పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 16న ముగియనున్నాయి.ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ షంషేర్ కె షరీఫ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రస్తుత సమావేశాలు 16వ లోక్‌సభలో 10వ సెషన్ కాగా.. రాజ్యసభకు 241వ సెషన్ కావడం గమనార్హం. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభమవుతాయి.