సాక్షి, న్యూఢిల్లీ : క్రిస్‌మస్ విరామం అనంతరం గురువారం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలూ సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. కావేరీ వివాదంపై నిరసనలు హోరెత్తడంతో రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో రాఫేల్ ఒప్పందంపై విపక్షాలు నినాదాలతో ప్రభుత్వంపై విరుచుకుపడటంతో గందరగోళం నెలకొంది.
ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై చర్చ చేపట్టాల్సిఉండగా సభ రాఫేల్ డీల్‌పై దద్దరిల్లింది. విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ పార్టీ సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేశాయి.
ఈ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ట్రిపుల్ తలాక్‌ను నేరపూరిత చర్యగా బిల్లులో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత శశి థరూర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం లోక్‌సభ ముందుంచనుంది.
Comments
Please login to add a commentAdd a comment