ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నాం | We're working hard from categorize SC | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నాం

Published Thu, Feb 9 2017 1:47 AM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM

ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నాం - Sakshi

ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నాం

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం కృషి చేస్తోందని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవ స్థాకుడు మందకృష్ణ మాదిగ బుధవారం కేంద్ర మంత్రితో సమావేశమై వర్గీకరణపై చర్చించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కులాలను ముందుకు తీసుకురావాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాలన్న స్పష్టత బీజేపీకి ఉందని వెంకయ్య తెలిపారు. వర్గీకరణ అమలు విషయంలో తన వంతు కృషి చేస్తున్నానని మందకృష్ణకు హామీ ఇచ్చారు.

ఎన్నికల కోడ్‌ వల్లే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు..
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉన్నందున ఎస్సీ వర్గీకరణ విషయంలో ఢిల్లీకి రావాలనుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలోని అఖిలపక్ష బృందానికి ప్రధాని అపాయింట్‌మెంట్‌ లభించలేదని వెంకయ్య వివరణ ఇచ్చారు. అపాయింట్‌మెంట్‌ రద్దు చేయడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement