పార్లమెంట్‌కు బిల్లు చేరకుండా కుట్ర
మంద కృష్ణమాదిగ
కావలిఅర్బన్: ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌కు చేరకుండా వ్యతిరేక శక్తులు తీవ్రంగా కుట్ర పన్ను తున్నాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. జూలై 7న అమరావతిలో జరగనున్న కురుక్షేత్ర మహాసభ సమీకరణలో భాగంగా గురువారం రాత్రి స్థానిక అరుంధతీయపాళెంలో సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఈ జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. వర్గీకరణకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయన్నారు.
ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుందన్నారు. వర్గీకరణ అంశం ఢిల్లీలో అజెండాగా మారిందంటే అందుకు వెంకయ్యనాయుడి పాత్రే ప్రధానమన్నారు. మాదిగ జాతిని ముంచైనా మాల జాతిని పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బుల్లా డేవిడ్ మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ నాయకులు దేవరపల్లి భిక్షాలు మాదిగ, పరుసు రమేష్ మాదిగ, సీనియర్ నాయకులు గొల్లపల్లి శ్రీనివాసులు మాదిగ, రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ పాల్గొన్నారు.