winter session
-
‘చాయ్ బిస్కట్’ సమావేశాలు కాదు: హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్‌ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్‌రావు చెప్పారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం కసరత్తు
-
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వీడని ప్రతిష్టంభన
-
ప్రతిష్టంభనకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ ఫలించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాజ్యాంగ దిన వజ్రోత్సవాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రాజ్యాంగంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య అంగీకారం కుదిరింది. ఆ మేరకు డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16, 17ల్లో రాజ్యసభలో చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటించారు. సోమవారం అన్ని పారీ్టల పార్లమెంటరీ పక్ష నేతలతో స్పీకర్ భేటీ అనంతరం ఆయన మీడియాకు ఈ మేరకు తెలిపారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ అంగీకరించాయన్నారు.దీన్ని భేటీలో పాల్గొన్న విపక్షాల నేతలు కూడా ధ్రువీకరించారు. విపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సంభాల్ హింస, మణిపూర్ కల్లోలం తదితరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా నిబంధనలకు లోబడి ఏ అంశాన్నైనా సభల్లో లేవనెత్తవచ్చని రిజిజు బదులిచ్చారు. అదానీ, మణిపూర్ కల్లోలం తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో నవంబర్ 25న పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ఉభయ సభల్లో రోజూ వాయిదాల పర్వం సాగుతుండటం తెలిసిందే. దీనికి తెర దించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయతి్నస్తున్నారు.వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించనున్నట్టు సమాచారం. తాము డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కారు ఎట్టకేలకు అంగీకరించిందని కాంగ్రెస్ పేర్కొంది.అదానీ, సంభాల్ తదితర అంశాలపై పార్లమెంటులో చర్చకు భయపడి తప్పించుకుంటోందని దుయ్యబట్టింది. ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతున్న అదానీ అంశంపై చర్చకు అధికార పక్షం అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో ఇతర విపక్షాలేవీ కాంగ్రెస్‌కు దన్నుగా నిలవడం లేదు. ప్రతి సమావేశాల్లోనూ పార్లమెంటును అధికార బీజేపీ హత్య చేస్తూ వస్తోందని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియాన్ దుయ్యబట్టారు.అవే ఆందోళనలు.. ఉభయసభలూ నేటికి వాయిదాఅదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా సహా పలు అంశాలపై సోమవరం పార్లమెంటు అట్టుడికింది. వాటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం కూడా ఉభయ సభలూ కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమవగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. అదానీపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా వాయిదా పడింది.తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. అదానీ సహా పలు అంశాలపై విపక్షాలిచి్చన 20 వాయిదా తీర్మానాలను చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆందోళనల నడుమ సభ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. -
‘అదానీ’పై రగడ.. పార్లమెంట్ రేపటికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండోరోజు బుధవారం(నవంబర్ 27) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.పార్లమెంట్ ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా తొలుత లోక్‌సభ గంటపాటు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు శాంతించకపోవడంతో స్పీకర్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ విపక్షాలు అదానీ వ్యవహారంపై ఆందోళన చేశాయి.ఎంపీల నినాదాల మధ్యలో చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను నిర్వహించినప్పటికీ తర్వాత సభను గురువారానికి వాయిదా వేశారు.అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో మళ్లీ వాయిదా తీర్మానం. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళకు దిగారు.విపక్షాల ఆందోళనతో స్పీకర్ లోక్‌సభను గంట పాటు వాయిదా వేశారు.ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. సోషల్ మీడియాను నియంత్రించేందుకు కఠిన చట్టాలు అవసరం: లోక్‌సభలో అశ్విని వైష్ణవ్సోషల్మీడియాను నియంత్రించాలంటే ఉన్న చట్టాలనే కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందిఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించే అంశం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిధిలో ఉంది.సోషల్‌మీడియాలో వాక్స్వాతంత్రం పేరిట ఏదిపడితే అది పోస్టు చేస్తున్నారుదీనిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.ఎంపీ అరుణ్‌గోవిల్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్విపక్షాల ఆందోళన మధ్యే సమాధానం చెప్పిన ఐటీ మంత్రి -
విపక్షాల ఆందోళన..పార్లమెంట్ ఎల్లుండికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం(నవంబర్ 25) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభలు ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండడంతో ఉభయసభలను బుధవారానికి వాయిదా వేశారు.పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ కామెంట్స్..పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరగాలిఎంపీలు అందరూ చర్చల్లో భాగస్వాములు కావాలికానీ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయిప్రజలు తిరస్కరించిన పార్టీలు, పార్లమెంటులో గందరగోళం సృష్టించాలని చూస్తున్నాయిపార్లమెంటును అడ్డుకునే వారికి ప్రజలు సమయం చూసి శిక్ష విధిస్తారుగందరగోళం సృషించే పార్టీలు పశ్చాతాపం చెందాలిఅదానీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..తొలి రోజే అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలని కాంగగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం. సంభల్‌లో అల్లర్లపై చర్చించాలని ఎంఐఎం వాయిదా తీర్మానం.ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. నవంబర్ 26(రాజ్యంగా దినోత్సవం)న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగం ఆమోదంపొంది 75 ఏళ్ల సందర్భంగా వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరగనున్న మొదటి పార్లమెంటు సమావేశాలు కావటం గమనార్హం. వక్ఫ్ బిల్లుకు వివాదాస్పద సవరణలు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు సంబంధించిన నిబంధనల బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ బిల్లు సవరణలను ప్రస్తుతం అధికార బీజేపీకి చెందిన జగదాంబిక పాల్ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తోంది. నవంబర్ 29లోగా కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది. అయితే.. ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో జేపీసీ పనితీరు వివాదాస్పదమైంది.Hon’ble President, on the recommendation of Government of India, has approved the proposal for summoning of both the Houses of Parliament for the Winter Session, 2024 from 25th November to 20th December, 2024 (subject to exigencies of parliamentary business). On 26th November,… pic.twitter.com/dV69uyvle6— Kiren Rijiju (@KirenRijiju) November 5, 2024 -
మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి!
చాలా మంది కాలి చీలమండల ప్రాంతంలో నొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల నడవటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నొప్పి రాకుండా వివిధ రకాల ఔషధాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మందు ప్రభావం తగ్గిన వెంటనే, నేనున్నానంటూ మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొన్ని ఇంటి నివారణ చిట్కాల సహాయంతో పాదాల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. మడమల నొప్పులు ఏ సీజన్లో అయినా రావచ్చు కానీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరమౌతుంది. ఈ నొప్పులకు కారణాలు అనేకం. వాటిలో బరువు పెరగడం, ఎక్కువసేపు నిలబడటం, ఎత్తు మడమల బూట్లు లేదా చెప్పులు ధరించడం, శరీరంలో కాల్షియం లోపించటం వంటివి ముఖ్య కారణాలు. అల్లం మడమ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవటం మంచిది. దీనికిగాను ముందుగా రెండు కప్పుల నీళ్లలో అల్లం వేయాలి. తరువాత దానిని మరగనివ్వాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత అందులో మూడు చుక్కల నిమ్మరసం, ఒక చెంచా తేనె వేసి సేవించడం వల్ల వల్ల చీలమండల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. చేప ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా నొప్పి, మడమల వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి నొప్పి, వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయి. రాక్‌సాల్ట్ మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రాతి ఉప్పును ఉపయోగించవచ్చు. ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేసి, దానిలో రెండు మూడు చెంచాల రాక్‌సాల్ట్ వేయండి. ఆ తర్వాత, ఈ నీటిలో పాదాలను 10–15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మడమ నొప్పి, వాపు ఉపశమిస్తాయి. ఐస్ క్యూబ్స్ మడమల నొప్పి సమస్య నుండి బయటపడటానికి నొప్పి ఉన్న ప్రాంతంలో రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఐస్‌క్యూబ్‌లు ఉంచాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా ఒక గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. లవంగ నూనెతో మసాజ్ మడమ నొప్పి నుంచి ఉపశమనం కోసం నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగ నూనెతో సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పాదాలలో ఏదైనా నొప్పి అనిపిస్తే లవంగ నూనెతో మసాజ్ చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. పసుపు మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు సహాయపడుతుంది. ఇది వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉండి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికిగాను పసుపునీళ్లలో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. అలాగే పసుపు పాలు తీసుకోవచ్చు. దీనిని సేవించటం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ మడమల నొప్పి. వాపు వంటి సమస్యలు ఉంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపకరిస్తుంది. కాసిని వేడినీళ్లలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ నీటితో పాదాలను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇవి చదవండి: కుకింగ్ టు కామెడీ క్వీన్స్.. -
ఇవాళే అత్యంత తక్కువ పగటి కాలం ఉండేది! ఎందుకంటే..?
శీతకాలంలో సాధారణంగా పగటి పూట తక్కువగానూ రాత్రి సమయం ఎక్కువగానూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసింది. కానీ ఈ శీతకాలంలో ఒక రోజు మాత్రం మిగతా అన్ని రోజుల కంటే పగటి పూట తక్కువగా ఉంటుంది. ఈసారి అయినా అది గమినించండి. సాధారణంగా దీన్ని గమనించం. ఇలా తక్కువ పగటికాలం ఉన్న రోజుని శీతాకాలపు అయానంతం అని కూడా పిలుస్తారు. అలా పగటి పూట తక్కువగా ఉన్న రోజు ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22ల మధ్యే వస్తుంది. అయితే ఈ ఏడాది ఇవాళే(డిసెంబర్22) అత్యంత తక్కువ పగటి పూట ఉంటుందట. నిజానికి మనకు ఏడాదిలో రెండు అయనాంతాలు ఉంటాయి ఒకటి జూన్ 21న ఇంకొకటి డిసెంబర్ 21న సంభవిస్తుంది. ఇక్కడ అయనాంత అంటే భూమధ్యరేఖకు సంబంధించి సూర్యుడు తన అత్యంత ఉత్తర లేదా దక్షిణ ధృవానికి చేరుకోవడంతో సంభవించే ఒక సంఘటన. ఎందువల్ల అలా జరుగుతుందంటే.. బొంగరంలా తిరిగేటప్పుడు భూమి ధ్రువం తన అక్షం నుంచి కొన్ని డిగ్రీలతో సూర్యుడికి దూరంగా వంగుతుంది. భూమి ధ్రువం ఎప్పుడైతే భానుడికి దూరంగా గరిష్ఠంగా వంగుతుందో అప్పుడు దక్షిణాయనం(winter solstice) ఏర్పడుతుంది. దక్షిణాయనం ఏర్పడినప్పుడు సూర్యకిరణాలు భూమిపై ఎక్కువగా పడవు. అందువల్ల ఈ రోజు భూమిపై ఎక్కువ రేపు రాత్రి సమయాన్ని అనుభవిస్తాం. అలాగే పగటిపూట అనేది తక్కువగా ఉంటుంది. దక్షిణాయనం అనేది చలికాలానికి సూచిక. ఒకసారి ఉత్తర అర్ధగోళంలో.. ఒకసారి దక్షిణ అర్ధగోళంలో భూమి సూర్యుడి వైపుకు తిరగడం.. సూర్యుడి వైపు కాకుండా మరో వైపు వంగడం జరుగుతుంది. ఇది ప్రతి ఏటా రెండు సార్లు జరుగుతుంది. అయితే సూర్యుని వైపు వంగి ఉంటే పగటి సమయం ఎక్కువగా.. రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ఎలా తెలుస్తుందంటే.. ఈ అయనాంతం ఉదయం 8.57 గంటలకు సంభవిస్తుంది. అంటే ఈ రోజు దాదాపు 7 గంటల 14 నిమిషాలు మాత్రమే వెలుతురు(పగటి పూట) ఉంటుంది. ఎలా తెలుసుకోగలం అంటే.. ఈ రోజు సూర్యోదయం లేదా సూర్యాస్తమయాన్ని గమనిస్తే క్లియర్‌గా తెలుస్తుంది. చీకటి పడుతున్న తర్వాత నక్షత్రాలు వచ్చే విధానాన్ని చూస్తే తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!) -
Parliament Winter Sessions: ఉభయ సభలు వాయిదా
లైవ్ అప్డేట్స్.. ►పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా.. తిరిగి రేపు ఉదయం 11గం. ప్రారంభం ►పీవోకే అంశంతో అట్టుడికిపోయిన పార్లమెంట్. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌దేనని షా ప్రకటన. పీవోకే అంశంలో దేశ తొలి ప్రధాని నెహ్రూను నిందించిన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్. ప్రధాని మోదీ అక్కడి ప్రజల బాధ అర్థం చేసుకున్నారని.. 70 ఏళ్లుగా దక్కని న్యాయం అందిస్తారని షా వ్యాఖ్యలు. బయటకు వచ్చాక.. అమిత్ షా ప్రసంగంపై విమర్శలు, సెటైర్లు సంధించిన విపక్ష సభ్యులు. #WATCH | On Union HM Amit Shah's remark on Pandit Nehru, Former J&K CM and National Conference (NC) President Farooq Abdullah says, "...At that time, the army was diverted to save Poonch and Rajouri. If it had not been done, Poonch and Rajouri would have also gone to… pic.twitter.com/tjqx537TRw — ANI (@ANI) December 6, 2023 ►కశ్మీర్ బిల్లులతో వారికి న్యాయం.. ‘‘70 ఏళ్లుగా అన్యాయానికి, అవమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నాను. ఏ సమాజంలోనైనా వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలి. ఈ క్రమంలో వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూడాలి. అదే భారత రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశం. ప్రస్తుతం చాలా మంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. ఈ బిల్లుతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయి’’ అని అమిత్‌షా వెల్లడించారు. ► దేశంలో 1980 దశకంలో ఉగ్రవాదం పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో ఓ భాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను నిరాశ్రయుల్ని చేశారని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్లు తమ సొంత దేశంలో శరణార్ధులుగా బతికారని దుయ్యబట్టారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 46,631 కుటుంబాలు, 1,57,968 మంది తమ సొంత స్థలాలను వదిలి వచ్చారని తెలిపారు. ప్రస్తుత బిల్లులతో వారందరికి హక్కులు కల్పించబడతాయని చెప్పారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "There was an era of terrorism after the 1980s and it was horrifying. Those who lived on the land considering it… pic.twitter.com/j1O6JIcOIq — ANI (@ANI) December 6, 2023 ► పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీఓకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రమే ఈ బిల్లులను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 Says, "The Bill that I have brought here pertains to bringing justice to and providing rights to those against whom… pic.twitter.com/DAl8zIv7Zi — ANI (@ANI) December 6, 2023 ► జమ్ముకశ్మీర్, లఢక్‌లో గణనీయ అభివృద్ధి జరిగిందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. "J-K, Ladakh witnessed profound affirmative and progressive changes" : MoS Home Nityanand Rai to Rajya Sabha Read @ANI Story | https://t.co/biq4Bmyh7C#ParliamentSession #JammuKashmir #NityanandRai pic.twitter.com/dZEYFyMRl7 — ANI Digital (@ani_digital) December 6, 2023 ► మిచౌంగ్ తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి తమిళనాడుకు కేంద్ర బృందాన్ని పంపాలని డీఎంకే ఎంపీ టిఆర్ బాలు లోక్‌సభలో కోరారు. మిచౌంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించడాన్ని పరిశీలించాలని విన్నవించారు. #WATCH | DMK MP TR Baalu in Lok Sabha calls upon the Centre to send to team to Tamil Nadu to assess flood damage due to the cyclone and consider declaring it a national calamity pic.twitter.com/pyCKYDCAyP — ANI (@ANI) December 6, 2023 ► డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంటూ.. ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఉపసంహరించుకుంటాను అని తెలిపారు #WATCH | Winter Session of Parliament | DMK MP DNV Senthilkumar S expresses regret over his 'Gaumutra' remark and withdraws it. "The statement made by me yesterday inadvertently, if it had hurt the sentiments of the Members and sections of the people, I would like to withdraw… pic.twitter.com/S0cjyfb7HU — ANI (@ANI) December 6, 2023 ► డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. Lok Sabha adjourned till 12 noon amid ruckus in the House. pic.twitter.com/T8bjnXoDGe — ANI (@ANI) December 6, 2023 ►కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడి హత్యపై కేంద్ర మంత్రి కైలాష్ చౌధరి స్పందించారు. రాజస్థాన్‌లో రౌడీయిజానికి స్థానంలేదని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష విధించాలని అన్నారు. #WATCH | On the murder of Sukhdev Singh Gogamedi, the national president of Rashtriya Rajput Karni Sena in Rajasthan, Union minister Kailash Choudhary says, "There is no place for goons in Rajasthan. Punishment should be given to those who indulge in criminal activities." pic.twitter.com/PayX03nd1b — ANI (@ANI) December 6, 2023 ► ఇండియా కూటమి భేటీ వాయిదా పడటంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. జ్వరం కారణంగా తాను హాజరుకాలేకపోతున్నానని మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. మరో మీటింగ్ వెళ్తానని చెప్పారు. కూటమి ముందుకు వెళుతుందని తెలిపారు. #WATCH | On INDIA bloc meeting, Bihar CM & JD(U) leader Nitish Kumar says, "I want that work should progress. It was being said in the news that I was not going to attend the meeting. I was down with a fever. Is it possible that I will go not to the meeting? In the next meeting… pic.twitter.com/9Qj5eqCvvE — ANI (@ANI) December 6, 2023 ► పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియాగాంధీ హాజరయ్యారు. పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament for its winter session proceedings. pic.twitter.com/boMXxmOJWF — ANI (@ANI) December 6, 2023 ► ఉత్తరాది రాష్ట్రాలను డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలు అని అభివర్ణించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ నిరంజన్ జ్యోతి తప్పుబట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ లేదని సెంథిల్ చేసిన వ్యాఖ్యలపై సాధ్వీ మండిపడ్డారు. కర్ణాటకలో ఎక్కువ ఎంపీలు బీజేపీకి చెందినవారేనని మర్చిపోవద్దని గుర్తుచేశారు. తెలంగాణలోనూ ముగ్గురు ఎంపీలు, ఇటీలవ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. దేశాన్ని విభజించే వ్యాఖ్యలు చేయరాదని హితువు పలికారు. సెంథిల్ వ్యాఖ్యలపై సోనియాగాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. #WATCH | On the 'Gaumutra' remark (which has hence been expunged) by DMK MP DNV Senthilkumar in the Parliament yesterday, BJP MP Sadhvi Niranjan Jyoti says, "They have forgotten that there was BJP govt in Karnataka. Most number of MPs in Karnataka are from BJP. We have 3 MPs from… pic.twitter.com/y90x8dUQcT — ANI (@ANI) December 6, 2023 ►పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడవ రోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరు కావడానికి పార్లమెంట్ భవనం వద్దకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు. #WATCH | Union Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh arrive in Parliament, on the third day of the winter session pic.twitter.com/N8g8V3jxl5 — ANI (@ANI) December 6, 2023 ► డిసెంబర్ 2 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. ►అంతే కాకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ►అంతేకాదు IPC, CRPC , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రతిపాదిత చట్టాలను కూడా ఈ సమావేశాలలో సమ్పర్పించనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఇండియన్ జస్టిస్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ బిల్లు-2023 , ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు-2023తో సహా వివిధ బిల్లులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
హెలికాప్టర్ ఘటనలో మృతి చెందిన వారికి పార్లమెంట్లో సంతాపం
02: 35 PM ►మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్‌సభ 11: 25 AM ► ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దాన్ని డీకోడ్ కోసం ఢిల్లీ లేదా బెంగళూరు తరలించే అవకాశం ఉంది. 11: 20 AM ► లోక్‌సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ దంపతులు, బృందంతో కూడిన హెలికాప్టర్ బుధవారం ఉదయం 11.35 నిమిషాలకు సులూరు నుంచి వెల్లింగ్టన్ బయలుదేరిందన్నారు. మధ్యాహ్నం 12.08 గంటలకు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని తెలిపారు. ► ఈ క్రమంలో 12.20 నిమిషాలకు ప్రమాదం జరిగిందనన్నారు.పేలుడు సంభవించినప్పుడు హెలికాప్టర్లో 14 మంది ఉన్నారని.. వీరిలో 13 మంది మృతి చెందారని తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి పార్లమెంట్ సభ్యులు సంతాపం తెలిపారు. అమరుల భౌతిక కాయాలు సాయంత్రానికి ఢిల్లీ చేరతాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 11: 05 AM ► తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు.. మొత్తం 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గురువారం లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం సభ ప్రారంభమయ్యింది. -
కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: రైతులకు కనీసమద్దతు ధర కల్పించే విషయంలో సంబంధిత భాగస్వాములతో చర్చించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు సాగుచట్టాలను రద్దుచేయాడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో.. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయన్నారు. కనీస మద్దతు ధర కల్పించాలనే అంశం మరోసారి చర్చకు వచ్చిందన్నారు. కాగా, తమ ప్రభుత్వం ఏపీ రైతులకు కనీస మద్దతుధర ఆచరించి చూపిందని తెలిపారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తే.. తమ ప్రభుత్వం మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్పీ ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఏపీలో 47 పంటలు కనీస మద్దతుధర పరిధిలోకి వచ్చాయని పేర్కొన్నారు. దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే అత్యధిక పంటలకు ఎంఎస్పీ ప్రకటించిన రాష్ట్రం ఏపీ అని విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలో కూడా అత్యధిక పంటలకు ఎంఎస్పీ ఉండేలా చట్టబద్ధమైన హామీ కల్పించాల్సిన అవసరముందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలో ఆటంకంగా ఉన్న అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్లో చట్టం చేయడానికి ఈ సంప్రదింపులు ఎంతగానే ఉపయోగపడతాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటుచేసి, కనీస మద్దతు ధరపై ముడిపడిన వివిధ సమస్యలపై సంబంధిత భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
బాయిల్డ్ రైస్ సరఫరా చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం: పీయుష్ గోయల్
11.55 AM ► సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ లేవనెత్తిన అంశం ప్రస్తుతం నడుస్తున్న.. చర్చకు సంబంధంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనాల్సిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.. కేంద్రానికి సంబంధం లేదని పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. బాయిల్ఢ్ రైస్ సరఫరా చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని పీయుష్ గోయల్ పేర్కొన్నారు. 11.25 AM ► ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సభలోకి వచ్చి డ్రామా చేసిందన్నారు. 11.15 AM ► రైతులకు కనీసమద్దతు ధర కల్పించే విషయంలో సంబంధిత భాగస్వామ్య పార్టీలతో చర్చించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు సాగుచట్టాలను రద్దుచేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రస్తుతం.. దేశంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుందన్నారు. ► అదే విధంగా.. కనీస మద్దతు ధర కల్పించాలనే అంశం చర్చకు వస్తుందన్నారు. కాగా, తమ ప్రభుత్వం ఏపీ రైతులకు కనీస మద్దతు ధర ఆచరించి చూపిందని తెలిపారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తే.. తమ ప్రభుత్వం మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్పీ ప్రకటించిందన్నారు. ప్రస్తుతం ఏపీలో 47 పంటలకు కనీస మద్దతుధర కల్పిస్తోందని పేర్కొన్నారు. 10.55 AM ► ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో ప్రత్యేక హల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లద్ జోషి, నిర్మలా సీతారామన్ తదితరులు హజరయ్యారు. 10.45 AM ► నాగాలాండ్ పౌరుల మృతిపై చర్చించేందుకు నాగా పీపుల్స్ ఎంపీ కేజీ కెన్యె రాజ్యసభలో నోటీసులు జారీచేశారు. వివాదాస్పద సైనిక చట్టాన్ని రద్దుచేయాలని కోరారు. 10.40 AM ► చైనా, భూటాన్ సరిహద్దు సమస్యలపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. 10.35 AM ► రైతుల సమస్యలపై రాజ్యసభలో చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర కల్పించాలని, బాధిత రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రైతులపై ఉన్న కేసులను కొట్టివేయాలని కోరుతూ.. ఎంపీ దీపేందర్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. 10.30 AM ► మోదీ ప్రభుత్వం రైతులు, సామాన్య ప్రజలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. నిత్యావసరాల ధరలు పెరుగుదలతో ప్రతి కుటుంబం విలవిల్లాడుతుందన్నారు. రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలకు పరిహరం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సస్పెండ్ అయిన 12 మంది ఎంపీలకు సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం సభ ప్రారంభమయ్యింది. -
టీఆర్ఎస్ తీరుతోనే రైతులు ఆత్మహత్యలు: ఎంపీ అరవింద్
LIVE UPDATES 07:01PM ► లోక్‌సభ రేపటికి ( మంగళవారం) వాయిదా ►దొంగే దొంగ అని అరిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ధాన్యం సేకరణ ఒప్పందాన్ని కేసీఆర్ తుంగలోతొక్కారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ►ఇటీవల ఏపీలో సంభవించిన వరదల వల్ల 1.85 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాణి భరత్ అన్నారు. లోక్‌సభలో వరదనష్టంపై మాట్లాడిన ఆయన.. కేంద్ర బృందం అంచనాల ప్రకారం దాదాపు 6 వేల కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ►కిసాన్ రైళ్ల వ్యవస్థ రైతాంగానికి ఎంతో మేలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అన్నారు. లోక్‌సభలో ప్రజా ప్రాముఖ్యత విషయాల చర్చ సందర్భంగా రైతు సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. కిసాన్ రైలు రవాణా వినియోగించుకుంటున్న రైతులకు ఇస్తున్న సబ్సిడీని ఏడాదికి 150 కోట్ల రూపాయలకు పెంచాలని కోరారు. ► లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ►లోక్‌సభలో నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై లోక్‌సభ సభ్యులు చర్చించారు. కొవిడ్ ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సింగారి అన్నారు. 04:38PM ► రాజ్యసభ రేపటికి వాయిదా 03:40 PM ► లోక్‌సభలో నాగాలాండ్ ఘటనపై అమిత్ షా మాట్లాడుతూ.. ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామి ఇచ్చారు. ప్రస్తుతం నాగాలాండ్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. 03:20 PM ► నాగాలాండ్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో వివరణ ఇచ్చారు. 02:30 PM ► పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా 02:00 PM ► నాగాలాండ్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యాహ్నం 3 గంటలకు కీలక ప్రకటన చేయనున్నారు. 01: 16 PM ► సాయుధ దళాల చట్టం దుర్వినియోగమవుతుందని మజ్లీస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17 మంది అమాయకులను చంపిన జవాన్లను కఠినంగా శిక్షించాలన్నారు. వివాదాస్పద చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 01: 10 PM ► నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతి చెందిన వారికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం నష్టపరిహరం చెల్లించాలని కోరారు. నాగాలాండ్‌లో శాంతిని పునరుద్ధరించాలని కోరారు. ఈ ఘటన వల్ల సైన్యం నైతికత దెబ్బతినకూడదని.. అదేవిధంగా పౌరులకు న్యాయం జరగాలని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. 12: 35 PM ► పార్లమెంట్‌కు నాగాలాండ్ కాల్పుల సేగ తగిలింది. ఈ ఘటనపై వెంటనే ప్రకటన చేయాలంటూ విపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో, సాయంత్రం 4 గంటలకు రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ.. పలువురు కీలక ఎంపీలతో సమావేశమయ్యారు. దీనిలో నాగాలాండ్ ఘటనతో పాటు సభలో అమలు చేయాల్సిన వ్యూహలపై చర్చించినట్లు తెలుస్తోంది. 12: 05 PM ► వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమయ్యింది. 11: 25 AM ► విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 11: 20 AM ► పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో అటెన్షన్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులో.. పోలవరం సవరించిన అంచనా వ్యయం 55,657 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆలస్యం వలన పునరావాసం పనులకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ ఏడాది ఖర్చు చేసిన 1,920 కోట్ల రూపాయలను వెంటనే రియంబర్స్ చేయాలన్నారు. కాగా, వచ్చే ఏడాది కల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు సహకరించాలన్నారు. 11: 15 AM ► నాగాలాండ్ కాల్పుల ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ క్రమంలో స్పీకర్ ఓంబిర్లా.. దీనిపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని తెలిపారు. అదే విధంగా.. టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యసేకరణ అంశంపై తీవ్ర ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో పోడియం చేరి చుట్టు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం తీసుకురావాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రబీ ధాన్యం సేకరణ సమస్యను పరిష్కరించాలన్నారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఆరో రోజు సభ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం పార్లమెంట్లో నాగాలాండ్ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపట్టాయి. కాల్పుల ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. కాల్పుల్లో 17 మంది అమాయక ప్రజలు చనిపోవడాన్ని ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
AP Assembly: గిరిజనుల అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ
Time: 02:45 PM ► జగనన్న గోరుముద్దతో మంచి పౌష్టికాహారాన్ని అందించామని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. నాడు- నేడు కార్యక్రమం ఏపీ చరిత్రలో గొప్ప పథకమని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేశామని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. Time: 02:40 PM ► జగనన్న విద్యాదీవెన, వసతిదీవెనతో గిరిజనులకు ఎంతోమేలు జరిగిందని మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. ఈ పథకాల కింద రూ.74.4 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. గిరిజన బిడ్డలకు అమ్మఒడి పథకం ఎంతో లబ్ధి చేకూర్చిందన్నారు. 2.86 లక్షల ఎస్టీ విద్యార్థులకు రూ. 843.80 కోట్లు వెచ్చించారని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని.. సీఎం జగన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. Time: 02:25 PM ► గిరిజనుల అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని విమర్శించారు. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ గిరిజనుల కష్టాలు చూశారన్నారు. అధికారంలోకి రాగానే వారికి అండగా నిలిచారని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. Time: 01:51 PM ► సినిమాటోగ్రఫి చట్టసవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈసందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. సినిమా షోలను కొందరు ఇష్టానుసారంగా వేస్తున్నారని అన్నారు. పేద,మధ్యతరగతి వాళ్ల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ విధానంలో టికెట్ ఇచ్చే పద్ధతి తేవాలనుకున్నామని మంత్రి తెలిపారు. Time: 01:21 PM ► విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి విశ్వరూప్ అన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లలా మార్చామని తెలిపారు. విదేశీ విద్యా ఫండ్‌ను రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచామన్నారు. 45 నుంచి 60 ఏళ్ల వయస్సున్న 5 లక్షల 83వేల ఎస్సీ మహిళలకు రుణాలిచ్చామని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. Time: 12:19 PM ► చంద్రబాబు సామాజిక వర్గం అభివృద్ధి కోసమే అమరావతి అని వైఎస్సార్సీపీ ఎమ్మెలే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. Time: 10:56 AM ►పేద, బడుగు వర్గాలకు నవరత్నాలతో భరోసా కల్పిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి సంక్షేమ పథకాలకు మోకాలడ్డుతున్నారన్నారు. Time: 10:39 AM ►ఎస్సీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి అన్నారు. ప్రాధాన్యత ఉన్న పదవుల్లో ఎస్సీలకు అవకాశం ఇచ్చారన్నారు. ఎస్సీ ఉపకులాలకు సైతం సముచిత ప్రాధాన్యత దక్కిందని తిప్పేస్వామి అన్నారు. ఎస్సీ ఉపకులాల గణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు ఇవ్వాలని కోరారు. నామినేటెడ్ పోస్టులో కూడా సీఎం జగన్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఎస్సీలను చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ హయాంలోఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దుర్వినియోగం చేశారని తిప్పే స్వామి అన్నారు. Time: 10:34 AM ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. బడుగుల అభ్యున్నతికి నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు. దళితుల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. పేదలు అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అవసరమన్నారు. బడ్జెట్లో 45 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. Time: 10:26 AM ►వైఎస్సార్ దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. 2014 నుంచి 2019 వరకు దళితుల స్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. దళితులను అణగదొక్కే విధంగా టీడీపీ పాలన సాగిందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. Time: 9:37 AM ►రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ కుటుంబానికి నవ రత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి అద్భుతమైన పథకం. ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. Time: 9:24 AM ►అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చను స్పీకర్ చేపట్టారు. Time: 9:15 AM సాక్షి, అమరావతి: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు మరో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు ఏపీఎస్ఆర్టీసీ, కార్మికశాఖ వార్షిక ఆడిట్ రిపోర్టు తీసుకురానుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వైద్యంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన 11 బిల్లులను నేడు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్ సంస్కరణలు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా సౌకర్యాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. -
శీతాకాల సమావేశాలకు బ్రేక్
పార్లమెంటు శీతాకాల సమావేశాలపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలు నిజమేనని తేలింది. వాటిని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారే ఇందుకు కారణమంటోంది. రివాజు ప్రకారమైతే నవంబర్ మధ్యలోనే సమావేశాలు మొదలుకావాలి. అలా జరగలేదు గనుక ఈసారి వుండకపోవచ్చునని అందరూ అనుకున్నారు. పార్లమెంటు ఏడాదికి మూడుసార్లు సమావేశం కావాలి. అయితే ఏ రెండు సమావేశాల మధ్యా ఆర్నెల్లకు మించి వ్యవధి వుండరాదని రాజ్యాంగంలోని 85(1) అధికరణ చెబుతోంది. మొన్న సెప్టెంబర్‌లో వర్షాకాల సమా వేశాలు జరిగాయి. అప్పుడు 18 రోజులపాటు సమావేశాలుంటాయని ప్రకటించినా ఇంకా వారం రోజుల గడువుండగానే అవి ముగిసిపోయాయి. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సమావేశా లకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కువమంది సభ్యులు ఒకచోట చేరే అవకాశం లేకుండా ఉభయ సభలనూ చెరో పూట ఏర్పాటు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దయింది. అయితే ఆ సమావేశాల తీరు మాత్రం యధాప్రకారమే వుంది. ఎప్పటిలాగే అధికార, విపక్ష సభ్యులు వాగ్యుద్ధాలకు దిగారు. రాజ్యసభలో ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు శీతాకాల సమావేశాలు నిలుపుదల చేయడానికి కేంద్రం చూపిన కారణంకంటే, అందుకనుసరించిన విధానంపై వివాదం తలెత్తింది. సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించడానికి ముందు విపక్ష నేతలతో లాంఛనంగా చర్చించా మని కేంద్రం చెబుతోంటే తమతో ఎవరూ మాట్లాడలేదని కాంగ్రెస్ అంటున్నది. పార్లమెంటు సమావేశాల రద్దు వంటి కీలక అంశంలో కూడా ఎవరు నిజం చెబుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యకరమే. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమేపీ శాంతిస్తున్న వైనం కనబడుతూనే వున్నా... మును పటితో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా ఆ వ్యాధి పూర్తిగా కనుమరుగుకాలేదు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వ్యాధి మరోసారి విరుచుకుపడినా పడొచ్చని నిపు ణులు కూడా చెబుతున్నారు. అయితే కరోనా కారణాన్నే చూపి శీతాకాల సమావేశాలు రద్దు చేయ దల్చుకుంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, బహిరంగసభలు వంటివి కూడా ఆపి వుండాలి. కానీ అవి యధావిధిగా జరిగాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్ రాజకీయ పక్షాల పోటాపోటీ ర్యాలీలు, సభలతో సందడిగా మారింది. ఢిల్లీలో ఇతరచోట్లకు భిన్నమైన ప్రత్యేక వాతా వరణ పరిస్థితులున్నాయనుకుంటే ఆ సంగతిని అఖిల పక్ష సమావేశం నిర్వహించి చెబితే ఎవరి అభిప్రాయాలేమిటో ప్రజలందరికీ తెలిసేది. నిజానికి మొన్న వర్షాకాల సమావేశాల సమయంలో సభ్యుల్లో కొందరు వరసగా కరోనా బారిన పడుతున్న తీరు చూసి విపక్ష నేతలే సమావేశాలను కుదిస్తే మంచిదని సూచించారు. వర్షాకాల సమావేశాలనాటికి దేశంలో కరోనా కేసుల తీవ్రత అసాధారణంగా వుంది. ఆ నెలలో 26 లక్షల కేసులు నమోదయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా సమావేశాలు నిర్వహించి ఇప్పుడు మాత్రం కరోనాను కారణంగా చూపడం ఏమిటన్నది కాంగ్రెస్ ప్రశ్న. అయితే ఎటూ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభం కానుండగా కేవలం కొన్ని రోజుల ముందు శీతాకాల సమావేశాలు జరిపితీరాలని వాదించడం ఏం సబబని బీజేపీ వాదన. ఎవరేం చెప్పినా సమస్యలు దండిగా వున్నప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవ హరించాలని... సమస్యల విషయంలో తన ఆలోచనలనూ, వైఖరిని తేటతెల్లం చేయాలని అందరూ కోరుకుంటారు. అందుకు చట్టసభే సరైన వేదిక. మీడియా సమావేశాల ద్వారానో, ఇతరత్రా సభలు, సమావేశాల్లోనో ప్రభుత్వాల ఆలోచనలు తెలుస్తుంటాయి. కానీ దాన్ని నిలదీయడానికి, ఒప్పించడా నికి చట్టసభల్ని మించిన వేదికలుండవు. అయితే చట్టసభలు గత కొన్నేళ్లుగా బలప్రదర్శన వేదిక లవుతున్నాయి. ప్రజా సమస్యలపై గళం వినిపించడం కన్నా ఏదో ఒక సాకుతో సభకు అంతరాయం కలిగించడం, మర్నాడు పత్రికల్లో పతాకశీర్షికలకు ఎక్కాలని తపనపడటం విపక్షాల్లో ముదిరింది. దాంతో అర్ధవంతమైన చర్చలకు అవకాశం కొరవడుతోంది. అటు ప్రభుత్వాలు కూడా నామ మాత్రంగా సమావేశాలు కానివ్వడం, కీలకమైన బిల్లుల్ని సైతం మూజువాణి ఓటుతో ఆమోదింప జేసుకోవటం రివాజైంది. గత సమావేశాలే ఇందుకు తార్కాణం. వర్షాకాల సమావేశాలు వరసగా పదిరోజులపాటు కొనసాగాయని, 27 బిల్లులు ఆమోదం పొందాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెబుతున్న మాట వాస్తవమే అయినా ఏ అంశంలో సక్రమంగా చర్చ జరిగిందో, విపక్షాల సూచనలను ఎన్ని సందర్భాల్లో పరిగణనలోకి తీసుకున్నారో లెక్కేస్తే నిరాశ కలుగుతుంది. విపక్షాల వాకౌట్లు, సస్పెన్షన్ల మధ్యే సాగు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయన్న సంగతి మరిచిపోకూడదు. పార్లమెంటులో ఆ బిల్లులపై ఆరోగ్యకరమైన చర్చ జరిగివుంటే ఇప్పుడు తలెత్తిన నిరసనలే వుండేవి కాదు. దేశంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు. వ్యాక్సిన్ త్వరలోనే వచ్చే అవకాశాలు కనబడుతు న్నాయి. ఢిల్లీ వెలుపల రైతుల నిరసనోద్యం సాగుతోంది. వీటన్నిటిపైనా పార్లమెంటు లోతుగా చర్చిస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. గతవారం పార్లమెంటు నూతన భవన సము దాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ సైతం ప్రజా స్వామ్యంలో చర్చల ప్రాధాన్యత గురించి చెప్పారు. కీలకమైన సమస్యలనూ, ప్రభుత్వం తీసుకునే ముఖ్య నిర్ణయాలనూ కూలంకషంగా చర్చించడం, వాటన్నిటిపైనా ఏకాభిప్రాయానికి రాలేక పోయినా, కనీసం సహేతుకమైన సూచనలను పాలకులు ఏదోమేరకు పట్టించుకుంటున్నారన్న అభి ప్రాయం కలగడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ కోణంలో చూస్తే స్వల్పకాలమైనా శీతాకాల సమావేశాల నిర్వహణకే ప్రాధాన్యమిచ్చివుంటే బాగుండేది. -
ఎల్లో మీడియాపై సీఎం జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: అమూల్‌తో ఒప్పందం వల్ల మహిళలకు మేలు చేకూరుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాల రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మాత్రం ఇవేమీ పట్టవని, అందుకే సభలో రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు తమ పార్టీ సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా సభలో సస్పెండ్ చేయించుకుని ఎల్లోమీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ఈనాడు పేపర్‌తో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని చురకలు అంటించారు. పెన్షన్ల అంశంపై సభలో వీడియో క్లిప్పింగ్‌లతో సహా చూపించినా.. చంద్రబాబు చెప్పే అసత్యాలను ప్రచురిస్తున్నారంటూ ఎల్లోమీడియా తీరును విమర్శించారు. బాబును కాపాడటానికి ఈనాడు, ఆంధ్రజోతి, టీవీ5 పనిచేస్తున్నాయని.. ఆయన సీఎం కాలేదన్న ఈర్ష్య, కడుపు మంటతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయంటూ ధ్వజమెత్తారు.(చదవండి: కావాలనే సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు!) 2023లో రూ. 3 వేలకు పెంపు పింఛన్ల గురించి సీఎం జగన్ సభలో మాట్లాడుతూ.. ‘‘2019, జనవరి 25న పింఛన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్లను పెంచారు. ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రమే 6 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక 60 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం. మేము రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే.. బాబు మాత్రం రూ.500 కోట్లే ఖర్చు చేశారు. ఈ వాస్తవాలన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు కనిపించడంలేదు. జూలై 8న రూ.2,250 నుంచి రూ.2500లకు పింఛన్ పెంచుతాం. 2022 జూలై 8న రూ.2,500 నుంచి రూ.2,750కి పింఛన్ పెంచుతాం. 2023 జూలై 8న రూ.2,750 నుంచి రూ.3 వేలకు పింఛన్ పెంచుతాం’’ అని స్పష్టం చేశారు. -
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 13 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉభయ సభలు ప్రారంభమయిన తొలుత ఇటీవల మరణించిన పలువురు ప్రముఖులకు సభ్యులు నివాళి అర్పించారు. మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ రాంజెఠ్మలానీ, గరుదాస్ దాస్‌గుప్తాలకు ఉభయ సభలు నివాళి అర్పించాయి. అనంతరం నూతనంగా ఎన్నికయిన సభ్యుల చేత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మహారాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించాలని శివసేన ఎంపీలు డిమాండ్ చేశారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు సభ్యులు పలు అంశాలను సభలో లేవనెత్తారు. ప్రస్తుతం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు కశ్మీర్లో నిర్బంధంలో ఉన్న నేతలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌తో పాటు యూపీఏ పక్షాల ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వారందరని నిర్బంధించారని ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండోదఫా సమావేశాలివి. కాగా 1952లో రాజ్యసభ ప్రారంభ మైన తర్వాత జరగనున్న 250వ భేటీని పురస్కరించుకుని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ భేటీలో ప్రభుత్వం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుతోపాటు అక్రమ వలసదారుల నిర్వచనంపై స్పష్టతనిచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఉంది. ఈనెల 18వ తేదీన మొదలై డిసెంబర్ 13వ తేదీతో ముగిసే ఈ సమావేశాల్లో పార్లమెంట్ 20 సార్లు భేటీ కానుంది. పార్లమెంట్ వద్ద 43 బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఈ సమావేశాల్లో ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం పొందేందుకు సిద్ధం చేసింది. -
రాఫేల్, కావేరీ వివాదాలపై పార్లమెంట్లో గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ : క్రిస్మస్ విరామం అనంతరం గురువారం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలూ సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. కావేరీ వివాదంపై నిరసనలు హోరెత్తడంతో రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో రాఫేల్ ఒప్పందంపై విపక్షాలు నినాదాలతో ప్రభుత్వంపై విరుచుకుపడటంతో గందరగోళం నెలకొంది. ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై చర్చ చేపట్టాల్సిఉండగా సభ రాఫేల్ డీల్‌పై దద్దరిల్లింది. విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ పార్టీ సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేశాయి. ఈ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ట్రిపుల్ తలాక్‌ను నేరపూరిత చర్యగా బిల్లులో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత శశి థరూర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం లోక్‌సభ ముందుంచనుంది. -
అసెంబ్లీలో 60 మంది మద్యం ప్రియులు!
సాక్షి, ముంబై : నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనారోగ్యంతో వైద్యం పొందిన ప్రముఖుల్లో 60 మంది అతిగా మద్యం సేవించడంవల్ల వారి ఆరోగ్యం పాడైనట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. దీంతో నాయకుల క్వార్టర్స్‌లో మద్యం నిషేధం అమలులో ఉన్నప్పటికీ మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు మద్యం సేవిస్తున్నట్లు స్పష్టమవుతోంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మహారాష్ట్రకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాల నాయకులు నాగ్‌పూర్‌లో తిష్ట వేస్తారు. వీరితోపాటు ముంబై, వివిధ ప్రాంతాల నుంచి సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అత్యవసర సమయంలో లేదా వీరు అనారోగ్యానికిగురైతే వైద్యం అందించడానికి అసెంబ్లీ ప్రాంగణం, ఎమ్మెల్యే క్వార్టర్స్, రవీ భవన్ ఇలా మూడు చోట్ల వైద్య కేంద్రాలు (క్లినిక్‌లు) అందుబాటులో ఉంచుతారు. అందుకు 48 మంది వైద్యులు విధులు నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో (కేవలం రెండు వారాల్లోనే) ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు కార్యదర్శులు, ఎమ్మెల్యేలు ఇలా మొత్తం 7,016 మంది వివిధ వైద్య సేవలు పొందారు. అందులో 60 మంది అతిగా మద్యం సేవించడం వల్లే అనారోగ్యానికి గురైనట్టు రక్త, మూత్ర పరీక్ష నివేదికలో బయటపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసముంటున్న రవీ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మద్యపాణ నిషేధం అమలులో ఉంది. అయినా అక్కడికి మద్యం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. సమావేశాలు ముగిసిన తరువాత వీరు బయట మద్యం సేవించారా..? లేక ఏకంగా గదిలోకే మద్యం తీసుకొచ్చారా...? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు...!
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల తొలిరోజన కొందరు సభ్యులు.. అనూహ్య రీతిలో సభకు వచ్చారు. సైకిల్, ట్రాక్టర్, బుల్లెట్‌పై ఇలా.. ఒక్కో వాహనం మీద లోక్‌సభకు వచ్చారు. రోడ్లపై వీరిని చూసిన జనాలు.. వీరిని ఒకింత ఆశ్చర్యంగా గమనించడం విశేషం. ఇండియన్ లోక్‌దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుష్యంత్ చౌతాలా... ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వస్తున్న చౌతాలాను ఇతర సభ్యులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యంతో గమనించారు. చౌతాలా ఇలా పార్లమెంట్‌కు రావడం కొత్తేమీ కాదు. గతంలో పొల్యూషన్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న సరి-బేసి విధానాన్ని వ్యతిరేకిస్తూ గుర్రంపై పార్లమెంట్‌కు వచ్చారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ ఎంపీలు మన్షుఖ్ ఎల్ మాండవీయ, మనోజ్ తివారీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు హాజరయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎంపీ రంజీత్ రంజన్ ఆరెంజ్ కలర్లోని హార్లీ డేవిడ్సన్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహిళల దినోత్సం కాబట్టి.. మహిళా శక్తిని చాటేందుకు హార్లీడేవిడ్సన్ బైక్ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బీహార్‌లోని సుపాల్ నియోజకవర్గానికి 42 ఏళ్ల రంజిత్ రంజన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. జనవరి 5 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ట్రిపుల్ తలాక్ సహా 14 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్దం
-
తలాక్‌కు చెల్లుచీటి!
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరింత మద్దతు తెలుపుతోంది. ట్రిపుల్ తలాక్‌ను పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తలాక్‌ను రద్దు చేసే క్రమంలో భాగంగా బిల్లును రూపొందించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా.. బిల్లు రూపకల్పనకు మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన సమాచారం. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముస్లిం వ్యవస్థలో భాగమైన ఈ తలాక్ వల్ల మహిళలు అన్యాయానికి గురువుతున్నారని, వారికి చట్ట పరమైన రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గతంలో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని గత ఆగస్టు 22న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ అనేది మత విశ్వాసాలకు సంబంధించినది.. కావడం వల్ల దీనిపై కేందం స్పష్టమైన చట్టాన్ని చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. -
11 తర్వాత శీతాకాల సమావేశాలు ప్రారంభం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. నిజానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలోనే ప్రారంభమవ్వాలి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా సమావేశాలు ప్రారంభం కావడం ఆలస్యమవుతోందని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. కాగా సమావేశాల తేదీల్ని నిర్ణయించే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇంకా భేటీ కాలేదు. డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 11– 14 మధ్యలో ప్రారంభం కావచ్చని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. సభ నిర్వహణకు కేంద్రం సుముఖంగా లేదని, శీతాకాల సమావేశాల్ని రద్దు చేసే ఆలోచనలో ఉందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలుచేశాయి. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
పార్లమెంటులో మళ్లీ అదే సీను
స్తంభించిన ఉభయసభలు న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారమూ ఆందోళనలతోనే ముగిశారుు. సభ బయట తమను కించపరిచేలా మాట్లాడిన ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ రాజ్యసభలో విపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేశారుు. ఉభయసభల్లోనూ కోల్‌కతాలో ఆర్మీ మోహరింపుపై టీఎంసీ ఎంపీలు ఆందోళన చేశారు. వీరికి కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీలు మద్దతు పలికారుు. దీనిపై రక్షణ మంత్రి స్వయంగా వివరణ ఇచ్చినా.. సంతృప్తి చెందని విపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నారుు. దీంతో పార్లమెంటు వారుుదా పడింది. రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాలు మోదీ క్షమాపణకు పట్టుబట్టారుు. వెల్‌లోకి వచ్చిన విపక్ష ఎంపీలు సర్కారుకు, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో చైర్మన్ అన్సారీ సభను మధ్యాహ్నానికి వారుుదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ గందరగోళంలోనే డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రైవేటు మెంబర్ శాసన వ్యవహారాలను కొనసాగించారు. తర్వాత సభ వారుుదాపడింది. ఐటీ బిల్లుకు సవరణలను చర్చ లేకుండానే ఆమోదించి పంపటంపై విపక్షాలు నిరసన తెలిపారుు. దీంతో సభ వారుుదా పడింది. తిరిగి ప్రారంభమైనా విపక్షాలు వెల్‌లోనే ఉండి నినాదాలు చేశారుు. ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ సభ్యులు బెంచీలపై నిలబడి నిరసన తెలిపారు. -
కరువుపై గళం
సాక్షి,బెంగళూరు: శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే వేడి రాజుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు చట్టసభలను కుదిపేశాయి. సమస్యల పరిష్కారం కోసం బెళగావికి చేరుకుంటున్న రైతుల అరెస్టును ఖండిస్తూ విపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించాయి. ఈ ఏడాది శీతాకాల శాసనసభ సభలు బెళగావిలోని సువర్ణ విధానసౌధలో సోమవారం నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విధానసౌధలో జగదీష్‌శెట్టర్ మాట్లాడుతూ.... సమస్యలను ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడానికి బెళగావికి వస్తున్న రైతులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడం, మండ్య, మైసూరు వంటి చోట్ల శాంతిభత్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం తుగ్లక్ పాలనను గుర్తుకు తెస్తోందని వ్యంగమాడారు. ఈ సమయంలో అధికార, విపక్షనాయకులు మధ్య వాగ్వాదం చెలరేగింది. అరుునా వెనక్కు తగ్గని బీజేపీ నేతలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేడీఎస్ శాసనసభ్యులు సైతం వారికి మద్దతుగా వెల్‌లోకి దూసుకెళ్లారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుగజేసుకుని సువర్ణ విధానసౌధ చుట్టూ నిషేదాజ్ఞలు ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రైతులను అదుపులోకి మాత్రమే తీసుకున్నారన్నారు. ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. వారిని వదిలిలేయాలని ఆదేశాలను జారీ చేశామన్నారు. ఎవరి పైనా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. అయినా విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు స్పీకర్ కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. పరిషత్‌లో కూడా... పరిషత్‌లో కూడా రైతుల అరెస్టుపై విపక్షాలు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టాయి. అనంతరం మండలి విపక్షనేత కే.ఎస్ ఈశ్వరప్ప కరువుపై చర్చకు పట్టుబట్టారు. అయితే అక్కడే ఉన్న మండలి నాయకుడు పరమేశ్వర్ అడ్డుచెప్పారు. మొదట ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని అటుపై వివిధ అంశాలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. దీంతో కే.ఎస్ ఈశ్వరప్ప ఆగ్రహం వ్యక్త చేశారు. ‘ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై చిత్తశుద్ధిలేదు. అందువల్లే కరువుపై చర్చిచండానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేరు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జేడీఎస్ ఎమ్మెల్సీలు కలుగజేసుకుని కరువుతో పాటు పెద్దనోట్ల రద్దు వల్ల రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండలి దృష్టికి తీసుకువచ్చారు. గంభీరత దృష్ట్యా మొదట కరువుపై చర్చకు అనుమతివ్వాలని మండలి అధ్యక్షుడు శంకరమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శంకరమూర్తి కలుగజేసుకుని విపక్షనాయకుడు కరువుపై ప్రస్తావించాలని, చర్చ మాత్రం ప్రశ్నోత్తరాల తర్వాత జరుగుతుందని స్పష్టంచేశారు. ఒక్క పైసా కూడా విడుదల కాలేదు... కరువు పరిస్థితులపై కే.ఎస్ ఈశ్వరప్ప మండలిలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 139 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కరువు నివారణకు ప్రతి తాలూకాకు రూ.50 లక్షలు అదంజేశామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. కరువు పరిహారం కోసం ప్రత్యేకంగా రూ.10వేల కోట్ల నిధులను కేటాయించాలి’ అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు రూ.96,834 కోట్లు కాగా అందులో రూ.12,850 కోట్లు ప్రభుత్వ బ్యాంకులు, సహకార సంఘాల్లో తీసుకొన్నవేనన్నారు. ఆ రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో కేంద్రాన్ని తప్పు పట్టడం సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదట తన వాటాను విడుదల చేసి రైతు సంక్షేమం విషయంలో తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ఈశ్వరప్ప ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఈ సమయంలో తిరిగి గందరగోళం చెలరేగినా మండలి అధ్యక్షుడు శంకరమూర్తి కలుగజేసుకోవడంతో సభా కార్యాక్రమాలు సజావుగా కొనసాగాయి. కాగా, అంతకు ముందు ఇటీవల చనిపోయిన ప్రజాప్రతినిధులకు, అప్పులబాధతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు ఉభయ సభల్లో ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. -
ప్రభుత్వానిది కక్ష సాధింపు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష శాసనసభ్యులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ కమిటీ హాల్లో బుధవారం జరిగిన సభాహక్కుల కమిటీ ముందు విచారణకు హాజరైన సందర్భంగా ఎమ్మెల్యేలు బి.ముత్యాలనాయుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్, కె.సంజీవయ్య, కంబాల జోగులు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో హోదాపై ఏకగ్రీవ తీర్మానం చేసిన చంద్రబాబు నిస్సిగ్గుగా దాన్ని పక్కన పడేసి.. ఇచ్చింది తీసుకోండి అన్న చందాన కేంద్ర ప్రకటనను స్వాగతిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ప్రాణాలు పోయినాసరే పోరాటం చేసి ప్రత్యేకహోదాను సాధించి తీరుతామని చెప్పారు. ప్రజల పక్షాన ఉద్యమించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. శీతాకాల సమావేశాల్లోగా స్పీకర్‌కు నివేదిక: గొల్లపల్లి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోగా సభాపతికి నివేదిక సమర్పిస్తామని సభాహక్కుల కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. మంగళవారం జరిగిన విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం కమిటీ సభ్యులు బీసీ జనార్ధన్‌రెడ్డి, శ్రావణ్ కుమార్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు రోజుల్లో విచారణకు హాజరు కాని ఎమ్మెల్యేలను కూడా డిసెంబర్2వ తేదీన విచారిస్తామని చెప్పారు. -
శీతాకాల సమావేశాల్లోనే ‘ఎస్సీ బిల్లు’ ప్రవేశపెట్టాలి
మంద కృష్ణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఎమ్మాఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్జీని మంద కృష్ణ శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఈయనతో వర్గీకరణ బిల్లుపై చర్చించారు. దళితుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా శివప్రకాశ్‌జీ స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధానితో చర్చించి త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
డిసెంబర్ 16 వరకు పార్లమెంట్
-
డిసెంబర్ 16 వరకు పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 16న ముగియనున్నాయి. ఈ నెల 13న సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నవంబర్ 16 నుంచి.. డిసెంబర్ 16 వరకూ నిర్వహించాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ షంషేర్ కె షరీఫ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రస్తుత సమావేశాలు 16వ లోక్‌సభలో 10వ సెషన్ కాగా.. రాజ్యసభకు 241వ సెషన్ కావడం గమనార్హం. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభమవుతాయి. అయితే ఈసారి వీటిని కాస్త ముందుకు జరిపి నవంబర్ 16నే సమావేశాలను ప్రారంభిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగానే నిర్వహించనున్న నేపథ్యంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కి సంబంధించి మిగిలి ఉన్న సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) చట్టాలను నవంబర్ చివరినాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వానికి మార్గం సుగమమవుతుంది. జీఎస్టీ బిల్లులతో పాటు డజను బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఆర్మీ సర్జికల్ దాడుల అంశం కీలకంగా మారే అవకాశాలున్నాయి. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీ ఖరారు
-
డిసెంబర్ 15లోగా అసెంబ్లీ భవన నిర్మాణం
- గడువును నిర్దేశించామన్న స్పీకర్ కోడెల - శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే సాక్షి, అమరావతి: వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తిచేసేందుకు డిసెంబర్ 15ను గడువుగా నిర్దేశించినట్లు శాసనసభాపతి డా.కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈమేరకు నిర్మాణ సంస్థతో పాటు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సోమవారం ఉదయం శాసనమండలి చైర్మన్ డా.చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీశ్‌రెడ్డి, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి యనమల రామకృష్ణుడు, శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ, డీజీపీ నండూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తదితరులతో కలసి నూతన అసెంబ్లీ, కౌన్సిల్ భవన నిర్మాణాలను పరిశీలించారు. శాసనసభ శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే జరుగుతాయని తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా హక్కుల సంఘానికి సిఫారసు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవటాన్ని నివారించేందుకు నూతన సమావేశమందిరంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిసెంబర్ ఆఖరు లేదా జనవరి మొదట్లో అసెంబ్లీ! ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా జీఎస్టీకి సంబంధించిన బిల్లులను ఆమోదించనుంది. అవసరమైతే ఒకటి, రెండు రోజులు అదనంగా సమావేశాలు నిర్వహించి శాసనసభ శీతాకాల సమావేశాలను మమ అనిపించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. -
ముందుగానే శీతాకాల సమావేశాలు!
-
ముందుగానే శీతాకాల సమావేశాలు!
- నవంబర్ మొదట్లోనే నిర్వహించే యోచన - జీఎస్టీ ఆమోదమే ప్రభుత్వ లక్ష్యం సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జీఎస్టీ మద్దతు బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను పక్షం రోజులు ముందుగానే, అంటే నవంబర్ మొదట్లోనే ప్రారంభించాలని అనుకుంటోంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబరు మూడవ లేదా నాల్గవ వారంలో ప్రారంభమవుతాయి. సీజీఎస్టీ (సెంట్రల్ జీఎస్టీ), ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ) బిల్లులు వీలైనంత త్వరగా పార్లమెంట్ ఆమోదం పొందితే, నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారానికల్లా జీఎస్టీకి మార్గం సుగమం చేయవచ్చునని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతుగా సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. జీఎస్టీ కోసం పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారేందుకు 31 రాష్ట్రాలలో సగానికి పైగా రాష్ట్రాలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పటికే పలు రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ రెండోవారం కల్లా మిగిలిన శాసనసభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే అవకాశాలున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
డిసెంబర్ 18న రాష్ట్రపతి రాక
- 30 వరకు హైదరాబాద్‌లో విడిది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్లో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో విడిది చేయటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి 30 వరకు శీతాకాల విడిదికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేస్తారు. ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ పర్యటనలకు హాజరవుతారు. రాష్ట్రపతి భవన్‌లోనే పలువురు ప్రముఖులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని, తేదీల వివరాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. -
పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
-
ప్రభుత్వానికి ‘అసహనం’ పరీక్ష
వేడెక్కనున్న శీతాకాల సమావేశాలు * అసహనంపై నేడు లోక్‌సభలో చర్చ షురూ న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సోమవారం నుంచి ‘అసహనం’ పరీక్ష ఎదురుకానుంది. దేశంలో పెరుగుతున్న అసహనంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు ప్రతిపక్షాలు రెండు సభల్లోనూ నోటీసులు ఇవ్వడంతో సోమవారం నుంచి ఈ అంశంపై చర్చ మొదలుకానుంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరు మంత్రులపై చర్యలు తీసుకోవాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, జేడీయూ, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు అసహనంపై చర్చకు ఓటింగ్‌తో లేదా ఓటింగ్ లేకుండా చర్చ, తీర్మానానికి ఉభయ సభల్లోనూ నోటీసులు ఇచ్చాయి. లోక్‌సభలో సోమవారం నుంచి చర్చ ప్రారంభం కానుండగా.. రాజ్యసభలో మాత్రం ఈ వారంలో ఏదో ఒక రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి రెండ్రోజులు రాజ్యాంగంపై చర్చలో అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నా సభకు అంతరాయం కలగలేదు. అయితే సోమవారం నుంచి అసహనంపై చర్చ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే కీలకమైన బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ప్రతిపక్షాలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అసహనం అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ‘వినియోగదారుల బిల్లు’ మరింత జాప్యం వినియోగదారుల హక్కుల పరిరక్షణ బిల్లు-2015 పార్లమెంటుకు రావడం ఆలస్యం కావొచ్చు. ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లును పరిశీలిస్తోంది. దీనిపై కమిటీ నివేదిక ఇవ్వాల్సిన గడువును కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటివారం వరకు పొడిగించింది. కాగా, లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏడాది చర్చల తర్వాత దానిపై ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. తుది నివేదికను వచ్చే నెల మొదట్లో రాజ్యసభకు సమర్పించనుంది. -
ఎంపీగా దయాకర్ ప్రమాణ స్వీకారం
హన్మకొండ : వరంగల్ ఎంపీగా ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్ లోక్‌సభ సభ్యుడిగా గురువారం ప్రమాణం చేశారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ఆయన పార్లమెంట్లో ఎంపీగా తెలుగులో ప్రమాణం చేశారు. దయాకర్ వెంట టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్‌కుమార్, వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి, జిల్లా నాయకులు గద్దల నర్సింగరావు, గుజ్జ సంపత్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లారు. వీరు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పసునూరి దయాకర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. కాగా, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి దయాకర్‌తో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. -
అసెంబ్లీ ఐదు రోజులే...
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులతో ముగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఆత్మహత్యలతో పాటు నూతన రాజధాని నిర్మాణం, రాజధానిలో భూ దందా, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, కారు చౌకగా కావాల్సిన వారికి భూముల కేటాయింపు, కరవు, ఇటీవల భారీ వర్షాలు తదితర ప్రధానమైన అంశాలు చర్చించాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలను కేవలం ఐదు రోజులకే పరిమితం చేయడం పట్ల అధికార వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వివిధ ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా.. గత వర్షాకాల సమావేశాలను సైతం తూతూ మంత్రంగా పూర్తి చేసిన సర్కార్ మరో సారి.. సమావేశాలను నామ మాత్రంగా నిర్వహించాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 83 రోజుల తరువాత హైదరాబాద్‌లోని సచివాలయానికి రానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన సచివాలయంలో ఎల్ బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తరువాత ఇప్పటి వరకు సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో గల సీఎం కార్యాలయానికి చంద్రబాబు నాయుడు రాలేదు. ఈ నెల 27వ తేదీ రాత్రికి హైదరాబాద్ రానున్న చంద్రబాబు నాయుడు.. 28 ఉదయం సచివాలయంలో అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులతో పాటు.. ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇలా ఉండగా వచ్చే నెల 1వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లో జరుగున్న నేపథ్యంలో వచ్చే నెల 18వ తేదీన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని అధికారులు పేర్కొంటున్నారు. అయితే తొలుత విజయవాడలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
ఉభయ సభలు గురించి సాక్షి ఈడీతో చర్చ
-
ఈనెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు
-
ఎస్... ఆ బిల్లు వెనక్కు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల సవరణ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొప్పాళలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ బిల్లును రూపొందించే విషయమై గత బీజేపీ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. అయితే చట్ట సభల్లో బిల్లుకు అనుమతి లభించిన తర్వాత రాజకీయ దురుద్దేశ్యంతో ఆ పార్టీ రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకాలకు రూ.వెయ్యి కోట్లు గంగావతి : కొప్పళ జిల్లాలో ఎత్తిపోతల పథకానికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించినట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు. కుష్టిగిలో పలు అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు... కేటాయించిన నిధుల్లో రూ. 600 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కొప్పళ జిల్లా యలబుర్గా, కుష్టిగి, కొప్పళ తాలూకాలు పూర్తిగా నీటి పారుదలకు నోచుకోని డ్రై ఏరియా కావడం, గంగావతి తాలూకాలోని కనకగిరి అసెంబ్లీ క్షేత్రం పూర్తిగా నీటిపారుదల లేని భూములు ఉన్నాయని, నాలుగు తాలూకాలకు ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వివరించారు. వచ్చే ఏడాది కొప్పళ నగరంలో వైద్య కళాశాలను ప్రారంభించడం ఖాయమన్నారు. కుష్టిగి పట్టణంలో కనకదాసుల భవన నిర్మాణానికి కోటి రూపాయలు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్-కర్ణాటక అభివృద్ధికి తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యత కల్పించిందని అన్నారు. కార్యక్రమంలో కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి , గంగావతి ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారి, యలబుర్గా ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి, కుష్టిగి ఎమ్మెల్యే దొడ్డనగౌడ పాటిల్, కొప్పళ జిల్లా ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, ఎమ్మెల్సీ హాలప్ప ఆచార్, మాజీ ఎమ్మెల్యే కే.శరణప్ప తదితరులు పాల్గొన్నారు. -
దుమారం రేపుతున్న మంత్రిగారి డ్యాన్స్!
బెంగళూరు : తానేం చెప్పినా అందుకు మీడియా వ్యతిరేకార్థాలు తీస్తోందని, అంతేకాక తన వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగేలా మీడియా వ్యవహరిస్తోందని కర్ణాటక మంత్రి, సినీనటుడు అంబరీష్ మండిపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సువర్ణసౌధ ప్రాంగణంలో నిన్న ఆయన మాట్లాడారు. 'నేను రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన నాకంటూ వ్యక్తిగత జీవితం ఉండదా? నేను నా బిడ్డలు, మనవలకు ముద్దిస్తే కూడా విపరీతార్థాలు తీస్తారా? ఇది ఎంతమాతం మంచిది కాదు. మంచి విషయాలను ప్రజలకు తెలియజెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు మీ పత్రికల్లో, టీవీల్లో వస్తాయా లేదా..' అని మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా అంభరీష్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి... ఓ బార్లో మందుకొట్టి... హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ... కెమెరాకు చిక్కారు. కాగా ఇది ఆయన వ్యక్తిగతం అని మద్దతుదారులు అంటున్నారు. అయితే.. ఇలా మందుకొట్టి.. మజా చేస్తున్న మంత్రికి.. ఇటీవలే.. కోటి 22 లక్షలు ప్రభుత్వ నిధులతో సింగపూర్‌లో వైద్యం చేయించుకోవడలో ఆంతర్యమేమిటని.. ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇదేకాదు.. గతంలో ఓ అమ్మాయిని అంబరీష్ ముద్దుపెట్టిన ఫోటో కూడా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాల ఆందోళన నేపధ్యంలో.. ఒకరు కాదు... 350 మంది అమ్మాయిలను కిస్ చేశానంటూ... మంత్రి అంబరీష్ రిప్లయ్ ఇవ్వటం గతంలో పెద్ద దుమారానికి దారి తీసింది. -
మందుకొట్టి,మంత్రిగారి డ్యాన్స్ షో
-
అంబి లీలలు
*మంత్రి అంబరీష్ సెల్లో తన అసభ్య నృత్యాలు, ఫొటోలు చూస్తూ కాలక్షేపం *అట్టుడికిన ఉభయ సభలు *బీజేపీ చేతికి కొత్త ఆయుధం *తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. అంబరీష్‌పై కూడా తీసుకోవాంటూ డిమాండ్ *ఉభయ సభల్లో మూడో రోజూ ఇదే తంతు బెంగళూరు : మంత్రి అంబరీష్ సెల్లో తన అసభ్య నృత్యాలు, ఫొటోలు చూస్తూ బుధవారం సభలో కాలక్షేపం చేసిన విషయం గురువారం వెలుగు చూసింది. దీంతో మూడవ రోజైన గురువారం కూడా సభల్లో ‘ సెల్ గోల’ తప్పలేదు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు సజావుగా జరగడం లేదు. మొదటిరోజు చెరుకు మద్దతుధర, రెండో రోజు మధ్యాహ్నం నుంచి ‘చౌహాన్ సెల్ పురాణం’తో కొండెక్కిన కార్యక్రమాలు మూడో రోజూ అదే బాటలో నడిచాయి. ఉభయ సభల అధిపతులు ఎంత ప్రయత్నించినా అధికార విపక్ష నాయకులు వెనక్కు తగ్గకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సభలు తర్వాతి రోజుకు (శుక్రవారానికి) వాయిదా పడటంతో విలువైన సభా సమయం వ ృథా అయిపోయింది. అధికార పార్టీకు చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఒక వైపు చర్చ జరుగుతుంటే మరోవైపు తన పక్కన ఉన్న స్వపక్షానికి చెందిన ఎమ్మెల్యే మల్లికార్జునకు గతంలో తాను ఓ పబ్‌లో తాగిన మైకంలో చేసిన తాను చేసిన నాట్యాన్ని సెల్ఫోన్లో చూపిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా శాసనసభలో మూడో రోజైన గురువారం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే కాంగ్రెస్ పార్టీకు చెందిన పలువురు నాయకులు ‘బీజేపీ షేమ్...షేమ్’ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సభలో మొబైల్లో ప్రియాంకగాంధీని ఫొటోను అసభ్య రీతిలో జూమ్ చేసి చూసిన ప్రభుచౌహాన్ను ఒక రోజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిస్పందించిన బీజేపీ నాయకులు ‘చేసిన తప్పునకు చౌహాన్ క్షమాపణ స్పీకర్‌కు ఇప్పటికే క్షమాపణ చెప్పారు. సభలో కూడా చెప్పడానికి సిద్ధం. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. అలా కాదు అంటే మీ పార్టీకు చెందిన మంత్రి అంబరీష్, మల్లికార్జునలను కూడా ఒక రోజు సస్పెండ్ చేయాలి’ అని పేర్కొన్నారు. ఇందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దీంతో శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభను సజావుగా జరిపే పరిస్థితి కనిపించ పోవడంతో సభను కొద్ది సేపు వాయిదావేశారు. అధికార, ప్రతిపక్షానికి చెందిన నాయకులతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప తన కార్యలయంలో కొద్ది సేపు సమావేశమై.. ఇరు పార్టీల మధ్య సంధానానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే సభను నడపడానికి స్పీకర్ విఫలయత్నం చేశారు. విపక్ష నాయకుడైన శట్టర్కు మాట్లాడుతూ... ‘క్షమాపణ కోరుతామన్నా అధికార పక్షం వినడం లేదు. చెరుకు రైతులు, ఉత్తర కర్ణాటక సమస్యల పై అడిగే ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవు. అందుకే అధికార పక్షం మొండిపట్టు పడుతోంది.’ అన్నారు. దీంతో మరోసారి శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. స్పీకర్ ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో శాసనసభ సమావేశాలు మూడు గంటలకు వాయిదా పడింది. శాసనమండలిలో అటు శాసనమండలిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నాయకులు పోడియంలోకి దూసుకెళ్లీ మరీ పోటాపోటీగా ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటలలోపు రెండు సార్లు సభను వాయిదా వేసి తిరిగి కార్యక్రమాలను నిర్వహించడానికి శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదు. విషయం తెలుసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప అటు మండలి, ఇటు శాసనసభకు చెందిన అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పాటు ముఖ్యనేతలను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే ఈ సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ నాయకులు బయటకు వచ్చి శాసనసభ విపక్ష నాయకుడు శెట్టర్ కార్యాలయంలో వేరుగా సమాలోచనలు తెలిపారు. ‘అంబరీష్‌తో శాసన సభలో క్షమాపణ చెప్పించి తీరాల్సిందే’ అని సమాలోచనలో అందరూ బీజేపీ ఏకగ్రీవంగా అంగీకరించారు. అటుపై బీజేపీ గైర్హాజరీ నేపథ్యంలో శాసనసభ, పరిషత్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పది నిమిషాల అనంతరం ఉభయ సభలకు చెందిన బీజేపీ నాయకులు అంబరీష్‌తో క్షమాపణ చెప్పించాలని అటు శాసనసభలో, ఇటు పరిషత్‌లో పట్టుపట్టారు. దీంతో స్పీకర్ సభను శుక్రవారం ఉదయం 9:30లకు వాయిదా వేయగా మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. -
అసెంబ్లీలో అశ్లీల చిత్రాల వీక్షణపై కాంగ్రెస్ ధర్నా
దావణగెరె:బెళగావి సువర్ణ సౌధలో చేపట్టిన శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే మొైబె ల్లో అశ్లీల చిత్రాలను వీక్షించడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం స్థానిక మహానగర పాలికె ఎదుట ధర్నా చేపట్టారు. మహానగర పాలికె సామాజిక, ఆరోగ్య స్థాయీ సమితి అధ్యక్షుడు దినేశ్ శెట్టి మాట్లాడుతూ అసెంబ్లీ స మావేశాల్లో రైతు సమస్యలపై చర్చించకుండా వృథాగా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్తో పాటు ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్నారని వెల్లడించారు. బాలికల రక్షణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ వా రు సభలో మాత్రం అశ్లీల చిత్రాలు చూడడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మే యర్ రేణుకాబాయి, ఉప మేయర్ అబ్దుల్ లతీఫ్, పాలికె సభ్యులు శివనహళ్లి రమేశ్, హాలేశ్, తిప్పణ్ణ, ఆయూబ్ పైల్వాన్, వెంకటేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు దశాబ్దాల తర్వాత..
సంప్రదాయాలకు విరామం ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత లేకుండా శీతాకాల సమావేశాలు సమావేశాలకు ముందు అధికారపక్షంలో చేరిన శివసేన ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీ హోరాహోరీ సాక్షి ముంబై: రాష్ర్టంలో ఈసారి శీతాకాల సమావేశాలు ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు లేకుండా జరుగుతుండటం విశేషం. 20 ఏళ్ల అనంతరం ఉపముఖ్యమంత్రి లేకుండా ఈ సమావేశాలకు నాగపూర్ వేదికకావడం విశేషంగా చెప్పుకోవచ్చు. 1995-99 మధ్య కాలంలో శివసేన-బీజేపీల కాషాయ కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పరంపర కొనసాగుతూ వచ్చింది. అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఒంటరిగా పోరాడాయి. ఎవరికీ పూర్తి మద్దతు లభించకపోయినప్పటికీ 122 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మళ్లీ మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలు ఒక్కటయ్యాయి. అయితే ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న శివసేన శీతాకాల సమావేశాలకు ఒక రోజు ముందు ప్రభుత్వంలో భాగస్వామిగా మారడంతో ఈసారి ప్రతిపక్ష నాయకుడు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు 2012లో ఉపముఖ్యమంత్రి లేకుండా సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైనప్పటికీ చివరి క్షణంలో మళ్లీ అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ సమయంలో జలవనరుల కుంభకోణంపై ఆరోపణలు రావడంతో ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఉపముఖ్యమంత్రి ఖాళీ అయింది. ఈ పదవిని భర్తీ చేయరని భావించినప్పటికీ శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందు భర్తీ చేసి ఆ సమావేశాల్లోనే ప్రమాణస్వీకారం చేశారు. 1978 నుంచి డిప్యూటీ సీఎం... రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1978లో ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించారు. ఆ సమయంలో ఎస్ కాంగ్రెస్‌కు చెందిన వసంత్‌దాదా పాటిల్ ముఖ్యమంత్రి ఉండగా ఉపముఖ్యమంత్రిగా ఇందిరా కాంగ్రెస్‌కు చెందిన నాశిక్‌రావ్ తిరపుడే బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఉపముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్‌కు చెందిన రామారావ్ అధిక్‌కు లభించింది. ఆయన వసంత్‌దాదా పాటిల్‌తోపాటు శరద్‌పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రామారావ్ అధిక్ అనంతరం మళ్లీ కాంగ్రెస్‌లో ఎవరికి ఉపముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టే గౌరవం లభించలేదు. 15 ఏళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎవరికీ ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదు. అనంతరం శివసేన-బీజేపీ కాషాయ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో శివసేనకు చెందిన మనోహర్ జోషీ ముఖ్యమంత్రిగా ఉండగా దివంగత బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. నాలుగేళ్ల అనంతరం శివసేనకు చెందిన నారాయణ రాణే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఉపముఖ్యమంత్రిగా మాత్రం గోపీనాథ్ ముండేనే కొనసాగారు. అదే సమయంలో శరద్‌పవార్ కాంగ్రెస్‌నుంచి విడిపోయి నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అలాగే శివసేన ప్రముఖ నాయకుడైన ఛగన్‌భుజ్‌బల్ తిరుగుబాటు బావుట ఎగురవే సి ఎన్సీపీలో చేరిపోయారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీల డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టగా, ఎన్సీపీలో చేరిన ఛగన్ భుజ్‌బల్‌కు ఉపముఖ్యమంత్రి పదవి లభించింది. 2003లో ఎన్సీపీకి చెందిన విజయ్‌సింగ్ మోహితేపాటిల్, 2004లో ఎన్సీపీకి చెందిన ఆర్ ఆర్ పాటిల్‌లు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌తోపాటు ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆర్ ఆర్ పాటిల్ రాజీనామా చేయాల్సివచ్చింది. దీంతో మరోసారి ఛగన్‌భుజ్‌బల్‌కు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లభించింది. 2009 ఎన్నికల్లో తిరిగి డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2012లో శీతాకాల సమావేశాలకు ముందు కొన్నిరోజులపాటు అజిత్‌పవార్ రాజీనామా చేసి, చివరిక్షణంలో మళ్లీ పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈసారి ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రి పదవిని ఎవరికీ కట్టబెట్టలేదు. దీంతో 20 యేళ్ల అనంతరం మరోసారి శీతాకాల సమావేశాలు ఉపముఖ్యమంత్రి లేకుండా జరుగుతున్నాయి. -
ఢీ.. రెడీ..
-
నేటినుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
-
ఢీ.. రెడీ..
నేటినుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్మాణాత్మక చర్చలకై ప్రధాని మోదీ పిలుపు ఆర్థిక ఎజెండాతో ప్రభుత్వం - అడ్డుకునే ప్రణాళికలో విపక్షం బీమా బిల్లుపై ఐక్యమైన విపక్షం; కలసిరావాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నల్లధనం, బీమా బిల్లు సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిలదీయాలన్న ప్రతిపక్షాల నిర్ణయంతో ఈ సమావేశాలు వాడి, వేడిగా జరగనున్నాయి. తమ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆర్థిక ఎజెండాకు చట్టబద్ధత కోసం అధికార ఎన్డీయే.. నల్లధనం, బీమా బిల్లు, బీజేపీ ఎన్నికల హామీల అమలు మొదలైనవి అస్త్రాలుగా విపక్షాలు దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం అఖిలపక్ష భేటీ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నేతలు మినహా 26 పార్టీలకు చెందిన 40 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల మాదిరిగానే ఈ సమావేశాలు కూడా నిర్మాణాత్మకంగా, విజయవంతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ అఖిలపక్ష భేటీలో పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తాలనుకుంటున్న అన్ని అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజల ఆలోచనలను, ప్రజాతీర్పు స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వానికి సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు సహా ఈ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టబోయే 37 బిల్లుల వివరాలు తెలి పారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల బలోపేతం, పెట్టుబడులు, ప్రభుత్వ విధానాల సరళీకరణ, ఉన్నత విద్య, కాలం చెల్లిన చట్టాల రద్దు, హైజాకర్లకు కఠిన శిక్ష, బొగ్గు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు.. తదితర అంశాల్లో ఈ బిల్లులుంటాయన్నారు. ‘అన్ని బిల్లులూ మాకు ముఖ్యమైనవే. మన జాతీయ ఎజెండా అయిన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. పెట్టుబడులు, ఆర్థిక రంగ పునరుత్తేజం, ప్రజల స్థితిగతులను మెరుగుపర్చడం మా ప్రాథమ్యాలు. బీమా బిల్లు కూడా ఆ దిశగా రూపొందించిందే’ అని వివరించారు. భారత దేశ ఆర్థిక ప్రణాళికను ప్రపంచం నిశితంగా గమనిస్తున్న నేపథ్యంలో సరైన చట్టాల ద్వారా సరైన సందేశాన్ని పంపించాల్సి ఉందన్నారు. చట్టసభలపై ప్రజల్లో గౌరవం పెరిగేలా పక్షపాత రహితంగా ఉభయసభల నిర్వహణ సాగాలన్నది ప్రధాని ఆకాంక్ష అన్నారు. బీమా బిల్లు రూపకల్పన చివరి దశలో ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు. అఖిలపక్ష భేటీకి తమను ఆహ్వానించలేదన్న తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను ఆయన కొట్టేశారు. తానే స్వయంగా ఆ పార్టీ నేతతో మాట్లాడానని, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అఖిలపక్ష భేటీకి ఆహ్వానిస్తూ ఆ పార్టీకి లేఖ రాశారని వెంకయ్యనాయుడు చెప్పారు. బీమా బిల్లును వ్యతిరేకిస్తాం బీమా బిల్లును ఐకమత్యంగా వ్యతిరేకించాలని వామపక్షాలు, తృణమూల్, జేడీయూ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బీఎస్పీలు నిర్ణయించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా తమతో కలసిరావాలని కోరాయి. కానీ బీమా బిల్లులో ప్రభుత్వం తీసుకువస్తున్న సవరణలను చూసిన తరువాత తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. అలాగే, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, వరదలు, కరవు, అనుసంధాన భాషగా సంస్కృతం.. తదితర అంశాలపై గట్టిగా గళమెత్తాలని ప్రతిపక్షం భావిస్తోంది. అఖిలపక్ష భేటీ అనంతరం జేడీయూ నేత కేసీ త్యాగి విలేకరులతో మాట్లాడుతూ.. భూసేకరణ చట్టానికి సవరణలను, ఉపాధి హామీ చట్టంలో మార్పులను ప్రతిపక్షాలు అంగీకరించబోవని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. బ్లాక్‌మనీ అంశాన్ని సభలో లేవనెత్తుతామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ ఎన్నికల ఖర్చుపై కూడా ప్రశ్నిస్తామని తెలిపింది. శివసేన మాత్రం ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రకటించింది. అధికార ఎన్డీయేలో తాము భాగమేనని, మహారాష్ట్రలో విభేదాలు కేంద్రంలో బీజేపీతో సంబంధాలపై ప్రభావం చూపబోవని పేర్కొంది. -
నవంబర్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమవేశాలకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనవసర పర్యటనలను తగ్గించుకుని పెండింగ్ బిల్లులపై దృష్టిసారించాలని మోదీ మంత్రులకు సూచించారు. -
లోక్‌సభలో ముందువరుస సీట్లకు పోటీ
ఢిల్లీ: లోక్‌సభలో సీట్ల కేటాయింపు వచ్చే నెల నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా లోక్‌సభలో సీట్ల కేటాయింపు కొలిక్కి రాలేదు. శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కుర్చీల కేటాయింపు పూర్తయ్యే అవకాశముందని పార్లమెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఏ పార్టీకి ఎక్కడ సీటింగ్ ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం జరిగే పార్లమెంటరీ వ్యవహారాల సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ముందువరుస సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. ప్రతిపక్షం లేనందున ముందువరుస సీట్లను తమకు కేటాయించాలని మిగతా పక్షాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ తో కలిసి సీట్లు పంచుకునేందుకు అన్నాడీఎంకే, తృణమూల్, బీజేడీ ఆసక్తి చూపకపోవడంతో కుర్చీల కేటాయింపు ఆలస్యమైంది. నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. -
‘రబీ’కి చలిపోటు
‘రబీ’కి చలిపోటు ముందుకు సాగని వరినాట్లు ఇప్పటివరకు 7,302 హెక్టార్లలోనే.. ఆందోళనలో రైతులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వాతావరణంలో మార్పు ప్రభావం రబీలో పంటల సాగుపై పడింది. సీజన్ ప్రారంభంనుంచి చలి ఎక్కువగా ఉండడంతో వరి నారులో పెరుగుదల దెబ్బతింది. చాలా చోట్ల నారు ఎర్రబడుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రబీ సీజన్లో 2,59,616 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు రబీ ప్రణాళికను ఖరారు చేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు రైతులు మాత్రం 1,21,039 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు వేశారు. 1.20 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుం దని అంచనా వేయగా ఇప్పటివరకు 7,302 హెక్టార్లలో మాత్రమే నాట్లుపడ్డాయి. గతేడాదితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. గతేడాది ఈ సీజన్లో 2,02,890 హెక్టార్లలో వివిధ పంటలు వేయగా ఇందులో 65,587 హెక్టార్లలో వరి సాగయ్యింది. బోధన్, వర్ని ప్రాంతాల్లోనే వరి నాట్లు ఎక్కువగా పూర్తయ్యాయి. అంచనాలకు అనుగుణంగా.. జిల్లాలో రబీ సీజన్లో మొక్కజొన్న, సజ్జ, జొన్న, పెసర, కంది, శనగ తదితర పంటలు అంచనాలకు అనుగుణంగా సాగయ్యాయి. 22 వేల హెక్టార్లలో జొన్న సాగవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటికి 20,556 హెక్టార్లలో జొన్న వేశారు. 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న వేస్తారని అంచనా వేయగా ఇప్పటికి 39,054 హెక్టార్లలో మొక్కజొన్న సాగయ్యింది. పెసర వెయ్యి హెక్టార్లకుగాను 570 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 12,500 హెక్టార్లకుగాను 4,843 హెక్టార్లలో, ఉల్లిగడ్డ 2,500 హెక్టార్లకుగాను 1,755 హెక్టార్లలో, కూరగాయలు 2,500 హెక్టార్లకుగాను 966 హెక్టార్లలో సాగయ్యాయి. శనగ, పొగాకు అంచనాలు మించాయి. శనగ 33 వేల హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా 34,077 హెక్టార్లలో, పొగాకు 500 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా 611 హెక్టార్లలో రైతులు సాగుచేశారు. వరి మినహాయించి మిగతా పంటల సాగుకు అదను దాటిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే జనవరి చివరి వరకు ఈ పంటలు సాగు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో అరకొర ఎరువులే.. గతంలో మాదిరిగానే ఈ ఏడాదిలో కూడా ఎరువులు, క్రిమిసంహారక మందులకు ఇబ్బందులు తప్పవనిపిస్తోంది. ఎరువుల కొరత కారణంగా గతంలో రైతులు ఇబ్బంది పడ్డారు. అయినా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. రబీ సీజన్లో 1,29,692 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా జిల్లాకు చేరింది 40,766 మెట్రిక్ టన్నులే. డీఏపీ 24,214 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 376.80 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఎంఓపీ 26,537 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా టన్ను కూడా జిల్లాలో లేదు. కాంప్లెక్స్ ఎరువులు 68,917 మెట్రిక్ టన్నులకుగాను 28,242 మెట్రిక్‌టన్నులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు రావాల్సిన కోటాకు అనుగుణంగా ఎరువులు సకాలంలోనే వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు మాత్రం గతేడాది మాదిరిగానే ఎరువుల కొరత ఏర్పడుతుందేమోనని అందోళన చెందుతున్నారు. రుణాలివ్వని బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. రబీ సీజన్లో వెయ్యి కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకర్లతో అధికారులు పలుమార్లు సమీక్షించారు. వ్యవ‘సాయం’ చేయాలని, లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు రూ. 350 కోట్ల రుణాలను మాత్రమే అందించారు. దీంతో విత్తనాలు మొదలుకొని ఎరువులు, క్రిమిసంహారక మందులతో పాటు వివిధ రకాల పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతులకే రుణాలివ్వడానికి వెనుకాడుతున్న బ్యాంకర్లు.. కౌలు రైతులను పూర్తిగా పట్టించుకోవడం లేదు. కొర్రీలు పెడుతూ వారికి పంట రుణాలివ్వడం లేదు. దీంతో కౌలురైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
మంచుతో కూరుకుపోతున్న ఇళ్ళు, రోడ్లు
-
‘శీతాకాలం’లోనే టీ -బిల్లు
తెలంగాణ జేఏసీ నేతలతో దిగ్విజయ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రక్రియను పూర్తిచేస్తామని, వాయిదాలుండవని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. విభజనపై అనుమానాలొద్దని, ఆ ప్రక్రియ పూర్తరుునట్టేనని చెప్పారు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే జనవరి మొదటి వారంలోనే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో గురువారం తనను కలిసిన తెలంగాణ జేఏసీ నేతలతో సుమారు అరగంటకుపైగా ఆయన చర్చించారు. రాష్ట్ర విభజన గడువు, ముసాయిదా బిల్లులో సవరణలు, విభజన అనంతరం రాజకీయ పరిస్థితులు, జేఏసీ మద్దతు, జేఏసీలో ఆశావహులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం వంటి అంశాలు ప్రస్తావనకొచ్చారుు. ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, జేఏసీ చైర్మన్ ఎం. కోదండరాం, నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, సి. విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, రాజేందర్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, వి. మమత, దేవీప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, మాదు సత్యం, రసమయి బాలకిషన్, ఎం. మణిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీ.జేఏసీ నేతలు అందించిన సమాచారం ప్రకారం.. ‘అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలకు తక్కువ సమయమే ఉంది కదా? శీతాకాల సమావేశాల్లోనే విభజన ప్రక్రియ పూర్తి అవుతుందా?’ అని ప్రశ్నించగా.. ‘మీరు చూస్తున్నారు కదా.. వీలైనంత వేగంగా విభజన ప్రక్రియను పూర్తిచేయాలనుకుంటున్నాం. ఈ సమావేశాల్లోనే చర్చలు పూర్తవుతాయి. ఇతర ప్రాంతాల సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంటుంది కదా. విభజన అంశాన్ని పక్కనబెట్టి వేరే ఇతర సమస్యలేమైనా ఉంటే చెప్పండి’ అని దిగ్విజయ్ అన్నారు. ఇప్పుడు మీ పనికోసం... తర్వాత మా పనికోసం వస్తా తెలంగాణ విభజన తర్వాత రాజకీయ పరిస్థితులపై, జేఏసీ నేతల భవిష్యత్తుపై దిగ్విజయ్ ఆరాతీశారు. విభజన వల్ల ఏ పార్టీకి లాభం అని, కాంగ్రెస్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘ఇప్పుడు వచ్చింది మీ పనికోసం (తెలంగాణ ఏర్పాటుకోసం). భవిష్యత్తులో మా పనికోసం వస్తా. మీ మద్దతు కావాలి. మీరు మాతో ఉన్నారా? లేదా?’ అని అడిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత తమతో పాటు తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్‌కు కృతజ్ఞులై ఉంటారని జేఏసీ నేతలు సమాధానం ఇచ్చారు. ‘ప్రజలు కోరుకున్నట్టుగా, శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ ఇస్తే వారు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారు. అయితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరువల్ల నష్టం జరుగుతోంది. ఆయనను కట్టడి చేయండి’ అని కోరారు. ఎన్నికల్లో టికెట్టు కోసం తీవ్రస్థాయిలో పోరాడుతున్న ఒక జేఏసీ నాయకుడు.. ‘తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ బలపడ్డది. ఇందిరాగాంధీ స్థాయిలో సోనియాగాంధీకి ప్రతిష్ట పెరిగిపోయింది’ అంటూ పొగిడారు. జేఏసీ నేతలు ఎవరికైనా రాజకీయంగా ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో తాము అవకాశాలు కల్పిస్తామని దిగ్విజయ్ చెప్పారు. బిల్లుకు సవరణలు కోరిన నేతలు ఉమ్మడి హైకోర్టు కుదరదని, ఉద్యోగుల విభజనపై స్పష్టత ఇచ్చే విధంగా ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని జేఏసీ నేతలు దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. నదీ జలాల పంపకం, నిర్వహణకు ప్రత్యేక బోర్డు ఉంటే అభ్యంతరంలేదని నివేదించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2 లేదా 3 ఏళ్లు చాలునన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు, కేంద్ర కేబినెట్‌కు, కాంగ్రెస్ పార్టీ నేతలకు జేఏసీ నాయకులు కృతజ్ఞత లు తెలిపారు. టీఆర్ఎస్ భవితవ్యమేమిటి?: తెలంగాణలో టీఆర్ఎస్ భవితవ్యం, కాంగ్రెస్‌తో ఆ పార్టీ సంబంధాలు ఎలా ఉంటాయంటూ తిరునావుక్కరసును జేఏసీ నేతలు ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ విలీనమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది సాధ్యం కాకుంటే విడిగానే పోటీచేస్తారు. పొత్తువల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు’ అని ఆయన చెప్పారు. కాగా, దిగ్విజయ్‌ను కలిసి బయటకు వస్తున్న జేఏసీ నేతలకు కేవీపీ రామచంద్రరావు ఎదురయ్యారు. ఆయనే కల్పించుకుని.. ‘పక్క రాష్ట్రానికి చెందిన మమ్ములను కూడా దృష్టిలో పెట్టుకోండి. తెలంగాణ వాళ్లతోనే మాట్లాడతామంటే ఎలా? భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. ఏఐసీసీ కార్యదర్శులుగా మీ రాష్ట్రానికి ఇన్చార్జిలుగా మేమే రావొచ్చు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దామోదర, జానా, నారాయణతో జేఏసీ నేతల భేటీ తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఐక్యంగా ఉండాలని కోరేందుకుగాను సీపీఐ, కాంగ్రెస్ నేతలను గురువారం జేఏసీ నేతలు కలిశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి కె.జానారెడ్డితో జేఏసీ నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బిల్లుపై త్వరగా చర్చలు ముగిసేందుకు, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకుగాను తెలంగాణ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని కోరారు. తెలంగాణకు తాము మద్దతుగా ఉన్నామని, దీనిపై అసెంబ్లీలో అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, శాసనసభాపక్ష నాయకులు గుండా మల్లేష్ హామీనిచ్చారు. సభలో అవసరమైన అన్ని వ్యూహాలను అమలుచేస్తామని, ఏమైనా సాంకేతిక అంశాలుంటే వెంటనే సలహాలు ఇచ్చి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి జానారెడ్డి జేఏసీ నేతలను కోరారు. -
కేంధ్ర ప్రభుత్వ యోచన....
-
రేపు వాయిదా తీర్మాణం ప్రవేశ పెడతాం
-
ఈ నెల 12నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
పంజా విసురుతున్న చలి
-
రేపు అసెంబ్లీకి టి బిల్లు..?
-
నేటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
తెలంగాణ కు కట్టుబడి ఉన్నాం: ప్రధాని
-
టీ ఇప్పుడే పెట్టండి
-
అందరి కళ్లూ నవంబరు 18 పైనే
-
డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 5 తేది నుంచి 20 వరకు కొనసాగనున్నట్టు లోకసభ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైన అంశాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 20 వరకు ప్రభుత్వం చర్చ చేపడుతుందని కార్యదర్శి వెల్లడించారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీతో నవంబర్ 11 తేదిన జరిగిన భేటిలో శీతాకాలం సమావేశాలపై నిర్ణయం తీసుకున్నట్టు లోకసభ కార్యదర్శి తెలిపారు. ఈ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం యూపీఏ ప్రభుత్వానికి కీలకంగా మారిన తరుణంలో ఈ శీతాకాలపు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
డిసెంబరు 5 నుంచి పార్లమెంటు!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 5 నుంచి 22 వరకూ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ మేరకు స్వల్పకాలమే డిసెంబరు మొదటి వారం నుంచి నిర్వహించాలంటూ ప్రతిపాదనలు వచ్చాయి. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్లమెంటు వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సోమవారం నిర్వహించే సమావేశంలో సమావేశాల తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, ఆ శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా కూడా సమావేశానికి హాజరు కానున్నారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమావేశాలను కుదించనున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు డిసెంబరు 4 నాటికి ముగియనుండగా, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.