
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
భద్రాచలంటౌన్: ఎన్నో ఏళ్లగా ఎదుగూబొదుగూ లేని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి వారికి రిజర్వేషన్ ఫలాలను అందించాలని ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొత్తపల్లి శ్రీలక్ష్మీ డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండుతో హైదరాబాద్ నుంచి వచ్చిన నాయకులు. స్థానికులతో కలిసి ఇక్కడ పాదయాత్ర ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ...రజకులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్ని విషయాన్ని గుర్తు చేశారు. వారిన ?ఎస్సీ జాబితాలో వెంటనే చేర్చాలని కోరారు.
తెలంగాణా సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధీరత్వంతోనే ఉద్యమం ప్రారంభమైందని అన్నారు. ఆమె పేరును ఏ జిల్లాకు పెట్టకపోవడం బాధాకరమన్నారు. ట్యాక్‌బండ్‌పై అయిలమ్మ విగ్రహం పెట్టిస్తానన్న కేసీఆర్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని విమర్శించారు. 31 జిల్లాల నుంచి చేపట్టిన పాదయాత్రలు అక్టోబర్ 15న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభతో ముగుస్తాయన్నారు. రజకుల సమస్యలను పరిష్కరించకపోతే కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. జనగాం జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో సాధన కమిటీ సభ్యులు ఆంజనేయులు, సత్తు వెంకటేశ్వర్లు, రాజకొండ వెంకన్న, భగవాన్, దామర్ల రేవతి, నిమ్మల రామకృష్ణ, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.