Bhadrachalam
-
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై భద్రాద్రిలో భక్తుల రియాక్షన్
-
అందాలు ‘ఏరు’కొందామా..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎకో టూరిజం.. ఈ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో పాపికొండలు, అరకు వంటి ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాలే మనకు గుర్తొస్తాయి. అందుకే ఆయా ప్రాంతాలకే ఎక్కువ మంది టూరిస్టులు క్యూ కడుతుంటారు. కానీ పర్యాటకులకు ప్రకృతి పర్యాటకానికి అసలైన నిర్వచనం ఇచ్చేందుకు.. అచ్చమైన తెలంగాణ గిరిజన సంస్కృతిని పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త థీమ్‌తో ముందుకొచి్చంది. ఎకో–టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా భద్రాచలం, పరిసర ప్రాంతాలను కలుపుతూ ఏరు–2025 ది రివర్ ఫెస్టివల్ పేరిట వేడుకలు నిర్వహించనుంది. ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారిని ఆకర్షించేలా ఈ నెల 9, 10, 11 తేదీల్లో రివర్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టింది. భద్రాచలంతోపాటు పర్ణశాల, బొజ్జుగుప్ప, కిన్నెరసాని, కనకగిరి (చండ్రుగొండ) గుట్టలకు పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తోంది.ఏమిటీ రివర్ ఫెస్టివల్ ప్రత్యేకత.. గోదావరి గలగలల చెంతన (కరకట్ట వెంబడి) ప్రత్యేక గుడారాలతో కూడిన క్యాంపింగ్ సైట్.. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా పూర్తిగా వెదురు, గడ్డితో గుడిసెలు, మంచెల ఏర్పాటు.. బోటింగ్ సదుపాయం.. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను అలరించనున్నాయి. అలాగే కొండలు, గుట్టల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. మరింతగా పల్లె వాతావరణం కోరుకొనే వారి కోసం భద్రాచలానికి 17 కి.మీ. దూరాన ఉన్న బొజ్జుగుప్ప అనే గిరిజన గ్రామంలో మరో వేదిక సిద్ధం చేస్తున్నారు. అక్కడకు చేరుకొనే అతిథులకు గిరిజన సంప్రదాయ రీతిలో స్వాగ తం పలికేలా గ్రామస్తులకు శిక్షణ సైతం ఇచ్చారు. అలాగే తాటి మొద్దులతో సిద్ధం చేసిన డయా స్పై కొమ్ము, కోయ నృత్యాలతో పర్యాటకులను వారు అలరించనున్నారు. ఈ వేదికకు సమీపాన తామర పూలతో నిండిన చెరువులో బోటింగ్, ఫిషింగ్‌కు ఏర్పాట్లు చేశారు.ఆకులు, దుంపలతో వంటకాలు..ఆకులు, దుంపలు, చిరుధాన్యాలతో వంటకాలు.. గిరిజన తెగలకు చెందిన ఆచార వ్యవహారాలు, పనిముట్లు, అలంకరణ గురించి పర్యాటకులకు అవగాహన కల్పించేలా ఐటీడీఏ క్యాంపస్‌లోని గిరిజన మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్థానిక గిరిజనులు సేకరించిన తేనె, కరక్కాయ, ఇప్పపూలు తదితర అటవీ ఉత్పత్తులు అమ్మనున్నారు. అడవుల్లో దొరికే, పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఆకులు, దుంపలు, చిరుధాన్యాలతో గిరిజనులు చేసిన వంటలను ప్రత్యేకంగా పర్యాటకులకు వడ్డించనున్నారు. -
భద్రగిరి.. ప్రకృతి సోయగాల సిరి
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం క్షేత్రం వైకుంఠ ముక్కోటి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. అయితే, భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకునే భక్తులు కొద్దిపాటి సమయం కేటాయిస్తే.. చుట్టుపక్కల ఎన్నో ఆలయాలు, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. నూతన సంవత్సరం సెలవులు, పర్యాటకానికి అనువైన శీతాకాల సీజన్ కావడంతో భద్రాచలం.. భక్తులు, పర్యాటకులకు సాదరంగా స్వాగతం పలుకుతోంది. భద్రాచలంలో బసచేసి నలువైపులా ఉన్న పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు. ఇక్కడి సందర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలపై కథనమిది.పర్ణశాల.. భద్రాచలం వచ్చిన భక్తులు.. భద్రాచలం తర్వాత అధికంగా దర్శించుకునే ప్రాంతం ఇదే. ఈ ప్రాంతాన్ని శ్రీరామాయణంలో పంచవటిగా వ్యవహరించారు. రామాయణానికి ప్రాణప్రదాలైన ముఖ్య ఘట్టాలన్నీ ఇక్కడే జరిగాయని అభివర్ణి స్తారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస కాలంలో ఎక్కువ రోజులు (11 మాసాల 10 రోజులు) పర్ణశాలలో నివాసం ఉన్నారట. శూర్పణఖ చెవి, ముక్కును లక్ష్మణస్వామి కోసింది ఇక్కడేనని, 14 వేల మంది రాక్షసుల వధ, సీతాపహరణం, మాయలేడిగా మారీచుడు రావడం, జటాయువు రావణుడిని ఎదుర్కొనడం వంటి ప్రధాన ఘట్టాలన్నీ ఇక్కడే జరిగినట్లు స్థల పురాణం చెబుతోంది. వీటికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తాయి. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి పర్ణశాల 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్ణశాలకు భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిత్యం బస్సులు తిరుగుతాయి. ఉత్సవాల సమయంలో ప్రతీ పది నిమిషాలకు ఒక బస్సును అధికారులు సిద్ధం చేస్తారు. బస్సులే కాకుండా.. ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. కిన్నెరసాని.. భద్రాచలానికి దగ్గరగా ఉన్న మరో పర్యాటక ప్రాంతం కిన్నెరసాని. ఇక్కడ ఉన్న అభయారణ్యం పార్కులో అందమైన జింకలను చూడొచ్చు. ఇక్కడ కేటీపీఎస్ కర్మాగారం కోసం కిన్నెరసానిపై నిర్మించిన ప్రాజెక్టును వీక్షించవచ్చు. బోటింగ్ అనుభూతిని ఆస్వాదించవచ్చు. ఇలా వెళ్లవచ్చు కిన్నెరసానికి వెళ్లాలంటే పాల్వంచ పట్టణం నుంచి 9 కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. భద్రాచలం నుంచి వెళ్లాలనుకునే వారు పాల్వంచ బస్టాండ్‌లో దిగి అక్కడ బస్సు మారాలి. సరాసరిగానైతే ప్రైవేట్ వాహనాలు, సొంత కార్లలో చేరుకోవచ్చు. మోతుగూడెం.. మోతుగూడెంలో పొల్లూరు జలపాతం, పొల్లూరు పవర్ స్టేషన్, పవర్ కెనాల్, అటునుంచి కొద్దిదూరంలో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి ప్రాజెక్టు తదితర చూడదగ్గ ప్రదేశాలున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడ్డ పొల్లూరు జలపాతం ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శీతాకాల సీజన్లో కొండల మీదుగా నేలమీదకి వచ్చాయా? అన్నట్లు తెల్లటి మేఘాల అందాలు కట్టిపడేస్తాయి. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి మోతుగూడెం సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు ఆర్టీసీ బస్సులున్నా సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లటానికి మొగ్గు చూపుతారు. ప్రయాణాల నడుమ ఉన్న అటవీ అందాలు, ప్రకృతి అందాలను చూడాలనుకుంటే.. కచి్చతంగా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లటం ఉత్తమం. శ్రీరామగిరి క్షేత్రం..ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. గోదావరి – శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉందీ ప్రాంతం. నిండుగా ప్రవహించే గోదావరి నదీ తీరాన ఎత్తయిన కొండపై నెలకొన్న క్షేత్రమిది. ఆ కొండ పేరే శ్రీరామగిరి. కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాడని స్థలపురాణం చెబుతోంది. పర్ణశాలలో సీతాపహరణ తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం (వనక్షేత్రం) చేరి సేదదీరి, మళ్లీ సీతమ్మను వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలిసి ఆమె ఆతిథ్యమైన ఎంగిలి పండ్లను స్వీకరించి, ముక్తిని ప్రసాదించాడని భక్తుల నమ్మిక. ఈ ప్రాంతానికి సమీపంలో రేఖపల్లిలో (రెక్కపల్లి – జటాయువు రెండో రెక్క పడిపోయిన చోటు) రెక్క పడిన జటాయువును చూశారట. రామలక్ష్మణుల ప్రాణవిశిష్టగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేశారని చెబుతారు. గోదావరి తీరంలో ఓ పెద్ద శిలపై దానికి పిండ ప్రధానం చేసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి శ్రీరామగిరి 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీరామగిరికి భద్రాచలం బస్టాండ్ నుంచి ప్రతీ గంటకు ఒక బస్సు ఉంది. బస్సులే కాకుండా ప్రైవేట్ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి.పాపికొండలు.. భద్రాచలం వ చ్చిన ప్రతీఒక్కరు చూడదగ్గ పర్యాటక ప్రాంతం పాపికొండలు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలను లాంచీ ప్రయాణంలో ఆస్వాదించడం ఈ యాత్ర ప్రత్యేకత. లాంచీలోనే గోదావరి అందాలను వీక్షిస్తూ గిరిజనుల సంప్రదాయాలను వీక్షించవచ్చు. పాపికొండల యాత్రలో పేరంటాలపల్లి వద్ద మఠాన్ని కూడా దర్శించే అవకాశముంది. ఇలా చేరుకోవచ్చు.. పాపికొండలకు వెళ్లాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పోచవరానికి చేరుకోవాలి. భద్రాచలం నుంచి పోచవరానికి 85 కిలోమీటర్ల దూరం ఉండగా.. బస్టాండ్ నుంచి ఉదయం 5.30, 11.30 గంటలకు బస్సులు ఉన్నాయి. అయితే, పాపికొండలు వెళ్లాలనుకునే వారు సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలైతే సమయానుకూలంగా మధ్యలో ప్రకృతి అడవి అందాలు, కూనవరం వద్ద శబరి, గోదావరి సంగమం చూడడానికి అనుకూలంగా ఉంటుంది. పోచవరం నుంచి లాంచీ టికెట్ ధర పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా ఉంది. మారేడుమిల్లి.. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ఉంటుంది. ఇటీవలి కాలంలో పర్యాటకుల ఆదరణ అత్యధికంగా ఉన్న ప్రాంతం ఇది. ‘పుష్ప’, ‘ఆచార్య’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తదితర సినిమాల చిత్రీకరణ జరిగిన పర్యాటక ప్రాంతం ఇది. ఘాట్ రోడ్డు అనుభూతులు, వాటర్ ఫాల్స్, పాము మెలికలు తిరిగినట్లుండే విహంగ వీక్షణం, పలు వ్యూ పాయింట్లను ఇక్కడ వీక్షించవచ్చు. ఇక్కడి నుంచి అత్యంత ఎత్తయిన ‘గుడిసె’అనే ప్రాంతానికి రాత్రి వేళలో బస చేసి.. సూర్యోదయాన్ని అతి దగ్గరగా చూసే అదృష్టం పర్యాటకులకు మాత్రమే సొంతం. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి నేరుగా మారేడుమిల్లికి 118 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో సుమారు 40 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీదుగానే ప్రయాణం సాగుతుంది. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, వాటర్ ఫాల్స్, ఇతర వ్యూ పాయింట్లను చూడాలంటే తప్పనిసరిగా ప్రైవేట్ వాహనాల్లోనే వెళ్లాలి. భద్రాచలం నుంచి మోతుగూడెం, మారేడుమిల్లి ప్రాంతాలకు వెళ్లి అక్కడే బస చేసి.. రెండు, మూడు రోజులు వీక్షించే అవకాశమూ ఉంటుంది. భద్రాచలం వచ్చేందుకు.. » భద్రాచలం వచ్చే రైల్వే ప్రయాణికులు విజయవాడ – సికింద్రాబాద్ మార్గంలో ఖమ్మం స్టేషన్లో దిగి బస్సుల్లో భద్రాచలం రావచ్చు. ఖమ్మం నుంచి భద్రాచలానికి రోడ్డు మార్గం 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. » నేరుగా భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) వరకు సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం ఉంది. ఆపై కొత్తగూడెం నుంచి భద్రాచలానికి 40 కిలోమీటర్లు బస్సుల్లో వెళ్లొచ్చు, » ఇవి కాక హైదరాబాద్ నుంచి రోజూ ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్లీపర్, నాన్ స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.బొగత జలపాతంఇది ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరాన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ మండలం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. పచ్చని కొండల నడుమ సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. తెలంగాణ నయాగారాగా అభివర్ణించే దీని అందాలు వర్షాకాలంలో చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగుతుండగా, శీతాకాల సీజన్లో సైతం వీక్షించవచ్చు. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని భద్రాచలం నుంచి వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రైవేట్, సొంత వాహనాల్లో వెళ్లాలి. ఇక హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే పర్యాటకులు దీనిని నేరుగా సందర్శించి.. అటునుంచి భద్రాచలం చేరుకునే అవకాశం ఉంది. -
ప్రకృతి ప్రేమికులకు రా రమ్మని... స్వాగతం
గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించాలని అనుకుంటున్నారా? అయితే, మీరు పాపికొండలు యాత్రకు వెళ్లాల్సిందే. భద్రాచలం సమీపాన పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి నిత్యం బోట్లు నడిపిస్తుండగా.. క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవులు రానున్న నేపథ్యాన పర్యాటకుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యాన పాపికొండల అందాలు, యాత్ర మిగిల్చే తీయని అనుభవాలపై ప్రత్యేక కథనమిది.రెండు మార్గాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాపికొండల యాత్రను సందర్శించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటోది.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న పోచమ్మ గండి పాయింట్ వద్ద నుంచి బోట్లో ప్రారంభమై.. పేరంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. రెండోది.. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి ప్రారంభమయ్యే మార్గం. ఈ పాయింట్ తెలంగాణలోని భద్రాచలానికి సమీపాన ఉంటుంది. దీంతో పర్యాటకులు ఒకరోజు ముందుగానే చేరుకుని రామయ్యను దర్శించుకుని.. ఆపై పాపికొండలు యాత్రకు బయలుదేరుతారు.భద్రాచలం నుంచి ఇలా.. హైదరాబాద్ నుంచి పాపికొండల యాత్రకు రావాలనుకునే వారు ముందుగా భద్రాచలం చేరుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి విరివిగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గంలో వచ్చే వారు కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రావాలి. ఇక్కడ వీలు చూసుకుని సీతారాముల దర్శనం చేసుకున్న తర్వాత.. భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోటింగ్ పాయింట్ ఉన్న పోచవరం గ్రామానికి బయలుదేరవచ్చు. 70 కిలోమీటర్ల జలవిహారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి లేదా 5 గంటల మధ్యలో ముగుస్తుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద పర్యాటకులను ఎక్కించుకుని మళ్లీ అక్కడే దింపుతారు. సుమారు ఆరు గంటల పాటు 70 కిలోమీటర్లు గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుత అవకాశం ఈ యాత్రలో పర్యాటకులకు కలుగుతుంది. పేరంటాలపల్లి సందర్శన పాపికొండల యాత్రలో పేరంటాల పల్లి వద్ద నున్న ప్రాచీన శివాలయం వద్ద బోటు ఆపుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుడిని గిరిజనులే నిర్వహిస్తున్నారు. గుట్ట పైనుంచి జాలువారే నది జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటారు. యాత్ర ప్రారంభానికి ముందు లేదా తర్వాతైనా పోచవరానికి సమీపాన వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి రాముడి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. షెడ్యూల్, ధరలు ఇలా.. పోచవరం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాపికొండల యాత్రకు సంబంధించి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750గా ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. కళాశాల విద్యార్థులు గ్రూపుగా పర్యటనకు వస్తే.. వారికి రూ.850, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 ప్యాకేజీ ధరగా ప్రకటించారు. అయితే శని, ఆదివారం, సెలవు దినాల్లో.. దీనికి అదనంగా రూ.100 వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలోనే భోజన సౌకర్యాన్ని బోటు నిర్వాహకులు కల్పిస్తారు. భద్రగిరిలోని రామాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లు విక్రయిస్తారు. ఇసుక తిన్నెల్లో విడిది.. రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం, ఇసుక తిన్నెలు, వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే వెదురు హట్స్‌ల్లో రాత్రి వేళ బస చేయాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని సిరివాక అనే గ్రామం వద్ద పర్యాటకుల కోసం హట్స్ ఉన్నాయి. గుడారాలలో ఒక్కొక్కరికి రూ.4 వేలు, వెదురు కాటేజీల్లో అయితే రూ.5,500గా ధర నిర్ణయించారు. ఉదయం పోచవరం నుంచి వెళ్లి.. రాత్రికి సిరివాకలో బస చేయిస్తారు. అనంతరం మర్నాడు సాయంత్రానికి పోచవరానికి లాంచీలో చేరుస్తారు. రెండు రోజుల పాటు భోజన వసతి, ఇతర సౌకర్యాలను నిర్వాహకులే చూసుకుంటారు. ఈ టికెట్లు కూడా భద్రాచలంలో అందుబాటులో ఉంటాయి. పటిష్టమైన రక్షణ ఏపీలోని కచ్చలూరు లాంచీ ప్రమాదం అనంతరం పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని బోట్లకు అనుసంధానం చేసిన శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు, వాటిని నియంత్రించే బోటింగ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీసు, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు.. పర్యాటకుల ధ్రువీకరణ పత్రాలను సరిపోలి్చన తరువాతే బోటులోకి అనుమతిస్తారు. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నారు.ఆహారం ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అల్పాహారం, టీ అందిస్తారు. మధ్యాహ్న సమయాన బోటులోనే శాఖాహార భోజనంతో ఆతిథ్యాన్ని అందిస్తారు. సాయంత్రం యాత్ర ముగిసిన తరువాత మళ్లీ బోట్ పాయింట్ వద్ద స్నాక్స్, టీ అందజేస్తారు. పాపికొండల ప్రయాణంలో కొల్లూరు, సిరివాక, పోచవరం వద్ద ‘బొంగు చికెన్’ అమ్ముతారు. ఆకట్టుకునే వెదురు బొమ్మలు పేరంటాలపల్లి దగ్గర గిరిజనులు తయారు చేసిన వెదురు బొమ్మలు, వస్తువులు ఆకట్టుకుంటాయి. రూ.50 నుంచి రూ.300 వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.👉పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు) -
బాల భీముడు
-
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు ప్రారంభం
-
బాహుబలి బాలుడు..!
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన కాన్పును సుసాధ్యం చేశారు. ఈ కాన్పులో మహిళ 5.25 కిలోల బాలుడికి జన్మనివ్వడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మడకం సన్న భార్య నందినికి నెలలు నిండటంతో.. గురువారం ఉదయం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు సాత్విక్, మల్లేశ్ సాధారణ ప్రసవం కోసంప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి శస్త్రచికిత్స చేయగా నందిని 5.25 కిలోల బరువైన మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆ రెండూ సాధారణ ప్రసవాలే జరిగాయి. ఈసారి కేసులో క్లిష్టత దృష్ట్యా తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. -
భద్రాచలంలో యాంకర్ అనసూయ.. రాములోరిని దర్శించుకుని (ఫొటోలు)
-
ఉగ్ర గోదావరి.. శాంతించిన కృష్ణ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం: ప్రశాంతంగా ఉన్న గోదావరి ఉగ్రరూపం దాలి్చతే.. మహోగ్ర రూపం దాలి్చన కృష్ణ శాంతిస్తోంది. పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండం, ప్రధాన పాయతోపాటు ఉప నదులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్దకు 8.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నీటి మట్టం 46.06 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరదకు శబరి తోడవడంతో కూనవరం వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటింది. పోలవరం ప్రాజెక్టులోకి వచి్చన వరదను వచి్చనట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు.ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు గురువారం రాత్రి 10 గంటల సమయానికి 10,06,328 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి 10,04,528 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అంతే స్థాయిలో దిగువకు వదలేస్తుండటంతో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. మరింత తగ్గిన కృష్ణా వరద కృష్ణా నదిలో వరద మరింత తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,39,744 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,39,244 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే వరద 1.36 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం నుంచి దిగువకు వదిలేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 1.26 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేస్తూ దిగువకు 38 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరే వరద శుక్రవారం మరింతగా తగ్గనుంది. -
గోదావరి డేంజర్ బెల్స్.. ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.వాయుగుండం ఎఫెక్ట్‌తో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంది. వరద నీరు పెరగడంతో అలర్ట్ అయిన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే తాజాగా కురిసిన వర్షం కారణంగా ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి వరద కూడా పెరుగుతున్న క్రమంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.ఇక, తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో వరద పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 9.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, ఆరు లక్షల 61వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలవుతోంది. 1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరా అవుతోంది. వర్షాల కారణంగా వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
కొత్త రైలు.. కొండ కోనల్లో హొయలు
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం వరకు సుమారు 173 కిలోమీటర్ల కొత్త రైల్వే లైను ఇటీవల మంజూరైంది. ఈ లైనుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ రైల్వేలైను నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలోని మల్కనగిరి నుంచి ఆంధ్రాలోని విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా తెలంగాణలోని పాండురంగాపురం వరకు కొత్త లైను నిర్మించనున్నారు. లైను నిర్మాణంలో భాగంగా 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలున్నాయి. ముంపు మాటేంటి? విలీన మండలాల్లో ప్రతిపాదించిన రైల్వేలైను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవనుంది. చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరుగట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో నిర్మించనున్న స్టేషన్లు సైతం ముంపునకు గురయ్యే అవకాశముంది. దీంతోపాటు శబరినదిపై నిర్మించే వంతెన సైతం ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే చేసిన మార్గం గుండా కాకుండా ముంపునకు గురికాని మార్గంలో లైను నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. లైనుతో పాటు స్టేషన్లు ముంపు పరిస్థితిపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు వేచి చూస్తున్నారు. విలీన మండలాల మీదుగా.. మల్కనగిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక గుండా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడలో, ఆంధ్రాలోని అల్లూరి జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు నిర్మించనున్నారు. అనంతరం నందిగామ నుంచి తెలంగాణలోని భద్రాచలం అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే పనులు పూర్తి చేశారు. దీనిలో భాగంగా కూనవరం మండలం జగ్గవరం వద్ద మహరాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి వచి్చన ప్రత్యేక బృందాలు 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి మట్టి శాంపిల్స్ పంపారు. కాగా ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించేందుకు శబరి నదిపై ఒడిశాలోని మోటు, చింతూరు మండలం వీరాపురం నడుమ వంతెన నిర్మించాల్సి ఉంది. -
నేను బీఆర్ఎస్లో చేరడం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, ఒకవేళ కాంగ్రెస్‌ను కాదని బీఆర్ఎస్లో చేరితో అది ప్రాణ త్యాగమే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుంది. భద్రాచలం అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్‌లో చేరాను. అదే నమ్మకంతో కాంగ్రెస్ లోనే ఉంటా. తిరిగి బీఆర్ఎస్లో చేరనున్నానేది అవాస్తవమని తెలిపారు. భద్రాచలం ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అయితే లోక్‌సభ ఎన్నికల ముందు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ వీడి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.తాజాగా ఆయన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఛాంబర్‌కి వెళ్లారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక్, మల్లారెడ్డిలు ఉన్నారు. కేసీఆర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అనంతరం తెల్లం వెంకటరావు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు కలిసి బయటకు వెళ్లడంతో..తెల్లం వెంకట్రావు సైతం తిరిగి బీఆర్ఎస్ చేరనున్నారనే సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాను కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడం లేదని స్పష్టత ఇచ్చారు. -
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్ టచ్‌లోకి మరో ఎమ్మెల్యే
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రతిపక్షనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఛాంబర్‌కి వెళ్లారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక్, మల్లారెడ్డిలు ఉన్నారు. కేసీఆర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అనంతరం తెల్లం వెంకటరావు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు కలిసి బయటకు వెళ్లడంతో..తెల్లం వెంకట్రావు సైతం తిరిగి బీఆర్ఎస్ చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.జులై మొదటి వారంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎల్‌వోపీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం. సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి మళ్లీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో భేటీ అవ్వడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. -
భద్రాచలం వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు కాగా, 9,18,164 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.కాగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. -
శాంతిస్తున్న గోదావరి
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగు లు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో సోమవారం గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ఉగ్రరూపం దాలి్చన గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు.దానికి ఇంద్రావతి ప్రవాహం తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క) బ్యారేజ్‌లోకి చేరుతున్న 8.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బ్యారేజ్‌లోకి 9.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారంరాత్రి 9 గంటలకు నీటిమట్టం 42.90 అడుగులకు చేరుకుంది.దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమ య్యాయి. కాగా ముంపు కాలనీ వాసులను సోమవారం సైతం పునరావాస శిబిరాల్లోనే కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 11.78 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో స్పిల్ ఎగువన నీటిమట్టం 33.46 మీటర్లకు తగ్గింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,50,084 క్యూసెక్కులు చేరుతుండగా.. 14,42,384 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
శాంతించిన గోదావరి..
-
నెమ్మదించిన గోదారి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో పాటు తెలంగాణలో వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కి శనివారం సాయంత్రం 6 గంటలకు 5,39,200 క్యూసెక్కుల ప్రవాహం రాగా ఆదివారం అదే సమయానికి 4,06,510 క్యూసెక్కులకు తగ్గింది. సమ్మక్క బరాజ్ (తుపాలకుగూడెం)కి వరద 9,75,910 క్యూసెక్కుల నుంచి 8,45,560 క్యూసెక్కులకు తగ్గింది. సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) బరాజ్‌కి సైతం వరద 13,95,637 క్యూసెక్కుల నుంచి 11,65,362 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ మూడు బరాజ్‌లకు వచి్చన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద ఉదయం నుంచి తగ్గుముఖంశనివారం అర్ధరాత్రి భద్రాచలం వద్ద 53.60 అడుగులతో మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన వరద, ఆదివారం ఉదయం 6 – 7 గంటల మధ్య 53 అడుగుల దిగువకు రాత్రి 11గంటల కల్లా 47.20 అడుగులకు తగ్గింది. దీంతో తొలుత అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఆ తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ప్రవాహం సైతం 14,36,573 క్యూసెక్కుల నుంచి 11,08,154 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు ఏపీలోని చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కు లు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. వరద కాల్వకు జలకళ బోయినపల్లి (చొప్పదండి): మెట్టప్రాంత రైతుల వరప్రదాయని వరద కాల్వ ఆరు నెలల తర్వాత జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ మీదుగా రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మ«ధ్య మానేరుకు చేరుకుంటున్నాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర వరద కాల్వలో జలసవ్వడులు వినిపిస్తున్నాయి.భద్రాచలంలో ఇళ్లల్లోకి నీళ్లుభద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే పట్టణంలోని ఏఎంసీ కాలనీకి ఎగువ భాగాన ఉన్న కరకట్ట స్లూయిజ్ నుంచి ఆదివారం సైతం వరద నీరు లీక్ కావడంతో అశోక్‌నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు గ్రామాల నడుమ ఇంకా రాకపోకలు సాగడం లేదు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా వరద నీరు తగ్గింది. -
48 గంటలు అప్రమత్తంగా ఉండాలి
-
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.కాగా, భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గోదావరిలో నీటి మట్టం పెరిగింది. దీంతో, రానున్న 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం అలాగే కొనసాగుతోంది. ఇక, భద్రాచలం వద్ద ఈరోజు ఉదయం ఆరు గంటలకు గోదావరి వరద 53.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులకు నేడు సెలవును రద్దు చేశారు. అధికారులందరూ నేడు విధుల్లోనే ఉండనున్నారు.మరోవైపు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. గోదావరి నీటి మట్టం 15 అడుగులు నమోదైంది. దీంతో, 14 లక్షల 83 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వెళ్తోంది. ఇక, అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, గోదావరి వరద రోజుల తరబడి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అప్పన రాముని లంక, గంటి పెదపూడి లంకల వద్ద అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన లంక ప్రాంతాల్లో ట్రాక్టర్లు, కాలినడకన లంకవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. -
భద్రాచలం: గోదావరి మహోగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 53 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకోవడంతో చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భద్రాచలం నుంచి కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చర్ల, వెంకటాపురం, వాజేడు వెళ్లే రహదారులపైకి వరద నీరు రావడంతో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి.ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికతూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 13.9 అడుగులకు నీటిమట్టం చేరింది. సముద్రంలోకి 13 లక్షల 6వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బొబ్బిల్లంకలో ఏటిగట్లు కోతకు గురవుతోంది. గట్టుకు గండిపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇనుప బస్తాలతో మరమ్మత్తులు చేపట్టారు.జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు..చింతూరులో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 40 అడుగులకు నది నీటిమట్టం చేరింది. డొంకరాయి జలాశయానికి వరద పోటెత్తింది. 4 గేట్ల ద్వారా 10,936 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 9 రోజులుగా సుమారు 50 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. నాలుగు మండల్లాలల్లో జనజీవనం స్తంభించింది. జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరింది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,59,889 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 61,348 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా, ప్రస్తుత నీటి మట్టం 865.70 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 125.1322 టీఎంసీలు. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/ధరూరు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో శుక్రవారం రాత్రికి మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. గోదావరికి ఎగువన ఉన్న మహా రాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు కాళేశ్వరం, సమ్మక్క బ్యారేజీ వద్ద నుంచి పెరిగిన వరద గోదావరికి చేరుతుండగా నీటిమట్టం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. గురు వారం రాత్రి 11 గంటలకు 48.10 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం ఉదయం 8గంటలకల్లా తగ్గి 46.90 అడు గులకు చేరింది.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కానీ ఆతర్వాత పెరుగుతూ రాత్రి 9:15 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, వరదతో ముంపు గ్రామాల రైతులు పంట కాలం ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతుండగా.. రహదా రుల పైకి నీరుచేరి ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రవాణా స్తంభించింది. నిలకడగా జూరాలజూరాల ప్రాజెక్టులో వరద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవా రం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టుకు 2,65,000 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 36 క్రస్టు గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,30,283 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 19,668 క్యూసెక్కులు, భీమా, నెట్టంపాడు, కుడి, ఎడమ కాల్వలకు కలిపి మొత్తం 2,53,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
భద్రాచలంలో ఉరకలేస్తున్న గోదావరి (ఫొటోలు)
-
ఉరకలేస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, తూర్పుగోదావరి/ఖమ్మం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా వస్తోంది. నీటిమట్టం 13.9 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 13 లక్షల 9వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అన్నంపల్లి అక్విడెట్, యానాం దగ్గర గౌతమి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.భద్రాచలంలో కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రస్తుతం 52 అడుగులకు నీటిమట్టం చేరింది. 13 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 53 అడుగులకు చేరితే చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో గోదారి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.గోదావరి నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వెళ్లే మార్గంలో తూరుబాక బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం మొండికుంట నుంచి ఇరవెండి రహదారిపై గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రామచంద్రాపురం స్టేజి వద్ద గల కడియాలబుడ్డి వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రభావం తగ్గింది. ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 6470 క్యూసెక్కులు ఉండగా, అడుగు మేర 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా: మిడ్ మానేరుకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 640 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 62 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ సామర్థ్యం 27.5 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 5.80 టీఎంసీలు.అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం, తెన్నేటి విశ్వనాథం పెద్దేరు జలాశయంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం కెపాసిటి 137 కాగా. ప్రస్తుతం 136కి చేరుకుంది. జలాశయం లోకి ఇన్ ఫ్లో 518 క్యూసెక్కుల నీరు. మూడు గేట్లు ద్వారా 456 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.కర్నూలు జిల్లా: తుంగభద్ర డ్యామ్‌కు వరద కొనసాగుతోంది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 90 టీఎంసీలు. ఇన్ ఫ్లో.. 92,636, ఔట్ ఫ్లో..11,657 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉగ్ర గోదావరి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలు, పోటెత్తుతున్న ఉప నదులు కలసి దిగువ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ గోదావరిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. దానికి దిగువన కడెం ప్రాజెక్టు నుంచి, వాగుల నుంచి వస్తున్న వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది.అయితే దాని దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ (లక్షి్మ) బరాజ్‌కు 9,54,130 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహానికి ఇతర ఉప నదులు, వాగులు కలసి.. తుపాకులగూడెం (సమ్మక్క), దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌ల వద్ద మరింత ఎక్కువగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు 50.20 అడుగులుగా...భద్రాచలం వద్దకు వచ్చేసరికి గోదావరి ఉగ్ర రూపం దాల్చు తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 50.20 అడుగుల నీటిమట్టంతో 13 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. భద్రాచలం నుంచి వెళ్తున్న నీరంతా పోలవరం, ధవళేశ్వరం మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వరద ప్రమాదకర స్థాయికి పెరిగే చాన్స్ మధ్య గోదావరి సబ్ బేసిన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నీళ్లన్నీ గోదావరిలోకి చేరేందుకు ఒక రోజు పడుతుంది. దీంతో మంగళవారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరవచ్చని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. భద్రాచలం వద్ద వరద 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన ములుగు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం పర్యటించారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి నది, సామాజిక ఆస్పత్రిని, పలు వరద ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలుమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వానలతో గోదావరి నది పోటెత్తుతోంది. కొన్ని నెలలుగా సరిగా వానల్లేక, నీటికి కటకటతో ఇబ్బందిపడగా.. ఇప్పుడు భారీగా వరదలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తేయడం, నీటి ఎత్తిపోతలు చేపట్టకపోవడంతో నీళ్లన్నీ వృధాగా వెళ్లిపోతున్నాయి. మరోవైపు ఎగువ గోదావరిలో పెద్దగా ప్రవాహాలు లేక ఎల్లంపల్లిలోకి నీటి చేరిక మెల్లగా కొనసాగుతోంది.మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే.. అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లిని నింపుకొని, అక్కడి నుంచి మిడ్‌మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ తదితర రిజర్వాయర్లను నింపుకొనే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. కానీ గోదావరి నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేక వరద అంతా సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం.. గోదావరిలో ఈ నెల 17 నుంచి సోమవారం సాయంత్రం వరకు 200 టీఎంసీల మేర నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఎగువ నుంచి నీళ్లు రాక, కాళేశ్వరం లిఫ్టింగ్ లేక.. ఈసారి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమేనన్న చర్చ జరుగుతోంది. -
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
గంట గంటకు పెరుగుతున్న గోదావరి ముంపు గ్రామాలు ఖాళీ
-
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
పోటెత్తుతున్న ‘గోదావరి’
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉప నదులు శబరి, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని కూడా పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి పోటెత్తుతోంది. గోదావరికి ఎగువున ప్రాణహిత తోడవ్వడంతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లోకి ఆదివారం సా.6 గంటలకు 5,52,600 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లు ఎత్తేసి, వచి్చంది వచి్చనట్లుగా దిగువకు వదిలేస్తున్నారు.ఈ ప్రవాహానికి ఇంద్రావతి వరద జత కలిసింది. దీంతో తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి 8,23,450 క్యూసెక్కులు చేరుతుండడంతో అంతేస్థాయిలో గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో దుమ్మగూడెం (సీతమ్మ సాగర్) బ్యారేజ్‌లోకి 9,01,989 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడా వ చి్చంది వచి్చనట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రవాహం కలుస్తోంది. ఫలితంగా.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది.ఆదివారం సా.6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసి.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక.. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. ఇక ఈ వరదలు విలీన మండలాల వాసుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కూనవరం వద్ద శబరి దూకుడు.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో శనివారం భారీ వర్షాలు కురవడంతో శబరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరి దూకుడుతో కూనవరం వద్ద నీటి మట్టం 36.74 మీటర్లకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసిన అధికారులు.. పరివాహక ప్రాంతంలో పల్లపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టులోకి 8,57,707 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే ఎగువన నీటిమట్టం 32 మీటర్లకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తేసి.. మొత్తం 8.60లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నేడు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ? ఇక ఆదివారం సా.6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,74,171 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 7,72,371 క్యూసెక్కులను 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 149.03 టీఎంసీలు సముద్రంలో కలిస్తే.. గతేడాది ఇదే సమయానికి 77.79 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఆదివారం కూడా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం.. ఇప్పటికే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో సోమవారం పేరూరు–ధవళేశ్వరం మధ్య గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. దీంతో సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి చేరే వరద పది లక్షల క్యూసెక్కులను దాటే అవకాశముందని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే.. సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఇళ్లలోకి వరదనీరు.. మరోవైపు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోని టోల్గేట్ సెంటర్‌తో పాటు సంతపాకలు, శబరిఒడ్డు ప్రాంతాల్లోని ఇళ్లలోకి క్రమక్రమంగా వరదనీరు ప్రవేశిస్తోంది. చింతూరు మెయిన్‌రోడ్ సెంటర్ నుండి శబరి ఒడ్డుకు వెళ్లే రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడున్న వివిధ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య.. చింతూరు మండలంలోని సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వంతెన వద్ద ఆదివారం రాత్రికి శబరినది నీటిమట్టం 40 అడుగులకు చేరుకుంది.కుయిగూరు వాగు ఉధృతితో కల్లేరు వద్ద రహదారి కోతకు గురైంది. దీంతో ఏపీ నుండి ఒడిశాకు రాకపోకలు రెండోరోజూ కూడా కొనసాగలేదు. అలాగే, చింతూరు మండలం చట్టి వద్ద వరదనీరు విజయవాడ, జగదల్పూర్ జాతీయ రహదారి–30 పైకి చేరడంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. వందలాది వాహనాలు సైతం నిలిచిపోయాయి. ఇక వీఆర్ మండలంలోని గోదవరి, శబరి ఉభయ నదుల పరివాహక గ్రామాల ప్రజలు వరదతో భయాందోళనకు గురవుతున్నారు. వడ్డిగూడెంతోపాటు మరికొన్ని చోట్ల కూడా గ్రామస్తులు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. జలదిగ్బంధంలో ‘వేలేరుపాడు’30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్.. మూడ్రోజులుగా అంధకారంలో పల్లెలుపొంగిపొర్లుతున్న వాగులు.. ఉగ్రరూపం దాలి్చన గోదావరి, శబరి నదులతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. వేలేరుపాడు మండలానికి దిగువనున్న మేళ్ల వాగు, ఎద్దుల వాగు, టేకూరు వాగుల వంతెనలు నీట మునగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. నార్లవరం, కన్నాయగుట్ట, జీలుగు చెరువు వద్ద రహదారంతా కూడా నీట మునిగింది.ఇక వేలేరుపాడు నుంచి రుద్రమకోట, తాట్కూర్ గొమ్ము, రేపాక గొమ్ము వెళ్లే రహదారులూ నీట మునిగాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. భారీ వర్షాలతో 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మూడ్రోజులుగా విద్యుత్ సరఫరాలేక ఆయా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. -
భద్రాద్రికి పోటెత్తిన గోదావరి పరవళ్లు..
-
భద్రాచలం: గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తుతున్న వరద
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఉదయo 10 గంటలకు 37.7 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో 7 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.పర్ణశాల వద్ద నారా చీరల ప్రాంతం నీట మునిగింది. తెలంగాణాతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న సరిహద్దు రాష్ట్రలైన ఛత్తీస్గడ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగి గోదావరిలోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే భారీ వరదల కారణంగా అనేక చోట్ల రవాణకీ తీవ్ర అంతరాయం కాగా, పలుగ్రామాల్లో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. అధికారులు అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు.భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీటిమట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి సోకిలేరు వాగు, అన్నవరం వాగు కొండరాజుపేట, వాగు చీకటి వాగు, అత్త కోడళ్ళ వాగు ఉదృతంగా ప్రవహించడంతో రహదారులపైకి వరద నీరు చేరుకుంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శబరి నది కూడా పోటెత్తి ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. -
వరద గోదారి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్‌ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్‌లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్‌లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. 6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలుమేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిపేరుకు పోటెత్తిన వరదభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది. -
అయ్యో రియాన్షిక.. ప్రాణం తీసిన పెన్ను
భద్రాచలం అర్బన్, సాక్షి: కళ్ల ముందే చిరునవ్వులతో హోం వర్క్ చేస్తున్న చిన్నారి(4) ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. తలలో పెన్నుతో నరకయాతన పడుతున్న ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఎలాగైనా ఆమెను బ్రతికించుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ, విధికి కన్నుకుట్టి ఆ పసికందు ప్రాణాన్ని బలిగొంది.భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నారి రియాన్షిక తలలో పెన్ను గుచ్చుకుని ప్రాణం పొగొట్టుకుంది. సోమవారం రాత్రి ఆమె హోం వర్క్ చేస్తున్న టైంలో బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. అయితే ప్రమాదవశాత్తు పెన్ను ఆమె తలలో గుచ్చుకుంది. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతికష్టం మీద వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ను తొలగించారు. పెన్ను తొలగించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్టేనని వైద్యులు భావించారు. ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వైద్యులకు ఫోన్ చేసి ఆరా తీశారు. కానీ, పరిస్థితి విషమించి రియాన్షిక కన్నుమూసింది. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడంతోనే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. బతికిందని సంతోషించే లోపే బిడ్డ మృతి చెందిందన్న వార్త విని ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుండెలు అవిసేలా రోదిస్తుండడం.. చూసేవాళ్లను కంటతడి పెట్టిస్తోంది. -
జగదభిరాముడికి పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో చతుఃస్థానార్చన హోమం జరిపారు. 10 గంటలకు శంఖు, చక్ర, ధనుర్బాణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తిని మేళతాళాలు, కోలాటం, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పల్లకీ సేవగా తీసుకొచ్చి మిథిలా స్టేడియంలోని వేదికపై సింహాసనంలో కొలువుదీర్చారు. శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించేందుకు వైదిక మంత్రాలతో వశిషు్టడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు, సుయజు్ఞడులను వేద పండితులు వరింపజేసుకున్నారు. మధ్యా హ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్రకిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవా హన చేసి రాజముద్రికను కుడిచేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు. రామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరాముడికి, చింతాకు పతకం సీతాదేవికి, రామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు. స్వర్ణఛత్రం నీడలో ఎడమవైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో శ్రీరాముడు దర్శ నం ఇవ్వగా, తిలకించిన భక్తులు పులకించిపోయారు. అనంతరం మండపత్రయంలో మంత్రించిన జలాలను శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకాన్ని పూర్తి చేశారు. చివరగా ముత్యాల దండతో ఆంజనేయుడికి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలకు హాజరైన గవర్నర్ పట్టాభిషేక వేడుకకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువ్రస్తాలు సమ ర్పించారు. మొదట ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకోగా పండితులు వేదాశీర్వచనం అందచేశారు. పట్టాభిషేకం పూర్తి కావడంతో.. ఈనెల 23 వరకు జరిగే వసంత పక్ష ప్రయుక్త తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాలు ముగిశాయి. రామరాజ్యమే ప్రతి ఒక్కరి ఆశయం కావాలి: గవర్నర్ రామరాజ్యం నిర్మించడమే ప్రతి ఒక్కరి ఆశయం కావాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రామరాజ్యంలో ప్రతి ఒక్కరి హక్కులకు రక్షణ ఉంటుందని, తప్పులకు చోటులేదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు. సమాజంలో కుటుంబాలు మరింత ఐక్యంగా ఉండాలని, తద్వారా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఎవరికీ అన్యాయం చేయకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. -
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం (ఫొటోలు)
-
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సిరిసిల్ల: భద్రాచలంలో సీతారాముల కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్లకు వేదపండితులు లఘు కల్యాణం నిర్వహించి లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకువచ్చారు. కల్యాణ మండపంలో శ్రీరాముడిని సింహాసనంలో, ఆయనకు ఎదురుగా గజాసనంపై సీతమ్మవారిని కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు సీతారాముల ఉత్సవమూర్తుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం సీతమ్మ వారికి మాంగల్యధారణ చేసి వెండి పాత్రల్లో ఉంచిన ముత్యాల తలంబ్రాలను సీతారాములపై పోశారు. ఆ తర్వాత తలంబ్రాలతో వేడుక నిర్వహించారు. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను, త్రిదండి చినజీయర్ స్వామి మఠం, శృంగేరి పీఠం, శ్రీరంగం, టీటీడీ తరఫున ప్రతినిధులు వ్రస్తాలను సమర్పించారు. ఈ వేడుకకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేశ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.హæరినాథ్, జస్టిస్ రవినాథ్ తిల్హారి హాజరయ్యారు. గురువారం మిథిలా స్టేడియంలో పట్టాభిõÙక మహోత్సవం జరగనుంది. కల్యాణోత్సవానికి తాను నేసిన బంగారు, వెండి జరీ పోగుల చీరను సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ కానుకగా అందించారు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం శాస్త్రోక్తం గా ధ్వజారోహణం 22న కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు ఒంటిమిట్ట: వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మలనం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఉత్సవాల్లో ప్రధానంగా ఈ నెల 20న హనుమంత వాహనం, 22న కల్యాణోత్సవం, 23న రథోత్సవం, 25న చక్రస్నానం నిర్వహించనున్నారు. 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగనుంది. ఈ వేడుక చూసేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారామ లక్ష్మణులు ఒంటిమిట్ట పురవీధుల్లో శేషవాహనంపై విహరించారు. -
Bhadrachalam Sri Rama Navami: భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు (ఫొటోలు)
-
Watch Live: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం
-
ముస్తాబైన భద్రాచలం
-
భద్రగిరికి కళ్యాణ శోభ.. ఎదుర్కోలు వేడుకలో సీతా, రాముడు (ఫొటోలు)
-
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తొలుత కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ కూడా శ్రీరామ కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుని అనుమతివ్వడం గమనార్హం. కాగా, భద్రాచల శ్రీరాముని కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం సీఈవో వికాస్‌రాజ్‌కు లక్ష్మణ్ నేతృత్వంలో వినతిపత్రం సమర్పించారు. -
నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ మంటపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి తంతు ఇలా.. ఉదయం 9:30 గంటల తర్వాత శంఖ, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో మిథిలా స్టేడియంలోని కల్యాణ మంటపానికి తీసుకొస్తారు. వేదికపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేస్తారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావిస్తారు. ఆ తర్వాత యోద్వాహం నిర్వహించి అప్పటివరకు మంటపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఆ తర్వాత సీతమ్మకు యోక్త్ర బంధనం చేస్తారు. ఆపై సీతారాముల వంశగోత్రాల ప్రవరలు ఉంటాయి. అనంతరం కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వ్రస్తాలను సీతారాములకు ధరింపజేస్తారు. అదే విధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చల హారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు. అభిజిత్ లగ్నంలో చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామి, అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళ హారతి అందిస్తారు. కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు. పూర్తయిన ఏర్పాట్లు సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి వేర్వేరు ధరల్లో టికెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామ నవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వేసవి కావడంతో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో భద్రాద్రితో భక్తులకు వసతి లభించడం దుర్లభంగా మారింది. లాడ్జీల్లో రేట్లు రెండు, మూడింతలు పెంచేశారు. పెరిగే ట్రాఫిక్‌కు తగ్గట్టుగా గోదావరిపై రెండో వంతెనను అందుబాటులోకి తెచ్చారు. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది. నవమి ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం చెల్లుబాటు అవుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఘనంగా ఎదుర్కోలు వేడుక శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయంలో మంగళవారం రాత్రి ఎదుర్కోలు వేడుకను కనుల పండువగా నిర్వహించారు. రామయ్య తరఫున కొందరు, సీతమ్మవారి తరఫున కొందరు అర్చకులు విడిపోయి ‘మా వంశమే గొప్పదంటే..కాదు కాదు.. మా వంశమే గొప్ప’అంటూ సంవాదం చేసుకుంటూ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు. -
భద్రాచలం: రామా కనవేమిరా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూద్దామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భద్రాచలంలో వసతి, సౌకర్యాలకు నోచుకోవడంలేదు. అధికారులు దశాబ్దాలుగా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు తప్ప సామాన్య భక్తులను పట్టించుకోవడంలేదు. ఒక్కరోజులోనే ఏసీ గదులు బుకింగ్.. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు దేవస్థానానికి చెందిన సత్రాలు, కాటేజీలతోపాటు ప్రైవేటు లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గదులను బుక్ చేసుకునేందుకు దేవస్థానం ఆన్లైన్లో అవకాశం కల్పించింది. ఈ నెల 17,18 తేదీల్లో కల్యాణం, పట్టాభిషేకం ఉండగా, 11 నుంచి ఆన్లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇలా బుకింగ్స్ మొదలయ్యాయో లేదో ఇటు దేవస్థానం, అటు ప్రైవేటు లాడ్జీల్లో ఉన్న ఏసీ గదులన్నీ బుక్ అయిపోయాయి. సింగిల్ రూమ్ మొదలు సూట్ వరకు ఏ ఒక్కటీ అందుబాటులో లేవు. వేసవిలో భద్రాచలంలో నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. దీంతో ఏసీ రూమ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. నాన్ ఏసీలదీ అదే బాట నాన్ ఏసీ గదులకు సంబంధించి దేవస్థానం ఆధ్వర్యంలోని కుటీరాలు, సత్రాల్లోని గదులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. కేవలం ప్రైవేటు లాడ్జీల్లో నాన్ ఏసీ గదులే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఈ నెల 16 సాయంత్రం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల ప్యాకేజీతో లభిస్తున్నాయి. ఇవి సింగిల్ రూమ్‌కి రూ.1,732 మొదలు ట్రిపుల్ రూమ్‌కు రూ. 3,464 వరకు చార్జీలుగా ఉన్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇంత ధర చెల్లించేందుకు కూడా భక్తులు పోటీ పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి ఈ గదులు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. భద్రాచలంలో ఉన్న గదులన్నీ ఆన్లైన్లో ముందుగానే బుక్ అయిపోతే నవమి రోజు ఇక్కడికి చేరుకునే సామాన్య భక్తులు, అడ్వాన్స్ రిజర్వ్ చేసుకోని వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. డార్మిటరీలు కరువే నవమి వేడుకలు చూసేందుకు యాభై వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఇలా వచ్చే భక్తుల్లో సగం మంది ఉదయమే (ఏప్రిల్ 17) భద్రాచలం చేరుకుని కల్యాణం చూసుకుని, దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఇలాంటి వారికి వసతితో పెద్దగా అవసరం పడదు. కానీ స్నానాలు చేసేందుకు, సామన్లు దాచుకునేందుకు అనువుగా నామామాత్రపు సౌకర్యాలను ఈ భక్తులు ఆశిస్తారు. ప్రస్తుతం భద్రాచలంలో ఈ సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు గోదావరి నదినే స్నానాలకు దిక్కవుతోంది. తమతో పాటు తెచ్చుకున్న లగేజీని దాచుకోవడం కష్టంగా మారుతోంది. బొమ్మలు, కొబ్బరికాయల దుకాణాలే క్లోక్‌రూమ్ సేవలు అందిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భద్రాచలంలో ఎప్పుడో దశాబ్దాల కిందట కట్టిన సత్రాలు, ప్రైవేటు లాడ్జీలే ఆశ్రయం కల్పిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంలో 32 గదులు, జానకీ సదనంలో 32 గదులు తప్ప మరో నిర్మాణం జరగలేదు. మరోవైపు ప్రైవేటు సెక్టారులో ఒకటి రెండు హోటళ్లు, కుల సంఘాల ఆధ్వర్యంలో సత్రాలు అందుబాటులోకి వచ్చాయి. హోం స్టే పద్ధతి అమల్లోకి తెస్తే.. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా భద్రాచలంలో మౌలిక సదుపాయలు మెరుగుపరచడంపై దేవస్థానం, ప్రభుత్వం, భద్రాచలం పంచాయతీలు ప్రయత్నించడం లేదు. ఫలితంగా శ్రీరామనవమి, ముక్కోటి, ఇతర పర్వదినాలు, సెలవు రోజుల్లో భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దాతల ద్వారా నిధులు సమీకరించి కొత్తగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు. ఇతర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్టుగా ‘హోం స్టే’ పద్ధతిని భద్రాచలంలో అమల్లోకి తీసుకురావడంపై కనీస స్థాయిలో కూడా ప్రయత్నాలు జరగడం లేదు. భద్రాచలంలో ఉన్న స్థానికులకు హోం స్టే విధానంపై అవగాహన కలిగిస్తే పైసా ఖర్చు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం సాధ్యం అవుతుంది. కానీ ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఎంత సేపు అరకొర సౌకర్యాల నడుమ ఉన్న మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేయడం, సెక్టార్లుగా విభజించి టిక్కెట్ల అమ్మకాలు సాగించడంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చివరికి భద్రాద్రిలో తమ ఇబ్బందులు తీర్చాలంటూ ఆ రామయ్యకే మొర పెట్టుకుని వెళ్లిపోతున్నారు. -
శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా.. ముస్తాబవుతున్న భద్రాద్రి (ఫొటోలు)
-
Telangana Temple Photos: ఈ ప్రముఖ దేవాలయాలు మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
ఆడబిడ్డల పేరిట ఇందిరమ్మ ఇళ్లు
మహిళల పేరిటే ‘ఇందిరమ్మ’ ఇళ్లు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే. ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టా మహిళల పేరుతోనే ఉంటుంది. తద్వారా ఆ ఇల్లు బాగుంటుంది. పిల్లలు చదువుకుంటారు. ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతుకుతుందనేది మా ప్రభుత్వ భావన. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని.. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టేనని, అందుకే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే ఇస్తామని చెప్పారు. సోమవారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. తర్వాత ఇక్కడి వ్యవసాయ మార్కెట్ మైదా నంలో నిర్వహించిన సభలో ఇందిరమ్మ ఇళ్ల పథ కాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. రేవంత్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘భద్రాచలం రాముడి సాక్షిగా ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదల చిరకాల కోరిక ఇది. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్లు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే, పది మందిలో తలెత్తుకొని నిలబడాలంటే సొంతిల్లు ఉండాలని ఆలోచించి నాడు వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాశమే హద్దుగా లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. పేదలు నేటికీ ఆ ఇళ్లలో ఉంటున్నారు. నాటి పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. పెళ్లయి పిల్లలతో కుటుంబంగా మారారు. వారు కూడా సొంతింట్లో ఆత్మగౌరవంతో బతకాలనే ఆశయంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ అబద్ధాలకు కాలం చెల్లింది 2014 ఎన్నికలకు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బె డ్రూం ఇల్లు ముద్దు అంటూ పేదల సొంతింటి కలలతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారు. పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఇదే కథ మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాల కు కాలం చెల్లడంతోనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మేం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేస్తాం. డబుల్ బెడ్రూం ఇళ్లున్న ఊళ్లలో కేసీఆర్ ఓట్లు వేయించుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లలోనే మేం ఓట్లు వేయించుకుంటాం. ఇందుకు కేసీఆర్ సిద్ధమా? ఆ ఊళ్లలో ఓట్లు వేయించుకోండి ప్రధాని మోదీ మాటలకు హద్దే లేదు. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసి తీయని మాటలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు. 2022 నాటికి దేశంలోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని గత ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి కేంద్రం రాష్ట్రంలో ఎక్కడ ఇళ్లు కట్టించిందో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ చెప్పాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లున్న చోట బీజేపీ నాయకులు ఓట్లు వేయించుకోవాలి. మేం అక్కడ ఓట్లు అడగబోం. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ పెట్టుబడి కూడా రాక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. భద్రాచలం రిటైనింగ్ వాల్‌కు రూ.500 కోట్లు గోదావరి ముంపు నుంచి భద్రాచలం పట్టణాన్ని రక్షించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. రాముల వారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి తుమ్మల అడిగారు. అన్నింటినీ పరిశీలిస్తాం. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నందునే ముగ్గురు మంత్రులను ఇచ్చాం. ఇటీవల రేణుకాచౌదరిని రాజ్యసభకు ఎంపిక చేశాం..’’అని రేవంత్ చెప్పారు. సభలో పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు చెందిన పలువురు మహిళలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రులతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా సీఎం భద్రాచలం పర్యటన సందర్భంగా కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాములవారిని దర్శించుకున్న సీఎం, మంత్రులు భద్రాచలం అర్బన్: భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్, మంత్రులు తొలుత శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం, మంత్రులకు అర్చకులు పరివట్టం కట్టి పూర్ణకుంభంతో ఆహ్వనించారు. గర్భగుడిలో సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి, బెల్లంతో చేసిన రాముల వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. పేదలు గుర్తుంచుకునే రోజు ఇది..: భట్టి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన, పేదలు గుర్తుంచుకునే సందర్భం ఇది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘‘పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం సీతారామచంద్రస్వామి పాదాల సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద, బలహీన వర్గాల వారు రాములవారి సన్నిధిలో ఇంటి పత్రాలు పొందడం శుభకరం. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని అటకెక్కిస్తే.. మేం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ప్రారంభించాం. దళిత, గిరిజనులు ఇల్లు కట్టుకోవడానికి రూ.6 లక్షలు, మిగతా వర్గాలకు రూ.5 లక్షలు ఇస్తాం. బీఆర్ఎస్లా హామీలిచ్చి విస్మరించకుండా.. బడ్జెట్లో నిధులు కేటాయించాకే పథకాలను ప్రారంభిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తొలి దఫాగా రూ.7,740 కోట్లు కేటాయించాం..’’అని చెప్పారు. -
మహిళలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: డ్వాక్రా మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేశామని పేర్కొన్న భట్టి విక్రమార్క.. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు. -
భక్తరామదాసు విగ్రహం ఇదిగో!
నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నివాసంలో కొనసాగుతున్న ధ్యాన మందిరంలోని కాంస్య విగ్రహం, ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉన్న మరో విగ్రహాన్ని కళాకారులు తమ ఊహల మేరకు రూపొందించారు. ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. దీంతో ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, కోకన్వినర్ కట్టా శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై బి.సతీశ్ చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేశారు. రామదాసు జయంతి ఉత్సవాల నాటికి ఈ విగ్రహం ప్రతిష్టాపనపై భద్రాచలం దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించాలని వారసులు కోరారు. విగ్రహం ఎలా ఉందంటే.. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది. కాగా, ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడుభక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు ఎలా చేరింది? నేలకొండపల్లిలో పాత సెంటర్‌గా పేరున్న రావిచెట్టు బజార్లో చాలా ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఉండేది. 1997లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌కు పాత స్టేషన్ నుంచి ఫరి్నచర్, తాజాగా బయటపడిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు తొర్రలో భద్రపర్చగా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఆ విగ్రహం పాత పోలీసుస్టేషన్‌కు ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఎక్కడా రికార్డులు లేవని చెపుతున్నారు. -
శ్రీ రామునికి అయోధ్య జన్మస్థానం..భద్రాచలం కర్మ స్థానం..
-
భద్రాచలంలో అయోధ్య బాలరామ ప్రాణప్రతిష్ట వేడుకలు
-
ఇంటికో ఇప్పమొక్క!
ఒకప్పుడు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇప్పపూల సేకరణ జోరుగా సాగేది. ఏటా వందల క్వింటాళ్లు... ఒక్కో ఏడాది అంతకు మించి ఇప్పపూవు సేకరించే గిరిజనులు జీసీసీకి అమ్మి ఆర్థికంగా ఎంతోకొంత లబ్ధి పొందేవారు. తద్వారా వారికి ఉపాధి లభించడమే కాక ఆ పూవును మరింత శుద్ధి చేసి అమ్ముతూ జీసీసీ సైతం ఆదాయం గడించేది. కానీ రానురాను రకరకాల కారణాలతో ఇప్ప పూల సేకరణ తగ్గిపోయి అటు గిరిజనులు, ఇటు జీసీసీ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సేకరణను గాడిలో పడేసేలా రాష్ట్రంలోనే ప్రత్యేకంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చొరవ తీసుకుని అడుగులు వేస్తున్నారు. – సాక్షి, ఖమ్మం డెస్క్ అడవి లేక.. చెట్లు కానరాక పునర్విభజనతో భద్రాచలానికి సమీపాన ఉన్న చిక్కని అటవీ ప్రాంతం ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో అక్కడి గిరిజనులు ఇప్పపూవు సేకరించి పాడేరు ఐటీడీఏ పరిధి జీసీసీకి అమ్ముతున్నారు. ఇదేకాక పోడు సాగుతో ఇప్ప చెట్ల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. అదేవిధంగా భద్రాచలం జీసీసీకి గిరిజనులు ఇస్తున్న ఇప్పపూవు పరిమాణమూ తగ్గుతోంది. ఇక ఇప్పపూవు సేకరణ, శుద్ధి, అమ్మితే సమకూరే ఆదాయంపై ఆదివాసీ, గిరిజనులకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. ఏడాది క్రితం భద్రాచలం ఏటీడీఏ పీఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్‌జైన్ గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగపడేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీసీసీ ఆధ్వర్యాన సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులపై ఆరా తీయగా ఇప్పపూవు విషయంలో హెచ్చుతగ్గులు గుర్తించి మళ్లీ గాడిన పడేయాలని రంగంలోకి దిగారు. గత ఏడాది 327 క్వింటాళ్లు భద్రాచలం జీసీసీ పరిధిలో ఆరు సబ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరం(2022–23)లో 327 క్వింటాళ్ల ఇప్ప పూవు సేకరించారు. అయితే, పదేళ్ల క్రితం వందలు దాటి వేల క్వింటాళ్లు సేకరించిన దాఖలాలూ ఉన్నాయి. ఇప్పపూవు నాణ్యత ఆధారంగా కేజీకి రూ.30 నుంచి రూ.35 చొప్పున జీసీసీ నుంచి గిరిజనులకు చెల్లిస్తారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఇల్లెందు, కరకగూడెం నుంచి ఎక్కువగా ఇప్పపూవు తీసుకొ స్తున్నారని జీసీసీ అధికారులు చెబుతున్నారు. ఏం చేస్తారంటే? జీసీసీ ద్వారా సేకరించిన ఇప్పపూవును మరింత శుద్ధి చేస్తారు. దీన్ని ఎక్కువగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వ్యాపారులు లేదా అక్కడి ప్రజలు నేరుగా కొనుగోలు చేస్తారు. వీరు ఇప్పపూలతో గారెలు, లడ్డూలు, ఇతర వంటకాలు చేసుకుంటారు. మరోపక్క అనధికారికంగా ఇప్పపూలతో సారా కాచి తాగడం ఆదివాసీల్లో ఏళ్ల నుంచి ఆచారంగా కొనసాగుతోంది. పర్ణశాలలో అమ్మకం శ్రీసీతారామచంద్రస్వామి వన వాసానికి వచ్చినప్పుడు భద్రాచలం సమీపాన దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు వచ్చినట్లు పురాణాల్లో ఉంది. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అన్ని అటవీ ఫలాలతో పాటు ఇప్పపూవు తీసుకున్నారని భక్తులకు నమ్మకంగా చెప్పే చిరువ్యాపారులు పర్ణశాల వద్ద ఇప్పపూలను కుప్పలుగా పోసి అమ్మడం కనిపిస్తుంది. కానీ దీనికి ఎలాంటి చారిత్రక, పురాణ ఆధారాలు లేవని అర్చకులు చెబుతారు. అయినప్పటికీ పర్ణశాల, భద్రాచలం వచ్చిన భక్తులు ఎంతో కొంత ఇప్పపూవు కొనుగోలు చేసి తీసుకెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 25వేలకు పైగా మొక్కలు ఇప్పపూవు సేకరణ పెరగాలంటే అదే సంఖ్యలో మొక్కలు ఉండాలి. అందుకోసం అటవీ శాఖ నుంచి 25వేలకు పైగా మొక్కలు సేకరించిన పీఓ.. ప్రతీ గిరిజన కుటుంబానికి ఒక్కో మొక్క పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ మొక్కలు ఉచితంగానే ఇవ్వాలని తొలుత భావించినా.. అలా చేస్తే నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపరనే ఆలోచనతో నామమాత్రపు ధర నిర్ణయించారు. ‘ఇంటికో ఇప్పమొక్క’పేరిట ఆరంభించిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చేలా స్వయంగా పీఓ సైతం ఐటీడీఏ కార్యాలయంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చి ఇప్పమొక్కలు వనాలైతే పూల సేకరణ ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే కాక జీసీసీకి సైతం ఆదాయం పెరగనుందని చెబుతున్నారు. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్: జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి భారీ స్పందన వస్తోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ బస్సులో చూసిన 70శాతం వరకు మహిళలే కనిపిస్తున్నారు. పలు రూట్లలో బస్ సర్వీసులు సరిపోకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వెల్లువెత్తుతున్నాయి. మహిళల సీట్లు నిండిపోవడంతో పురుషుల సీట్లలోనూ కూర్చుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగా సీట్ల కోసం పలుచోట్ల పంచాయితీలు కూడా జరుగుతున్నాయి. తాజాగా భద్రాచలంలో ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. క్రిస్మస్ పండగ కావడంతో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు కొనసాగించారు. ఈ క్రమంలో సీటులో కూర్చునే విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ మొదలైంది. ఇది పెరిగి పెద్దది కావడంతో ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. చివరికి మిగిలిన మహిళలు సర్ధిచెప్పడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇదిలా ఉండగా కర్ణాటకలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ బాగానే ఉంది. ఏదో విషయంలో గొడవ పడిన కొదరు మహిళలు బస్సు దిగి దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్: పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు
-
ముక్కోటికి రెడీ! వీఐపీల తాకిడితోనే అసలు సమస్య!!
భద్రాచలం: ముక్కోటి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా ఈ నెల 22న రాత్రి గోదావరిలో హంసవాహనంపై రామయ్య తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 23న తెల్లవారుజామున ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరపనున్నారు. దీంతో ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానం, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. తెప్పోత్సవం జరిపే హంసవాహనం ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఉత్తర ద్వార దర్శనం వీక్షణకు సెక్టార్ల వారీగా విభజనతోపాటు ప్రధాన ద్వారాల వద్ద తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఏర్పాట్లపై కలెక్టర్ ప్రియాంక ఆల పలుమార్లు సమీక్షలు జరిపారు. ఎస్పీ వినీత్‌తో కలిసి పర్యవేక్షించి పలు సూచనలు అందజేశారు. వీఐపీల తాకిడితోనే అసలు సమస్య! ప్రతి ఏడాది వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనికి తోడు వీఐపీ సెక్టార్లలో అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించి కిక్కిరిసి ఉండటం, నిలబడి వీక్షించడంతో వెనుక సెక్టార్లలో ఉన్న భక్తులు ఉత్తర ద్వార దర్శనంను వీక్షించే అవకాశం ఉండటం లేదు. ఈ సమస్యను అధికారులు గుర్తించి నివారించాల్సి ఉంది. ఈ ఏడాది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకు అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సైతం హాజరయ్యే అకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రుల అనుచరులు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు. దీంతో రద్దీ పెరిగి సెక్టార్లు, అంతరాలయం వద్ద సామాన్య భక్తులు ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. ఈ సమస్యను దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులు గమనించి అధిగమించాలని పలువురు కోరుతున్నారు. -
భద్రాచలంలో విషాదం.. నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం కేటీఆర్ పర్యటనకు బందోబస్తు వచ్చిన కొత్తగూడెం వన్ టౌన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి ప్రమాదవశాత్తు అన్నదాన సత్రం దగ్గర ఉన్న నాలాలో పడి మృతి చెందింది. గోదావరి కరకట్ట స్లూయిస్ల వద్ద కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. మరోవైపు భద్రాచలంలో భారీ వర్షం నేపథ్యంలో హెలిక్యాప్టర్ ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో కేటీఆర్ పర్యటన రద్దయ్యింది. చదవండి: మర్రిగూడ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.2 కోట్ల నగదు గుర్తింపు -
టైఫాయిడ్లోనూ వైద్య సేవలందిస్తూ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతూ చేతికి సెలైన్‌తోనే విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు వైద్యురాలు కృష్ణశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ప్రభ్వుత్వాస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణశ్రీ కొద్దిరోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం అయితే చేతికి సెలైన్ కూడా పెట్టుకున్నారు. అంత అనారోగ్యంలో కూడా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 24 గంటలపాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించారు. ఇన్ పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వారి రికార్డులను పరిశీలించారు. కృష్ణశ్రీ గతంలో వరదల సమయంలో కూడా పేషంట్లకు విశేషమైన సేవలందించిన ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి -
భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్ సంస్థ ఇంజనీరింగ్ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
భద్రాచలం వద్ద మహోగ్రం.. కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా వానలు తెరిపించినా.. ఇప్పటికే చేరిన నీటితో ఉప నదు లు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదా వరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. శనివారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు, నీటి మట్టం 56 అడుగులకు పెరిగింది. భారీగా వరద వస్తుండటంతో నీటి మ ట్టం మెల్లగా పెరుగుతూనే ఉంది. దీనితో అధికారు లు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నా రు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాల్లోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత తదితరులు సహాయక చర్యలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. శనివారం మధ్యా హ్నం 2 గంటల వరకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భోజనం పెట్టకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్డీఓ మాధవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు 3 గంటలకు భోజనం అందించారు. ఎగువ నుంచి తగ్గుతూ.. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో.. ఎగువన గోదావరిలో వరద తగ్గు తోంది. శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 2.95 లక్షలు, పార్వతి బ్యారేజీ వద్ద 3.01 లక్షలు, సరస్వతి బ్యారేజీ వద్ద 1.98 లక్షలు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 10.80 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి శాంతించనుంది. భద్రాచలం నుంచి వెళ్తున్న భారీ వరద పోలవరం, ధవళేశ్వరం మీదుగా కడలిలోకి వెళ్లిపోతోంది. శ్రీశైలంలోకి 1.51 లక్షల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్రలలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కృష్ణాలో ఆల్మట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్‌లోకి 88,228 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో కాస్త నీటిని నిల్వ చేస్తూ, మిగతా దిగువకు వదులుతున్నారు. జూరాలకు శనివారం ఉద యం నుంచి సాయంత్రందాకా 2.20 లక్షల క్యూసె క్కుల వరదరాగా.. సాయంత్రానికి 1,35,900 క్యూసెక్కులకు తగ్గింది. ఇక్కడ గేట్లు, విద్యుత్ సరఫరా ద్వారా కలిపి 1,48,875 క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి సుంకేశుల నుంచి 2,181 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 1,51,056 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 61.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే మరో 157 టీఎంసీలు కావాలి. ఇక తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 69.23 టీఎంసీలకు పెరిగింది. -
భద్రాచలం వద్ద మహోగ్రంగానే..
సాక్షి, హైదరాబాద్/ భద్రాచలం/ గద్వాల రూరల్/ ధరూర్/ దోమలపెంట: రాష్ట్రవ్యాప్తంగా వానలు తెరిపినిచ్చినా.. ఇప్పటికే చేరిన నీటితో ఉప నదు లు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదా వరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. శనివారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు, నీటి మట్టం 56 అడుగులకు పెరిగింది. భారీగా వరద వస్తుండటంతో నీటి మ ట్టం మెల్లగా పెరుగుతూనే ఉంది. దీనితో అధికారు లు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నా రు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాల్లోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత తదితరులు సహాయక చర్యలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. శనివారం మధ్యా హ్నం 2 గంటల వరకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భోజనం పెట్టకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్డీఓ మాధవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు 3 గంటలకు భోజనం అందించారు. ఎగువ నుంచి తగ్గుతూ.. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో.. ఎగువన గోదావరిలో వరద తగ్గు తోంది. శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 2.95 లక్షలు, పార్వతి బ్యారేజీ వద్ద 3.01 లక్షలు, సరస్వతి బ్యారేజీ వద్ద 1.98 లక్షలు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 10.80 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి శాంతించనుంది. భద్రాచలం నుంచి వెళ్తున్న భారీ వరద పోలవరం, ధవళేశ్వరం మీదుగా కడలిలోకి వెళ్లిపోతోంది. శ్రీశైలంలోకి 1.51 లక్షల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్రలలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కృష్ణాలో ఆల్మట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్‌లోకి 88,228 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో కాస్త నీటిని నిల్వ చేస్తూ, మిగతా దిగువకు వదులుతున్నారు. జూరాలకు శనివారం ఉద యం నుంచి సాయంత్రందాకా 2.20 లక్షల క్యూసె క్కుల వరదరాగా.. సాయంత్రానికి 1,35,900 క్యూసెక్కులకు తగ్గింది. ఇక్కడ గేట్లు, విద్యుత్ సరఫరా ద్వారా కలిపి 1,48,875 క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి సుంకేశుల నుంచి 2,181 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 1,51,056 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 61.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే మరో 157 టీఎంసీలు కావాలి. ఇక తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 69.23 టీఎంసీలకు పెరిగింది. -
కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ నష్టం
-
Godavari Water Level: భద్రాచలం వద్ద గోదారమ్మ మహోగ్రరూపం (ఫొటోలు)
-
గోదావరి డేంజర్ లెవల్.. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, హెలికాప్టర్
సాక్షి, భద్రాచలం: దక్షిణ గంగ అయిన గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణలోని సీతమ్మసాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శనివారం తెల్లవారుజామున గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిగువకు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. కాగా, ఈ ఏడాది తొలిసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాలు, కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చర్ల మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాచలం పట్టణంలోని మూడు కాలనీలకు చెందిన వారిని కూడా పునరావస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ రెస్య్కూ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 8712682128ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్‌కు ఫొటోలు, లోకేషన్ పంపించి పోలీసుల సహయం పోందవచ్చని జిల్లా ఏస్పీ వినిత్ వెల్లడించారు. ఇక, పడవలు, బోట్లు , గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్లను అధికారులు సిద్దం చేశారు. ఇదిలా ఉండగా.. గోదావరీ ఉధృతి, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ ప్రియాంక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58 నుంచి 60 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యలు అందించడానికి సిద్ధంగా ఉంది. జిల్లావ్యాప్తంగా 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత కేంద్రాలకు తరలించాము. అత్యవసర పరిస్థితుల్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్ అందుబాటులో ఉంచాం. గోదావరి 60 అడుగులు వచ్చినా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రంగా సిద్ధంగా ఉంది. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు పునరావస కేంద్రాలకు తరలిరావాలి అని సూచించారు. ఇది కూడా చదవండి: 19 ప్రాణాలు.. 10 లక్షల ఎకరాలు.. వరదలతో రాష్ట్రం అతలాకుతలం -
పోటెత్తుతున్న గోదావరి.. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 14లక్షల 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి ప్రవహిస్తోంది. రాత్రికి 58 నుంచి 60 అడుగుల వరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు వరదనీటిలో మునిగిపోయాయి. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. చదవండి: వానలు మిగిల్చిన విషాదం ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్
సాక్షి, భద్రాచలం: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. నదిలో మరోసారి వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది. దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఈ సందర్బంగా కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు వేగంగా పెరుగుతోంది. లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సహకరించాలి. గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉదృతంగా నీరు వస్తున్నందున ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇది కూడా చదవండి: 5 లక్షల ఎకరాల్లో పంటల మునక! -
భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతున్న ఉధృతి
-
భద్రాచలం రామాలయం చుట్టూ వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గంట గంటకు వరద పెరుగుతోంది. 44.40 అడుగులకు నీటిమట్టం చేరింది. రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. అన్నదాన సత్రం నీటమునిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం నుంచి దిగువకు 9.92 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం డివిజన్ లోని ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే స్థానిక అధికారులకు సహకరించి పునరావస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రావతి ప్రాణహిత నదుల్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. కాలేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి కూడా లక్షల కొద్ది క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. చర్ల మండలంలోని తల్లి పేరు ప్రాజెక్టు నుంచి కూడా సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతున్నదని ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చదవండి: కొట్టుకుపోతుంటే.. ప్రాణాలకు తెగించి మరీ భద్రాచలం నుండి చర్ల వెళ్ళు రహదారిపైకి సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరినందున రాక పోకలు నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజలు రవాణా చేయకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుందని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళొద్దని, ప్రజలు కూడా దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని పేర్కొన్నారు. పశువులను మేతకు బయటికి వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, వరద చేరిన సందర్భంగా పశువులను ఎతైన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలన్నారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. -
భద్రాచలం వద్ద గోదావరికి పెరిగిన నీటి మట్టం
-
వరద గోదారి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగు వన గోదావరిలోకి ప్రవాహాలు పెరుగుతుండగా.. కాళేశ్వరం దిగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులు, వాగుల నీటి చేరికతో నది ఉగ్రరూపం దాల్చుతోంది. మేడిగడ్డ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దీనితో అధికారులు గురువారం మధ్యాహ్నమే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక్క గురువారం రాత్రి 8 గంటల సమయానికి 9,79,347 క్యూసెక్కుల ప్రవాహంతో వరద నీరు 44.1 అడుగులకు చేరింది. శుక్రవారం తెల్లవారు జాము సమయానికి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక అయిన 48 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రా లకు తరలిస్తున్నారు. ఇక ఎగువ గోదావరిలోనూ వరద పెరిగింది. మహారాష్ట్రలో, రాష్ట్రంలోని పరీ వాహక ప్రాంతంలో వానలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి 59,165 క్యూసెక్కుల వరద చేరుతోంది. వచ్చిన వరద వచ్చినట్టుగానే.. ప్రాణహితలో వరద ఉధృతి పెరుగుతోంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోకి చేరుతున్న 5,37,140 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు దిగువన ఇంద్రావతి జలాలు తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 8,76,940 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ మొత్తాన్నీ విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు దాదాపు గరిష్ట మట్టానికి చేరగా.. తాలిపేరు 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వీటితోపాటు శబరి జలాలు కూడా కలసి గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. దీనితో కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం భద్రాచలం రానున్నారు. వరద మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. పోలవరానికి పెరిగిన వరద భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి గోదా వరి ప్రవాహం పెరిగింది. గురువారం రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 5,99,490 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 48 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటి మట్టం స్పిల్‌వే ఎగువన 31.88 మీటర్లు, దిగువన 23.3 మీటర్లుగా.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.55 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 22.73 మీటర్లుగా నమోదైంది. పోలవరం నుంచి నీరంతా ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత గోదావరి, దాని ఉప నదుల పరీవాహక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరితోపాటు ఉప నదులు, వాగుల ప్రవాహాలతో ప్రభావం పడేచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా ఉప నదులకూజలకళ మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నది ఉప నదుల్లోనూ వరద ప్రారంభమైంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి 32,146 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి నిల్వ 32.24 టీఎంసీలకు చేరింది. ఆ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 97 టీఎంసీలు అవసరం. దీని దిగువన ఉన్న నారాయణ పూర్ డ్యామ్‌లోకి ఇంకా వరద మొదలవలేదు. ఇక కృష్ణా ఉపనది మలప్రభ నుంచి మలప్రభ ప్రాజెక్టులోకి 10,437 క్యూసెక్కులు, ఘటప్రభ ఉప నది నుంచి ఘటప్రభ ప్రాజెక్టులోకి 20,813 క్యూసెక్కులు వరద వస్తోంది. భద్ర నది నుంచి భద్ర రిజర్వాయర్‌లోకి 4,227 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి తుంగభద్ర డ్యామ్‌లోకి 9,536 క్యూసెక్కులు ప్రవాహాలు ఉన్నాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 12,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండితే ప్రధాన కృష్ణా నదిలోకి వరద మొదలుకానుంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. నెలాఖరు నాటికి ప్రధాన నదిలో ప్రవాహాలు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. కాగా, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో వానలతో కృష్ణా ఉప నది అయిన మూసీలో వరద ఉధృతి పెరిగింది. మూసీ ప్రాజెక్టులోకి 2,125 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి 1,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. -
గోదావరి ఉధృతి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, ఖమ్మం/తూర్పుగోదావరి: భద్రాచలం వద్ద గోదావరి వరద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్లోకి లీకేజీ వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో రామయ్య ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగరేణి నుంచి తెప్పించిన హై పవర్ మోటార్ల సహాయంతో నీటిని రివర్స్‌గా మళ్లీ గోదావరిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు గోదావరి: ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద తీవ్రత పెరుగుతుంది. కోటిపల్లి స్నాన ఘట్టాలను వరద తాకడంతో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటి ప్రయాణాలు నిలిపివేశారు. కోటిపల్లి గోదావరి సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయ గట్టుకు వరద తాకిడితో తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం,పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్‌వేల పైకి కూడా వరద నీరు చేరనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి పోర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై వరంగల్‌తో పాటు పలు గ్రామాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా టేకులగూడెం వద్ద గోదావరి వరద ఉధృతికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట మండలం కట్రియాల- ఇల్లంద మద్య జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలడంతో వరంగల్-ఖమ్మం మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆధార్ సిన్హా, రజత్ కుమార్, సునీల్ శర్మ,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు హాజరయ్యారు. -
భద్రాద్రి గోదావరికి పోటెత్తిన వరద
-
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
వైద్యుడి నుంచి ఐపీఎస్‌గా..
భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తించి, ప్రస్తుతం జిల్లా ఎస్పీగా ఉన్న డాక్టర్ వినీత్ ఎంఎస్ ఆర్థోపెడిక్ వైద్యుడే. బెంగళూరులో మెడిసిన్ పూర్తి చేసుకుని, సంజయ్‌గాంధీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్‌కు ఆయన అర్హత సాధించారు. భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయాన దుమ్ముగుడెం పోలీసులు, పర్ణశాల పీహెచ్సీ ఆధ్వర్యాన ములకలపల్లిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీగా హాజరైన వినీత్.. వైద్యుడిగా మారిపోయి స్థానికులకు పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇక్కడే కాదు ఏ శిబిరంలో సమయం లభించినా వైద్యుడిగా సేవలందించేందుకు వినీత్ ఇష్టపడతారు. -
సీతారాముల కళ్యాణం లో కన్యాదానం
-
సీతారాముల కళ్యాణం లో మాంగల్యధారణ
-
స్వామివారి లడ్డూ ప్రసాదం చేయడం మా అదృష్టం
-
బాసర నుంచి భద్రాచలానికి లాంచీ!
మంథని: గోదావరి పరీవాహక తీర ప్రాంత కేంద్రాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా)లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిత్యం నిండుకుండలా ఉంటోంది. అంతేకాకుండా తీరం వెంట పచ్చని అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలు కొలువై ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి నదిపై పర్యాటకం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లాంచీలు నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు.. గోదావరి తీరం వెంట నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు, మంథని తీరంలో గౌతమేశ్వర, రామాలయం, మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, భద్రాద్రి రామాలయంతోపాటు అనేక శివాలయాలు, ఇతర దేవతల పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. జలమార్గంలో ప్రయాణిస్తూ వీటన్నిటినీ దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారని అధికారులు అంటున్నారు. తీరం వెంట అడవి అందాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీలు చేపట్టారు. ఈ బ్యారేజీలు, పంపుహౌస్‌ల సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి బ్యారేజీల వద్ద పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అలాగే గోదావరి తీరం వెంట ఉన్న అడవులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇవి యాత్రికులను ఆకట్టుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి ఆదాయం గోదావరి తీరం వెంట పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శన పెరగనుంది. యాత్రికుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనతోపాటు బ్యారేజీ, ఇతర వంతెనలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు సైతం పెరిగి.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గోదావరిలో స్టీమర్లు, లాంచీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని కూడగట్టవచ్చని భావిస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మంథని వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదం పంచాలనే ఆలోచనతో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంథని వద్ద గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటన కూడా చేశారు. దీనికోసం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిని త్వరలో కలసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంను కలుస్తాం.. గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని త్వరలోనే సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలుస్తాం. యాత్రికుల సందర్శనతో ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. - కొండేల మారుతి విద్యార్థి యువత వ్యవస్థాపకుడు, మంథని ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు గోదావరి నది తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర దేశాల్లో నివాసం ఉండే మంథని వాసులు ఇక్కడికి వస్తే.. సేదతీరేందుకోసం కోనసీమను తలపించేలా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. చిన్న పిల్లల కోసం పార్కులు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. - పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ -
అక్కగా.. అండగా ఉంటా!
భద్రాచలం/సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాజ్‌భవన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోంది. సాధారణంగా రాజ్భవన్ల ద్వారాలు మూసి ఉంటాయి. కానీ ఈ రాజ్‌భవన్ ద్వారాలు ప్రతి ఒక్కరి కోసం తెరిచే ఉంటాయి. ఇది నిజంగా ఒక ప్రజాభవన్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రాజ్‌భవన్‌ను సందర్శించండి. అక్కడ ఈ అక్క మీకు అండగా ఉంటుంది. నేను తమిళనాడు ఆడపడుచునైనా తెలంగాణ అక్కనే..’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో, ఖమ్మం రూరల్ మండలంలో గవర్నర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, విద్యార్థులతో సమావేశమయ్యారు. సీతారాములను దర్శించుకుని.. గవర్నర్ ముందుగా భద్రాచలంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత భద్రాచలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ‘ప్రియాతి ప్రియమైన నా ఆదివాసీ బంధువులారా..’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆదివాసీల సమస్యలు తన హృదయాన్ని కలచివేస్తున్నాయని.. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు అందకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యపరంగా ఆదివాసీలు అభివృద్ధి చెందడానికి కలసి పనిచేద్దామన్నారు. జనంలోకి వెళితేనే సమస్యలు తెలుస్తాయి ప్రజలను నేరుగా కలిస్తేనే సమస్యలపై మరింత అవగాహన కలుగుతుందని, రాజ్‌భవన్‌లో కూర్చుంటే సమస్యలు మాత్రమే వినగలుగుతానని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల సమస్యలను, బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే వచ్చానని, వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను.. ఈ ప్రాంత ప్రజలు, ఆదివాసీల తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తానని చెప్పారు. పరిశోధనలపై దృష్టి పెట్టాలి దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం.. ఇన్నోవేషన్ (ఆవిష్కరణ), ఎంటర్ ప్రెన్యూర్íÙప్ (వ్యవస్థాపన) కీలకమని.. కళాశాలలు తమ క్యాంపస్‌లను ఆవిష్కరణలకు వేదికగా మార్చుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టిపెట్టాలని సూచించారు. బుధవారం ఖమ్మంరూరల్ మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వై20 ఇండియా ఉత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుందని, తమ అభిరుచికి అనుగుణంగా రాణించడానికి కృషిచేయాలని సూచించారు. విద్యార్థులు రాజకీయాల్లో కూడా రాణించాలని.. చదువుకున్న రాజకీయ నాయకులు దేశానికి ఉపయోగపడతారని పేర్కొన్నారు. -
భద్రాచలం ప్రజలకు ఒణుకు పుటిస్తున్నగోదావరి నది
-
భద్రాద్రిలో వైభవంగా మహా పట్టాభిషేక మహోత్సవం (ఫొటోలు)
-
శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ తమిళిసై