్డి సలహాలు, సూచనలతో సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఎంపీలను సబ్ గ్రూప్‌లుగా ఏర్పాటు చేసి, మంత్రిత్వ శాఖల వారీగా సబ్జెక్టులు కేటాయిస్తాం. తరచుగా ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను దృష్టి సారించాలి. క్రమశిక్షణ, ఐకమత్యంతో పార్లమెంట్లో వ్యవహరించాలి.’ అని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమరస్వామి...వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కుమారస్వామిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని సాదరంగా ఆహ్వానించారు. మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో 115 ఏస్పిరేషనల్ జిల్లాలపై చర్చ జరగనుంది. నీటి ఎద్దడి, తాగునీటి సమస్య నివారణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. -
స్పీకర్‌గా ఆ దేశ మాజీ అధ్యక్షుడు
మాలీ: మాల్దీవులు రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్‌గా మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మాల్దీవులు డెమోక్రటిక్ పార్టీ నషీద్‌ను ఏకగ్రీవంగా ఎన్నికుంటున్నట్లు ప్రకటించింది. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాల్దీవులు అధ్యక్షుడిగా 2008-2012 కాలంలో నషీద్ పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహ్మాద్ నషీద్ కావడం విశేషం. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నషీద్ 13 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విపక్షనేత ఇబ్రహీం మహ్మద్ నల్హీ అఖండ విజయం సాధించారు. దీంతో కొత్తగా స్వీకర్‌ను ఎన్నుకోవల్సి ఉంది. -
పార్లమెంట్ ఎగ్జిట్ గేట్ వద్ద కారు కలకలం
-
పార్లమెంట్లో భద్రతా లోపంపై కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం పోలీసు పహారాలో ఉండే పార్లమెంట్ ఎగ్జిట్ గేట్ నుంచి ఓ వాహనం లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారుల కళ్లుగప్పి నిష్క్రమణ ద్వారం నుంచి బారికేడ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కారును అడ్డుకున్న భద్రతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ఈ కారు నెంబర్ డీఎల్ 12 సీహెచ్ 4897 కాగా, ఈ వాహనంపై ఎంపీ స్టిక్కర్ ఉంది. ఈ కారు ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ డాక్టర్ తొకొం మైనాకు చెందినదిగా అధికారులు గుర్తించారు. కాగా, కారు ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి రావడంతో భద్రతా లోపాలపై పార్లమెంట్ భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. పార్లమెంట్ ప్రాంగణం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటన 2001 డిసెంబర్13న పార్లమెంట్‌పై జైషే, లష్కరే ఉగ్రవాదుల దాడి ఘటనను జ్ఞప్తికి తెచ్చింది. నాటి ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు సహా తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు పార్లమెంట్ సిబ్బంది, గార్డెనర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ ఉన్నారు. -
పార్లమెంట్లో నేడు రఫేల్‌పై కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రభుత్వం నేడు పార్లమెంట్ ముందుంచనుంది. ఫ్రాన్స్ కంపెనీ దాసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగియనుండటంతో దీనికి కేవలం ఒకరోజు ముందు రఫేల్‌పై కాగ్ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో సమర్పించనుండటం గమనార్హం. రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదిక పార్లమెంట్లో ప్రభుత్వం సమర్పించనున్న క్రమంలో మరోసారి రఫేల్ ప్రకంపనలు చట్టసభను కుదిపేయనున్నాయి. మరోవైపు రఫేల్ ఒప్పందం జరిగిన సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి ఈ ఒప్పందంపై ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది. కాగా కపిల్ సిబల్ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇక రఫేల్‌పై కాగ్ నివేదిక పార్లమెంట్లో మరిన్ని ప్రకంపనలకు దారితీస్తుందని భావిస్తున్నారు. -
రఫేల్‌పై రేపు పార్లమెంట్ ముందుకు కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా పెనుదుమారం రేపుతున్న రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ ముందుంచనుంది. ఫ్రాన్స్ కంపెనీ దాసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందు రఫేల్‌పై కాగ్ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో సమర్పించనుండటం గమనార్హం. మరోవైపు రఫేల్ ఒప్పందం జరిగిన సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి ఈ ఒప్పందంపై ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది. కాగా కపిల్ సిబల్ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇక రఫేల్‌పై కాగ్ నివేదిక పార్లమెంట్లో మరిన్ని ప్రకంపనలకు దారితీస్తుందని భావిస్తున్నారు. -
ఇది ట్రైలర్ మాత్రమే : ప్రధాని మోదీ
-
ఇది ట్రైలర్ మాత్రమే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్ సమాజంలోని అన్నివర్గాలకు లబ్ధి చేకూర్చేలా, సాధికారత కల్పించేలా ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత్ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి తాజా బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన పలు సంక్షేమ పథకాలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ బడ్జెట్‌తో 12 కోట్లకుపైగా రైతు కుటుంబాలు, అసంఘటిత రంగంలో ఉన్న 30–40 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వ చర్యలతో దేశంలో ప్రస్తుతం పేదరికం రేటు గణనీయంగా తగ్గుతోంది. మధ్యతరగతి ప్రజలు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంస్ఎంఈ)లకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు పొందిన మధ్యతరగతి ప్రజలకు అభినందనలు. దేశ నిర్మాణంలో మీరు చేసిన కృషికి సెల్యూట్ చేస్తున్నా’అని తెలిపారు. కిసాన్ నిధి పథకం చరిత్రాత్మకం.. ‘గతంలో ప్రభుత్వాలు రైతుల కోసం రకరకాల పథకాలు తీసుకొచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చలేకపోయాయి. కానీ ‘ప్రధానమంత్రి కిసాన్ నిధి’పేరుతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం చరిత్రాత్మకమైనది. దీనికింద 5 ఎకరాల వరకూ భూమి ఉన్న రైతులకు లబ్ధి చేకూరుతుంది. నవ భారత్ నిర్మాణంలో భాగంగా పశుపోషణ, చేపల పెంపకం రంగాలపై బడ్జెట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన’కింద దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులు లాభపడతారు. ఆయుష్మాన్ భారత్, ఇతర సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. సంక్షేమ పథకాల ఫలాలు అన్నివర్గాలకు దక్కాలి. ఈ మధ్యంతర బడ్జెట్ పేదలకు సాధికారత కల్పిస్తుంది. రైతులకు ప్రోత్సాహం, ఆర్థికాభివృద్ధికి ఊతమందిస్తుంది’’అని పేర్కొన్నారు. -
గోయల్ నోట పదేపదే ‘కోట్ల’ మాట
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ అంటేనే గణాంకాల గారడీ. అంకెలతో కుస్తీ, పద్దులు ఖాతాలపై కసరత్తే అధికంగా కనిపిస్తుంది. పార్లమెంట్లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ అడుగడుగునా పదాల వల్లెవేత సాగింది. బడ్జెట్ ప్రసంగంలో గోయల్ పలుమార్లు కోట్లు, ప్రభుత్వం, భారత్, పన్ను వంటి పదాలను అధికంగా వాడారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన కోట్లు అనేపదాన్ని ఏకంగా 80 సార్లు ప్రయోగించగా, విల్ అనే మాటను 76 సార్లు, ప్రభుత్వం అనే పదాన్ని 60 సార్లు వాడారు. ఇక పన్నును 46 సార్లు, లక్షలను 32 సార్లు బడ్జెట్ స్పీచ్‌లో ప్రస్తావించారు. ఇక సంవత్సరం అనే పదాన్ని 29 సార్లు, కూడా అంటూ 28 సార్లు మాట్లాడారు. పెంపు అనే పదాన్ని 23 సార్లు ప్రస్తావించారు. -
భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ : పీయూష్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక్‌సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మోదీ సారథ్యంలో సుస్థిర పాలన అందిచామన్నారు. అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోందన్నారు. విధాన నిర్ణయాల్లో వేగం పెంచామన్నారు. -
పార్లమెంట్‌కు చేరుకున్న పీయూష్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యంతర బడ్జెట్‌ను మరికాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.బడ్జెట్ పత్రాలతో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నారు. అంతకుముందు పీయూష్ గోయల్ రాష్ట్రపతి భవన్లో రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్న అనంతరం నేరుగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాగా మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానుండటంతో మధ్యంతర బడ్జెట్లో గ్రామీణ రైతాంగానికి, పట్టణ మధ్యతరగతి వర్గాలకు చేరువయ్యే పథకాలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. రైతులకు నగదుసాయం, వేతనజీవులకు ఊరటగా ఐటీ మినహాయింపు పరిమితి పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి స్పష్టత
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు బదులు నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందనే వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2019-20 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సాధారణంగా ఎన్నికల ఏడాది మధ్యంతర బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఆనవాయితీ.ఎన్నికల అనంతరం కొలువుతీరే ప్రభుత్వం పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఎన్నికలకు ముందు పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయానికి సంబంధించి అనుమతి అవసరం కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం కొద్దినెలల కాలానికి ప్రవేశపెడుతుంది. కాగా,ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లడంతో గత వారం ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయల్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ సహాయమంత్రులు పొన్ రాధాకృష్ణన్, శివ్ ప్రతాప్ శుక్లాలు ఇటీవల హల్వా వేడుకతో బడ్జెట్ కసరత్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి మోదీ సర్కార్ స్వస్తిపలుకుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీనే బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ఏప్రిల్‌లో నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభానికే మంత్రిత్వ శాఖలు తమ కేటాయింపులు పొందేలా కార్యాచరణ రూపొందించుకునే వెసులుబాటు ఏర్పడింది. -
విదేశాలకు వెళ్లే కార్మికులకు శిక్షణ
పార్లమెంటులో ప్రవాస భారతీయం గల్ఫ్, మలేషియా తదితర దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు ఒకరోజు అవగాహన శిక్షణ ఇస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ డిసెంబర్ 12న లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తమిళనాడుకు చెందిన ఏఐడీఎంకే సభ్యుడు డా.సి.గోపాలక్రిష్ణన్, పి.నాగరాజన్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ – పీడీఓటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా దేశాల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలు తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు (సాఫ్ట్ స్కిల్స్) పెంపొందించుట ఈ శిక్షణ ఉద్దేశమని మంత్రి వివరించారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడం లక్ష్యమని వివరించారు. ఇప్పటివరకు 30వేల మంది కార్మికులకు పీడీఓటీ శిక్షణ ఇచ్చామని తెలిపారు. అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా ఈ శిక్షణను అందించాలని ఆయన కోరారు. కాన్సులార్ ఆక్సెస్.. భారత పౌరులు విదేశీ జైళ్లలో, నిర్బంధ కేంద్రాలలో (డిటెన్షన్ సెంటర్లు) ఉన్నప్పుడు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యా లయాలు స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ‘కాన్సులార్ ఆక్సెస్’ (భారత దౌత్య అధికారులను కలిసే అవకాశం) కల్పిస్తున్నామని ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ సభ్యుడు రవీంద్ర కుమార్ జెనా అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. 68 దేశాల జైళ్లలో 8,445 మంది భారతీయ ఖైదీలు 68 దేశాలలోని వివిధ జైళ్లలో 8,445 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ వెల్లడించారు. పశ్చిమబంగకు చెందిన సీపీఎం సభ్యుడు బదరుద్దొజాఖాన్ అడిగిన ప్రశ్నకు డిసెంబర్ 19న మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని కఠినమైన గోప్యతా చట్టాల కారణంగా ఖైదీల సమాచారాన్ని వెల్లడించడం లేదని, 15 దేశాల జైళ్లలో శిక్ష అనుభవిస్తూ 40 మంది భారతీయ ఖైదీలు మృతిచెందారని తెలిపారు. ‘విదేశా ల్లోని భారతీయుల భద్రత, శ్రేయస్సు భారత ప్రభుత్వం ముఖ్య ప్రాధాన్యతలు. ప్రవాస భారతీయులు దాడులు, అగౌరవానికి గురైన సందర్భాలలో భారత దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండి జాగరూకతతో పర్యవేక్షిస్తాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. ఉచితంగా సేవలు అందించే న్యాయవాదులు (ప్రోబోనో లాయర్స్) అందుబాటులో ఉన్న దేశాలలో ఖైదీలకు న్యాయ సహాయం అందజేస్తున్నాం’ అని మంత్రి వివరించారు. శిక్ష కాలం పూర్తయిన భారతీయ ఖైదీల విడుదలకు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ ప్రభుత్వాలకు చెందిన సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ఎగ్జిట్ వీసాలు (దేశం విడిచి వెళ్లడానికి అనుమతి), జరిమానాల మాఫీ లాంటి పనులు వేగవంతంగా పూర్తిచేసి త్వరగా భారత్‌కు రప్పిస్తున్నామని పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలకు అవసరమైన సందర్భాలలో ఉచితంగా విమాన ప్రయాణ టికెట్లు సమకూరుస్తున్నామని వివరించారు. కాగా, గల్ఫ్‌లోని ఆరు దేశాల జైళ్లలో 4,705 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. –మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు -
‘నారా పవన్ రాహుల్ నాయుడు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాటం కొనసాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం పార్లమెంటులో ఆందోళన చేపట్టింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు భవనాల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా హైకోర్టు భవనం నిర్మించలేదని ఎద్దేవా చేశారు. హైకోర్టును హైదరాబాద్ నుంచి అమరావతికి తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి సరిగా అమలు కాలేదని విమర్శించారు. శంకుస్థాపనలతో చంద్రబాబు జనాలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రతి రాజకీయ పార్టీతో కాపురం చేశారని.. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు పవన్‌తో గతంలో వివాహం చేసుకుని విడాకులు ఇచ్చి.. మళ్లీ పవన్‌ను వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. చంద్రబాబుకు నారా పవన్ రాహుల్ నాయుడని సముచితమైన పేరు ఉందని వ్యాఖ్యానించారు. జనసేనలో టీడీపీ కోవర్టులు.. చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల రాజకీయం అన్ని వేళలా, అంతటా పనిచేయదని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చంద్రబాబు వ్యవహర శైలిపై మండిపడ్డారు. ఖమ్మంలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్లో చేరిపోమంటున్నారని ఆరోపించారు. తన కోవర్టులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించి ఆ పార్టీని నాశనం చేశారని అన్నారు. జనసేనలోకి కూడా తన కోవర్టులను పంపించి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
జగన్ సీఎంకాగానే తిన్నదంతా కక్కిస్తాం
-
‘చంద్రబాబుపై కోర్టు ధిక్కారం కేసు పెట్టాలి’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదాను కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ముందు ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్కేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు కేంద్రంలో మోదీతో అంటకాగింది వ్యభిచారమా, కాపురమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంకాగానే తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. హైకోర్టు విభజనపై తప్పుడు సమాచారం ఇచ్చిన చంద్రబాబుపై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ కోసమే హైకోర్టును విభజించారని చెప్పడంతో చంద్రబాబుకు మంతిభ్రమించిందని అనడానికి నిదర్శనమన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాస్తానని అనటం తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌తో పాటు హోదాకు ఎవ్వరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని అన్నారు. తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలి.. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని వైఎస్సార్సీపీ రాజ్యసభలో డిమాండ్ చేసింది. బిల్లులోని పలు అంశాలను సెలెక్టు కమిటీ పరిశీలన చేయాలని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. -
‘గేట్లు పెట్టి డబ్బా కొట్టుకోవడం విడ్డూరం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో పోరాటం కొనసాగిస్తున్నారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. వైఎస్సార్ సీపీ ఎంపీలు వి విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాకుండా పత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎంపీల నిరసనలతో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంట్ వెలుపల కూడా వైఎస్సార్ సీపీ నాయకులు తమ నిరసనలను కొనసాగించారు. గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ నాయకులు ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు డ్రామాలను జనం నమ్మేందుకు సిద్ధంగా లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణాన్ని గ్రాఫిక్స్‌లో చూపించి జనాన్ని మాయ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజక్టుకు గేట్లు పెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పునాది రాయి పేరిట డ్రామాలు... ఆగమేఘాలమీద కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబుపై కడప మాజీ అవినాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే స్టీల్ ప్లాంట్‌కు కొబ్బరికాయ కొట్టారని అన్నారు. ఆ ప్లాంట్‌కు చంద్రబాబు పెట్టే ఖర్చు నాలుగు టెంకాయలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ ధర్నాలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
రాఫేల్, కావేరీ వివాదాలపై పార్లమెంట్లో గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ : క్రిస్మస్ విరామం అనంతరం గురువారం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలూ సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. కావేరీ వివాదంపై నిరసనలు హోరెత్తడంతో రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో రాఫేల్ ఒప్పందంపై విపక్షాలు నినాదాలతో ప్రభుత్వంపై విరుచుకుపడటంతో గందరగోళం నెలకొంది. ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై చర్చ చేపట్టాల్సిఉండగా సభ రాఫేల్ డీల్‌పై దద్దరిల్లింది. విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ పార్టీ సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేశాయి. ఈ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ట్రిపుల్ తలాక్‌ను నేరపూరిత చర్యగా బిల్లులో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత శశి థరూర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం లోక్‌సభ ముందుంచనుంది. -
రైళ్లలోనూ బ్లాక్‌బాక్స్‌లు!
సాక్షి, న్యూఢిల్లీ : విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. విమానాల్లో మాదిరిగా రైళ్లలో లోకో కాబ్ ఆడియో వీడియా రికార్డింగ్ సిస్టమ్, క్రూ వాయిస్, వీడియో రికార్డింగ్ సిస్టమ్‌లను నెలకొల్పుతామని పార్లమెంట్లో రైల్వే సహాయ మంత్రి శ్రీ రాజెన్ గోహెన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఊహించని ఘటనలు జరిగిన సందర్భాల్లో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిర్వహణ అంశాలు, మానవ తప్పిదాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులకు ఈ వ్యవస్థ కీలక సమాచారం చేరవేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సిస్టమ్‌ను ఇప్పటికే 26 రైళ్లలో అమర్చినట్టు తెలిపింది. ఈ వ్యవస్థను పలు రైళ్లలో అమర్చేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు 2018-19 బడ్జెట్లో రూ 100 కోట్లు కేటాయించినట్టు ప్రకటన తెలిపింది. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీల ఖరారు
-
ఫలప్రదంగా జరిగాయ్!!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిసి, నిరవధికంగా వాయిదాపడ్డాయి. జూలై 18వ తేదీ నుంచి మొదలయిన ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతోపాటు కీలకమైన ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనంతరం ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండటంతో వాటిని రికార్డుల నుంచి తొలగించటం గమనార్హం. అయితే, ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ప్రవేశపెట్టలేకపోయింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ కార్యకలాపాలు ఫలవంతంగా సాగడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాసం.. కీలక బిల్లులు గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈసారి ‘సంతృప్తికరం, ఫలప్రదం’గా జరిగాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే కీలక బిల్లులతోపాటు అవినీతి నిరోధక, క్రిమినల్ లా, ఆర్థిక ఎగవేతదారుల బిల్లు, బాలలకు ఉచిత, నిర్బంధ హక్కు బిల్లు, మనుషుల రవాణా వ్యతిరేక బిల్లు వంటివి 21 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన 4,140 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఇందులో 75 ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అందజేసిన 62 నివేదికలతోపాటు సభ్యులు 128 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారని వివరించారు. వివిధ అంశాలపై సభ్యుల నిరసనల కారణంగా 27 గంటల సభాకాలం వృథా అయింది. ‘ట్రిపుల్ తలాక్’ను చర్చించని రాజ్యసభ రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో శుక్రవారం రాజ్యసభ సజావుగా సాగలేదు. త్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేయాలని, పార్లమెంట్ సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో చర్చకు తీసుకోవట్లేదని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. త్వరలో దీనిపై ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రవేశపెట్టిన బిల్లును సభ తిరస్కరించింది. అత్యంత ఫలప్రదం జూలై 18వ తేదీ నుంచి మొదలైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఈ సెషన్లో భాగంగా 24 రోజుల్లో 17 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎజెండా ప్రకారం లోక్‌సభ 118 శాతం, రాజ్యసభ 74 శాతం సమర్ధంగా నడిచింది. లోక్‌సభ 21 బిల్లులు, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి. 21 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో అనువాదకుల సాయంతో ఏకకాలంలో వినే సౌకర్యం సభ్యులకు మొదటిసారిగా కల్పించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లులను ఆమోదించిన ఈ సమావేశాలను సామాజిక న్యాయ ఉత్సవంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ అభివర్ణించారు. ఈ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగటం 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. 16వ లోక్‌సభలో ఇదే రికార్డు. మొత్తం బిల్లుల్లో 26శాతం మాత్రమే పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు ప్రభుత్వం పంపగా ఇది 15వ లోక్‌సభలో 71శాతం, 14వ లోక్‌సభలో 60శాతం వరకు ఉంది. మొత్తం 999 ప్రైవేట్ బిల్లులను సభలో ప్రవేశపెట్టడం కూడా 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమం. రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు తొలగింపు కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్‌పై ప్రధాని మోదీ గురువారం చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరమైనవిగా భావిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం అధికార పార్టీని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లయింది. ప్రధాని మాటలను, అభ్యంతరకరంగా ఉన్నాయనే ఆరోపణలతో రికార్డుల నుంచి తీసివేయడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారని రాజ్యసభ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్ధిగా ప్రతిపక్షం బలపరిచిన హరిప్రసాద్‌పై ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ గెలుపు సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ పేరులోని ‘బి.కె.’ కలిసి వచ్చేలా అమర్యాదకరమైన 3 హిందీ పదాలను వాడారు. దీంతో ఆ వ్యాఖ్యలను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంత్రి రాందాస్ అథవలే చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. -
ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. పాలక, విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా సాగిన ఉభయ సభలూ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక ప్రస్తుత సమావేశాల్లో చేపట్టిన బిల్లులు, సవరణలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సభకు వివరించిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలను సెక్రటేరియట్ అధికారులు రికార్డుల నుంచి తొలిగించారు. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థిగా హరివంశ్, విపక్ష అభ్యర్థిగా హరిప్రసాద్ పోటీపడ్డారు. హరివంశ్ విజయం తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ.. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిని విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ తప్పుపట్టారు. చైర్ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని ఆరోపించారు. ఈ క్రమంలో మోదీ ప్రసంగంలోని కొన్నిపదాలను రాజ్యసభ సెక్రటేరియట్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదప్రయోగంతో విపక్ష అభ్యర్థి ఇబ్బందిపడిన కారణంగా.. వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగించిన్నట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించడం ఇదే తొలిసారి. పెద్దల సభలో చర్చకు రాని ట్రిపుల్ తలాఖ్.. వర్షాకాల సమావేశాల్లోనూ ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించలేదు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసినందున ట్రిపుల్ తలాఖ్ బిల్లును చేపట్టలేమని చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో తెలిపారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు గతేడాదే లోక్‌సభ ఆమోదం లభించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి తగిన మెజార్టీ లేకపోవడంతో వ్యతిరేకత ఎదురైంది. ఎగువసభలో అడ్డంకులను అధిగమించేందుకు ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు నిన్న కేంద్ర కేబినెట్ మూడు కీలక సవరణలు కూడా చేసింది. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రాజ్యసభ బిల్లుపై చర్చ చేపట్టలేదు. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించనందున.. కేంద్రం ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ తీసుకురానుందని సమాచారం. -
‘ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ దేవాలయం లాంటిదని అలాంటి చోట ప్రజల సమస్యల పరిష్కారాల కోసం చర్చలు జరగాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై మహాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ‘విజన్ ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన వర్క్ షాప్‌లో పాల్గొన్న స్పీకర్ పార్లమెంట్ కార్యకలాపాలపై మాట్లాడారు. సమస్యల గురించి చర్చించాల్సిన చోట సభ్యుల మధ్య వాగ్వాదాలు జరుతున్నాయని మహాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను ప్రజలు గమనిస్తున్న విషయం ఎంపీలు గుర్తెరిగి ప్రవర్తించాలని, ఎన్నికల సమయంలో సభను అర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొన్నారు. ఎంపీలందరూ సభ రూల్స్ పాటించాలని, వెల్ లోపలికి వచ్చి అవాంతరం కలిగించి సభా మర్యాదలకు భంగం కలిగించడం మంచిది కాదన్నారు. సభ్యుల చర్యల వల్ల గత బడ్జెట్ సమావేశంలో 127 గంటల సమయం వృథా అయిందని, 29 సార్లు సమావేశమైతే కేవలం 0.58 శాతం ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగిందని వెల్లడించారు. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహాజన్ పలుమార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష, అధికార పక్షాలు మహిళా రిజర్వేషన్లకు సహకరించాలని ఆమె ఎంపీలను కోరారు. మీడియా ప్రసారాలపై స్పీకర్ ఆగ్రహించారు. సభలో మంచి చర్చ జరిగినప్పుడు ప్రచారం చేయ్యరని, సభ్యుల మధ్య వాగ్వాదం జరిగితే పదేపదే ప్రసారం చేస్తారని అన్నారు. -
తొలి పార్లమెంటేరియన్ తిలక్ కన్నుమూత
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, మొదటి పార్లమెం టేరియన్ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ (98) శుక్రవారం అక్కయ్య పాలెంలోని తన కుమారుడి ఇంట మధ్యాహ్నం 12.48 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయ నకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య సూర్యకాంతం 2015లో కన్ను మూశారు. అప్పటి నుంచి కుమారుడు వద్ద ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం మహారాజా కాలేజీ, బెనారస్ కళాశాల, బెల్గాంలలో సాగింది. గ్రాడ్యు యేషన్ పూర్తిచేసి, న్యాయవిద్యలో పట్టభద్రు లయ్యారు. తొలి పార్లమెంట్ ఏర్పడిన 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తిలక్ ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఈయన దేశంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన వారిగా గుర్తింపు పొందారు. మొదట్లో కాంగ్రెస్ ద్వారా రాజకీ యాల్లో ప్రవేశించినా తదనంతరం సోషలిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై సోషలిస్టు పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. పార్ల మెంట్‌కు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో నాటి ప్ర«ధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఇంతవరకు జీవించి ఉన్న తొలి పార్లమెంటే రియన్ ఈయన ఒక్కరే. కాగా, తిలక్ పార్థివ దేహాన్ని ఆయన కోరిక మేరకు గాయత్రి వైద్య కళాశాలకు అందజేయనున్నట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. తిలక్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. -
కూటమి సర్కార్లు చేటు కలిగిస్తాయనడం భ్రమ
అవలోకనం ఎందుకనో మన మార్కెట్ విశ్లేషకులకు కూటమి ప్రభుత్వాలపై దురభిప్రాయాలున్నాయి. ఆ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలకు మంచివికాదని, అవి నిర్ణయాత్మకంగా వ్యవహరించలేవని వారి భావన. కానీ వెనక్కెళ్లి చూస్తే సుస్థిరమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలకంటే కూటమి ప్రభుత్వాల హయాంలోనే దేశం ప్రయోజనం పొందింది. దినదినగండంగా బతుకీడ్చిన ప్రభుత్వాలే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోగలిగాయి. ప్రపంచబ్యాంకు పాలనా సూచికలు కూడా ఈ విషయాలనే చాటుతున్నాయి. ‘హంగ్ పార్లమెంటు’ అనే పదబంధం వింటేనే స్టాక్ మార్కెట్ వణుకుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వం అవసరమని, ఒకే పార్టీకి మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఇది అసాధ్యమనుకో వడమే ఇందుకు కారణం. ఏక పార్టీ పాలన లేకపోతే సరైన ఆర్థిక నిర్దేశం ఉండదని, అందువల్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వృద్ధి కొరవడుతుందని, కేబినెట్లో స్వప్రయోజనపరులు పెరుగుతారని, నాయకత్వం చేసే పనులకు అడ్డుతగులుతా రని అటువంటివారు అంటారు. మెజారిటీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా, కూటములకు వ్యతిరేకంగా సాగే వాదనలకు స్థూలంగా ఇదీ ప్రాతిపదిక. అయితే ఇటీవలి సంవత్సరాల్లోని ఆధారాలు ఈ ఆలోచనను బలపరిచేలా లేవు. యూపీఏ తొలి దశ పాలనాకాలం(2004–09)లో మొదటి అయిదేళ్లూ జీడీపీ వృద్ధి 8.5 శాతం. ఇది దేశ చరిత్రలో ఏ అయిదేళ్ల పాలనను తీసుకున్నా అత్యధికమని చెప్పాలి. కేవలం 145 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దీన్ని సాధించింది. సమాచార హక్కు చట్టంవంటి అత్యుత్తమ చట్టాలు ఈ కాలంలోనే రూపొందాయి. అదే కూటమి తదుపరి ఎన్నికల్లో సైతం 200 స్థానాలు గెల్చుకుని అధికారంలోకొచ్చింది. లెక్కప్రకారం యూపీఏ–2 ప్రభు త్వానికి మరింత స్వేచ్ఛ లభించింది గనుక అది లోగడకంటే ఎక్కువ నిర్ణయాత్మ కంగా ఉండాలి. కానీ జీడీపీ గణాంకాలు దీన్ని ప్రతిఫలించవు. ఈసారి సగటున 7 శాతం వార్షిక జీడీపీ మాత్రమే నమోదైంది. అయితే ఈ కాలం ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటున్న దశ అని, అందువల్ల అధిక వృద్ధి సాధించడానికి అనువైన మద్దతు వెలుపలి నుంచి లభించలేదని మనం గుర్తించాలి. నిజానికి ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉన్న ఈ తరుణంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్న ఈ సమయంలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత బలహీనమైన ఆర్థిక వృద్ధి నమోదైంది. ప్రభుత్వ పనితీరును వ్యాఖ్యా నించడం నా ఉద్దేశం కాదు. స్టాక్ మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు భయపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికుండే మెజారిటీకీ, నమోదయ్యే జీడీపీ వృద్ధికీ సంబంధం లేదని చెప్పడమే నా వివరణలోని అంతరార్థం. కూటమి ప్రభుత్వాలు ప్రధానమైన సంస్కరణలను తీసుకురాలేవన్నది మరో భయం. కానీ దినదినగండంగా బతు కీడ్చిన మైనారిటీ ప్రభుత్వాలున్న కాలంలోనే దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక సంస్క రణలు ప్రారంభమయ్యాయి. అందరూ ‘డ్రీమ్ బడ్జెట్’గా చెప్పుకునే 1998నాటి బడ్జెట్‌ను అతి తక్కువ కాలం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలినుంచి మద్దతిచ్చింది. కనుక ఈ చరి త్రంతా గమనిస్తే కూటమి ప్రభుత్వాలు మంచివి కావని మార్కెట్లు ఎందుక నుకుంటాయో ఎవరికీ బోధపడదు. ప్రపంచబ్యాంకు వివిధ సంవత్సరాల్లో విడుదల చేసిన ప్రపంచవ్యాప్త పాలనా సూచికల ఆధారంగా యూపీఏ–1, యూపీఏ–2, ఎన్డీఏ ప్రభుత్వాలను పాత్రికేయుడు టీఎన్ నైనన్ పోల్చిచూపారు. అవినీతి నియంత్రణ అంశంలో మన పర్సంటైల్ ర్యాంకు 2013లో 37.0 నుంచి 2016లో 47.1కు మెరుగైంది. కానీ దీనికీ, మన్మోహన్ హయాంలో సాధించిన పర్సంటైల్ 46.8కీ పెద్దగా తేడాలేదు. ప్రభుత్వ పనితీరులో మన దేశం ర్యాంకు 2014లో 45.2 ఉండగా 2016లో అది 57.2, అంతకు చాలాముందు అంటే యూపీఏ–1 హయాం(20017)లో అది 57.3. నియంత్రణలకు సంబంధించి 2012నాటి స్కోరు 35.1 అయితే, 2016లో అది 41.3. కానీ 2006లో అది అత్యధికంగా నమోదైంది. ఆనాటి స్కోరు 45.1. రాజకీయ సుస్థిరత, హింస లేకపోవడం విషయంలో మన ర్యాంకు ఎప్పుడూ అల్పమే. 2005లో అది 17.5... 2014లో 13.8...2015లో 17.1...ఆ మరుసటి ఏడాది 14.3(అంటే 2005నాటి కంటే ఘోరం). శాంతిభద్రతల విషయంలో 2016 (52.4)... 2013 (53.1) కన్నా స్వల్పంగా తక్కువ. కానీ 2006 (58.4)తో పోలిస్తే బాగా తక్కువ. ఈ ర్యాంకుల్లో ఆఖరి సూచిక అభిప్రాయ వ్యక్తీకరణ, జవాబు దారీతనంలో చూస్తే 2013నాటి 61.5 ర్యాంకు 2016 కల్లా 58.6కు దిగింది. ఈ డేటా స్పష్టంగానే ఉంది. మార్కెట్లు, విశ్లేషకులు భయపడుతున్నట్టుగా ‘పటి ష్టమైన, నిర్ణయాత్మకమైన’ ప్రభుత్వం సాధించగలిగేదీ, ‘బలహీనమైన’ ప్రభుత్వం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇది నాయ కత్వపటిమకూ, దాని గురికి సంబంధించింది. అంతేతప్ప కీలకమైనదిగా కనబడే లోక్‌సభ అమరికతో దీనికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మెజారిటీ లేకున్నా కీలకమైన జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అంశం చర్చకొచ్చినప్పుడు అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేమీ కాదు. నిజానికి స్పష్టమైన ఆధిక్యత మనకు అంత మంచిది కాదని నేను వాదిస్తాను. మన దేశంలాంటి వైవి ధ్యభరిత దేశంలో సాహసవంతమైన నిర్ణయం తీసుకుని అది కాస్తా వికటిం చడంకంటే... ఎంతో అప్రమత్తతతో, మధ్యే మార్గం ఎంచుకోవడమే శ్రేయస్కరం. ముందే ఏర్పర్చుకున్న కొన్ని అభిప్రాయాల కారణంగానే ఏదో ఒక పార్టీకి మెజారిటీ ఉండటం మంచిదన్న ఆలోచన ఏర్పడుతుందని మనం ఒప్పుకోవాలి. ఉదా హరణకు ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతికరమైనవి, స్వప్రయోజనాలతో కూడిన వని, కుల ప్రాతిపదికన ఏర్పడే పార్టీలు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన అధునాతన భావాలతో ఉండవని కొందరంటారు. కానీ ఇందులో విశ్లేషణకంటే ప్రతికూల భావమే ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ మరో పార్టీ కంటే ఏ విషయంలోనూ ఉన్నతమైనదని చెప్పుకోలేదు. ఉత్తర భార తంలోని ఇటీవలి పరిణామాలు 2019లో హంగ్ పార్లమెంటు ఏర్పడవచ్చునని లేదా పాలకపక్షానికి తగినంత మెజారిటీ రాకపోవచ్చునని సూచిస్తున్న నేపథ్యంలో దీన్ని నేను రాయాల్సివచ్చింది. ‘హంగ్’ రావడం లేదా పాలకపక్షానికి మెజారిటీ తగ్గడం తథ్యమని మున్ముందు సర్వేలు వెల్లడిస్తే మన మార్కెట్ విశ్లేషకులు, బిజి నెస్ పత్రికలు దేశ ఆర్థిక వ్యవస్థకూ, సుస్థిరతకూ అది మంచిదికాదని ఊదర గొడతారు. కానీ చరిత్ర మాత్రం అదొక సమస్యే కాదని చెబుతోంది. నిజానికి అలా ‘హంగ్’ ఏర్పడటం స్వాగతించదగ్గదని మాబోటివాళ్లం అనుకుంటున్నాం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్ఎస్ మోసం..
సాక్షి, హైదరాబాద్ : ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్లీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్లు సాధ్యం కాదని కేంద్రం చెప్పిందని, దానికి టీఆర్ఎస్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు. మెడీ-అమిత్ షా కనుసన్నల్లోనే సీఎం కేసీఆర్ నాటకాలడుతున్నారని ఆయన అన్నారు. -
ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పారంటూ...
సాక్షి, న్యూఢిల్లీ : రుణ మాఫీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రస్తావించడం ఆసక్తి రేపింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు రుణ మాఫీ హామీలివ్వడం సరైంది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడాన్ని జైట్లీ ప్రస్తావించారు. రుణ మాఫీ వాగ్ధానాలతో లబ్దిదారులు రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నా చెల్లించేందుకు ముందుకురారరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఈ పరిణామం బ్యాంకింగ్ రంగంతో పాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారన్నారు. అయితే ఈసీకి రాజకీయ పార్టీల రుణ మాఫీ హామీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసిన ఆర్బీఐ మాజీ గవర్నర్ పేరునూ, ఆయన ఎప్పుడు ఈ లేఖ రాశారనే వివరాలను జైట్లీ వెల్లడించలేదు. నాబార్డ్, సిడ్బీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులోనూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రుణ మాఫీలు, సబ్సిడీలు పరపతి వ్యవస్థను దెబ్బతీసాయని ఆందోళన వ్యక్తం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయం గురించి ఆర్థిక మంత్రి ఇచ్చిన వివరణ దుమారం రేపుతోంది. రైతు రుణమాఫీపై అసలు ప్రభుత్వ ఉద్దేశమేంటనేది జైట్లీ వివరణ ఇవ్వకపోవడం పలు సందేహాలను ముందుకు తెస్తోంది. గతంలోనూ ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ దిగ్గజాలు వ్యవసాయ రుణాల మాఫీపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడంపై ఆందోళన నెలకొంది. -
బ్యాంకులకు రూ .80,000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం కింద రూ 80,000 కోట్ల నిధులను అందించాలన్న ప్రతిపాదనకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. మొండి బాకీలు, రుణ డిమాండ్ తగ్గుదలతో సతమతమవుతున్న బ్యాంకులను ఆదుకునేందుకు ప్రభుత్వం భారీగా నిధుల సాయం అందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. బాండ్ల ద్వారా పీఎస్‌యూ బ్యాంకులకు రూ 80,000 కోట్లు అదనందగా వెచ్చించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ల వ్యవధిలో బ్యాంకులకు రూ 1.35 లక్షల కోట్ల మూలధనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు జూన్ 2017 నాటికి విపరీతంగా పెరిగి రూ 7.33 లక్షల కోట్లకు ఎగబాకాయి. -
రాహుల్ పోలీస్ సలహాలు పాటించడం లేదు..
♦ కేంద్రహోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారు దాడిపై పార్లమెంటులో దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ నేత మల్లి ఖార్జున్ ఖర్గే దాడిని ఖండిస్తూ ఈ అంశాన్ని సభలో లెవనెత్తారు. బీజేపీ కార్యకర్తలు రాహుల్‌ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం విచారణ జరుపుతోందని ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాహుల్ ఎస్పీజీ పోలీసుల భద్రత లేకుండా ఇప్పటికి 6 సార్లు దేశం విడిచి వెళ్లారని, పోలీస్ సలహాలు పాటించడంలేదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనకు బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఎందుకు వెళ్లలేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ వరద బాధితులను పరామర్శించేందకు వెళ్లిన రాహుల్ గాంధీ కారు పై రాళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. -
డబ్బులు దండుకునేందుకే మహిళా పార్లమెంటు
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు పైపైకి గొప్పలు చెప్పుకునేందుకు, డబ్బులు దండుకునేందుకు తప్పితే మహిళలకు సాధికారిత కల్పించేందుకు కాదని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోడలు మగపిల్లవాడిని కంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్లలను కించపరుస్తూ వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఆడవాళ్ళును షెడ్డులో ఉన్న కార్లతో పోల్చుతూ మాట్లాడిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ సదస్సు నిర్వహించటానికి అర్హులేనా అని ప్రశ్నించారు. నగరి ఎమ్మెల్యే రోజాను సదస్సులో పాల్గొననీయకుండా చేసినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. విగ్రహం వద్ద నిరసన తెలియచేసిన అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ రోజాను సదస్సుకు ఆహ్వానించి అవమానించటం చాలా దారుణమన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అధికారులు ఎవరినీ తమ విధులు నిర్వర్తించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన చేస్తున్నాడన్నారు. తన సొంత కోడలుపై దౌర్జన్యంచేసి మనవడిని అపహరించిన స్పీకర్ కోడెల ఏమాత్రం అర్హుడు కాదన్నారు. అసెంబ్లీలో ఒక ఆడకూతురిని ఏడాదిపాటు సస్పెండ్ చేసిన చరిత్ర స్పీకర్ కోడెలది అన్నారు. అసెంబ్లీలో తమను ఎదిరించి మాట్లాడుతుందోనని, సదస్సుకు హాజరైతే తమ బండారం ఎక్కడ బయటపెడుతుందోనని రోజాను హాజరుకానీయకుండా చేశారన్నారు. ఎమ్మార్వో వనజాక్షి, రిషితేశ్వరి, ఇటీవల మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ఆడవారికి భద్రతలేదనే విషయం తేటతెల్లమవుతుందని చెప్పారు. సదస్సు నిర్వహణకు కేటాయించిన రూ.13 కోట్ల డబ్బును వాటాలు పంచుకొని దండుకునేందుకు మాత్రమే నిర్వహించారని ఆరోపించారు. జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు మహిళలు అంటే ఏమాత్రం గౌరవలేదన్నారు. ఆడవారు వంటింట్లో ఉండాలి, కారు షెడ్డులో ఉండాలని వ్యాఖ్యానించిన స్పీకర్ కోడెల తన కుమార్తె ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. స్త్రీలను అవమానించటం ఏమాత్రం తగదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.ఏ.హనీఫ్, కందుల ఎజ్రా, షేక్.ఖాదర్‌బాషా, బాపతు రామకృష్ణారెడ్డి, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, షేక్.సైదావలి, వంకా శ్రీనివాసరెడ్డి, షాహిదా, అలీంభాయ్, ఖాజామొహిద్దీన్, పంగులూరి విజయకుమార్, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
అరకు పార్లమెంటు పరిశీలకురాలిగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి
పాడేరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకురాలిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రెండేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి పోరాటం సాగిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తూ జీవో 97 జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. కొయ్యూరు, చింతపల్లిల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వానికి దడ పుట్టించారు. ఏజెన్సీలో గిరిజన సమస్యలపై దృష్టి సారించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి పరిష్కారానికి నిరంతరం కృషి జరుపుతున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాడేరు నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా నియమితులైన ఆమె అప్పట్లో పార్టీ నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు పార్టీ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లో కూడా అనతికాలంలోనే విశేషమైన ఆదరాభిమానాలు చూరగొన్నారు. జిల్లాలోనే ముందుగా పాడేరు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరిని ఖరారు చేయడం విశేషం. నియోజకవర్గంలోనే కనీవినీ ఎరుగని రీతిలో 25 వేల పైచిలుకు భారీ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆమెకు పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ అపూర్వమైన ఆదరణ లభించింది. గత రెండేళ్లలో ఆమె ఎక్కడా రాజీ పడకుండా పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అధికార పార్టీ నిర్బంధాలను సైతం తిప్పికొడుతూ ముందుకు దూసుకుపోయారు. ∙అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత పార్టీకి దూరమవడంతోపాటు అక్కడి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సైతం వైఎస్సార్ పార్టీని వీడి ఇటీవల టీడీపీలో చేరడంతో గిడ్డి ఈశ్వరి ఇటు అరకు నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణపై దృష్టి సారించి పార్టీ శ్రేణులకు అండగా, మార్గదర్శకంగా నిలిచారు. ఆది నుంచి పార్టీ కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న ఈశ్వరి అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వాసాన్ని చూరగొన్నారు. అరకు పార్లమెంట్ పరిశీలకురాలిగా ఈశ్వరి నియామకం పట్ల పార్టీ వర్గాల్లో, గిరిజనుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది గిరిజన మహిళకు దక్కిన మరో గౌరవంగా పేర్కొంటున్నారు. -
కుయుక్తుల క్రీడ దొంగలకు నీడ
జాతిహితం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరినీ దొంగలుగా విశ్వసిస్తూ... బందిపోట్లు, నయవంచకులు, లాబీయిస్టులు, ఒప్పందాలు కుదిర్చేవారి జీవితాలను దుర్భరంగా మార్చడానికి బదులు దేశాన్ని వారి దయా దాక్షిణ్యాలకు వదిలేశారు. విధ్వంసకరమైన ప్రతికూలాత్మకత ఆవరించి ఢిల్లీ కంపుతో కుళ్లిపోతోంది. రాజకీయ పోరాటాలు పార్లమెంటులోనో, ఎన్నికల్లోనో లేక బహిరంగ చర్చలోనో జరగక... వంచనాత్మక రాజకీయాలకు పాల్పడుతుండటం ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఇంటి ముందు పెంటకుప్పను పెట్టడంతో సమానమైనది. దొంగలు తప్పించుకుపోతుండగా బురద జల్లుకోవడం, జిత్తులమారి కుయుక్తులను ప్రయోగించడం భారీ స్వీయ వినాశక ఆయుధాలుగా మారే కంపు కొట్టే నూతన రాజకీయాలను ఆస్వాదిద్దాం. కాస్త దారి తప్పినా జ్ఞానీ జైల్‌సింగ్ మహా ఇష్టంగా చెబుతుండే ఈ కథనాన్ని చూద్దాం. ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉండగా పాటియాలాలోని వ్యాపార వర్గాలు ఆయన పార్టీకి నిధులను సమకూర్చకపోవడంపై ఆందోళన చెందారు. దీంతో ఆయన తన అభిమానపాత్రుడు, యుక్తివంతుడైన ఒక కిలాడీని పిలిపించి ‘‘లాలాల’’కు (వారిలో అత్యధికులు బనియాలు) పాటియాలా పాఠం చెప్పే పనిని అప్పచెప్పారు. డీఎస్పీగా పనిచేస్తున్న ఆ విధేయుడు నిండు సంచులతో తిరిగొచ్చాడు. అతను చేసిందల్లా తెరలు వేసి ఉన్న ఒక వ్యాన్‌కు ముందొకటి, వెనుకొకటి పోలీసు జీపులను వెంటపెట్టుకుని నగదు పద్దుల పుస్తకం, ఖాళీ సంచులతో బజారులోకి వెళ్లారు. లౌడ్ స్పీకర్లో ‘‘అప్రతిష్టాకరమైన ఒక ఇంటి’’పై గత రాత్రి పోలీసులు దాడి చేశారని, మేడమ్ వ్యాన్‌లో ఉన్నారని, ఆమె నుంచి, ఆమె వద్ద ఉన్న అమ్మాయిల నుంచి సేవలందుకున్న వ్యాపారులందరినీ ఆమె గుర్తు పడుతుందని లౌడ్ స్పీకర్లో చాటించారు. వాళ్లు ఒక్కో దుకాణం ముందు నిలుస్తుంటే బెంబేలెత్తిపోయిన యజమానులు నిధులు చెల్లించి పారిపోయారు. వ్యభిచార గృహమూ లేదు, దానిపై దాడి జరిగిందీ లేదు. కాకపోతే ఆ మేడమ్ తమ పేరును చెబితే ఏమౌతుందోననే భయంతోనే వారు అలా చేశారు. ‘‘అప్రతిష్టకు బదులు గౌరవాన్ని, శాంతిని కొనుక్కున్నారు’’ అని వివరించారు.‘‘గౌరవనీయుడైన వ్యకి తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భయపడతాడే తప్ప ఎవరినో జైలుకు పంపాలని ఎందుకు అనుకుంటాడు?’’ అనేవారాయన. బురదజల్లుడు రాజకీయం ఇప్పుడు మన రాజకీయాల్లోనూ, బహిరంగ చర్చలోనూ అదే ఆటను ఆడుతుండటాన్ని చూస్తున్నాం. ఇప్పుడది జాతీయ రాజకీయాలను శాసి స్తోంది. మనం, మీడియాలోని వాళ్లం ఇతరుల బాధను చూసి నవ్వు కుంటూనే... ఎటునుంచి బురద వచ్చి మనమీద పడుతుందోనని భయ పడుతూ అదే ఆటను ఆడుతున్నాం ఇటీవల రెండుసార్లు ఆ పాటియాలా మేడమ్ కథ పునఃప్రదర్శితం కావడాన్ని చూశాం. ఒకటి, ఆగస్టా ఒప్పందం. ఒక ఇటాలియన్ కోర్టులో అవినీతి రుజువైంది. లంచాలు ఇచ్చినవారికి శిక్షలు పడ్డాయి. కానీ లంచాలు పుచ్చుకున్నవారుగా ఏ ఒక్కరినీ నిర్దిష్టంగా పేర్కొన లేదు (2013 ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రముఖమైన పేరు మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగీదే). రాజకీయ విరోధులు, అరడజను మంది 2–3 నక్షత్రాల ఐఏఎఫ్ అధికారులు, అత్యున్నత పౌర అధికారులు (వారిలో కొందరు కాగ్, సీవీసీ, యూపీఎస్సీ బోర్డు తదితర రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారు) లంచాలు తీసుకున్నారని సార్వత్రిక దూమారాన్ని రేపారు. ఎవరిపైనా చార్జీషీటు దాఖలు కాలేదు, ఎవరి పేరునూ అధికారికంగా పేర్కొన్నది లేదు. కానీ లీకులు, పరోక్ష వ్యాఖ్యలు కలసి మొత్తంగా వ్యవస్థే కళంకితౖమైందని అనిపించే కంపును ఢిల్లీలో రేకెత్తించగలిగాయి. అగస్టా నుంచి ముడుపులందు కున్న పాత్రికేయుల ‘అధికారిక జాబితా’ సైబర్ స్పేస్‌లో చక్కర్లు కొట్టసా గింది. ఈ సందర్భంగా ప్రయోగించినది కూడా అదే కుయుక్తి. పేర్లు లేవు, నమోదైన ఆరోపణలు లేవు, వాస్తవాలు లేవు. కేవలం ఊహాత్మకమైన పుక్కిటి పురాణాలను, బురదజల్లడాన్ని... దిగ్భ్రాంతిని, నివ్వెరపాటును కలిగించడా నికి, భారీ స్వీయ వినాశనానికి సాధనాలుగా ప్రయోగించారు. జ్ఞానీజీ కాల్పనిక మేడమ్లాగే, ఈ కేసులో కూడా ఎవరికైనా ముడుపులు అందాయా? అనేది మనకు తెలియదు. కానీ వ్యవస్థకు, నిజాయితీపరులైన వారి ప్రతిష్టకు చాలానే నష్టం వాటిల్లింది. ఏ వైమానిక దళ అధికారినైనా అడిగి చూడండి... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సంస్థాపరంగా వారు ఎంతగా బాధపడ్డారో చెబుతారు. క్రిస్టియన్ మిషెల్ దుబాయ్‌లో హాయిగా కూర్చుని కొద్దిరోజులపాటూ భారత మీడియా పతాక శీర్షికలను లిఖిస్తుంటాడు. ఇదే సినిమాను మనం 35 ఏళ్ల క్రితం చూశాం. విన్ ‘‘బోఫోర్స్’’ చద్దా అదే దుబా య్‌లో సురక్షితంగా ఉండటాన్ని చూశాం. భోఫోర్స్లాగే అగస్టా కేసు కూడా నేడు ఇక ముందుకు సాగడానికి లేని స్థితికి చేరినట్టుంది. ‘ఢిల్లీ’కి ఇంపైన కొత్త కంపు అగస్టా బెలూనులో గ్యాస్ అయిపోవడంతో సంజయ్ భండారీ ప్రియమైన సరికొత్త కంపుగా అవతరించారు. ఇప్పుడూ ఆయన పేరు తప్ప మరెవరి పేరునూ ఇంతవరకు లాంఛనంగా ప్రకటించింది లేదు. ఆయన ఏ ఒప్పం దాలకు మధ్యవర్తిత్వం వహించారో, ఆయనకు ఎంత చెల్లించారో, దాన్ని ఆయన ఎవరితో పంచుకున్నారో తెలియదు. కానీ ఢిల్లీలో సగంమంది ఆయన ‘‘ముడుపులపై ఆధారపడినట్టు’’ అనిపిస్తోంది. సోనియా గాంధీ అల్లుడి నుంచి ఒక బీజేపీ అధికార ప్రతినిధి, మరో ప్రముఖ పాత్రికేయుని వరకు వారిలో ఉన్నారు. ఇప్పుడు కూడా నమోదైన ఆరోపణలు లేవు, పేర్లు లేవు, ఉన్నదంతా బురదే. భండారీ ‘‘ఫోన్ కాల్ రికార్డులు’’గా చెబుతున్న ఆధారం చివరి ఇద్దరూ ‘‘వందల కొద్దీ’’ కాల్స్‌ను భండారీకి చేశారని ‘‘చూపుతోంది’’. భండారీకి వారు దేనికి సహాయం చేశారో తెలియదు. అందుకు ఏమి, ఎలా చెల్లించారో తెలియదు. తెలుసుకోవాల్సిన లేదా చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానీజీ చెప్పినట్టు వ్యక్తులు ప్రతిష్టను కోల్పోతామని భయపడతారు, ప్రత్యే కించి వారిపై లాంఛనంగా ఆరోపణలను నమోదు చేయకపోతే తమ జీవిత కాలంలో ఆ ఆరోపణల నుంచి తమ పేరు తొలగడాన్ని చూడలేరు. జిత్తులమారి కుయుక్తులే ప్రధాన రాజకీయ పనిముట్టుగా మారడం ప్రమాదకర పర్యవసానాలకు దారితీసే అవకాశం ఉంది. అన్ని పక్షాలు ఆడేది అదే ఆట. కాంగ్రెస్ ఇప్పుడు నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయడానికి జీఎస్పీసీని ప్రయోగిస్తుండటాన్ని చూడండి. అయితే బీజేపీయే ఈ ఆటను అత్యంత సమర్థవంతంగా చేయగలుగుతున్నట్టు అనిపిస్తోందంటే, అందుకు కారణం ఆ పార్టీ కమెండోలు తమ వారిని సైతం లక్ష్యంగా చేసుకుంటుం డటమే. శత్రువులు మీకు రాజకీయ ప్రత్యర్థులే. అయితే మీ పార్టీలోనే మీకు అసూయ కలిగించే స్థానాలలో ఉన్నవారు కూడా అంతే శత్రువులు. ఇది అందిరిపైనా అందరూ దాడికి దిగే ఒక రకం విపరీత స్థితి. దీంతో పార్టీల సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒక రోజు వసుంధరారాజే సింథియా, మరో రోజు సుష్మాస్వరాజ్, ఇప్పుడిక అరుణ్ జైట్లీ. లండన్‌లో కూర్చుని విజయ్ మాల్యా, లలిత్ మోదీలు మనల్ని చూసి నవ్వుకుంటుంటారు. కొన్ని నెలల క్రితం జాతీయస్థాయిలో ఒకటో స్థానంలోని లక్ష్యంగా లలిత్ మోదీపైకి గురిపెట్టారు. ఆయనకు ప్రధాన లక్ష్యమైన అరుణ్ జైట్లీ అధికారిక పర్యటన కోసం టోక్యోలో దిగేటప్పటికే లలిత్ అక్కడకు చేరడాన్ని చూసి మెచ్చు కుంటాం. టోక్యోలో నవ్వులు చిందిస్తున్న లలిత్ ఫోటోలు సోషల్ మీడి యాలో చక్కర్లు కొడుతూ... సర్వసత్తాక రాజ్యంగా చెప్పుకుంటున్న భారత్‌ను పరిహసిçస్తుంటాయి. మనం భారత్ మాతా కీ జై అని గావు కేకలు వేస్తుంటాం. ముగ్గురు ‘ఎమ్’లు (మోదీ (లలిత్), మాల్యా, మిషెల్) మనం ఎంత చేత గాని వారమో, ఎంత అసమర్థులమో, ఎంత అవినీతిపరులమో, ఎంతగా రాజీ పడే, గందరగోళపడే బాపతో మనకు రోజూ గుర్తు చేస్తుంటారు. స్వీయ పరాజయ క్రీడ ఇది ఎంత స్వీయ పరాజయకరమైనదో టట్రా కుంభకోణంగా పిలిచే దాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చెకొస్లవేకియాకు చెందిన ట్రాక్డ్ యుద్ధ శకటాల తయారీ సంస్థ ఆ కాంట్రాక్టు కోసం ముడుపులు చెల్లించిందని 2012లో బాధ్యతగల పౌరులు ఆరోపించారు. అణ్వస్త్ర క్షిపణులు సహా మన అన్ని క్షిపణులను తరలించేది ఆ శకటాలే. సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ శకటాలను తయారు చేసేది ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్సే అయినా వాటి తయారీకి ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేశారు. దాని సీఈఓ నటరాజ న్ను సస్పెండ్ చేశారు. ఆ కేసులను ఇప్పుడు మూసేసి, అందరిపైనా కేసులు ఎత్తేశారు. టట్రా కొనుగోళ్లు తిరిగి మళ్లీ సాగుతున్నాయి. చెకొస్లవేకియా సంస్థ ఇప్పుడు బీఈఎమ్ఎల్కు బదులుగా ఒక ప్రైవేటు సంస్థ (అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్) భాగస్వామ్యంతో నడుస్తోంది. నటరాజన్ కోర్టు లలో పోరాడాల్సి వచ్చింది. ఈలోగా మన వ్యూహాత్మక బలగాలు కలదలలేని స్థితిలో మూడేళ్లకు పైగా ఉండిపోవాల్సి వచ్చింది, దేశం మొత్తం మనకున్నది దొంగల సైన్యమని విశ్వసించింది. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరినీ దొంగలుగా విశ్వసిస్తుండటంతో... బంది పోట్లు, నయవంచకులు, లాబీయిస్టులు, ఒప్పందాలు కుదిర్చేవారి జీవితా లను దుర్భరంగా మార్చడానికి బదులు దేశాన్ని వారి దయా దాక్షిణ్యాలకు వదిలేశారు. అసాధారణ, అసమర్థతకు, రాజీలకు మారుపేరైన మన దర్యాప్తు సంస్థలకు (సీబీఐ నుంచి ఈడీ వరకు) ఇది తిరిగి సై్థర్యాన్ని నింపింది. ఏ దర్యాప్తునూ దాని తార్కికమైన ముగింపుకు చేరనివ్వని ఎన్ఐఏను వారు కోరుకోవడం విచారకరం. అధికార వ్యవస్థకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడల్లా మురికిని చల్లడమో లేదా క్లీన్ చిట్లను ఇవ్వడమో మాత్రమే అది చేస్తుంది. మాలెగావ్, సంఝాతా ఎక్స్‌ప్రెస్‌ల విషయంలో ఎన్ఏఐ పరస్పర విరుద్ధ అభిప్రాయాలకు ఫిరాయించడం జాతికే అవమాన కరం. అయితేనేం, దాని అధిపతి ఏదో ఒక నియంత్రణాధికారిగానో లేక ఏ సీవీసీలో లేదా యూపీఎస్సీ సెలక్షన్ కమిటీలో సభ్యత్వాన్నో సంపాదించు కోవచ్చు. రాజకీయ నేతలను, న్యాయమూర్తులను, నియంత్రణాధికారులను, రాజ్యాంగ అధిపతులను, ఆర్బీఐ అధిపతిని ఎవరినీ ఈ బురదజల్లుడు నుంచి వదలరు ఇక చాలా మంది పాత్రికేయుల సంగతి చెప్పనవసరం లేదు. విధ్వంసకరమైన ప్రతికూలాత్మకత ఆవరించి ప్రస్తుతం ఢిల్లీ కంపుతో కుళ్లిపోతోంది. రాజకీయ పోరాటాలు పార్లమెంటులోనో, ఎన్నికల్లోనో లేక బహిరంగ చర్చలోనో జరగక... నయవంచనతో కూడిన జిత్తులకు పాల్పడు తుండటం ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఇంటి ముందు పెంటకుప్పను పెట్ట డంతో సమానమైనది. twitter@shekargupta శేఖర్ గుప్తా -
పార్లమెంటు తీరు ఇంతేనా?!
పార్లమెంటును సజావుగా నడపడంలో యూపీఏ ప్రభుత్వం తరహాలోనే ఎన్డీయే సర్కారు కూడా విఫలమవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో సహా ఎన్నో ముఖ్యమైనవి ఉన్నాయి. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉండగా...చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన సవరణ బిల్లు, ఆర్బిట్రేషన్ చట్టాన్ని సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో పెట్టే బిల్లు సహా మొత్తంగా 67 బిల్లులు ఉభయసభల ముందుకూ రావాల్సి ఉంది. మరోపక్క రైతుల ఆత్మహత్యలు, అధిక ధరలు, ప్రకృతి విపత్తులవంటి ఎన్నో ముఖ్యాంశాలపై చర్చించాల్సి ఉంది. ఈ తరుణంలో హఠాత్తుగా ఊడిపడిన ‘నేషనల్ హెరాల్డ్’ వివాదం పార్లమెంటును ముందుకు కదలనివ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ సీఎం ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సీబీఐ చేసిన దాడి ఉభయ సభల్లో కల్లోలాన్ని సృష్టించింది. దానికి కొనసాగింపుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఆప్ చేసిన ఆరోపణలు, అందుకు కాంగ్రెస్ వత్తాసునివ్వడం మరికొంత సమయాన్ని మింగేశాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు తెస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని పెను సంక్షోభాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 23తో సమావేశాల గడువు ముగిబోతున్నది. సెలవుల్ని మినహాయిస్తే పార్లమెంటు సాగేది మరో నాలుగు రోజులు మాత్రమే. పాలక పక్షం పరిణతితో వ్యవహరిస్తే వీటిలో చాలా వివాదాలు నివారించదగ్గవే. ‘నేషనల్ హెరాల్డ్’ కేసు విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఎవరూ అంగీకరించలేదు. న్యాయస్థానంలో ఉన్న వివాదాన్ని అనవసరంగా పార్లమెంటుకు ఈడ్చుకొచ్చిందన్న అభిప్రాయమే సాధారణ పౌరుల్లో వ్యక్తమైంది. ఢిల్లీలో సీబీఐ నిర్వహించిన దాడి మాటల యుద్ధానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకుని పిరికిపంద, ఉన్మాది అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. సీబీఐ దాడి లక్ష్యం రాజేంద్ర కుమార్ కాదనీ, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఫైలు కోసమే ఇలా చేశారని ఆయన ఆరోపించారు. ఇందులో నిజానిజాల మాటెలా ఉన్నా సీబీఐ వ్యవహరించిన తీరు మాత్రం సరిగా లేదనే చెప్పాలి. అవసరమనుకున్నచోట సోదాలు నిర్వహించేందుకు కేసును దర్యాప్తు చేసే అధికారికి సర్వాధికారాలున్నాయి. అందుకు ప్రభుత్వ ముందస్తు అనుమతిగానీ, ఆఖరికి తన ఉన్నతాధికారి అనుమతిగానీ అవసరం లేదు. అవినీతి కేసుల్లో మెరుపుదాడులే ఫలితాన్నిస్తాయి తప్ప ముందుగా చెప్పి వెళ్తే ఉపయోగం ఉండదని కేంద్రం చెప్పిందీ నిజమే కావొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారిపై ఉన్న ఆరోపణల విషయంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాల సంగతిని మర్చిపోకూడదు. మూడో అంతస్తులో ఉన్న రాజేంద్రకుమార్ కార్యాలయాన్ని మాత్రమే సోదా చేశామని సీబీఐ సంజాయిషీ ఇస్తోంది. కానీ దానికి చేర్చి ఉన్న తన కార్యాలయంలో కూడా సోదాలు చేశారని కేజ్రీవాల్ అంటున్నారు. మూడో అంతస్తు మొత్తాన్ని సీల్ చేసి, సీఎం ఆఫీసుకు దారితీసే మార్గాన్ని కూడా అడ్డుకుని సోదాలు నిర్వహించకపోయి ఉంటే ఇలాంటి ఆరోపణలకు తావుండేది కాదు. పైగా ఢిల్లీ ప్రభుత్వానికీ, కేంద్రానికీ మధ్య ఇప్పటికే ఎన్నో అంశాల్లో తగాదాలొచ్చాయి. ఈ చరిత్రంతా అక్కడే కొలువుదీరిన సీబీఐకి తెలియదనుకోలేం. కనుక దాడులు చేయడానికి కొద్ది సమయం ముందైనా కేజ్రీవాల్‌కు వర్తమానం ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పోనీ తనదేమైనా ఘన చరిత్ర అయివుంటే...ముందూ మునుపూ తటస్థంగా, నిక్కచ్చిగా వ్యవహరించిన నేపథ్యం ఉంటే వేరు. యూపీఏ పాలనాకాలమంతా విపక్షాలన్నీ దాన్ని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే పిలిచేవి. సాక్షాత్తూ సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో సీబీఐ డెరైక్టర్లుగా ఉన్నవారికి అక్షింతలేసింది. ఇలా ఎన్నిమార్లు మందలించినా దారికి రాకపోవడంతో చివరకు సహనం నశించి ‘పంజరంలో చిలుక’తో కూడా పోలిక తెచ్చింది. ఇప్పుడు ఆ పాత్రలోనే ప్రస్తుత దాడి నిర్వహించిందని విపక్షాలు ఆరోపిస్తుంటే సీబీఐ సమాధానం చెప్పుకోగలదా? మధ్యప్రదేశ్ వ్యాపం కేసు మొదలుకొని వివిధ కేసుల విషయంలో ఇంత చురుగ్గా ఎందుకు కదలడం లేదంటే ఏం చెబుతుంది? సీబీఐకి విశ్వసనీయత అనేది ఉంటే ప్రస్తుత దాడి ఇంత వివాదాస్పదం అయ్యేది కాదు. సీబీఐ దాడి తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఆప్ నేతలు పార్లమెంటు వెలుపలా, లోపలా విరుచుకుపడుతున్నారు. డీడీసీఏ వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం నియమించిన కమిటీ ఆ సంగతిని నిగ్గు తేల్చిందంటున్నారు. మరి ఇన్ని నెలలుగా ఆయనపై ఢిల్లీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలెందుకు చేయలేదో, కనీసం ఆ స్కాంను ఎందుకు బయటపెట్టలేదో ఆప్ నేతలు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చేస్తున్న హడావుడిని చూస్తే స్వల్పకాలంలోనే ఆప్ కూడా ఒక సాధారణ రాజకీయ పక్షంగా మారిపోయిందని అర్ధమవుతుంది. ఢిల్లీ ప్రభుత్వం విషయంలో వ్యవహరించిన తీరుపైనే పార్లమెంటు రెండు రోజుల సమయం హరించుకుపోతే అరుణాచల్ ప్రదేశ్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం దీనికి తోడైంది. పార్లమెంటు సాగుతుండగా ఇలాంటి వివాదాలన్నీ తెచ్చుకోవడం క్షేమం కాదని ఎన్డీఏ పెద్దలకు అర్ధమైనట్టు లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు సోనియా, మన్మోహన్‌లను ప్రధాని తన ఇంటికి ఆహ్వానించి చర్చించినప్పుడు ఈ సమావేశాలు సజావుగా సాగుతాయన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. తీరా ఒకదాని వెనకొక వివాదం వచ్చి పడి సమావేశాలను చాపచుట్టేసే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు తీరు ఇలాగే సాగితే జనం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చకొచ్చేది ఎప్పుడు? పరిష్కారం లభించేదెప్పుడు? అన్ని పార్టీలూ ఆలోచించాలి.