sc cell
-
ఎస్టీ వర్గీకరణ ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గీకరణ ప్రక్రియ ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ మాత్రం కేవలం ఎస్సీ వర్గీకరణపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీంతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ఎస్టీ వర్గీకరణపై మాత్రం కమిటీ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో ఎస్టీ వర్గీకరణ అంశం కాస్త వెనకబడిపోయింది. అసెంబ్లీలో సీఎం ప్రకటన..: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు అమలు చేసే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన తీర్పు చెప్పడం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన వెంటనే దేశంలోకెల్లా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్ప టికే జారీ చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణను అమలు చేస్తామని స్పష్టం చేశా రు. ఇందులో భాగంగా గత నెల 12న రాష్ట్ర ప్రభు త్వం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన వర్గీకరణ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు, ఇందుకు అవసరమైన సూచనలను తమకు తెలియజేయాలని కమి టీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు మూడుసార్లు సమావేశమైన కమిటీ.. వర్గీకరణపై ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖను ఆదేశించడంతోపాటు పంజాబ్, హరియాణా, తమిళనాడులో అమలవుతున్న వర్గీకరణపై అధ్యయనానికి అధికారుల బృందాన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది. అధికారులు ఆ అధ్యయనాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తాజాగా ఎస్సీ వర్గీకరణకు వన్‌మెన్ జ్యుడీíÙయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. కానీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు. వర్గీకరణ జాప్యంతో...: సీఎం ప్రకటనకు భిన్నంగా టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా విడుదల చేశారు. మొత్తం 11 వేల టీచర్ ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశారు. ఈ నెల 9న టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు సైతం ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపు 9 వేల ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియలోనూ దాదాపు 8 వేల సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియలో రెండో విడుత వెబ్ఆప్షన్ల ప్రక్రియ సైతం పూర్తి కావచి్చంది. వర్గీకరణ ప్రక్రియను తేల్చకపోవడంతో ఎస్సీ, ఎస్టీల్లోని ఉపకులాలకు సరైన న్యాయం జరగడం లేదనే వాదన రోజురోజుకు పెరుగుతోంది. -
బీజేపీని గ్రామగ్రామాన విస్తరిస్తాం
సాక్షి, విజయవాడ: ఎస్సీలకు సామాజిక న్యాయం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేలు చేకూర్చిందని బీజేపీ రాష్ట్ర కో ఇంచార్జ్ సునీల్ థియోధర్ పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల వారు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీని బాగా విశ్వసించారు. కానీ, కాంగ్రెస్ వారిని మోసం చేసిందని వ్యాఖ్యానించారు.బీజేపీ రానున్న ఐదేళ్లలో బలపడుతుందనీ, ఎస్సీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుందని ఆయన విశ్లేషించారు. కుల, మతాలకు అతీతంగా మోదీ ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వివాస్ పేరుతో ఆదరిస్తుందని, గ్రామగ్రామాన పార్టీని తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్కా సునీల్ కూడా పాల్గొన్నారు. -
‘నక్కా ఆనంద్, కారెం శివాజిలు.. చంద్రబాబు చప్రాసీలు’
సాక్షి, విజయవాడ : దళితుల పేరుతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కారుకూతులు కూస్తే సహించేది లేదంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. బుధవారం వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నాగార్జున వైఎస్ జగన్‌పై దాడి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అనైతికంగా మాట్లాడుతూ పశువుల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నక్కా ఆనంద్ బాబు, కారెం శివాజి, జవహర్‌లు దళితులైనంతా మాత్రాన వైఎస్ జగన్ గురించి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోరన్న చంద్రబాబు వద్ద పని చేస్తూ వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.. మీకు అంత సత్తా ఉంటే అరెస్ట్ చేయించండంటూ సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌ను చంపడానికి విజయమ్మ, షర్మిల ప్లాన్ చేశారని ఏకలవ్యుడు లాంటి నేతలు ఆరోపిస్తున్నారు.. మీ నోట్లో ఏమన్నా అశుద్దం పోసుకున్నారా అంటూ మేరుగు తీవ్రంగా ధ్వజమెత్తారు. నక్కా ఆనంద్, కారెం శివాజి, జవహర్‌లు దళితులని వారి చేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారు. దళితుల పేరుతో మా నాయకుడి గురించి కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. అంబేడ్కర్ దయతో పదవులు పొందిన మీరు చంద్రబాబు దగ్గర చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారంటూ విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి తెగబలిసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి పట్ల టీడీపీ నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ.. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు వెళ్తున్న ప్రజానాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించే సత్తా టీడీపీ నేతలకు లేదని వెల్లడించారు. వైఎస్ జగన్ చమట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే మీ రాజీనామాలను చంద్రబాబు ముఖాన విసిరేసి ప్రజాక్షేత్రంలోకి రండి. అంతేకానీ దళితులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టొద్దని కోరారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన ఒక్క దళితుడు కూడా వైఎస్ జగన్ నుంచి పక్కకు వెళ్లరని మేరుగు ధీమా వ్యక్తం చేశారు. -
వేరే రాష్ట్రంలో కోటా వర్తించదు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల వర్గాలకు చెందిన ఒక వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలోను అదే వర్గంగా గుర్తిస్తే తప్ప ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ల లబ్ధి పొందలేరంటూ సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏ శంతన గౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. అదే సమయంలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. ‘ఒక రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఉద్యోగం, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన అంశాల్లో ఆ రాష్ట్రంలో అతనిని ఎస్సీ, ఎస్టీగా పరిగణించకూడదు. దాని వల్ల సొంత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు వారికోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు కోల్పోతారు’ అని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలో అదే వర్గంగా గుర్తించని పక్షంలో అతను ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ కోరవచ్చా? అని దాఖలైన 8 పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందితే వారికి వేరే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా అదే హోదా ఉండాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక కులం లేదా తెగను ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చేందుకు అర్హతను ఆ ప్రాంత పరిస్థితులు, ప్రతికూలతలు, ఆ వర్గం ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులపై ఆధారపడి పరిగణనలోకి తీసుకుంటారని ధర్మాసనం వెల్లడించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రలో రిజర్వేషన్ లబ్ధి పొందితే మహారాష్ట్రలోని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఆ రాష్ట్రం కేటాయించిన రిజర్వేషన్ ఫలాన్ని దక్కకుండా చేయడమే’ అని పేర్కొంది. అయితే వేరే రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ విషయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని నలుగురు న్యాయమూర్తులు స్పష్టం చేయగా జస్టిస్ భానుమతి వారితో విభేదించారు. ‘కేంద్ర పాలిత ప్రాంతంలోని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చినప్పటికీ అవన్నీ కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండవు’ అని తన తీర్పులో జస్టిస్ భానుమతి అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లకు వెనుకబాటు గీటురాయి కాదు ఉద్యోగ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంలో వెనుకబాటుతనాన్ని కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిథ్యం లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు షరతులు విధిస్తూ 2006లో సుప్రీం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవరించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన రాజ్యాంగ బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2006 నాటి తీర్పును సమీక్షించండి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలకు సంబంధించి అవసరమైన సమాచారం సమర్పించాలని 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును పునః సమీక్షించాలని కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను కోరాయి. -
ఉద్యోగుల పిల్లలకూ రిజర్వేషన్లా?
న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పిల్లలు, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనక హేతుబద్ధత ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రీమీలేయర్‌ను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరని నిలదీసింది. ‘ పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఫలానా వ్యక్తి ఓ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాడునుకోండి. ఆయన కుటుంబ సభ్యులను దళితులుగా భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనా? దాని వల్ల వారి సీనియారిటీ సైతం త్వరగా పెరుగుతుందిగా’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. గురువారం రోజంతా జరిగిన విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పలువురు సీనియర్ లాయర్లు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలును సమర్థించారు. ఈ రిజర్వేషన్లు దాదాపుగా నిలిచిపోవడానికి కారణమైన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించాలని కోరారు. కానీ, సీనియర్ లాయర్ శాంతిభూషణ్, మరో సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఈ కోటాను వ్యతిరేకించారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాల్లో సమానత్వపు హక్కు ఉల్లంఘనకు గురవుతోందని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి క్లాస్–1 అధికారి అయితే, ఇక అతను ఎంతమాత్రం వెనకబడిన తరగతికి చెందడు. కానీ రాజకీయ పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నాయి’ అని శాంతి భూషణ్ అన్నారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్ లాయర్లు కోటాకు మద్దతుగా వాదించారు. -
చూడండి సారూ.. మా గోస
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని ఎస్సీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకొని, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘హాస్టల్లో భయం భయంగా’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురించిన కథనానికి ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిల్కమర్రి నర్సింలు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, చేవేళ్ల ఏఎస్‌డబ్ల్యూ నుషితలు ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సోమవారం ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి పెచ్చులూడుతున్న భవనాన్ని పరిశీలించారు. భోజనశాలను తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికే విద్యార్థులు హాస్టల్ ఎదుట భైఠాయించారు. విద్యార్థులంతా ఒక్కసారిగా తమ సమస్యలను ఎమ్మెల్యేతో ఏకరువు పెట్టారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుంటే తామందరం ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, మాకు టీసీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే హాస్టల్ విద్యార్థులు ఉండేందుకు భవనాన్ని అద్దెకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల ఏఎస్‌డబ్ల్యూ నుషిత, ఇన్చార్జి వార్డెన్ సుశీలను ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతి గృహంలో ఈ విధంగా సమస్యలు ఉంటే విద్యార్థినులు ఏవిధంగా చదువుకుంటారని వారిని ప్రశ్నించారు. హాస్టల్లో పనిచేసేందుకు కావల్సిన సిబ్బందిని వెంటనే నియమించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఎస్డబ్ల్యూను ఆదేశించారు. వాహనం ఎదుట భైఠాయింపు స్ధానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సీ హాస్టల్లో సమస్యలు నెలకొన్నాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిల్కమర్రి నర్సింలు అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని, విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. హాస్టల్ నూతన భవన నిర్మాణం, సమస్యల పరిష్కారం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థినులతో కలిసి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, వాహనం ఎదుట భైఠాయించారు. సమస్య పరిష్కారానికి మార్గం చూపే వరకు వెళ్లనీయమని విద్యార్థులు భీష్మించుకొని కూర్చోవడంతో ఆయన వినతిపత్రం స్వీకరించారు. అనంతరం విద్యార్థినులు హాస్టల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట భైఠాయించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్, మనోహర్, పవన్, సాయి, సుమన్, పవన్, జాంగారి రవి పాల్గొన్నారు. -
మరింత ‘బెస్ట్’గా..
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత వసతితో బోధన అందించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకానికి మరిన్ని హంగులు అద్దుతోంది. పరిమిత స్థాయిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని భావిస్తోంది. ఏటా గరిష్టంగా 5 వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది. కేజీ టు పీజీ విద్యలో భాగంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలకు క్రేజ్ పెరగడం.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీట్లు ఇవ్వడం కష్టమవడంతో ఈ ప్రత్యామ్నాయ పద్ధతికి శ్రీకారం చుట్టింది. బీఏఎస్ ద్వారా మరింత మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఉపక్రమించింది. ఒకటో తరగతి నుంచే.. రాష్ట్రంలో 185 పాఠశాలలను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా ఎస్సీ అభివృద్ధి శాఖ గుర్తించింది. పదేళ్లలో వచ్చిన ఫలితాలు, పాఠశాలల నిర్వహణ, బోధన సిబ్బంది సామర్థ్యం ఆధారంగా ఈ పాఠశాలలను ఎంపిక చేస్తారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ పథకం కింద 8,390 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వివిధ తరగతుల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యను అభ్యసిస్తున్నారు. 2017–18లో 785 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. 91.97 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 27 మంది 9.5 కంటే ఎక్కువ జీపీఏ సాధించారు. బీఏఎస్ పథకం సత్ఫలితాలు ఇస్తుండటంతో మరింత విస్తృతం చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఏటా 5 వేల మందికి అవకాశం ఇచ్చేలా స్కూళ్ల సంఖ్య పెంచాలని భావిస్తోంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలల గుర్తింపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఐదో తరగతి నుంచే రెసిడెన్షియల్ పద్ధతిలో ప్రవేశాలు కల్పించారు. తాజాగా ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థికి ఏటా రూ. 35 వేలు బీఏఎస్ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థికి ఏటా రూ. 35 వేలు సర్కారు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు తీసుకోవాలని భావిస్తుండటంతో ఫీజుల పైనా పరిశీలన చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీ పాఠశాలల వివరాల సేకరణతో పాటు అక్కడి ఫీజులను అంచనా వేస్తోంది. జిల్లాలో విద్యార్థి చెల్లిస్తున్న సగటు ఫీజులు అంచనా వేసి నిపుణుల కమిటీ సూచనల ప్రకారం ఫీజు ఖరారు చేయనుంది. -
హాస్టల్ విద్యార్థుల కిచిడిలో ఎలుక
జడ్చర్ల టౌన్ మహబూబ్ నగర్ : స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోని ఎస్సీ హాస్టల్లో బుధవారం అల్పాహారంలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అల్పాహారం కోసం సిబ్బంది కిచిడి తయారు చేశారు. వండి వార్చిన కిచిడిని విద్యార్థులకు వడ్డిస్తుండగా ఒక విద్యార్థి ప్లేటులో చిన్న ఎలుక కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే ఇతర విద్యార్థులకు అల్పాహారం వడ్డించకుండా బయటకు పారవేశారు. మళ్లీ వండి వార్చారు. హాస్టల్ వార్డెన్ ఆదినారాయణకు బాలానగర్ హాస్టల్ ఇన్చార్జ్ బాధ్యతలు ఉండటంతో ఆయన అక్కడ ఉన్నారు. విషయం తెలియగానే భవిష్యత్‌లో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. అయితే బాదేపల్లి జెడ్పీహైస్కూల్‌కు ఎస్సీ వసతి గృహం నుంచి వెళ్లే విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ఎలుక విషయం వెలుగు చూసింది. హైస్కూల్‌కు నూతన గేట్ పెట్టి దానిని మూసివేయడంతో ఆలస్యమైన విద్యార్థులు బయటే ఉండిపోయారు. ఆలస్యానికి గల కారణాలను ఎంఈఓ మంజులాదేవి, ఉపాధ్యాయులు ఆరా తీయగా అల్పాహారంలో ఎలుక రావడం వల్ల వంట ఆలస్యమైందని విద్యార్థులు చెప్పారన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు అండగా ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ 3వ అంతస్తులో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసన మండలి ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, సమాచారహక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఉందా అనే అనుమానం ఉండేదన్నారు. తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని సమైక్యరాష్ట్ర పాలకులు ఎద్దేవా చేశారని, అన్ని అవరోధాల ను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కమిషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 2003లోనే కమిషన్ ఏర్పాటైనా ఎక్కడా పనిచేయలేదన్నారు. గతంలో సమైక్యపాలకులకు మాత్రమే కమిషన్‌లో అవకాశం ఇచ్చారని, తెలంగాణ దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. కమిషన్ ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటామన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఎస్సీ విద్యార్థుల ఫీజు గడువును పెంచండి
న్యూఢిల్లీ: పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందుకునే ఎస్సీ విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువును పెంచేలా ఆయా విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజుతో పాటు ఉపకార వేతనం నగదు జమఅయ్యేంత వరకూ ఈ గడువును పెంచాలని కోరింది.. ఫీజు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయన్న కారణంతో పలు విద్యాసంస్థలు ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. బ్యాంక్ ఖాతాలో ఫీజు డిపాజిట్ కాగానే వెంటనే చెల్లిస్తామని విద్యార్థుల నుంచి కాలేజీలు హమీపత్రం తీసుకోవాలని సూచించింది. -
మధ్యంతర ఉత్తర్వులుండవ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్ల విషయంలో క్రీమీలేయర్ వర్తింపుపై 2006నాటి తీర్పు (ఎం.నాగరాజ్ తీర్పు అనికూడా పిలుస్తారు)కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. ‘2006 తీర్పు’ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. మధ్యంతర ఉపశమన చర్యలు ఇచ్చేందుకు కేసు విచారించబోమని, కూలంకషంగా చర్చిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఇందుకోసం ఎం నాగరాజు తీర్పుపై విచారించేందుకు ఏడుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించింది. తదుపరి విచారణ ఆగస్టు 3న జరుగుతుందని స్పష్టం చేసింది. నియామకాలు ఆగిపోయాయ్: కేంద్రం వివిధ న్యాయపరమైన ప్రకటనల కారణంగా రైల్వేలు, ఇతర సేవా రంగాల్లో లక్షల ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయని, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదన వినిపిస్తూ.. వివిధ బెంచ్‌లు, హైకోర్టులు ఇటీవల ఇచ్చిన తీర్పుల కారణంగా రిజర్వేషన్లపై గందరగోళం నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ‘స్టేటస్ కో’ నెలకొందంటూ ఓ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం పదోన్నతులకు సిద్ధమవుతున్న సమయంలో జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పెండింగ్‌లో పెట్టిందన్నారు. ధావన్ వాదనలను వేణుగోపాల్ సమర్థించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్‌పై గందరగోళం నెలకొందని.. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న మరో సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే మాత్రం.. ఈ విషయంలో గందరగోళం లేదన్నారు. పలు పక్షాలు వాదిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. క్రీమీలేయర్ వర్తించదు: నాటి తీర్పులో సుప్రీం 2006 నాటి ‘ఎం నాగరాజ్, ఇతరులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ తీర్పును పునఃపరిశీలించాలా వద్దా? అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని గతేడాది నవంబర్ 15న ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల పదోన్నతుల్లో క్రీమీలేయర్ వర్తించదంటూ ఎం నాగరాజు తీర్పులో 2006లో సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయండి
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఉన్నతాధికారుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీం తీర్పును అనుసరించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ అన్ని విభాగాలకు ఉత్తర్వులు జారీచేస్తూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. అదే సమయంలో ఉత్తర్వుల్లో తప్పనిసరిగా .. ‘పదోన్నతి సుప్రీం కోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉంటుంది’ అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక అధికారి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని జూన్ 5న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది. -
దళితుల కోసం ఖర్చుచేసిందెంత?: ఆరేపల్లి మోహన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేలా లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఓటర్ల గణన తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళనలో తప్పులు జరిగాయని, అయితే ఓటర్ల గణనలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల వారిగా కులసంఘాలతో చర్చించి రిజర్వేషన్‌పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఒక్క సిరిసిల్లలోనే దళితులపై ఎందుకు దాడులు పెరుగుతున్నాయని మోహన్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దళితులకు బడ్డెట్ ఎంత కేటాయించిందో?, అందులో ఎంత ఖర్చు చేసిందో?, మిగులు నిధులు ఏం చేసిందో? ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీలకు అండగా సుప్రీం తీర్పు: ఎంపీ బూర
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించేందుకు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, ఈ తీర్పుతో బలహీన వర్గాలకు న్యాయం జరిగినట్లైందని అభిప్రాయపడ్డారు. మరోవైపు లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన రిజర్వేషన్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పోస్ట్ అండ్ సర్వీసెస్ టు ది ఫార్మర్స్ ప్రైవేటు బిల్లును చర్చకు తీసుకుంటున్నట్టు లేఖ అందిందని చెప్పారు. వచ్చే సమావేశాల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, బిల్లు వల్ల పేద రైతులకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో రైతేరాజుగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. -
చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు..
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత వ్యతిరేకని విమర్శించారు. అంబేడ్కర్ పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం పేరుతో కేటాయించిన రూ. 100 కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అందుకు నిరసనగా ఈ నెల( మే) 8న ఆందోళన చేస్తామన్నారు. అంతేకాక చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా మౌనదీక్షలు చేస్తామని మేరుగ నాగార్జున తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. సాంఘిక సంక్షే మ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయని, వీటిలో చదివి దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీల విద్యా ప్రమాణాలను పెంచడానికి, మరింత అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’పై ఆర్డినెన్స్?
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆ తీర్పును రద్దు చేసేలా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పునకు ముందున్న యథాస్థితికి ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. ఆర్డినెన్స్ జారీ ద్వారా సుప్రీంకోర్టు చేసిన మార్పుల్ని రద్దు చేసే అంశంపై ఇప్పటికే సమాలోచనలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై సాగుతున్న చర్చలపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. ‘ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించవచ్చనే ఆలోచనలో కేంద్రం ఉంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పును నిరోధించేలా జూలైలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వేధింపుల నిరోధక చట్టం, 1989ను సవరించేలా బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది’ అని వెల్లడించాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్‌తో తక్షణ ఫలితం ‘ఒకసారి ఆర్డినెన్స్ జారీ చేస్తే.. ఆ తర్వాత దానిని బిల్లు రూపంలో మార్చి పార్లమెంటు ఆమోదం పొందవచ్చు. రెండింటి ఫలితాలు ఒకటే అయినా ఆర్డినెన్స్‌తో తక్షణం ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వపు స్థితిలో అమల్లోకి వస్తుంది. ఆర్డినెన్స్‌తో వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. దేశంలో కొనసాగుతున్న నిరసనల్ని నియంత్రించవచ్చు’ అని ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన సంఘాలతో పాటు అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తీర్పును నిరసిస్తూ ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వబోమని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మనం పటిష్టంగా రూపొందించిన చట్టం ప్రభావితమయ్యేందుకు (సుప్రీంకోర్టు తీర్పు ద్వారా) అనుమతించమని మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, సమీక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం విదితమే. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ప్రభుత్వం కాగా ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆర్డినెన్స్ జారీకి ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రివ్యూ పిటిషన్‌తో తక్షణ ఫలితం రాకపోవచ్చని, అలాగే సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలంగా ఉండకపోవచ్చని.. అందువల్ల భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు. వ్యతిరేకంగా వస్తే ఆర్డినెన్స్: పాశ్వాన్ దళితుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం బలహీనపరిచే చర్యల్ని ప్రభుత్వం అంగీకరించబోదని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో.. ఆర్డినెన్స్‌తో పాటు పలు ప్రత్యామ్నాయాల్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ‘తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే.. ఆ తర్వాతి రోజే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన న్యాయమూర్తుల అంశంపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. హైకోర్టుల్లో నామమాత్రంగా న్యాయమూర్తులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు మౌలికంగా తప్పు’
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ‘మౌలికంగా తప్పని’ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పులు ప్రజల్లో హింసకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు నిబంధనల్ని నిర్వీర్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజల మధ్య హింసను ప్రేరేపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అధిక శాతం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల్ని కోర్టు వెలువరించాల్సి ఉంది. అంతేకానీ సమాజంలో హింసను పురికొల్పకూడదు’ అని అన్నారు. -
ఆ తీర్పు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉంది
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు నిబంధనలను నిర్వీర్యం చేసేలా ఉందని, ఇది ప్రజల్లో ఆగ్రహానికి, అశాంతికి కారణమై దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, అందువల్ల దీనిని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తక్షణం అరెస్టులు చేయకుండా మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగాయి. దీంతో ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషనదాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు మద్దతుగా గురువారం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక నివేదిక సమర్పించింది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగంలో ప్రాథమిక భాగమనీ, చట్టాలు చేయగలిగే ఎలాంటి అవకాశమూ కోర్టులకు లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు తీవ్ర గందరగోళానికి దారి తీసిందని, సమీక్ష ద్వారా, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవటం ద్వారా ఈ అంశాన్ని చక్కదిద్దవచ్చని తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, కోర్టు తీర్పు ఫలితంగా గందరగోళం, ఆగ్రహం, అసంతృప్తి, అశాంతి దేశంలో చెలరేగాయని పేర్కొంది. ఈ తీర్పు చట్టాన్ని బలహీనపరిచేలా ఉందని తెలిపింది. తమ తీర్పును పూర్తిగా చదవలేదని, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ దీనిపై సమీక్షించేందుకు గత వారం సుప్రీంకోర్టు నిరాకరించింది. -
దళితులపై నేరాలు ఎనిమిదింతలు
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద నిందితుల్ని తక్షణ అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2006తో పోల్చుకుంటే 2016 నాటికి దళితుల(ఎస్సీ)పై నేరాలు 746 శాతం (8 రెట్లు) పెరిగాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. ఇక ఆదివాసీల(ఎస్టీ)పై నేరాల సంఖ్య ఈ పదేళ్లలో 1,160 శాతం(12 రెట్లు) పెరిగాయని వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2016లో విడుదల చేసిన గణాంకాలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20.1 కోట్ల మంది(16.6 శాతం) దళితులు, 10.4 కోట్ల మంది(8.6 శాతం) ఆదివాసీలు ఉన్నారు. మధ్యప్రదేశ్ టాప్ 2006–16 మధ్య దేశవ్యాప్తంగా దళితులపై 4,22,799 నేరాలు జరిగాయి. గోవా, కేరళ, ఢిల్లీ, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ నేరాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆ సంస్థ వెల్లడించింది. దళితులపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్(43.4%), గోవా (43.2%), రాజస్తాన్(42%) రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయంది. ఇక ఆదివాసీలపై 37.5% నేరాలతో కేరళ తొలిస్థానంలో నిలవగా, అండమాన్–నికోబార్ దీవులు (21%), ఆంధ్రప్రదేశ్ (15.4%) తర్వాతి స్థానాల్లో నిలిచాయంది. దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో ఆదివాసీలపై 81,322 నేరాలు జరగగా.. వాటిలో అత్యధికం కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయంది. పోలీస్స్టేషన్లలో ఆదివాసీలకు సంబంధించి 405 పెండింగ్ కేసులతో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో దోషుల సంఖ్య 10 శాతానికి మించడం లేదని తెలిపింది. కొండలా పేరుకుపోతున్న కేసులు దళితులు, ఆదివాసీలపై ఈ పదేళ్లలో నేరాలు పెరిగినప్పటికీ.. పోలీస్స్టేషన్లు, కోర్టుల్లో అదే స్థాయిలో కేసుల పరిష్కారం జరగడంలేదని నివేదిక స్పష్టం చేసింది. దళితుల ఫిర్యాదులపై పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ పదేళ్లలో 99 శాతం పెరిగాయని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 50 శాతం పెరిగాయని తెలిపింది. 4,311 పెండింగ్ కేసులతో బిహార్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. తప్పుడు కేసులు అంతంతే: దళితులు నిందితులపై పెట్టిన తప్పుడు కేసు ల సంఖ్యలో ఈ పదేళ్లలో ఎలాంటి పెరుగుదల లేదని ఆ నివేదిక తెలిపింది. 2006–16 మధ్య దళితులు పెట్టిన కేసుల్లో 5,347 తప్పుడు కేసులుగా తేలాయంది. వీటిలో రాజస్తాన్ 2,632 కేసులతో ముందుంది. శిక్షపడుతున్న సందర్భాలు చాలా తక్కువ దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తేలుతున్నవారి సంఖ్య 30 శాతానికి మించడం లేదు. దళితులపై జరిగిన నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 2006లో 28 శాతం ఉండగా, 2016 నాటికి 26 శాతానికి పడిపోయిందని ఆ నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 10 శాతానికి మించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే 2006లో ఆదివాసీలపై నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 28 శాతం ఉండగా, 2016 నాటికి ఇది 21 శాతానికి పడిపోయిందని పేర్కొంది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, విచారణలో జాప్యం, బాధితులకు రక్షణ లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సరైన సెక్షన్ల కింద కేసు నమోదుచేయకపోవడం కారణంగానే చాలామంది నేరస్తులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారంది. –సాక్షి నేషనల్ డెస్క్ -
సుప్రీం అంటే దళితులకు భయం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నివారణ చట్టంలో సుప్రీంకోర్టు మార్పులు చేయడం, ఆ తరువాత దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు చెందిన జడ్జీలకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల వెల్లువెత్తిన నిరసనలు సుప్రీంకోర్టు అంటే దళితుల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఎగువ న్యాయ వ్యవస్థలో దళితులు, పేదలకు న్యాయబద్ధ ప్రాతినిధ్యం దక్కేలా ఆయన పార్టీ, ఎన్డీయే భాగస్వామి అయిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ గురువారం ‘హల్లా బోల్, దర్వాజా ఖోల్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కుష్వాహ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థే మూల స్తంభం లాంటిదని, కానీ న్యాయ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపించారు. ‘టీ అమ్మే వ్యక్తి ప్రధాని కావొచ్చు. దినసరి కూలీ బిడ్డ ఐఏఎస్ అధికారి కావొచ్చు. పేద కుటుంబాల నుంచి ఎంత మంది జడ్జీలు వచ్చారో సుప్రీంకోర్టు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని కోరారు. -
ప్రతిపక్షాల మానవహారం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించటంలో అధికార ఎన్డీఏ విఫలమైందంటూ ప్రతిపక్షాలు గురువారం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, వామపక్షాలు, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ తదితర 17 పార్టీల నాయకులు అరగంటపాటు మానవహారంగా ఏర్పడ్డారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు..’అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. మరోమార్గం లేకనే ప్రభుత్వ వైఖరిపై ఈ నిరసన తెలిపామన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చు కునేందుకు.. వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం, ఎస్టీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు, సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీకేజీ తదితర అంశాలను తాము ప్రస్తావించకుండా అడ్డుకుం దని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. -
బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలి
సాక్షి, న్యూఢిల్లీ: మాదిగల అస్తిత్వ నినాదమైన ఎస్సీ వర్గీకరణను పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలని, ఈ నెల 14న మాదిగలు ప్రతిజ్ఞ చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి మంగళవారం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా స్వీకరించాలని, కాంగ్రెస్, బీజేపీలు చేసే మోసాన్ని పల్లెపల్లెకూ చేరవేయాలని కోరారు. తెలంగాణ భవన్లో ‘ఎస్సీ వర్గీకరణ’అనే అంశంపై మంగళవారం సెమినార్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. -
వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. వర్గీకరణ చేపట్టాలంటూ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ మాదిగ జేఏసీ నేతలతో కలసి ఆయన మౌన దీక్ష చేపట్టారు. వర్గీకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, మంద కృష్ణల వల్ల మాదిగలు బలయ్యారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకపోతే బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
భారత్ బంద్ హింసాత్మకం
న్యూఢిల్లీ/భోపాల్/లక్నో: ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ప్రాణ నష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటుచేసుకుంది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పలు చోట్ల దళిత ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోవడంతో పాటు పోలీసులతో ఘర్షణ పడ్డారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ హింసలో 9 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. జోధ్‌పూర్‌లో రాస్తారోకోలో పాల్గొన్న వందలాది మంది దళితులు, భీమ్ సేన కార్యకర్తలు మధ్యప్రదేశ్‌లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మరణించగా.. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్తాన్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పో యారు. ముందస్తుగా అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించగా.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఆర్మీని రంగంలోకి దింపారు. పంజాబ్‌లో ఉదయం నుంచే ఆర్మీ, పారామిలటరీ బలగాల్ని సిద్ధంగా ఉంచారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్‌ల్లో కూడా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పలు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా రైళ్లను ఆందోళనకారులు అడ్డుకోవడంతో రవాణాకు తీవ్రంగా అంతరాయం కలిగింది. రైల్వే శాఖ 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. ఉత్తర, తూర్పు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిన బంద్ ఛాయలు దక్షిణాదిలో కనిపించకపోవడం గమనార్హం. ముంబైలో నిరసనకార్యక్రమంలో నినాదాలిస్తున్న కార్యకర్త హుటాహుటిన బలగాలు బంద్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా.. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఆస్తుల దహనం, కాల్పులు, విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ఆందోళన సందర్భంగా ఎదురుకాల్పులు జరగడంతో మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ముగ్గురు, గ్వాలియర్ జిల్లాలో ఇద్దరు, మొరేనా జిల్లాలో ఒక్కరు మరణించారు’ అని మధ్యప్రదేశ్ ఐజీ (శాంతి భద్రతలు) మార్కండ్ దేవ్స్కర్ తెలిపారు. మృతుల్లో నలుగురు దళితులు, ఇద్దరు ఉన్నత కులాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒకరు, మీరట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఒకరు మరణించగా.. 9 మంది పోలీసులతో సహా 26 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా శాంతిభద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లకు అల్లర్ల నిరోధానికి ప్రత్యేక్ష శిక్షణ పొందిన 1,700 మందిని హుటాహుటిన పంపింది. అలాగే యూపీకి ఎనిమిది కంపెనీలు, మధ్యప్రదేశ్‌కి నాలుగు, రాజస్తాన్‌కు మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బందిని కేంద్రం తరలించింది. మధ్యప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో కర్ఫ్యూ పరిస్థితి అదుపు తప్పడంతో మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్, భింద్, మొరేనా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. చంబల్, గ్వాలియర్, సాగర్ రీజియన్లలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక చోట్ల రాళ్లు రువ్వడం, దహనాలు, లూటీలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు కాల్పులు జరపడంతో మొరేనా జిల్లాలో విద్యార్థి నాయకుడు రాహుల్ పాఠక్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా హింస మిగతా ప్రాంతాలకు విస్తరించడంతో గ్వాలియర్ పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ ఉమేశ్ శుక్లా చెప్పారు. భింద్ జిల్లాలో మరణించిన వ్యక్తిని మహావీర్ సింగ్‌గా గుర్తించామని, మరో ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఝబువాలో ఆందోళనకారులు దుకాణాల్ని లూటీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. భోపాల్‌లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో పాటు పలు వాహనాల్ని ధ్వంసం చేశారు. యూపీలో 75 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ హింసలో 40 మంది పోలీసులు సహా 75 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డీఐజీ (శాంతి భద్రతలు) ప్రవీణ్ కుమార్ చెప్పారు. విధ్వంసానికి, దహనాలకు పాల్పడిన 450 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరట్‌లో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మను అరెస్టు చేశారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. అజాంగఢ్‌లో ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పుపెట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగ్రా, హాపూర్, మీరట్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అదనపు బలగాలు పంపాలని యూపీ డీజీపీ ఓపీ సింగ్ కేంద్రాన్ని కోరారు. యూపీలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లతో అనేక రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంజాబ్‌లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా హరియాణాలో అంబాలా, రోహ్‌తక్‌తో పాటు చండీగఢ్లోను ఆందోళనలు కొనసాగాయి. భారత్ బంద్ నేపథ్యంలో పంజాబ్‌లో జరగాల్సిన 10, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షల్ని వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల ఆందోళనకారులు పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. డెహ్రాడూన్ , రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. ఘజియాబాద్‌లోని ఒక గుంపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిందని ఉత్తర రైల్వే అధికారి ఒకరు తెలిపారు. మండి హౌస్ ప్రాంతంలో రోడ్లపై ఆందోళనకారులు బైఠాయించి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే ట్రాక్‌లు, రోడ్లను దిగ్బంధించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన 30 మందిని రాజస్తాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నాలో ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌ను ముట్టడించి టికెట్ కౌంటర్లను మూయించివేశారు. పదుల సంఖ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఒడిశా, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనల వల్ల జన సామాన్యానికి అంతరాయం కలిగింది. గుజరాత్‌లోని ప్రధాన పట్టణాల్లో రోడ్లపై ఆందోళనలు చేపట్టడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. సుప్రీం తీర్పులో ఏముంది? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసుల్లో తక్షణ అరెస్టులు వద్దని మార్చి 20న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి కేసుల్లో వారంలోగా ప్రాథమిక విచారణ నిర్వహించి ఫిర్యాదు సరైందేనని నిర్ధారించుకోవాలని, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే ముందస్తు బెయిల్ కూడా ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదైనా అరెస్టు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు దాఖలైతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వోద్యోగిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఫిర్యాదు చేస్తే.. ఆ ఉద్యోగికి అరెస్టుకు సంబంధిత నియామక అధికారి అనుమతి తప్పనిసరి అని చెప్పింది. ఇతరులపై ఫిర్యాదుల విషయంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా డీఎస్పీ అనుమతి అవసరమంది. ఈ చట్టం ఆసరాగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసులతో బెదిరిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారనీ, అమాయక పౌరులను వేధిస్తున్న ఘటనలూ చాలా జరుగుతున్నాయంది. సుప్రీంలో కేంద్రం రివ్యూ పిటిషన్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై తీర్పును సమీక్షించాలని విజ్ఞప్తి వీలైనంత తొందరగా విచారించాలని కోరే చాన్స్ న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలుచేసింది. దళితులు, గిరిజనులపై వేధింపుల్ని అడ్డుకునేలా ఉన్న నిబంధనలపై సుప్రీం తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టం అసలు ఉద్దేశాన్ని నీరుగార్చేలా ఉందని పిటిషన్లో పేర్కొంది. దేశంలోని గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. పార్లమెంటు శాసన విధానానికి ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ కేసును బహిరంగంగా విచారించాలంది. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా దళితులు, గిరిజనులు వెనుకబడే ఉన్నారనీ, వారిపై పలు చోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వ పిటిషన్‌ను వీలైనంత తొందరగా విచారించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మంగళవారం సుప్రీంకోర్టును కోరే అవకాశముంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం విభేదిస్తున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీం తీర్పును నిలిపివేయాలని ఆల్ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం నిరాకరించింది. సంయమనం పాటించండి హింసాత్మక సంఘటనలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాదని, తీర్పు అంశాలతో తాము ఏకీభవించడం లేదన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో సమగ్ర రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. రివ్యూ పిటిషన్‌పై ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయం తీసుకుందని దళిత నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అభినందించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులు, మైనార్టీలపై అత్యాచారాల ఘటనలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత ఆజాద్ ఆరోపించారు. -
సుప్రీం తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలులో తక్షణ అరెస్టులు వద్దంటూ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచే బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. రాష్ట్రపతిని కలిసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై వచ్చే వారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. సామాజిక న్యాయ శాఖతో న్యాయ శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారని, వచ్చే బుధవారం రివ్యూ పిటిషన్ వేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరాన్ని పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించానని, వారు తగిన చర్యలు చేపడుతున్నారని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ తెలిపారు. -
వారికి క్రీమీలేయర్ వర్తించదు: కేంద్రం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ విధానం వర్తించదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ సామాజిక వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల్లోని ధనికులకు రిజర్వేషన్ అవసరం లేదని, వారికి కోటా ప్రయోజనాలు మినహాయించాలని ఎన్జీవో సమ్తా ఆందోళన్ సమితి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ సామాజిక వర్గంలోని ధనికుల వల్ల అసలైన లబ్ధిదారులకు ఫలాలు అందడంలేదని, ఎక్కువ మొత్తంలో ధనికులే లబ్ధి పొందుతున్నారని పిల్లో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. -
రాష్ట్రపతిని కలిసిన రాహుల్,ఇతర విపక్షాలు
-
నన్ను చంపేందుకు సీఎం కుట్ర!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దళితుడేనంటూ వాగ్దానం చేసి మాట తప్పారని విమర్శించినందుకు తనపై కక్ష గట్టి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హత్య చేయించేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో లేఖను సమర్పించారు. గత ఏడాది జూలై 8వ తేదీన ఈ కుట్రపై తనకు అనుమానం కలిగిందని, సూర్యాపేట నుంచి వరంగల్‌కు ప్రయాణిస్తుండగా తనపై కొందరు దాడికి యత్నించారని లేఖలో ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు తాము చేస్తున్న పోరాటానికి స్పందిస్తూ పలుమార్లు అఖిలపక్ష నేతలను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని ప్రకటించి కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే రెండు సార్లు అరెస్టు చేశారని తెలిపారు. చివరగా రెండోసారి జనవరి 2న అరెస్టు చేసినప్పుడు 23 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో ఉండగా తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, ఇది వెలుగులోకి రావడంతో అమలుచేసేందుకు వెనకడుగు వేశారని వివరించారు. తనను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని, భవిష్యత్తులో కూడా అణచివేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఈ నెల 14వ తేదీన శాసనసభలో ప్రకటన చేశారని వెల్లడించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తనపై జరిగిన హత్యాయత్నంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇవే అంశాలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డికి వివరించినట్టు మంద కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఎందుకలా? అన్నందుకే ఎస్ఐ దౌర్జన్యం..
సాక్షి, జమ్మలమడుగు : న్యాయన్యాయాలు విచారించకుండానే ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించిన ఓ దళితుడిని ఎస్ఐ చితకబాదిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన గుజ్జారి ప్రసాద్ తన ఇంటి ఆవరణలో అదనపు గది నిర్మించుకుంటున్నాడు. ఇందుకు అడ్డుగా ఉన్న పక్కింటి వారి చెట్టును ప్రసాద్ కొట్టివేశాడు. దీంతో చెట్టు యజమాని సురేష్ మైలవరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసాద్‌ను స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి చేయి చేసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి చెట్టు అడ్డం వస్తుందని, దానిని తొలగించాలని పలు మార్లు వారికి విజ్ఞప్తి చేశానని, వారు పట్టించుకోకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో తానే కొట్టేశానని ప్రసాద్ వివరణ ఇస్తుండగానే.. ఎస్ఐ మళ్లీ కొట్టాడు. తన వాదన వినకుండానే ఎందుకు కొడుతున్నావని ప్రసాద్ ప్రశ్నించాడు. దీంతో ఎస్ఐ లాఠీ కర్రతో చితకబాదాడు. దూషిస్తూ ఇష్టారాజ్యంగా కొట్టాడు. ప్రసాద్ తలకు గాయమైంది. బాధితుడిని బయటికి పంపించకుండా అక్కడే ఉంచారు. వెంట వచ్చిన ప్రసాద్ కుమారుడు సంజీవ్‌ను సైతం బయటికి పోనివ్వలేదు. రాత్రి అయినా వారిని స్టేషన్లోనే ఉంచారు. ఈ విషయంపై జమ్మలమడుగు రూరల్ సీఐ ఉమామహేశ్వరరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. విచారణ చేసి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వండి
నెల్లూరు రూరల్: ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఎమ్మార్పీఎస్ నేతలు కోరారు. ఈ మేరకు పొదలకూరురోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షుడు మంద పెంచలయ్యమాదిగ మాట్లాడు తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని ఎంపీలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లుగా తెలి పారు. జిల్లాలోని అన్ని మం డల కేంద్రాల్లో ఈ నెల 21న రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి కోలగట్ల రమేష్, పాపయ్య, బెల్లంకొండ గోపి, బర్రె ప్రసాద్, సుధా, మునె య్య పాల్గొన్నారు. -
13న ఎమ్మార్పీఎస్ బంద్ వాయిదా
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న తలపెట్టిన బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. ఆదివారం సికింద్రాబాద్ పార్శిగుట్టలోని కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 24 ఏళ్ల తమ ఉద్యమ పోరాటంలో బంద్‌ను వాయిదా వేయడం ఇదే తొలిసారని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేని రోజునే బంద్ నిర్వహిస్తామని చెప్పారు. 13న బంద్‌కు బదులుగా జిల్లా, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళనలు చేపడతామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని అన్నారు. రాజ్యసభలో వర్గీకరణ కోసం రాహుల్‌గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షంపై సీఎం కేసీఆర్, మంత్రి కడియం ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న తనను హతమార్చేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలని మంద కృష్ణ మాదిగ కోరారు. హత్యకుట్రపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
వర్గీకరణ బిల్లును వెంటనే ఆమోదించాలి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంట్లో ఆమోదించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. వర్గీకరణ బిల్లును ఆమోదించాలనే డిమాండ్‌తో మార్చి 13న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ శుక్రవారం మఖ్దూంభవన్‌లో చాడను కలిశారు. చాడ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా కేంద్రం స్పందించకపోవడమేమిటని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో వర్గీకరణకు మద్దతుగా అన్ని పార్టీలను సమన్వయం చేస్తామని చెప్పారు. బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తామని ప్రకటించారు. వర్గీకరణ కోసం 24 ఏళ్లుగా ఉద్యమం జరుగుతున్నా ఎన్నడూ బంద్ పిలుపును ఇవ్వలేదని మంద కృష్ణ మాదిగ గుర్తు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో రైతు సమితులా? రైతు సమన్వయ సమితులు టీఆర్ఎస్ కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయని చాడ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతు సమన్వయ సమితుల పేరుతో అధికారాన్ని, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. -
మార్చి 13న తెలంగాణ బంద్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మార్చి 13న తెలంగాణ బంద్ చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ ప్రకటించారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల పాటు బంద్ నిర్వహిస్తామని.. ఇందుకు టీఆర్ఎస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు తీసుకుంటామని వెల్లడించారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ మద్దతు విషయమై సీఎం అపాయింట్మెంట్ కోసం లేఖ ఇచ్చానని, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారని నమ్మకముందని చెప్పారు. బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చినపుడు ఎమ్మార్పీఎస్ మొదట మద్దతు తెలిపిన విషయం గుర్తు చేశారు. కేసీఆర్‌ను కలిస్తే అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లే అంశాన్నీ వివరిస్తానన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఈ మేరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మంద కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, కానీ నాలుగేళ్లు కావస్తున్నా బిల్లు ఊసెత్తకపోవడం శోచనీయమన్నారు. రాజ్యాంగం ప్రకారంఅన్ని వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు దక్కాలని, కానీ దళిత వర్గాల్లోని కొన్ని కులాలే వాటి ఫలాలు ఎక్కువగా పొందాయని చెప్పారు. వర్గీకరణతో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లె ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. పుంగనూరు సమీపంలోని సుగా లిమిట్టకు చెందిన కుమార్‌నాయక్ కుమారుడు ముఖేష్ నాయక్ కొలమాసనపల్లె హాస్టల్లో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సెలవు కావడంతో హాస్టల్ వద్దే ఉన్నాడు. సాయంత్రం స్టడీ క్లాస్‌కు వెళ్లకపోవడంతో వార్డన్ మధుసూదన్ ఆరాతీశారు. బాత్రూమ్ గడియపెట్టి ఉం డడంతో తీసిచూడగా లోపల కమ్మీకి ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారమివ్వగా, వారు సంఘటన స్థ లాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిందట బంగారుపాళెం హాస్టల్లో జరిగిన మోటివేషన్ క్లాస్‌లో ప్రసంగించిన ముఖేష్ మంచి మార్కులు తెచ్చుకుంటానని చెప్పినట్టు వార్డన్ తెలిపా రు. బాగా చదివే విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కా వ డం లేదని ఆయన అంటున్నారు. అయితే తనను సాకిన చిన్నాన్న గజేంద్రనాయక్ ఆత్మహత్యతో మానసిక వేదనకు గురై అత డు ఈ చర్యకు పాల్పడి ఉంటాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఎస్ఐ పూరేనాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్‌తో ఉద్యోగాలు.. భారీ షాక్!
ముంబై : తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తోన్న 11,700 మందిపై వేటు వేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఎస్సీ, ఎస్టీలుగా చెలామణి అవుతూ 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తున్నవారి జాబితాలో క్లర్క్ నుంచి సీనియర్ కార్యదర్శులదాకా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నకిలీ ఉద్యోగుల తొలగింపు అనివార్యమని, అయితే ఒకే దఫాలో వేటు వేస్తే ఎదురయ్యే న్యాయసమస్యలపై చర్యలు జరుపుతున్నామని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమిత్ ములి మీడియాకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి సోమవారం(ఫిబ్రవరి 5న) పలు ఉద్యోగ సంఘాలు, వివిధ పక్షాలకు చెందిన నాయకులతో సీఎస్ భేటీ కానున్నారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు జరుగనున్న ఈ భేటీల అనంతరం ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తూ.. : మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో గడిచిన నాలుగు దశాబద్దాలుగా 63,600 మంది ఉద్యోగాలు పొందారు. వారిలో 51,100 మంది అసలైన అర్హులుకాగా, మిగిలిన 11,700 మంది ఫేక్ సర్టిఫికేట్లతో అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందారు. అక్రమ ఉద్యోగులపై కొన్ని దళిత, గిరిజన సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ‘‘ఒక వ్యక్తి దీర్ఘ కాలం సర్వీసులో ఉన్నప్పుడు అతని కుల ధృవీకరణ తప్పని తేలితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిన అవసరంలేదు’’ అన్న ముంబై హైకోర్టు తీర్పు మరింత గందరగోళానికి దారితీసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. 2017 జులైలో సంచలన తీర్పు చెప్పింది. ‘‘రిజర్వేషన్ కేటగరిలో నకిలీ సర్టిఫికెట్లతో పొందిన ఉద్యోగాలు, ప్రవేశాలు చట్టం దృష్టిలో చెల్లుబాటుకావని, అలా ఉద్యోగాలు చేస్తున్న వారిని విధుల నుంచి తప్పించాల్సిందే’’నని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో ఆ 11,700 మందిపై వేటుకు రంగం సిద్ధమైంది. -
వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి
మహబూబ్‌నగర్ రూరల్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో ఎమ్మార్పీఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని అన్నారు. వర్గీకరణ సాధనలో భాగంగా ఈ నెల 7న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, తిరుమలయ్య, లక్ష్మయ్య, ప్రభుదాస్, హన్మంతు, గోపి, వెంకటయ్య, నగేష్, కర్రెప్ప, శ్రీనివాస్, శివరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వర్గీకరణ జరిగేదాకా పోరాటం ఆగదు
షాద్‌నగర్‌రూరల్ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టబద్దత కల్పించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఎమ్మార్పీస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగటి సత్యం అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగటి సత్యం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టడానికి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆమోదింపజేయడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిని కలిసి ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అధికారంలోనికి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తామని చెప్పిన బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వర్గీకరణ విషయమై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు హాజరైనా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరుకాకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకుంటే సీపీఐ పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి నాయకత్వంలో అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి బయలుదేరే పనిలో ఉన్నామన్నారు. వర్గీకరణ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 7న తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ నాయకత్వాన్ని కేంద్ర, రాష్ట్రాలపై యుద్ధానికి సమాయత్తం చేయడానికి జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఫిబ్రవరి 1న షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేవానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఫిబ్రవరి 12, 13న హైదరాబాద్‌లో జాతీయ స్థాయి కార్యనిర్వాహక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీస్ నాయకులు వనం నర్సింహ, మద్దిలేటి, శంకర్ రావు, బుర్రా రాంచంద్రయ్య, కట్ట జగన్, నర్సయ్య, చిన్నోళ్ల అనంతయ్య, జోగు మల్లేష్, పెంటనోళ్ల నర్సింలు, శ్రవణ్ కుమార్, జోగు శివరాములు, పాండు, యాదగిరి, రవి, రాజు, సురేష్ పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు వీలుగా బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈమేరకు ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వీలుగా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన నివేదిక కేంద్ర కేబినెట్ వద్ద 9 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష గోయల్‌కు నంది ఎల్లయ్య మరో వినతిపత్రం ఇచ్చారు. గద్వాల–మాచర్ల రైల్వే లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. వెనుకబడిన ప్రాంతాలైన నాగర్‌కర్నూలు, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేటలకు ఈ లైను ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు నంది ఎల్లయ్య మరో విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నాగర్‌కర్నూలు నియోజకవర్గ పరిధిలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ప్రాంత నిరుపేద చిన్నారులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కేంద్రీయ విద్యాలయ సీట్లలో ఎంపీ కోటాను 10 సీట్ల నుంచి 20 సీట్లకు పెంచాలని కోరారు. -
వర్గీకరణపై నిర్లక్ష్యమెందుకు: చాడ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం లేఖ రాశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేస్తానని ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగానే ఉన్నట్టుగా ప్రకటించిందని గుర్తుచేశారు. -
ఉద్యమం పార్లమెంటును తాకాలి!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించాలంటే ఉద్యమం పార్లమెంటును తాకాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. వర్గీకరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాయని, మిగిలింది పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా ఉద్యమాన్ని తీవ్రం చేయాలని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలతో ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ)ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్యక్షతన సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ వర్గీకరణ సాధనపై అఖిలపక్ష పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులతో పాటు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల అధ్యక్షులు, ఇతర నేతలు మాట్లాడుతూ, వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఉద్యమానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని, కార్యాచరణ ప్రకటిస్తే ఆమేరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వర్గీకరణ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి చనిపోయిన సందర్భంలో కూడా రెండ్రోజుల్లో ఢిల్లీకి తీసుకెళ్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలి. వర్గీకరణ అంశాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాం. పార్టీ అదిష్టానం తరఫున కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కృషి చేస్తాం. అన్నింటికీ టైం దొరుకుతుంది కానీ..: మందకృష్ణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేవలం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు మాత్రమే టైం దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి అడుగడుగునా టీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తోంది. అయినా కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడంలేదా? అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ చేస్తామని గతంలో బీజేపీ ప్రకటించింది. కానీ అధికారం చేపట్టి ఇన్ని రోజులు అయినా వర్గీకరణ ఊసేలేదు. అణచివేస్తే తిరగబడతాం: కోదండ ప్రస్తుతం ప్రజాసమస్యలపై గళమెత్తే పరిస్థితి లేదు. 506, 507 సెక్షన్లతో కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు. కోర్టు జోక్యం లేకుండా నేరుగా అరెస్టులు చేసి జైల్లో పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. ఇక ఊరుకుంటే లాభంలేదు. తిరగబడదాం. ఎస్సీ రిజర్వేషన్లపై కేంద్రంతో చర్చించి ఒత్తిడి తీసుకొద్దాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలను, మాదిగలు దోషులుగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మంచిది. ఇది కులస్పృహ ఉద్యమం: గద్దర్ ఎమ్మార్పీఎస్ ఉద్యమం కులస్పృహ ఉద్యమం. దళితుల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుతూ చేస్తున్న ఉద్యమం. నేను మాల అయినప్పటికీ ఒక ఉద్యమకారుడిగా, నక్సలైట్‌గా దీనిని సమర్థిస్తున్నా. అన్ని పార్టీల ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. జనాభా ప్రాతిపదికన దక్కాలి: ఎల్.రమణ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కాలి. టీడీపీ హయాంలో రిజర్వేషన్లు అమలు చేశాం.న్యాయపరమైన చిక్కులతో వర్గీకరణ మళ్లీ మొదటికొచ్చింది. ఎమ్మార్పీఎస్ కార్యక్రమాలకు టీడీపీ అండగా ఉంటుంది. కొన్నివర్గాలకే పరిమితమయ్యాయి: చాడ ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అవి కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దీంతో దళితుల్లో సంపన్నులు మరింత పైకెళ్తున్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. ఈ అంతరాన్ని అధిగమించేందుకు వర్గీకరణ చేపట్టాలి. కేంద్రం సానుకూలంగా ఉంది: కె.లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా ఉంది. వర్గీకరణ న్యాయమైందే. అణగారిన వర్గాలకు సమన్యాయం జరగాలని రాజ్యాంగం చెబుతోంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపాలి. -
మంద కృష్ణపై అక్రమ కేసులను ఎత్తివేయాలి
హైదరాబాద్: ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ మేధావుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, టీపీసీసీ నేత మల్లు రవి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. గద్దర్ మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకెళ్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత అరాచకంగా, అప్రజాస్వామికంగా మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేశారని డాక్టర్ చెరుకు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న మంద కృష్ణను అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మల్లురవి అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మాదిగలు ఉన్నారని, ఈ మాదిగలు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని గాలి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న నిర్బంధాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 4న ఓయూలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కాశీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉ. సాంబశివరావు, అద్దంకి దయాకర్, నల్లా రాధాకృష్ణ, ప్రొఫెసర్లు మధు, జి. లక్ష్మణ్, ముత్తయ్య, ఇటుకాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా వర్గీకరణ ఉద్యమం
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని గుజరాత్ స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. తెలంగాణలో వెంటనే వర్గీకరణ చేపట్టాలని కోరారు. చంచల్‌గూడ జైల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఆయన బుధవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కుట్ర పన్ని మంద కృష్ణను జైల్లో పెట్టాయని, అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత హక్కుల కోసం కృష్ణమాదిగ కష్టపడుతున్నారని అన్నారు. దళితులు ఏకమై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై మంద కృష్ణతో చర్చించినట్లు తెలిపారు. నిరుపేద దళితులకు 3 నుంచి 5 ఎకరాల భూమి పంపిణీ చేయాలని ఆయా ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తారా.. అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. -
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
హైదరాబాద్: 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వారు బీసీ–ఏలో ఉండటం ఎంత వరకు సమంజసమని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొత్తకొండ శ్రీలక్ష్మి ప్రశ్నించారు. చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, అందుకోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. శ్రీలక్ష్మి నాయకత్వంలో జూలై 2న భద్రాచలంలో చేపట్టిన పాదయాత్ర ముగింపు కార్యక్రమం ‘చాకలి పోరు గర్జన’ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగింది. ఈ గర్జనకు బిహార్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్యామ్ రజక, అఖిల భారత దోభీ మహాసంఘం అధ్యక్షుడు వి.చంద్రశేఖర్, హరియాణా ప్రతినిధి అమిత్ ఖత్రీ, రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య హాజరయ్యారు. బహిరంగ సభలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ఒక దేశం, ఒకే వృత్తి, ఒకే రాజ్యాంగ పద్ధతిలో రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని 70 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదన్నారు. ఎస్సీ జాబితాలో ఉంటేనే రజకులకు విద్య, ఉద్యోగ, ఉపాధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది రజకులు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, ఎస్సీ రిజర్వేషన్లు ఉంటేనే చట్టసభల్లో ప్రాతినిథ్యం లభిస్తుందన్నారు. మూడున్నరేళ్లు గడుస్తున్నా రజక సహకార సంఘం నియామకం ఊసే లేదని, నిరుద్యోగ యువతకు రజక సహకార సంఘం ద్వారా నేరుగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల రుణాలు ఇవ్వాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రజకుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే.. రజకులకు ఎస్సీ హోదా కోసం 190 రోజుల పాటు 31 జిల్లాల్లో పాదయాత్ర చేశానని, విజయానికి దగ్గర్లో ఉన్నామని శ్రీలక్ష్మి పేర్కొన్నారు. తన పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసం కాదని, రజకులను ఏకతాటిపైకి తీసుకురావటానికి.. వారిని చైతన్యపరచటానికే అని చెప్పారు. రజకుల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం ఎస్సీ హోదానే అని తెలంగాణ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నామన్నారు. రజకుల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం అవసరమన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సేవలందిస్తున్నామని, ఈ గర్జనకు ఆహ్వానం పలికితే ఒక్క పార్టీ స్పందించలేదని, తమకు గెలిపించే దమ్ము లేకపోయినా.. ఓడించే సత్తా ఉందని హెచ్చరించారు. రజకుల హక్కుల సాధనకు ఉద్యమమే శరణ్యమని, నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ అవమానాలే.. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ రజకులు అవమానాలు ఎదుర్కొంటున్నారని, రజకుల్లో ఐక్యత లేకపోవడమే దీనికి కారణమని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. రజకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని, ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రజకులను వెంటనే దళితులుగా గుర్తించి ఎస్సీ హోదా కల్పించాలని శ్యామ్ రజక డిమాండ్ చేశారు. రజకులకు న్యాయం జరగకపోతే 2019 ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. -
వర్గీకరణపై మా చిత్తశుద్ధిని శంకించొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పనిలేదని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ నిజాయితీతో వ్యవహరించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణపై అఖిలపక్ష బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని సీఎం పలుమార్లు కోరారని గుర్తు చేశారు. అఖిలపక్ష బృందానికి ప్రధాని సమయం ఇవ్వడం లేదంటే ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదనే అనుమానం వస్తోందన్నారు. వర్గీకరణపై నిర్ణయం తీసుకుని అమలు చేయాల్సింది కేంద్రమేనన్నారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఏ ఆందోళన చేయాలనుకున్నా ఢిల్లీలోనే చేయాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని విమర్శించారు. -
వర్గీకరణ కోరుతూ నేటి నుంచి దీక్ష
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం నేటి(మంగళవారం) నుంచి దీక్ష కొనసాగించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు, బాపూఘాట్ లేదా నగర పరిధిలో ఎక్కడ అనుమతి ఇచ్చినా తమ దీక్ష కొనసాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎమ్మార్పీఎస్‌పై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, తమపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు టీఆర్ఎస్ నేతలెవరూ తమకు మద్దతు ఇవ్వలేదన్నారు. తాము వేసిన 13 ప్రశ్నలకు కేసీఆర్‌గానీ, కడియంగానీ ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. దళిత సీఎం విషయం లో కేసీఆర్ మాట తప్పారని, దళితుల్లో సీఎం స్థాయివ్యక్తి లేరని శ్రీహరి ప్రకటన చేసి దళితులను అవమానపరిచా రన్నారు. రాజయ్య బర్తరఫ్ కుట్రలో భాగమై ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కడియం దోచు కున్నారని మంద కృష్ణ ఆరోపించారు. తమపై పెట్టిన కేసుల కుట్రకు కడియం మూలకారకుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీహరి తన రాజకీయ భవిష్యత్ కోసం దళితులకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇంట్లో వెయ్యిమందితో మీటింగ్ పెట్టుకోవచ్చు కానీ, పదిమందితో దీక్ష చేయనీయరా.. అని ప్రశ్నించారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పిన బీజేపీ ఇంకా ఆ దిశగా ముందుకు సాగడం లేదన్నారు. -
వర్గీకరణపై టీఆర్ఎస్ కపట నాటకం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై టీఆర్ఎస్ కపట నాటకం ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారంనాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్గీకరణ కోసం కలుస్తామంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమయం ఇవ్వడం లేదంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎస్సీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు ఉన్న ప్రేమ ఏపాటిదో ఈ మూడున్నరేళ్ల నుంచి ఆచరణలోనే చూశామన్నారు. దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అని చెప్పిన సీఎం కేసీఆర్.. దాన్ని అమలు చేయకుండా తానే గద్దెపై కూర్చున్నారని అన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయడం లేదని, సబ్‌ప్లాన్ చట్టానికి కోరల్లేకుండా చేశారని ఆరోపించారు. ఈ సంవత్సరంలో ఉద్యమాలతో బీజేపీ దూసుకు పోతుందన్నారు. దళితులకు ఈ మూడున్నరేళ్లలో ఖర్చు చేసిందెంత అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎస్సీ కమిషన్ వేయకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడెక్కడ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై ఆగడాలు పెరిగిపోతున్నాయన్నారు. -
వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును కేంద్రం వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తెలంగాణ ఎమ్మార్పీఎస్, ఏపీ ఎమ్మార్పీఎస్, మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఈటుకు రాజు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య విమర్శించారు. ఇచ్చిన హామీమేరకు వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని నేతలు హెచ్చరించారు. -
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అందులో భాగంగానే 2014 నవంబర్ 29న వర్గీకరణను సమర్థిస్తూ అసెంబ్లీలో తీర్మానించామని చెప్పా రు. తీర్మాన ప్రతులను తాను ప్రధాని మోదీకి అందజేశానని తెలిపారు. శుక్రవారం ఎస్సీ వర్గీకరణ అంశంపై కడియం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘దండోరా ఉద్య మం ప్రారంభంలో వర్గీకరణపై కేంద్రం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అందులో కేసీఆర్ కూడా సభ్యుడు. ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా అమలు సాధ్యం కాకుంటే కనీసం తెలంగాణకు పరిమితం చేసి అను మతివ్వాలని కూడా ప్రధానిని కోరాం’’ అని చెప్పారు. వర్గీకరణపై అఖిలపక్ష బృందంతో కలుస్తామని కోరితే ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారని.. కానీ యూపీ ఎన్నికల నేపథ్యంలో చివరి క్షణంలో రద్దు చేశారన్నారు. మళ్లీ ప్రయత్నించినా స్పందన లేదు ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి నవంబర్ 6న దురదృష్టవశాత్తు చనిపోయారని.. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్తానని ఆ మరునాడే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని కడియం చెప్పారు. దీనిపై అదే నెల 9న ప్రధానికి కేసీఆర్ లేఖ రాసినా.. ఎలాంటి సమాధానం రాలేదన్నారు. జీఈఎస్, మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చి నప్పుడూ దీనిపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. కానీ సమయం తక్కువగా ఉందని ప్రధాని స్పష్టం చేశారన్నారు. తర్వాత కూడా ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తా: డీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో తెలంగాణ మాదిగ జేఏసీ చేపట్టిన రెండో రోజు నిరసనలో డీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నిరసనలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ నన్ను జైల్లో పెట్టించారు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. గత పది రోజులుగా జైలులో ఉన్న ఆయన ఈరోజు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. అదే విధంగా మను ధర్మ చట్టాన్ని అవలంభిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్‌పై నిర్భంధ కేసులు నమోదు కాలేదని.. శాంతి యుతంగా ర్యాలీ నిర్వహిస్తే తమపై 20 కేసులు పెట్టారన్నారు. దొరలకు ఒక చట్టం.. దళితులకు ఒక చట్టమా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే ఎమ్మార్పీఎస్ అండగా నిలిచిందని.. కానీ వర్గీకరణ కోసం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే కేసీఆర్ తనను 10 రోజులు జైల్లో పెట్టారన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలని, లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. జనవరి 1 నుంచి 5 వరకు ఉపవాస దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. -
30న ‘హలో మాల.. చలో ఢిల్లీ’
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న హలో మాల.. చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు మాల మహానాడు జాతీయ అ«ధ్యక్షుడు జి.చెన్నయ్య తెలిపారు. లక్షలాది మంది మాలలతో కలసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని కూకట్పల్లి వై జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన పార్టీలకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాలలు తగురీతిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడమే మాలల లక్ష్యమని అన్నారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి, బీజేపీ మంత్రి రాందాస్ అత్వాలేకు ప్రత్యేక కృతజ్ఞతలు -
ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదే
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్ న్యాయమైనదని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మంద కృష్ణను బేషరతుగా విడుదల చేసి, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసినా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి ఆలస్యం చేయడం తగదన్నారు. జనవరి 5న పార్ల మెంట్ సమావేశాలు ముగుస్తాయని, సీఎం చొరవ తీసుకుని ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడి వర్గీకరణకు కృషి చేయాలని కోరారు. ఉద్యమకారులను అరెస్ట్ చేసి అడ్డుకోవాలనుకుంటే ఉద్యమాలు ఆగవన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వెంటనే వదిలిపెట్టారే తప్ప ఇలా సెక్షన్ల మీద సెక్షన్లు పెట్టి హింసించలేదని గుర్తు చేశారు. చట్టం పేరుతో అరాచకం సృష్టించడం బాధాకరమన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కడుపు మండిన పోరాటమని, ఆ పోరాటం చేస్తున్న మంద కృష్ణను అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఫ్యూడల్ వ్యవస్థ వచ్చిందని, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మళ్లీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాలందరూ ఏకమై రాజకీయశక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. మంద కృష్ణను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంద కృష్ణ సంఘీభావ, విడుదల కమిటీ ఈ నెల 27న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కమిటీ చైర్మన్ సాదం వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, సీపీఎం, సీపీఐ నేతలు జి.నాగయ్య, బాలమల్లేశ్, ప్రజాసంఘాల నేతలు మన్నారం నాగరాజు, స్కైలాబ్ బాబు, డాక్టర్ కాశీం, ఏపూరు సోమన్న, ప్రొఫెసర్ గాలివినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణపై రెండు నాల్కల ధోరణి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి చం ద్రశేఖర్‌రావు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వర్గీకరణపై మాట్లాడేందుకు ఇప్పటివరకూ ప్రధాని అపాయింట్మెంట్ సీఎం తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరా బాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను కేసీఆర్ గాలికొదిలేశారని, ఉద్యోగాల భర్తీపై బోగస్ మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ఘర్షణలు పెంచేలా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించకపోవడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. -
వర్గీకరణపై కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి: చాడ
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వర్గీకరణ అంశంపై మాట్లాడేందుకు సీఎం ఇప్పటి దాకా ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మఖ్దూం భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యను పూర్తిగా గాలికి వదిలివేశారని, ఉద్యోగాల భర్తీపై బోగస్ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో స్థానిక సంస్థల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. గ్రామాల్లో ఘర్షణలు పెంచడానికి టీఆర్ఎస్ చూస్తోందని, ఆ రకంగా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. కేరళ తరహా పంచాయతీ రాజ్ చట్టాన్ని తయారు చేసి అమలు చేయాలని చాడ డిమాండ్ చేశారు. నెరేళ్ల ఘటన దళితులపై దాడులకు సంబంధించి ఈనెల 27వ తేదీన వారితో ముఖాముఖీ సంభాషిస్తామన్నారు. ఈ కేసులో వివాదస్పదంగా వ్యవమరించిన సిరిసిల్ల ఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీ బయటపెట్టాలని, లేదంటే తామే ఈ అంశంపై ఒక బుక్లెట్ తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడ, తక్షణం స్పందించని కారణంగానే ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణలు నెలకొన్నాయని ఆరోపించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతని ఎద్దేవా చేశారు. -
ఎస్సీ వర్గీకరణపై దేనికైనా తెగిస్తాం: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం దేనికైనా తెగిస్తామని మాజీమంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని, మంద కృష్ణ మాదిగను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట గురువారం ఆయన మౌనదీక్షకు దిగారు. దీక్షకు దిగిన వెంటనే మోత్కుపల్లితోపాటు టీడీపీ నేతలు బొట్ల శ్రీనివాస్, సారంగపాణి, బి.ఎన్.రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్‌కి తరలించారు. అక్కడ కూడా మోత్కుపల్లి దీక్షను సాయంత్రం దాకా కొనసాగించారు, దీక్ష చేస్తున్న మోత్కుపల్లికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇస్తామని, దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితులను జైళ్లలో పెడుతున్నారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధతకు కృషి చేస్తామని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకు వెళ్తామని ఇచ్చిన హామీని ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను గద్దెదించడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని, వాటిలో ఎక్కడా భాగస్వామ్యం కాలేదని, మాదిగలకు అన్యాయం జరిగితే నిలబెట్టడమా, కూలగొట్టడమా అనేదానిపైనా నిర్ణయం తీసుకుంటామని మోత్కుపల్లి హెచ్చరించారు. మంద కృష్ణపై కేసు పెట్టిన తర్వాత మౌనదీక్షకు దిగితే తమను నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ను సీఎంగా చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని, మాదిగలకు అన్యాయం జరిగితే మాత్రం సహించమన్నారు. తెలుగు మహాసభల్లోనూ పేద, దళిత కవులను పట్టించుకోలేదని విమర్శించారు. అగ్రవర్ణ ఆధిపత్యం కిందనే కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఇదే వైఖరి కొనసాగితే టీఆర్ఎస్తో చావోరేవో తేల్చుకుంటామని హెచ్చరించారు.కృష్ణమాదిగను బేషరతుగా విడుదల చేయాలని, కేసులను ఎత్తివేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ మంద కృష్ణను విడుదల చేయాలని, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌చేశారు. -
కంటతడి పెట్టిన మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. కేసీఆర్ ఎస్సీలను నియంతృత్వ పోకడలతో అణిచివేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. గురువారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోత్కుపల్లి మౌనదీక్షకు దిగారు. ఎస్సీ వర్గీకరణలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఈ దీక్షకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణను అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తాము కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని, ఆయన తమను అణగదొక్కాలని చూస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి కేసీఆర్ ఎప్పుడు తీసుకెళతారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే మందకృష్ణను విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. -
మాదిగల అభివృద్ధే ధ్యేయం
హైదరాబాద్: అక్షరమే ఆయుధమనే లక్ష్యం తో మాదిగల అభివృద్ధి దిశగా మలిదశ ఉద్య మం సాగుతోందని తెలంగాణ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. మంద కృష్ణ నేతృత్వంలో 23 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమంలో కార్యకర్తలపై వందలాది కేసులు మినహా సాధించే దేమీ లేదన్నారు. హైదరాబాద్ తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్స్‌లో సోమవారం మాదిగ అమరవీరుల శ్రద్ధాంజలి సభ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాటాకుల భాస్కర్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జెన్ను రమణయ్య పాల్గొన్నారు. వంగపల్లి మాట్లాడుతూ.. మంద కృష్ణ ఉద్యమ ద్రోహి అని అన్నారు. దాడుల సంస్కృతిని ప్రేరేపిస్తూ అమాయక కార్యకర్తలను బలి చేస్తున్నారన్నారు. భారతి చనిపోయిన వెంటనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఆమె కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేలా ప్రకటన చేయించామన్నారు. తామెవ రికీ అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించారని మేడి పాపయ్య మాదిగ అన్నారు. ఆదివారం జరిగిన ఘటనల్లో అమాయకులపై కేసులు ఎత్తేసి, మంద కృష్ణపై పీడీ యాక్టు ప్రయోగించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బినామీల పేరిట మందకృష్ణ కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని యాటాకుల భాస్కర్ విమర్శించారు. 19న కొలనుపాకలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. -
కేంద్రంపై యుద్ధం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ విమర్శిం చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ, మూడేళ్లు గడిచినా ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. వర్గీకరణ కోసం కేంద్రంపై త్వరలో యుద్ధం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. శనివారం సోమాజిగూడలో ఆయన మీడి యాతో మాట్లాడారు. వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన భారతి సంస్మరణ సభను ఈనెల 17న సిక్‌విలేజ్ హాకీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు రాష్ట్రంలోని మహిళలంతా కొవ్వొత్తులతో హాజరు కావా లని పిలుపునిచ్చారు. వర్గీకరణ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, కేసీఆర్ మాత్రం అసెంబ్లీలో బిల్లుపెట్టి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని తీసుకెళ్లడం పట్ల సీఎంను అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ని ఎవరూ స్మరించుకోవడం లేదని, వారి దేహాలను సమాధి చేసినట్లే చరిత్రనూ సమాధి చేస్తున్నార న్నారు. అమరులను స్మరించుకునేం దుకు ఒకరోజు కేటాయించాల న్నారు. ఆదివాసీల ఆవేదన న్యాయమైందని, మాదిగలు వెనుకబడినట్లే ఎస్టీల్లో ఆదివాసీలు వెనుకబడ్డారని, వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుం దన్నారు. భద్రాద్రి ఎన్కౌంటర్ బూటకమని, నక్సల్స్ ఎజెండా అమలుచేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని చంపడమే పనిగా పెట్టుకుందన్నారు. ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిం చాలన్నారు. తెలంగాణ ఉద్యమం లో ఆటపాటలతో చైతన్యపర్చిన కళాకారులను తెలుగు మహా సభలకు ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. -
వర్గీకరణ కోసం డిసెంబర్ 28న ‘ఢిల్లీ ముట్టడి’
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం డిసెంబర్ 28న ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్పైకి నెట్టి బీజేపీ తన బాధ్యతను విస్మరించొద్దని అన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్సీ వర్గీకరణపై వినతిపత్రం ఇవ్వాలని, ముఖ్యమంత్రి నేతృత్వంలో వెళ్లే అఖిలపక్షానికి సమయం ఇవ్వాలని కోరాలని సూచించారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యతను బీజేపీ పెద్దలే తీసుకోవాలని అన్నారు. లక్ష ఉద్యోగాల మాటలు నీటిమూటలేనా అని బీజేపీ నాయకులు టీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నారని, అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ నేతల మాటలు కూడా నీటిమూటలేనా అని కృష్ణ మాదిగ ప్రశ్నించారు. వర్గీకరణపై బీజేపీ ముందుకు వెళ్లకపోతే కేంద్రంపై ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ పోరులో అసువులు బాసిన భారతి మాదిగ సంస్మరణ సభను డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 5వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరవధిక దీక్షలు, పార్లమెంట్ ముందు దీక్షలు చేపడతామన్నారు. 18వ తేదీన మాదిగ యువసేన ఆధ్వర్యంలో ఢిల్లీలో కవాతు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే 28వ తేదీన మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ ముట్టడి కార్యక్రమం, జనవరి 3న మాదిగ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ‘ఢిల్లీ దిగ్బంధం’నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ ఉద్యమంలో ఎలాంటి ఘటనలు జరిగినా బీజేపీ పెద్దలే బాధ్యత వహించాలన్నారు. -
ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ ను ముట్టడించేందుకు బుధవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. మల్కాపురం గ్రామం నుంచి వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలంతా అసెంబ్లీలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం చంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారని.. ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరగా పెట్టాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 30 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్కాపురం గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం నుంచి సుమారు 30 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రహస్యంగా మకాం వేసి ఉన్నారని పోలీసులు అంటున్నారు. -
కేసీఆర్ అబద్ధాల కోరు: మంద కృష్ణ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చి అబద్ధాలకోరు అని, ఆయన చెప్పే మాటల్లో చిత్తశుద్ధి, నిజాయితీ ఉండదని, అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన మాదిగలపై మొసలికన్నీరు కార్చడమేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పున రుద్ఘాటించారు. సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘ఎస్సీ వర్గీకరణ కోరుతూ కేసీఆర్ ప్రధానికి లేఖ రాయడానికి రెండు రోజుల సమయం అడిగి ఇప్పటికీ రాయలేదు’ అని విమర్శించారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ సీఎం ఫిబ్రవరి 6న లేఖ రాయగా ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ తిరస్కరించిందని, నాటి నుంచి నేటి వరకు సీఎం ప్రధానికి లేఖ రాయలేదని అన్నారు. ఎమ్మార్పీఎస్ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఈ మూడు సంఘటనలు వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ,నిజాయితీ లేదనడానికి నిదర్శనాలని పేర్కొన్నారు. దేశంలో ఏ త్యాగానికి దక్కనంత గౌరవం దక్కేలా భారతి సంస్మరణ సభ ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. -
ఎస్సీ యువతకు శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా 2017–18 ఏడాదిలో ఆ శాఖ రూ.169 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ప్రధానంగా ఎస్సీ యువతులకు ఎయిర్‌హోస్టింగ్‌లో శిక్షణతో కూడిన ఉపాధి కల్పించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్తో ఎస్సీ కార్పొరేషన్ అవగాహన కుదుర్చుకుంది. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా ఉపాధి అవకాశాలు సైతం కల్పించనుంది తొలివిడత 50 మందికి... ఎయిర్ హోస్టింగ్ శిక్షణలో ప్రస్తుతం 50 మందికి శిక్షణతో కూడిన ఉపాధి ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇప్పటికే ఇందులో శిక్షణ నిమిత్తం 200 పైగా దరఖాస్తులు రాగా.. వీటిలోంచి 50 మందిని ఈనెలాఖర్లోగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. తొలివిడత కార్యక్రమం విజయవంతంగా పూర్తయితే మరికొందరికి సైతం ఇదే తరహాలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని రంగాల్లోనూ శిక్షణ ఎయిర్ హోస్టింగ్‌తో పాటు మరిన్ని రంగాల్లోనూ శిక్షణతో కూడిన ఉపాధి కల్పించేందుకు ఆ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది పదివేల మందికి టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి.. వారికి అత్యాధునిక కుట్టుమిషన్లు సైతం అందించనుంది. సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు 3నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు న్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమం మొదలైంది. తొలివిడత 27 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 23 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మెడికల్ రంగంలో ఉపాధి కల్పనకు ఆ శాఖ అపోలో హాస్పిటల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకోనుంది. వీటితో పాటు హౌస్‌కీపింగ్, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత కోర్సులు, వెబ్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ తదితర కోర్సుల్లో శిక్షణతో కూడిన ఉపాధి కల్పనకు నిధమ్, కెల్ట్రాన్, ఎంఎస్ఎంఈ సంస్థలతో అవగాహన కుదుర్చుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2017–18 ఏడాది ముగిసేనాటికి కనీసం పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘనంగా దున్నపోతుల వేడుక కర్ణాటకలోని మంగళూరు తీరప్రాంత సంప్రదాయ క్రీడ అయిన కంబళ ఘనంగా పునఃప్రారంభమైంది. శనివారం మంగళూరు సమీపంలోని కడళకెరె గ్రామంలో దున్నపోతులను బురద మడుల్లో పరిగెత్తించి, గెలిచిన వాటి యజమానులను సన్మానించారు. కంబళలో జంతుహింస జరుగుతోందని ఆరోపిస్తూ కొన్ని సంఘాలు ఏడాది కిందట హైకోర్టులో కేసులు వేయడంతో క్రీడను ఆపివేశారు. రాష్ట్ర సంస్కృతిని అణచివేయరాదని గతేడాది చివర్లో ప్రముఖులు, ప్రజలు కంబళకు మద్దతుగా నిరసనలు చేపట్టడం తెలిసిందే. చివరకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి రాష్ట్రపతికి పంపగా ఇటీవల ఆమోదం లభించింది. దీంతో శనివారం రెట్టించిన ఉత్సాహంతో కంబళను నిర్వహించారు. – సాక్షి, బెంగళూరు -
వర్గీకరణపై స్పష్టమైన విధానం ప్రకటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానం చెప్పని పక్షంలో ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనకు నిరసన తప్పదని ఎమ్మార్పీఎస్ హెచ్చరించింది. ఈ మేరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ జాతిలో ఉన్న ఆవేదనను, ఉద్యమ తీవ్రతను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలియజేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజును కోరారు. శుక్రవారం ఇక్కడ ఏఐసీసీ కార్యాలయంలో రాజుతో కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులు వివరించేందుకు ఢిల్లీకి వచ్చినట్టు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లలో అసమానతలున్నాయని 1965లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని, అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కృష్ణ మాదిగ వివరించారు. ఆయా డిక్లరేషన్లు, తీర్మానాల ప్రతులను కొప్పుల రాజుకు అందజేశారు. ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా లేక అణచివేతకు గురైన కులాల పక్షాన స్పష్టమైన విధానం ప్రకటిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. 23 ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎందరో బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని చెబుతూ భారతి ఉదంతాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ మేనిఫెస్టోలు, తీర్మానాలకే పరిమితం కారాదని కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానం ప్రకటిస్తే రాహుల్ గాంధీని స్వాగతిస్తామని, లేదంటే నిరసన తెలియపరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు తీగల ప్రదీప్, ఎం.నారాయణ ఉన్నారు. -
భారతి కుటుంబానికి 25లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ధర్నాలో అస్వస్తతకు గురై మృతి చెందిన కార్యకర్త భారతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను తక్షణమే చెల్లిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆమె కుటుం బంలో అర్హులుంటే ప్రభుత్వ ఉద్యోగమిస్తామని, ఆమెకు పిల్లలు ఉంటే వారి చదువుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై సోమవారం శాసనసభలో స్వల్ప కాల చర్చ జరుగుతున్న సమయంలో విపక్షాల కోరిక మేరకు భారతి మర ణించిన ఘటనపై సీఎం సభలో ప్రకటన చేశారు. భారతి మృతి దురదృష్టకరమని, ఆమెను వెనక్కి తీసుకురాలేమని అన్నారు. వ్యక్తిగతంగా ఎమ్మార్పీ ఎస్తో తనకు దగ్గరి సంబంధం ఉందని, చంద్ర బాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు మంత్రివర్గ ఉపకమిటీ సభ్యుడిగా ఎస్సీ వర్గీకరణకు తాను మద్దతు తెలిపానన్నారు. అలాగే టీఆర్ఎస్ అధినేతగా కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించానన్నారు. ఎస్సీ వర్గీకరణ జరపాలన్న డిమాండ్‌పై అఖిలపక్ష బృందంతో వచ్చి ప్రధాని మోదీని కలుస్తామని, అందుకు సమయం కేటా యించాల్సిందిగా కోరామని గుర్తు చేశారు. సంద ర్భాన్ని బట్టి సమయం కేటాయిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు. గతంలో సభలో చేసిన తీర్మానం మేరకు ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని పునరుద్ఘాటించారు. ఈ విషయం తీవ్రతను వివరిస్తూ ప్రధానికి ఒకట్రెండు రోజుల్లో లేఖ రాస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని రాజకీయపక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురికావా ల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధానిని కలసి ఈ సమస్యకు త్వరలో మంచి ముగింపు ఇద్దామని విపక్షాలకు పిలుపు నిచ్చారు. భారతి మృతిపై విచారణ.. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించా లని ఎమ్మార్పీఎస్ ఇచ్చిన పిలుపు మేరకు కొందరు కార్యకర్తలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారని సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యా హ్నం 12.40 గంటల సమయంలో కార్యక ర్తలు కలెక్టరేట్ గేటు తోసుకుని లోపలికి పోవడానికి ప్రయత్నిం చారని, పోలీసులు అడ్డుకుని వారిని వాహనంలో తరలించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇదే సమయంలో ధర్నాలో పాల్గొన్న 40 ఏళ్ల భారతి అస్వస్తతకు గురై అక్కడే కూర్చోగా, పోలీసులు వెంటనే తమ వాహనంలో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారతి మృతిచెందారని, ఈ ఘటనకు సంబందించిన వీడియో ఫుటేజీని స్వయంగా తను వీక్షించానని సీఎం తెలిపారు. ఈ వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేస్తున్నామని, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని చెప్పారు. భారతి మృతి చెందిన విషాద సమయంలో సభను నిర్వహించకుండా వాయిదా వేయాలని విపక్షాలు చేసిన సూచనతో ఏకీభవిస్తున్నానని అన్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు స్పీకర్ మధుసూదనాచారి సభను మంగళవారానికి వాయిదా వేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి: విపక్షాలు ఎస్సీ వర్గీకరణ జరపాలని ప్రధాని మోదీని కోరేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని విపక్షనేత కె.జానారెడ్డి, బీజేపీఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం సభ్యుడు అహమ్మద్ పాషా ఖాద్రీ, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణ పోరులో ఆగిన ఊపిరి
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపట్టిన చలో కలెక్టరేట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆమెను ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఎమ్మార్పీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించింది. తోపులాటలో కిందపడిపోయి.. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలంటూ ఎమ్మార్పీఎస్ సోమవారం చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత ఎమ్మార్పీఎస్ నాయకులు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడే బైఠాయించారు. లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఈస్ట్ మారేడ్‌పల్లి గాంధీకాలనీకి చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి(45) అస్వస్థతకు గురై కింద పడిపోయింది. వెంటనే ఎమ్మార్పీఎస్ నాయకులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలియగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, అధికార, విపక్ష నేతలు పెద్దఎత్తున ఉస్మానియాకు చేరుకున్నారు. ఇదీ ప్రభుత్వ హత్యే..: నాయకులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో నాలుగు గంటల పాటు గందరగోళం నెలకొంది. ఎమ్మార్పీఎస్ కళా మండలి జాతీయ నాయకులు ఎన్.సి.అశోక్ మాదిగ, ఆస్పత్రికి చేరుకొని తన బృందంతో భారతి పేరిట అప్పటికప్పుడు పాట కట్టి ఆలపించారు. తర్వాత ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే అడ్డుకున్నారని, ఇది ప్రభుత్వ హత్యేనని వారు మండిపడ్డారు. ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం సీఎం కేసీఆర్ వెంటనే కేంద్రంతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి తరలివెళ్లిన నేతలు.. భారతి మృతి వార్త తెలియగానే వివిధ పార్టీల నేతలు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి తదితరులు వారిలో ఉన్నారు. మరోవైపు భారతి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె ప్రాణాలకు పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. అసెంబ్లీలో ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా వెంటనే అఖిలపక్షాన్ని, ఎమ్మార్పీఎస్ నాయకత్వాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం డిమాండ్ చేసింది. రూ.25 లక్షల నష్టపరిహారం: కడియం ‘‘గత 23 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోరాటంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి రావడం దురదృష్టకరం. భారతి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. ఏబీసీడీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తానని సీఎం హామీ ఇచ్చారు’’ పోలీసుల అత్యుత్సాహం వల్లే: జానారెడ్డి ‘‘ఎమ్మార్పీఎస్ పోరాటం ఇతర ఉద్యమాలకు ఓ కనువిప్పు. వారి పోరాట పటిమను ప్రశంసిస్తున్నాం. పోలీసుల అతి ఉత్సాహమే భారతి మరణానికి కారణం. అసెంబ్లీ నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేలా మేమే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. కేంద్రంపైనా ఒత్తిడి తెస్తాం. ఆమె త్యాగం వృథా కాదు: కిషన్‌రెడ్డి ‘‘ఎస్సీ వర్గీకరణ కోసం ఓ మహిళ అసువులు బాసడం ఎంతో విచారకరం. ఆమె త్యాగం వృథా కాదు’’ అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి: మోత్కుపల్లి నర్సింహ్ములు, మాజీ ఎమ్మెల్యే ‘‘సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో వర్గీకరణ సమస్యను పరిష్కరించాలి. అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలి. వర్గీకరణకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది’’ -
ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించే అంశంపై కేంద్రంతో చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో సోమవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభలో హామీయిచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోడియం వద్దకు వచ్చి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. దీనిపై మరోసారి సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తిని కూడా ప్రతిపక్షం పట్టించుకోలేదు. అయితే, బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాలను కొనసాగించాలని ఆయన విన్నవించారు. దీంతో కాసేపు పరిస్థితి సద్దుమణిగింది. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత వర్గీకరణపై ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి మధుసూదనాచారి తిరస్కరించడంతో మళ్లీ నిరసన మొదలైంది. ఈ విషయంలో సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని హామీయిచ్చారని, కాబట్టి దీనికి సమాధానం కావాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. సమాధానం రానందుకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ వాకౌట్ చేయగానే బీజేపీ నేత కిషన్‌రెడ్డి, టీడీపీ నేత వెంకటవీరయ్య అఖిలపక్షాన్ని ఎప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తారో ప్రకటన చేయాలని కోరారు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ అఖిలపక్షంలో ఎస్సీ వర్గీకరణతోపాటు ముస్లిం రిజర్వేషన్ల అంశం కూడా ఉండాలని కోరారు. నిరసనల మధ్య ఈటల స్పందిస్తూ అఖిలపక్షం లేకపోయినా ఇంతకుముందే వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోదీతో సీఎం కేసీఆర్ చర్చించారని చెప్పారు. ఈసారి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని ఈటల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ దీనిపై తీర్మానం చేయలేదని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఈ అఖిలపక్షం ద్వారానే కేంద్రం దృష్టికి తీసుకెళతామని హరీశ్ ప్రకటించారు. -
ప్రజాభీష్టం మీద ఎందుకీ పగ?
విశ్లేషణ అమెరికన్ తత్వవేత్త నామ్ చోమ్స్కీ ప్రభుత్వానుకూలమైన వార్తలను ప్రజలు నమ్మే విధంగా రూపొందించే విధానాన్ని ‘మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్’గా అభివర్ణించారు. రాష్ట్రంలో కూడా కొందరు తమ స్వార్థం కోసం మాన్యుఫాక్చరింగ్ ఉద్యమాలను లేవదీసి లబ్ధి పొందారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల, తగిన వ్యవధి లేకపోవడం వల్ల ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేరు. అందుకే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకే అధికారం అప్పగించారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా; సొంత ఎజెండాలతో పాలించే ప్రభుత్వాలను దారిలోకి తేవడానికి ప్రజలు ఉపయోగించే ఆయుధం ‘ఉద్యమం’. సాధారణంగా ప్రజానీకం ఓపికతోనే ఉంటుంది. కష్టాలు, నష్టాలను మౌనంగా భరిస్తుంది. ప్రజలు ఉద్యమబాట పట్టారంటే అర్థం– వారి సహనం నశించినట్టే. ఇక ఉద్యమాల వెనుక ఉన్న ఆకాంక్షలను గుర్తించకుండా, వాటిని అణచివేయడమంటే ప్రభుత్వం తన వేలితో తన కన్ను పొడుచుకోవడమే. ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. రెండేళ్ల పాటు ప్రజలు ఓపికగా భరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్షణాలేవీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలలో కనపడడం లేదని గ్రహించిన తరువాత హక్కుల సాధనకు ఇప్పుడు ఉద్యమబాట పట్టారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ, మద్యపాన వ్యతిరేకోద్యమం (ఇది రూపుదిద్దుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు), ప్రత్యేక హోదా ఉద్యమం– ఇలా అనేక ఉద్యమాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు ఉద్యమిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తమ పాలనలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఎందుకు రోడ్ల పైకి వచ్చి ఉద్యమిస్తున్నారో, ఆ అసంతృప్తి ఎందుకో ప్రభుత్వం అర్థం చేసుకోవలసి ఉంది. తదనుగుణంగా ఆ పార్టీ ప్రభుత్వం తన విధానాలను సవరించుకునే బాధ్యతను కలిగి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా ఉద్యమాలను అణచివేయడానికీ, నిర్బంధకాండతో కృత్రిమమైన కౌంటర్ ఉద్యమాలను (మాన్యుఫ్యాక్చరింగ్ యాజిటేషన్స్) తానే నడిపిస్తున్నది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారిని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నవారిగా చిత్రీకరిస్తున్నది. అమెరికన్ తత్వవేత్త నామ్ చోమ్స్కీ ప్రభుత్వానుకూలమైన వార్తలను ప్రజలు నమ్మే విధంగా రూపొందించే విధానాన్ని ‘మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్’గా అభివర్ణించారు. రాష్ట్రంలో కూడా కొందరు తమ స్వార్థం కోసం మాన్యుఫాక్చరింగ్ ఉద్యమాలను లేవదీసి లబ్ధి పొందారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల, తగిన వ్యవధి లేకపోవడం వల్ల ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేరు. అందుకే తెలం గాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకే అధికారం అప్పగించారు. అయితే అన్ని సందర్భాలలో కౌంటర్ ఉద్యమాలతో లబ్ధి పొందగలమన్న నమ్మకంతో చంద్రబాబు ప్రస్తుతం అన్ని ఉద్యమాలను అణచివేయడానికి అదే ఆయుధాన్ని ఉపయోగించాలని భావిస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా తెలుగుదేశం సాగిస్తున్న కౌంటర్ ఉద్యమాల తీరుతెన్నులను సమగ్రంగా విశ్లేషించుకోవాలి. ఎస్సీ వర్గీకరణ– చంద్రబాబు ద్వంద్వ వైఖరి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. వర్గీకరణకు అనుకూలంగా అసెం బ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. అక్కడ నుంచి అనుమతి రాక ముందే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ ఫలాలను ప్రభుత్వ పరంగా ఆయా వర్గాలకు అందించారు కూడా. తరువాత జరిగిన పరిణామాలలో న్యాయస్థానం ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కొట్టివేయడంతో సమస్య మొదటికొచ్చింది. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, ఆయన పార్టీ ఈ మూడున్నరేళ్లుగా ఏనాడూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు. పైగా కృష్ణమాదిగ మంగళగిరిలో కురుక్షేత్ర సభ ఏర్పాటు చేసుకుంటే అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి వ్యతిరేకంగా కొందరితో కౌంటర్ ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టించారు. ఈ కౌంటర్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఒకరిద్దరు నాయకులకు తరువాత రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కూడా దక్కాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమం తెలుగుదేశం తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం మేరకు కాపులను బీసీలలో చేర్చకుండా జరుగుతున్న జాప్యానికి నిరసనగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కాలంగా నిర్బంధ కాండను కొనసాగిస్తున్నది. ముద్రగడకు వ్యతిరేకంగా కాపు, బలిజనేతలను కొందరిని సమీకరించి కౌంటర్ ఉద్యమాన్ని కూడా సాగిస్తున్నారు. ఒకవైపు కాపులను బీసీలలో చేర్చాలన్న తమ విధానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతూనే, మరోవైపు లోపాయికారీగా బీసీ నేతలతో వ్యతిరేక ప్రకటనలు చేయిస్తున్నారు. వారితో లోపాయికారీగా కౌంటర్ ఉద్యమాన్ని ప్రారంభించేటట్టు చేసి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. తునిలో జరిగిన రైలు దహనం సంఘటనకు ముద్రగడను బాధ్యుడిని చేయడంతో పాటు, ఆయనను ఏనాడూ కాపు, బలిజల హక్కుల కోసం పాటుపడని స్వార్థపరునిగా చిత్రించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా నుంచి ప్రత్యేక ప్యాకేజీకి రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ, కేంద్ర మంత్రిమండలి నిర్ణయాల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. ఈ అంశంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ, తక్షణం ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ ఒక దశలో టీడీపీ, బీజేపీయేతర పార్టీలన్నీ ఉద్యమం చేశాయి. దీనితోనే ఆ అంశం ప్రజలలో సెంటిమెంట్‌గా బలపడింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నలుగురు వ్యక్తులు ఆత్మార్పణ చేసుకున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అప్రమత్తమై తాను కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించబోతున్నట్టు ప్రజ లందర్నీ నమ్మిస్తూ వచ్చి చివరకు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీయే మేలు అని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదంటూ ప్లేట్ ఫిరాయించారు. రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’రాకపోవడానికి బీజేపీయే కారణమంటూ పరోక్ష ప్రచారాన్ని నిర్వహించారు. ‘మద్యపాన వ్యతిరేక ఉద్యమం’రాకుండా కౌంటర్ ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన ‘దశలవారీ మద్యపాన నిషేధం’ హామీ, బెల్ట్ షాపులను రద్దు చేస్తూ ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి చేసిన ‘తొలి సంతకం’ హామీలు మూడున్నర సంవత్సరాలుగా ఆచరణకు నోచుకోలేదు. ఇంకా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నూతన మద్య విధానం’లో భాగంగా అన్ని పట్టణాల్లో జనావాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు అవుతున్నాయి. దీని మీద మహిళల ఆగ్రహాన్ని గ్రహించిన బాబు దానికీ ఓ కౌంటర్ వదిలారు. ‘రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు ఉండేందుకు వీల్లేదు’ అంటూ మౌఖికమైన ఆదేశాలు జారీ చేశారు. దానికి బ్రహ్మాండమైన ప్రచారం కల్పిం చారు. సీఎం ఆదేశాలు అమలు జరిగినట్లు, బెల్ట్ షాపులు తొలగిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపుల్ని తొలగించి ఉంటే మద్యం అమ్మకాలు తగ్గి ఉండాలి. కానీ ‘సీఎం కోర్‌డాష్ బోర్డు’లోని వివరాల ప్రకారం 2016 ఆగస్టు మాసంలో మద్యం అమ్మకాల విలువ రూ. 1,019.78 కోట్లు ఉండగా, 2017 ఆగస్టు మాసానికి ఆ మొత్తం 1,195.59 కోట్లు. అంటే ఆదాయంలో వృద్ధిరేటు 17.24 శాతం. సీఎం ఆదేశాలు అమలు జరిగి రాష్ట్రంలో బెల్ట్ షాపు ఒక్కటీ లేనట్లయితే అమ్మకాలు తగ్గాలి కదా? మరి ఎలా పెరిగినట్లు? పోలవరాన్ని అడ్డుకుంటున్నదెవరు? పోలవరం ప్రాజెక్టును 2018 నాటికల్లా పూర్తి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చంద్రబాబునాయుడు పలు వేదికల నుంచి చెప్పారు. ఎప్పుడైతే తమ కాంట్రాక్టర్ ఆ పనుల్ని సకాలంలో చేయలేకపోతున్నారని గ్రహించారో.. కాంట్రాక్టర్‌పై వేటు వేయకుండా పనులన్నీ విభజించి నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పి.. 2018 నాటికి తొలి దశæ నిర్మాణం పూర్తి కాబోతున్నదని మాట మార్చారు. తాజాగా, ప్రాజెక్టు తొలిదశ కూడా 2018 నాటికి పూర్తి కావడం సాధ్యం కాదని తేలిపోవడంతో ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో సహా ప్రతిపక్షాలు ఎత్తిచూపుతూ, బహిరంగ చర్చకు రావాలని సవాలు చేస్తుంటే ఆత్మ రక్షణలో పడిన ప్రభుత్వం ఎలా సమర్థించుకోవాలో తెలియక ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని కౌంటర్ ఎటాక్ చేస్తున్నది. పాఠాలు నేర్చుకోని ‘బాబు’ 1995–2004 మధ్య చంద్రబాబు ప్రజల ఆకాంక్షలు, ఆక్రందనలు గుర్తించకుండా, సహచర పార్టీ నేతల సలహాలు, హితవులు పాటించకుండా ప్రపంచ బ్యాంక్ ఎజెండాను అమలు చేసుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసి అవి ఉద్యమాలుగా రూపుదిద్దుకుంటే వాటిపట్ల సానుకూల వైఖరితో విధానాలను సమీక్షించుకొని అనుగుణ్యమైన సవరణలు చేసుకోకుండా సాచివేత విధానాలను అమలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఎగసిన ఉద్యమంపై బషీర్‌బాగ్ సాక్షిగా పోలీసు తూటాలను ప్రయోగించారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుందని కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందంటూ ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. తన హయాంలోనే తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి సాధించిందంటూ హైదరాబాద్‌లోని సైబ రాబాద్ అభివృద్ధిని తన ఖాతాలో చూపించాలని విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు అలిపిరిలో తనపై నక్సలైట్లు దాడి చేసినప్పుడు దానిని ప్రభుత్వ వైఫల్యంగా అంగీకరించకుండా ఏకంగా అసెంబ్లీని రద్దు చేసి నక్సలిజానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు అంటూ దానిని ప్రధాన ఎన్నికల అస్త్రంగా మార్చి భంగపడ్డారు. చరిత్ర పునరావృతమైనట్లుగా, సీఎం బాబు ప్రస్తుతం రాష్ట్రంలో ఎగసిపడుతున్న పలు ప్రజా ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న సంఘాలలో చీలికలు తెస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలలో చీలి కలు తెచ్చిన తెలుగుదేశం పార్టీ చివరకు జర్నలిస్ట్ సంఘాలలో సైతం పార్టీ పరంగా చీలికలు తేవడం గమనార్హం. తాజాగా, డబ్బుతో అధికార దుర్వినియోగంతో లభించిన నంద్యాల గెలుపును సీఎం చంద్రబాబు తన విధానాలకు, అభివృద్ధి నమూనాకు ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించుకుంటూ ప్రజాస్వామ్యానికి ఊపిరి అయిన ప్రజా ఉద్యమాలను మరింతగా అణచివేసే ప్రమాదం కనబడుతున్నది. కౌంటర్ ఉద్యమాలవల్ల తాత్కాలిక విజయాలు దక్కవచ్చు. అంతిమంగా ప్రజా చైతన్యం ముందు తలవంచాల్సిందే. వ్యాసకర్త సి. రామచంద్రయ్య, మాజీ ఎంపీ మొబైల్ : 81069 15555 -
ఎస్సీ వర్గీకరణ బిల్లు వద్దు
కేంద్ర మంత్రి అఠావలేను కోరిన మాలమహానాడు సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని కేంద్ర మంత్రి రాందాస్ అఠావలేను మాలమహానాడు నేతలు కోరారు. ఆదివారం అఠావలేను ఢిల్లీలో కలుసుకున్న ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. వర్గీకరణపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందని, ఇది ఇప్పట్లో తేలే అంశం కాదని ఆయన తమతో చెప్పారని చెన్నయ్య తెలిపారు. వర్గీకరణను అడ్డుకోండి: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీ రవీంద్రబాబును తెలంగాణ మాలమహానాడు నేతలు కోరారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పసుల రాంమూర్తి తదితరులు ఆదివారం ఆయనను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. -
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సహకరించకండి
కుంతియాకు మాలమహానాడు వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాను మాలమహానాడు నేతలు కోరారు. అంతేకాకుండా వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కుంతియాను ఢిల్లీలో మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు కలసి వినతిపత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి వర్గీకరణ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కుంతియా హామీ ఇచ్చినట్టు చెన్నయ్య తెలిపారు. మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. సంఘం అధ్యక్షుడు రాంమూర్తి మాట్లా డుతూ.. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే సహిం చబోమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా బిల్లు పెట్టండి
కేంద్రమంత్రి అథావాలేను కోరిన సంఘం నేతలు సాక్షి, న్యూఢిల్లీ: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలేను అఖిల భారత క్రిస్టియన్ల సమాఖ్య కోరింది. ఈ మేరకు సంఘం నేతలు శ్రీమంతులు, రాజేశ్‌బాబు తదితరులు శుక్రవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుంటే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు. -
‘ప్రజాపాలనలో టీఆర్ఎస్ విఫలం’
జనగామ అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్ర జాపాలనలో పూర్తిగా విఫలమైందని జాతీ య ఎస్సీ రిజర్వేషన్ పరిరిక్షణ సమితి (ఎన్‌ఎస్‌సీఆర్‌పీఎస్) జాతీ య అధ్యక్షుడు కర్నె శ్రీశైలం అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉ మ్మడి వరంగల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయని, సర్టిఫికెట్ల జారీలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయ 0ని ఆరోపించారు. క్రైస్తవమతంలోకి మారిన దళితులకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈనెల 30న జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ సీబీ వెంకటేష్, జిల్లా, పట్టణ అధ్యక్షులు స్వామి, సాయికృష్ణ, రాజు, మహేష్ పాల్గొన్నారు. -
అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించాం
ఎస్సీ వర్గీకరణపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ వర్గీకరణ అంశంపై జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన సిఫారసులపై ఈ అంశంలో ప్రధాన భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర మంత్రి విజయ్ సాంప్లా లోక్‌సభకు తెలిపారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు. -
ఎస్సీ రుణాల దరఖాస్తులకు ఆహ్వానం
కాకినాడ సిటీ : జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి స్వయం ఉపాధి కల్పనకు రుణాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ వి.డేవిడ్‌రాజు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం 16,779 మందికి వివిధ పథకాల ప్రకారం ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించినట్టు తెలిపారు. అర్హులైన ఎస్సీ వర్గాల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు కార్యాలయ పనివేళల్లో 0884–2362196కు సంప్రదించాలని ఆయన కోరారు. -
‘పల్లె’కు వర్గీకరణ సెగ
ఓడీ చెరువు : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్లే ‘పల్లె’ రఘునాథరెడ్డికి ఎస్సీ వర్గీకరణ సెగ తగిలింది. శనివారం ఓడీ చెరువు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి పల్లె పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు తంగేడుకుంట గ్రామం వద్ద రోడ్డుకడ్డంగా బైఠాయించి, నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులను రోడ్డుపై నుంచి తొలగించేందుకు పోలీసులను పల్లె ఆదేశించారు. ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐలు ఇస్మాయిల్, శివప్రసాద్ సిబ్బందితో కలిసి ఎమ్మార్పీఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి వర్గీకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బేకరీ గంగాధర్, కాలేజ్ తిప్పన్న, జింక సుంకన్న, రామయ్య మాట్లాడుతూ మందకృష్ణమాదిగ చేపట్టిన కురుక్షేత్ర యాత్రను అడ్డుకొని మాదిగలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సుమారు రెండు గంటల పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డుపై భైఠాయించడంతో ఎట్టకేలకు ఆలస్యంగా ఎమ్మెల్యే పల్లె తంగేడుకుంటకు వచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్లను విన్న ఎమ్మెల్యే పల్లె సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామ్మోహన్, ఆనంద్, లక్ష్మీనారాయణ, రమణ, ఎర్రదొడ్డెప్ప, గంగాద్రి, కిష్ట, వీరప్ప, నాగభూషణ, డీలర్ రమణ, పలకగంగన్న, వెంకటరమణ, గంగులప్ప మహిళలు పాల్గొన్నారు. -
కేసీఆర్‌పై మందకృష్ణ ఎందుకు పోరాడటం లేదు..
అమరావతి: తెలంగాణలో దళితుల సమస్యలపై , దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్ పై మందకృష్ణ ఎందుకు పోరాటం చేయడం లేదని ఏపీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ వచ్చిన తర్వాతే మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత వచ్చిందన్నారు. టీడీపీ మాత్రమే మాదిగలకు న్యాయం చేస్తుందని తెలిపారు. వర్గీకరణ అంశం మా చేతుల్లో లేదని , చట్టప్రకారం దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మద్యం అమ్మకాల్లో ఎటువంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారని వివరించారు. సుప్రీం కోర్టు నిబంధనల మేరకే షాపులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మద్యం షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టొద్దని, కేవలం రిజిస్ట్రేషన్స్ లో పేర్లు పెట్టుకోవచ్చునని సూచించారు. మహిళలకు ఎక్కడైనా సమస్యలుంటే తనకు నేరుగా 9951314101 అనే నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. మద్యం కల్తీకి పాల్పడితే టాడా కేసులు పెడతామని హెచ్చరించారు. -
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
భద్రాచలంటౌన్: ఎన్నో ఏళ్లగా ఎదుగూబొదుగూ లేని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి వారికి రిజర్వేషన్ ఫలాలను అందించాలని ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొత్తపల్లి శ్రీలక్ష్మీ డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండుతో హైదరాబాద్ నుంచి వచ్చిన నాయకులు. స్థానికులతో కలిసి ఇక్కడ పాదయాత్ర ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ...రజకులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్ని విషయాన్ని గుర్తు చేశారు. వారిన ?ఎస్సీ జాబితాలో వెంటనే చేర్చాలని కోరారు. తెలంగాణా సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధీరత్వంతోనే ఉద్యమం ప్రారంభమైందని అన్నారు. ఆమె పేరును ఏ జిల్లాకు పెట్టకపోవడం బాధాకరమన్నారు. ట్యాక్‌బండ్‌పై అయిలమ్మ విగ్రహం పెట్టిస్తానన్న కేసీఆర్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని విమర్శించారు. 31 జిల్లాల నుంచి చేపట్టిన పాదయాత్రలు అక్టోబర్ 15న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభతో ముగుస్తాయన్నారు. రజకుల సమస్యలను పరిష్కరించకపోతే కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. జనగాం జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో సాధన కమిటీ సభ్యులు ఆంజనేయులు, సత్తు వెంకటేశ్వర్లు, రాజకొండ వెంకన్న, భగవాన్, దామర్ల రేవతి, నిమ్మల రామకృష్ణ, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
► ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో రూ.40.15 కోట్లతో 2,500 యూనిట్లు మంజూరు ► 31వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కొత్తగూడెంరూరల్: జిల్లాలోని ఎస్సీ యువతీ, యువకులకు 2017–18 ద్వారా బ్యాంకు రుణాలు పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎస్సీ కార్పొరేషన్ కోసం ఆన్లైన్ చేసుకుని ఉంటే ఆ దరఖాస్తును రెన్యువల్ చేసుకోవాలి. జిల్లాలో 2,542 యూనిట్లకు గాను రూ.40.15 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇందులో రూ.లక్ష రుణానికి రూ.80 వేలు సబ్సిడీ ఇస్తుండగా, రూ.2 లక్షల రుణానికి రూ.70 వేలు సబ్సిడీ వర్తిస్తుంది. రూ.2 లక్షలు పైబడిన యూనిట్‌కు రూ.60 వేలు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షలకు మించకుండా బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు గలవారు అర్హులుగా ప్రకటించారు. ఈనెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్‌కార్డు, సాంకేతిక విద్యార్హత జతపర్చి పట్టణానికి చెందిన అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్‌కు, మండలాల అభ్యర్థులు ఎంపీడీఓకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తరువాత, వాటికి సంబంధించి జిరాక్స్ పత్రాలు ఇవ్వాలి. జిల్లాలో జనాభా ప్రాతిపదికన నాలుగు మున్సిపాలిటీలు, ఇతర మండలాలకు యూనిట్ల కేటాయింపు రెండుమూడు రోజుల్లో జరగనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహేశ్వర్ తెలిపారు. గతంలో 2016–17కు సంబంధించిన యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని, త్వరలో వాటికి సంబంధించిన సబ్సిడీని ఎకౌంట్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్సీలు ఉపయోగించుకుని స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మహేశ్వర్ పేర్కొన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు చొరవ చూపండి
వెంకయ్య నాయుడికి కడియం విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల ఆమోదానికి చూపిన చొరవను ఎస్సీ వర్గీకరణలోనూ చూపాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఎంపీ బి.వినోద్‌కుమార్, తెలం గాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి,ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి మంగళవారం ఢిల్లీలో ఆయన.. వెంకయ్యను కలిశారు. ఏకీకృత సర్వీసుల ఆమోదానికి చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏకీకృత సర్వీసుల అమలుకు ఒక కమిటీ వేశాం. భవిష్యత్తులో ఎలాంటి న్యాయ సమస్యలు లేకుండా పదోన్నతులు కల్పిస్తాం. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబం« దించి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దానిని కేంద్రానికి పం పాం. ఈ విషయంలోనూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని వెంకయ్య నాయుడిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు..’ అని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు వికృత చర్యలకు నిరసనగా..’
విజయవాడ: మాదిగలకు పెద్దకొడుకుగా ఉంటానన్న చంద్రబాబు మాదిగలకు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై బెజవాడ కనకదుర్గమ్మను సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మాదిగల కోసం ఏం చేశారో దుర్గమ్మ సన్నిధిలో బాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మాదిగల ఉద్యమాన్ని అణచివేయడం సిగ్గుచేటన్నారు. వర్గీకరణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని జిల్లాల్లో పర్యటిస్తుంటే అక్రమ అరెస్ట్‌లకు పాల్పడటం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. 23 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమని వాపోయారు. చంద్రబాబుకు ఓట్లు వేసింది కాపులు, దళితులేనని అన్నారు. ‘మా ఓట్లతో గెలిచి అటు ముద్రగడ పాదయాత్రను, ఇటు మా పర్యటనను బాబు అడ్డుకుంటున్నారు. ఆయనను ఓడించడానికి కృషిచేసిన వారికేమో పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. గెలిపించినవారిని విస్మరిస్తున్నారు. చంద్రబాబు వికృత చర్యలకు నిరసనగా దేవాలయాల యాత్ర పేరుతో పర్యటిస్తున్నా పోలీసులు నిఘా పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోంద’ని మండిపడ్డారు. జూలై 7న అమరావతిలో తలపెట్టిన కురుక్షేత్ర సభకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా నిర్వహించి తీరుతామని మందకృష్ణ స్పష్టం చేశారు. -
వెంకయ్యనాయుడు తీరు దారుణం
ఆచంట : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవ చూపడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ధ్వజమెత్తారు. ఆచంట మండలంలోని దళిత ప్రజాప్రతినిధులను స్థానిక రామేశ్వరస్వామి సత్రంలో గురువారం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేష్ మాట్లాడుతూ కనీసం వార్డు సభ్యునిగా కూడా గెలవలేని వెంకయ్యనాయుడుకు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని కోరిన ఆయన ఇప్పుడు మాటమార్చి తన నైజాన్ని బయటపెట్టారన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను మానుకోకపోతే వెంకయ్యనాయుడుకు, తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడతామన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమానికి ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు ప్రధాన కార్యదర్శి కొల్లాపు వేణు, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, కోశాధికారి ఏనుగుపల్లి చంద్రశేఖర్, ఆచంట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిసరెళ్ల శ్రీనివాస్, పోడూరు మండల అధ్యక్షుడు నేలపాటి రాజబాబు, ఆచంట, పెనుగొండ మండలాల అధ్యక్షులు రావి నాగరాజు, బల్లాశ్రీనివాస్, పోడూరు మండల ఉపాధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, ఆచంట యువజన విభాగం అధ్యక్షుడు కట్టా శిరీష, సర్పంచ్ బీర తిరుపతమ్మ, ఎంపీటీసీ కట్టా జాన్‌మోషే, జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్ పాల్గొన్నారు. -
దళిత ఉద్యోగిపై అటవీ శాఖ అధికారి వేధింపులు
కార్యాలయంలోనే లైంగికదాడికి యత్నం ప్రాణహాని ఉందంటూ భయాందోళన అర్బన్ ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు సాక్షి, రాజమహేంద్రవరం : తల్లి లేని ఓ దళిత ఉద్యోగినికి అండగా ఉండాల్సిన ఆ అధికారి ఆమెపై కన్నేశాడు. తండ్రి వయసు ఉన్న అతడు ఏడాదిగా లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. భవిష్యత్ కోసం, కళ్లు లేని తండ్రి కోసం.. ఆ ఉద్యోగిని బాధను భరించింది. చివరకు ప్రాణహాని ఉందన్న భయంతో మంగళవారం అర్బన్ జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. రాజమహేంద్రవరం డివిజన్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రావి మరియమ్మ తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. కొత్తపల్లి జోన్ ఫీల్డ్ స్టాఫ్ ప్లాన్టేషన్ మేనేజర్ మల్లి వెంకటేశ్వరరావు వేధింపులను బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులకు వెల్లడించింది. ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ==== పశ్చిమగోదావరి జిల్లా పోడురు మండలం అప్పన్నచెర్వు గ్రామానికి చెందిన మరియమ్మకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి కి కళ్లు లేవు. దాతలు, బంధువుల సహకారంతో ఎంబీఏ పూర్తి చేసింది. రాజమహేంద్రవరం డివిజన్ అటవీ అభివృద్ధి కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం సంపాదించింది. కార్యాలయంలో ముఖ్య అధికారిగా ఉన్న కొత్తపల్లి జోన్ ఫీల్డ్ స్టాఫ్ ప్లాంటేషన్ మేనేజర్ మల్లి వెంకటేశ్వరరావు గతేడాది నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తున్నారు. ఆమెకు ఎవరి అండ లేదన్న భావనతో, మాట వినకపోతే జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించేవారు. ఫోన్లో అసభ్యకర మాటలతో హింసించేవారు. ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయంతో ఆమె ఇంతకాలం భరిస్తూ మానసికంగా కుంగిపోయింది. కూతురులాంటి తనను తప్పుడు ఉద్దేశంతో చూడవద్దని ఆమె ఎన్నిసార్లు వేడుకున్నా అతడు వినిపించుకోలేదు. ఈ నెల 3వ తేదీన... ఈ నెల 3న డివిజనల్ మేనేజర్ క్యాంప్‌నకు, కొంతమంది ఉద్యోగులు ఆఫీసు పనిపై బయటకు వెళ్లారు. కంప్యూటర్ ఆపరేటర్ చెప్పడంతో ఆఫీసులో ఉండిపోయిన ఆమెపై అతడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ఎదురుతిరగడం, ఎవరో వస్తున్న వినికిడి రావడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారాన్ని ఆమె తెలివిగా సెల్ఫోన్లో రికార్డు చేసింది. అయితే ఈ ఘటనతో తీవ్ర భయాందోళన చెందిన మరియమ్మ తనకు వెంకటేశ్వరరావు నుంచి ప్రాణహాని కలుగుతుందోనని బుధవారం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారికి ఫిర్యాదు చేశారు. విచారించి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకుంది. ఉన్నతాధికారులు మల్లి వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. -
‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’
-
‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’
హైదరాబాద్: వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అన్నివర్గాలు సంతోషంగా ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వ్యక్తిగత ఆహారపు అలవాట్లపై తమ ప్రభుత్వం జోక్యం చేసుకోదని, కొన్ని నియమ నిబంధనలను మాత్రమే సవరించిందని చెప్పారు. గోవధపై విమర్శలు సరికావన్నారు. ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. జమ్మూకశ్మీర్‌కు రూ. 62 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. -
చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి: మందకృష్ణ
విశాఖపట్టణం: ఏపీ సీఎం చంద్రబాబుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడా, రాష్ట్ర అధ్యక్షుడో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల జరిగిన మహానాడులో విశాఖ సాక్షిగా చంద్రబాబు మాదిగలను మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడి మహానాడులో తీర్మానం పెట్టకపోవడం, మాదిగలను మోసం చేయడమేనన్నారు. మాలలను అందలం ఎక్కించి మాదిగలను విస్మరిస్తున్నారని విమర్శించారు. వర్గీకరణకు కట్టుబడక పోతే చంద్రబాబు మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. జూలై 7వ తేదీన అమరావతిలో పదిలక్షల మందితో కురుక్షేత్ర మహాసభ జరుపుతామని వెల్లడించారు. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
అమిత్‌షాకు ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ వినతి నల్లగొండ టౌన్: ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలని కోరారు. -
పార్లమెంట్‌కు బిల్లు చేరకుండా కుట్ర
మంద కృష్ణమాదిగ కావలిఅర్బన్: ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌కు చేరకుండా వ్యతిరేక శక్తులు తీవ్రంగా కుట్ర పన్ను తున్నాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. జూలై 7న అమరావతిలో జరగనున్న కురుక్షేత్ర మహాసభ సమీకరణలో భాగంగా గురువారం రాత్రి స్థానిక అరుంధతీయపాళెంలో సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఈ జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. వర్గీకరణకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయన్నారు. ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుందన్నారు. వర్గీకరణ అంశం ఢిల్లీలో అజెండాగా మారిందంటే అందుకు వెంకయ్యనాయుడి పాత్రే ప్రధానమన్నారు. మాదిగ జాతిని ముంచైనా మాల జాతిని పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బుల్లా డేవిడ్ మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ నాయకులు దేవరపల్లి భిక్షాలు మాదిగ, పరుసు రమేష్ మాదిగ, సీనియర్ నాయకులు గొల్లపల్లి శ్రీనివాసులు మాదిగ, రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ పాల్గొన్నారు. -
ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా వెంకటేశ్వర్లు
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా పెరిక వెంకటేశ్వర్లు రెండోసారి నియమితులయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా సోమవారం నియామక పత్రాన్ని వెంకటేశ్వర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి పాటు పడుతానని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ విభాగం చైర్మన్ ఆరెపల్లి మోహన్, సహకరించిన పార్టీ సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎస్సీ వర్గీకరణకు పాలకులే అడ్డు!
- ఉస్మానియాలో జరిగిన మేధావుల సభలో ప్రకాశ్ అంబేడ్కర్ - రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ ఆమోదయోగ్యమే - దళితులు రాజకీయ శక్తిగా ఎదగాలి - లేకుంటే మనువాద భావజాల ఆధిపత్యం వస్తుందని వ్యాఖ్య హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగ ప్రకారం ఆమోదయోగ్యమేనని, కానీ పాలకులే దానికి అడ్డు అని డా. బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. దళితులు రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మాదిగ మేధావుల వేదిక (ఎంఎంవీ) ఆధ్వర్యంలో మేధావుల సంఘీ భావ మహాసభ జరిగింది. కార్యక్రమానికి ఓయూ అధ్యాపకుడు డాక్టర్ కాశీం అధ్యక్షత వహించగా.. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశ్ అంబేడ్కర్ ప్రసంగించారు. రాజ్యాంగపరంగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలకు విస్తరించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలే అడ్డంకి అని... అధికారంలో లేనప్పుడు మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చాక అడ్డు పడుతున్నాయని మండిపడ్డారు. సమస్యల్ని పట్టించుకునే దిక్కు లేదు ప్రజాసమస్యలను బలంగా వినిపించేందుకు దేశంలో గట్టి ప్రతిపక్షం లేకుండ పోయిందని.. ప్రస్తుతం ప్రతిపక్షాల పాత్ర నామమాత్రమేనని ప్రకాశ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు మనుగడ సాధించలేని పరిస్థితి కనిపిస్తోందని.. పార్లమెంట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ లభిస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రమాదముందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రిజర్వేషన్లు రద్దు చేసి మనువాద భావజాల సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందువల్ల దళిత బహుజనులు రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అన్ని పార్టీల మద్దతు ఉందని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును పెట్టి ఆమోదింప జేయాలని మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. వర్గీకరణ కోసం వేసిన అన్ని కమిషన్లు దానికి అనుకూలంగానే నివేదికలను సమర్పిం చాయని చెప్పారు. న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు చట్టబద్ధత కల్పించాలని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఉన్నట్లు ఎస్సీలలో వర్గీకరణ ఉంటే తప్పేమీ లేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. మాదిగల పోరాటానికి మాలలు కూడ అండ గా ఉండాలని ఉసా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ పత్రికల సంపాదకులు శ్రీనివాసరెడ్డి, వీరయ్య, కె.శ్రీనివాస్, ప్రొ.నాగేశ్వర్, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రభుత్వ మాజీ సీఎస్ కాకి మాధవరావు, విమలక్క, గద్దర్, గోరటి వెంకన్న, ప్రొ.ముత్తయ్య, రచయిత నందిని సిధారెడ్డి, కవి దేశపతి శ్రీనివాస్, ఐఏఎస్ అధి కారి విద్యాసాగర్, డాక్టర్ కాలువ మల్లయ్య, సూరేపల్లి సుజాత, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ, డాక్టర్ వరంగల్ రవి, మాదిగ అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎస్టీ విద్యార్థినులకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు
- ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం - ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇప్పటికే ఎస్సీ విద్యార్థినుల కోసం జారీ చేసిన 30 డిగ్రీ కళాశాలల తరహాలో ఎస్టీ విద్యార్థినులకు డిగ్రీ రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మంగళ వారం ప్రగతిభవన్‌లో సంబంధిత అధికారులతో సీఎం సమీ క్షించారు. 2017–18 విద్యా సంవత్సరం నుంచే ఈ కాలేజీల ను ప్రారంభించాలని సూచించారు. ఎన్ని డిగ్రీ రెసిడెన్షియల్స్ ప్రారంభించాలి, ఎక్కడెక్కడ ఏర్పాటుకు అవకాశాలున్నా యనే అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. మెస్ చార్జీల పెంపుపై కృతజ్ఞతలు విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడం పట్ల వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పలు బీసీ సంఘాల నేతలు మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎర్ర సత్యనారాయణ, సర్పంచుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూమన్న యాదవ్, బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణుడు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు. మెస్ చార్జీలు పెంచడం వల్ల విద్యార్థులకు మంచి ఆహారం లభిస్తుందని, రేపటి పౌరులు చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఇక విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచినందుకు ఎంబీసీల సంఘం సీఎంను అభినందించింది. సంఘం అధ్యక్షుడు కాళప్ప, నాయకులు సూర్యారావు, ప్రేమ్ లాల్, శేఖరాచారి, నర్సింగరావు, అంతయ్య, సత్యం వంశిరాజు, విష్ణువర్థన్ రాజు, శ్రీనివాసరావు, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. శ్రీనివాసరెడ్డి తదితరులతోపాటు ఎంపీ బాల్క సుమన్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థి నాయకులు, విద్యార్థులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ‘హోటళ్ల’ సమస్యలు తీర్చండి హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు వెంకటరెడ్డి నాయకత్వంలో పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ను కలసి తమ సమస్యలు విన్నవించారు. కేంద్రం అమలు చేస్తున్న పన్నుల విధానంతో హోటళ్ల నిర్వహణ కష్టంగా ఉందని చెప్పారు. ప్రధాని వద్దకు తమ ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి సమస్యలు వివరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. -
‘వెంకయ్య పంచెలు ఊడదీసి తరుముతాం’
నెల్లూరు(సెంట్రల్): ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ, మాలల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పంచెలు ఊడదీసి తరుముతామని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల సుదర్శన్ హెచ్చరించారు. నెల్లూరులో ఆదివారం జరిగిన మాల మహానాడు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాల, మాదిగల మధ్య కావాలనే వర్గీకరణ పేరుతో వెంకయ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాలలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తు న్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల మొత్తాన్ని టీడీపీ నాయకులకే ఇస్తున్నారని విమర్శించారు. మాలల ఓట్లతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు, వెంకయ్యలకు బుద్ధి చెబుతామన్నారు. నెల్లూరులో జూలై 25న పెద్ద ఎత్తున మాలల సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వర్ణా వెంకయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణను మరిచిపోయారా?
సీఎంకు రేవంత్‌రెడ్డి లేఖ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్ష బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకుపోతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ విషయం మరిచిపోయారా అని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాలయాపన ద్వారా వర్గీకరణను మరిపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని, ప్రస్తుత శాసనసభ సమావేశాలలోపే దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సీఎంకు శుక్రవారం రేవంత్ బహిరంగ లేఖ రాశారు. -
‘మాలలను అణచివేసే కుట్ర’
హైదరాబాద్: రాష్ట్రంలో మాలలను అణిచివేసేందుకు చూస్తున్నారని, అందులో భాగంగానే మాలల పోరు మహాగర్జన సభకు అనుమతి నిరాకరించారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమితి అధ్యక్షుడు ఆవుల బాలనాథం, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని మాల సంఘాలను ఒక్కతాటి పైకి తెచ్చి.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మాలలను ఐక్యం చేశామన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్లో ఈ నెల 26న భారీ బహిరంగసభ ఏర్పాటుకు నిర్ణయిం చామని.. అయితే ప్రభుత్వం అనుమతి నిరాకరిం చిందన్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత నిర్వహణకు అనుమతి అడిగినా.. నిరాకరించడం మాలలపై ప్రభుత్వానికి ఉన్న కక్ష సాధింపు దోరణిని తెలియజేస్తోందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మాలలు, మాదిగలను పిలిపించి వారి సమస్యలు తెలుసుకునేవారని, ఇద్దరికీ న్యాయం జరిగేలా చూసేవారని, కాని ప్రస్తుతం రాచరిక ప్రభుత్వం, నియంత ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఒక పక్షం వారికి తొత్తుగా మారి మరో వర్గం వారిని అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ అంశాన్ని ఎవ్వరు లేవనెత్తినా రాష్ట్రం అగ్నిగుండంలా మారుస్తామని హెచ్చరించారు. ప్రస్తుతానికి సభ నిర్వహణను వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి జి.నర్సింగరావు, కార్యదర్శి బిర బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణ, నగర అధ్యక్షుడు జంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే ఎదుగుదల
‘మాలల రణగర్జన’లో అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ పెదకాకాని(పొన్నూరు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి సమష్టిగా పోరాటాలు చేయడం ద్వారానే మాలలు రాజకీ యంగా ఎదుగుతారని అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అన్నారు. గుంటూరుజిల్లా పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఆది వారం మాలల రణగర్జన జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ‘చలో అమరావతి’ పిలుపులో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బహిరంగసభలో భీమ్రావ్ మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాలలు రాజకీయ శక్తిగా ఎదగడానికి ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. మాలల హక్కుల సాధనకోసం సమతా సైనికదళ్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. మాలమహా నాడు రాష్ట్ర నాయకుడు మల్లెల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ఎస్సీ వర్గీకరణ కుట్రను తెలియజేస్తూ కారం శశిధర్, గౌరీశ్వరరావు సంపా దకులుగా రూపొందించిన పుస్తకాన్ని భీమ్రావ్ ఆవిష్కరించారు. -
బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి
-
బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి: పెద్దిరెడ్డి
అమరావతి: రాష్ట్రంలోని బుడగ జంగాలను ఎస్సీల్లోకి చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు లక్షల మంది బుడగ జంగాలు ఉన్నారని... సంచార జీవనం గుడుపుతున్న వీరందరినీ పక్క రాష్ట్రాల్లో ఎస్సీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలోనూ వారిని ఎస్సీలుగానే పొందుపరిచారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో కమిటీల పేరుతో జాప్యం చేస్తోందని వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని పెద్దిరెడ్డి కోరారు. -
త్యాగాలు వృథా కానివ్వం: మంద కృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు వృథా కానివ్వబోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల సంస్మ రణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎమ్మార్పీఎస్ కార్యా లయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీ కరణకు చట్టబద్ధత కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, త్వరలో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందనుందని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా కొనసాగించాలి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వికలాంగుల సంక్షేమ శాఖను విలీనం చేయొద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ కోరారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. సీఎస్‌ను కలిసిన వారిలో వికలాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తదితరులున్నారు. -
ఎస్సీ వర్గీకరణ కోరుతూ హైకోర్టులో పిటిషన్
విచారణకు స్వీకరణ కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలోని జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం, ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలై న పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ఆదేశించారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. బీసీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయక పోవడం వివక్ష చూపడమేనని, అందువల్ల ఎస్సీ వర్గీకరణకు 2008లో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, 1999లో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్లు ఇచ్చిన నివేదికలను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదిగ హక్కుల పరిరక్షణ సేవా సమితి సంయుక్త కార్యదర్శి రాయవరపు చిరంజీవరావు, మాదిగ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వ రరావులు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మంగళ వారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్ అనందకుమార్ వాదనలు వినిపిస్తూ.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం సెక్షన్ 3(4) కింద కమిషన్ నివేదికలు సమర్పించిన 6 నెలల్లోపు వాటిని పార్లమెంట్ ఉభయ సభల ముందుం చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నివేదికను అమలు చేసేందుకు కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించా రు. అందువల్ల ఎస్సీ వర్గీకరణ అవసరమని, జస్టిస్ ఉషా మెహ్రా, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ల నివేదికలను అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివా దులుగా ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. -
ఎన్నికల తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లు
కేంద్ర మంత్రి వెంకయ్య హామీ ఇచ్చారు: మంద కృష్ణ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ జి.కిషన్‌రెడ్డితో కలసి వెంకయ్య నాయుడుతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరగా.. మంత్రి పైవిధంగా స్పందించినట్లు మంద కృష్ణ చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొంత బిజీగా ఉన్నామని, ఎన్నికలు పూర్తయిన వెంటనే వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈలోపు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని, అఖిలపక్షంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లాలని వెంకయ్య సూచించినట్లు చెప్పారు. -
వర్గీకరణపై నివేదికలను అమలు చేయాలి
హైకోర్టులో మాదిగ సంఘాల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ నిమిత్తం జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలోని జాతీయ ఎస్సీ కమిషన్ 2008లో ఇచ్చిన నివేదికను, 1999లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదికలను అమలు చేసేలా కేంద్రంతోపాటు, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం వివక్ష చూపడమే నంటూ మాదిగ హక్కుల పరిరక్షణ సేవా సమిటీ సం యుక్త కార్యదర్శి రాయవరపు చిరంజీవరావు, మాదిగ రిజర్వేషన్ సా«ధన సమితి అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వ రరావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నాం
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం కృషి చేస్తోందని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాకుడు మందకృష్ణ మాదిగ బుధవారం కేంద్ర మంత్రితో సమావేశమై వర్గీకరణపై చర్చించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కులాలను ముందుకు తీసుకురావాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాలన్న స్పష్టత బీజేపీకి ఉందని వెంకయ్య తెలిపారు. వర్గీకరణ అమలు విషయంలో తన వంతు కృషి చేస్తున్నానని మందకృష్ణకు హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వల్లే అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నందున ఎస్సీ వర్గీకరణ విషయంలో ఢిల్లీకి రావాలనుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలోని అఖిలపక్ష బృందానికి ప్రధాని అపాయింట్మెంట్ లభించలేదని వెంకయ్య వివరణ ఇచ్చారు. అపాయింట్మెంట్ రద్దు చేయడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. -
'ఆ ఇద్దరూ వాడుకుంటున్నారు'
హైదరాబాద్‌సిటీ: ఎస్సీ వర్గీకరణను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తమ రాజకీయ ప్రాయోజనాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. దళితుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటూ, దళితుల సంక్షేమం పై దోబూచులాడుతున్నాయని ఆరోపించారు. దళితుల సంక్షేమం పై ప్రభుత్వం శ్వేత పత్రం ఇచ్చెందుకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా దళితులకు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, వెంకయ్యల దుర్భుద్దే అఖిలపక్ష సమావేశం వాయిదాకు కారణమని అన్నారు. వీరిద్దరికి దళితులపై చిత్తశుద్ధి లేదన్నారు. వర్గీకరణపై ఇప్పటికే 90శాతం పనిని నాటి యూపీఏ ప్రభుత్వం పూర్తిచేసిందని తెలిపారు. వర్గీకరణపై ప్రధానితో మాట్లాడకుండా హైదరాబాద్‌కు వస్తే దళితుల ఆగ్రహాన్ని చవిచూస్తారని అన్నారు. -
రాష్ట్ర బీజేపీనే రద్దు చేయించింది...
• ప్రధాని అపాయింట్మెంట్ రద్దుపై జితేందర్‌రెడ్డి • ఇచ్చిన అపాయింట్మెంట్ను వెనక్కి తీసుకున్నారు సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షంతో ప్రధానిని కలిసేందుకు యత్నించగా.. తెలంగాణ బీజేపీ అపాయింట్మెంటును రద్దు చేయించిందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వా నికి తాము మద్దతుగా నిలుస్తున్నా ఏ మాత్రం సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘మాది కొత్త రాష్ట్రం. కేంద్రం నుంచి పూర్తి మద్దతు కావాలని మొదట్నుంచీ అడుగుతు న్నాం. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మేం సాయపడుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఈ దిశగా తగిన సూచనలు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను కూడా కేంద్రం అమలు చేయలేదు. హక్కుభుక్తంగా ఉన్నవాటినే మేం అడుగుతున్నాం. బయటి నుంచి ఒక్కటి అడగలేదు. చాలా బాధతో ఈ మాట చెబుతున్నాం. ప్రత్యేక హైకోర్టు ఇప్పటివరకు కాలేదు. ఎయిమ్స్ అడిగాం.. ఇవ్వలేదు. ఐఐఎం అడిగాం.. ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణ కోసం మా రాష్ట్రంలో ఉన్న డిమాండ్‌ను ప్రధాని దృష్టికి తెచ్చేందుకు అఖిలపక్ష సమావేశంతో వచ్చి కలవాలని మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగారు. అయితే అపాయింట్మెంటు ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్నారు. తెలంగాణ బీజేపీ ప్రధానికి చెప్పి ఈ అపాయింట్మెంట్ను రద్దు చేయించింది. విపక్షాలు మాపై ఎన్ని విమర్శలు చేసినా.. మేం కేంద్రానికి అనేక అంశాల్లో మద్దతుగా నిలిచాం. కానీ ఏదీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున మా శకటాన్ని కూడా ప్రదర్శించనివ్వడం లేదు. నోట్లరద్దును విపక్షాలు వ్యతిరేకించినా.. మేం మీకు మద్దతుగా నిలిచాం..’’ అని ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి చెప్పారు. వాయిదా పడి ఉండొచ్చు.. రద్దు కాలేదు: దత్తాత్రేయ ఎంపీ జితేందర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సమాధానం ఇచ్చారు. ‘‘జితేందర్‌రెడ్డి చెబుతు న్నదాంట్లో వాస్తవం లేదు. అపా యింట్మెంటును వ్యతిరేకించామ నడం సత్యదూరం. ఉమ్మడి రాష్ట్రంలోనే మేం ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికాం. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నాం. అపాయింట్మెంట్ వాయిదా పడి ఉండొ చ్చు. కానీ రద్దు కాలేదు. మేం వర్గీకరణకు మద్దతుగా ఉంటాం.. తెలంగాణకు కేంద్రం మద్దతుగా నిలుస్తోంది’’ అని చెప్పారు. దీనిపై జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇవి నా మాటలు కాదు. మీ పార్టీ నేతలు చెబితే పత్రికల్లో వచ్చిన సమాచారం అది. టీఆర్ఎస్కు మైలేజీ వస్తుందని భావించి అపాయింట్మెంట్ రద్దు చేయించామని బీజేపీ నేతలు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. దానికి మేం చింతిస్తున్నాం. మాకు కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి. పార్లమెంటరీ మంత్రి ఎప్పుడు అడిగినా కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాం’’ అని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 119 సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, డబుల్ బెడ్రూమ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్రం తగిన సాయం చేయాలని కోరారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. -
కుట్రతోనే ప్రధాని అపాయింట్మెంట్ రద్దు
పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీక రణ బిల్లును పార్లమెం ట్లో ప్రవేశపెట్టాలని కోరేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధం కాగా, చివరి క్షణంలో ప్రధాని అపాయింట్మెం ట్ రద్దు చేసుకోవడం వెనక ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాది గ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుట్ర ఉందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. వర్గీకర ణ ఇప్పుడే జరిగితే క్రెడిట్ అంతా టీఆర్ ఎస్‌కు దక్కుతుందన్న అక్కసుతో కుట్రలు జరిపి అపాయింట్మెంట్ రద్దు చేయించా రన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిర్ణయం తర్వాత మాదిగ లంతా టీఆర్ఎస్వైపు మొగ్గు చూపారని, వారంతా కేసీఆర్‌తో కలిసిపోతారన్న అక్కసుతో అపాయింట్ మెంట్ రద్దు చేయించారన్నారు. -
సీఎం కేసీఆర్‌ది ఓట్ల రాజకీయం
వైఎస్సార్సీపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి కుత్బుల్లాపూర్: ఎస్సీ వర్గీకరణ విషయంలో వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతు ఉంటుందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్సీల సంక్షేమానికి కృషి చేశారని ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ ముత్యపాగ నర్సింగ్‌రావు తన అనుచరులతో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి కలిసి జిల్లా కార్యాలయంలో బెంబడి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు, ఆ తరువాత సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ విషయంపై ఏ రోజూ మాట్లాడలేదని, తాజాగా అఖిలపక్షం పేరుతో హడావుడి చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ తెలంగాణలో బలపడుతోందన్నారు.ఏళ్ల తరబడి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాటలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, నేడు ఓట్ల రాజకీయాలు చేస్తోందని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణపై మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు తెలుపుతున్నారని, వైఎస్సార్ సీపీని ఆహ్వానిస్తే తన క్రెడిట్ ఎక్కడ పోతుందోనన్న భయంతో కేసీఆర్ ఆహ్వానించలేదని ఎద్దేవ చేశారు. గతంలో జిల్లా పునర్విభజనలో ఇదే వైఎస్సార్సీపీకి ఆహ్వానం అందని కారణంగా కోర్టు సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మీసాల రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రేటర్ కార్యదర్శి గోవిందస్వామి, గాజులరామారం డివిజన్ అధ్యక్షుడు వీర్శెట్టి, నాయకులు రాజు, రమేష్ పాల్గొన్నారు. -
అఖిలపక్షం ఢిల్లీ పర్యటన వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ అఖిలపక్షం నేతృత్వంలో చేపట్టిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బృందానికి ప్రధాని మోదీ ఇచ్చిన అపాయింట్మెంట్ను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది. ఈ మేరకు అఖిలపక్షం ఢిల్లీ పర్యటన తిరిగి ఎప్పుడు ఉంటుందనేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొంటూ సీఎంవో ప్రకటన విడుదల చేసింది. -
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా
-
‘ఎస్సీ వర్గీకరణపై బాబు స్పందించాలి’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మందుల సామేలు డిమాండ్ చేశారు. మాదిగల జనాభా ప్రకారం వర్గీకరణ జరగాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నారని, ఈ నేపథ్యంలో అఖిల పక్షాన్ని ఈ నెల 6న ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో జనాభా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలని బాబుకు హితవు పలికారు. వర్గీకరణ ఒక ప్పుడు జరిగినట్లే జరిగి కొన్ని కారణాలతో వెనక్కుపోయిందని, అయినా మాదిగలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులు కేసీఆర్‌ను కలసి ఎస్సీ వర్గీ కరణ కోరగా.. ఆయన తన మద్దతు తెలిపా రని గుర్తు చేశారు. వర్గీకరణకు మద్దతుగా కేసీఆర్ రెండుసార్లు లేఖలు ఇచ్చారని, తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళుతున్నారని తెలిపారు. కేంద్రం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు. -
గ్రామీణ దళితుల జీవనం దయనీయం
సాక్షి, మంచిర్యాల : అణగారిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న కోట్ల రూపాయల లెక్కలు వెక్కిరిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 52 మండలాలలోని గ్రామీణ దళిత వర్గాల పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామీణ ఎస్సీ జనాభాలో రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ తరువాత ఉమ్మడి ఆదిలాబాద్ రెండోస్థానంలో ఉండగా, వారి ఆర్థిక, సామాజిక జీవన స్థితిగతులు మాత్రం అథమస్థానంలో ఉన్నాయి.. జిల్లాలోని ఎస్సీ కుటుంబాలలో కడుపు నిండా భోజనం, మెరుగైన జీవితం గడుపుతున్నవి కేవలం 4.6 శాతం మాత్రమే ఉంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, కోటపల్లి మండలంలో కేవలం ఒకే ఒక్క కుటుంబానికి సర్కారీ నౌకరీ ఉండడం వారి జీవనస్థితిని తెలియజేస్తుంది. విద్య, వ్యవసాయం, ఉద్యోగ రంగాల్లో జిల్లాలోని ఎస్సీ కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువనే కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్ఈసీసీ) ఫలితాలు తెలియజేస్తున్నాయి. కోటపల్లిలో 40.68 శాతం రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాలు 18.02 శాతం ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 19.59 శాతం ఉన్నాయి. కోటపల్లి మండలంలో అత్యధికంగా 40.68 శాతం దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ మండలంలోని మొత్తం 8,279 గృహాలకు గాను 3,368 కుటుంబాలు ఎస్సీలవే. ఆ తరువాత స్థానాల్లో దహేగాం (37.62శాతం), బెజ్జూరు (35.16 శాతం), జైపూర్ (35.10శాతం), నెన్నెల (33.69 శాతం) ఉన్నాయి. అతి తక్కువ ఎస్సీ కుటుంబాలు ఉన్న మండలం సిర్పూర్. ఈ మండలంలోని 5,867 కుటుంబాలకు కేవలం 5.05 శాతం మాత్రమే ఎస్సీ వర్గానికి చెందిన వారు. కోటపల్లి మండలంలోని 96 శాతం కుటుంబాలు రూ.5వేల లోపు నెలసరి సంపాదనతోనే దుర్భర జీవితం గడుపుతున్నాయి. తరువాత జైపూర్, నెన్నెలలో సైతం 90 శాతానికి పైగా కుటుంబాలది ఇదే పరిస్థితి. నెలసరి సంపాదన అత్యల్పం ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో సైతం ఒక కుటుంబం జీవనానికి నెలకు రూ.5వేలు ఎందుకూ కొరగావు. రూ.5వేల నుంచి రూ.10వేల మధ్య సంపాదన ఉన్న మధ్యతరగతి కుటుంబాలే కష్టంగా కుటుంబాన్ని ఈడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 4,75,708 గ్రామీణ కుటుంబాల్లో దళిత వర్గాలకు చెందినవి 93,213. ఇందులో రూ.5వేల కన్నా తక్కువ సంపాదించే దళిత కుటుంబాలు ఏకంగా 81,708 (87.65 శాతం ). ఇందులో నెలకు రూ.500 నుంచి రూ.4,999 వరకు సంపాదించే కుటుంబాలు ఉండడం గమనార్హం. రూ.5వేల నుంచి రూ.10వేల లోపు సంపాదన గల గ్రామీణ దళిత కుటుంబాలు 7,143 (7.66 శాతం) మాత్రమే. ఇక రూ.10వేల పైన సంపాదించే కుటుంబాలు 4,347 (4.66 శాతం) ఉన్నాయి. ఈ దళిత కుటుంబాలు మాత్రమే ఉమ్మడి జిల్లాలో కొంత మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే జైనథ్ మండలంలోని గ్రామాల్లో కేవలం రెండు కుటుంబాలే రూ.10వేలకు పైబడి సంపాదన ఉన్నవి కాగా, భీమినిలో నాలుగు, మామడలో ఐదు, నేరేడిగొండలో ఆరు కుటుంబాలకు ఈ పరిస్థితి ఉంది. ఒక్క మంచిర్యాల ఉమ్మడి మండలంలోనే 1,077 దళిత కుటుంబాలు రూ.10వేలకు పైగా సంపాదించే కేటగిరీలో ఉన్నాయి. సర్కారీ కొలువులు ఏపాటి..? నిరక్షరాస్యత కారణంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లోని ఎస్సీలకు ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. దేశవ్యాప్తంగా 0.77 శాతం గ్రామీణ దళితులు సర్కార్ కొలువుల్లో ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్‌లో 0.66 శాతం మందికే ప్రభుత్వ ఉద్యోగం ఉంది. వాటిలో కూడా కిందిస్థాయి ఉద్యోగాలే అధికం. ఉమ్మడి జిల్లాలోని 5.31 లక్షల గృహాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న దళిత కుటుంబాలు కేవలం 3,137 మాత్రమే. వీరు కాకుండా మరో 1673 ఎస్సీ కుటుంబాల్లో ప్రైవేటు ఉద్యోగులు ఉండగా, 309 కుటుంబాల్లో పబ్లిక్ రంగంలోని ఉద్యోగులున్నారు. ఇక జిల్లాలో దళిత కుటుంబాలు అధికంగా ఉన్న కోటపల్లి మండలంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది ఒక్కరికే. ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్లలో ఒక్కరు కూడా లేకపోవడం ఈ మండంలోని ఎస్సీల దయనీయ పరిస్థితిని ఎత్తిచూపుతోంది. సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియా గల మంచిర్యాల (నస్పూర్, హాజీపూర్‌తో కలిపి) మండలం పరిధిలోని గ్రామాల్లో అధికంగా 899 కుటుంబాలు, మందమర్రిలో 480 కుటుంబాలకు సర్కారీ ఉద్యోగం ఉంది. చెన్నూరు మండలంలోని 3,569 దళిత కుటుంబాల్లో ప్రైవేటు ఉద్యోగి ఒక్కరు కూడా లేదు. తిర్యాణిలో ఇద్దరు, సిర్పూర్, జైనూరు, కెరమెరిలో నాలుగేసి కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం ఉండడం గమనార్హం. కూలీతోనే జీవనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 93,213 దళిత కుటుంబాలలో 55,192 రోజువారీ కూలీతో వచ్చే ఆదాయంతోనే బతుకు వెళ్లదీస్తున్నారు. అంటే 59 శాతం కుటుంబాలకు కూలీ జీవనాధారం కాగా, మరో 19,148 (13.65 శాతం) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను నమ్ముకొని బతుకుతున్నారు. 3,178 దళిత కుటుంబాలు వ్యవసాయంతో సంబంధం లేని ఇతర పనులపై ఆధారపడ్డారు. 12,766 కుటుంబాలు మాత్రం వ్యవసాయం, కూలీతో సంబంధం లేని ఇతర రంగాల్లో ఉన్నట్లు ఎస్ఈసీసీ లెక్కలు చెపుతున్నాయి. -
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్/ఢిల్లీ: ఢిల్లీకి వెళ్లాల్సిన తెలంగాణ అఖిలపక్షం వాయిదా పడింది. ఎల్లుండి అపాయింట్ మెంట్ ను ప్రధానమంత్రి కార్యాలయం శనివారం రాత్రి రద్దు చేసింది. తిరిగి అపాయింట్ మెంట్ ఎప్పుడనేది మళ్లీ చెబుతామని పీఎంవో అధికారులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న తెలంగాణ అఖిలపక్షం తమ పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పూర్తి మద్దతు: ఉత్తమ్
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పూర్తిమద్దతు ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం కూడా కాంగ్రెస్ చేసిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై శనివారం గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం జరిపే అఖిల పక్షసమావేశంలో తాను పాల్గొంటానని, వర్గీకరణ తొందరగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే ఎస్సీల వర్గీకరణ జరిగేదని, అయితే అప్పట్లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఆలస్యమయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ అఖిలపక్షం భేటీతో చేతులు దులిపేసుకోవద్దని హితవు పలికారు. వర్గీకరణ బిల్లు అమలయ్యేలా కృషి చేయాలని కోరారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒత్తిడితోనే తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిందని, ఇప్పుడు వర్గీకరణ అవుతుందంటే అది కాంగ్రెస్ కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. -
ఎస్సీ వర్గీకరణపై హస్తినకు...
-
ఎస్సీ వర్గీకరణపై హస్తినకు...
అఖిలపక్ష నేతలను ఆహ్వానించిన సీఎం కేసీఆర్ - ఈ నెల 6న ప్రధానమంత్రిని కలవాలని నిర్ణయం - ఓయూ శతాబ్ది ఉత్సవాలకు మోదీ, రాష్ట్రపతిని ఆహ్వానించనున్న సీఎం - ప్రభుత్వ ‘అఖిలపక్ష’ నిర్ణయాన్ని స్వాగతించిన మంద కృష్ణమాదిగ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో అఖిలపక్ష బృందం ఈ నెల 6న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలవనుంది. ఈ నెల 5న ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఆహ్వానం పంపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని సీఎం ప్రకటించటం తెలిసిందే. కొంతకాలంగా ఎస్సీలు ఉప కులాల వర్గీకరణకు డిమాండ్ చేస్తున్నారు. మాదిగ ఉప కులాలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయని, ఎస్సీలను ఏ, బీ, సీ, డీగా వర్గీకరించి వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఇది రాజ్యాంగ సవరణతో ముడిపడిన అంశం కావటంతో పార్ల మెంట్లో ప్రత్యేకంగా బిల్లు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవల మంద కృష్ణమాదిగ సారథ్యంలో ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభకు హాజరైన పార్టీలన్నీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ ప్రభుత్వం తరఫున అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉస్మానియా ఉత్సవాలకు రండి.. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుంటారు. ఏప్రిల్‌లో జరిగే ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించనున్నారు. ఈ మేరకు సీఎం.. రాష్ట్రప్రతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. ప్రభుత్వం దిగిరాక తప్పదు: మందకృష్ణ మాదిగ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి దిగి రాక తప్పదని రుజువైందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ మా వేలితో మా కంటినే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. రెండ్రోజులుగా ఓయూలో ఎమ్మార్పీఎస్ విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపడుతున్నాం. ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందనే ప్రభుత్వం దిగి వచ్చింది. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది. ఎమ్మార్పీఎస్ తరపున మేం కూడా ఢిల్లీ వెళ్లి పార్లమెంట్లో బిల్లు పెట్టేలా ఒత్తిడి తెస్తాం. చేనేత వస్త్రాలను ప్రోత్సహించినట్లే కుట్టిన తోలు చెప్పులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. సబ్‌ప్లాన్ స్ఫూర్తికి అనుగుణంగా చట్టాలు తీసుకురావాలి. పక్కదారి పట్టిన సబ్‌ప్లాన్ నిధులను రికవరీ చేయాలి. అవన్నీ మాకే ఖర్చు పెడితే 30 శాతం పేదరికం పోతుంది’’ అని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే.. ఆహ్వానించకపోవడంపై వైఎస్సార్సీపీ తెలంగాణ మండిపాటు ఎస్సీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం కేసీఆర్ తమ పార్టీని ఆహ్వానించకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ మండిపడింది. ఇది హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పేర్కొంది. కోర్టుల ఆదేశాలను కూడా అమలు చేయకుండా ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు.రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో నిర్వహించిన అఖిలపక్షానికి ఆహ్వానించక పోవడంపై తమ పార్టీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. రాష్ట్రంలో నిర్వహించే అన్ని అఖిలపక్ష భేటీలకు వైఎస్సార్సీపీని కూడా పిలవాలని కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఎస్సీ వర్గీకరణ: ప్రధాని వద్దకు అఖిలపక్షం
ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణం చేపట్టాలని కోరుతూ అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఈనెల 6వ తేదీన ఆయన ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేశామని, వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి కేంద్రాన్ని కూడా ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రధాని అపాయింట్మెంట్ దొరకడంతో.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, ఎంఐఎం నేతలకు ఆయన లేఖలు రాశారు. ఈనెల ఐదో తేదీకల్లా ఆయా పార్టీల నాయకులు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆ లేఖలో కోరారు. ఐదో తేదీన ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్.. అక్కడ విస్తృతంగా పలువురితో భేటీ అవుతారు. కాగా ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఆయన ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని మరీ అందరినీ తీసుకెళ్తున్నారు. ప్రధానితో సమావేశమైనప్పుడు.. అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానం కాపీని కూడా ఆయనకు ఇవ్వాలని నిర్ణయించారు. -
ఎస్సీ వర్గీకరణ: ప్రధాని వద్దకు అఖిలపక్షం
-
అనాథలకు అండగా వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: అనాథలను ఆదుకునేందుకు నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. అనాథ పిల్లలకు కూడా ఎస్సీ విద్యార్థుల తరహాలో అన్ని ప్రయోజనాలు కల్పించేందుకు 2008లోనే అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎస్సీ విద్యార్థుల మాదిరే అనాథ పిల్లలకు స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయాలు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్ 34 జారీ చేసింది. దానికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీలో చేసిన ప్రకటన అనాథ పిల్లలకు మరింత బాసటగా నిలవనుంది. ‘‘రాష్ట్రంలో అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులు. వారిని ఎస్సీలుగా పరిగణిస్తాం. ఎస్సీల రిజర్వేషన్ కోటా తగ్గించకుండానే అనాథలకు అదనపు కోటా ఇస్తాం..’’ అని ప్రకటించడం ద్వారా కేసీఆర్ అనాథలకు తీపి కబురు వినిపించారు. -
అనాథ పిల్లలకు ఎస్సీ హోదా
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన ఎస్సీల రిజర్వేషన్లు తగ్గించకుండానే వారికి అదనపు కోటా ఇస్తాం అనాథలకు ప్రభుత్వమే తల్లీతండ్రీ మార్చి 31లోగా 2015–16 ఫీజుల బకాయిలన్నీ చెల్లిస్తాం ఫీజులను ఏ ఏడాదికా ఏడాది చెల్లించడం సాధ్యం కాదు రాబోయే బడ్జెట్‌లోగా ఫీజుల పథకాన్ని సంస్కరిస్తాం.. తప్పుడు మార్గంలో కాలేజీలు నడిపితే మూసేస్తాం సాక్షి, హైదరాబాద్ ‘‘రాష్ట్రంలోని అనాథ పిల్లలకు నూటికి నూరు శాతం ప్రభుత్వమే తల్లీతండ్రీ! వారిని ఎస్సీలుగా పరిగణిస్తాం. ఎస్సీ హోదా కల్పిస్తాం. ఎస్సీల రిజర్వేషన్ కోటాను తగ్గించకుండానే అనాథలకు అదనపు కోటా ఇస్తాం..’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనాథ పిల్లలకు ఏ కులం, ఏ మతం హోదా కల్పించినా తక్కువేనని అన్నారు. గురువారం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. అంతకుముందు హైదరాబాద్‌లోని ఓ అనాథాశ్రమంలోని విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తర్వాత దీనిపై సీఎం మాట్లాడుతూ.. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో అనాథ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తామన్నారు. ఫీజులపై ఒక్క విద్యార్థి కూడా రంధి పడాల్సిన అవసరం లేదని, 2015–16 సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఈ ఏడాది మార్చి 31లోగా 100 శాతం చెల్లిస్తామని హామీనిచ్చారు. ‘‘విద్యార్థుల సంఖ్య, ఫీజుల డిమాండ్ ఒక్క సంవత్సరం కూడా స్థిరంగా ఉండదు. బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సరైన అంచనా సాధ్యం కాదు. దీంతో ఏ ఏడాదికా ఏడాది చెల్లించడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. గతేడాది బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వం చెల్లిస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేసింది’’ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై ప్రేమ లేదని కొందరంటున్నారని, అయితే ప్రేమ ఉందా? లేదా? అన్నది ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.20 లక్షల ఉపకారవేతనాన్ని చరిత్రలో తొలిసారి ఇస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది రూ.4,687 కోట్ల ఫీజులు రీయింబర్స్ చేశామని, అందులో రూ.1,880 కోట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించని పాత బకాయిలేనని సీఎం వివరించారు. ఫీజుల పథకాన్ని సంస్కరిస్తాం ఫీజుల పథకం అనారోగ్యంగా ఉందని, రాబోయే బడ్జెట్‌లోగా కొంత సంస్కరించేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. తాను అన్ని ఇంజనీరిం గ్ కాలేజీలను మూసివేస్తామని చెప్పలేదని, అయితే ఎవరైనా తప్పుడు మార్గంలో, అధ్యాపకులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తే తప్పకుండా మూసివేయిస్తామని స్పష్టంచేశారు. ‘‘ఓ మహిళ అధ్యాపకురాలు ఏకకాలం లో 11 కళాశాలల్లో పనిచేస్తున్నట్లు సీఐడీ తనిఖీల్లో వెలుగు చూసింది. హైదరాబాద్, ఆదిలాబాద్ వేర్వేరు ప్రాంతాల్లో డబుల్‌యాక్షన్ ఎలా సాధ్యం? తనిఖీలకు సంబంధించిన సమాచారం ముందస్తుగా ఇస్తే రూ.లక్ష లంచం ఇస్తామని కొందరి ఫోన్లలో మెసేజ్‌లు లభించాయి. విద్యార్థుల కోసం ఇస్తున్న డబ్బులను కొన్ని కళాశాలలు దుర్వినియోగం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు మూతపడతాయి. మరికొన్ని కొత్తవి వస్తాయన్నారు. అందుకే ప్రైవేటు వర్సిటీల బిల్లును తీస ుకువస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్పులు లేకుండా యథాతథంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులు పాస్ కావాలని, 75 శాతం అటెండెన్స్ కలిగి ఉండాలని గత ప్రభుత్వం రూ పొందించిన నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఉన్నత ప్రమాణాల ఆధారంగా కాలేజీలకు వేర్వేరు ఫీజులను నిర్ణయించారని, దీనినే తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. విద్యాసం స్థలు సర్టిఫికెట్లను ఆపుకోకుండా విద్యార్థులకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘‘బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ప్రమాణాలున్న కళాశాలల్లో చదువుకోవద్దా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జనరల్ కేటగిరీలో ప్రవేశాల పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లిస్తాం. ముస్లిం విద్యార్థుల్లో 99 శాతం పేదలే. వారికి ఎస్సీ, ఎస్టీలతో సమానంగా అవకాశాలు కల్పిస్తాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను సైతం జారీ చేసింది. వీటి అమలు బాధ్యతను స్వయంగా నేనే తీసుకుంటా’’ అని వివరించారు. జనవరిలో నోట్ల రద్దు ప్రభావం నోట్ల రద్దు ప్రభావం అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణపై సైతం తాత్కాలికంగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీని ప్రభావం జనవరిలో తెలుస్తుందన్నారు. ఆ తర్వాత ఫీజులు ఎలా చెల్లించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిని మాలమహానాడు నేతలు ముట్టడించారు. బుధవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటానికి నిరసనగా.. గురువారం మాలమహానాడు కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటిని ముట్టడించడానికి యత్నించడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
వర్గీకరణను మరుగున పెట్టిన కాంగ్రెస్
గువ్వల, రసమయి విమర్శ సాక్షి, హైదరాబాద్: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎస్సీల ఎ,బి,సి,డి వర్గీకరణ చేయాలని నిర్ణయించినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ విషయాన్ని మరుగున పెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంగళవారం వారు విలేకరులతో మాట్లా డారు. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలపై సభ్యులు మాట్లాడుతున్న సంద ర్భంలో కొందరు సభ్యులు అభ్యంతరకరంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టిందన్నారు. మాదిగ జాతి కోసం ఏకగ్రీవ తీర్మానం చేసిన ఘనత సీఎం కేసీ ఆర్కే దక్కుతుందన్నారు. పక్క రాష్టంలో ఇప్పటి వరకు కనీసం తీర్మానం చెయ్యలేదని, రేవంత్‌రెడ్డి తమ నేత, ఏపీ సీఎం చంద్ర బాబుతో తీర్మానం చేయిస్తే మాదిగ జాతి రేవంత్‌ను అక్కున చేర్చుకుంటుందన్నారు. దళితుల పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవా లని ఆరాట పడ్డ పార్టీలుగా టీడీపీ, కాంగ్రెస్ మిగిలాయన్నారు. కానీ వర్గీకరణను తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. -
వర్గీకరణపై త్వరలో ఢిల్లీకి అఖిలపక్షం
సీఎం కేసీఆర్‌ను కలసిన డిప్యూటీ సీఎం కడియం, దళిత నేతలు సాక్షి, హైదరాబాద్: మాదిగల వర్గీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నందుకు దళిత నేతలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగలపల్లి శ్రీనివాస్ తదితరులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసెంబ్లీలో సీఎం చాంబర్‌కు తీసుకువెళ్లారు. వీరివెంట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా వెళ్లారు. డప్పు–చెప్పుకు రూ. 2వేల పెన్షన్ ఇవ్వడానికి కూడా సీఎం అంగీకరించడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అదే మాదిరిగా జీవో 183 పునరుద్ధరణకు కూడా సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ జీవో ద్వారా జనాభా ప్రాతిపదికన ఎస్సీల్లోని 59 కులాలకు ప్రభుత్వ పథకాలలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. -
ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్, ఎత్తివేత
-
ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్, ఎత్తివేత
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీవరణ పై రగడ చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చించాలని పోడియం వద్ద ఆందోళనకు దిగిన విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మంగళవారం శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళన మొదలు పెట్టారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని పట్టుబట్టారు. కానీ, ప్రశ్నోత్తరాల సమయం కొనసాగిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. కానీ, టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్‌కు చెందిన సంపత్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనిపై స్పందించిన స్పీకర్ .. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా సభ్యుల సస్పెన్షన్ పై విపక్ష నేతల విజ్ఞప్తి చేయగా సస్పెన్షన్ ను ఎత్తివేశారు. -
ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు
టీఆర్ఎస్ ఎంపీల వెల్లడి న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు చిత్తశుద్ధితో ఉన్నారని, వర్గీకరణకు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో టీఎమ్మార్పీఎస్, మాదిగ విద్యార్థి జేఏసీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. గురువారం రెండో రోజు జరిగిన ఈ ధర్నాలో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొని మద్దతు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, ఈ తీర్మాన ప్రతులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారని ఎంపీలు తెలిపారు. కాగా, ఈ ధర్నాలో ఎస్సీ కార్పొరేషన్ చెర్మన్ పిడమర్తి రవి, టీఎమ్పార్పీఎస్ అధ్యక్షుడు ఈటుక రాజు, మాదిగ విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
దాడి చేసిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలి
కొవ్వూరు : దళితులపై దాడులకు పాల్పడిన టీడీపీ ఎంపీటీసీ అబోతుల దానయ్యపై చర్యలు తీసుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు దళిత సంఘ నాయకులు కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పెంటపాడు మండలంలో సబ్బితి కళాకాంతులకు రావిపాడు గ్రామంలో ఉన్న జిరాయితీ భూమిలో పంట చేతికి అందే సమయంలో టీడీపీ ఎంపీటీసీ దానయ్య వరి పంటను నాశనం చేయించారని ఆరోపించారు. ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించి చేతనైన పనిచేసుకోమని హెచ్చరించారన్నారు. నిందితుడిపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మాల మహానాడు జిల్లా కార్యదర్శి బొంతా కిషోర్, ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్లు కె.పుష్పారాజ్, గారపాటి నానాజీ, నాయుకులు పులిదిండి సుబ్బారావు, బుద్ధా అంతర్వేది, మల్లుల శ్రీనివాస్, కేదాసి ధర్మారావు, వర్ల రాజశేఖర్ పాల్గొన్నారు. -
‘బీజేపీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. బీజేపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. బీజేపీ తీరుకు నిరసనగా శనివారం నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయన్ని ముట్టడించేందుకు యత్నించిన మాలమహానాడు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే నివేదిక
న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ అంశంపై త్వరలోనే నివేదిక రూపొందించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయమంత్రి తావర్ చంద్ గెహ్లాట్ సోమవారం కేంద్ర సమాచార మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధం సభ వివరాలను తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరవై మూడేళ్లుగా జరుగుతున్న ఎస్సీల ఉద్యమాన్ని సామాజిక న్యాయమంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు వివరించి చట్టపరమైన, రాజకీయపరమైన నిబంధనలకు లోబడి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన గెహ్లాట్ ఈ అంశంపై నివేదిక తయారు చేసి ప్రధాని, పార్టీ అధ్యక్షుడితో చర్చిస్తానని తెలిపారు. వెంకయ్యనాయుడు పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలకు కూడా ఇదే విషయాన్ని వివరించారు. -
వర్గీకరణ చేసి తీరుతాం : వెంకయ్య
-
వర్గీకరణ చేసి తీరుతాం
అప్పుడే మాదిగ కులాలకు న్యాయం ధర్మయుద్ధం మహాసభలో వెంకయ్యనాయుడు వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం నేను ముందుండి నడిపిస్తా.. అవసరమైతే పోరాటం చేస్తా నోట్ల రద్దు సమస్య పెద్దగా లేదు ఉంటే ఈ సభకు ఇంతమంది వచ్చేవారే కాదు పార్లమెంట్లో వర్గీకరణపై బిల్లు పెడితే మద్దతు: సురవరం సాక్షి, హైదరాబాద్ ‘‘రాజ్యాంగం హక్కులు కల్పించినా మాదిగ కులాలకు ఆ ఫలాలు అందలేదు. దీంతో ఆ కులాలన్నీ ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనకబడ్డాయి. ఆ కులాలను ముందుకు తీసుకురావాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి. అందుకు బీజేపీ కట్టుబడి ఉంది. అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి. అయితే వర్గీకరణ అంశం సులువైంది కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లు పెట్టి చట్టాన్ని తీసుకురావాలి. ఈ ప్రక్రియను నేను ముందుండి నడిపిస్తా. అవసరమైతే పోరాటం చేస్తా..’’అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్సలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నేను మాట్లాడితే కొన్ని వర్గాలు నాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. దళిత కులాలను విభజిస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ నేను వర్గీకరణ ప్రక్రియను తప్పకుండా అమల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలన్న సందర్భంలో కొన్ని వర్గాలు హిందువులను విభజిస్తున్నారంటూ గోల చేశాయి. కానీ రిజర్వేషన్లు జరగకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అభివృద్ధి కొన్ని వర్గాలకే పరిమితమయ్యేది’’అని వెంకయ్య అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కులాల మధ్య గొడవలు పెట్టడం లేదని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేందుకు కృషి చేస్తుందని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘‘నెల్లూరుకు వాజ్‌పేయి వచ్చినప్పుడు నేను మైకు పట్టుకుని ప్రకటనలు చేశా.. కానీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను పార్టీ పెద్దగా ఆయన పక్కన కూర్చున్నా. నేనెప్పుడూ అంతటి స్థానం అందుకుంటానని ఊహించలేదు. వర్గీకరణ ప్రక్రియ అమల్లోకి వస్తే మాదిగ ఉపకులాల ప్రజలు కూడా అత్యున్నత స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నా. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా తీసుకొచ్చేందుకు అన్ని పార్టీల సమ్మతికి ప్రయత్నిస్తా. మాదిగ కులాల కలలను సాకారం చేస్తా. బిల్లుకు సరికొత్త రూపు తీసుకొస్తా’’అని చెప్పారు. నోట్ల సమస్య పెద్దగా లేదు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, దేశంలో ప్రతి అంశాన్ని సమూలంగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ క్రమంలోనే నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు పెద్దనోట్లను రద్దు చేశామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు సమస్య పెద్దగా లేదని, సమస్య ఉంటే ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు సభకు వచ్చేవారే కారన్నారు. దేశ ప్రజల ఆశలు త్వరలో ఫలిస్తాయని... ఒకేసారి వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పాసయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మాదిగ కులాలు చేస్తున్న వర్గీకరణ ఉద్యమం న్యాయమైందని, ఈ అంశంపై ప్రధానికి వివరిస్తానన్నారు. కేంద్ర సర్వీసుల్లో మాదిగ కులాలకు అన్యాయం జరుగుతోందని కొందరు తనను ప్రశ్నించారని, వర్గీకరణ అమలైతే ఈ సమస్య ఉండదని చెప్పారు. ఇప్పటికే ఆలస్యమైంది: సురవరం ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, దీంతో మాదిగ ఉపకులాల్లో మూడు తరాలకు పైగా నష్టపోయాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లు పెడితే దేశంలోని అన్ని వామపక్ష పార్టీలు మద్దతిస్తాయని ఆయన తెలిపారు. దళితులపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని, వీటిని ఆపేందుకు ప్రభుత్వాలు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. వర్గీకరణకు మాల కులాలు మద్దతుగా నిలవాలని, దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటే ఇతర వర్గాలు లాభపడతాయని, దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్‌కు నాపై కోపం వచ్చినట్టుంది..: మందకృష్ణ ‘‘ఈ సభకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు పలుమార్లు ప్రయత్నించా. ఈ రోజు మధ్యాహ్నం కూడా ట్రై చేశా. కానీ అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులతో చాలా ప్రయత్నం చేశా. కానీ వీలు చిక్కలేదు. నాపై ఎందుకు ఇంతటి కోపాన్ని పెంచుకున్నారో అర్థం కావడంలేదు. తెలంగాణకు దళితుడ్ని సీఎంగా చేస్తానని ఆయన అన్నారు. ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడిగా. అందుకు ఆయనకు నాపై కోపం వచ్చినట్లుంది. కోపముంటే నాపై చూపాలి. కానీ మా మాదిగ కులాల ఆశయాలపై రుద్దొద్దు..’అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఢిల్లీలో ఓ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పాదాభివందనం చేశా. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు చూశా. కానీ నాకు ఎవరి వద్ద బానిసత్వం చేయాల్సిన పనిలేదు. వర్గీకరణ కోసం గత 22 ఏళ్లుగా వెంకయ్యనాయుడు నాకు సలహాలు, సూచనలిస్తూ ముందుకు నడిపించారు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల అధ్యక్షులతో మద్దతుగా లేఖలు ఇప్పించారు. నా మాదిగ కులాల ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా’’అని పేర్కొన్నారు. వెంకయ్య తనకు పెద్దన్న లాంటివారని, ఆయనకు పాదాభివందనం చేస్తే తప్పులేదని అన్నారు. సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ పక్షనేత జానారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ పక్షనేత కిషన్‌రెడ్డి, ఎంపీలు నంది ఎల్లయ్య, ఆనంద్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలివచ్చారు. -
ధర్మయుద్ధం మహాసభ ప్రారంభం
హైదరాబాద్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లుపెట్టాలని మాదిగలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాదిగల ధర్మయుద్ధం మహాసభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష మాదిగ నేతృత్వంలో జరుగుతున్న ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డితో పాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు నేతలు మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మాదిగలు తరలివచ్చారు. -
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం
- మాదిగల శక్తి ప్రదర్శన సభలో కడియం శ్రీహరి - వెంకయ్యను అంబేడ్కర్‌తో పోల్చడం బాధించిందని వ్యాఖ్య హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ‘మాదిగల శక్తి ప్రదర్శన బహిరంగ సభ’ జరిగింది. ఇందులో కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణ కోసం పాటుపడే వారంతా తమకు మిత్రులేనన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో షెడ్యూల్డ్ కులాల మధ్య చీలిక వచ్చిందని, దీనిని అవకాశంగా వాడుకునేందుకు అగ్రవర్ణాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని.. త్వరలో జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. బీజేపీ, టీడీపీలు కలసి రావాలి.. ఇటీవల ఢిల్లీలోని ఒక సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును అంబేడ్కర్‌తో పోల్చారని, అది తీవ్రంగా బాధించిందని కడియం చెప్పారు. దయచేసి అంబేడ్కర్‌తో ఎవరినీ పోల్చవద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసిందని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా తీర్మానించాలని కోరారు. బీజేపీ, టీడీపీలు అనుకుంటే వర్గీకరణ సాధ్యమవుతుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలంతా ఏకమై పోరాడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సూచించారు. మంద కృష్ణ మాదిగ జాతిని అమ్ముకున్నాడని మాదిగ జేఏసీ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉందని నమ్మకం వ్యక్తం చేసిన వ్యక్తి.. ధర్మ యుద్ధ మహాసభ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కార్మికుల జేఏసీ చైర్మన్ ఉప్పర్తి యాదయ్య, మేడి రమేశ్, జీఎస్ఎస్ సురేష్, తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు, మాదిగ మహిళా జాతీయ అధ్యక్షురాలు జీవ మాదిగ, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ధర్మయుద్ధమే అంతిమ పోరు
మొయినాబాద్ : ఎస్సీ వర్గీకరణకోసం మాదిగల ధర్మయుద్ధమే అంతిమ యుద్ధమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించే మాదిగల ధర్మయుద్ధం మహాసభ విజయవంతం చేయడం కోసం ఎంఆర్పీఎస్ యువసేన ఆధ్వర్యంలో చేపడుతున్న సైకిల్ యాత్రను గురువారం మొయినాబాద్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమాదిగ మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణతో పాటు, ఇతర సమస్యలపై ఎంఆర్పీఎస్ సుదీర్ఘపోరాటం చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని ఏన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని..ఇటీవలే ఢిల్లీలో 23 రోజుల పాటు మహాధర్నా చేపట్టామన్నారు. వర్గీకరణ బిల్లుకు మద్దతిచ్చేందుకు బీజేపీ, వామపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నాయన్నారు. అయితే, కొందరు స్వార్థపరులు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టి ఎస్సీ వర్గీకరణను సాధించుకునేందుకు మాదిగలంతా ఐక్యంగా ఉండాలన్నారు. మాదిగల ధర్మయుద్ధం మహాసభను 30 లక్షల మందితో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు వనం నర్సింహమాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్రావు మాదిగ, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు ఆశన్నమాదిగ, జిల్లా ఇన్ చార్జి నాగార్జున, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్, మాదిగ యువసేన నాయకులు రాజయ్యమాదిగ, యువసేన రాష్ట్ర కన్వీనర్ కమలాకర్‌మాదిగ, మండల అధ్యక్షుడు సునీల్‌కుమార్ మాదిగ, నాయకులు సంజీవరావు, సురేష్మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
శీతాకాల సమావేశాల్లోనే ‘ఎస్సీ బిల్లు’ ప్రవేశపెట్టాలి
మంద కృష్ణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఎమ్మాఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్జీని మంద కృష్ణ శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఈయనతో వర్గీకరణ బిల్లుపై చర్చించారు. దళితుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా శివప్రకాశ్‌జీ స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధానితో చర్చించి త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి
ధర్మవరం రూరల్ : ఇతర రాష్ట్రాల మాదిరిగా తమను ఎస్సీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని తోలుబొమ్మల కళాకారులు కోరారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ సభ్యులు మంగళవారం ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ కేఎల్ మంజునాథ్, సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌లు తోలుబొమ్మల కళాకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తంగిశెట్టి అనే కళాకారుడు మాట్లాడుతూ బీసీ–బీలో ఉన్న తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలలో తోలుబొమ్మల కళాకారులు దళితులుగా ఉంటూ ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తోలుబొమ్మ కళాకారులను కూడా ఎస్సీ జాబితాలోకి చేర్చాలని కోరారు. తోలుబొమ్మల కళాకారులకు ప్రభుత్వం పింఛన్ సదుపాయం కల్పించాలని రంగమ్మ అనే కళాకారిణి కోరారు. మీ విజ్ఞప్తులను ప్రభుత్వానికి నివేదిస్తామని సభ్యులు తెలిపారు. అనంతరం గ్రామంలో తిరిగి కళాకారులు ఇళ్లలో బొమ్మలు తయారు చేసే విధానాన్ని వారు పరిశీలించారు. జాతీయ అవార్డు గ్రహీత దళవాయి చలపతితో కమిషన్ చైర్మన్ ముచ్చటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ బాలానాయక్, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాభార్గవి, డీఎస్పీ వేణుగోపాల్, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నారాయణమూర్తి, బీసీ సంక్షేమ అధికారి పుల్లన్న, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ ఈశ్వరయ్య, ఏపీఎం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
బీసీసీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా ప్రతిపాదనలను అమలు చేయకుండా బీసీసీఐ ధిక్కారణ ధోరణితో వ్యవహరిస్తోందని సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం సుప్రీం కోర్టు ఈ కేసును విచారించింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తుందని భావించినా.. లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని బీసీసీఐ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. సిబల్ విన్నపం మేరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. కాగా తీర్పును ఎప్పుడు వెల్లడించేది ప్రకటించలేదు. బీసీసీఐలో ప్రక్షాళన చేయాలని సూచిస్తూ లోధా కమిటీ పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. కాగా వీటిని అమలు చేయడానికి బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. సుప్రీం కోర్టులో బీసీసీఐ తరఫు న్యాయవాది ఇదే విషయాన్ని వాదించగా, లోధా కమిటీ ప్రతిపాదనలను పూర్తిగా అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేయడంతో బోర్డు పెద్దలు దిగివచ్చారు. -
'చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అవినీతి ప్రభుత్వం' అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆదివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి చంద్రబాబు విస్మరించారని మండిపడ్డారు. పెట్రోల్, డీజీల్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రఘువీరా విమర్శించారు. -
వర్గీకరణ పోరాటం ఫలించనుంది
వినాయక్‌నగర్ : ఎస్సీ వర్గీకరణ లక్ష్యానికి చేరువయ్యామని, ఈ సమయంలో మాదిగ ఉప కులాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్మయుద్ధం మహా సభ సన్నాహాక సదస్సును నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. 23 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నామని, పోరాటం ఫలించే సమయం ఆసన్నమైందని మందకృష్ణ అన్నారు. వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల 20న నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని కోరారు. 03ఎన్జడ్టి402,406 : సదస్సులో ప్రసంగిస్తున్న మంద కృష్ణ -
'పోరాటం ఫలించే సమయం వచ్చింది'
-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వినాయక్‌నగర్ : ఎస్సీ వర్గీకరణ లక్ష్యానికి చేరువయ్యామని, ఈ సమయంలో మాదిగ ఉప కులాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. వచ్చేనెల 20న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ధర్మ యుద్ధం మహా సభ సన్నాహక సదస్సును సోమవారం నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. పోరాటం ఫలించే సమయం వచ్చిందన్నారు. అప్రమత్తంగా ఉండి వర్గీకరణను సాధించుకుందామన్నారు. వచ్చేనెల 20 న నిర్వహించే ధర్మయుద్ధం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ప్రభుత్వం స్పందించకుంటే తిరుగుబాటు తప్పదు
అనంతపురం న్యూటౌన్ : ఎస్సీ వర్గీకరణ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తోందని ఇలాగే కొనసాగితే మాదిగల తిరుగుబాటు తప్పదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఆదివారం స్థానిక సంగమేష్ నగర్‌లోని సాయిబాబా కల్యాణ మండపంలో ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల ముఖ్యనేతల సమావేశం జరిగింది. రాజు మాట్లాడుతూ వర్గీకరణ కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు వచ్చేనెల 5న అమలాపురంలో మాదిగ ఆత్మగౌరవ సభను, 25న నెల్లూరులో మాదిగ యుద్ధ భేరి, నవంబరు 20న అమరావతిలో మాదిగల తిరుగుబాటు సభలు జరుగుతాయని, అన్ని జిల్లాల నుండి కార్యకర్తలను తరలించేలా కషి చేయాలని పిలుపునిచ్చారు. -
పేద ఎస్సీ రైతులకు చేయూత
మచిలీపట్నం (చిలకలపూడి) : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ నిరుపేద రైతులకు వ్యవసాయ సామగ్రిని ఉచితంగా అందజేయనున్నట్లు ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా రెండు ఎకరాలోపు ఉన్న నిరుపేద ఎస్సీ రైతులు బోరుబావులు, ఎలక్ట్రానిక్ మోటారు, విద్యుత్ కనెక్షన్ల కోసం ఉచితంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కొత్తగా వ్యవసాయం చేస్తూ బోరు, కరెంటు లైను, ఎలక్ట్రానిక్ మోటార్ల ఏర్పాటుకు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం మీ–సేవా ద్వారా పొందిన కులధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు నకలు, భూమి పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో దరఖాస్తుతో పాటు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. యువస్పూర్తి సమ్మేళనాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అక్టోబరు 1వ తేదీ నుంచి నియోజకవర్గస్థాయిలో యువస్ఫూర్తి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఈడీ తెలిపారు. ఇందులో సంక్షేమ పథకాలపై అవగాహన, అలాగే రుణాల మంజూరుపై లబ్ధిదారులు, బ్యాంకుల మధ్య చర్చలు నిర్వహిస్తామన్నారు. -
ఎస్సీ వర్గీక రణ బిల్లు పారల్లమెంటులో ప్రవేశపెట్టాలి
ఆలేరు(నల్గొండ జిల్లా) వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రజాయుద్ధ నౌక గద్దర్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా ఆలేరులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏబీసీడీల వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొన్నందున.. అన్ని వర్గాల వారిని కలుపుకుపోయి ఐక్యంగా ఉండి వర్గీకరణ కోసం పోరాడాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం సులభమేనన్నారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పాటైందని, పాలకులు మాత్రమే మారరాని అయినప్పటికీ దళితులకు ఒరిగిందేమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు 3ఎకరాల భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు హామీలను విస్మరించిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావు పూలేలను ఆదర్శంగా తీసుకుని మాదిగలు విద్యా, ఉద్యోగాల్లో రాణించాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా పయణించాలని పిలుపునిచ్చారు. డప్పులు కొట్టేవారికి, చెప్పులు కుట్టేవారికి ప్రభుత్వం రూ. 2వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. -
ఎస్సీ, బీసీ కార్యాలయాల పరిశీలన
కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం మండలం విద్యానగర్ కాలనీలోని ఎఎస్డబ్ల్యూఓ కార్యాలయంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. బీసీ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం ఇక్కడకు వచ్చి భవన సముదాయాలను పరిశీలించి వెళ్లారు. ఎస్సీ, బీసీ రుణాల మంజూరు తదితర కార్యక్రమాలకు ఈ కార్యాలయాలనే వినియోగించనున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం కొత్త రుణాలు ఈ జిల్లా నుంచే వెలవడనున్నాయి. -
వర్గీకరణను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి
మందకృష్ణమాదిగ నెల్లూరు(సెంట్రల్): ఎస్సీ వర్గీకరణను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ పేర్కొన్నారు. నెల్లూరులోని ఒక కళ్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరవయ్యేళ్ల క్రితమే వర్గీకరణ జరగాల్సిందని, తమ కులంలోనే ఉన్నత స్థానంలో ఉన్నవారు దానిని అడ్డుకున్నారన్నారు. న్యాయస్థానాలలో ఏపీకి చెందినవారు కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్గీకరణకు కేంద్రం అనుకూలంగా ఉందని తెలుస్తోందన్నారు. చివరి నిమిషంలో కూడా వర్గీకరణను అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలసి ఎస్సీ వర్గీకరణ సాధించుకునేందుకు పోరాడుదామని పిలుపునిచ్చారు. అందుకే నవంబరు 20న హైదరాబాద్‌లో మాదిగల మహాధర్నా కార్యక్రమం చేపట్టామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మందాపెంచలయ్య, నాయకులు మంచు వేణు, బెల్లంకొండ గోపి పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల్లో జనాభా వివరాలు వెల్లడి..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో జనాభాకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. జిల్లాల్లో మొత్తం జనాభా 3 కోట్ల 50 లక్షల 50 వేల 137 ఉండగా, ఎస్సీ జనాభా 15 శాతం, ఎస్టీ 9 శాతం, మైనార్టీ 14 శాతం ఉన్నట్టు వెల్లడైంది. హైదరాబాద్‌లో అత్యధిక జనాభా 39 లక్షల 43వేల 323 కాగా, ప్రొ. జయశంకర్ జిల్లాలో అత్యల్ప జనాభా 6 లక్షల 54వేల 853 మంది జనాభా ఉన్నట్లు తేలింది. మల్కాజ్‌గిరిలో 24 లక్షల 40వేల 073, శంషాబాద్‌లో 20 లక్షల 51 వేల 130 జనాభా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. కొమురం భీం జిల్లాలో అత్యధికంగా 22 శాతం ఎస్సీ జనాభా ఉండగా, మహబుబాబాద్ జిల్లాలో అత్యధికంగా 38 శాతం ఎస్టీ జనాభా, హైదరాబాద్‌లో అత్యధికంగా 46 శాతం మైనార్టీ జనాభా ఉన్నట్టు వెల్లడయ్యాయి. -
ఎస్సీ వర్గీకరణకు ‘తెలుగు’ సీఎంలే అడ్డంకి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కష్ణమాదిగ బోనకల్ : ఎస్సీ వర్గీకరణకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కష్ణమాదిగ విమర్శించారు. ఆయన మంగళవారం ఇక్కడ ఎమ్మార్పీఎస్ సమావేశంలో మాట్లాడుతూ.. నవంబర్ 20న 30లక్షల మందితో హైదరాబాద్‌లో ‘మహాధర్నా – యుద్ధ సభ’ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ధర్నా, సభకు ప్రతి గ్రామం నుంచి 200 మందికి తగ్గకుండా హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లితే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందన్నారు. చట్ట సభల్లో వర్గీకరణకు అన్ని జాతీయ పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు సుముఖంగా ఉందన్నారు. నవంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉందన్నారు. నవంబర్ 20న జరిగే మహాధర్నా – యుద్ధ సభను జయప్రదం చేయడం ద్వారా ఎమ్మార్పీఎస్ సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘‘జిల్లాల విభజన వెనుక సీఎం కేసీఆర్, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేల ప్రయోజనాలు ఉన్నాయి. 1.20కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ను జిల్లాలుగా విడగొట్టకుండా.. జంట పట్టణాలుగా ఉన్న వరంగల్, హన్మకొండను జిల్లాలుగా విడగొట్టడం వెనుక ఆంతర్యమేమిటి? 8వేల జనాభాగల యాదగిరిని జిల్లాగా చేశారు, 40వేల జనాభా ఉన్న వేములవాడను ఎందుకు చేయలేదు? దీనికి కారణాలేమిటో వెల్లడించాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, షేక్ మదార్ సాహెబ్, వంగూరి ఆనందరావు, కె.వెంకటేశ్వర్లు, బి.వెంకటేశ్వర్లు, కనకపూడి శ్రీను, మొండితోక అఫ్జల్, గద్దల వెంకటేశ్వర్లు, యంగల కనకయ్య, చిలకా నాగభూషణం, కోటకొండ, తాటికొండ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం:జి.చెన్నయ్య
సుల్తాన్‌బజార్: ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా అడ్డుకుంటామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య తెలిపారు. హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ తేల్చి చెప్పినా... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎమ్మార్పీఎస్ నాయకులను వాడుకొని దళితులను చీల్చడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఉషా మెహ్రా కమిషన్ సూచించినట్లుగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్లను కలుపుకొని ఒక కమిటీగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలిపారు. త్వరలో ఢిల్లీలో ‘మాలల మహా ధర్మయుద్ధం’ సభను ఏర్పాటు చేసి వర్గీకరణకు మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామన్నారు. ఈ సభలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మహిళలు, మేధావులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఢిల్లీ మాల మహానాడు అధ్యక్షులు సుధాకర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గైని గంగాధర్, శ్రీను, రమేష్, వి. సుధాకర్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పథకాల అమలు కోరుతూ ధర్నా
ఏలూరు (సెంట్రల్): ఎస్టీ ఉప కులాలకు సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింగం పట్టాభి మాట్లాడుతూ గిరిజన కాలనీల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి, కులవృత్తులు చేసుకుంటున్న ఎస్టీలకు రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, బోగస్ గిరిజనులను కఠినంగా శిక్షించి, నిజమైన ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో çపలువురు మహిళలు పాల్గొన్నారు -
ఎస్సీ హాస్టళ్లన్నీ ఎత్తివేస్తాం
– మూడేళ్లలో ఎస్సీ హాస్టళ్లు ఖాళీ – విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తాం – సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయరావు లావేరు: మూడేళ్లలో జిల్లాలోని అన్ని ఎస్సీ హాస్టళ్లను ఎత్తివేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.ధనుంజయరావు అన్నారు. మండలంలోని లావేరు హైస్కూల్‌కు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో 12 ఎస్సీ హాస్టల్స్ ఎత్తివేశామని, ఈ ఏడాది జిల్లాలోని లావేరు, ఇచ్చాపురం మండలాల్లో గల ఎస్సీ బాలికల హాస్టల్స్, నీలానగరం, సీతంపేట, శ్రీకాకుళం అర్బన్, అక్కుపల్లి, జి.సిగడాం, డోలపేట గ్రామాల్లో గల ఎస్సీ బాలుర హాస్టల్స్‌ను ఎత్తివేస్తామని తెలిపారు. ఇంకా జిల్లాలో 41 ఎస్సీ హాస్టల్స్ పనిచేస్తున్నాయని వాటిన్నింటినీ మూడేళ్లలో దశల వారీగా ఎత్తి వేస్తామన్నారు. ఇక్కడి విద్యార్థులను జిల్లాలో ఉన్న 12 ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో చేర్పిస్తామన్నారు. షెడ్యూల్ కులాలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసమే హాస్టల్స్‌ను ఎత్తివేస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో అదనపు పాఠశాల భవనాలు నిర్మించడం కోసం జిల్లాకు రూ.21.03 కోట్లు నిదులు మంజూరు చేశామని చెప్పారు. హాస్టళ్లు మూతబడితే అక్కడ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందినీ తీసేస్తామని స్పష్టం చేశారు. రెగ్యులర్ వార్డెన్లు, ఉద్యోగులను రెసిడెన్షియల్ హాస్టల్స్‌కు, వేరే శాఖల్లోను నియమించడం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు రణస్థలం ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ కె.సుజాత ఉన్నారు. -
సొంత భవనం లేక!
సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కరువు ఇబ్బంది పడుతున్న విద్యార్థులు పట్టించుకోని అధికారులు హాస్టళ్లలో ఉండలేమంటున్న విద్యార్థులు ఝరాసంగం రూరల్: విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం తనవంతుగా ప్రచారం కూడా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతున్నారు. వాస్తవానికి విరుద్దంగా ఉంటోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో ఆశలతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్నారు పేద మధ్యతరగతి కుటుంబాలు. అయితే వసతి గృహాలు మాత్రం వారికి సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. హాస్టళ్లలో ఉండలేమని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెగేసి చెబుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వసతి గృహాల్లో సమస్యల తిష్ట ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దూరప్రాంత విద్యార్థులకు వసతి గృహాలే దిక్కు. అయితే వాటిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యాభివృద్ధికోసం కృషి చేస్తున్నామని చెబుతున్న వారి మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. కనీస సౌకర్యాలైన తాగునీరు. విద్యుత్, మరుగుదొడ్లు లేకపోవడంతో చదువుపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారు. ఇరకు గదులతో ఇబ్బందులు ఝరాసంగం ఎస్సీ బాలికల వసతి గృహానికి స్వంత భవనం లేక గత ఎనిమిది సంవత్సరాల నుంచి అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ భవనంలో గదులు ఇరుకుగా ఉండడంతో బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు తమ దుస్తులు, పుస్తకాలు పెట్టుకునేందుకు చాలినంత స్థలం లేదు. ఇరుకు గదుల్లోనే సమస్యలతో సహవాసంచేస్తున్నారు. అయినా అధికారులు సౌకర్యాలపై దృష్టిసారించకపోవడం విచారకరం. వసతి గృహంలో ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 90 మంది విద్యార్థులున్నారు. ఇంత మందికి రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. స్నానం చేయడానికి కూడా రెండు గదులతోనే సరిపెట్టుకుంటున్నారు. బీసీ వసతి గహంలో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేక నిరూపయోగంగా మారాయి. దీంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళుతున్నారు. కాగా ఇటీవల ఎస్సీ బాలికల వసతి గృహం నిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరయ్యాయి. అయితే సదురు కాంట్రాక్టర్ పిల్లర స్థాయిలో పనులను నిలిపివేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. సొంత భవనం సమకూరుతుందనుకున్న వారి ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లయింది. అధికారులు చర్యలు తీసుకుని వెంటనే నిర్మాణం పూర్తి అయ్యే చూడాలని కోరుతున్నారు. త్వరగా భవనం పూర్తి చేయాలి గత కొన్నేళ్ల నుంచి సొంత భవనం ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. సొంత భవనం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. నూతన నిర్మాణం త్వరగా పూర్తి చేసి మా కష్టాలు తీర్చాలి. హాస్టల్లో ఉండలేకపోతున్నాం. - స్వరూప, 10వ తరగతి విద్యార్థిని, ఝరాసంగం ఇరుకైన గదులతో ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న భవనంలో మాకు సరిపడా గదులు లేవు. ఉన్న గదులు ఇరుకుగా ఉన్నాయి. మా అందరికి కలిపి రెండు మరుగుదొడ్లే ఉన్నాయి. కొత్త భవనం కడుతూ మధ్యలోనే ఆపేశారు. భవనం పూర్తిచేసి వెంటనే వినియోగంలోకి వచ్చేలా చూడాలి. - సుజాత, 9వ తరగతి విద్యార్థి, ఝరాసంగం జిల్లా అధికారులకు నివేదించాం సొంత భవనం లేక విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అధికారులకు నివేదించాం. అలాగే భవనం ఏర్పాటు చేయాలని పలుమార్లు నాయకులు, అధికారుల దృష్టికి తీసుళ్లాం. భవనం పూర్తి చేసి వెంటనే వినియోగం వస్తే విద్యార్థులకు ఇబ్బందిలేకుండా ఉంటుంది. - చంద్రమ్మ, వార్డెన్ -
ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తాం: గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణకు సహకరించాలని కోరుతూ గడ్కరీకి మందకృష్ణ మంగళవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ వర్గీకరణ ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశమని, తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అవసరం ఉందని చెప్పారన్నారు. అంతేగాకుండా ఈ విషయంలో వ్యక్తిగత చొరవ తీసుకొని వర్గీకరణకు సహకరిస్తామని హామీ ఇచ్చారని మందకృష్ణ పేర్కొన్నారు. గడ్కరీని కలసిన వారిలో బీజేపీ జాతీయ నేత జి.కిషన్‌రెడ్డి, దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులున్నారు. -
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా రవి
వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కొత్తపేట గ్రామానికి చెందిన బొచ్చు రవి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ శుక్రవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తన నియామకానికి సహ కరించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్‌కు రవి కృతజ్ఞతలు తెలిపారు.