
శీతాకాల సమావేశాల్లోనే ‘ఎస్సీ బిల్లు’ ప్రవేశపెట్టాలి
మంద కృష్ణ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఎమ్మాఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌జీని మంద కృష్ణ శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఈయనతో వర్గీకరణ బిల్లుపై చర్చించారు. దళితుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా శివప్రకాశ్‌జీ స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధానితో చర్చించి త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.